SARA SUDHA CHINDRIK    Chapters   

ఓం తత్‌సత్‌

శ్రీగణశాయనమః శ్రీరామచంద్రపరబ్రహ్మణనమః

బ్రహ్మ సూత్రములు - తృతీయఅధ్యాయము (సాధన)

ప్రధమ పాదము

ఈ అధ్యాయ మందు పరమాత్మ ప్రాప్తి సాధనములు తెలుపుటచే దీనిని 'సాధన' అధ్యాయము లేక 'ఉపాసన' అధ్యాయమనియందురు. పరమాత్మ ప్రాప్తికి వైరాగ్యావశ్యకత యుండుటచే జన్మ మరణాది దుఃఖముల ప్రదర్శించుటకు, జీవాత్మ ఒక శరీరమును వీడి ఇంకొకశరీరము పొందునపుడు జీవాత్మ ఒంటరిగా వెళ్లునా? లేక వెంట ఏమైనా ఉండునా? అను విషయములు మొదటి పాదమున వివరింపబడెను.

3-1-(1-6):- ప్రవహణుడను రాజు శ్వేతకేతునకు ఐదు ప్రశ్నలు వేసెను. అతడు తనకు తెలియదని పలికి తండ్రికడకేగి ఆ ప్రశ్నలకు జవాబు చెప్పమనెను. అతడును తనకు తెలియదని పనికి రాజసభ##కేగి ఆ ప్రశ్నల జవాబు తెలుపవేడెను. అంతరాజిట్లు తెలిపెను.

1. మరణానంతరము జీవాత్మ ఎచటకు వెళ్లును. 2. అట నుండి మరల ఎట్లు వచ్చును. 3. దేవయాన, పితృయాన మార్గములన నేవి? 4. ఇచట నుండి వెళ్లిన వారితో అచటి లోకములు ఏల నిండవు 5. జలము యొక్క పంచ ఆహుతులచే పురుషరూపము ఎట్లు ఏర్పడును?

ఇందు 5వ ప్రశ్నకు జవాబు చెప్పుచు రాజు ఇట్లు తెలిపెను. ద్యులోక అగ్నియందు శ్రద్ధ (సంకల్పము) యొక్క మొదటి ఆహుతిచే సోమము ఉత్పన్నమగును. రెండవ ఆహుతిలో మేఘ రూపమగు అగ్నిలో సోమమును ఆహుతి చేయుటచే వర్షము. మూడవ ఆహుతిలో పృధ్వి రూపమగు అగ్నిలో వర్షమును ఆహుది చేయుటచే అన్నము. నాల్గవ ఆహుతిలో పురుష రూపమను అగ్నిలో అన్నమును ఆహుతి చేయుటచే వీర్యము. ఐదవ ఆహుతిలో స్త్రీ రూపమగు అగ్నిలో వీర్యము ఆహుతి చేయుటచే గర్భోత్పత్తి జరిగి పురుష సంజ్ఞగల జీవుడు జన్మించి ఆయువున్నంతరవకు జీవించును. జలమునందు బీజరూపమున అన్నితత్వములు కలిసి సూక్ష్మ రూప జీవాత్మ జన్మించి ఒక శరీరమువదలి మరియొక శరీరమున ప్రవేశించు నపుడు ఈ తత్వములు కూడి వెళ్లును. జగదుత్పత్తి వర్ణములో మూడు తత్వముల సంమ్మేళనముచే భగవంతుడు నామ రూపాత్మక జగత్తును సృష్టించెను. స్త్రీ గర్భమందు ప్రవేశ##పెట్టబడిన వీర్యమునందు అన్ని భౌతిక తత్వములు సూక్ష్మ రూపమునుండును. అందు జలతత్వమధికమగుటచే జలతత్వము నుండి జీవాత్మ పుట్టుట చెప్పబినది. ప్రాణము జలమయము. కావున జలము పురుష రూపము.

ప్రశ్నోపనిషత్తులో ఆశ్వలాయనుడు. పిప్పలాదుని అడిగిన ప్రశ్న, జీవాత్మ ఒక శరీరమువదలి వేరొక శరీరము పొదుటకు ఎట్లు బయలువెడలును? సమాదానముగా పిప్పలాదు డిట్లు చెప్పెను. శరీరము నుండి ఉదాన వాయువెడలునపుడు శరీరము చల్లబడును. జీవాత్మ మనస్సులో విలీనమైన ఇంద్రియాదులు, సంకల్పానుసారము వివిధ జన్మలనొందును. జీవాత్మతో ప్రాణము, మనస్సు, ఇంద్రియములు, సంకల్పాదులు సూక్ష్మ రూపమున ఒక శరీరము నుండి రెండవది పొందును.

బృహదారణ్యకమందు ఆర్త భాగుడు మరణకాలమున వాణి అగ్నియందు, ప్రాణము వాయువు నందు విలీనమగునని చెప్పెను. వాస్తవమునకు అవి వాని కారణములందు విలీనమగును. మానవుడు తన కర్మల ననుసరించి పుణ్యపాప లోకముల పొందును. శ్రద్ధ (సంకల్పము)ను మొదటి హవనీయవస్తువుగా పరిగణించినను జీవాత్మ యొక్క గతి దాని అంతిమ సంకల్పానుసారము ప్రాణము ద్వారానే జరుగును. ప్రాణము లమయమగుటచే సంకలపాను సారము సూక్ష్మతత్వ సముదాయము ప్రాణము లోనే ఉండును. పుణ్యకర్మలు చేయువారు స్వర్గలోక సుఖముల ననుభవింతురు. ఇది ఎట్లు అను ప్రశ్నకు సమాధానముగా -

3-1-(7-11):- ఏకామ భావమున పుణ్య కర్మలుచేయువారు ఆత్మ జ్ఞానులుకారు. అట్టి వారు స్వర్గలోకమును పొంది. స్వర్గలోక సుఖముల ననుభవించి పుణ్యక్షయము కాగానే మర్త్యలోకమున మరల జన్మింతురు (గీ. 9స్త్ర21). పుణ్యమంతయు క్షయముపొందునా? లేక కొంత మిగిలి యుండునా? అను శంకకు సమాధానముగా - పుణ్యకర్మల నాచరించుటచే కలుగు స్వర్గ సుఖముల ననుభవించి మిగిలిన కర్మ సంస్కారములచే మంచి న్మ నొందెదరు. చెడు కర్మలు చేయువారు నరకదుఃఖముల ననుభవించి మిగిలిన కర్మ సంస్కారానుసారము నీచ జన్మలు పొందెదరు. 'రమణీయాచరణా' అనుశృతి వాక్యమునందు చరణ శబ్దము జీవాత్మ భుక్త శేషకర్మ సంస్కారములను తీసుకొనిమరల వచ్చును. అని చెప్పబడెను. ఆచార్య బదరి కూడ 'రమణీయ చరణ శబ్ద ప్రయోగము పుణ్యకర్మలకు, 'కపూయచరణ' శబ్ద ప్రయోగము పాపకర్మలకు చేయుటచే ఆయా మిగిలిన కర్మ సంస్కారములను తీసుకొని జీవాత్మ మర్త్యలోకమునకు తిరిగి వచ్చును.

3-1-(12-17):- పుణ్యపాప కర్మలు చేయువారందరు ధూమమార్గమున చంద్రలోకము చేరుదురన్న శంకకు సమాధానముగా - పుణ్యకర్ములేఫల మునుభవించుటకు స్వర్గము నకు వెళ్లెదరు. పాపకర్ములు యమలోకమున నరక యాతనల ననుభవించి మరల కర్మానుసారము మర్త్యలోకమున వివిధ నీచయోనుల జన్మింతురు. కఠోపనిషత్తులో యమ ధర్మరాజు స్వయముగా పై విషయము తెలిపెను. కౌషీతకీ బ్రాహ్మణమున చెప్పబడిన చంద్రలోకము పుణ్యకర్ములకేవర్తించును. భవగద్గీత (16-1-15) శ్లోకములలో ఆసురీ ప్రకృతిని తెలిపుచు 16వ శ్లోకమున అట్టి వారు కుంభపాకాదినరకము పొందెదరని చెప్పబడెను. పురాణములలో కూడ రౌరవాది నరకములు పొందుట గూర్చి చెప్పబడెను. యమ లోకమున చిత్రగుప్తాది అధికారులు గూడ యమధర్మరాజు ఆజ్ఞానువర్తులై యుండెదరు.కాన విరోధములేదు. ఛాందోగ్యోపనిషత్తులోకూడ చంద్రలోక గమనము పుణ్యకర్ములకేగాని పాపకర్మలకు కాదని చెప్పబడెను.

