Sri Naradapuranam-3    Chapters    Last Page

ఏకోనాశీతి తమోధ్యాయః - డెబ్బది తొమ్మిదవ అధ్యాయము

మధురా మాహాత్మ్యము

మోహిన్యువాచ :-


శ్రుతం హ్యవన్త్యా మాహాత్మ్యం వసో పాపహరం నృణామ్‌ | అధునా శ్రోతుమిచ్ఛామి మహాత్మ్యం మధురాభవమ్‌ 1
మోహిని పలికెను :-
ఓ వసూ ! నరుల పాపములను హరించు అవన్తీ మాహాత్మ్యమును వింటిని. ఇపుడు మధురా మాహాత్మ్యమును వినగోరుచున్నాను.
వసురువాచ :-
శృణు మోహిని వక్ష్యామి మధురాయాశ్శుభావహామ్‌ | వైభవం యత్ర భగవా ఞాతః పద్మభువార్థితః 2
ఆవిర్భూయ విభుస్తత్ర సంప్రాప్తో నందగోకులమ్‌ | తత్ర స్థిత్వా ఖిలాః క్రీడా శ్చచార సహ గోపకైః 3
హత్వా చ కంసప్రహితా న్పూతనా దీన్ని శాచరాన్‌ | విజహార స గోపీభి ర్వనేషు ద్వాదశస్వపి 4

వనేషు యాని తీర్థాని సన్తి యాని చ మాధురే | తాని తే
%హం ప్రవక్ష్యామి శృణు మోహిని సాంప్రతమ్‌ 5
ఆద్యం మదువనం నామ స్నాతో యత్ర నరోత్తమః | సంతర్ప్య దేవర్షి పితౄ న్విష్ణులోకే మహీయతే 6
అధ తాలాహ్వయం దేవి ద్వితీయం వనముత్తమమ్‌ | యత్ర స్నాతో నరో భక్త్యా కృతకృత్యః ప్రజాయతే 7
కుముదాఖ్యం తృతీయం తు యత్ర స్నాత్వా సులోచనే | లభ##తే వాంఛితా న్కామా నిహాముత్ర చ మోదతే 8
తతః కామ్యవనం నామ చతుర్థం పరికీర్తితమ్‌ | బహుతీర్థాన్వితం యత్ర గత్వా స్యాద్విష్ణులోకభాక్‌ 9
యత్తత్ర విమలం కుండం సర్వతీర్థోత్తమోత్తమమ్‌ | తత్ర స్నాతో నరో భ##ద్రే లభ##తే వైష్ణవం పదమ్‌ 10
పంచమం బహులాఖ్యంతు వనం పాప వినాశనమ్‌ | యత్ర స్నాతస్తు మనుజః సర్వాన్కామానవాప్నుయాత్‌ 11

అస్తి భద్రవనం నామ షష్ఠం స్నాతో
%త్ర మానవః | కృష్ణదేవ ప్రసాదేన సర్వభద్రాణి పశ్యతి 12
ఖాదిరంతు వనం దేవి సప్తమం యత్ర మానవః | స్నానమాత్రేణ లభ##తే తద్విష్ణోః పరమం పదమ్‌ 13
మహావనం చాష్టమం తు సదైవ హరివల్లభమ్‌ | తద్దృష్ట్వా మనుజో భక్త్యా శక్రలోకే మహీయతే 14
లోహజంఘం తు నవమం వనం యత్రాపన్లుతో నరః | మహావిష్ణుప్రసాదేన భుక్తిం ముక్తిం చ విన్దతి 15
బిల్వారణ్యం తు దశమం యత్ర స్నాతస్సుమధ్యమే | శైవం వా వైష్ణవం వాపి యాతి లోకం నిజేచ్ఛయా 16
ఏకాదశం తు భాండీరం యోగినామతిదుర్లభమ్‌ | యత్ర స్నాతో నరో భక్త్యా సర్వపాపైర్విముచ్యతే 17
బృన్దావనం ద్వాదశం తు సర్వపాపనికృంతనమ్‌ | యత్సమం న ధరాపృష్ఠే వనమస్త్యపరం సతి 18
యత్ర స్నాతస్తు మనుజో దేవర్షి పితృతర్పణమ్‌ | కృత్వా ఋణత్రయాన్ముక్తో విష్ణులో కేమహీయతే 19
వింశతిర్యోజనానాం తు మాదురం పరిమండలమ్‌ | యత్ర కుత్రా ప్లుతస్తత్ర విష్ణుభక్తిమవాప్నుయాత్‌ 20
తన్మధ్యే మధురా నామ పురీ సర్వోత్తమోత్తమా | యస్యా దర్శన మాత్రేణ భక్తిం విందతి మాధవే 21
విశ్రాంతి సంజ్ఞకం యత్ర తీర్దరత్నం నరేశ్వరి | తత్ర స్నాతో నరో భక్త్యా వైష్ణవం లభ##తే పదమ్‌ 22
విశ్రాంతేర్నికటే దక్షే విముక్తం తీర్ధముత్తమమ్‌ | తత్ర స్నాతో నరో భక్త్యా ముక్తి మాప్నోతి నిశ్చితమ్‌ 23

