SARA SUDHA CHINDRIK    Chapters   

ఓం తత్‌సత్‌

శ్రీగణశాయనమః శ్రీరామచంద్రపరబ్రహ్మణనమః

బ్రహ్మసూత్రములు - ద్వితీయ అధ్యాయము (అవిరోధం)

ప్రధమ పాదము

సమస్త వేదాంత వాక్యానుసారము పరబ్రహ్మ పరమేశ్వరుడే జగత్తునకు అభిన్నినిమిత్త ఉపాదానకారణమనియు, ప్రధానాది జడవర్గముకాదని మొదటి అధ్యాయమున నిర్ధారింపబడుటచేదానిని సమన్వయాధ్యామనిరి. రెండవ అధ్యాయ ములో శృతిస్మృతులు లేక స్మృతుల మధ్య విరోధము లేదనుటచే ఇది అవరోధ నామ అధ్యాయము.

2-1-(1-11):- ప్రధానము (ప్రకృతి)ను జగత్కారణముగానంగీకరించక బ్రహ్మనే అంగీకరించుటచే కపిలముని రచిత సాంఖ్యశాస్త్ర మునకు అవకాశమయక ప్రమాణముగా నంగీకరించిన ప్రసంగమున సమాధానముగా - వేదాను కూలస్మృతులనే ప్రమాణముగా స్వీకరించవలెను. కాని వేదవిరుద్ధస్మృతులనుకాదు. వాస్తవముకు వేదములు స్మృతులయందు భ##దేములేదు. ఒకవేళ ఉన్నను వేదమే ప్రమాణముగాని స్మృఇకాదు. వేదము బలవత్తరము. భగవద్గీత, విష్ణుపురాణము. మనుస్మృతులలోకూడ బ్రహ్మనే జగత్కారణముగా వచింపబడెను. మనుస్మృతి యందు కూడ సాంఖ్యమతానుసారము ప్రధానముకారణమనుట ఎచటను వర్ణింపబడలేదు.

యోగశాస్త్రమందు ఇతర విషయముల సాంఖ్యులతోమత భేదమున్నది. జడప్రకృతిని జగత్కారణమని అంగీకరించుటలో ఏకత్వమున్నది. కావున ఒకదాని నిరాకరణచే రెండవదికూడ నిరాకరింపబడెను.

చేతన బ్రహ్మనుండి జడ ప్రకృతి ఉత్పన్నమాయెనుటచే శృతి ప్రమాణమున పరమేశ్వరుని విలక్షనత గోచరించును. కారణము నుండి కార్యము విలక్షణముగా నుండుట యుక్తి సంగతముకాదు. కావున చేతన బ్రహ్మ అచేతన జగదుత్వాదనకు ఉపాదానకారణము కారాదు. మరియు శృతులయందు తేజ, జలాదుల విచారించు నపుడు జడతత్వముల చేతన వ్యవహారము చెప్పబడినది. వాని అభిమనదేవతల ను లక్ష్యముగా జడతత్వములను చెప్పిరి. ఐ.ఉ. 1-2-4 నందు అగ్నివాణి రూపమున ముఖముని, వాయువు ప్రాణరూపమున నాసిక యందు ప్రతిష్ఠమగుటయందు ఆయాతత్వముల అభిమానదేవతల వర్ణన జరిగెను. ఆకాశాది జడతత్వములు జగత్తున లభించుటచే చేతన బ్రహ్మధర్మములకంటె విలక్షణము కావున బ్రహ్మ ఉపాదానకారణముకాదు. ఈశంకకు సూత్రకారుని జవాబు - మనుష్యాదులలో అచేతన నఖ, కేశములు ఉత్పన్న మగుట చెప్పబడినది. చేతన పురుషుని నుండి జడవస్తూత్పత్తి విలక్షణమే. కావున చేతన బ్రహ్మ నుండి జడజగత్తు ఉత్పన్నమగుట యుక్తి సంగతము. శృతిస్మృతి అనుమోదమేగాని విరోధము లేదు.

అవయవ రహిత చేతన పరబ్రహ్మ నుండి సావయవ జడవర్గము ఉత్పన్నమైనదని, మొదటలేని వస్తువుయొక్క ఉత్పత్తి చెప్పుట శృతి ప్రమాణవిరుద్ధము. వేదములలో అసత్‌నుండి సత్‌ ఉత్పత్తి అసంభవమనుట జరిగినదనుశంకకు సమదాధానముగా - అసత్‌ శబ్ద వాచ్యము అభావమునకు బదులుగా అప్రకటితమను అర్ధమున జడచేతన జగత్తు పరమాత్మయందు అప్రకటిత రూపమున నుండి ఆయన సంకల్ప మాత్రమున ప్రకటిత మాయెను. కావున పరబ్రహ్మను జగదుత్పత్తి కారణమనుట అసత్‌ నుండి సత్‌ ఉత్పత్తి యనుటకాదు.

మరియు ప్రళయకాలమున సంపూర్ణ జగత్తు పరబ్రహ్మయందుండుననుటచే పరబ్రహ్మయందు జడత్వము, జీవుల సుఖదుఃఖాది ధర్మముల నంగీకరించవలసివచ్చుటచే యుక్తి యుక్తముకాదను శంకకు సమాధానముగా - సువర్ణ ఆభూషణము సవర్ణములో విలీనమగుట. మట్టితోచేసిన వస్తువులు మట్టితోకలయుటయందు కార్యరూప ఆభూషణాదుల ధర్మము కారణ రూపతత్వము నందు కానరాదు. కావున సృష్టి ప్రళయకాలములందు కారణము (బ్రహ్మ) తనకార్య (జగత్‌) ధర్మములచే లిప్తముకాదు.

అవయవరహిత, అవ్యక్త, అగ్రాహ్యప్రధానము నుండి సాకార, జగదుత్పత్తి యందు కారణముకంటె విలక్షణకార్యోత్పత్తి నంగీకరించు దోషమున్నది. ఉత్పత్తికి ముందు స్పర్శాది ధర్మములు ప్రధానమందులేనివి. కార్యోత్పత్తి తర్వాత కార్యములో వచ్చుటచే అసత్‌ నుండి సత్‌ యొక్క ఉత్పత్తి దోషము. ప్రళయకాలమున సమస్త కార్యములు ప్రధానమున విలీనముకాగా కార్యధర్మములు కారణమందుండవు, అనుదోషములు సాంఖ్యవాదమున ప్రధానకారణ వాడముననుండుటచే ప్రధానము జగత్కారణముకాదు. వాద ప్రతివాదములందు ఒకరియుక్తిని మరియొకరు ఖండించుటచే దానికంత ముండదుకాన, అనుమానము ద్వారా నిశ్చయించవలెననుట కూడ సరికాదు. వేద ప్రమాణరహిత అనుమానము కూడ వాస్తవిక్ఞానము కలిగించదు. దానిచే తత్వజ్ఞానము కలుగదు. తత్వజ్ఞానము లేనిదే మోక్షముండదు. కావున సాంఖ్యమతమున మోక్షమురాదు.

2-1-12 :- వేదవిరుద్ధ సాంఖ్యమత సిద్ధాంతముల నిరాకరించినట్లే అన్యవేదాను కూలముకాని మతములు శిష్టపురుషులకు అంగీకారము కాదు. కావున నిరాకరింపబడెను.

2-1-(13, 14):- బ్రహ్మను జగత్కారణమనియెంచిన స్వయముగా బ్రహ్మ జీవరూపమున కర్మఫల సుఖదుఃఖాది భోక్తయనుటచే జీవ ఈశ్వర విభాగము సంభవముకాదు. తండ్రి యొక్క అంశీభూతుడగు. గర్భస్ధ శిశువు. గర్భజనిత పీడను అనుభవించునుకాని తండ్రికాదు. అటులనే ఒకే తండ్రికి పుట్టిన కుమారులు కూడ వారి వారి కర్మానుసారముగా సుఖదుఃఖముల ననుభవింతురుకాని ఒకేరకముగా కాదు. కావున భిన్నభిన్న జీవుల కర్మానుసార సుఖదుఃఖభోగములు వేర్వేరుగానుండును. అటులనే పృధ్వీతత్వము నుండి ఉత్పన్నమైన ఘటపటాదులయందు కూడ భేదమున్నది. ఘటముపటముకాదు. పటము పుటముకాదు. వానివాని నామ రూప వ్యవహారములు వేరువేరుగానుండును. ఒకే బ్రహ్మనుండి అసంఖ్యకార్యములు కలిగినను వానివిభాగమున అడ్డంకిలేదు. ఇట్లు భావించుటచే కారణ కార్యముల అనన్యత్వము ఋజువగుకున్నది. మట్టి, మట్టిచే చేయు వస్తువుల యందు, కారణకార్య అన్యత్వమున్నది. అటులనే ఈసర్వము పరమాత్మయే. సృష్టికి పూర్వము అవ్యక్తముగా నున్న జడముచేతన, భోగ్యభోక్త, జగత్తు సృష్ట్యారంభమున వ్యక్తమాయెను. అష్టభేదరూప జడప్రకృతినే అపరాప్రకృతియనియు, ఈవరూపచేతన సముదాయము తన పరాప్రకృతి యని గీత 7-5 నందు పరమాత్మ చెప్పెను. మరియు ఈ రెండు ప్రకృతులు సమస్త ప్రాణులకారణము నేను సంపూర్ణ జగదుత్పత్తి ప్రళయముల మహాకారణము (గీ 7-6) కావున పరమాత్మ తన ప్రకృతులతో అనన్యుడు.