3-1-(18-21):- ఛాందోగ్యోపనిషత్తులో దేవయాన పితృయాన ములేగాక క్షుద్రజీవులు భూలోకమందే పుట్టుచు చచ్చుచుండుటచే ఇది తృతీయమార్గము. అటులైన నరకలోక గమనము ఏమార్గము? అను ప్రశ్నకు సమాధానముగా - భగవద్గీత (14-18) లో చెప్పబడి నట్లు తత్వగుణ సంపన్నులు దేవయాన, పితృయానముల ద్వారా ఊర్ధ్వలోకములు పొందెదరు. రాజసగుణులు మర్త్యలోకము నందే పుట్టుచు చచ్చుచుందురు. తమో గుణులు నరకయాతనలు అను భవించుటకు అధోగతి పొందెదరు. ఉపనిషత్తులలో కూడ నరకాది లోకప్రాప్తి చెప్పబడుటచే తృతీయ మార్గముననే యమ లోక ప్రాప్తి కలుగును. స్వేద జలములు కూడ ఉద్భిజముల అంతర్భాగమే. రెండును పృధ్వీల సంయోగముచే ఉత్పన్నమగును.

3-1-(22-27):- స్వర్గలోకము నుండి మర్త్యలోకముపొందు ప్రాణులు, ఆకాశ, వాయు, మేఘాది మార్గమును పొందెదరు. ఆయా రూపములు పొందెదరా యను శంకకు సమాధానముగా - జీవాత్మ ఆయాభావాన కూలముగా సూక్ష్మము నుండి స్ధూల భావముపొందును. ఊర్ధ్వలోకములు పొందుపుడు మధ్య వచ్చు పితృలోకాదులలో కొంత ఆలస్యమగును. కాని తిరిగి వచ్చు సమయములో అట్టి ఆలస్యముండదు. పరలోకము నుండి తిరిగి వచ్చు జీవాత్మ ధాన్యాది రూపముల పొదునాయకను శంకకు సమాధానముగా -జీవాత్మ ధాన్యాదుల ద్వారా పురుషుల ఉదరమున ప్రవేశించును. ధాన్యాదులు బీజ రూపమున నున్నంత వరకు ప్రాణ ముండదు. అట్టి సమయమున వానిని పక్వము చేయుట. తినుట జీవహింసకాదు. శృతులలో అన్ని భక్షణమును గూర్చి చెప్పబడెను. బీజము అంకురస్ధితిని పొందినపుడే జీవు ను పొదును. ధాన్యాదులు అన్ని రూపమున భక్షింపబడి పురుషుని ఉదరములో జీర్ణమై వీర్యరూపమునుపొందును. ఆకాశముమొదలు అన్నియు వరకు జీవాత్మ సంయోగము తదాకార ప్రాప్తియే గాని స్వరూపమున కాదు. ఇట్లు స్వర్గము నుండి వచ్చు జీవత్మ అన్నాదుల రూపమున పురుష శరీరమున పచనమై వీర్యరూపమును పొంది స్త్రీ గర్భమున ప్రతిష్ఠింపబడి కర్మ ఫలానుసారముగా శరీరధారణచేయును. ఇచట నుండియే మరల కర్మఫల భోగము ప్రారంభమగును.

తృతీయ అధ్యాయము - ద్వితీయ పాదము

మొదటి పాదమున జీవులదే హంతరప్రాప్తి జన్మమరణ దుఃఖవర్ణన జరిగెను. ఇందువలన ఈజవుని మనమున సంసారవస్తువులు నశ్వరములనియు, నశ్వర శరీరమందు ఆశక్తి తగ్గి వైరాగ్య భావము వృద్ధి పొందుటకు తెలుపబడెను. రెండవ పాదమున ఈ శరీరము భిన్న భిన్న అవస్ధల వర్ణన ద్వారా జన్మమరణ సంసార బంధవిముక్తికి పరమాత్మ ధ్యాన రూప ఉపాయములు తెలుపుచు స్వప్నాది అవస్థలతో ప్రారంభింపబడుచున్నది.

3-2-(1-6):- బృహదారణ్యకోపనిషత్తులో ఇట్లు వర్రణింపబడెను. స్వప్నావస్ధలో జీవాత్మ ఈ లోకము, పరలోకము రెంటిని చూచును. ఆనందము, దుఃఖము అనుభవించును. స్ధూల శరీరమును అచేతన పరచి వాసనాయుక్తమగు క్రొత్త శరీరముపొంది జగత్తును చూచును. నిమునకు లేని రధాదివస్తువుల రచింపబడును. స్వప్నములో సృష్టి జరుగుటగురించి ఇతర శృతుల లోకూడ చెప్పబడినది. ఇది అత్యంత విచిత్ర జీవకృతము. కఠోపనిషత్తునందు పురుషుడు (జీవుడు) కోరకిల నిర్మాతయని, పుత్రపౌత్రాదులు కోరికల విషయమని చెప్పబడెను. జాగ్రదావస్ధలో విని, చూచి, అనుభవించిన వస్తువులను స్వప్నములో చూచును. కాని విచిత్ర విధముగా వినినను - అనుభవించక పోయినను అట్టి వస్తువులను అపూర్ణముగా, అనియమితముగా చూచును. ఇది వాస్తవముకాదు. జీవుని యొక్క కర్మ ఫల భోగాను సారము భగవంతుడు యోగమాయచే కర్మ సంస్కార వాసనానుసారము అట్టి దృష్యములు కనిపించునట్లు చేయును. స్వప్నసృష్టి మాయ మాత్రము. స్వప్నావస్ధలో చేసిన శుభాశుభకర్మఫలము జీవాత్మకు చెందదు. స్వప్నములు పూర్తిగా వ్యర్ధముకాదు. భవిషత్తులో జరుగు శుభాశుభకర్మల సూచికము. కావున స్వప్నసృష్టి జీవుని కర్మానుసారము భగవంతుని శక్తిచే జరుగును. జీవాత్మ ఈశ్వరుని అంశ##యైనను ఈవ్వరీయ గుణములు జీవుని యందు అంతర్హితమైయుండును. ఈశ్వరారాధనచే బంధవిముక్తుడై తనను తాను తెలుసుకొనును ఈశ్వరీయ గుణములు తన యందున్నను దేహాభిమానము చే జన్మజన్మాంతర కర్మ సంస్కారపరశుడై జన్మ మరణదుఃఖము పొందుచున్నాడు.

3-2-(7-10):- జీవుడు స్వప్నావస్ధలో మెలుకువ పొందుచు స్వప్నమును చూచుచుండును. కాని సుషుప్తి అవస్ధలో స్వాప్నికమాయ బాహ్యజగత్తుల జ్ఞానమే లేక పరిపూర్ణముగాని ద్రావస్ధ పొందును. అపుడు ఏమియు తెలియదు. బృహదారణ్య కాదిశృతుల ననుసరించి హృద్గత 72 వేల నాడులు శరీరమంతట వ్యాపించి శరీరము నకు పూర్ణ విశ్రాంతికలుగ జేయును. ఆసమయమున పరమాత్మ స్పర్శనుపొందును. కావున జీవుడు, పరమాత్మ, హృదయకుహరమందుండుట సత్యము. ప్రశ్నోపనిషత్తులో చెప్పబడిన విధముగా మనస్సు (తేజస) ఉదాన వాయువుచే అణగద్రొక్కబడినప్పుడు ఉదానవాయువు ఇంద్రియ సహితమనస్సును హృదయ మందు మోహింపజేయును. సుషుప్తి అవస్దలో స్వప్నములురావు. మంచి నిద్రపట్టుటయనగా నిదియే. జీవాత్మ సుషుప్తి అవస్ధ పూర్తి యగుట తోడనే హృదయ కుహరము నుండియే. ప్రారబ్ధాను సారము ఈశ్వరేచ్ఛచే జాగృతమగును. సుషుప్తి అవస్ధలో విలీనమైన జీవాత్మయే జాగృతమగును పూర్వ స్మృతులతో నేను బాగుగాని ద్రించితిని, ఇపుడే లేచితి ననును అన్యకారణములచే అచేతనావస్ధ పొందినను అది సుషుప్తి అవస్ధకాదు.

