SARA SUDHA CHINDRIK    Chapters   

ఓం తత్‌సత్‌

శ్రీగణశాయనమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణనమ;

11 బృహదారణ్యకాపనిషత్తు.

బృహదారణ్యకాపనిషత్తు శుక్లయజుర్వేదకాణ్విశాఖ యొక్క వాజసనేయ బ్రహ్మణాంతర్గతము. ఆకారమున బృహత్‌యగుడు చేతను, అరణ్యమున అరణ్యమున అద్యయనముచేయుటచే దీనికహృహదారణ్యకమని పేరువచ్చెను.

శాంతిపాదము:- ఓంపూర్ణమద:, పూర్ణమిదం పూర్ణాతీపూర్ణ పూర్ణస్య పూర్ణమదాయపూర్ణమేవావశిష్యతే||

ఓ. శాంతిః శాంతిః శాంతిః

ప్రథమ అధ్యాయము.

1 యజ్ఞమును అశ్వరూపమున కల్పనచేయబడెను. బ్రహ్మముహూర్తము శారము, సూర్యుడు నేత్రములు, వాయువు ప్రాణము. పైశ్వానరాగ్నిముణము. సంవత్సరము ఆత్మ. ఇట్లే ద్యులోకాములుత, నష్‌త్రములు మొదలగునవి అశ్వాంగములుగాకల్పనచేయబడెను. ఇదియే హయముగా దేవతలను, వాజిగాగందర్వుచేయబడెను. ఇదియే హయముగాదేవతలను. వాజిగా గందర్వులను, అర్వగా అసురులను. అశ్వముగానుష్యులను వహించును.

2. ప్రళయనానంతరము సృష్టిక్రమము:- ప్రళయాకలమున ఆకలి (ఆశనాయ) చే ఆవృతమృత్యువు. నేనుఆత్మయుక్తడనగంగాకయని ప్రజేపతి సంకల్పముచే జలము (అర్క) దానిస్థూలరూపపృద్వి. తేజము ఉత్పన్నమాయేను. తేజము (అగ్ని) మూడుబపాగములుగా విభక్తమై ఒక భాగము ఆదిత్యునకు. రెండవది వాయువునకు. మూడవది ప్రాణమునకు ఇచ్చెను దిశలు, అగ్నిరూపం పారావీపురుషుని బాహువులు. తోడేలు పార్శ్వము. పుష్టభాగము ఉదరము ఆయెను. పృద్విహృదయమైయెను. ప్రజాపతిమిదునమును భావించెను. వాణి మనస్యులద్వారాచించెను. బుకోయజాస్సామచందములు, యజ్ఞప్రజమరియు పశువు పాపిని గ్రహించుటచే అతడు బోక్త. అ భీజ్యము. తపించు సూర్యుడే అశ్వవేదము అగ్ని, ఆదిత్యువే అర్క. అశ్వవేధములు. ఇట్లుతెలిసినవారు. మృత్యువు ఆత్మగా దేవతలలో ఒకరగుదురు.

3 ప్రాణముయొక్కమహిమ:- ప్రజాపతికి దేవతలు అసురు అనురెండు రకములు సంతానము వారు పరస్పరము స్పర్దకలిగియుండిరి దేవతలుఉద్గీదద్వారా అసురుల నిర్జింపజూచిరి. దేవతలువాక్కు. ఘ్రాణరూపప్రాణము, చక్షువులు, శ్రోత్రము. మనస్సుల ద్వారా ఉద్గీదచేయగా అసురులు వానిని పాపయుక్తముచేయుటచే అవి పాపకర్మలయందు ప్రవృత్తమాయెను. అపుడు దేవతలు ప్రాణము ద్వారా ఉద్గానము చేయగా అసురులు దానిని పాపివిద్ధముచేయనెంచగా పరాజితులైరి. ఇట్లు దేవ భావయుక్తముకావించిన ఆస్య (ముణము) నందలిఅంగరసము అట్లు ప్రాణదేవతవాగాది దేవతల రూప మృత్యువు నుండి దూరముచేసి దిశాంతము చేర్చెను. పాప (మృత్యు) నుండి దూరమైనవాక్కు అగ్నిగాను, వాయువు, చక్షశ్రాత్ర, దిశలు చంద్రుడుగా మృత్యువు (పాపము) నుండి దూరమాయిరి. ప్రాణమే ఏఅంగము నుండి బయలువేదలునా అది ఎఁడిపోవును. వాక్కు బృవాస్పతి ప్రాణము ఉత్‌. వాక్కుగీద. అదియే ఉద్గుధ. సామశబ్ద వాచ్యముణ్యప్రాణముయొక్క 'స్వ'ధనము .కావున ఋత్వికులు స్వరసంపన్న ఉద్గడును ఇచ్చగింతురు. ప్రస్తాత అతామాసద్గుమయ, తమసామాజ్యోతీర్గమయ, మృత్యార్మమృతంగమయ అను మంత్రముల జపించిన యజచమానికి సర్వభాదములు కలుగును. ఈ ప్రాణదర్శనమే లోకప్రాప్తి సాధనము.

4 బ్రహ్మస్వరూప చాతుర్వర్ణ సృష్టి:- ప్రారంబమున బ్రహ్మపురుషా కార ఆత్మ. ఆత్మసంజ్ఞకప్రజాపతి పాపములదగ్ధముచేయుటచే పురుషుడనబడెను. అతను రెండవ వారిని కారెను. తనశరీరము స్త్రీపురుషరూపముల విభక్తమాయెను. ఇదిద్విదశఅన్నసమానము ఇవ్వి పురుషార్ధఆకారము స్త్రీచేపూర్ణమగును. ఆస్త్రీయేశతరూపగా అశ్వ, గార్జ బాది రూపములబాంది స్త్రీపురుషురూపులుగావారు ఆయ జంతుజాలము సృజించిరి. కావుననే ప్రజాపతిస్రష్ట. ఈ ప్రజాపతియే సర్వదేవతారూపుడు. ఇట్లు అద్యాకృతము నారమరూపాత్మకముగావ్యక్తమాయెను కర్మానుసారము ప్రాణము. వాక్కు, చషు, శ్రాత్రి, మనస్సుమొదలగు నామములుదచ్చెను. %ాత్మయే ఆయారూపముల నాంటెను. తాలుత బ్రహ్మమేయుండెను. దేవతలు, ఋ%ుషులు.మునులు మనుష్యులు బ్రహ్మానుతెలసుకాని తద్రూపులైరి. బ్రహ్మవిభూతియుక్త కర్మలు చేయుటకు ష్‌త్రియులరచించెను. ఇంద్ర వరుణ సోమ, రుద్రయమ, మృత్యుఈశానాదులు క్షత్రియులు. కావున ష్‌త్రియులు రాజసూయమండుపైన బ్రహ్మాణులు క్రిందకూర్చుందురు. కాని అంతమున బ్రహ్మణశ్రయముపొందును. పిదప వైశ్య, శూద్రులరచించెను. వసు, రుద్ర, ఆదిత్య విశ్వదేవమరుతాదులు. దేవగణంగణకులు(వైశ్యులు) పృద్వి (పూష) సూద్రవర్ణము పోషించునది. పిదప విభూతియుక్తకర్మలు చేయుటకు శ్రేయోరూపదర్మములరచించెను. బ్రహ్మఅగ్నిరూపమున దేవతలలో బ్రాహ్మణుడాయెను. కావున అగ్ని, బ్రహ్మణులు కర్మఫలము నిత్తురు. ఈ ఆత్మయే సమ్మజీవులు లోకము (భోగము) యజ్ఞస్వాధ్యాయాదులచే ఆయా భోగముల నాందును. పురుషునిమనస్సే ఆత్మ. వాణిస్త్రి, ప్రాణముసంతానము. నేత్రములు మానుషవిత్తము. శాత్రము దేవవిత్తములు ఇది ఆత్మదర్శనరూపయజ్ఞము.