2-1(15-20):- కార్యము తనకారణమున ఎల్లపుడు ఉండును. ఉన్నవస్తువే లభించును, కాని లేనిదికాదు. కందేటికొమ్ము, ఆకాశ పుష్పము. సర్వదా భావమగుటచే లభింపవు. ఈ జడచేతనాత్మక జగత్తు తన కారణ రూప పరమాత్మ యందు శక్తి రూపమున సర్వదా ఉండును. మరియు కారణముకంటె అభిన్నము. మరియు చా 6-2-1 బృ.ఉ. 1-4-7 ప్రకారము స్ధూల రూపమున ప్రకటితమగుటకు పూర్వము ఈ సంపూర్ణ జగత్తు తన కారణ రూప శక్తి రూపమునుండి సృష్టి కాలమున వ్యక్తమాయెను. మరియు తై.ఉ. 2-7 నందు ఈ జగత్తు అసత్‌ నుండి సత్‌ ఉత్పన్న మగుటచే దానికి 'సుకృత్‌' యను నామముకలిగెను. కాని ఇట అసత్‌ అనగా అవ్యక్తమను భావము ఛా.ఉ. 6-2-1, 2 లలో అసత్‌ నుండి సత్‌ ఉత్పన్నమగుననుటలో అభావ భ్రమను తొలగించును. ఈ సర్వముమొదట సత్‌యే, అనగా అవ్యక్తమే వ్యక్తమాయెను. ఇవి సత్కార్యవాదము ఋజువగుచున్నది. బృహదారణ్యకాదుల యందు అవ్యాకృతాది ప్రయోగముచే కూడ జగదుత్పత్తికి పూర్వము కూడ సత్‌యేయని ఋజువగుచున్నది. మరియు బట్ట దారము రూపమున అప్రకటితమైయుండును అటులనే జగత్తుకూడ మరియు మృత్యుకాలమున జీవాత్మతో కూడ ప్రాణంద్రియములు శరీరము వదలి వేరొక చోటికి పోవును. వాని స్వరూపముండనప్పటికి వాని అస్ధిత్వముకలదు. అటులనే ప్రళయ కాలమున జగత్తు అప్రకటితరూపమున నున్నను కారణ రూపమున దాని అస్తిత్వము తెలియవలెను.

2-1-(21-23):- బ్రహ్మ స్వయముగా జీవరూపమున ఉత్పన్నమాయెను. దీని వలన బ్రహ్మ తన హిత, అహితములు చేయు దోషముకలుగును. ఇది ఉచితముకాదు. సమర్దుడైయుండియు ఎవరు దుఃఖము లనుభవింతురు. అందురు హితమునే కోరుదురు. సర్‌వ్ఞ, సర్వశక్తివంత భగవానుడు తన అహితముచేయుచు జన్మమరణ చక్రమున తగులు నను దోషముండుటచే బ్రహ్మ జగత్కారణమనుట ఉచితముకాదు. ఈశంకకు సమాధానముగా బృ.ఉ. 4-3-(4-7), 21 ప్రకారము సూర్యాదులవలె ఆత్మజ్యోతి విజ్ఞాన మయ జీవుడే ఆత్మ. మరియు సుషుప్తి కాలమునే జీవి అంతర్బాహ్యజ్ఞాన శూన్యమై పరమాత్మతో సంయుక్తమై యుండును. మరణకాలమున పరమాత్మయందు అధిష్ఠితమై ఒక శరీరము నుండి వేరొక శరీరము నకు వెళ్లును. హృదయ కుహరమున బ్రహ్మ ఈవునితో గూడి పశించునేకాని, జీవరూపమునకాదు. జీవాత్మయను పక్షి కర్మఫలభోక్త. పరమాత్మయను పక్షి సాక్షీభూత ద్రష్ట మాత్రమే. మరియు పరమాత్మ జీవాత్మ, ప్రకృతులను శాఇసంచువాడు. 'తత్వమసి' ''అయమాత్మబ్రహ్మ'' యను మహావాక్యము లందు జీవాత్మ పరమాత్మ రూపమును పొందుటచే అనన్యత్వము ప్రతిపాదించబడినది. పరమాత్మకారణము, జడజగత్తుకార్యము. కావున జీవబ్రహ్మల అభేదము స్పష్టము. పరమాత్మ అపరా, పరాప్రకృతులకంటె భిన్నుడు. పరబ్రహ్మ అహిత హితములకంటె విలక్షణుడు. కావున ఆయనకు అహితదోషములేదు. అందరియొక్క హితము ఆయన వలననేయ కలుగును.

2-1-24, 25 :- అద్వితీయ నిరాకార బ్రహ్మ సాధన సామగ్రి లేకయే జగత్‌ సృష్టి ఎట్లు చేసెను? సమాధానము - పాలు పెరుగగుటయందు స్వాభావిక శక్తి కలదు. సాలెపురుగు గూడు అల్లుటకు కూడ ఎట్టి సాధన సామగ్రి అవసరములేదు. అట్లే పరమాత్మ అన్యసాధనముల అవసరము లేకయే సంకల్పమాత్రమున సృష్టిరచించెను. పరమాత్మయొక్క జ్ఞాన, బల, క్రియా రూప స్వాభావిక పరాశక్తి అనేక విధములు. (శ్వే.ఉ. 6-8) పరమాత్మ సంకల్పమాత్రమున సృష్టిచేసెనన్ని ఆలోచించి పనిచేయు వారికి సాధన సామగ్రియొక్క అవసరముండునుగాన సాధనా శూన్యపరమాత్మ జగత్‌ సృష్టి ఎట్లు చేసెను. అను శంకకు సమాధానముగా - దేవతలు, యోగులు ఎట్టి సాధనములు ఏలక అద్భుత శక్తి ద్వారా వివిధవస్తు, శరీర రచన చేయుదురు. సాలెపురుగు ఎట్టి సాధనలేక గూడుఅల్లగా పరమాత్మ సాధనారహితముగా సృష్టికి అభిన్న నిమిత్తోపదానకారణము.

2-1-(26-28):- బ్రహ్మ అవయవరహితుడగుటచే సంపూర్ణ రూపమున జగదాకారమున ఎట్లు పరిణతిచెందెను. మరియు జగత్తు కంటె భిన్నము గా బ్రహ్మనామకవస్తు వేదియులేదు. బ్రహ్మ నిరవయవుడన్న ఆయన గురించి శ్రవణ, మనన, నిధిధ్యాసాది ఉపదేశములు వ్యర్ధము. సావయవుడన్నచో అవయవరహిత అన్ముడను శృతి వాక్యవిరోధముకలుగును. సావయవుడు సనాతనుడు కాజాలడు. కావున బ్రహ్మ జగత్కారణమనుట యుక్కతి సంగతముకాదు, అనుశంకకు సమాధానముగా - శృతి ప్రమాణములో బ్రహ్మ జగత్కారణ మైనను నిర్వికార రూపమున నిత్యస్థితుడు. అవయవరహిత నిష్క్రియుడైనను జగత్తుయొక్క అభిన్ననిమిత్తోత్పాదన కారణము. ఆయన మనస్సు, ఇంద్రియముల కతీతుడు. తర్కయుక్తులచే తెలియలేదు. ఆయన పూర్ణముగా జగదాకారమున పరిణతిచెందడు. సమస్త బ్రహ్మాండములు ఆయన యొక్క ఒక పాదము, మిగిలిన మూడు పాదములు పరమధామమున విలసిల్లును.

మరియు స్వప్నావస్ధలో అవయవరహితనిర్వికార జీవాత్మ నానా ప్రకార విచిత్ర సృష్టి చేయును. మరియు విశ్వామిత్ర, చ్యలీన భరద్వా, వశిష్ఠాదిమునులు, సురభిధేనువు అద్భుత సృష్టి రచనాశక్తికి ఉదాహరణలు. అట్టిచో సర్వశక్తివంతుడగు పరమాత్మ తన అచింత్యశక్తిచే విచిత్ర సృష్టి చేయుటలో వొంతేమియున్నది.

2-1-(29, 30):- మరియు సాంఖ్యమతాను సారము ప్రకృతి జగత్కారణ మన్న అవయవరహిత ప్రధాన ప్రకృతి నుండి అవయవ సహితసృష్టి ఎట్లు? పైన వివరింపబడిన దోషములన్నియు సాంఖ్యవాదమున కూడా నుండుటచే పరబ్రహ్మయే జగత్తు యొక్క అభిన్న నిమిత్తోత్పాదన కారణమనుట ఉచితము. పరబ్రహ్మ సత్యసంకల్ప, ఆకాశస్వరూప, సర్వకర్మ, సర్వకామ, పరమాత్మనుండి విరాట్‌రూపనామరూప అన్నాదులు ఉత్పన్నమాయెను. పరమాత్మ అవయవరహితుడనుట ఆయన అఖండ స్వరూప బోధకము. అనేక విచిత్ర శక్తులు కల పరమాత్మయే జగదుత్పత్తికి నిమిత్తోత్పాదనకారణము.

2-1-(31-33):- పరబ్రహ్మ శరీరము, బుద్ధి, మనస్సు, ఇంద్రియాని కరణరహితుడైనను. సర్వశక్తి సంపన్నుడగుటచే బ్రహ్మయే జగత్కారణము. పరమాత్మ పూర్ణ కాముడగుటచే జగత్‌సృష్టి ప్రయోజనమేమి? అందరి హితము చేయువాడగుటచే దుఃఖమయ సంసారమున ఈవులకు సుఖముకలుగదు. అట్టిచో పరమాత్మ జగద్రచన చేయుటలో శంకకలుగగా సమాధానము - ఆప్తకాములు, వీతరాగులు అయిన మహాపురుషులు ఎట్టి ప్రయోజనములేకయే జగత్తునకు హితము చేయుదురు. వారి కర్మలు ఫలము నిచ్చుటయందు సమర్ధములుగాక కేవలము లీలా మాత్రము. అటులనే పరమాత్మ యొక్క జగద్రచన, మనుష్యాది అవతారములు దాల్చుట మొదలగు లోకపావన చరిత్రలు కర్తృత్వబుద్ధిలేక ఆసక్తిరహితముగా లోక కళ్యాణార్ధము కర్మల నాచరించుట లీలా విశేషము.