తతో
%పి దక్షిణ భాగే రామతీర్ధం జనేశ్వరి | యత్ర స్నాతో నరో%జ్ఞాన బంధాన్ముక్తో భ##వేద్ధ్రువమ్‌ 24
సంసారమోక్షణం తస్మా ద్దక్షిణ తీర్దముత్తమమ్‌ | తత్ర స్నాత్వా తు మనుజో విష్ణులోకే మహీయతే 25
ప్రయాగాఖ్యం తతో దక్షే తీర్ధం త్రిదశదుర్లభమ్‌ | స్నాతస్తత్ర నరో దేవి అగ్నిష్టోమఫలం లభేత్‌ 26
తతః కనకలం తీర్ధం యత్ర స్నాతో నరస్సతి | స్వర్గమాసాద్య దేహాంతే మోదతే నన్దనాదిషు 27
తద్దక్షేతిందుకం తీర్ధం యస్మిన్‌స్స్నాతో నరోత్తమః | రాజసూయఫలం ప్రాప్య దివి మోదతే దివి దేవవత్‌ 28
తతఃపరం పటుస్వామి తీర్ధం భాస్కర వల్లభమ్‌ | స్నాత్వా యత్ర రవిం దృష్ట్వా భుక్తభోగో దివం వ్రజేత్‌ 29
తస్మాదక్షిణతో భ##ద్రే ధ్రువతీర్ధమనుత్తమమ్‌ | యత్ర స్నాతో ధ్రువం దృష్‌వా లభ##తే వైష్ణవం పదమ్‌ 30
ధ్రువతీర్ధాత్తతో దక్ష తీర్థం సప్తర్షిసేవితమ్‌ | తత్ర స్నాత్వా మునీన్దృష్ట్వా ఋషిలోకే స మోదతే 31
దక్షిణ ఋషి తీర్ధస్య మోక్షతీర్ధమనుత్తమమ్‌ | యత్ర వై స్నాన మాత్రేణ ముచ్యతే సర్వపాపతః 32
తద్దక్షే బోధినీతీర్థం స్నాత్వా యత్‌ తు మానవః | దత్వా పిండం పితృభ్యశ్చ నయేత్తాంస్త్రిదశాలయమ్‌ 33
తద్దక్షేకోటి తీర్ధం వై యత్ర స్నానేన మానవః | సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకమవాప్నుయాత్‌ 34
విశ్రాంతేరుత్తరేభాగే తీర్ధమస్త్యసి కుండకమ్‌ | యత్ర స్నాతో నరో దేవి వైష్ణవం లభ##తే పదమ్‌ 35
వసువు పలికెను :- మోహినీ! శుభావహమగు మధురామాహాత్మ్యమును చెప్పెదను. వినుము ఈమధురలో బ్రహ్మప్రార్ధనచే శ్రీహరి జన్మించెను. మధురలో ఆవిర్భవించి నందగోకులమును చేరెను. నన్దగోకులమున నివసించి గోపకులతో నానా క్రీడలనాచరించెను. కంసుడు పంపిన పూతనాది రాక్షసులను సంహరించి ద్వాదశవనములలో గోపికలతో విహరించెను. ద్వాదశవనములలో కలతీర్ధములను, మధురలో గల తీర్ధములను ఇపుడు నీకు చెప్పెదను వినుము. మొదటిది మధువనము. ఇచట స్నానమాడి పితరులకు దేవతలకు తర్పణము నాచరించినవారు విష్ణులోకమున విరాజిల్లెదరు. ఇక రెండవది తాలవనము. ఇచట స్నానమాడినవారు కృతకృత్యులయ్యెదరు. మూడవది కుముదవనము. ఇచట స్నానమాడినవారు వాంఛితార్ధములను పొంది. ఇహపరములందు ఆనందింతురు. నాలుగవది కామ్యవనము. ఇచటికి వెళ్లిన వారు విష్ణులోకమును పొందెదరు. ఇచట చాలా తీర్ధములు కలవు. వాటిలో విమలకుండము సర్వతీర్ధోత్తమోత్తమము. ఇచట స్నానమాడిన వారు విష్ణుపదమును చేరెదరు. అయిదవది బహులావనము. ఇచట స్నానమాడినవారు సర్వాభీష్టములను పొందెదరు. ఆరవది భద్రవనము. ఇచట