5 అన్నముయొక్క ఉత్పత్తి, ఉపాసన, మాన, వాణిప్రాణరూపమున

సృష్టివిధానము:- ప్రజాపతి(తండ్రి) విజ్ఞానకర్మల ద్వారా సప్తాన్నములరచించెను. మూడ అన్నములు తనకొరకుచెను. ఒకఅన్నము పశువులుకుఇచ్చెను. దేవతలకిచ్చుఅన్నము. హరితము ప్రహరితము కావున గృహస్థుదేవతలు కొరకు. హవన బలి, అరపణ చేయును. పశువులకిచ్చు అన్నము దుగ్ధరూపమునాందును. ఇది మనుష్యులకు, పశువులకు, జీవనాశ్రాయము. సర్వదా భషించినప్పటికి అన్నము క్షేణించదు. ఏలనన పురుషుడు అవినాశి. మరల మరల అన్నము ఉత్పన్నము చేయును. ప్రతికాత్మక్రమణము దేవారా భషించిన అన్నము దేవతలకు ళభించును. కావున అమృతభోక్తలగుదురు. తనకొరకుంచుకున్నమూడుఅన్నములు మనవాణి, ప్రాణములు. మనస్సుచేతనేసంకల్పాదులుకలుగును. మనస్సుచేతనే తెలిసికొనును. శబ్దమే వాక్కు. ప్రాణపానాదులు పంచప్రాణములు కావున ఆత్మ (శరీరము) వాజ్ఞ్మయ, మనోమయ, ప్రాణమయము ఇవియే మూడులేకములు మూడువేదములు. దేవ,పితృ, మనుష్యగణములు. పితా, మాతా, సంతానము, విజ్ఞాత, విజిజ్ఞాస, అవిజ్ఞాతము, వాక్కునకు పుద్విశరీరము, అగ్ని జ్యోతి రూపము, మనస్సునకు ద్యులోకము శరీరము, జ్యోతి%ోరూపము ఆదిత్యుడు. ఆదిత్యేగ్ననులు మిదున రూపమునొంద ప్రాణము. ఉద్బించెను. ప్రాణమునకు జనముశరీరము, చంద్రుడు జ్యోతిరూపము. ఇవియన్నియు సవరనము, అనంతము, ప్రజాపతికి సంవత్సరరూప16కళలు: అందు 15 తిధులు. 16వకళ ధృవా (నిత్యము) అతడు తిధుల ద్వారా వృద్ధిక్షయములు పొంది అమావాస్యనాడు రాత్రి 16వ కళతో (చంద్రుడు) ప్రాణులయందు ప్రవిష్టుడై మరల ప్రాతః కాలమున ఉత్పన్నమగును, పురుషునికిదిత్తమే 15కళలు, ఆత్మ16వకళ. విత్తహీనుడైనను. శరీరముండుటచేమరల వృద్ధిపొందును. మనుష్యలోకమును కుమారునిచే. పితృలోకమును కర్మచే, దేవలోకము%ు ఉపాసనచేజయించవచ్చును. తండ్రి కుమారుని ద్వారా ఈలోకమున ప్రతిష్టితుడై మరల అనితో హిరణ్యగర్భసంబంధిత ప్రాణము ప్రవేశించును. పృధ్విం అగ్నులచే దైవవాక్కుకలుగును. ద్యులకము, ఆదిత్యులచే ఇందు దైవీయమనుస్సు ఆదేశించును. జలముచంద్రుని చే దైవీప్రాణము ఆదేశించును. కావున అతుడుచెప్పినది జరుగును. సుణమునే పొందును. ప్రాణము సంచారముచేయుచున్న లేక పోయినను వ్యధితముకాదు. నష్ఠముకాదు. అతడు హిరణ్యగర్భుడే యగును. వాగింద్రియములు మృత్యులు చేయవ్యాపింపబడినను ప్రాణమున్నంతవరకు నష్టపోవు. సూర్యచంద్రాదులు తమతమవ్యాపారములు చేయుచు అస్తమింతురు.కాని వాయువు అస్తమించదు. ప్రాణరూప దేవతచే సాయుజ్యలోకములుకలుగును.

6. నామరూపకర్మలు:- వాక్కుచేనాము, చక్షవుచేరూపము. కర్మసన్వయము ఆత్మ (శరీరము) చేజరుగును. ఆత్మయేమూడు రూపముల అమృతముచే ఆచ్ఛాదితమైనయుండును. ప్రాణమే రూపముల అమృతముచే అచ్ఛాదితమైయుండును. ప్రాణమే అమృతము. నామరూపములు సత్యము. వీనిచేప్రాణము ఆచ్ఛాదితము.

ద్వీతీయ అధ్యాయము

1 గార్గ్య అజీతశతృసంవాదము:- గార్గ్యకుఅజీతశత్రవు.

ఆత్మస్వరూపముతెలుపుట:-

గార్గ్యగోత్రోత్పన్న బాలాకి అనుపురుషండు. గర్వముతో కేశీరాజు అజాత శత్రవు యొద్దకువెళ్ళి. నేనునీకు బ్రహ్మను గూర్చి ఉపదేశింతుననేను. అటులైననీకు సహస్రగావుల నిత్తుననిరాజు అనెను.

గార్గ్యఆదిత్యునియందలిపురుషుని బ్రహ్మరూపమున ఉపాసింతుననెను. ఆదిత్యుడు అన్నిపని అతిక్రమించుటచే అతనినే సర్వభూతమస్తకరూపమున రాజుగా(దీప్తివంతుడు) ఉపాసింతుననెను. గార్గ్య చంద్రరూప పురుషుని విద్యత్యందలిపురుషుని, ఆకాశము నందలి పురుషుని. వాయువు.అగ్నిజలము దర్పణము. నడుచువాని వెనుక గలుగుశబ్దము. దిశలు. ధాయమయపురుషండు; ఆత్మయందలి పురుషుని బ్రహ్మారూపమున ఉపాసింతుననెను. అజాతశత్రవు గార్గ్యవాదమునకుప్రతిగా శుక్లవస్త్రధారి సోమునిగా, తేజస్విరూపమున పూరఅణ అప్రవర్తిరూపమున,ఇంద్ర, వైకుఁట, అపరాజిత, సేన, విషాసహిరూపమున. ప్రతిరూపమున రాబిష్ణరూపమున, ప్రాణరూపమున ద్వితీయవంతునిగా మృత్యురూపమున ఆత్మవంతుని రూపమున ఉపాసింతుననెను. పిద్యుటగార్గ్యమౌనము వహించుటచూచి ఇంతటితో బ్రహ్మను తెలియుట కాదనిఇట్లువదేసించెను.నిద్రించుటచూచి ఇంతటితో బ్రహ్మను దతెలియుట కాదని ఇట్లుపదేసించెను. నిద్రించు పురుషుని చూపి, అతనిని లేపి, ఇతడు విజ్ఞానమయపురుషుడు నిద్రించునపుడు ఇంద్రుయములజ్ఞానశక్తినిగ్రహించి హృదయాకాశమునశనాందును. అప్పుడు అతనిని 'స్వపితి' అందురు ఘ్రాణ,వాణి, చక్షు, శ్రోత్ర, మనము నీనమగును. ఆన్మస్వప్రవృత్తిచే వ్యవహరించునపుడు ప్రాణములగ్రహంచి శరీరమందు యధేచ్ఛగా విహరించును. గాడనిద్లలోనున్నపుడు ఏవిషయమును ఎరుగక హృదయమునుండి శరీరమంతావ్యాపించు 72 వేలనాడుద్వారా బుద్ధితోగూడి శరీరమందువ్యాపించి శటసాచును. ఈఆత్మనుడియే సమ్సతప్రాణులు, లోకములు, దేవతలు, భూతములు, వివిధరూపమున ఉత్పన్నమగును. ఆత్మ సత్యము యొక్క సత్యము ప్రాణసత్యము

2. శిశునామమున మద్యుమప్రాణియొక్క ఉపాసన:-

మధ్యమప్రాణమేశిశువు. ఆశిశువుయొక్కశరీరమే అధిష్టానము (ఆధానము). శరస్సుప్రత్యాధానము, ప్రాణము అన్నపానజనిత స్థోణశక్తి సప్తనేత్రఅంకములు (అషితములు) నేత్రమునందలి ఎర్రని జీరద్వారా రుద్రుడు, జలము ద్వారా మేఘములు, దర్శనశక్తిచే ఆదిత్యుడు, నల్లటిభాదముచే అగ్ని, శుక్ల బాగముచే ఇంద్రుడు, మధ్యమప్రాణమునకలు గుదురు. ఇందురెండుచేవులు. గీతము, భరద్వాజులు (వాక్కుయేఅత్రి) రెండుకండ్లు విశ్వామిత్ర లజమదగ్ని. వాగింద్రీయమే అన్న భక్షణముచేయుటచే 'అత్తి' అందురు ప్రాణములుదిశ్వరూపయశము. ఇట్లు తెలిసనవారు భోక్త, అన్నముభాగ్యము

3. బ్రహ్మయొక్కరెండు రూపముల:- బ్రహ్మయొక్కరెండు రూపములు మూర్త-అమూర్త, మర్త్య-అమృత,స్తిత- చరే, సత్‌ త్యత్‌, వాయువు. అంతరిక్షముకంటెన భిన్నమైనది మూర్తము. అవిమర్త్యస్థిత, త్యత్‌, ఇవి సత్‌యొక్కరసము. వాయువు అంతరిష్‌ముమూర్తము ఇవి అమృత, యతీత్యత్‌యొక్కసారము. ఆమండసలస్థపురుషుడు. త్యత్‌ యొక్క సారము. ఇది అధిథైవత దర్మనము. ఆద్యాత్మమర్తామూర్త విషయమున ప్రాణము దేహంతర్గత ఆకాశముకంటె భిన్నమైనని మూర్తము. నేత్రములు మూర్త, మర్త్య. స్థితోతతీలసారము. ప్రాణము శరీరంతర్గత ఆకాసమూమూర్తుము. దషిణ నేత్రాంతర్గత పురుషుడే అమూర్త అమృత యత్‌తతీలరసము. ఆపురుషుని శ్రయశము మెరుపువలె సర్వత్రృష్ట ఆదేశములేదు. ఇదియే సత్యముయొక్క సత్యము ప్రాణమే సత్యము ఇదియే సత్యము

4. యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి అమృతత్వసాధన రూపమున

పరమాత్మతత్వోపదేశము:-

అమృతత్వసాధనతెలుపువేడిన మైత్రేయికి,యాజ్ఞవల్క్యుడు ఇట్లు ఉపదేశించెను. పతి,పత్ని, పుత్రులు, ధనము, బ్రహ్మణాచులు, దేవతలు, ప్రాణము సర్వమువాని ప్రయోజనముకొరకు ప్రియములు కావు. తనయొక్క ప్రయోజనముకొరకు ప్రియములు కావు. తనయొకత్క ప్రజోయనముకొరకే ప్రయమగును. ఆత్మయొక్క దర్శన, శ్రద్గణ, మనన, విజ్ఞేనాదులచే అన్నిటి జ్ఞానముకలుగును బ్రహ్మణ. ష్‌త్రియ లోకము%ు, దేవభూతగణములు అన్నియు ఆత్మయే దుందుభియొక్కశబ్దమును ఎవరు పట్టలేరు. కాని దుందుభిపైబడు దెబ్బను పద్దనచోశబ్దము పట్టు బడును. శంఖవీణాదులశద్బము వీలుకాదు. కాని స్వరగ్రహణముచేశబ్దగ్రహణముకలుగును. వేదములు. ఇతిహాసపురాణములు. శోకసూత్రమంత్రదావరణు, అన్నియు పరమాత్మశ్వాసములు. జలమునకుఆశ్రయముసముద్రము గంధమునకునాసిక, రసనమునకు జిహ్వ, రూపమునకు చక్షువు, శబ్దమునకు శ్రాత్రము. సంకల్పమునకు మనస్సు, దిద్యులకుహృదయము, కర్తలకుహస్తము మొదలగునవి. ఆశ్రయములు, అటులనే సమస్త వేదములకు ఆశ్రయమువాణి, పరమాత్మతత్వము అనంతము,అపారము, విజ్ఞేనఘనము. దేహంద్రియ భావముక్తి కలిగిన పిదప ఏవిశేష సంజ్ఞలు ఉండవు. దేనిద్వారా సర్వముతెలియనగునే దానినిఎట్లుతెలిసికొనుట విజ్ఞాతను తెలిసికొనుట ఎట్లు?

5. మధువిద్యయొక్క ఉపదేశము-ఆత్మయొక్కవివిధ

రూపములవర్ణన:-

పుధివ్యాదిపంచభూతములు, సూర్యచంద్ర, అగ్ని, వాయు, విద్యుత్‌, ఆకాశము, ధర్మము, సత్యము, మనుష్యులు, ఆత్మ మొదలగు వాని యందు మధు%ోరూపమున నుండు అమృత రూపపురుషుడు ఆద్‌%ాయత్మశరీరతేజోమయ రూపుడే ఈ లఆత్మయందు సమస్త భూతములు, దేవతలు, లోకములు , జీవులు, ఆత్మలుసమర్పింతము. ఈ మధువిద్యదంధ్యాండ ధర్వణుడును ఋషి అశ్వినీకుమారులకుపదేసించెను సరక్వముతెలియుబ్రహ్మ ఇదియే సమస్తవేదాంతముల ఉపదేశము.

తృతీయఅధ్యాము

1. జనకునియజ్ఞమందు యాజ్ఞదల్క్యఅశ్వల సంవాదము:-

జనకుడుయజ్ఞము చేయుచు బ్రహ్మణులతోప్రవచనము చేయుటకు ఎవరుగొప్పవారు అనితెలిసికొనుటకు సహస్రగాపులను దషీణగానిర్ణయించెను. సభలో ఎవరు సాహసించలేదు. యజ్ఞవల్క్యుడు గోవులను తోలుకుపొమ్మని శిష్యుని ఆదేశించెను. నేను గోవులను కోరితిననెను. అపుడు వారిరువురు సంవాధము జరిపిరి.

(అ) మృత్యువును యజమాని ఏసాధనచే అతిక్రముంచును? యజమానుడు. హీత ఋత్వికారూప అగ్ని, వాక్కులచేఅతిక్రమించును

(ఆ) యజమాని దివారాత్రముల వ్యాప్తిని ఎట్లు అతిక్రమించును? అధ్వర్యముఋత్వికదురియు చక్షురూప ఆదిత్యునిద్వారా

(ఇ) పూర్వపక్ష, అపరీపక్ష వ్యాప్తిని ఎట్లు దాచిముక్తడగును? ఉద్గాత, ఋత్వికదురుయ వాయు రూపప్రాణముచే.

(ఈ) యజమాని ఏఆధారముచే స్వర్గలోకమునకువెళ్ళును? బ్రహ్మఋత్విజడు, మనస్సురూపచంద్రుని ద్వారా దీని చేముక్తి అతి ముక్తిపొందుననిచెప్పెను.

(ఉ) నేడు హోతఎన్నిఋచలుద్వారా శస్త్రసంచయనము చేయును? ఏవిఏవి? మూడిటిద్వారా. అవి పూరోనువాస్య. యాజ్యి, శస్య, వీనిచే యజమాని సర్వప్రాణులగెలుచును?

(ఊ) అధ్వర్యుడు ఎన్ని ఆహతులిచ్చును? అవిఏవి? మూడుఆహుతులు. హోమము జరుగునప్పుడు ప్రజ్వలించుదాని ద్వారా దేవతలోకము,అత్యంత శబ్దముచేయు దాని ద్వారా పితృలోకము బూమిపైన వీనమగు ఆహరతిద్వార మనుష్యలోకము జయించును.

(ఋ) నేడు బ్రహ్మదషిణముగా కూర్చుండి ఎందరిదేవతల ద్వారా యజ్ఞరషణచేయును? ఒకరే. అనియేమనస్సు.

(బుూ) నేడు ఉద్గాతఎన్నిస్తోత్రయ ఋచాస్తవన్గముచేయును? మూడు, అవిపూరానువాక్యము, యాజ్యశస్యములు, ప్రాణము పురానువాక్యము, అపానము యాజ్యము. వ్యానముశస్యము. పూరోనువాక్యము చేపుద్వీలోకము, యాజ్యముచే అంతరిక్షము. శస్యముచే ద్యులోకవిజయము యజమానిపొందును.

(అ) యాజ్ఞివల్క్య. ఆర్తభాగసంవాదము:- జరత్తారఆర్తభాగుడు.

యాజ్ఞవల్క్యని ప్రశించెను. '' గ్రహములెన్ని, అతిగ్రహములెన్నెని-అవిఏవి? ప్రాణముగ్రహము, అపానము అతిగ్రహము, వాక్కుగ్రహము, నామరూపము అదిగ్రహము, జిగ్వగ్రహము, రసరూపము అతిగ్రము. చక్షువుగ్రహము, రూపము అతి గ్రహము, శ్రోత్రము గ్రహము-శబ్ధము అతిగ్రహము. ఈ ఎనిమిది గ్రహములు అతిగ్రహములచే గృహీతమై ఆయా కర్మల ప్రవృత్తమగును.

(ఆ) సర్వము మృరత్యువుకు ఆహారమైన మృత్యువు ఎవరికి ఆహారము? అగ్నిమృత్యువు. అదిజలముయొక్క ఆహారము.

(ఇ) దునుష్యడు మరణించిన ప్రాణములు ఉత్క్రమణము జరుగునా? జరుగదు. వాయువులోనికి పీల్చుచు మృత్యుడైపడియుండును.

(ఈ) మరణసమయమునఅతనినిఏదివదలదు? నామము. నామము అనంతము, విశ్వేదేవుడే అనంతము

(ఉ) మృతుని వాణి. అగ్నిలో, ప్రాణమువాయువులో, హృదయాకాశము భూతాకాశములో, రామములు ఔషదుల. కేశములు వనస్పతుల స్థాపితమగును., అపుడు పురుషుడుఎచటపడును? పురుషుడు పుణ్యక్రమల చే పుణ్యత్ముడు పాపకర్మలచే పాపత్ముడు అగును

3. యాజ్ఞవల్క్యు లాహ్యయని భుజ్యుని సంవాదము:- లోకముల అంతము పారషితమని ఆంగీరస సుధన్యుడు తెలిపెను. అవిఅశ్వమేధ యాజిపెళ్ల దేవరధాహన్య, సూర్యుడు ఒక దినములోప్రయాణించుదూరము. ఇట్లువాయుప్రశంసచేయుటచే వాయువే వ్యష్ఠి. సమిష్ఠియనెను.