2-1-(34, 35):- పరమాత్మ కొందరికి సుఖము, కొందరికి దుఃఖము నిచ్చుటచే పక్షపాతము,రాగద్వేషములు, నిర్దయత్వము కనిపించును అని శంకకు సమాధానముగా - పరమాత్మ జీవుల కర్మానుసారము పాపపుణ్యముల నిష్పక్షన్యాయాధికారివలె నిర్ణయించి పుణ్యపాపయోనుల జన్మనిచ్చును. సృష్టి ప్రారంభమున విభిన్న జీవుల కర్మవిభాగములేదు. అట్టిచో కర్మపులానుసారము ఫలము నిచ్చుననుటలో విషయమతా, నిర్ణయతాదోషమున్నదను శంకకు, సృష్టికి పూర్వము అనగా పూర్వకల్పమున జీవుల కర్మ ఫలానుసారము మరు కల్పమున జన్మ లభించును. జీవులు వారి కర్మలు ప్రలయకాలమందు బ్రహ్మయందు అది భక్తముగా నుండి సృష్టితో వ్యక్తమగును.

2-1-(36, 37):- జీవులు వారి కర్మలు కూడ అనాదియే. జీవత్మనిత్య శాశ్వత, పురాతనము పురుషుడు (జీవ సముదాయము) ప్రకృతి (జీవుల కర్మసంస్కారములు). అనాదియే 9గీ. 13-19). జగత్కారణ పరమాత్మ సర్‌వ్ఞ, సర్వశక్తి వంతుడు. సగుణ, నిర్గుణ, వ్యక్త అవ్యక్త రూపముల సర్వధర్మాశ్రయుడు. పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి, అనాది, కావున సత్కర్మలద్వారా ధర్మముననుసరించి జీవాత్మ పరమాత్మతో లీనమగుటయే మోక్షము. అదియే జీవుని లక్ష్యసాధనము.

ద్వితీయ అధ్యాయము - ద్వితీయ పాదము

మొదటి పాదమున ప్రధానముగా తన పక్షమున వచ్చు సమస్త దోషముల ఖండనచేయుచు జగదుత్పత్తి నిమిత్తోత్పాదనకారణము పరమాత్మయేయని నిశ్చయింపబడెను. ఇప్పుడు ఇతరులచే ప్రతిపాదిత జగత్కారణమునందలి దోషములు చూపుచు వానిని ఖండించి తన సిద్ధాంతమునకు పుష్టి కలిగించుటకు రెండవపాదము ప్రారంభింపబడెను. మొట్ట మొదట సాంఖ్యప్రతిపాదిత ప్రధానము (ప్రకృతి) జగత్కారణమని అంగీకరించుట యుక్తి సంగతముకాదు.

2-2-(1-10):- సాంఖ్య ప్రతిపాదిత ప్రధానము (జడప్రకృతి) జగత్కారణమనుట యుక్తి సంగమతముకాదు. ఏలనన ప్రకృతి జగము ఎప్పుడు ఎట్టి వస్తువుయొక్క ఆవశ్యకత యుండునను విచారము జడ ప్రకృతి చేయలేదు. మరియు చేతనకర్త సహాయములేకుండ జడవస్తువు స్వయముగా ఏమి చేయుటకు సమర్ధముకాదు. గృహ, వస్త్ర, ఆయుధాది నిర్మాణమందు బుద్ధియుక్త కుశలపనివారి ఆవశ్యకతకలదు. పృధ్వి, ఆకాశ, సూర్య, చంద్ర, గ్రహ, నోత్ర, అద్భుతవస్తు సంపన్న మనుష్య, పశుపక్ష్యాది సుశోభిత, శరీర ఇంద్రియ, మనస్సు మొదలగు ఆధ్యాత్మిక తత్వ పూర్ణ నిర్మాణ కౌశీలము గొప్ప వైజ్ఞానికులు, శిల్పులు, మనమున కూడ తలంపలేరో అట్టి విచిత్ర, అద్భుత జగద్రచన పరమాత్మదక్క జడప్రకృతి వశమా? సామ్యావస్ధయందు సత్వరజస్తమోగుణోపేత ప్రకృతి చేతన శక్తి సహాయము లేక సృష్టికార్యము ప్రారంభించుటకు ప్రవృత్తి మగుట ఎన్నిటికి సంభవముకాదు. అచేతన లము నదీతటాకాది రూపమున ప్రజలకుపకరించుచుండ ప్రకృతి జగత్కారణము ఏలకారాదు? అనుశంకకు సమాదనాముగా రధాదుట అచేతన మగుటచే చేతన సహాయములేక సంచరింపజాలవు. అట్లే జలాదులు కూడ అవ్యక్త చేతనయొక్క ప్రేరణచే పనిచేయుచున్నది. జడ జలము పల్లమునకే ప్రవహించును కాని ఎత్తైన ప్రదేశమునకుకాదు. కాని చేతన పురుషుడు దానిని తన ప్రయత్నముచే ఇచ్చవచ్చిన దివకు మళ్లించగలడు. మరియు ప్రవృత్తి, నివృత్తి ధర్మములు జడప్రకృతి యందుకానరావు. స్వభావములేనిదే ఉత్పత్తి యందు ప్రవృత్తులుకాలేరు.

మరియు గోవు ద్వారా తిన బడిన గడ్డి పాలకరూపమున పరిణతిచెందును.కాని ఎద్దు, గుర్రము విషయమున అట్లు జరుగదు. కావున విశిష్ఠ చేతనశక్తి యొక్క సహయోగము చేతనే అట్లు రుగును. మరియు సాంఖ్యమతానుసారము ప్రధానము యొక్క ప్రవృత్తి, పురుషుని భోగ, ఉపవర్గము కొరకేకలదు. అన్నచో పురుషుడు అసంగ, చైతన్య మాత్ర, నిష్క్రియాదులచే ప్రకృతి దర్శన రూప భోగము, విముక్త రూప ఉపవర్గము అవసరము లేదు. కావున అట్టి ప్రయోజనము భావించుట వ్యర్ధము. జడచుంబకము ఇనుము నాకర్షించుట యందు వేరొక చేతన పురుషుని అవసరమున్నది. పురుషప్రకృతుల సంయోగము చేతనే సృష్టిరచన జరుగును. కావున జడప్రకృతి గద్రచనాకారణము కాదు. చేతన పురుషుని సహాయము అవసరము.

ప్రకృతిలక్షణములైన త్రిగుణములయందు హ్రాసవృద్ధి రూప విషమతలేనిచో సృష్టిక్రమము నిరంతరముసాగును ప్రళయము జరుగదు. కావున సృష్టిక్రమము, ప్రలయము జరుగు చుండుటచే ప్రధానము జగత్కారణముకాదు. జ్ఞానశక్తి లేని ప్రకృతి ద్వారా బుద్దికుశలతగల జగద్రచనాకార్యము జరుగదు. ఏలనన జడవస్తు నిర్మాణమందు చేతన కర్తయొక్క ఆవశ్యకతకలదు. విచిత్రవిశ్వసృష్టి సర్వశక్తి వంత సర్వజ్ఞ పరమాత్మయే చేయగలడు.

మరియు సాంఖ్య దర్శనమున పెక్కు పరస్పర విరుద్ధ విషయములుకలవు. పురుషుడు అసంగుడు, నిష్క్రియుడు అనుట మరల అతడు ప్రకృతి యొక్క ద్రష్ట, భోక్తయనుట, ప్రకృతితో ఆయన సంయోగము, ప్రకృతి పురుషుని కొరకు భోగము, మోక్షము ఇచ్చునదనుట, ప్రకృతి పురుషుల నిత్యసార్ధక్యజ్ఞానముచే దుఃఖములేని మోక్షము పొందుట మొదలగునవి నిర్దేషములని చెప్పుటకు వీలు పడదు. పరస్పర విరుద్ధ, దోషపూర్ణ గుణములచే సాంఖ్యదర్శనము యుక్తియుక్తముకాదు.