3-2-(11-26):- స్వప్నాది అవస్ధల వర్ణనలో పరబ్రహ్మ పరమేశ్వరుని గూర్చి నిరంతరము చింతన చేయుటచే జీవుడు కర్మ బంధముల నుండి విముక్తుడగునని చెప్పబడెను. అయిన అట్టి పరబ్రహ్మ పరమేశ్వరుని స్వరూపము ఏమిటి? శృతులలో పరమాత్మ నిర్విశేష నిర్గుణ, సర్వజ్ఞ, సర్వశక్తియుత, సర్వసాక్షియనియు, అంగుష్టమాత్రుడనియు, మొదలగు వానిని వివరించుచు - ''అణోరణీయాన్‌మహత్‌ మహీయానాత్మ స్యంతో న్నిహతేగుహాయామ్‌'' (క.ఉ. 1-2-20) అనుసరించి పరమాత్మ ప్రతి జీవి యొక్క హృదయ కుహరమందుడును. ప్రకృతి, జీవుల కంటె విలక్షణుడు, ఉపాధిరహితుడు, భేదరహితుడు, భూత భవిష్యత్మాశకుడు. అవాజ్ఞానసగోచరుడు. పరమాత్మ సర్వగుణ సంపన్నుడయ్యుగుణాతీతుడు. పరమాత్మ వివిధ రూపాత్మకముగా కన్పట్టుట, సర్వవ్యాపకత, సర్వగుణ సంపన్న, సర్వశక్తివంత, నిర్విశేష, పరబ్రహ్మ నిర్గుణ, నిరాకార, సగుణ సాకారుడైయున్నాడు. ఇది స్వాభావికలక్షనము. ''సత్యం జ్ఞానమనంతంబ్రహ్మ'' యని తైత్తరీయోపనిషత్తులో చెప్పబడెను. పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారము సూర్యుడు, వాయువు, అగ్ని, ఇంద్రాదులు తమ తమ కార్యముల ప్రవృత్తమగుదురు. పరమాత్మ నిర్గుణ - సగుణ స్వరూపుడు. శ్వేతాశ్‌ఏతరో పనిషత్తు 6-11 ప్రకారము పరబ్రహ్మ నిర్గుణ నిరాకార, సగుణ సాకారుడు. రెండు లక్షనములు ప్రధానమే. అగ్ని, విద్యుత్‌ మొదలగు జ్యోతుల యొక్క ప్రకటిత, అప్రకటిత రెండు రూపములు ఉండును. రెండును ప్రధానము సార్ధకము. వ్యర్ధము, గౌణముకాదు. అటులనే పరబ్రహ్మయొక్కసగుణ నిర్గుణ, సవిశేష నిర్విశేష ఉభయలక్షణయుక్తుడు. ''సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ'' అనుశృతి వాక్యముతో పరబ్రహ్మ జ్ఞానస్వరూపుడనియే చెప్పబడెను. సత్యసంకల్పాది గుణయుక్తుడని చెప్పబడలేదు. అను శంకకు సమాధానముగా - పరమాత్మ సర్వప్రాణుల హృదయమందుండి సమస్త జగత్తును సృజించును. పరమాత్మ రసస్వరూపుడు. ఆనంద ప్రదాత. భగవద్గీత, ఇతర శృతుల యందు పరమాత్మ నిర్గుణ నిర్విశేషుడు, సగుణ సవిశేషుడు అని చెప్పబడెను. రెండింటిలో వ్యత్యాసమేమియులేదు. రెండును సత్యమే. సూర్యచంద్రుల ప్రతి బింబములు వేరు వేరు ఉపాధులందు వేరు వేరుగా కనబడినను ఒక్కడే. పరమాత్మ విభక్తుడుగా ప్రానులయందున్నను అవిబక్తుడే (గీ. 3-16). అది ఆయన విచిత్ర మహిమ. ప్రతిబింబ దృష్టాంతమున ప్రతి బింబముమిధ్య. చంద్రుడు సత్యము, ప్రతిబింబము మిధ్య, కాని పరమాత్మ సర్వప్రాణుల హృదయమున నుండి సంసార చక్రమున పరిభ్రమింపజేయును (గీ. 18-61). ప్రతి బింబోపమానము ఏలఈయబడెను? అను ప్రశ్నకు సమాధానముగా ఉపమాన ఉపమేయముల యందు సామాన్య గుణము ప్రధానము. పూర్తిగా రెండిటిలోను ఒకే గుణమున్న ఉపమాన మిచ్చుటకు అవకాశములేదు. అగ్ని, తేజస్సు, వాయువు, వానా రూపములు పొందునట్లున్నను ఒక్కటే. అటులనే పరమాత్మకూడ వివిధ ప్రాణులలో వివిధ రూపముల వ్యక్తమగును. ప్రతిబింబ సాదృశ్యము. ఆభాసమాత్రము కావున పరబ్రహ్మ నిర్గుణసగుణుడు పరమాత్మ తత్వవివరణలో 'నేతినేతి' అని చెప్పుటకు కారణమేమి? పరబ్రహ్మ మూర్త అమూర్త స్వరూపుడు. పృధ్వి, జల, తేజములు మూర్త రూపములు. ఆకాశము, వాయువు అమూర్త రూపములు. ఇంద్రియములు మూర్త రూపములు. ప్రాణము హృదయాకాశము అమూర్తము. మూర్తీ పదార్థము నాశనమగును. అమూర్త పదార్ధముల నాశములేదు. అటులనే సూర్యమండలము, నేత్రము మూర్త పదార్ధములు. అందలి పురుషుడు అమూర్త రూపుడు. పరమాత్మ నిర్గుణ నిరాకా, సగుణ సాకారుడయ్యు అంతకంటె విశిష్టు డగుటచే 'నేతి నేతి' ఇంతేకాదు, ఇంతేకాదు అని చెప్పబడెను. సాకార పరమాత్మ యందలి జడ అంశము అపరా ప్రకృతి, చేతన అంశము పరాప్రకృతి. పరమాత్మ జీవాత్మ ప్రకృతులకంటె శ్రేష్ఠుడగుటచే 'నేతి నేతి' యని చెప్పబడెను. నిర్గుణనిరాకార పరబ్రహ్మవలెనే సగుణసాకార బ్రహ్మయు ప్రాకృత మనో ఇంద్రియముల విషయముకాదు. పరమాత్మ నేత్రములు, వాణి, ఇంద్రియములు, మనస్సు ద్వారా చూడబడడు. అయినచో పరమాత్మ యొక్క ప్రత్యక్ష దర్శనమగునా? పరమాత్మ నామజప స్మరణ, ధ్యాన ఆరాధనాదుల ద్వారా భక్తులకు ప్రత్యక్షమగును 'గీ. 11-54) అగ్ని విద్యుత్‌లయందు ఉష్ణము, ప్రకాశము ప్రకటిత అప్కటిత అవస్ధలరెండింటి యందును ఉండును. అటులనే పరమాత్మ ఉపాసనాదుల ద్వారా ప్రత్యక్షమైనపుడు సమస్త కళ్యాణగుణ సంపన్నుడో అటులనే అప్రకటిత అవస్థ యందుకూడ. ఆరాధించినపుడు అప్రకటిత పరమాత్మ ప్రకటితమగును. కావున పరమాత్మ సాకారనిరాకార రూపముల రెండింటియందును అనంత దివ్య కళ్యాణ గుణ సంపన్నుడు.