స్నానమాడినవారు శ్రీకృష్ణానుగ్రహముతో సర్వభద్రములను బడయగలరు. ఏడవది ఖాదిరవనము. ఇచట స్నానమాత్రముననే పరమపదమును పొందెదరు. ఎనిమిది శ్రీహరికి ప్రియమగు మహావనము. భక్తితో ఈవనమును చూచినవారు ఇంద్రలోకమున విరాజిల్లెదరు. తొమ్మిదవది లోహజంఘవనము. ఇచట స్నానమాడినవారు మహావిష్ణుప్రసాదమున భుక్తి ముక్తులను పొందును. పదియవది బిల్వారణ్యము. ఇచటస్నానమాడినవారు ఇజేచ్ఛానుసారముగా శివలోకమును కాని విష్ణులోకమును కాని పొందగలరు. పదకొండవది యోగి దుర్లభమగు ఖాండీరవనము. ఇచట స్నానమాడినవారు సర్వపాపవినిర్ముక్తులగుదురు. ఇక పన్నెండవది సర్వపాపహరమగు బృందావనము. బృందావనసమమగుమరియొక వనము ఈ భూమండలముననే లేదు. ఇచట స్నానమాడి దేవర్షి పితృ తర్పణము గావించినవారు ఋణత్రయముక్తులై విష్ణులోకమున విరాజిల్లెదరు. మధురామండలము వింశతియోజనపరివ్యాప్తముగా ఉన్నది. ఈ మండలమున ఎచట పస్నానమాడిననూ విష్ణుభక్తిని పొందగలరు. ఈ మండల మధ్య భాగమును మధురానగరము సర్వోత్తమోత్తమము. ఈ నగరమునుదర్శించినంతనే మాధవ భక్తి కలుగును. ఇచటనే విశ్రాన్తి తీర్థము కలదు. ఇచట భక్తి చే స్నానమాడినవారు నిశ్చయముగా ముక్తిని పొందగలరు. ఇచటికి దక్షిణభాగమున రామతీర్థము కలదు. ఇచట స్నానమాడినవారు అజ్ఞానబంధమునుండి విముక్తులగుదురు. ఇచటికి దక్షిణమున సంసారమోక్షణతీర్ధము కలదు. ఇచట స్నానమాడిన వారు విష్ణులోకమున విరాజిల్లెదరు. ఇచటికి దక్షిణభాగమున దేవదుర్లభమగు ప్రయాగ తీర్ధముకలదు. ఇచట స్నానమాడినవారు అగ్ని ష్టోమ ఫలమును పొందెదరు. తరువాత కనకలతీర్ధము కలదు. ఇచట స్నానమాడినవారు దేహాంతమున స్వర్గమును పొంది నందనాదులలో విహరించెదరు. ఇచటికి దక్షిణమున తిందు తీర్ధము కలదు. ఇచట స్నానమాడినవారు రాజసూయఫలమును పొంది స్వర్గమున ఆనందింతురు. దాని తరువాత సటుస్వామితీర్ధము కలదు. ఇది భాస్కరప్రియము. ఇచట స్నానమాడి సూర్యసందర్శనమును గావించి భోగములననుభవించి స్వర్గమును పొందెదరు. ఇచటికి దక్షిణభాగమున ధ్రువతీర్ధము కలదు. ఇచట స్నానమాడి ధ్రువుని దర్శించినవారు విష్ణుపదమును పొందెదరు. ధ్రువ తీర్ధమునకు దక్షిణ భాగమున సప్తర్షిసేవిత తీర్ధము కలదున. అచట స్నానమాడి సప్తర్షులను దర్శించి ఋషిలోకమున ఆనందించును. ఋషితీర్ధమునకు దక్షిణమున ఉత్తమమగు మోక్షతీర్ధము కలదు. ఇచటస్నానమాత్రమున సర్వపాతకవినిర్ముక్తుడగును. ఇచటికి దక్షిణభాగమున బోధినీ తీర్ధము ఇచటస్నానముచేసి పితరులకు పిండప్రదానము చేసి వారిని స్వర్గమున చేర్చగలడు ఇచటికి దక్షిణ భాగమును కోటి తీర్ధము కలదు. ఇచట స్నానమాడిన సర్వపాపవినిర్ముక్తుడై విష్ణులోకమును పొందును. విశ్రాన్తితీర్ధమున కుత్తర భాగమున అసి కుండతీర్ధము కలదు. ఇచట స్నానమాడిన విష్ణు పదుమును చేరును.