2-2-(11-17):- పరమాణు వాదులగు వైశేషికుల జగద్రచనాప్రక్రియలో ఒక ద్రవ్యము సజాతీయరెండవద్రవ్యమును, ఒక గుణముసజాతీయ రెండవ గుణమును ఉత్పన్నము చేయును. సమవాయి, అసమవాయు నిమిత్తమను మూడు కారణములచే కార్యము త్పన్నమగును. వస్త్రము యొక్క ఉత్పత్తిలో తంతువు సమువాయికరణము, తంతువుల పరస్పర సంయోగము అసమవాయికరణము మరి%్‌యు దారము పడుగు పేకలు వేసి బట్ట నేయుసాలెవాడు నిమిత్తకారణము. పరమాణువునకు నాలుగు భేదములు - పార్ధివ పరమాణు, జల పరమాణువు, తేజస పరమాణువు, వాయు వీయ పరమాణువు. ఈ పరమాణువులు నిత్య, నిరవయవ రూపాది గుణములు కలవి. వీని పరిమాణము వాని పారిమాండల్యము (Orbit of Atom) సృష్టి కార్యసిద్ధికి పరమాణువులు సమవాయుకరణముచెంది, పిదప ఒకదాని తోనొకటి సంయోగము చెందుట యను అసమవాయికరణము జరుగును. అదృష్టము లేక ఈశ్వరేచ్ఛ వీని నిమిత్తకారణము. భగవంతుని ఇచ్ఛచే మొదట కర్మ వాయువీయపరమాణువుల యందు ప్రకటమై, పిదప ఒక దానితో నొకటి సంయోగము చెందును. రెండు పరమాణువుల సంయోగముచే ఒక ద్యయణుకకార్యము, మూడుద్యయణకము లచే ఒక త్రియణుకము, నాలుగు ద్యయణుకములచే ఒకచతురణుకము ఉత్పన్నమగును. ఇట్లు వాయుతత్వము ప్రకటమై ఆకాశమున వేగముగా సంచరించును. ఇటులనే తేజస, జల, పృధ్వి, పరమాణుసంయోగ ప్రక్రియద్వారా జగ ద్రచన జరుగును. ప్రళయ కాలమున పరమాణువులు కార్యారంభము చేయక అటులనే యుండును. కారణము యొక్క గుణములచేతనే కార్యము యొక్క గుణములు ఉత్పన్నమగును. ఇట్లు భావించిన పరమాణు గుణము పారి మాండల్యము (అత్యంత సూక్ష్మత్వము) ద్వయణుకములో ప్రకటమగుట ఉచితము. కాని అట్లు రుగుటలేదు. హ్రస్య ద్యయణుకము నుండి మహత్‌ దీర్ఘ పరిమాణము గల త్రియణుకము ఉత్పన్నమగుచున్నది. వైశేషికుల ఈ విచారము అసంగతము.

పరమాణువాదుల ప్రకారము సృష్టికి పూర్వము పరమాణువులు నిశ్చలముగానుండి పిదప వానిలో కర్మ ఉత్పన్నమై పరమాణు సంయోగముచే జగడుత్పత్తి జరుగును. ప్రళయకాలమున నిశ్చలముగా నున్న పరమాణువులలో నిమిత్తకారణములేక కర్మ రుగుట అసంభవము. మరియు జీవుల అదృష్ట కర్మ సంస్కారములు పరమాణుకర్మ సంచారమున జరుగుట సంభవము. ఏలనన జీవుల అదృష్టము వారి యందే ఉండునుకాని పరమాణువుల యందుకాదు. కావున పరమాణువులలో కర్మ జరుగుట ఋజువుకాదు - మరియు అదృష్ము అచేతనము. అచేతన వస్తువుచేతన సహయోగము లేనిదే స్వయముగా కర్మ చేయలేదు. ఇతరులచే కర్మ చేయించలేదు. జీవాత్మయొక్క శుభాశుభకర్మలే అదృష్ట మగుననుటచే జీవాత్మ చేతన మనుట సరికాదు. సృష్టికి పూర్వము జీవాత్మ యొక్క చేతనము జాగ్రతముకాదు. అచేతనావస్ధయందుండును. నియతనిమిత్తము లేనిదే పరమాణువులయందుకర్మ ఉత్పన్నముకాదు. కర్మలేక క్రియా శీలత లేక పరస్పర సంయోగము జరుగదు. కావున పరమాణు సంయోగముచే జగత్‌ సృష్టి, ప్రళయములు జరుగవు. మరియు వేరు వేరు గానుండు రజ్జువు ఘటమునందు యుత సిద్ధ సంయోగ సంబంధము కలదు. వేరు వేరుగా లేని తంతు వస్త్రముల యందు అయుత సిద్ధతచే సమవాయ సంబంధము కలుగును. ద్వైయణుక సమవాయ సంబంధముద్వారా అసమవాయ సమవాయల మధ్య నూతన సమవాయాత్మక సంబంధమునందు అవస్ధాదోషముకలదు.

ప్రవృత్తి కర్మలచే సృష్టి, నివృత్తి కర్మలచే ప్రళయము జరుగుననుటలో ఇవి పరమాణువుల యొక్క స్వాభావికగుణములు కావు. నిమిత్త కారణములేనిదే ప్రవృత్తి, నివృత్తి కర్మలు జరుగవు. ఈ ప్రతిపాదిత నిమిత్తము సరికాదు. వైశేషికుల మతానుసారము పరమాణువునిత్యము, మరియు రూపరసాది గుణ యుక్తము. ఇట రూపాది గుణములు గల ఘటాదుల నాశనము జరుగుచుండ నిత్యత్వమెట్లు. కావున ఈ సిద్ధాంతము దోషయుతము.

పరమాణవుల యందు న్యూనాధిక గుణములు కలవన్న జలమునందు గంధము, తేజము నందు గంధరసములు కలవనుట దోషము, స్ధూల భూతములందు ఒక్కొక్క గుణమున్నదన్న తేజమున స్పర్శము, జలమున రూపస్పర్శలు, భూమి యందు రస, రూప, స్పర్శ గుణములు ఉండవు. ఈ రెండు వాదములు దోషయుతములే.

ప్రధానకారణ వాదమున సత్యకార్యవాద నిరూపణముండుటచే ఆ యంశమును మన్వాది శిష్ట పురుషులు గ్రహించిరి. కాని పరమాణుకారణ వాదమును శ్రేష్ఠ పురుషులెవ్వరు అంగీకరించలేదు.కావున ఉపేక్షణీయము.

2-2-(18-32):- బౌద్ధమతాను యాయులు, వైభాషిక, సౌతాంత్రిక, యోగాచార, మాధ్యమిక అనునాలుగు వర్గములు. వైభాషికులు సేతాంత్రికులు బాహ్యపదార్ధముల శక్తి (సత్తా)ను స్వీకరించెదరు. కాని వైభాషికులు ప్రత్యక్ష పదార్ధముల అస్ధిత్వమును, సౌతాంత్రికులు వైజ్ఞానిక అనుమతిచే బాహ్యపదార్ధములు సత్తాను స్వీకరించెదరు. యోగాచారులు నిరాలంబ విజ్ఞానముయొక్క సత్తాను, బాహ్య పదార్ధములు స్వప్నమందు చూడబడువస్తువులవలె మిధ్యయందురు. మాధ్యమికులు సర్వము శూన్యమందురు. వారిమతాను సారము దీపశిఖ ప్రతిక్షణము నశించుచున్నను ఒకధారవలె కనపడుచున్నకారణమున విజ్ఞాన ధారమాత్రము గాకనబడును. ఈ విధముగా శూన్యతా ప్రాప్తియే అపవర్గములేక ముక్తి యనబడును. వైభాషిక, సౌతాంత్రికులమతాను సారము, శరీర ఇంద్రియాదులు రూపస్కంధము. వీనియందు రూప, రస, గంధ, స్పర్శాది నాలుగు స్వభావములు పృధ్వియందు, జలమునందు, రూపరసగంధములు, అగ్నియందు రూప స్పర్శగుణములు, వాయువునందు స్పర్శ గుణము మాత్రముండి కఠోరము నుండి తరళరూపము పొందును. ఈ నాలుగు విధములక్షణిక పరమాణువుల భూత భౌతిక సంఘాతముచే ఉత్పత్తి కారణమగుచున్నవి. విజ్ఞాన స్కంధములో 'నేను' కర్త, భోక్త, ఆత్మ తత్వముల ద్వారా లౌకికవ్యవహారములు జరుగును. సుఖదుఃఖాది అనుభూతులే వేదనాస్కంధము. ఉపలక్షణములచే ప్రతీతమగునది సంజ్ఞాస్కంధము. రాగద్వేష, కామ క్రోధాదులు సంస్కార స్కంధము. ఈ బాహ్యాభ్యంతర సముదాయము చేతనే సమస్తలోకవ్యవహారములు జరుగును. కావున నిత్య ఆత్మను అంగీకరించనవసరములేదు. ఈ సిద్దాంతమును ఖండించుచు - ఈ సముదాయముల అంతర్గత వస్తువులు అచేతనములు. ఒకదాని కంటె మరి యొకటి శూన్యము. క్షణవిధ్వంసి పరమాణువులు పృధివ్యాది భూతసముదాయమున ఒకటి యను (కలయు) ప్రయత్నము ఎట్లు చేయగలవు. కావున వాని సంఘాత పూర్వక జగదుత్పత్తి కల్పన, యుక్తి సంగతముకాదు. కావున వైభాషిక, సౌతాంత్రికులమతము అంగీకారముకాదు.