3-2-(27-33):- పరమాత్మ ప్రకృతి భిన్నమా, అభిన్నమా? సర్పము సాధారణ అవస్ధ, కుండలినీ అవస్ధల యందుండును. సాధారణ అవస్ధ కారణభావము. కుండలాకారము కార్యభావము. ఒకటి ప్రకటితమైన రెండవరూపము అప్రకటితము. అటులనే పరమాత్మ కారణావస్ధ యందున్నపుడు పరా అపరాశక్తులు అభిన్న రూపముననున్నను అప్రకటితము. కార్యరూపమున రెండు శక్తులు భిన్న భిన్న రూపములు వ్యక్తమగును. కారణావస్ధయందు పరమాత్మ నిరాకారుడు, కార్య రూపమున సాకారుడు. సూర్యుడు సూర్యకాంతి అభిన్నములైనను రెంటిని వేర్వేరుగా చెపుదురు. అటులనే పరమాత్మ అతనిశక్తి విశేషము. అభిన్నమైనప్పటికి వేరువేరుగా వర్ణింపబడెను. పరమాత్మ అతని అంశీభూతములగు ఈవులు అభిన్నమైనటులే శక్తి శక్తి వంతుడు (పరమాత్మ) ల అభేదము తెలియనగును. ప్రళయకాలమున పరమాత్మ యొక్కపరా అపరాప్రకృతులు పరమాత్మ యందే విలీనమై యుండును. జడచేతనాత్మక సమస్త జగత్తుకు కారణ భూతుడైన పరమాత్మయొక్క అపరావరా శక్తులు. క్షర-అక్షర, క్షేత్ర - క్షేత్రజ్ఞ. ప్రకృతి - పురుషుల ను వివిధ నామముల చెప్పబడెను. పరమాత్మ వీటన్నిటి కంటె విలక్షణుడు, పరమశ్రేష్ఠుడు. భగవంతుడు శ్రేష్ఠుడగుటకు నాలుగు కారణములు (1) సేతు, (2) ఉన్మాద, (3) సంబంధము (4) భేదము.పరమాత్మ సర్వమును ధరించుసేతువు. పరమాత్మ అన్నటి కంటె పరిమాణములో పెద్ద సంపూర్ణ భూతప్రాణులు ఆయన ఒక భాగము. మిగిలిన మూడు భాగములు అమృతస్వరూప అప్రాకృత పరమ ధామమందున్నవి. పరమాత్మ ప్రకృతుల సంబంధము స్వామి - సేవక - శాసక - శాసిత, నియంత - నియంతత్వ సబంధము కలదు. పరమాత్మ సర్వము సృజించు సర్వజ్ఞుడు, సమస్త కళ్యాణ గుణ సంపన్నుడు, జీవాత్మ యొక్క స్వామి, జన్మ మృత్యురూప సంసారమున బంధించి, నిలిపి, ముక్తునిచేయును. నాల్గవకారణము భేదము. పరమాత్మ రెండు ప్రకృతుల అంతర్యామి, ధారణ, పోషణ చేయువాడు, కావున వానికంటె భిన్నుడు. పరమాత్మ ప్రకృతులు కంటె విలక్షణుడు శ్రేష్ఠుడు. పరమాత్మ ప్రకృతుల భేదపక్షమా, అభేదపక్షమా, ఏది ఉత్తమ మను దానికి సమాధానము - పరబ్రహ్మ పరమాత్మ అందరికి ఈశ్వరుడు, అధిపతి, ప్రేరకుడు, శాసకుడు, అంతర్యామి అని చెప్పు భేదప్రతిపాదక శృతులు, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ యని తెలుపు అభేద ప్రతిపాదిక శృతులు రెండును ప్రమాణములే. కావున భేదాభేద పక్షములు రెండును ఉత్తమములే. భేదా భేద భావముల రెండింటి యందును సాధకుని ప్రకృతి, యోగ్యత, రుచి, విశ్వాసనుసారము ఉపాసనచేయు విధానము శృతల యందు చెప్పబడెను.

3-2-(34-41):- అగ్ని, దీపము, సూర్య చంద్రులు, నక్షత్రములు, అన్నియు ప్రకాశము నిచ్చునవియే యైనను శక్తి భేదముచే పరస్పర భేదము, నానా త్వముకలదు. అటులనే జీవ సముదాయములు అభిన్నములైనను వాని యొక్క అనాది సంస్కారముల సమూహము, తదనుసార ఫలరూప శరీర, బుద్ధి, శక్తి మొదలగు తారతమ్యములు వానితో భేదము చూపట్టును. శృతులలో తెలిపిన జగదుత్పత్తి సంచాలన, జీవకర్మ ఫలభోగము బంధ మోక్షములు కలుగ జేయువాడు పరమాత్మయే. ప్రళయ కాలమున పరమాత్మ యందు విలీనమైన సృష్టియంతయు మరల ప్రకటితమగును. ఈవుల పరాప్రకృతి అంతర్గతమగుటచే పరమాత్మయొక్క అంశ##లే. కావున అభిన్నము. పరమాత్మ సమస్త జీవుల నియామకుడగుటచే పరస్పర భిన్నము. పరా అపరా ప్రకృతుల ద్వారా పరమాత్మ నానా రూపముల వ్యక్తమగును. అయినను పరమత్మ నిర్వికార, అసంగ, అఖండ, భేదరహితుడు. పరమత్మ సర్వగత, సర్వ్యాపకుడు. జీవుల కర్మ ఫల భోగము నిర్ణయించువాడు పరమాత్మయే. ఇతర దైవములు పరమాత్మ అధీనమున పనిచేయువారు వేదములు, శృతులు పరమాత్మయే కర్మ ఫల ప్రదాతగా చెప్పును. కాని జైమిని కర్మనే ఫల ప్రదాతయనెను. వేదములలో కూడ ప్రత్యేకఫలమును ప్రత్యేక కర్మ నిర్దేశింపబడెను. కావున వేరు ఫల ప్రదాత అవసరములేదు. కాని సూత్రకరారుడు కర్మ నిమిత్త మాత్రము. జడ, పరివర్తనశీల క్షణికమగుటచే ఫలమునిచ్చు శక్తిలేదు. పరమాత్మయే కర్మ ఫల ప్రదాతయనెను. శృతులలో కూడ అటులనే చెప్పబడెను.

తృతీయ అధ్యాయము - తృతీయ పాదము

వేదాంత వాక్యములలోని ఆత్మ విద్య అనేక ప్రకారములు గా వర్ణింపబడెను. భగవత్ర్పాప్తి విషయక భిన్న భిన్న వాక్యముల లోని విరోధమును దూరము చేసి ఏకత్వ ప్రతిపాదన చేయుటకు మూడవ పాదము ప్రారంభింపబడెను.

3-3(1-10):- ఉపనిషత్తులలోని వివిధ ఆధ్యాత్మిక విద్యల వర్ణనలో విధి వాక్యముల ఏకత్వము కనబడును. పరమాత్మను తెలిసికొనుటకు వానియొక్క లక్ష్యము. మోక్ష ప్రాప్తియే వాని పరమావధి. భిన్న భిన్న శాఖలద్వారా వర్నిత ప్రకారముల యందు కూడ ఆంశిక భేదము కనబడి నను ఆస్తవమునకు భేదము లేదు. ఈశ్వర తత్వజ్ఞానమే ప్రముఖము. వర్ణన శైలిలో భేదమున్ననను వాస్తవ మునకు భేదములేదు. ఉత్పత్తి కారకుడు పరమాత్మనే సత్‌, ఆత్మ, ఆనందమయ, ప్రజాపతి, అవ్యాకృత మను వివిదనామముల, వివిధ ఉత్పత్తి క్రమములు చెప్పబడినను కేవలము వర్ణన భేదమేకాని ఉద్దేశ్యము, ఫలము ఒక్కటే. అదియే పరబ్రహ్మ. అధర్వణశాఖయందు ముండకోపనిషత్తులో శిరోవ్రతము (జటాధారణ) పూనినవారికే బ్రహ్మ విద్యను పదేశింపవలెనని చెప్పబడెను. ఇది ఆకాఖవారియొక్క అధ్యయన, అధ్యాపక పరంపరాగత ఆచారమే కాని బ్రహ్మవిద్య యొక్క ఏకత్వములో భేదములేదు. కఠోపనిషత్తులోను గీతయందు, సర్వవేదముల ద్వారా తెలిసికొనవదగిన వాడు నేనే (బ్రహ్మ) యని చెప్పబడుటచే అన్నివేద, శృతి వాక్యములు ఒకే విషయమును ప్రతిపాదించుచున్నది. బ్రహ్మ విద్యా వర్ణనలో ప్రయోజన భేదము లేని కారణమున ఒక చోట చెప్పడిన విషయము రెండవ చోట ఉప సంహరింపబడెను. శృతులలో వర్ణిత బ్రహ్మ విషయమున శబ్ధ భేదము నామ భేదము, ప్రకరణ భేదము కనబడుచున్నను వాని విషయము ఒక్కటే. ఛాండోగ్యోపనిషత్తులో దహరవిద్య ప్రాజాపత్యవిద్య యను రెండు బ్రహ్మవిద్యల వర్ణనకనడును. దహరవిద్యయందు దహరాకాశమునే ఉపాస్యమని చెప్పబడెను. ప్రకారాంతమున పరబ్రహ్మ సర్వమునకు. ఆధారమనియు, అది ఆత్మయేయని సత్య సంకల్పాది గుణ యుక్త మని చెప్పబడెను. చాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులలో ఉద్గీధ (ఓంకారము) శ్రేష్టము, దుహత్వ పూర్ణమనియు, బృహదారణ్యకమందు యజ్ఞముల యందు ఉద్గీధ గానము స్వర విశేషమని చెప్పబడెను. వీనలో ఉద్దేశ్య, విధేయ ఫలముల ఏకత్వములేదు. కావున రెండు ప్రకరణములందు భిన్నత కలదు. కాని దహర విద్య, ప్రజా పత్య విద్లయ యందు అట్టి భేదములేదు. నామ భేదమున్నను ఉద్దేశ్య విధేయఫలముల సమానత కలదు. నామ భేదమున్నను పరబ్రహ్మ పరమాత్మ సర్వవ్యాపి, సర్వశక్తివంతుడు సర్వజ్ఞుడు. కావున బ్రహ్మ పరమాత్మ సర్వవ్యాపి, సర్వశక్తివంతుడు సర్వజ్ఞుడు. కావున బ్రహ్మ విషయక విద్యలలో నామ ప్రకరణభేదము కనబడినను పరమాత్మ స్వరూపమును తెలుపుటయే వాని ఉద్దేశ్యము. కావున భేదములేదు. ఇతర విద్యలయందు పైకారణముచే భేదముండవచ్చును, కాని బ్రహ్మ విద్యయందుకాదు.