అసి కుండస్య సౌమ్యే తు నవతీర్థం సులోచనే | యత్ర వై స్నానతో మర్త్య స్స్వర్గలోకే మహీయతే 36
తీర్థం సంయమనం నామ తత ఉత్తరతస్థ్సితమ్‌ | తత్ర స్నానేన దానేన యమలోకం న పశ్యతి 37
తదుత్తరే పరం తీర్థం ధారాయతనసంజ్ఞకమ్‌ | తత్ర స్నాత్వా తు మనుజః పితృభి స్సహ మోదతే 38
తదుత్తరే నాగతీర్థం యత్ర స్నానేన మోహిని | సర్వేభ్యోహ్యభయం లబ్ధ్వా స్వర్గే లోకే మహీయతే 39
తదుత్తరే బ్రహ్మలోకం ఘంటాభరణ కాహ్వాయమ్‌ | స్నానాత్పాపాపహరం తీర్థం బ్రహ్మలోకగతిప్రదమ్‌ 40
అస్మాత్సామ్యే పరం తీర్థం సోమాఖ్యం యత్ర సంప్లుతః | సోమలోక మావాప్నోతి మవాప్నోతి విపాపో మనుజోత్తమః 41
స్నాత్వా ప్రాచీసరస్వత్యాం తస్మాదుత్తరత శ్శుభే | యత్ర వై స్నానమాత్రేణ నరో వాగీశ్వరో భ##వేత్‌ 42
తదుత్తరే చక్రతీర్థం యత్ర స్నాతాస్తు మానవాః | జిత్వా శత్రుగణం స్వర్గే మోదతే యుగసప్తకమ్‌ 43
దశాశ్వమేధికం తీర్థం తస్మాదుత్తరతస్థ్సితమ్‌ | యత్ర స్నానేన సుభ##గే వాజిమేధఫలం లభేత్‌ 44
గోపర్ణాఖ్యం శివం తత్ర సంపూజ్య విధివన్నరః | సర్వాన్కామానవాప్యాన్తే శివలోకే మహీయతే 45
విఘ్నరాజాహ్వయం తీర్థం తస్మాదుత్తరతస్థ్సితమ్‌ | యత్ర స్నాత్వాహ్య విఘ్నేన సర్వకర్మఫలం లభేత్‌ 46
తదుత్తరే హ్యనంతాఖ్యం తీర్థం తత్రాప్లుతో నరః | చతుర్వింశతి తీర్థానాం మధురాణాం ఫలం లభేత్‌ 47
మధురాయణ మహాభాగే సాక్షాద్దేవో హరిస్థ్సితః | చతుర్వ్యూహస్వరూపేణ మాధురాణాం విముక్తిదః 48
ఏకా వారాహమూర్తిశ్చ పరా నారయణాహ్వయా | వామనాఖ్యా తృతీయా చ చతుర్థీ హలధారిణీ 49
చతుర్వ్యూహధరం దృష్ట్వా సమభ్యర్చ్య విధానతః | నరో ముక్తి మవాప్నోతి నాత్ర కార్యావిచారణా 50
రంగేశం చాపి భూతేశం మహావిద్యాం చ భైవరమ్‌ | దృష్ట్వా సంపూజ్య విధివత్‌ తీర్థయాత్రాఫలం లభేత్‌ 51
చతుస్సాముద్రికే కూపే కుబ్జాయాశ్చ గణశితుః | తథా కృష్ణాఖ్య గంగాయాం స్నాత్వా ముచ్యేత పాతకాత్‌ 52
సర్వస్య మాధురాఖ్యస్య మండలస్య శుభాననే | ఆధిపత్యే స్థితో దేవః కేశవః
క్లేశనాశనః 53
అదృష్ట్వా కేశవం భ##ద్రే మాధురే పుణ్యమండలే | జనిర్నిరర్ధకం తస్య సంసరేద్భవసాగరే 54
అన్యాన్య సంఖ్యతీర్థాని త్రత సన్తి శుభాననే | స్నాత్వా తేష్వపి దత్త్వా చ కించిత్తత్ర స్థితాయ చ 55
నరో న దుర్గతిం యాతి సత్యం తుభ్యం మయోదితమ్‌ | మధురాయశ్చ మాహాత్మ్యం శ్రావయేద్యశ్శృణోతి చ 56