బౌద్ధ శాస్త్ర విజ్ఞాన సంతతికి హేతువులగు అవిద్య, సంస్కార, విజ్ఞాన, నామ, రూప, రామరణ, శోకదుఃఖాది క్షణికవస్తువుల యందు నిత్యత, స్థిరత భ్రమప్రదముగాన అవిద్యయనబడును. అవిద్యా రాగాది రూప సంస్కారముల ఉత్పత్తి కారణము. నామ, రూప, స్పర్శ, వేదన, మానసిక ఉద్విగ్నత మొదలగునవి ఘటీయంత్రమువలె చక్ర భ్రమణము చేయును. అవిద్యామొదలగునవి సంస్కారోత్పత్తి కారనములేకాని సంఘాత ఉత్పత్తి కారణములుకావు. కావున వాని సిద్ధి అసంభవము. ఘటాదులు యందు కారణరూపమగుమట్టి కార్యము నందు కూడ ఉండును. బౌద్ధము తానుసారము సమస్త పదార్ధములు. ప్రత్యేక క్షణమందు నాశనము పొదునన కార్యోత్పత్తి తో బాటు కారణ వినాశము జరుగునుగాన అవిద్యా మొదలగునవి సంస్కారాది ఉత్తరోత్తర భావములకు కారనముకాజాలవు. బౌద్ధ మతానుసారము అధిపతి, ప్రత్యయము, సహకార ప్రత్యయము, సమంతర ప్రత్యయము, ఆలంబన ప్రత్యయము, (ఇంద్రియ, ప్రకాశ, మనోయోగ విషయ ప్రత్యయములు). అనునాలుగు కారణములు విజ్ఞానోత్పత్తికారణ ములుగా ఎంచబడెను. కారణములేనిదే కార్మోత్పత్తి వారి వాదమునకు బంగముకలిగించును. అటుకానిచో కారణ కార్యముల సత్తా ఏకకాలమున అంగీకరించవలెను. ఎటులైనను ఈ సిద్ధాంతము సమీచీనముకాదు. ప్రతిక్షణము వినాశము గల అసత్‌ కారణమునుండి 'సత్‌' కార్యోత్పత్తి నంగీకరించుటచే నష్టపదార్ధములనుండి మరియొక పదార్ధము ఉత్పన్నమగుట యనుక్రమము నిరంతరము జరుగుచుండుటచే బుద్ధి పూర్వక ప్రతిసంఖ్యనిరోధము. అబుద్ధి పూర్వక అప్రతి సంఖ్య నిరోధమను రెండును (నాశము) ఋజువుకాదు. భ్రాంతి రూక అవిద్యచే ప్రకటితమగు జగత్తు జ్ఞానముచే అవిద్యా నాశముతో బాటు నాశమొదునన జ్ఞానము. దానియొక్క సాధనల ఉపదేశము వ్యర్దమగును. కావున ప్రతిసంఖ్య, అప్రతి సంఖ్య నిరోధము (నాశము) యుక్తి సంగతముకాదు. పృథివ్యాది భావ పదార్ధములవలె ఆకాశము కూడ భావరూపము. అభావరూపముకాదు. ఆకాశము శబ్దమునకు ఆశ్రయము. అటులనే మిగలిన నాలుగు భూతములకు ఆధారము. పక్షులు ఆకాశమున చరించుటచే విహంగ మనబడెను. పరమాత్మ నుండి ఆకాశోత్పత్తి స్పష్టము, ఆత్మనిత్య వస్తువుకాదు. క్షనికమగు బౌద్ధ సిద్ధాంతమును ఖండించుచు ఆత్మ క్షణికమైన మనకు పూర్వ స్మృతులెట్లు కలుగును. కావున ఆత్మ నిత్యము, క్షణికముకాదు. బీము నష్టమై అంకురించును. పాలునష్టమొంది పనెరుగుయగును. అభావము నుండి భావము ఉత్పన్నమగునను బౌద్ధ సిద్ధాంతము అసంగతము. ఏలనన అదిరూపాంతరము చెందినదేకాని నశించలేదు. జగత్కారణము సర్వదా సత్యమే. కార్మోత్పత్తిలో నిత్య చేతన కర్తయొక్క ఆవశ్యకత లేదు, క్షణిక పదార్థ సముదాయముచే తనంతానే కార్యోత్పత్తి జరుగునను బౌద్ధవాదము సరియైనదికాదు. ఏలననగా ఉదాసీనముగా కూర్చున్నవ్యక్తి యొక్క కార్యములు పదార్ధగత శక్తిచే సిద్ధించుటలేదు.

విజ్ఞాన వాది బౌద్ధులు యోగా చార్యుల ప్రకారము బాహ్యపదార్ధములు స్వప్నవతు బుద్ధి యొక్క కల్పన అను సిద్ధాంతము ఖండించుచు బాహ్య పదార్ధములు కార్యకారణ రూపముల సత్యములే, ప్రత్యక్షముగాదారకుని స్వప్నాదులలో కనిపించు వస్తువులు ఒకరికి ఒక విధముగా మరియొకరికి మరియొక విదముగా కనిపించును. ఇంద్రజాలికుడు సృష్టించినవస్తువులు కొద్ది సేపటిలో మాయమగును. కావున స్వప్నాది భ్రాంతిలో ఉన్నపదార్ధములకు సత్పదార్ధములకు చాలా అంతరముకలదు. మొదట దొరికిన వస్తువులు సంస్కార బుద్ధిచే వాసనారూపమున స్ఫురించును. వస్తువు లేనిదే వాసనాను భవము అసంగతము. వాసనల ఆధారభూతమగు బుద్ధి క్షణికమను, బౌద్ధవాదము భ్రాంతి పూర్ణము. బౌద్ధుల ప్రతి వాదము యుక్తి సంగతము కానందున అస్వీకారము. అటులనే మాధ్యమిక బౌద్ధుల సర్వశూన్యవాదము కూడ పైయుక్తులచే ఖండింపబడెను. ఇట్లు బౌద్ధ మత నిరాకరణము జరిగినది.

2-2-(33-36):- జైనులు, జీవ, అజీవ, అశ్రవ, ఐంవర, బంధ, మోక్ష అను సప్తపదార్ధములు, జీవాస్తిక్య, పుద్గలాస్తిక్య, ధర్మాస్తిక్య, అధర్మాస్తిక్య, ఆకాశాస్తిక్య, అను ఐదు ఆస్తిక్యములు నంగీకరించుచు, సప్త భంగీన్యాయము ప్రకారము (1) పదార్ధము యొక్క అస్తిత్వము. (2) పదార్ధము ఉండును (3) పదార్ధము ఉండవచ్చును లేకపోవచ్చును (4) వస్తు స్వరూపము వర్ణనయోగ్యముకాదు (5) పదార్ధముండి వర్ణన యోగ్యము కాకపోవచ్చును (6) వస్తు అస్తిత్వములేక వర్ణనయోగ్యము కాకపోవచ్చును (7) వస్తు అస్తిత్వము ఉండనువచ్చును. లేక పోనువచ్చును, వర్ణయోగ్యముకాదు. దీనిని ఖండించుచు, సూత్రకారుడు :- ఉన్నవస్తువుయొక్క అభావము, లేనివస్తువుయొక్క ఉనికి విరుద్ధము. నిత్యపదార్ధము నిత్యము, అనిత్యముకారాదు, అటులనే అనిత్య పదార్థములు అనిత్యము, నిత్యముకాఆలదు. కావున జైనుల ప్రతి వస్తువు విరుద్ధ ధర్మములు కలిగి యుండుటచే యుక్తి సంగతముకాదు.

ఆత్మ శరీరపరిమాణము కలిగి యుండుననుట అసంగతము. చీమలోనున్న ఆత్మ చిన్నిగాను, ఏనుగలో శరీరము పొందినపుడు పెద్దదిగా ఎట్లగును. మాన శరీరము బాల్యమున చిన్నదిగా ఉండుటచే చిన్న ఆత్మ పెద్దయిన పిదప శరీరముతో బాటు ఆత్మ పెరుగుట లేదుకదా. కావున ఆత్మ శరీర పరిమాణము కలిగి యుండుననుట అసంగతము - ఆత్మ శరీర పరిమాణము నను సరించి చిన్నది పెద్ది యగునన్న దాని యందు అనిత్య దోషము సంభవించును. అవయవయుక్త పదార్ధములే చిన్నపెద్ద అగును. ఆత్మ సావయవముకాదు.నిర్వికారము. కావున జైనుల సిద్ధాంతము యుక్తి సంగతముకాదు. మోక్షావస్ధలో జీవుని (ఆత్మ) యొక్క పరిమాణము. నిత్య స్ధితి యందుడునన్న వాదనను ఖండించుచు - నిత్యమైన వస్తువు ఎల్లపుడు ఒకేలాగుండును. ఆద్యంతము నిత్యస్ధితి యందుండు ఆత్మ మధ్య మధ్య వచ్చు జన్మల యందు జీవుని శరీర పరిమాణము ననుసరించి చిన్న పెద్ద యగుననుట అసంగతము. కావున జైనుల ఈ సిద్ధాంతము అనంగీకారము.