4. యాజ్ఞవల్క్య చాక్రాయణ ఉషిత్ససంవాదము:- సాక్షత్‌ అపరోక్షబ్రహ్మ సర్వాంతర ఆత్మయొక్క వ్యాఖ్యచేయగోరిన ఉపిత్సునకు యాజ్ఞవల్క్యుడిచ్లుతెలిపెను. పంచప్రాణములచే ప్రాణక్రియచేయునదే సర్వాంతరఆత్మ. దృష్టియొక్కద్రష్టను, శృతియొక్కశ్రోత్రమును, మతియొక్కమంతను, విజ్ఞాతియొక్క విజ్ఞాతను చూడనట్లే సర్వాంతరాత్మను చూడలేము. ఆయా క్రియలు చేయునది సర్వాంతరాత్మయే.

5. యాజ్ఞవల్క్యకహలసంవాదము:- బ్రహ్మ- ఆత్మయొక్కవ్యాఖ్యక్షుధా, పిపాస, శోకే, మోహ, జరామృత్యువులకు, పరముగా నుండునదే సర్వాంతరఆత్మ,పుత్ర, విత్త. లోకముల కొరకే కోరికలు వదలి. ఆత్మజ్ఞాన రూపబలముచేనుండగోరిన అతడంకృతకృత్యుడగును

6. యాజ్ఞవల్క్య, గార్గిసంవాదము:- ఉన్నదంతయుజలములోను, జలమువాయువులోను, అటులనే అంతరిక్ష గాంధర్వలోక, చంద్రలోక, బ్రహ్మలోకముల ఓతప్రాతమనెను. మరల ప్రశ్మింపబూన అతిప్రశ్నయనెను.

7. యాజ్ఞవల్క్య-అరుణ ఉద్దాలక సంవాదము:- ఆత్మస్వరూపదర్ణన, వాయువురూపసూత్రమునందే ఇహలోక, పరలోక, సమస్తభూతసముదాయము గ్రుచ్చబెడను. పృధ్వి,జలము, అగ్ని, అంతరి7 వాయు, ద్యులోక, ఆదిత్య, దిశలు, చంద్రుడు, ఆకాశము,తమస్సుతేజస్సు, ఇట్లు సర్వభూతముల యందలి శరీరము, సర్వభూతముల నియంత, అమృతరూప అంతర్యామి ఆత్మయే. ఇది అధిబూతదర్శనము. అటులనే ఆధ్యాత్మదర్శనము వాణి, నేత్రములు, శ్రోత్రములు, మనస్సు త్వద, విజ్ఞానము, వీర్యుము, వాని యందున్నను అది తెలియలేక శరీరముగానుండి, లోనుండి నియమించునది అంతర్యామి ఆత్మయే.

8. యాజ్ఞవల్క్య - గార్గి సంవాదము:- అక్షర ఆత్మస్వరూపమవర్ణన:- ద్యులోకము నకుపైన. పృద్వికిక్రింద, రెండుటికి. మద్యను, స్వయముగా ఈరెండుల వలోకములు భూత,, భవిష్యత్‌,వర్తమానము. అంతా ఆఆకాశమందే ఓత్పరాతమైయున్నది. అట్టిఆకాశము. అక్షరమందు ఓతప్రాతము. ఈఅక్షరమే సర్వభూతములు, రాత్రింబగర్లు దిశలు, మనుష్యాదులు అక్షరముకంటెబిన్నముగా ద్రుష్ట శ్రాతాదులులేరు. ఆత్మఅక్షరరూపమే.

9. యాజ్ఞవల్క్య. శాకల్యసంవాదము-యాజ్ఞవల్లవిజయము:-

దేవతలెందరు? మూడువేల, మూడవందల, మూడు, దేవగణములు 33, 8వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్రప్రజాపతులతోకలసి 33, వసువులుఎవరు? అగ్ని, పృధ్వి, వాయువు, అంతరిక్షము ఆదిత్యద్యులోకే చంద్రనక్షత్రములయందు జగత్తునిహితమగుటచే ఇవి వసువులు రుద్రులుఎవరు? 10 ఇంద్రియములు (ప్రాణములు) ఆత్మ,ఇవి మరణసమయమున రోదన కారణముగాన రుద్రులు. ఆధిత్యులు ఎవరు? సంవత్సరములోని 12 మాసములే ఆదిత్యులు ఇంద్రుడు, ప్రజాపతిఎవరు? విద్యుత్‌ ఇంద్రుడు, యజ్ఞముప్రజాపతి వజ్రము. పశుగణముల ఆర్గురుదేవగణముఎవరు? అగ్ని, పృధ్వి వాయువు, అంతరిక్ష ఆదిత్యప్రాణములు ఇద్దరు%దవతలు వాయువు11/2 దేవతలు. ఏకదేవుడెవరు? ప్రాణము అదియే బ్‌ర్హమ, అదియేత్యత్‌, సంపూర్ణ ఆద్యాత్మికకార్యకారణ సంఘాతమునకు ఆశ్రాయభూతపురుషుడు శరీరమే అమృతమే దానిదేవుత. కామే ఆయచతనము, హృదయములోకము. మనస్సుజ్యోతిగా గల కార్యకారణసంబంధపురషుంఢు కామయపురుషుడు. దేవతస్త్రీ రూప, చషు, దునములే కార్యకారణ సంబంధ ఆశ్రితుడు ఆదిత్యు%ుడ. సత్యమే దేవత, ఆకాశ శ్రాత్ర, మనములే కార్యాకరాణ రూపపురుషుడు. శ్రాత్రసంబంధిత ప్రతిశుల్కపురుషుడు. దిశలుదేవతలు, తమహృదయమనముల కార్యచకారణపురుషుడు ఛాయాదుయపురషుడు. మృత్యువు దేవత, రూపనేత్రమనముల కార్యకారణఆశ్రితము ఆదర్శ (దర్పణ) మందలి పురుషుడు. ఆసుదేవత, జలహృదగయమనముల కార్యకారణ ఆశ్రితముజములనందలి పురుషుడు. వరు

ణదేవత, వీర్యహృదయ మనముల కార్యకారణ అశ్రితము ప్రితిరూపపురుషుడు ప్రజాపతి దేవత, పూర్వదిశయందు ఆదితక్యుడు నేత్రములయందు రూపముగా హృదయమున ప్రతిష్టతము. దషిణదిశయందలియముడు యజ్ఞమందు దషిణమున శ్రద్ధరూపమున హృదయమున ప్రతిష్టతము పశ్చిమదిశయందలి వరుణుడు జలమునందువీర్యముగా ప్రితిరూపముగా హృదయమందు ప్రతిష్టితము. ఉత్తర దిశయందు సామదేవత దీష్‌యందు సత్యముగా హృదయమందు ప్రతిష్టితము. దృవదిశయందు అగ్నిదేవత వాగ్రుపమున హృదయమందుప్రతిష్టితము శరీరము%ి. ఆత్మ, ప్రాణమునందు వాయులందు ప్రదతిష్టితము. నేతినేతిఅనినిరూపించబడిన ఆత్మనాశములేనిది. వ్యధి తమకాదు పుధివ్యాది అష్టఆయతనముల, అగ్నిది అష్టలోకములు, జీపాధిక పుధివ్యాది అష్ట ఆయతనములు, అగ్న్యాది అష్టలోకములు ,అమృతం అష్టదేవతలు శరీరాది అష్టపురుషులు, ఈపురుషులు జీవపాధిక ధర్మముల అతిక్రమించని ఉపనిషత్పురుషుడుఎవరు? అనియజ్ఞవల్యుడు ప్రశ్నింపగా సమాదానముతెలియని శాకల్యముని మస్తకముపడిపోయెను. పురుషుడుకూడావనస్పతివలె ఉండును. చర్మముబెందు రక్తమువురసము. మాంసము వృక్షఅంతర్భాగము. శిరలు వుష్‌నాళములు. ఎముకలుకాష్టము వృక్షముఖడించిన మరల అంకురితమగును. మరణానంతరముపురుషుడు జీవించడు. వీర్యము బేపురుషుడు. బీజముచేవృక్షము జన్మించును. మరణానంతరము మరల పురుషుని ఎవరు ఉత్పన్నము చేయుదురు? విజ్ఞానఆనందబ్రహ్మ

చతుర్థ అధ్యాయము

1. జనక యాజ్ఞవల్క్యసంవాదము:- తనవద్దకువచ్చిన యాజ్ఞవల్క్యునిచూచి జనకుడు గోవులకొరకా లేక ప్రశ్నశ్రవణమునకా వచ్చినారన. రెండింటికినవి జావాబుజెప్పెను.

యాజ్ఞవల్క్యుడు వానినివివరించు. '' వాక్కు ఆయతనము. ఆకాశమి ప్రతిష్ఠ| ఆ బ్రహ్మయొక్క ప్రజ్ఞను ఉపాసించవలెను. వాక్కుచే బంధువులు దేవపురఆమ ఇతిహాసములు తెలియబడుటచే వాక్కు యే ప్రజ్ఞ. కావునవాక్కుయే పరబ్రహ్మ.

