Sri Naradapuranam-3    Chapters    Last Page

ఏకాశీతితమోధ్యాయః = ఎనుబదియొకటవ అధ్యాయము

వసు చరిత్ర నిరూపణమ్‌

వసురువాచ :

యదేతత్కీర్తితం దేవి తీర్థమాహాత్మ్యముత్తమమ్‌ | తల్లభస్య మహాభాగే! చరిత్వా తీర్థమండలమ్‌ 1

అహం బ్రహ్మాణ మామన్త్య్ర పితరం చ నరేశ్వరి! | బృన్దావన ముపాగమ్య చరిష్యామి మృగైస్సహ 2

వసువు పలికెను:- ఓ మోహినీ! ఇపుడు నీకు చెప్పినతీర్థమాహాత్మ్య విధిని అనుసరించి తీర్థమండమును పర్యటించి ఫలమును పొందుము. నేను కూడా నీ తండ్రి యగు బ్రహ్మతో సంభాషించి బృన్దావనమును చేరి మృగములతో కలిసి సంచరించెను.

సూత ఉవాచ :-

ఇత్యుక్త్వా మోహినీం విప్రా వసుస్తస్యాః పురోహితః | సత్కృత్య పూజితోభీక్షం బ్రహ్మలోకం య¸° తధా 3

స గత్వా తత్ర ధాతారం బ్రహ్మణం జగతాం విధిమ్‌ | ప్రణమ్య మోహినీ వృత్తం తం కార్న్య్సైన న్యవేదయత్‌ 4

తచ్ఛ్రుత్వా వచనం బ్రహ్మ బ్రాహ్మణస్య వసోర్ద్విజాః | ప్రసన్నః ప్రాహ తం వత్స సుకృతం హి త్వయా కృతమ్‌ 5

యా మయా మోహినీ విప్ర దేవకార్యార్థ మాత్మజా | నియుక్తా కృతకార్యా సా త్వయా శప్తా క్షయం గతా 6

భూ మమాజ్ఞయా వత్స త్వయామోసా జీవితాధునా | నీతా కృతార్ధతాం తస్మా త్కోన్యస్త్వత్తో ధికః కృతీ 7

యత్త్వయా మహ్యమాఖ్యాతం మోహినీ వృత్త ముత్తమమ్‌ | ప్రసన్న స్తేన దాస్యామి బ్రూహి తుభ్యం వరం ద్విజ 8

ఇత్యుక్త స్స ద్విజస్తేన బ్రహ్మణా లోకభావినా | ప్రణమ్య వవ్రే స వరం బృన్దారణ్య నివాసనమ్‌ 9

తచ్ఛ్రుత్వా జగతాం ధాతా స్మయమాన శ్చతుర్ముఖః | ప్రాహ ప్రపన్నార్తిహర సప్తధాస్త్వితి మునీశ్వరాః 10

స ప్రణమ్య విధాతారం వసుర్హృష్ట మనాస్తతః | బృన్ధావన ముపావ్రజ్య తప శ్చక్రే సమాహితః 11

తపతస్తస్యతు వసో స్సంవత్సర గణా ద్విజా | వ్యతీయుః పంచసాహస్రా స్తతస్తుష్టో హరి స్స్వయమ్‌ 12

గోపైః ప్రియసఖైర్ద్విత్రై ర్యుతో భ్యాహ ద్విజోత్తమమ్‌ | బ్రూహి కిం కృణుషే విప్ర తుష్టోహం తపసా తవ 13

తతస్స వసురుత్థాయ అష్టాంగాలింగితావనిః | ప్రాహ బృన్దావనే దేవ వాసమిచ్ఛామి సర్వదా 14

అధ విష్ణుర్ద్విజ శ్రేష్ఠా వరం తద్వాంఛితం దదౌ | తేనాభి వందితో భూయో హ్యంతర్ధాన ముపాగతః 15

సద్విజస్త త్ర్పభృత్యేవం స్వేచ్ఛా రూపధర స్థ్సితః | చిన్త యన్స తతం దేవం బృన్దారణ్య కుతూహలమ్‌ 16