2-2-(37-41):- పాశుపత సిద్ధాంతరీత్యా కంఠి. డచిక, కుండలము, జటా, భస్మము ¸్ఞూపవీతము. ఈ ఆరుముద్రలతో శరీరమును ముద్రించువారు మోక్షమును పొందెదరు. చేతులకు రుద్రాక్షలు, తలపైన జటలు, కసాలము, శరీరమున భస్మమలదుటచే ముక్తిలభించును. మహేశ్వరుడు నిమిత్తకారణము. ప్రధాన (ప్రకృతి) ఉపాదాసకారణమని భావింతురు. ఈ సిద్ధాంతము యుక్తి సంగతముకాదు. ఈశ్వరుడు నిమిత్త కారణమైన ఉపాదానకారణము ప్రకృతితో ఏమి సంబంధము. నిమిత్త కారణ మగు కుమ్మరి ఉపాదానకారణమగు మట్టి మొదటగు వానితో సైంయోగ సంబంధముండును. ఈశ్వరుడు నిరాకారుడగుటచే ప్రధానముతో సంయోగ సంబంధమెట్లుండును. వేదముల నంగీకరించు వారు పరమాత్మ సర్వశక్తి వంతుడగుటచే తానే స్వయముగా నిమిత్త ఉపాదానకారణమగును. తర్కముపై నాధారపడుసిద్ధాంతము తర్క సంగతము గానుండువలెను. పాశుపత సిద్ధాంతము వేదములచే గాని, తర్కముచేగాని నిరూపింపబడ కుండుటచే అంగీకరాయోగ్యముకాదు. కుమ్మరి మృత్తికాది సాధనముల అధిష్టాతయై సృష్టి కార్యము చేయునను వాదము ఉ ఖండించుచు - రూపాది రహిత ప్రధానము నిరాకార ఈశ్వరుని అధిష్టేయము ఎట్లు కాగలదు. ఈశ్వరుడు కేవలము నిమిత్త కారణమను పాశుపత వాదము యుక్త సంగతముకాదు. ఈశ్వరుడు సంకల్పమాత్రముచే మనో బుద్ధ్యాదులతో కూడిన శరీరధారియై నిమిత్త కారణుడను వాదుమ. అసంగతము. ఏలనన శరీరధారియైనచో కర్మానుసార ఫలమనుభవించుట జరుగవలెను. అటులైన ఈశ్వరుని ఈశ్వరత్వము నిరూపింబడదు. ఈశ్వరుడు అనంతడు, సర్వజ్ఞుడైన ప్రకృతి ఈవులు కూడ అనంతమని భావించవలెను. అటులైన ఈశ్వరుడు జీవులెన్ని, ఎటులున్నవి, ప్రకృతి స్వరూపమేమి, నేనుఎవరు? ఎటులున్నాను. అను విషయములు తెలిసి యుండవలెను. ఈశ్వరుని కన్నియు తెలియునన్ని తెలియ బడువస్తువులు అనంతమనుట సరికాదు. ఈశ్వరునికి తెలియదన్న ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాదు. కావున ఈ సిద్ధాంతము వేదవిరుద్దము. దోషయుక్తము, అమాన్యము.

2-2-(42-45):- పాంచరాత్ర్యాగమము ప్రకారము. జగత్కారణుడగు పరమాత్మ వాసుదేవుడు నిమిత్త ఉపాదానకారణములనుట వైదిక మాతానుకూలము. కాని వాసుదేవుని నుండి సంకర్షణుడను జీవుని ఉత్పత్తి వేదవిరుద్ధము. జీవునికి జన్మ మరణములులేవు. ఉత్పన్నమగు వస్తువు నిత్యముకాదు. జీవుని ఉత్పత్తి, అనిత్యత్వము అంగీకరించిన బద్ధముక్తావస్ధ, జన్మమరణ రహితపరమపదము పొందు సాధనములు వ్యర్ధమగును. కావున ఈవుని ఉత్పత్తి అంగీకరించుట ఉచితముకాదు. అటులనే సంకర్షణ నామక జీవాత్మ నుండి ప్రదుమ్ననామక మనస్తత్వము దాని ఉండి అనిరుద్ధ నామక అహంకారతత్వము, ఉత్పన్నమగుట సంభవముకాదు. ఏలనన జీవాత్మ కర్త, చేతనము, మనస్సు కరణము, కర్త నుండి కరణము ఉత్పన్నముకాదు.

సంకర్షణుడు భగవంతుని ప్రాణము, ప్రద్యుమ్నుడు మనస్సు, అని రుద్ధుడు అహంకారము, ఈమూడు తత్వములు పరమేశ్వరుడగు వాసుదేవుని కంటె భిన్నముకాదు. కావున వేద విరుద్ధముకాదు. శాండిల్యముని అంగసహితవేదనిష్ఠుడు. గాకనే భక్తి శాస్త్రాధ్యయనము చేసెను. అయినను ఇది వే విరుద్ధముకాదు. నారదులకూడ భక్తి మహిమను ప్రకటించుచు వేదముల ప్రమాణము నంగీకరించిరి. కావున పాంచరాత్రము వేదాను కూలము.

ద్వితీయ అధ్యాయము - తృతీయపాదము

శాస్త్రములలో చెప్పబడిన బ్రహ్మలక్షణములకు స్మృతి న్యాయముల యందు కనపడు విరోధమునకు నిర్ణయపూర్వక సమాదానము ప్రధమపాదమందు చేయబడెను. ద్వితీయ పాదమున అనీశ్వరవాది నాస్తిక సిద్ధాంతములు, మరియు ఈశ్వరు నంగీకరించుచు ఆయనను ఉపాదానకరాణముగా నంగీకరించనివారి సిద్ధాంతములను యుక్తి పూర్వకముగా నిరాకరించబడెను. మరియు భాగవతమతమున గ్రంధ సిద్ధాంతములకు కనపడు విరోధమునకు సమాదానముతో రెండవ పాదము పూర్తియైనది.

తృతీయ పాదమందు పరబ్రహ్మ పరమాత్మ జగత్తును అభిన్ననిమిత్తోత్పాదనకారణ మనుటలో శృతి వాక్యములందు కన్పట్టు విరోధములకు సమాదానము చేయుచు జీవాత్మ స్వరూప నిర్ణయము చేయబడినది.

2-3-(1-9):- ఛాందోగ్యోపనిషత్తులో లము, అన్నముల ఉత్పత్తి క్రమము చెప్పబడెను. వ్యాపకమగు ఆకాశము గురించి చెప్పలేదు. ఆకాశమునిత్యము. అది ఉత్పన్నముకాలేదు అను శంకకు సమాదాన ముగా - బ్రహ్మ సత్యము, అనంతుడు, జ్ఞాన స్వరూపుడు. బ్రహ్మ ఉండి ఆకాశముత్పన్నమగుట చెప్పబడెను. తైత్తరీయోపనిషత్తు లోని ఆకాశోత్పత్తి గౌణముగా అన్యాభిప్రాయముతో చెప్పబడినదిగా భావవించవలెను. బృహ దారణ్యకములో వాయువు, అంతరిక్షము అమృతమని చెప్పుటచే వాని ఉత్పత్తి రుగదు. ఆత్మకూడ అనంతమే. ప్రకరణాంతరములో ఒకే శబ్దము ముఖ్యగౌణ రూపముల ప్రయోగము జరుగును. సృష్టి, స్థితి, లయకారకుడగు పరమాత్మయే సర్వస్వము అను వాక్యమును బట్టి ఆకాశము బ్రహ్మ యొక్క కార్యమే. తేఆదుల బ్రహ్మచే సృజించబడెననగా ఆకాశము, వాయుతత్వములు కూడ బ్రహ్మ సృష్టియే. వీటిని అమృతమనుటలో దేవతలవలె చిరస్ధాయి యని తెలుపుటకే. జడచేతనాత్మక జగత్తంతయు బ్రహ్మ సృష్టియే. బుద్ధి, అహంకారము, కాలము, గుణము, పరమాణువాదులు ఉత్పన్నమైనవే.

2-3-(10-15):- ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి తేజస్సు, తేజస్సు నుండి లము, లము నుండి పృధ్వి, పృధ్వినుండి ఓషధుల ద్వారా అన్నము ఉత్పన్నమగును. జలము అధికముగా నున్నచోట అన్నము అధికముగా పండును. జడతత్వములు ఉత్పత్తికారణముకావు. చేతన పరమాత్మయే ఈ తత్వములు క్రమశీ: ఉత్పత్తి చేసెను. జగదుత్పత్తి క్రమమునకు విపరీతముగా ప్రళయము సంభవించును. ప్రళయ కాలమందు పృధివ్యాదితత్వములు తమతమ కారణములలో లయమగును. శృతులలో ప్రాణము, మనస్సు, ఇంద్రియములు, ఉత్పత్తి పంచ భూతములకు ముందు రిగెనా? తరువాతనా? అను సందేహమును తావులేదు. భిన్నభిన్న కల్పములలో భిన్నభిన్న క్రమముండును.

