Sri Naradapuranam-3    Chapters    Last Page

ద్విసప్తతి తమోధ్యాయః డెబ్బది రెండవ అధ్యాయమ

గౌతమాశ్రమ మాహాత్మ్యమ్‌

మోహిన్యువాచ :-


శ్రుతం పుష్కర మామాత్మ్యం వసో పాపప్రణాశనమ్‌ | గౌతమాశ్రమ మాహాత్మ్య మధునా కీర్తయ ప్రభో1
మోహిని పలికెను :-
వసూ ! పాప ప్రణావనమగు పుష్కర మాహాత్మ్యమును వింటిని. ఇపుడు గౌతమాశ్రమ మాహాత్మ్యమును తెలుపుము.
వసురువాచ :-
శృణు దేవి ప్రవక్ష్యామి గౌతమాశ్రమ ముత్తమమ్‌ | యత్ర గత్వా నరో భక్త్యా న భూయోర్హతి యాతనాః 2
గౌతమస్యాశ్రమం పుణ్యం దేవర్షి గణ సేవితమ్‌ | సర్వపాప ప్రశమనం సర్వోపద్రవ శాంతిదమ్‌ 3
సేవతే ద్వా దశాబ్దం యో భక్తి భావ సమన్వితః | స శైవం లభ##తే ధామ యత్ర గత్వాన శోచతి 4
మాయాదేవీ నుతోయత్ర తపస్యుగ్రే సమాస్థితః | తత్ర గోదావరీ గంగా సర్వపాతకనాశినీ 5
తపస్యతో మునేస్తస్య ద్వాదశాబ్దమ మర్షణమ్‌ | బభూవ ఘోరం విధిజే సర్వసత్త్వ క్షయం కరమ్‌ 6

తస్మిన్నుగ్రేతు దుర్భిక్షే క్షుత్‌క్షామా మునయో
%ఖిలాః | నానాదేశేభ్య ఆయాతా గౌతమస్యాశ్రమం శుభే 7
చక్రుర్విజ్ఞాపనం తస్య గౌతమస్య తపస్యతం | దేహినో భోజనం యేన ప్రాణాస్తిష్ఠన్తి వర్ష్మసు 8
ఏవం విజ్ఞాపితసై#్తస్తు మునిభి ర్గౌతమో మునిః | జాతానుకంపస్తానాహ వివ్వస్తా స్తపసోబలాత్‌ 9
వసువు పలికెను :
ఓ మోహినీ దేవీ! గౌతమాశ్రమ మాహాత్మ్యమును చెప్పెదను వినుము. ఇచటికి వెళ్ళిన వాడు మరల యాతనలను పొందడు. గౌతమాశ్రమము పరమ పావనము. దేవర్షి గణ సేవితము. సర్వపాప ప్రశమనము. సర్వోపద్రవ శాంతి కరము. ఈ ఆశ్రమమున భక్తి భావముతో పన్నెండు సంవత్సరములు సేవించినచో మరల దుఃఖము కలగని శివలోకమును చేరును. ఇచటనే మాయాదేవీ సుతుడు ఉగ్రతపమునాచరించెను. ఇచటనే సర్వపాతక నాశిని యగు గోదావరి గంగ కలదు. ఆ ఋషి తప మాచరించు చుండగా పన్నెండు సంవత్సరములు వర్షము కురియలేదు. ఇట్లు ఘోరమగు క్షామము సర్వ ప్రాణి భయంకరమాయెను. భయంకరమగు దుర్భిక్షమున సకల మునీశ్వరులు నానాదేశములనుండి గౌతమాశ్రమమునకొచ్చి తపమునాచరించుచున్న గౌతమునితో ఇట్లు పలికిరి. మా ప్రాణములు నిలుచుటకు మాకు భోజనము నిమ్ము అని. ఇట్లు పలుకగా గౌతము మహర్షి దయకలవాడై తనను నమ్మిన వారిని తపోబలముతో ఇట్లు పలికెను.
గౌతమ ఉవాచ :-
తిష్ఠధ్వం మునయస్సర్వే మమాశ్రమ సమీపతః | భోనం వః ప్రదాస్యామి యావద్ధుర్భిక్ష మాదృతః 10
విశ్వాసై#్యవ మృషీన్సర్వా న్గౌతమస్త పసోబలాత్‌ | దధ్యౌ ప్రసన్నమనసా గంగాం సర్వార్థ సాధినీమ్‌ 11
స్మృతమాత్రా తు సా దేవీ తత్రోద్భూతా ధరాతలాత్‌ | తాంతు దృష్ట్వా మునిర్గంగా సంప్లావిత ధరాతలామ్‌ 12
ప్రాతరుప్త్వా క్షితౌ శాలీ న్సక్వాన్మధ్యాహ్నకేలునాత్‌ | శాల్యన్నేన తతస్తేన తా నృషీన్సమ భోజయత్‌ 13
తతస్తే మునయః ప్రీతా భుక్త్వాన్నం తృప్తి మాగతాః | నివాసం చక్రిరే తత్ర గౌతమాశ్రమకే ముదా 14
ఏవం ప్రతిదినం భ##ద్రే శాలిభిః పక్వతాం గతైః | ఆతిధ్యం విదధే తేషాం భక్తి భావ సమన్వితః. 15
తతస్తస్య మునీన్ద్రస్య ద్విఆన్భోజయతోన్వహమ్‌ | వ్యతీయాయచ దుర్భిక్షం ద్వాదశాబ్దాంత కాలతః 16
తతస్తే మునయ స్సర్వే సుభిక్షే కాల ఆగతే | విజ్ఞాప్య తం మునిశ్రేష్ఠం జగ్ముర్దే శాన్స్వకాన్పునః 17
ఏవం ప్రభావస్సముని ర్గౌతమస్తత్ర మోహిని | తపస్తేపే బహుతిథం కాలం నియమితేంద్రియః 18
తతస్తస్తపసా తుష్టో భతవానంబికాపతిః | సగణో దర్శనం యాతో వరం బుూహీత్యువాచహ 19
తతో మునివరో దృష్ట్వా దేవ దేవ ముమాపతిమ్‌ | త్ర్యంబకం స నమశ్చక్రే నిపత్య భువి తత్పురః 20
తదుత్థాయ సహసా కృతాంలి రుపస్థితః | ప్రోవాచ దేహి మే భక్తిం పాదయోస్తవ నిత్యదా 21