3-3-(11-18):- ఆనంద, సర్వగతత్వము, సర్వజ్ఞత మొదలగునవి పరబ్రహ్మ పరమాత్మ దర్మములు. ఇవిశృతుల యందు ఒకచోట వర్ణింపబడి వేరొక చోట ఉపసంహరింపబడవచ్చును పరబ్రహ్మ వర్ణలో పక్షి రూపమున కల్పింపబడిన అంగుముల బ్రహ్మ స్వరూపగుట ధర్మములుకావు. ఇవి కేవలము రూపకాత్మకము. రూపకమునందు ప్రియ శిరత్వాది ధర్మములు కల్పనాత్మకములు. ఆనందాది స్వరూప గత ధర్మములు ప్రతి ప్రసంగమునందును ప్రయోగింపవచ్చును. దీని యందు అర్ధ సమానత్వము కలదు. హృదయ కుహరమందున్న పరమాత్మ తత్వమును విశదము చేయుటకు పంచకోశముల ప్రకరణమున స్థూల అన్నమయ కోశమునుండి సూక్ష్మ ఆనందమయ కోశవర్ణనలో పక్షి యొక్క అంగముల ఉపమాన మీయబడెను. క్రమముగా రెండువది మొదటి దాని అంతరాత్మగా ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయుడు. ఆత్మ శబ్దము అధికముగా జీవాత్మయొక్క వాచకము. కాని పరబ్రహ్మ వాచకమెట్లు అను శంకకుసమాధానముగా శృతుల యందు వర్ణిత ఆత్మ పరమాత్మయే. ఆనందమయ పరబ్రహ్మ పంచకోశవర్ణనలో ఆత్మ శబ్ద ప్రయోగము ఒకదానికి మరియ యొకటి అగును. కాని చిట్ట చివర ఆత్మ శబ్ద ప్రయోగము ఆనందమయ బ్రహ్మ యొక్క వాచకము. అన్ని రసమయ పురుషుడు పరమాత్మయా? అను శంకకు సమాధానముగా అన్నిమయ స్ధూలకోశము పురుషుడు, క్రమముగా సూక్ష్మతను పొంది విజ్ఞాన మయ కోశమునందుజీవాత్మ ఆనందమయకోశస్ధ పరబ్రహ్మను పొందును. ఇదియే ''సత్యం జ్ఞాన మనంతంబ్రహ్మ'' అన్నమయ పురుషుని అంతరాత్మయే పరబ్రహ్మ.

3-3-(19-25):- శృతుల యందలి వివిధ శాఖలలో బ్రహ్మవిద్యయొక్క ఏకత్వము, గుణముల ఉపసంహారము స్వీకరింపబడెను. అటులనే ఒక శాఖలో చెప్పబడిన విద్యల యందు కూడ ఒకే ఉపాస్యబ్రహ్మ విషయముండుటచే ఏకత్వముకలదు. బృహదారణ్యకములో సత్యమే బ్రహ్మయని, సత్యము సూర్యమండలస్థిత పురుషునితో, మరల నేత్రముతో ఏకత్వము చెప్పబడెను. ఉపాస్యసంబంధమున్నను వేరు వేరు ఉపాసనలు తెలుపబడుటచే భ##దేమున్నదా? లేదా? సమాధానము - సూర్యస్ధ పురుషుని 'అహర' అనియు, నేత్రస్ధ పురుషుని 'అహమ్‌' అనియు నామ, స్థాన భేదములుకలవు. కాని సూర్యస్థ పురుషుని గుణములు, నేత్రస్థ పురుషుని గుణములు విధానీకరింపబడెను. బృహదారణ్యకమందు గార్గి యాజ్ఞవల్క్య సంవాదమునందు సూర్య, చంద్ర ద్యులోక, పృధివ్యాదులు అక్షర పర బ్రహ్మయందే ధరింపబడి, శాసింపబడుచున్నవి. సూర్యస్థ, నేత్రస్థ పురుషులకు అంతరాత్మ యందు వశించు పరమపురుషునకు సమానత్వములేదు. ఇది కేవలము అంతరాత్మగతపురుషుని గురించి వివరించుటకే వానికి పురుషనామమీయబడెను. శృతుల యందు రూపకల్పన ద్వారా విశేష విషయము చెప్పుటకేగాని అన్యప్రకరణము లందు అనుపయుక్త మగుటచే స్వీకరా యోగ్యముకాదు.

3-3-26:- శృతుల యందు బ్రహ్మ విద్యాఫలము వేర్వేరు గా వర్ణింపబడెను. కాని భేదముకలదా? లేదా యను జిజ్ఞాసకు సమాధానముగా - శృతుల యందు ఫల ప్రాప్తి వర్ణలో హర్ష శోకనాశనము, మృత్యుముఖమునుండి వెలువడుట సమస్త పాశముల నుండి విడివడుట మొదలగు వర్ణనలు బ్రహ్మ లోకప్రాప్తి. పరబ్రహ్మలో విలీనమగుట, అమృత స్వరూపమును పొందుట మొదలగు ఫలవర్ణనల వాక్యశేషముగా భావించవలెను. వాక్యశేషమును గ్రహించుట శృతి సమ్మతము.

3-3-(27-32):- పుణ్యకర్మ శేషముండ బ్రహ్మలోకమెట్లు పొందును? సమాధానము - జ్ఞాన పురుషులు శరీర త్యాగము చేసినపుడు వారిశుభా శుభకర్మల సంబంధముండదు. కర్మ ఫల రూపమున గాక బ్రహ్మజ్ఞాన బలముచే బ్రహ్మలోకమును పొందెదరు. జ్ఞాన పురుషులు సంకల్పమాత్రము చే ఈలోకముననే బ్రహ్మసాయు%్‌యమును పొందవచ్చును. బ్రహ్మలోక దర్శనేచ్ఛచే దేవయానము ద్వారా బ్రహ్మలోక ప్రాప్తి పొందవచ్చును. సంకల్పాను సారము ముఖ్య ప్రాణము ఉదాన వాయువు ద్వారా మనస్సు, ఇం%్‌రియాదుల వాసనలతో జీవాత్మ ఇతర లోకములు పొందును. కాని నిష్కామ పూర్ణకాలములగు జ్ఞానులు ఈ లోకమందే ఈశ్వర ప్రాప్తి పొందెదరు. ఇచటనే పరమాత్మను పొందినవారు బ్రహ్మలోకమునకు వెళ్లి నవసరములేదు. వశిష్ట వ్యాసాదులు పురుషాధికారము పొంది పరమేశ్వరు నాజ్ఞచే జగత్కళ్యాణముకొరకు వచ్చుచుందురు. వారి క్రియలు సర్వదా విలక్షనము, దివ్యము, అవసరముననుసరించి సర్వలోకములందు స్వతంత్రగమనము కలిగి పిదపపరమాత్మలో విలీనమగుదురు.