2-3-(16-41):- జీవాత్మ శుద్ధ పరమాత్మయొక్క అంవ. జన్మమరణ రహిత, విజ్ఞాన స్వరూప, నిత్య, అవినాశి అయినను పరంపరాగత తన కర్మల ననుసరించి దేవ, మనుష్య, పశుపక్ష్యాది యోనులందు జన్మించును. వానితో తద్రూపమగును. కల్పాదిన జడ చేతనాత్మక గత్తు ప్రకటితమై ప్రళయకాలమందు పరమాత్మలో విలీనమగును. ఇవిగాక క్రొత్త జీవులను పరమాత్మ ఉత్పన్నము చేయుటలేదు (గీ. 9-1-10) స్ధూల సూక్ష్మ కారణ శరీరములనాశ్రయించిన జీవాత్మ కర్మాను సారముగా మంచి, చెడు యోనులనుపొందును. ఇందు జీవుల ఉత్పత్తి గౌణము గాక ముఖ్యమనను కొందమన్న శృతులనునుసరించి జీవాత్మ, అజన్మ, నిత్యము, పురాతనము, మరణము శరీరముననేగాని జీవాత్మకు కాదు. జన్మమరణరహితమైనది జీవాత్మ. కావున జీవాత్మ స్వరూపత: ఉత్ప్నముకాదు. సిద్ధయోగులు జన్మాంతరవిషయములు తెలుసుకొందురు. జీవాత్మ నూతన శరీరమును పొందినను పూర్వ స్మృత్యానుసారము స్తనపానాదుల ప్రవృత్తమగును. కావున జీవాత్మ జ్ఞాన, నిత్యము, శృతుల యందు జీవాత్మ ప్రస్తుత శరీరము విడచి పరలోకమును (స్వర్గ, నరక) పొంది తిరిగి మర్త్యలోకమున శరీరధారణ చేయును. శరీరనాశముతో జీవాత్మనాశము పొందుదు. అపరి వర్తన శీలముకలది. శరీరమును వదలిన జీవాత్మ పరలోకమునకు వెళ్లి తిరిగి ఈలోకమున జన్మిం జన్మించును. జీవాత్మగమనాగమన శీలియగుటచే నిత్యముకాదు అను శంకకు సమాధానముగా - ప్రాణులో నుండు విజ్ఞాన మయ ఆత్మ మహాన్‌, అజన్మ, ఆత్మయన్న ఈవాత్మ అణువుకాదు. మహానవ్యాపక మను చోట ఆత్మ జీవాత్మ పరముగాగాక పరమాత్మ పరముగా చెప్పబడెను. అణు పరిమాణాత్మక ఆత్మ చిత్తముచే తెలియదగినను శృతి వాక్యమునను సరించి శ్వేతాశ్వతరోపనిష్తుతలో జీవాత్మ సూక్ష్మాతి సూక్ష్మ అణువనుటచే సూక్ష్మ దేహులందుకూడ ప్రవేశించకలదు. కావున జీవాత్మ అణువు ప్రమాణము కలది. ఈవాత్మ శరీరములో ఒకే ఒక్క భాగములో నుండునన్న సమస్త శరీరములో జరుగు. సుఖదుఃఖాదులనెట్ల నుభవించును? సమాధానము - శరీరమందు హృదయసీమలోనుండు జీవాత్మ విజ్ఞానరూప గుణములచే సమస్త శరీర భాగముల యందు ఉత్పన్నమగు సుఖదుఃఖముల తెలిసికొనును. ఇంటిలో ఒక చోట నున్న చందనము ఇల్లంతా సుగంధము వెదజల్లును. అటులనే దీపము ఒక చోట నున్ను ఇల్లంతా వెలుతురు నింపును. అటులనే జీవాత్మ హృదయ మందున్నను శరీరాంతర్గత సుఖదుఃఖముల తెలుసుకొనుచు శరీరమునంతను చేతనా యుక్తము చేయును. పుష్ప సుగంధము పుష్పము నుండి దూర మునకు కూడ వ్యాపించును. అటులనే ఆత్మ నుండి దూరముగా శరీరమంతా చేతనశక్తి వ్యాపించును. శృతుల యందుకూడ ఇది నిరూపించబడెను.

ఆత్మ అణువుకాదు. నిత్యము, సర్వవ్యాపి, స్ధిరము, అచలము సనాతనము. జీవాత్మ అణువు అంగుష్ఠ మాత్రమను శంకకు సమాధానముగా - జీవాత్మ అంగుష్ఠమాత్రము, అణువు, ఏకదేశయము అనునట్లే పరమాత్మ కూడ అంగుష్ఠ మాత్రుడై జీవహృదయముననుండు ననుటచే ఈ వర్ణన బుద్ధి, శరీర గుణములనుసరించి జరిగినది. ప్రళయకాలములో బుద్ధ్యాదులకు జీవాత్మతో సంబంధముండదన్నచో జీవులన్నియు ముక్తులగును. మరల సృష్టి జరుగుట, ముక్తినొందినవి. జరుగుటకు వీలుకాదు. దీనికి సమాదానముగా - శరీరమువదలి వేరొక శరీరము పొందినపుడు సుషుప్తి, స్వప్నకాలమందు, పన్రలయ కాలమందు జీవత్మకు కారణ శరీరము తో సంబంధముండును. ప్రళయ కాలమందు బుద్ధ్యాదులు, జీవాత్మ బీజరూపమున పరమాత్‌ యందు లీనమై, సృష్ట్యాదియందు ప్రకటి తమగును. జీవాత్మ మొదటి నుండియు సర్వత్ర వ్యాప్తమైనను అంతఃకరణ స్ధూల శరీర సంబంధముచే తదనురూప ఆకారము పొందును. కారణ శరీరముతో సంబంధముండుటచే జీవాత్మ సమస్త కర్మలకు కర్తగా భావింపబడును. కాని స్వరూపతః కర్తకాదు. స్వప్నాదుల యందుచేయు కర్మలకు జీవాత్మకర్త. స్వప్నావస్ధలో జీవాత్మప్రాణ శబ్ద వాచ్య ఇంద్రియాదులగూడి ఇచ్ఛాను సారము సంచరించును. కావున ఇంద్రియములతో గూడిన జీవాత్మకర్త. శృతులలో కూడ జీవాత్మ యజ్ఞముల విస్తారము చేయునని చెప్పబడెను. జీవాత్మ స్వతంత్రమైన హితకరకార్యములనే చేయవలెను. అనిష్టకార్యముల నేల చేయవలెను? సమాధానముగా - ప్రారబ్ధాను సారముగా కర్మఫల మును భవించు రీతిని, పూర్వ సంచిత కర్మల ననుసరించియే నూతన కర్మలు జరుగును. హితకరకర్మలు చేయ వలెనను నియమములేదు. ఈశ్వర కృపచే ఉద్ధరింపబడిన స్వభావముచే హితకరకర్మలే చేయును. అహితకర్మలు చేయు ప్రవృత్తి నశించును. అంతఃకరణ, ఇంద్రియములు, శరీరకశక్తులు విపర్యయమగుటచే వివేకమును ఆదరించక జీవాత్మ తన హితకర కర్మలు చేయుటలో సర్వదాస్వతంత్రము కాదు. వాస్తవముగా జీవాత్మ స్వరూపతః నిష్క్రియము. కావున కర్తృత్వము అంతఃకరణ సంబంధితము,కాని స్వరూపతఃకాదు. వడ్రంగి ఉపకర ణములతో వస్తువులు చేయును. ఉపకరణముల ప్రక్కనుంచిన నిష్క్రియుడగును. అటులనే జీవాత్మ అంతఃకరణాదుల అధిష్టాతయగుటచే వాని ద్వార కర్మలు చేయును. లేనిచో నిష్క్రియుడే. గీతాదులయందు ప్రవచించిన విధముగా కూడ అంతఃకరణ సంస్కార సంబంధముచేతనే జీవత్మ యందు కర్తృత్వ ముండునుగాని శుద్ధ ఆత్మలో కర్తృత్వము లేదు. శృతులయందలి వర్ణనల ననుసరించి జీవాత్మ స్వతంత్రముగా ఏమియుచేయలేదు. పరమాత్మయొక్క సహకార సహయోగముచే పరమాత్మచే నొసగ బడిన శక్తి ద్వారానే జీవాత్మ కర్మలుచేయును. జీవునియొక్క కర్తృత్వము ఈశ్వరాధీనము. తనను కర్తగా ఎంఉచట పతన కారణము. పరమాత్మ జీవునికి సమస్త శుభకర్మలు చేయు సాధనములు, వివేకమునొసగెను. కాని కర్మలు చేయుట యందు జీవుడు స్వతంత్రుడు. వివేకము కోల్పోయి చేసిన దుష్కర్మల ఫలమనుభవించవలెను. కావున సర్వశక్తి ప్రదాత పరమాత్మనే శరణు జొచ్చిన పరమ శాంతిని పొంది పరమ పదమునొందును.

2-3-(43-53):- శృత్యాదుల ననుసరించి జీవబ్రహ్మలు అంశ అంశీ భావము వ్యక్తమగును. త్రిగుణాత్మక మగు ప్రకృతి సర్వభూతము లకుయోని, పరమాత్మ చేతన రూపి బీజస్ధాపకుడు. జడచేతన సంయోగముచే సర్వభూతముల ఉత్పత్తి జరుగును. ప్రకృతి మాత, పరమాత్మ పిత, సమస్త జీవసముదాయము. పరమాత్మయొక్క ఏక పాదము (అంశ). మిగిలిన మూడు పాదములు అలౌకిక విజ్ఞానానంద బ్రహ్మ స్వరూపము. కావున జీవి బ్రహ్మయొక్క అంశమాత్రమే. భగవద్గీతయందలి ''మమైవాంశోజీవలోకే జీవభూత సనాతనః'' (గీ. 15/7). అనువాక్యమును బట్టి కూడ జీవిబ్రహ్మయొక్క అంశ, జీవాత్మ పరమాత్మయొక్క అంశ##యైనచో శుభాశుభకర్మలు, సుఖదుఃఖాది భోగముల ఈశ్వరునికి కూడ సంబంధముండు నాయను సందేహమునివారించుచు సూత్రకారుడు వివరించుచున్నారు - సర్వ లోకచక్షుస్వరూపుడగు (పరమాత్మ లోకమందలి సుఖదుఃఖములకు బాధ్యుడుకాడు) సూర్యడు చక్షుదోషములకు బాధ్యుడుకానట్లే ప్రాణుల అంతరాత్మ స్వరూపుడగు పరమాత్మ లోకమందలి సుఖదుఃఖములకు బాధ్యుడు కాడు. భగవద్గీతయందలి ''అనాదిత్వాత్‌ నిర్గుణత్వాత్‌'' (గీ. 13-31) అనుసరించి తామరాకు నీటి చేలిప్తముకానట్లే ఈవియొక్క సుఖదుఃఖములతో పరమాత్మ లిప్తుడుకాడు. కర్మ ఫలమనుభవించునది జీవాత్మ. పరమాత్మద్రష్ట. జీవులన్నియు పరమాత్మ అంశ##లేయైన ఒక్కొక్కరికి ఒక్కొక్క విదముగా వేర్వేరు ఆదేశములిచ్చుటకు కారణమేమి? శ్మశాన అగ్ని త్యా%్‌యము యజ్ఞమందలి అగ్ని స్వీకార యోగ్యము. అట్లే శరీర సంబందానుసారము యధాయోగ్య భిన్నభిన్న వివిధ ప్రకారముల అదేశము ఉచితమే ఇట్టి విధి నిషేధములున్నను జీవాత్మ ''విభు'' అనుటచే దాని కర్మల వేర్వేరు విభాగ మెట్లు జరుగును? కారణ వరీరావరణచే జీవాత్మ లన్నియు 'విభు' అయినను ప్రళయకాలమున ఒకటికావు. వాని విభాగము అటులనే యుండును. మరల సృష్టి కాలమందు. పరస్పర వ్యాప్తిలేకుండుటచే వాని కర్మల మిశ్రణ కూడ జరుగదు. పరమేశ్వరుని వలెకాకవాని వ్యాపకత సీమితము. శబ్దము ఆకాశమున వ్యాపించినను ఒకదానితో నొకటి మిశ్రితమగుటలేదు. అందుచేతనే వివిద దేశములందు వివిధ భాషలలో వెలువడు శబ్దములను మనము రేడియో ద్వారా వినుచున్నాము. శబ్దము యొక్క విభుత్వము అమిశ్రణత్వము ఉన్నట్లే అంతకంటె సూక్ష్మమైన జీవాత్మయొక్క విభుత్వము, అమిశ్రణత్వము ఉండును. జీవాత్మ పరమాత్మకంటె భిన్నము సర్వస్వతంత్రము అనువారి యుక్తులు కేవలము ఆభానమాత్రము. పరమాత్మ అఖండ అవయవ రహితమైనచో జీవాత్మ అతని అంశకారాదు. అనుశంకకు సమాధానముగా - జీవాత్మ సర్వస్వతంత్రమైన వాని కర్మ ఫలభోగము నెవరు నిర్దేశించెదరు. కావున శృత్యానుసారము సర్వశక్తి వంతుడైన పరమాత్మ అందరియొక్క కర్మ ఫలములను యధాయోగ్యముగా వ్యవస్ధీకరించును. సమస్త జీవులు ఆయన నుండి ప్రకటితమగును. కావున తండ్రీ కుమారుల మాదిరి అంశీ అంశ సంబంధము యుక్తి సంగతము. కర్మ ఫల భోగమునందేకాక సంకల్పాదులయందు కూడ పైన తెలిపిన శంకకు ఆధారములేదు. పరమాత్మ ద్వారా సంకల్ప మాత్రమున సృష్టిజరిగినది. ఉపాధుల దేశ భేదముచే పరమాత్మ యందు దేశ##భేదముండదు. ఉపాధి ఒక దేశమునుండి మరియొక దేశమునకు వెళ్లినచో వానితో ఆకాశమువెళ్లదుకదా? కావున పరమేశ్వరుడు, జీవాత్మల యొక్క అంశాంశీభావము ఘవాకాశము వలె ఉపాధి నిమిత్తముకాదు.