కదా చిద్యమునాతీరే నివిష్ట స్తం విచిన్త యన్‌ | దదర్శ నారదం ప్రాప్తం బృన్దారణ్యం విధేస్సుతమ్‌ 17

స తం దృష్ట్వా నమస్కృత్య పరమం గురు మాత్మనః | పప్రచ్ఛ వివిధా న్థర్మాన్‌ భగవద్భక్తి వర్ధనాన్‌ 18

సతే నైవం సుసంసృష్టో నారదో ధ్యాత్మదర్శనః | తసై#్మ ప్రోవాచ నిఖిలం భవిష్య చ్చరితం హరేః 19

సూత మహర్షి పలికెను :- పురోహితుడగు వసువు మోహినితో ఇట్లు చెప్పి మోహినిచే చక్కగా పూజాసత్కారములు చేయబడినవాడై బ్రహ్మలోకమునకు వెళ్ళెను. అచట జగద్విధియగు బ్రహ్మకు నమస్కరించి మోహినీ చరిత్ర నంతటిని జరిగినది జరిగినట్టుగా విన్నివించెను. వసువు మాటలను వినిన బ్రహ్మ సంతోషించి నీవు మంచి పని చేసితివి. నేను మోహినిని దేవకార్యార్ధము నియోగించితిని. కాని దేవకార్యము చేయకమునుపే నీచే శపించబడి మృతి చెందెను. మరల నాయాజ్ఞచే నీవామెను బ్రతికించితివి కృతార్థుశాలను చేసితివి. కావున నీ కంటె అధిక పుణ్యాత్ముడెవడు? ఇపుడు నీవు నాకు చెప్పిన మోహినీ చరితమును విని ప్రసన్నుడనైతిని. కావున నీకు వరమునిచ్చెదను. ఏమి కావలయునో కోరుము అని పలికెను. లోకభావియగు బ్రహ్మా ఇట్లు పలుకగా బ్రాహ్మణోత్తముడగు వసువు ప్రణామమునాచరించి బృన్దావననివాసమును వరముగా కోరెను. ఆ మాటలను వినిన బ్రహ్మ చిరునవ్వు నవ్వి అట్లే కానిమ్మని పలికెను. అంతట వసువు సంతోషముతో బ్రహ్మకు నమస్కరించి బృన్దావనమును చేరి తపము నాచరించెను. వసువు తపస్సు చేయుచుండగా ముగ్గురు ప్రియ మిత్రులతో కూడి శ్రీహరి సాక్షాత్కరించి వసువుతో ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణోత్తమా నేను నీ తపస్సునకు సంతోషించితిని ఏమి కావలయునో కోరుము. అంతట వసువు లేచి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి దేవా! ఎల్లపుడూ బృన్దావన నివాసమును కోరుచున్నాను అని పలికెను. శ్రీహరి వసువు కోరికను తీర్చి నమస్కారములనంది అంతర్ధానమును చెందెను. ఆ వసువు అప్పటి నుండి స్వేచ్ఛారూపధరుడై బృన్దావనమున నుండెను. బృందారణ్యకుతూహలయగు శ్రీకృష్ణ భగవానుని ధ్యానించి చుండెను. ఒకపుడు యమునాతీరమున కూర్చొని శ్రీకృష్ణ భగవానుని చింతించుచు బ్రహ్మమానస పుత్రడగు నాదర మహర్షిని దర్శించెను. తనకు పరమ గురువగు నాదర మహర్షిని చూచి నమస్కరించి భగవద్భక్తి వర్ధకములగు పలు ధర్మములు నడిగెను. వసువు ఇట్లడుగగా అధ్యాత్మజ్ఞానము గల నాదర మహర్షి శ్రీహరి భవిష్యచ్చరితమును వసువునకు తెలిపెను.