3-3-(33-41):- బ్రహ్మ జీవుల స్వరూప వర్ణన గల శృతులను గూర్చి విశదీకరణము - బృహదారణ్యకముండకోపనిషత్తులలోయాజ్ఞవల్క్యగార్గి, అంగిర - శౌనక, ఋషుల సంవాదములో పరబ్రహ్మ అక్షరుడు, నిర్గుణ, నిరాకార, అవినాశి, సర్వవ్యాపి, అతి సూక్ష్మ వినాశ రహితుడు సర్వప్రాణుల కారణభూతుడు. జ్ఞానులగు పురుషులు అట్టి పరబ్రహ్మను అ%్‌నిదిశల నుండి చూచెదరు. ముండకోపనిషత్తులో ప్రకాశము ఛాయ రూపమునజీవుల హృదయ మందుండుట చెప్పబడెను. పరమాత్మ జీవాత్మలు హృదయకుహరమందున్నను జీవాత్మ శరీర ఆసక్తిచే మోహితమై చింతించుచుండును. భక్తుల ద్వారా సేవింపబడు, తన దగ్గర నే యుండు సఖుడగు పరమాత్మ అతని విచిత్రమహిమలు తెలియగనే శోకరహితుడగును. శృతుల యందు ఉదాహరణలు, వర్ణిత విద్యలు ఒక్కటే. సర్వప్రాణుల హృదయమందుండు అంతర్యామి యే పరమాత్మ. సర్వవ్యాపకుడు. సర్వకర్మల అధిష్టాత, సర్వసాక్షి, విశుద్ధుడు, గుణాతీతుడు. జీవాత్మ అందరి యొక్క అంతర్యామి కాజాలదు. అతి సూక్ష్మముగా హృదయమందుండు పరమాత్మయే సత్యము. ఆత్మ, కార్యకారణ ములవలె జీవాత్మ పరమాత్మలు ఒక్కటే. పరమాత్మ జీవాత్మల భేదము లేదు. ఉపాసనా కాలములో తనను పరమాత్మవలె నిత్యశుద్ధ, బుద్ధ ముక్తునిగా తద్రూప ధ్యానముచేసిన సచ్చిదానంద పరబ్రహ్మ నుపొందును. పరమాత్మ నిర్విశేషుడు, సవిశేషుడు, పరమాత్మ యొక్క సత్య సంకల్ప, సత్యకామ, అర, అమర, సర్వజ్ఞ సర్వశక్తి వంత, సర్వాధారాది లక్షణములు స్వాభావికము, ఉపాధికృతముకాదు. పరమాత్మ జీవాత్మలలో సమాన ధర్మత్వము లేని కారణమున వారి యందు ఎల్లపుడు అభేదము చెప్పుటదకు వీలులేదు. పరమాత్మ కంటె వేరే ద్రష్టలేడు. అని చెప్పుట పరమాత్మ యొక్క సర్వశ్రేష్ఠతను తెలుపుటకేకాని వాస్తవమునకు కాదు. జీవుల యందు సంపూర్ణ ద్రష్టత్వములేదు. పరమాత్మ ప్రేరకుడు. పరమాత్మ కంటె అన్య ద్రష్టము మొ|| వారు లేరని చెప్పుటలో పరమాత్మ సర్వశ్రేష్ఠత సూచింపబడెను.

3-3-(42-52):- ఫల విషయమున శృతులలోని విరోధాభాసము దూరము చేయుచు - స్వర్గలోక భోగములవలె బ్రహ్మలోకమునగూడ భోగముల నను భవించు విషయమున అట్టి ఇచ్ఛకలవారికే భోగము లనుభవించుట పరమపద ప్రాప్తి యందు భోగేచ్ఛ ఉండదు. స్వర్గభోగాసక్తి కామ్యకర్ములను బ్రహ్మ విద్యయందు ప్రవృత్తులను చేయుటకు, వారియందు శ్రద్ధకలిగించుటకు, స్వర్గలోక సుఖములు తుచ్ఛత తెలుపుటకు అట్టి వర్ణన చేయబడెను. వేదాంత శాస్త్రమందు బ్రహ్మ జ్ఞాన ఫలము జన్మమరణ రహిత శాశ్వత బ్రహ్మ పదము పొందుటే. బ్రహ్మ విద్యవలెనే అగ్నిహోత్ర కర్మ, ¸్ఞు, దాన, తపాదికర్మలు జన్మ మృత్యురహితముక్తి హేతువులు. అను పూర్వ పక్షవాదమునకు, బ్రహ్మ జ్ఞానమే మోక్ష హేతువు. కర్తలు స్వర్గలోక స్తుతియందు. మోక్ష ప్రాప్తియనుట గౌణము. శృతులయందు కూడ యజ్ఞయాగాది కర్మలు స్వర్గలోక ప్రాప్తికి, బ్రహ్మ %్‌ఞానము పరమ పదప్రాప్తికి హేతువులని చెప్పబడెను. భావానభేదముచే భిన్న భిన్న అధికారులకు కలుగు ఫలమునందు భేదముండును. భోగ సంకల్పము కలవారికి బ్రహ్మ సాక్షాత్కారముకాదు. భోగ విరక్తునకు పరమాత్మ సాక్షాత్కారము శరీరముండగనే లభించును. బ్రహ్మలోక దర్శనము కోరువారు బ్రహ్మలోకమునకు వెళ్లెదరు. ఎవరికి ఇచటనే బ్రహ్మ సాక్షాత్కారము కలుగునో వారు బ్రహ్మలోలీనమగుటచే బ్రహ్మ లోకమును వెళ్లరు.

3-3-(53-54):- నాస్తికులు శరీరము లేనిచో ఆత్మ యొక్క అస్ధిత్వము కర్మ ఫల భోగమునకు పరలోక ప్రాప్తి అంగీకరించరు. కాని శరీరముకంటె భిన్నముగా సమస్త భూతములు వానియొక్క కార్యములు తెలిసికొను ఆత్మకలదు. మృత్యుకామున శరీరము ఇచటనేయున్నను చేతన ఆత్మ ఇచట ఉండదు. ఆత్మ స్ధూలశరీరమునగాక సూక్ష్మ శరీరమున ఉండును. శరీరముకంటెభిన్నమగు చేతన ఆత్మ లేనిచో జడపదార్ధములవలె అది ఇతర శరీరములను తెలిసికొనవలేదు. జ్ఞేయశరీరమందు జ్ఞాతయగు ఆత్మకలదు.

3-3-(55-60):- భిన్న భిన్న శాఖలలో యజ్ఞ యాగాదులందు ఉపాసనా భేదముకలదు. ఒక శాఖలోని పద్ధతి ప్రకారము రెండవ శాఖలో చేయ వచ్చునా? ఓంకార ఉద్గీధ మొదలగు ప్రతీకోపాసన ఒక శాఖలో చెప్పబడినను రెండవ శాఖలో కూడ అనుష్టించవచ్చును. యజ్ఞోపయోగ పదార్ధముల వలెనే ¸్ఞు సంబంధమగు ఉపాసనల ననుష్టించుట యందును విరోధములేదు. వైశ్వానరోపాసన మొదలగు ఉపాసనలయందు వివిధ అంగముల వేర్వేరుగా ఉపాసించుటకంటె పూర్ణముగా ఉపాసించుట శ్రేష్ఠము. సద్విద్య, భూమవిద్య, దహర విద్య, ఉపకోశల విద్యశాండిల్య విద్య వైశ్వానరవిద్య ఆనందమయవిద్య, అక్షర విద్య అనుభిన్న భిన్న యవిధి విధానములను అధికారిని బట్టి యుండును. ఫలప్రాప్తి బ్రహ్మ ప్రాప్తి యైనను ఇది ఒకటికాదు. భిన్నము సైఆధకుడ తన ఇచ్ఛానుసారము ఏదేని ఒక విద్యానుసారము సాధన చేయవచ్చును. సకామకర్మల ఉపాసనావిధులు వేరేవేరైనను, వానిని కలిపిగాని వేరుగా గాని చేయవచ్చును.

3-3-(61-66):- యజ్ఞ కర్మలయందు అంగభూతమగు ఉద్గీధమొ|| ఉపాసనలు ఆయాకర్మలనును సరించి కలపవచ్చును. అంగాశ్రిత ఉపాసనలు కలవవచ్చును. అను పూర్వ పక్షమును సిద్ధాంతకరించుచు, ఏ ఉద్ధేశ్యముతో ఏఫల ప్రాప్తికి యజ్ఞాదికర్మలు చేయబడునో, వాని అంగములతో చేయబడు ఉపాసన భిన్నన ఉద్ధేశ్యముతో చేయబడును.కావున ఉపాసనలు కలుపరాదు. ఉపాసనలు ఆశ్రయభూతకర్మ సంబంధిత అంగములుకావు. స్వతంత్రములు, వాని అనుష్టానము కలిపి చేయక వేర్వేరుగా చేయవలెను.

తృతీయ అధ్యాయము - చతుర్ధపాదము

పరమాత్మ ప్రాప్తికి బ్రహ్మ జ్ఞానము స్వతంత్ర సాధనమా? కాదా? వాని అంతరంగ బహిరంగ సాధనలుఏవి? పరమాత్మ ప్రాప్తి జ్ఞానము ద్వారానా లేక కర్మల ద్వారానా అను విషయ వివరణ చేయబడినది.

3-4-1:- ఆత్మ జ్ఞాని శోకమోహములను తరించును నామ రూప ములనుండి ముక్తుడై పరాత్పర పరబ్రహ్మను పొందును. బంధవిముక్తుడగును కావున శృత్యాను సారము పరమాత్మ ప్రాప్తి రూపమగుపరమ పురుషార్ధ సిద్ధి బ్రహ్మ జ్ఞానముచే లభించును.