'' ప్రాణము ఆయతనము. ఆకాశముప్రతిష్ఠ ప్రియరూపమున ఉపాసించవలెను. అన్నికార్యములు ప్రాణుకొరకే జరుగును. కావున ప్రాణమే పరబ్రహ్మ.

'' చక్షవులే ఆయతనము. ఆకాశము ప్రతిష్ఠ. సత్యరూపమున ఉపాసించవలెను. కండ్లతో చూచిన దంతయు సత్యము. కావున చక్షవులే పరబ్రహ్మము

'' శ్రోత్రములే ఆయతనము.ఆకాశము ప్రతిష్ఠ.అనంతరూపమునఉపాసించవలను దిశ##లే అనంతము. దిశ##పే శ్రోత్రము. కావున శ్రీత్రమే పరబ్రహ్మ.

'' మనస్సే ఆయతనము. ఆకాశము ప్రతిష్ఠ. ఆనందరూపమున ఉపాసించవెలను. మనస్సుచేతనే స్త్రిని కాంషించి అనురూపపుత్రినిపొందును అదియేఆనందము కావునమనస్సే పరబ్రహ్మ.

'' హృదయమే ఆయతనము ఆకాశము ప్రతిష్ఠ . స్థితిరూపమున ఉపాసించవలెను. హృదయమే సర్వభూతముల ఆయతనము, ప్రతిష్ఠ సర్వభూతములు హృదయమందే ప్రతిష్టతము. కావున హృదయమే పరబ్రహ్మ. ఇట్లు పాసించు వారిని ఇంద్రియములువదలిపెట్టవు. దేవతారూపమున దేవతలను పొందును.

2. జనకునకుయాజ్ఞవల్క్యుని ఉపదేశమి:- దూరప్రయాణము చేయవారు రదములనాశ్రయించి నటుల ఉపనిషదుక్తప్రాణాని బ్రహ్మనుపాసించి సమహితచిత్తుడవైతివి. ఈ శరీరమువిడచిన తర్వాత ఎచటికి వెళ్ళెదవని యాజ్ఞవల్క్యుడు ప్రశ్నింప జనకుడు తనకు తెలియదనియు, తెలివువేడెను. దషిణనేత్రమందలి పురుషుడు ఇంద్రుడు, వామనేత్రమున్న ఇంద్రునిభార్యవిరావ (అన్నము), వారుకలయుస్థానము హృదయాంతర్గత ఆకాశము హృదయమందలి హితనామకనాడులుద్వారా స్థూలశరీరభిమాని వైశ్యానిరరూపమునిండి. సూష్మ్‌దేహాభిమానితైజసరూపమున సూక్ష్మ ఆహారము గ్రహించును. దిశలు దిద్వాంసుని ప్రాణము. నేతినేతి యను ఆత్మగ్రహింపబడదు. నష్టముకాదు.సంగము నాంది బద్ధ ముకాదు, వ్యభితము ష్‌ణముకాదు. ఇదియే అభబ్రహ్మయొక్క జ్ఞానము.

3. యాజ్ఞల్క్యుని ద్వారా ఆత్మ స్వరూపకధనము:-

జీవాత్మయగుపురుషుడు. ఆదిత్య, చంద్ర, అగ్ని, వాక,ఆత్మ, జ్యోతి రూపములకర్మలను చేయును. ఆత్మప్రాణము నందలి బుద్ధథి వృత్తియందతలి విజ్ఞానమయ జ్యోతి స్వరూపపురుషుడు. ఆపురుడు ఇహపరలోకసంచారము చేయును. స్వప్నమున శరీర ఇంద్రియాదులు ఆక్రమించును. జన్మించుట తోడనే శరీరమున ఆత్మ బాదముపొంది, దేహేంద్రియపావము లచే సంశ్లిష్టుడై మరణసమయమున పాపముల త్యజించును. ఈపురుషునకు ఇహలోకమపరలోకములనిరెండు స్థానములుకలవు. మూడవదియగు స్వప్నస్థానము సంధిస్థానము. పరలోకస్థానమునకై సాధనసంపన్నుడగునటులే ఆసాధనశ్రయముననే పాపభఫలరూప ఆనందము పొందును. స్వప్నావస్థయందు వాసనా మయదేహము రుచించి జ్యోతి స్వరూపము నశయసాచును. ఆనంద ఆమోద ప్రయోదమును రుచించును. ఆత్మస్వప్నముద్వారా శరీరమును నిశ్చేష్టపరచి. తాను నిద్రించక, నిద్రించు సమస్త పదార్థములను ప్కాశింపజేయును. శుద్ధ, ఇంద్రయరూపమును పొంది మరల జాగృతస్థానమునకువచ్చును. హిర్మణయజ్యోతి స్వరుపపురషుడు స్వప్నావస్థయందు ఉచ్చనీచభావముల పొంది స్త్రీలతో ఆందముపొందును. మిత్రులతోసంతోషము భయాదులు పొందును. జాగ్రదావస్థలోచూచిన పదార్థములే స్వప్నావ్సతలోచూచును. పురుషుడు అసంగుడగుటచే బద్ధుడ కాడు. ఆత్మ స్వప్నావస్థలో విహరించి, రమించి, పుణ్యపాపాదుల చూచి ఎచటనుండి వచ్చెనో అటకేతిరిగివెళ్ళును. అసంగమంగుటచే అబద్ధముకాగు. చేపనిదియొక్క రెండుతీరములకు సంచరించునట్లు ఆత్మ జాగ్రత, స్వప్నావస్థలయందు సంచరించును.హృదయమందలి హితనామకనాడులు జాగ్రనావస్థలోచూడు భయందులనే స్వప్నావస్థయందు చూపును. ప్రియభార్యను ఆలింగనముచేయుపురుషునకు బాహ్యజ్ఞానముండనట్లే ప్రజ్ఞాత్మచే ఆలింగతుడై బాహ్యవిషయములు తెలియకుండును. చూచుటు వినుట. రుచిచూచుట మొదలగు క్రియలు చేయుచున్నట్లున్నను అవిచేయడుయవిజ్ఞాతయొక్క విజ్ఞానశక్తి సర్వదా లోపించదు. ఏలనన అతడు అవినాశి. అతని కంటె భిన్నమగు వేరువస్తువులేదు. సుషుప్తియందు అద్వైతద్రష్ట. అదియేఅతని బ్రహ్మలోకము,. పరమానందపరమగతి. మనుష్య. పితర, గంధర్య దేవ, అజనదేవ, ప్రజాపతి, బ్రహ్మలోకానందములు ఒకదానికంటె ఒకటి శతాధికము. ఆత్మ ప్రజ్ఞాత్మచే అధిష్టమైమరణ కాలమున శబ్దముతో బయటకుశ్వాసవదలి పావును. ఆత్మ ఏమార్గమున వచ్చెనో అదేమార్గమున పోవును.

4. కోరికలు నశించురుచేబ్రహ్మప్రాప్తి:- ఆత్మనేత్రమార్థ శరీరముయొక్కఇతర మార్గములద్వారా సంపూర్ణ ఇంద్రియవర్గప్రాణముల తీసికొని ఉత్క్రమణము చెంది, జ్ఞానకర్మఅనుభూతివిషయిక వాసనల తీసుకొని విజ్ఞానయుక్తప్రదేశ మునకువెళ్లును-మరల అన్యభూతయుత నవీన సుందర రూపమును రచించును. ఆత్మయేబ్రహ్మ.విజ్ఞాన మనోమయ ప్రాణమయాది సర్వమయము. ప్రత్యక్షము. పరోక్షముఇదియే క్రమాచరణముల ననుసరించి రూపముపొందును పుణ్యలురుపుణ్యాత్ములుగను. పాపకర్మములు పాపాత్ములుగను జన్మించెదరు. మనోభిలాషానుసారము ఈలోకమునకువచ్చును.నిష్ఠాములు, ఆత్మకాములు. ఆప్తకాములు నగుట చే బ్రహ్మమును పొందెదరు. జ్ఞాన మార్గగామియగు బ్రహ్మవేత్త ఈలోకమందే, ఈజన్మమందే జీవన్ముక్తుడై శరీర త్యాగనంతరము పేరాక్షముపొందును. బోగసక్తులు అవిధ్యా అజ్ఞనాంధకారయుతుపై నరకాదులపొందినీచజన్మపొందెరు. పంచపంచజన అధ్యాకృత ఆఖాశప్రతిష్టత ఆత్మయే బ్రహ్మము. ఆత్మను ప్రాణ చక్షురాదులుగా తెలిసికొనువారు. సనాతన బ్రహ్మను తెలిసికొనగలరు. బ్రహ్మను ఆచార్యోపదేశమననముచే తెలియవలెను. బ్రహ్మఒక్కటే. నానాత్వము లేదు. ఉపనిషత్తు లందు దిగ్దర్మనము చేయబడ్డ ఆత్మను వేదపారగుగు బ్రాహ్మణులు. స్వాద్యాయ, యజ్ఞ, దాన, తపాదులచే తెలిసినకొందరు. సర్వసంగ పరిత్యాగులు సన్యాసముపొందెదరు. నేతినేతియని నిర్దేశింపబడు ఆత్మ. అగృహ్య, అశీర్య అసంగ, అనాసక్త, వ్యభితక్షయంరహితము. నిత్యమహిమాన్విత బ్రహ్మవేత్తశాంత, దాంత, ఉవరత, తితిక్షువుల సమాహితుడై ఆత్మలోఆత్మను చూచును. ఇట్టి అజన్మ ఆత్మయే అజార, అమరీ, అమృత, అభయబ్రహ్మ