ఏకదాహం గతో విప్ర దేవం కైలాస వాసినమ్‌ | ద్రుష్ఠుం ప్రష్టుం భవిష్యచ్చ బృన్దావన రహస్యకమ్‌ 20

తతః ప్రణమ్య దేవేశం తతస్సిద్ధై స్సమావృతమ్‌ | మహేశం స్వమహివ్యాప్త సర్వ బ్రహ్మండ గోలకమ్‌ 21

అపృచ్ఛ మీప్సితం భద్రం స మాం ప్రాహ స్మయ న్హరః | వైధాత్ర యత్త్వయా పృష్టం హరేర్వృత్తమనాగతమ్‌ 22

తత్తే బ్రవీమి యత్పూర్వం శ్రుతం సునభి వక్త్రతః | ఏకదా సురభిర్దృష్టా మయా గోలోక మధ్యగా 23

స్వసంతాన సమాయుక్తా సుప్రీతా స్నిగ్ధ మానసా | తతః పృష్టా భవిష్యార్ధే గవాం మాతా పయస్వినీ 24

మహ్యం ప్రోవాచ దే వర్షే భవిష్య చ్చరితం హరేః | సుఖమాస్తే ధునా దేవః కృష్ణో రాధా సమన్వితః 25

గోలోకేస్మి న్మహె శాన గోపగోపీ సుఖావహః | స దాచిద్ధరాలోకే మాదురే మండలే శివ 26

ఆవిర్భూయాద్భుతాం క్రీడాం బృన్దారణ్య కరిష్యతి | వృషభానుసుతా రాధా శ్రీదామానం హరేః ప్రియా 27

సఖాయం విరజాగేనా ద్వాస్థ్సం క్రుద్ధా శపిష్యతి | తతస్సోపి మహాభాగ రాధాం ప్రతిశపిష్యతి 28

యాహి త్వం మానుషం లోకం మిధ శ్శాపాద్ధరాం తతః | ప్రాప్స్యత్యధ హరిః పశ్చా ద్బ్రహ్మణా ప్రార్థితః క్షితౌ 29

భూభార హరణాయైవ వాసుదేవో భవిష్యతి | వసుదేవ గృహే జన్మ ప్రాప్య యాదవ నందనః 30

కంసాసురభియా పశ్చా ద్ర్వజం నన్దస్య యాస్యతి | తత్ర యాతో హరిః ప్రాప్తాం పూతనాం బాలఘాతినీమ్‌ 31

వియోజయిష్యతి ప్రాణౖ శ్చక్రవాతం చ దానవమ్‌ | వత్సాసురం మహాకాయం హనిష్యతి సురార్దనమ్‌ 32

దమిత్వా కాలియం నాగశిం యమ్యా ఉచ్చాటయిష్యతి | దుస్సహం ధేనుకం హత్వా బకం తద్వదఘాసురమ్‌ 33

దావం ప్రదావంచ తధా ప్రలంబం చ హనిష్యతి | బ్రహ్మాణ మిన్ద్రం వరుణం ప్రమత్తౌ ధనదాత్మజౌ 34

విమదాన్స విధాయేశో హనిష్యతి వృషాసురమ్‌ | శంఖ చూడం కేశినం చ వ్యోమం హత్వా వ్రజే వసన్‌ 35

ఏకాదశ సమాస్తత్ర గోపీభిః క్రీడయిష్యతి | తతశ్చ మధురాం ప్రాప్య రజకం సంనిహత్య చ 36

కుబ్జా మృజ్వీం తతః కృత్వా ధనుర్భంక్త్వా గజోత్తమమ్‌ | హత్వా కువలయా పీడం మల్లాంశ్చాణూర కాదికాన్‌ 37

కంసం స్వమాతులం కృష్ణో హనిష్యతి తతః పరమ్‌ | విముచ్య పితరౌ బద్ధౌ యవనేశం నిహత్య చ 38

జరాసంధ భయాత్కృష్ణో ద్వారకాయాం సముష్యతి | రుక్మిణీం సత్యభామాంచ సత్యాం ఆంబవతీం తధా 39

కైకేయీం లక్ష్మణాం మిత్ర విందాం కాలిందికాం విభుః | దారాన్షోడ శసాహస్రా భౌమం హత్వోద్వహిష్యతి 40

పౌండ్రకం శిశుపాలం చ దంతవక్త్రం విదూరధమ్‌ | శాల్వంచ హత్వా ద్వివిదం బల్వలం ఘాతయిష్యతి 41