3-4-(2-7):- జైమిని ప్రకారము ఆత్మ కర్మలకు కర్త గావున ఆత్మ స్వరూప జ్ఞానము కలిగించు విద్యకూడా కర్మ యొక్క అంగమే. వాస్తవమునకు పురుషార్ధ సాధనము కర్మయే. బృహదారణ్యక, ఛాందోగ్యోపనిషత్తులలో జనకుడు, అశ్వపతి మొదలగు రాజర్షుల వచనములు, ఉద్దాలకయాజ్ఞవల్క్యాది ఋషులు కర్మలు చేసిరి. కావున బ్రహ్మ విద్య కర్మ యొక్క అంగమే. కర్మల చేతనే అది పురుషార్ధసాధకము. కర్మ విద్య శ్రద్ధ, యోగము లతో కూడి చేయబడును. కర్మ బ్రహ్మయొక్క అంగము. కేవల జ్ఞానము పురుషార్ధ హేతువుకాదు. జీవాత్మ ఒక శరీరమునుండి బయటకు వెళ్లునపుడు ఇంద్రియములు, అంతఃకరణలతోపాటు విద్యాకర్మలను కూడ తీసుకువెళ్లును. పూర్వ సంస్కారములను తీసుకొని ఈవాత్మ ఒక శరీరము నుండి వేరొక శరీరము పొందును.కావున విద్య కర్మ యొక్క అంగము. శృతులలో బ్రహ్మవిద్య, బ్రహ్మ నుండి ప్రజాపతులు, వారి నుండి మనువు, మనువు నుండి ప్రజలు గురు శిష్య పరంపరగా పొందిరి. బ్రహ్మచారి గురువు వద్ద వేద వేదాంగములు, వేదాంతవిద్యనభ్యసించి స్నాత కానంతరము గృహస్ధ జీవితము గడపుచు, పుత్రులకు, శిష్యులకు విద్యల బోధించి, ఇంద్రియములను అంతఃకరణమున స్ధాపించి అంతమున బ్రహ్మలోక మునుపొందును. శాస్త్ర విహిత శ్రేష్ఠకర్మల నాచరించుచుండుట శృతుల యందు చెప్పబడెను. కావున విద్య కర్మ యొక్క అంగము. కేవల జ్ఞానము పురుషార్ధహేతువుకాదు.

3-4-(8-17):- జైమిని చెప్పిన యుక్తులన్నియు ఆభాసమాత్రములు లోక సంగ్రహార్ధము, ప్రారబ్ధానుసారము శరీరస్ధితి కొరకు చేయుకర్మలు ఇహలోక సంబంధమైనవి. యజ్ఞాది కర్మలు ఇష్ట పూర్తికి చేయుటచే స్వర్గాది లోకములుపొంది కర్మఫల క్షయము కాగానే మరల మర్త్యలోకమును పొందెదరు. కేవలము బ్రహ్మ నిష్ఠులగు గురువుల ఉపదేశానుసారము బ్రహ్మజ్ఞానము బడయుటచే పురుషార్ధ ప్రాప్తికలుగును. బ్రహ్మవిద్య కర్మ యొక్క అంగముకాదు. జ్ఞానమే మోక్షసాధనము. జనకాదులు జ్ఞాన నిష్ఠులైనను లోకసంగ్రహార్ధము కర్మలు చేసిరి. విరక్త సన్యాసులు సమస్త కర్మల త్యజించి బ్రహ్మ చింతన తత్పరులై బ్రహ్మను పొందెదరు. జ్ఞాన ప్రాప్త పురుషులు కర్మ చేయుట వలన ప్రయోజనములేదు. అటులనే త్యాగమువలన (గీ. 3-17). కావున బ్రహ్మజ్ఞానము చేతనే పరమ పదము పొందెదరు. కర్మచేకాదు. ఉద్గీధ విద్యాదులు ఏకదేశీయములగుటచే విద్యకర్మ యొక్క అంగముకాజాలదు. అధికారిక భేదానుసారము ఫలముండును. బ్రహ్మజ్ఞానియొక్క కర్మలు ఇచటనేనష్టమగుటచే బ్రహ్మ విద్యా బలము చేతనే బ్రహ్మ లోకము పొందును. సాధకుడగు సాంసారికమానవుడు శ్రవణ, మననాదులచే బ్రహ్మ విద్ను పొదుటకు యత్నించును. కావున విద్యకర్మ యొక్క అంగము కాదు. కేవలము బ్రహ్మ విద్య నభ్యసించి మనన నిధి ధ్యాసనాది అనుష్టానములు చేయనివారి అంతఃకరణ శుద్ధికొరకు కర్మలు చెప్పబడినవి. త్యాగపూర్వక అజీవన కర్మలు చేయుట సాధకుల కొరకు జ్ఞానుల కొరకు కాదు. బ్రహ్మ విద్యావేత్తలు లోక సంగ్రహార్ధము కర్మలుచేసినను వారు కర్మలదచే లిప్తులుకారు. విద్వాంసులు పూర్వ ప్రకృతి ననుసరించి జీవితాంతము కర్మలు చేయుదురు. లేదా విడచిపెట్టెదరు - అట్లు చేయుటకు వారికి పూర్ణ స్వాతంత్ర్యముకలదు. కర్మ ఫలనావనమే బ్రహ్మజ్ఞానఫలము. బ్రహ్మచర్య, గృహస్ధ, వాన ప్రస్ధాశ్రమములందు కూడ బ్రహ్మ విద్యను అనుష్టించుటకు అధికారముకలదు. సన్యాసులకు వైదిక యజ్ఞాది కర్మల విధానములేదు. వారికి బ్రహ్మవిద్యయందే అధికారము కలదు. కావున విద్యకర్మయొక్క అంగముకాదు. జ్ఞానమేమోక్షహేతువు.

3-4-(18-20):- జైమిని శృతివచనములననుసరించి సన్యాసాశ్రమము ఆచరణయోగ్యముకాదు. కావున సన్యాసాశ్రమము అనువాద మాత్రము విధి పూర్వకముకాదు. విద్య కర్మ యొక్క అంగము. దీనిని ఖండించుచు సూత్రకారుని భాష్యము - ప్రతి వారికి ఆశ్రమ ధర్మముల ననుష్ఠించుట ఉచితము. అగ్ని హోత్రాదికర్మలు త్యజించుట తగదు. పూర్ణవిరాగి యైన సన్యాసికి కర్మలయందుగాక బ్రహ్మవిద్యయందే అధికారముకలదు. కావున విద్య కర్మ యొక్క అంగముకాదు. శృతుల యందు కర్మత్యాగ నిషేధము, కర్మాసక్త మనుష్యులకేగాని విరక్తులకు కాదు. క్రమానుసారముగాగాని, లేదా తీవ్రవైరాగ్యభావముచే ఏ ఆశ్రమానంతరమైనను సన్యాసాశ్రమము స్వీకరించవచ్చును. బ్రహ్మ విద్యచేతనే పురుషార్ధ ప్రాప్తి జరుగును.

3-4-(21-22):- శృతుల యందు ఉద్గీధ విషయమగువర్ణనలు. కేవల స్తుతి మాత్రములు. సమస్సకర్మాంగ భూత ఉపాసనలలో ఏయే విశేష గుణముల వర్ణన చేయబడునో అది ఆయా అంగముల స్తుతి మాత్రమే. కావున విద్యకర్మ యొక్క అంగముకాదు. కర్మయొక్క అంగభూత ఉద్గీధాదులు ప్రతీకాత్మకముగా ఉపసనా విధానము కొరకగుటచే విద్యకర్మ యొక్క అంగముకాదు.

3-4-(23-24):- ఉపనిషత్తులలో వచ్చు యమ - నచికేత, దేవతా - యక్ష, మైత్రేయి - యాజ్ఞవల్క్య, ప్రతర్దన - ఇంద్ర మొదలగు సందర్భముల వచ్చు కధలు యజ్ఞ సంబంధమగు పరిప్లవ నామకకర్మయొక్క అంగములు. 'మనుర్వైవస్వతోరాజా' మొదలగు వాక్యముల ద్వారా వచ్చు ఉపాఖ్యానములు పరిప్లవ కర్మ అంగ భూతములుకావు. ఆయా ఆఖ్యానములు ఆయావిద్యల అంగ భూతములు. కావున ఆఖ్యానములు బ్రహ్మవిద్య యొక్క అంగములే కాని కర్మవికాదు.

3-4-25:- బ్రహ్మ విద్యయను యజ్ఞమందు యజ్ఞోపకరణము లన్నియు పరమాత్మే (గీ. 4-29). బ్రహ్మ విద్యపరమ పురుషార్ధ సాధనలలో సర్వధా స్వతంత్రము. కర్మకు అంగముకాదు.