5. యాజ్ఞవల్క్యమైత్రేయి సంవాదము:- యాజ్ఞవల్క్యునకు మైత్రేయి. కాత్యాయని ఇద్దరుభార్యలు మైత్రేయి బ్రహ్మవాదిని కాత్యేయనిసాధరణగృహిణి సన్యాసము స్వీకరించగోరి యజ్ఞలవల్క్యుడు తన సంపదను భార్లకుపంచగోరెను. అంత మైత్రేయ ఈధనమువలన ప్రయోజనమేమి? అమృతత్వమును పొందుమార్గమునుపదేశింపగోరెను.

అంతటయాజ్ఞవల్క్యుడు మైత్రేయికిట్లు ఉపదేశించెను. పతి, పత్ని, పుత్రీ, మాతా, పిత, సోదర, బంధు,క్షత్రియ, బ్రహ్మణ దేవవేదాదులు వాని ప్రయోజనము కొరకుకాక తన ప్రయోజనము కొరతే ప్రీతి పాత్రదుగును. కావున ఆత్మయే దర్శన, శ్రవణమనన, ధ్యానయోగ్యములు. అందుచేవిజ్ఞానము కలుగును. బ్రహ్మణ క్షత్రియ, లోకేదేవాదులు తమ ఆత్మకంటె భిన్నమైన దానిని పరాజితము చేయుదురు. దుందిభిమొదలగువానిశబ్దమును పట్టవేరు. కాని శబ్దముకలిగించు. సాధనమును పట్టిన శబ్దమును పట్టలేరు. కాని శబ్దము కలిగించుసాధనమునుపట్టిన శబ్దమును పట్టవచ్చును. వేద, శాస్త్రపురాణ, ఇతిహాస, మంత్ర, యజ్ఞ, ఇహలోక, పరలోకాదులసు పరమాత్మ (ఆత్మ) యొక్కవిశ్వాసము అన్నినదులు సముద్రములో కలయునట్లు, సంకల్పములు, మనస్సు, ఇంద్రియములు సర్వమునకు పరమాత్రమయే ఆశ్రయము ఆత్మ అంత ర్బాహ్యభేదములేక సంపూర్ణ భూతముల ఉత్పన్నమై వినుట. తెలిసికొనుట మొదలగుక్రియలు జరుగును. సక్వముఆత్మయును అదైవతభావమున ఎవరి ద్వారా క్రియలుజరుగనో. అతడే (%ాత్మ) సర్వము. అదియేనేతినేతియని నిర్దేశింపబడిన. అమృత స్వరూపము.

పంచమ అధ్యాయము

1. పరబ్రహ్మపూర్ముడు. పూర్ణ బ్రహ్మనుండిపూర్ణము ఉత్పన్నడగును. పూర్ణమునుండి పూర్ణము తీసివేసిన పూర్ణమేమిగులును. ఆకాశ##మే ఓంకారరూపమ బ్రహ్మ. ఓంకారమేవేదము.

2. ప్రజాపతి బ్రహ్మ, మనుష్య, దేవ, అసురులకు '' అనఅక్షరమునుపదేశించెను. దానిని వారు దదున, దాన, దయగా గ్రహించిరి-అనగా భోగప్రధానదేవతలారా ఇద్రయమనము చేయుడు సంగ్రహప్రధానమగుమనుష్యచులారా భోగసామగ్రిని దానము చేయుడు.క్రోధహింసాప్రధాన అసురులారా జీవులపై దయచూపుడు.

3. హృదయమేప్రజాపతి. బ్రహ్మసర్వము. ఇందలి ''అను అక్షరము స్వజన, అన్యజనులు, బలిసమర్పణచేయుటకు '' స్వజన అన్యజనులుఇచ్చటకు. యమే అనునదితెలిసిన స్వర్గలోకముపొందుడి

4. బ్రహ్మసత్యము. మహత్తు, యష్‌, సర్వప్రధమ, ఉత్పన్న మగువాడు సత్యబ్రహ్మయే ఇట్లతెలసినలోకములు జయింతురు.

5. వ్యక్త జగత్తుమొదట జలము. జలము సత్యమును రచించెను. సత్యమేబ్రహ్మ, బ్రహ్మప్రజాపతిని ప్రజాపతి దేవతలను ఉత్పన్నము చేసెను దేవతలు సత్యము నుపాసింతురు. సత్యమునందు స, తీ, యమే అనుమూడు అక్షరములుకలవు. అందు స, యమే సత్యము 'తి' అసత్యము. %ిట్లు%ి అసత్యము సత్యముచే ఆదరిపంబడెను. అదిత్యమండలస్థ, దషిణనేతరమందలి పురుషుడు ఒకరిచే ఒకరు ప్రతిష్టితులు ఆదిత్యపురుషుడు రశ్మిద్వారానే నేత్రస్థపురు,%ుని, నేత్రస్థరుపుషుడు ప్రాణములద్వారా ఆదిత్యపురుషునందు ప్రతిష్టతమగుదురు. భూ, భూవ, స్వ, ఇవి ఆయా మండలపురుషుని శిరము, ధాహువులు పాదజములు, ఇట్లు తెలిసనవారు పాప దూరలగుదురు. 'అహమే' దీనిఉపనిషత్తు (గూఢనామము)

6. ప్రకాశ##మే సత్యస్వరూపముగాగల హృగయస్థమానోమయ పురుషుడు ధ్యాన్యపుగింజంత పరిమాణముకలవాడై అందరికి స్వామి. అధిపతి శాసకుడు

7. విద్యుత్‌ బ్రహ్మము. ఇట్లు తెలిసనవారు ఆత్మయొక్క పిరతికూల మగు పాపములు నశింపజేయును.

8. వాగ్రూపధేనువునుపాసించవెలన.%ు దానిని నాలుగు స్తనములు, స్వాహికార, దషవికారములు, బోక్త దేవగుణము. హంతాకారపు భోక్త దునుష్యుడు. స్వధాకారముభోక్తపితృగణము, ధేనుపుయొక్కప్రాణము వృషభము-మనస్సుదూజ.

9. పురషునిలోపల అన్నాదుల పచనము చేయునది వైశ్వానరఅగ్ని. చెవులు మూసికొనినకలుగుశబ్దము. ఆ అగ్నియొక్కఘోష బ్రహ్మమేవైశ్వానకాగ్ని,

10. మరణించిన పురుషుడు వాయురూపమున ఊర్ధ్వగామిదై. సూర్యలోకము, చంద్రలోకము, పిదపదు. ఖరహితమలోకము పొంది అనంతకాలము అచటనివసించును.

11. వ్యాధియుక్తపురుషుడు తాపమును తపముణానెంచినపరలోకము పొందును. మృతపురషుని శ్యశానమనము, దాహక్రియందుకలుగు తాపము తపముగానెంచి పరమలోకము పొందును.

12. అన్నమేబ్రహ్మ ప్రాణమే బ్రహ్మయనికొందరందురు కానిఅవి ఒకటి లేని చో రెండవది ఉండజాలదు. కావున రెండింటిది ఏకరూపత్వమే అన్న మందు సర్వభూతములు ప్రతిష్టతమైన ప్రాణము నందు రమించును ఇట్లు తెలిసినవారు సర్వభూతములందు ప్రతిష్టితులైరమించెదరు.

13. 'ఉక్ధ' అని ప్రాణమునుపాసించువారు ప్రాణముయొక్క సాయుజ్య, సాలోక్యములు పొందెదరు. సర్వప్రాణులకు యోగముకలగించురుదే ప్రాణము యజుః రూపమున ఉపాసించువారు యజుఃయొక్క సామడ్యసాలోక్యములుపొందెదరు. సర్వభూతముల సుసంగతముచేయు ప్రాణము 'సామ' పూమున ఉపాసించిన సాయుజ్యసలోక్యములు పొందెను. శస్త్రాదులుటచే రక్షించుటే క్షత్రరూపమున ఉపాశించువారు క్షత్రముయొక్క సాయుజ్యసాలోక్యములు పొందెదరు.