వజ్రనాభం సునాభం చ సార్ధం వై షట్సురాలయైః | త్రి శరీరం తతో దైత్యం హనిష్యతి వరోర్జితమ్‌ 42

కౌరవా న్పాండవాం శ్చాపి నిమిత్తమితరేతరమ్‌ | కృత్వా హనిష్యతి శివో భూభారహరణోత్సుకః 43

యదూన్యదుభిర న్యోన్యం సంహృత్య స్వకులం హరిః | పునరేతన్నిజం ధామ సమేష్యతి చ సానుగః 44

ఏతత్తే భిహితం శంభో భవిష్యచ్చరితం హరేః | గచ్ఛ ద్రక్ష్యసి తత్సర్వం జగతీతలగే హరౌ 45

తచ్ఛ్రుత్వా సురభేర్వాక్యం భృశం ప్రీతో విధాతృజ | స్వస్థానం పునరాయాత స్తుభ్యం చాపి మయోదితమ్‌ 46

త్వం చ ద్రక్ష్యసి కాలేన చరితం గోకులేశితుః | తచ్ఛ్రుత్వా శూలినో వాక్యం వసుర్హృష్ట తనూరుహః 47

గాయన్మాద్యా న్విభుం తంత్ర్యా రమయామ్యాతురం జగత్‌ | ఏతద్భవిష్య కధితం మయా తుభ్యం ద్విజోత్తమ 48