సో
%పి భక్తిం హరాల్ల బ్ధ్వా సర్వాన్కామానవప్నుయాత్‌ 57
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ బృహదుపాఖ్యానే
ఉత్తరభాగే వసుమోహినీ సంవాదే
మధురామాహాత్మ్యవర్ణనం నామ

ఏకోనాశీతితమో
%ధ్యాయః
అసికుండముననుత్తర భాగమున నవతీర్థము కలదు. ఇచట స్నానమాడిన స్వర్గమును పొందును. ఇచటికి ఉత్తరమున సంయమనతీర్థము కలదు. ఇచట స్నానదానములతో యమలోకదర్శనము కాదు. ఇచటికి ఉత్తరమున ధారాయతన తీర్థము కలదు. ఇచట స్నానమాడినవారు పితరులతో కలిసి ఆనందింతురు. ఇచటికి ఉత్తరమున నున్న నాగతీర్థమున స్నానమాడినవారు సర్పములనుండి అభయమును పొందగలరు. ఇచటికి ఉత్తరమున గల ఘంటాభరణమను బ్రహ్మతీర్థమున స్నానమాడినవారు పాపవిముక్తులై బ్రహ్మలోకమును పొందెదరు. ఇచటికి ఉత్తరమున గల సోమ తీర్థమున స్నానమాడినవారు సోమలోకమును పొందెదరు. ఇచటికి ఉత్తరమున గల ప్రాచీ సరస్వతిలో స్నానమాడినవారు వాగీశ్వరులయ్యెదరు. ఇచటికి ఉత్తరముగల చక్రతీర్థమున స్నానమాడిన మానవులు శత్రువర్గమును జయించి స్వర్గమున ఏడు యుగములు ఆనందింతురు. ఇచటికి ఉత్తరమున గల దశాశ్వమేధిక తీర్థమున స్నానమాడిన అశ్వమేధఫలము లభించును. ఇచటనున్న గోకర్ణ శివుని యధావిధిగా పూజించినవారు ఇహమున సకలాభీష్టములను పొంది అంతమున శివలోకమును పొందెదరు. ఇచటికి ఉత్తరమున గల విఘ్నరాజతీర్థమున స్నానమాడినవారు నిర్విఘ్నముగా సర్వకర్మఫలమును పొందెదరు. ఇచటికి ఉత్తరమున గల అనన్త తీర్థమున స్నానమాడినవారు చతుర్వింశతి తీర్థముల ఫలమును పొందెదరు. మధురానగరమున సాక్షాత్తుగా శ్రీహరియే యున్నాడు. చతుర్వ్యూహరూపముతో ఇచటినుండి మధురావాసులకు ముక్తి ప్రదుడగుచున్నాడు. వారాహమూర్తి, నారయణమూర్తి, వామనమూర్తి, హలధరమూర్తి అని నాలుగు వ్యూహరూపములు. ఇట్లు చతుర్వ్యూహధరుని దర్శించి యధావిధిగా పూజించినవారు ముక్తిని పొందెదరు. రంగేశుని, భూతేశుని, మహావిద్యను, భైరవుని దర్శించి యధావిధిగా పూజించి తీర్థయాత్రాఫలమును పొందెదరు. చతుస్సాముద్రికకూపమున కుబ్జాకూపమున, గణశకూపమున, కృష్ణగంగయందు స్నానమాడినవారు పాపవిముక్తులగుదురు. సమగ్రమధురామండలాధిపత్యమున క్లేశనాశకుడగు మాధవుడు కలడు. మధురామండలమున కేశవుని దర్శించినవారి జన్మవ్యర్థము. వారు సంసారముననే పరిభ్రమించెదరు. ఇంకా ఇతర తీర్థములు అసంఖ్యాకములు కలవు. వాటియందు స్నానమాడి దానమాచరించినవారు దుర్గతిని పొందజాలరు. ఈ మధురామాహాత్మ్యమును వినినవారు వినిపించినవారు హరిభక్తిని పొంది సర్వాభీష్టములను బడయుదురు.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున బృహదుపాఖ్యానమున
ఉత్తర భాగమున వసుమోహినీసంవాదమున మధురామాహాత్మ్య
వర్ణనమను డెబ్బది తొమ్మిదవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    ంశష శగ|