14. భూమి. అంతరిక్ష, దౌ - ఈ 8అక్షరములగాయత్రియొక్క పర్ధమపాదము. బుచః, యజూంషి, సామాని-ఈ8అక్షరములు గాయత్రియొక్క ద్వితీయపాదము, ఇట్లు ఆయా పాదములతెలిసినవారు క్రమముగా త్రిలోకములను, త్రియీదిద్యను, సర్వప్రాణి సముదాయమును గెలుచును. ప్రాణ, అపాన, వ్యాన, ఇది 8అక్షరములు గాయత్రియొ క్కతృతీయ పాదము. ఇట్లు తెలిసినవారు. సర్వప్రాణిసమముదాయమునుగెలచును. తురీయ, దర్మిత, పరోరజ, ఇది చతుర్థపాదము. తురీయ (ప్రకాశించునది) దర్మిత ఆదిత్యముండలస్థపురుషుడు) పరోరజాః (సర్వలోకములపై నుండి ప్రకాశించవాడు) గాయత్రినిఇట్లు తెలిసనవాయుశోభ, కార్తులదేప్రకాశింతురు. గాయత్రి దర్మిత, పరారాజఃపదమునందు ప్రతిష్టతము, సతయము నందుప్రతిష్ఠితము గాయత్రి ఆధ్యాత్మప్రాణమునందు ప్రతిష్ఠితము, ప్రాణమే 'గయ.' ప్రాణమును త్రాణముచేయుటచే గాయత్రిఅనిపేరు కలిగెను. గాయత్రి త్రైలోక రూపి ప్రధమ పాదముచే ఏకపది మూడవేదముల రూపమున ద్పవిదతీయ పాదముగాద్విపది. మూడు ప్రాణుల రూపమున తృతీయ పదముగాత్రిపతి తురీయ పాదముచే యచతుష్పని దానిపై రూపమున ద్వితీయ పాదముగా ద్విపది-మూడ ప్రాణములరూపమున తృతీయ పాదముగా త్రిపది-తూరీయ పాదముచే చతుష్పని దీనిపై నిరుపాధిక స్వరూపముచే 'అపద' ఇట్లు గాయత్రి%ిని ఉపస్థానము చేయువారి సర్వకోరికలుతీరును.

15. అంత్యసమయమున పరమేశ్వరు నిట్లుపార్థించవలెను.

సత్యస్వరూపపరమాత్మ, నీవు సరక్వులనుభరించి పోషించువాడవు. భక్తిరూప సత్యధర్మము ననుష్టించుకనాకు దర్శన మిచ్చుట కొరకు. సూర్యమండలికిరణముల (ఏకముజేసి) ఏకత్రిముచేసి నీ అతిశయ కాళ్యాణమయ దివ్యరూపమును దయతోచూడ గలుగు నట్లు చేయును. ప్రాణణు, ఇంద్రియములు అవినీ%ాశి సమిష్టిదాయ తత్వమును పొందుగాక.స్థూలశరీరము అగ్నిచే దహింపబడి భస్మమగు గాక. నాచే చేయబడినకర్మలను స్మరించి సుందర శుభమార్గమున తీసుకువెళ్లుము. మా సర్వకర్మలను తెలిసననీవు ఈ మార్గమున ప్రతిబంధకమగు పారములను దూరముచేయుము. ప్రభూ! నీకుమరలమరల నమస్కరించెదను.

షష్ఠ అధ్యాయము

ప్రాణమే జ్యోష్ఠము శ్రేష్ఠము. వాక్కువశిష్టము చక్షువుప్రతిష్ఠము. చక్షువుచే సమాన దుర్గమములు దేశకాలమందు ప్రతిష్ఠతమగును. శ్రోత్రము సంపద. సంవదలు భోగముల కేలుగును. మనస్సు ఆయతనము (ఆశ్రయము) అట్టివారు. స్వజనుల అన్యజనుల కాశ్రయ భూతలగుదుర. రేతస్సు ప్రజాతము. అట్లు తెలిసిన వారు ప్రజా పశువులద్వారా వృద్ధిపొందెదరు.

ప్రాణము. మనస్సు, ఇంద్రియములలో ఎవరు గొప్పయన ప్రశ్నవచ్చెను. ఎదురు ఈ శరీరమునుండి ఉత్క్రమణము చెందిన శరీరము పనికి రాని దగునో వారు గొప్పవారని బ్రహ్మచెప్పగా ఇంద్రిములు, మనస్సు, రేతస్సు శరీరము విడచి వెళ్ళినను శరీరము పతనముకాలేదు. ప్రాణము ఉత్క్రణము చెందకోరగనే మిగిలిన ఇంద్రియములు వలదని వానివానితత్‌%ివములను ప్రాణమున కర్పించెను. ప్రాణముయొక్క అన్నము. దాద్యపదార్థములు వస్త్రము జలముకనుకనే భోజననముకముందు తర్వాత జలము ఆచమించవలెరను.

2. పంచాగ్నివిద్య. త్రివిధగతి:- ఆరుణికపుత్రుడు శ్వేతకేతువు జీవలపుత్రుడు ప్రదవాణుని ప్రశ్నలకు సమాధానము తెలియదని పలికి తండ్రివద్దకువెళ్ళి నీవువిద్యనంతయు చెప్పితినంపివి. ఆప్రశ్నలకు సమాధానము చెప్పలేకపోయితి ననెను. అపుడు తండ్రియగుగౌతముడు రాజ సభసభకు వచ్చి తనకు ఆవిద్య నేర్పి ప్రార్థించెను.

'' ద్యులోకము అగ్ని, అదిత్యుడు సమిధలు, కరిణులు ధూమము, దీనము జచ్వాల, దిశలునిప్పు, అవాంతరదిశు విస్పులింగములు. ఆ అగ్నియందు దేవతలు శ్రద్ధను వాహనము చేయగా సోమరాజు ఉత్పన్నమగును.

'' పర్జన్యదేవతఅగ్ని, సంవత్సరము సమిదలు, మేషుములు ధూమము, విద్యత్‌జ్వాల, మెరుపు అంగారము, మేగములగర్జన విస్ఫురింగములు, ఆఆగ్మియందు సోమరాజును హవనము చేయగా వృష్టికలుగును

'' ఈలోకము అగ్ని, పృద్విసమిధ, అగ్నిధూమము, రాత్రిజ్వాల, చంద్రుడు అంగారము. నక్షత్రములు దిస్ఫులింగములు ఈ అగ్నియందు వృరష్టిని హోమము చేయగా అన్నముకలుగును.

'' పురుషుడు అగ్ని. తెరచినము ఖముసమిధ, ప్రాణము దూమము, వాక్కుజ్వాల,నేత్రములు అంగారములు. శ్రోతము విస్ఫులింగములు.ఆ అగ్నియందు అన్నమును హోమము చేయగా వీర్యము కలుగును.

'' స్త్రఅగ్ని, ఉపస్థసమిధ, లోమముధూమము, యోనిజ్వాల, మైదున వ్యాపారము అంగారములు. ఆనందము విస్ఫలింగములు అందు వీర్యము హోమముచేయగా పురుషుడుకలుగును. అట్టి పురుషుడు క్రమశేషమున్నంతవరకు జీవించి మరణించిన పిదప అగ్నిలోచేరి. అగ్ని అగ్నిగను, సమిధసమిధగను, ధూమము ధూమముగను, జచ్వాల జ్వాలగను, అంగారము అంగారముగను, విస్ఫులింగము దిస్ఫులింగముఅగను. ఇట్లు దేవతలు పురుషుని అగ్నియందు హోమము చేయగా ఆహుతి నుండి పురుషుడు అత్యంత దేదీప్యమానుడగును. ఇట్లు పంచాగ్ని విద్యనెరిగిన గృహస్థులు దాన ప్రస్థ, సన్యాసాశ్రమము లందు శ్రద్ధాయుక్తలై సగుణ బ్రహ్మనుపాసించనివారు జ్యోతి అభిమానులన %ుదేవతలను పొందెదరు. దినము, శుక్లపక్షము, ఉత్తరాయణము, దేవలోకము, ఆదిత్యలోకము, విద్యుల్లోకము పొందగా మానసపుపరుషుడు. వానిని పునారావృతితి రహిత బ్రహ్మ లోకమును చేర్చును ఇదియే దేవయానము.

యజ్ఞ, దాన, తపాదిసకామకర్మలు దూమమార్గము. రాత్రి, కృష్మపష్‌ము, దక్షిణాయనము, పితృలోకము చంద్రలోకములు పొంది కర్మష్‌యము కాగానే ఆకాశ, వాయు దృష్టి, పుధ్వింలను పొంది అన్నరూపమున పురుషుని యందు వీర్యముగా స్త్రీయందు ప్రతిష్ఠితమై మరల జన్మించును. ఇది పితృయానము ఈరెండు మార్గములు తెలియని నీచజీవులు క్రిమికీటక రూపమున పొందెదరు.