యధా తు గౌతమస్తద్వ దహం చాపి హితే రతః

ఓ బ్రాహ్మణోత్తమా! ఒకసారి నేను కైలాసవాసియగు శంకరుని దర్శించుటకు భవిష్యద్బృన్దావన రహస్యమును అడుగుటకు కైలాసమునకు వెళ్ళితిని. అపుడు నేను సిద్ధసమావృతుడు తన మహిమచే జగత్తునంతటిని వ్యాపించియున్న శంకరునికి నమస్కరించి నా ఈప్సితమును అడిగితిని. అంతట శంకరుడు చిరునవ్వు నవ్వుచు ఇట్లు పలికెను. ఓ నారదా! నీవిపుడడిగిన శ్రీహరి భవిష్యచ్చరిత్రను నేను సురభివదనమునుండి వింటిని. ఇపుడు దానిని నీకు చెప్పెదను. ఒకపుడు నేను గోలోకమధ్యలో నున్న, స్వసంతానసహిత, సుప్రీతురాలు, సుస్నిగ్ధమానస యగు సురభిని చూచితిని. అపుడు నును పయస్విని యగు గోమాతను శ్రీహరి భవిష్యచ్చరితమును అడిగితిని. అపుడు నాకు సురభి శ్రీహరి భశిష్యచ్చరితమును తెలిపెను. ఓ శంకరా ఇపుడు శ్రీకృష్ణ భగవానుడు రాధాసమన్వితుడై గోపాలక గోపికలకు సుఖమును కలిగించుచు ఈ గోలోకమున ఆనందముగా నున్నాడు. అతను కొంతకాలమునకు భూలోకమున మధురా మండలమున ఆవిర్భవించి బృన్దారణ్యమున క్రీడించును. వృషభాను సుతయగు శ్రీహరి ప్రియురాలగు రాధ విరాజాగేహద్వారస్థుడగు శ్రీహరి మిత్రుని శ్రీదాముని కోపించి శపించును. శ్రీదాముడు కూడా నీవు మానుషలోకమున పుట్టుమని శపించును. ఇట్లు ఇద్దరూ శాపముచే భూలోకమున పుట్టెదరు. తరువాత బ్రహ్మ ప్రార్థనచే శ్రీహరి భూభారమును హరించుటకు భూలోకమున వసుదేవ పుత్రునిగా అవతరించును. వసుదేవుని ఇంటిలో పుట్టి తరవాత కంసుని బయముచే వ్రేపల్లెకు చనును. అచట నుండి శ్రీహరి కంసుని పంపున వచ్చిన బాలఘాతిని యగు పూతనను, సుడిగాలి రూపమున వచ్చిన తృణావర్తుని సంహరించును. అట్లే మహాకాయుడు దేవపీడాకరుడగు వత్సాసురుని సంహరించును. బ్రహ్మను, ఇంద్రుని, వరుణుని, మదించిన కుబేర పుత్రులను గర్వరహితులను చేసి వృషాసురుని సంహరించును. శంఖచూడుని, కేశిని, వ్యోమాసురుని సంహరించి వ్రేపల్లెలో నివసించుచు పదకొండు సంవత్సరములు గోపిలకతో క్రీడించును. తరువాత మధురానగరమును చేరి రజకుని సంహరించి, కుబ్జను చక్కగా చేసి, దనుర్భంగము గావించి కువలయాపీడమను గమును సంహరించి చాణూరాది మల్లులను పరిమార్చి తన మేనమామయగు కంసుని సంహరించును. కారాగారబద్ధులగు తన తలిదండ్రులను విడిపించి, కాలయవనుని సంహరించి, జరాసంధ భయము వలన ద్వారకానగరమున నివసించును. రుక్మిణిని, సత్యభామను, సత్యను, జాంబవతిని, కైకేయిని, లక్ష్మణను, మిత్రవిందను, కాలిందిని వివాహమాడును. తరువాత నరకాసురుని సంహరించి పదునారు వేల రాజ కన్యలను విమాహమాడును. పౌండ్రకుని, శిశుపాలుని, దంత వక్త్రుని, విదూరధుని శాల్వుని, ద్వివిధుని సంహరించును. వజ్రనాభుని, సునాభుని, షట్సురాలయులతో, త్రిశిరదైత్యుని సంహరించును. కౌరవపాండవులకు పరస్పరము కలహమును కలిగించి భూభారహరణమును కోరి సంహరించును. యాదవులకు యాదవులచే పరస్పరము వైరమును కలిగించి స్వకులమును హరింప చేయును. అపుడు మరల తన నివాసమునకు చేరును. ఓ శంకరా! ఇది శ్రీహరి భవిష్యచ్చరితము. నీకు చెప్పితిని. ఇక నీవు వెళ్ళుము. శ్రీహరి భూతలమునకు వెళ్ళినపుడు దీనినంతటిని చూడగలవు. ఇట్లు సురభి చెప్పిన శ్రీహరి చరితమును విని నా నివాసమునకు చేరితిని. దానినే ఇపుడు నీకు చెప్పితిని. నీవు కూడా ఈ సమయమున శ్రీ గోపీపతి చరితమును చూడగలవు. ఇట్లు తెలిపిన శంకరుని మాటలను వినిన వసువు సంతోషముచే పులకితగాత్రుడయ్యెను. వీణానాదముచే శ్రీహరిని గానము చేయుచు ఆనందించుచు జగత్తును ఆనందింపచేయుచున్నాను అని నారదుడు పలికెను. ఇది శ్రీహరి భవిష్యచ్చరితము. నీ హితమును కోరి నీకు తెలిపితిని.

సూత ఉవాచ :-

ఇత్యుక్త్వా నారదస్తసై#్మ వసవే స ద్విజన్మనే 49

జగామ వీనాం రణయం శ్చిన్తయన్యదునందనమ్‌ | సవసుస్తద్వచశ్శ్రుత్వా వ్రజే సుప్రీతమానసః 50

ఉవాస సర్వదా విప్రాః కృష్ణక్రీడేక్షణోత్సుకః 51

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ బృహదుపాఖ్యానే ఉత్తరభాగే వసుమోహినీ సంవాదే

వసుచరిత్ర నిరూపణం నామ ఏకాశీతితమోధ్యాయ!

సూతమహర్షి పలికెను:- ఇట్లు నారదమహర్షి బ్రాహ్మణోత్తముడగు వసువునకు తెలిపి, వీణా నాదము గావించుచు, యదునందనుని ధ్యానించుచు వెడలెను. ఆ వసువు కూడా నారదమహర్షి మాటలను విని బృందావనమున పరమప్రీతిచే నివసించెను. అచట ఎల్లకాలము బ్రాహ్మణులు శ్రీ కృష్ణభగవానుని క్రీడలను చూడగోరుచుందురు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున

బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున

వసుమోహినీ సంవాదమున వసుచరిత్ర

నిరూపణమను ఎనుబడియొకటవ

అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page