రెండవ అధ్యాయము - నాలుగవ పాదము

ఈ పాదమునందు ఇంద్రియములు, ప్రాణముల ఉత్పత్తి, ప్రతిపాదితము. శృతి వాక్యములలోకనిపించు విరోధ భావ నిరాకరణ, సూత్రకారుని సిద్ధాంతము వివరింపబడెను.

2-4-(1-7):- ఆకాశాది పంచతత్వములు, ప్రాణము, మనస్సు, సమస్త ఇంద్రియములు సమస్తము పరబ్రహ్మనుండియే ఉత్పన్న మాయెను. వాక్‌ ఇంద్రియము తేజస్సు నుండి ఉద్భవించెను. కావున పంచభూతముల నుండి ఇంద్రియముల ఉత్పత్తి జరుగు చున్నదను వాదనను ఖండించుచు - ప్రాణముల ఉపకారి యగుటచే జలము గౌణరూపమున ప్రాణముల ఉత్పత్తి కారణ మనునటులే తేజాది తత్వములచే వాగాది ఇంద్రియముల ఉత్పత్తి గౌణము, ముండ కోపనిషత్తులో కూడ ఆకాశాది తత్వములచే ఇంద్రియములు ఉత్పన్న మాయెననుట గౌణము. త్రిగుణాత్మక జీవాత్మ సహితముగా నామ రూపాత్మక జగత్తును పరమాత్మ సృష్టించెను. కావున సమస్త ఇంద్రియములు బ్రహ్మ నుండియే ఉత్పన్నమాయెను. కొన్ని సమస్త ఇంద్రియములు బ్రహ్మనుండియే ఉత్పన్నమాయెను. కొన్ని శృతులలోమనస్సుతో గూడ ఏడు ఇంద్రియములు, కొన్ని చోట్ల పదకొండు ఇంద్రియములు ఉత్పత్తి చెప్పబడెను. అందు సత్యమేది? ముండకోపనిషత్తులో కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, వాక్కు, మనస్సు అను ఏడింద్రియములు, వర్ణింపబడినను, పాణి, పాద, ఉపస్ధ, గుదాది నాలుగు కర్మేద్రియములు చేరి మొత్తము. పదకొండు ఇంద్రియములు (గీ 13-5)లో చెప్పబడెను. పంచ భూతముల తన్మాత్రలు కూడ బ్రహ్మ సృష్టియే.

2-4-(8-13):- ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన అను పంచ ప్రాణములతో కూడిన ముఖ్యప్రాణము పరమాత్మ నుండియే ఉత్పన్న మాయెను. ముఖ్యప్రాణము వాయుతత్వముకాదు, వాయుక్రియ రూపముకాదు. అయినచో ఇది జీవాత్మవలె స్వతంత్ర పదార్ధమా? ఇంద్రియములు ప్రాణములేనిచో పనిచేయవు. కావున ప్రాణము సర్వశ్రేష్ఠము. ఇంద్రియములవలె ప్రాణము కూడయ జీవాత్మ అధీనము లోనుండును. కావున ఇంద్రియ నిగ్రహమువలె ప్రాణ నిగ్రహముకూడ చెప్పబడెను. ఇంద్రియములవలె ఇది జడము, జీవాత్మ వలె చేతనము కాదు. ఇంద్రియముల వలె ఇది జ్ఞానోపకరణముకాదు అనుశంకకు సమాదానముగా - చక్షురాదులవలె విషయోపభోగకరణము కానప్పటికి శరీరము, ఇంద్రియముల ధారణ, పోషణ, ప్రాణము చేనగును. ఈప్రాణ సంయోగముతోనే జీవాత్మ ఒక శరీరమువదలి మరియొక శరీరము పొందును. కావున ఇది కరణమే. జ్ఞానేంద్రియాదులు మనస్సు యొక్క పంచ వృత్తులైనట్లే. ప్రాణ అపాన, వ్యాన, సమాన, ఉదాన వాయువులు ముఖ్యప్రాణముయొక్క పంచవృత్తులు. వీని ద్వారా ఇది జీవాత్మకు అనేక విధముల ఉపయోగపడును. కావున ప్రాణము జీవాత్మ యొక్క ఉపకరణము. ప్రాణ తత్వము పంచ వృత్తుల ద్వారా స్ధూల రూపమున ఉన్నను, సూక్ష్మము, పరిభిన్నతత్వము, సూక్ష్మతకారణముగా వ్యాపకమైనను సీమితమైనదే.

2-4-(14-16):- పరమాత్మ తేజాది తత్వము లందు అధిష్టాత రూపమున ప్రవేశించి సృష్టికార్యము నిర్వహించెను. జీవాత్మ పరమాత్మలు ప్రత్యేక శరీరములో కలసి యుండుటచే జీవాత్మను శరీరముయొక్క అధిష్టాత అనుటలో విరోధములేదు. జీవాత్మ నిత్యము. జీవాత్మతో కలసి పరమాత్మ శరీరమందు ప్రవేశించుట చెప్పబడుటచే పంచ భూతములవలె దీని (జీవాత్మ) ఉత్పత్తి జరుగలేదు.

2-4-(17-19):- ఇంద్రియములు ప్రాణాధీనములు. ఇంద్రియముల కార్యములు ముఖ్యప్రాణకార్యముకాదు. శృతులలో ముఖ్యప్రాణము ఇంద్రియములకంటె భిన్నమని చెప్పబడెను. సుషుప్తి కాలమున ఇంద్రియములు అంతఃకరణములో విలీనమగును. కాని ప్రాణము జాగృతమైయుండును. కావున ఇంద్రియములు ప్రాణముకంటె భిన్నమైనవి.

2-4-(20-22):- నామ రూపాత్మక జగత్తును సృష్టించిన పరమాత్మ జీవాత్మతో గూడి అందు ప్రవేశించెను. జీవాత్మ కర్మ సంస్కారానుసారము కర్మ చేయు శక్తి ప్రదాతకాదు. పరమాత్మ ఆతత్వముల మిశ్రణచేసెను. భూమి నుండి అన్ని కార్యములు, మాంసము, విష్ట, మనస్సు, జలము యొక్క కార్యము మూత్రము, రక్తము, తేజస్సు యొక్క కార్యము ఎముకలు, వ్జిు, వాణి అనుకార్యములు, ఇట్లు త్రివిధ తత్వముల మిశ్రణ జరిగెను. మనస్సు అన్నము యొక్క కార్యము అన్నమయము, ప్రాణము జలము యొక్క కార్యము జలమయము, వాణి తేజస్సు యొక్క కార్యము తేఓమయము అని చెప్పబడినను ఆ యా తత్వముల సంబంధముచే వానికి ఉపకారము జరుగును. ఆకారణమున అవిగౌణములు. మనస్సు, ప్రాణము, వాణి, మొదలగు ఇంద్రియములు భూతముల యొక్క కార్యముకాదు. భూతముల నుండి భిన్నపదార్ధములు.

SARA SUDHA CHINDRIK    Chapters