3. మందవిద్య:- మహత్వమునుపొంద గోరువారు ఉత్తరాయణ,శుక్ల పక్షపుణ్యతిధియందు 12 దినములు పయోంద్రితుడై యోదుగ (గూలర్‌) తేచేయబడినదపాత్ర, చమన, సర్వజేషధ, ఫల సామగ్రులు సిద్ధము చేసుకొని హవనస్థలము ను శుద్ధిచేసి ఓషధులపిండము, హస్తము అగ్నికి తనకు మధ్యనుంచవలెను. ఓ అగ్నిదేవతా! నీవు ఈ హవనముచే తృప్తుడవై ప్రతి బందక దేవతల నిరోధించి, నా సమస్త కోరికలను తృప్తిపరచుము అని ఘృతధారలచే యజనము చేయవలెను. జ్యేష్ఠాయస్వాహా, శ్రేష్టాయ స్వాహా, వాచేస్వాహా, ప్రతిష్టాయై స్వాహా, చక్షుసేస్వాహా, సంపదే స్వాహా, శ్రోత్రాయ స్వాహా, ఆయతనాయస్వాహా, మనసే స్వాహా, ప్రజాతైస్వాహా, రేతసే స్వాహా, అగ్నయే స్వాహా, సోమాయస్వాహా, భూః స్వాహా భూవః స్వాహా, స్వః స్వాహా, భూర్జవః స్వాహా, బ్రహ్మణస్వాహా, క్షత్రాయస్వాహా, భూతాయస్వాహా, భవిష్యతేస్వాహా, విశ్వాయస్వాహా, సర్వాయస్వాహా, ప్రజాపతయేస్వాహా, ఇట్లు ఘతమును అగ్నిలో హవనముచేసి సృవయందుమిగిలిన ఘృతమును మంధ పాత్రయందుంచవలెను.

మంధవిద్యఅదిష్ఠాతదేవయగు ప్రాణమునుద్రమగని ఇత్యాదిమంత్రములద్వారా నీవు ప్రాణరూపమన సంపూర్ణదేహము నందు తిరుగు వాడవు. అగ్నిరూపమున ప్రజ్వలితుడవు. బ్రహ్మరూపమున పూర్ణడవు. ఆకాశమునస్తబ్దుడవు. యజ్ఞకర్మాయందు హింకృత ఉద్గాధా రూపుడవు అని స్తోత్రముచేయవలెను. "అమంహితేమహి" నమహిమనుబాగుగాతెలిపితివి. నీవురాజు. ఈశ్వరుడు అధిపతిని, నన్నుగూడ అట్లు చేయుము.

పిమ్మట తత్సవితుర్వవేరేణ్యమ్‌. వాతారు భుఋతాయత్సే సింధవః, మదుక్షరంతి, న, ఓషధిః మాద్వీః సంతు, భూః స్వాహా ఇట్లు పలుకుచు మంధయొక్కమొదటిగ్రాసము తీసికోవలెను. (సూర్యునియొక్కశ్రేష్ఠ, వరేణ్యపదమును ద్యానింతును పవనుడు మంద మధురగతి వీచుగాక, నదులు మధురరసము స్రవించు గాక, ఓషదులు మధురమగు గాక) దేవస్యభర్గః ధీమహి (సవితాదేవియొక్క తేజముద్యానింతును). నక్తముత ఉషసః మధు (రాత్రింబగళ్ళు సుఖకరమగు గాక) పాన్ధివంరజః మధుమతీ (పృధ్వియొక్క ధూళికణములు అద్వేగము చెందుకుండుగాక) దౌ, పితాన, మధు%్‌స్తు (పితాద్యులోకము ణాకుసుఖమకరముగాక) భువః స్వాహా (ఇట్లు మంత్రముచే ద్వీతీయగ్రసముతీసుకొనవలెను) యఃనః ధియః ప్రచోదయాతీ (సవితాదేవి మాబుద్ధిని ప్రేరితము చేయగాక) నః మనస్పతిమదుమాన్‌ (వనస్పతిమధురసమయ మగుగాక) గావః నః మాధ్వీః భవంతు) దిశలు మాకు సుఖకరమగునుగాక) స్వఃస్వాహా (ఇట్లు మంత్రముచే తృతీయగ్రాసము తీసుకొవలెను (పిమ్మట)

పిమ్మట పూర్తి గాయత్రిమంత్రము-తత్సవితుర్వరేణ్యమ్‌ భర్గోవదేవస్యధీమహి, దియోమోసః ప్రచోదయాత్‌- తత్సవితుర్వరేణ్యమ్‌- సూర్యనియొక్క (వరేణ్యశ్లేష్ఠపదమును నేను ద్యానింతును. దేవస్యభర్గః ధీమహి- మేము సవితాదేవుని (సవితాదేవి) జేతమును ధ్యానింతుము. యః నఃదియః ప్రచోదయతీ- ఏ సవితాదేవుడు (సవితాదేవి) మాబుద్ధిని ప్రేరేపించునో ఆ సవితాదేవుడు (సవితాదేవి) తేజము, మేముద్యానింతుము.

పిమ్మట పూర్తిగాయత్రిమంత్రము. మధువాతే ఋతయతే (సమస్తమదమతిఋచ) అహమేవేదం, సర్వభూయాసః (ఇది అంతయు నేనేయగుగాక) భూర్ఖువః స్వాహా అని మిగిలిన మంధనము భషించి చేతులుకడుగుకొని కూర్చుండవలెను. ప్రాతః కాలమున దిశోమ్క పుండరీక మస్యహం---భూయాసమే (నీవుదిశలకు పుండరీకము, నేను మనుష్యులకు పుండరీకుడు (శ్రేష్ఠుడు)నగుగాకయని ఆదిత్యునకు నమస్కారము చేసి వెళ్లిన మార్గమునే తిరిగి వచ్చి అగ్నికి పశ్చిమ భాగమునకూర్చిండి వంశమునుజింపించవలెను.

ఈమందవిద్యుద్దాలకుని నుండి శిష్యపరంపరగా వచ్చినది. ఈ మంధకర్మయమోదుగ కర్రతో చేసినపాత్ర, సృవ, చమన, ఇధ్య, ఉపమందనిత, ధ్యాన్యము, యవలు, లిలలు, మినుము, గోధుమపిండి, పెరుగు, తేనె, నేతితోకలపి హవనము చేయవలెను.

4. సంతానోత్పత్తివిజ్ఞానము:-

సృష్టికార్యమునెరపుటకు ప్రజాపతిస్త్రీపురుషుల రంచించెను. మైదునక్రియద్వారా పురుషువీర్యము స్త్రీగర్భము నందుని నషిప్తమైపురుషరూపమునవృద్ధిపొంది.తొమ్మిది మాసములు నిండినపిమ్మట జననమొందును. శాస్త్రీయముగా లైంగికవిద్యతెలిసినవారు అశాస్త్రీయపద్దతులచరించక. సంతానప్రాప్తి నొందెదరు. కావున పూర్వపు ఋషులుమునులు కూడ శాస్త్రాపద్ధతిలో ఉపదేశించిరి.

పురుషుడు బ్రహ్మచర్యవ్రతము నాచరించుచు. వీర్య స్థలముకాకుండా వీర్యసేచటనము గావించవలెను. ధర్మపత్ని ఋతుస్నానమైనవాడు మంత్రపూతముగా అగ్నిహోత్రదికర్మల నాచరించి సత్సంతానప్రాప్తికి శాస్త్రాను సారము ఉచిత ఆహారము పత్నిసహితముగా భుజించవలెను. భార్యకు సంతానప్రాప్తికొరకు. మైదున క్రియకు ప్రోత్సాహపరచి మైదున క్రియజరువలెను. స్త్రీయు సంతానకాంక్షతో వీర్య సేచనముచేసి, గర్భమునందుని షిప్తముచేసి ఉచితతీరతిన వృద్ధిపొందించుటకు దోహదము చేయవలెను.తల్లియొక్క శరీరక, మానసిక ఆరోగ్యముపై బిడ్డయొక్క ఆరోగ్యము ఆధారపడియుండును. గానతల్లి గర్భవదికా నున్నప్పుడు జాగరూకతదహించవలెను. సంతానోత్పత్తియైనపిదప మంత్రపూతముగా అన్ని హాత్రాదికర్మల ననుష్టించుచు. శిశువునకు మదుఘృతాదులు సేవింపవలెను. పిమ్మటనామకారణము జరిపించవలెను విశిష్ఠజ్ఞానసంపన్నులగు బ్రాహ్మణునకు కలుగు పుత్రులు శ్రీ, యశస్సు బ్రహ్మతేడముల ద్వారా సర్వోచ్చస్థితినిపొందెదరు.

బృహదారణ్యకోపనిషత్తు సమాప్తము

ఓం తత్‌సత్‌, ఓం తత్‌సత్‌, ఓం తత్‌సత్‌.

ఓం శాంతిః శాంతిః శాంతిః

-------

SARA SUDHA CHINDRIK    Chapters