Sri Tattvamu    Chapters   

మనవి

అనేకజన్మ సుకృత పరిపాకమైన మానవజన్మ సార్థకమగుటకు సద్గురుప్రాప్తి ముఖ్యము. ఇదియు నదృష్టవిశేషమె. ఈ యదృష్టము అందరకు అభించదు. గురూపదిష్టమంత్రసాధనా ఫలము గుర్వనుగ్రహయు వలననే లభించును. మంత్రము, తదధిదేవత, గురువు-ఈత్రయమును అభేదభావనతో భావించిన శిష్యుడు చరితార్థుడు - శ్రీ మఱ్ఱిపాటి వెంకటనరసింహారావు గారు గురుప్రసాదమున తమ యిష్టదేవతానుగ్రహమును బడసిరి. గుర్వనుగ్రహము శిష్యునియెడ యెట్లు ఫలించినది, శిష్యుని సాధనాఫలితము, గురుభక్తిప్రభావము ఈ గ్రంథము వలన వ్యక్తమగును.

బ్ర|| శ్రీ|| ఈశ్వర సత్యనారాయణశర్మగారి శిష్యవాత్సల్యమునకీగ్రంథమే నిదర్శనము. శ్రీ శర్మగారి దర్శనమాత్రముననే భక్తిభావ ముదయించును. వారి బోధలు జ్ఞానోదయ బాలభాస్కరుని కాంతి పుంజము. నాయందు అవ్యాజ వాత్సల్యము గల శ్రీశర్మగారికి హృదయపూర్వక నమస్కారములు.

మా సాధన గ్రంథమండలిలో నీ '' శ్రీ తత్త్వము'' ప్రకటించి, సాధకుల కరకమలములందుంచుటకు ఉత్సాహముతో సంపూర్ణ సహకారమిచ్చిన శ్రీతత్త్వ కృతికర్తలు, ఆవులు శ్రీ వెంకటనరసింహారావుగారికి మండలి తరపున కృతజ్ఞాతాపూర్వక ధన్యవాదములు.

శోభకృత్‌ భాద్రపదము

తెనాలి. 9-9-63

బులుసు సూర్య ప్రకాశశాస్త్రి వ్యవస్థాపకుడు: సాధన గ్రంథమండలి.

Sri Tattvamu    Chapters