3-4-(26-27):- శృతి వచనానుసారము పరమాత్మ తత్వము తెలుసుకొనుటకొరకు అన్నివర్ణాశ్రమోచిత కర్మల ఆవశ్యకతకలదు. యజ్ఞదాన, తపాది కర్మలు త్యాజముకావు. ఇవి మనీషులగు పురుషులను పవిత్రము చేయును. కర్మ త్యాగము కాక కర్మ ఫలత్యాగముమిన్న. నిష్కామ భావనచే చేయు కర్మ ఫలమంటదు. బ్రహ్మ జ్ఞాన ప్రాప్తికి కర్మల అవసరము, కాని ముఖ్యము కాదు. బ్రహ్మ విద్యచేతనే ఫల ప్రాప్తి కలుగును. కర్మ బ్రహ్మ విద్యాప్రాప్తిలో సహాయకము. బ్రహ్మ సాక్షాత్కారమునకుకాదు. పరమాత్మ ప్రాప్తికి శమదమాది సాధనలు బ్రహ్మవిద్య యొక్క అంగములు. కావున వాని నాచరింపవలెను. ఆశ్రమ ధర్మానుసార కర్మలు నిష్కామ భావనచే చేసిన అంతఃకరణ శుద్ధి కలిగి బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి సులభమగును. విరాగులకు కర్మయొక్క అవసరములేదు. కాని శమ దమాదుల ఆచరణ ఆవశ్యకము.

3-4-(28-31):- ఛాందోగ్యోపనిషత్తు నందు ఉషిత్సుడనువిద్వాంసుడు ఆకలి బాధకోర్వలేక మావటి వానిచే ఎంగిలి చేయబడిన ఉలవలను గ్రహించెను. కాని ఎంగిలి నీరు త్రాగలేదు. ప్రాణాపాయ పరిస్థితలో ప్రాణము నిలుపుటకు ఎంగిలి దోషములేదు. కాని ఇతర అభక్ష్యనిషేధము కలదు. ఆహార శుద్ధిచే అంతఃకరణ శుద్ధి కలుగును. కావున ఆపత్తి కాలము లందు తప్ప ఇతర సమయములందు భక్షా భక్ష్యపాచారముచేసి అభక్ష్య వస్తువులను త్యజించవలెను. ఆహార విషయిక సదాచారమును పరిత్యజించకూడదు. విద్వాంసుల విషయములో వారికి ఏదియు అభక్ష్యము కాదు అనుట కేవలము వారి దిద్వత్ర్పశంశమాత్రమే. కావున అభక్ష్యములను భక్షించరాదు.

3-4-(32-33):- జ్ఞానులగు పురుషులు కూడ శరీర స్ధితికి భోజనాదులు బ్రహ్మవిద్యాపయోగములగు శమదమాది కర్మలు లోక సంగ్రహార్ధము చేయవలెను. అటులనే ఆశ్రమ ధర్మములను నిర్వర్తించవలెను. శమ దమాదులు ఈశ్వరప్రాప్తి సాధకములైనట్లే నిష్కామ భావనచే చేయబడు శాస్త్రవిహిత ఆశ్రమ ధర్మ ఆచార వ్యవహారాదులు సాధకములు. కావున వానిని లోక సంగ్రహార్ధము చేయవలెను. విడువరాదు.

3-4-(34-39):- శృతిస్మృతులలో వర్ణించిన విధముగా ఆపత్తి కాలములో కారణవశమున ఆశ్రమసంబంధమైనవి. శరీర నిర్వహణ సంబంధమైన కర్మలను పూర్తిగా చేయలేక పోయినను శ్రవణమననాదులచే భగవదుపాసనా ధర్మములు ఎటులైన చేయవలెను. పరమాత్మ ప్రాప్తి కొరకు చెప్పబడిన ఉపాసనా విషయిక శ్రవణ, కీర్తన, స్మరణాదులను అన్ని పరిస్థితులలోను చేయవలెను. ఇతర వర్ణాశ్రమ ధర్మములు చేయుటకు అసమర్ధుడైనను కేవలము ఉపాసనా ధర్మముల పానలచే పరమాత్మ ప్రాప్తికలుగును. వర్ణాశ్రమ మర్యాదారహితుడగు పురుషుడు కూడ అనన్య భక్తిచే శరణాగతుడై పరమాత్మను పొదును. పాప యోనుల యందు జన్మించిన వారు కూడ పరమాత్మ శరణుపొంది ముక్కతులగుదురు. భాగవతము, భగవద్గీతాదుల యందు అనన్యభావనచే భక్తియుక్తుడై పరమాత్మ శరణుపొందినవారు భక్తవత్సలుడగు పరమాత్మ కృపను పొందెదరు. అట్టివారు భక్తి వినాముక్తిని కూడ ఆశింపరు. పరబ్రహ్మ పరమాత్మ పద్మనాభునినామము జిహ్వాగ్రమున నర్తించు చండాలుడు కూడ శ్రేష్టుడే. తప, యజ్ఞ, దాన, వేదాధ్యయనములకంటె భాగవత ధర్మము, భగవద్భక్తి శ్రేష్ఠము.

3-4-(40-43):- ఉన్నతాశ్రమములు స్వీకరించి పిదప క్రింద ఆశ్రమములు పొందగోరుట ఆశ్రమధర్మవ్యతిక్రమము. న్యాయ సంగతముకాదు. బ్రహ్మ చర్య, గృహస్ధాశ్రమములందు ఆశ్రవమ ధర్మములు తప్పుట చేవచ్చు వ్రత భంగదోషపరిహారార్ధము ప్రాయశ్చిత్త విదానముకలదు. కాని వాన ప్రస్ధ, సన్యాసాశ్రమ స్వీక్‌ఆరానంతరము ఆశ్రమ ధర్మ వ్రత భంగమునకు ప్రాయశ్చిత్తము లేదు. అది పతనము. కొందరు వాన ప్రస్ధ, సన్యాసాశ్రమవ్రత భంగము ఉపపాతకముగాన ప్రాయశ్చిత్త విధానముకలదందురు. కాని అది ఉపపాతకముకాదు. వారి పతనము భోగాసక్తిచే జరిగినది కావున అట్టి వారు బ్రహ్మవిద్యకు అర్హులుకారు.

3-4-(44-46):- యజ్ఞాదుల యందు, ఉపాసనాదులకర్తృత్వము ఫలప్రాప్తి యజమానిదే. కొందరు ఆచార్యులు కర్తృత్వము ఋత్వికునిదేకాని యజమానిదికాదు అందరు. శృత్యానుసారము యజ్ఞకర్మల కర్తృత్వము ఋత్వికునకు, ఫలాధికారము యజమానిది.

3-4-(47-50):- బ్రహ్మయొక్క శాస్త్రీయ జ్ఞానము, వికారముల అభావము, నిరంతర మనన నిధిద్యాసనల పరిపక్వ అవస్ధ యందే బ్రహ్మ సాక్షాత్కారము కలుగును. గృహస్ధాశ్రమములో కూడ బ్రహ్మప్రాప్తి పొందవచ్చును. కాని ఇంద్రియనిగ్రహము, కోరకలు విడచుట, రాగద్వేషములు విడచుట మొదలగునవి సన్యాసాశ్రమములోనే సాధ్యము. కావున సుగమము కొరకు సన్యాసాశ్రమము చెప్పబడెనేకాని అన్య ఆశ్రమములలో బ్రహ్మవిద్యాధికార నిషేధములేదు. అన్ని ఆశ్రమము లందు శమ దమాదినియమ శీలురకు బ్రహ్మ విద్యాధికారము కలదు. బ్రహ్మవిద్య సహకార సాధన రూపమున బాల్యావస్థ భావన చెప్పబడెను. అనగా మాన, దంబ, రాగ ద్వేషరహిత నిర్మలత్వము ప్రతిపాదితము. కాని బాల్యకాలమదలి అభక్షణ భక్షణ, ఆచారహీనత, అశౌచము మొదలగు నిషిద్ధ భావములు గ్రహించరాదు. కావున బ్రహ్మవిద్యా సాధకునకు బాలకుని నిర్మలత్వము గ్రాహ్యము.

3-4-(51-52):- శృతిస్మృతుల ప్రమాణానుసారము జన్మ జన్మాంతర సంబంధమగు ఏవిధమైన ప్రతిబంధములేనిచో ఈ జన్మమందే ముక్తినిపొందెదరు. అట్టి విఘ్నములేని జన్మాంతరమున పొందెదరు. కాని చేసిన అభ్యాసాదుల వ్యర్ధముకావు. బ్రహ్మవిద్యచే ప్రాప్తించు ముక్తి ఈ జన్మలోనేకాక మరు జన్మలోనా అనునట్లే ఈ శరీరముతోగాని, లేక మరణానంతరముగాని బ్రహ్మప్రాప్తికలుగును. అమృత స్వరూపుడగు సాధకుడు ఈశరీరమందే బ్రహ్మను పొందును. అట్టి ముక్తావస్థ ఈశరీరముండగ కలగని వారు బ్రహ్మ లోకమున పరమాత్మను పొందెదరు.

SARA SUDHA CHINDRIK    Chapters