మమాశ్రమ సమీపే
%త్ర పర్వతోపరి శంకర ! | త్వామేవ సంస్థితం పశ్యా మ్యేష ఏవ వరో మమ 22
ఇత్యుక్తః పార్వతీనాధో భక్తానాం వాంఛిత ప్రదః | తత్ర దత్వా స్వసాన్నిధ్యం సద్యః ప్రీతం చకారషతమ్‌ 23
తేన రూపేణ తత్రైవ న్యవ సత్ర్యంబక స్సతి | స గిరిస్త్య్రంబకాఖ్యస్తు తతః ప్రభృతి కీర్త్యతే 24
యే తు గోదావరీం గంగాం ప్రాప్య భక్తియుతా నరాః | స్నానం కుర్వన్తి సుభ##గే తేస్యుర్ముక్తా భవార్ణవాత్‌ 25
స్నాత్వా గోదావరీతోయే త్య్రంబకం యే గిరి స్థితమ్‌ | ఉపచారైః పూజయన్తి తేస్యు స్సాక్షాన్మహేశ్వరాః 26
త్య్రంబకస్య తు మాహాత్మ్యం సంక్షేపాద్వర్ణితం మయా | బ్రహ్మాపి విస్తరాద్వక్తుం తవ తాతః క్షమో నహి 27
తతో గోదావరీ యావ త్సాక్షాద్దర్శనతాం గతా | తావ దప్యాశ్రమా పుణ్యా స్తత్ర సంతి హ్యనేకశః. 28

తేషు స్నాత్వా విధానేన సంతర్ప్య పితృదేవతాః | నరో
%భిలాషితాన్కామా న్ర్పాప్నుయాన్నాత్ర సంశయః 29
ప్రకాశా తు క్వచిద్భద్రు క్వచిద్గుప్తా తతః పరమ్‌ | ప్లావయామాస ధరణీం పుణ్యాం గోదావరీ నదీ 30
యత్ర ప్రకటతాం యాతా నృణాం భక్త్యా మహేశ్వరీ | తత్ర తీర్థం మహాత్పుణ్యం స్నాన మాత్రా దఘాపహమ్‌ 31
తతః పంచవటీం ప్రాప్య సా దేవీ నియతవ్రతా | సుప్రకాశమనుప్రాప్తా లోకానాం గతి దాయినీ 32
గోదావర్యాం పసంచవట్యాం యస్స్నాయాన్నియత వ్రతః | స నరః ప్రాప్నుయా త్కామా నభీష్టాన్విధి నందిని 33
యదా త్రేతాయుగే రామః పంచవట్యా ముపాగతః | సభార్య స్సానుజస్తత్ర వసన్పుణ్యతరాం వ్యధాత్‌ 34
ఇత్యేతత్సర్వ మాఖ్యాతం గౌతమాశ్రజమం శుభే | శృణ్వతాం పఠతాం పుణ్యం పాపఘ్నం వాంఛితప్రదమ్‌ 35
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమునవసుమోహినీ సంవాదమున గౌతమాశ్రవమ మాహాత్మ్యమను దెబ్బది రెండవ అధ్యాయము
గౌతమ తపశ్చర్యాప్రభావ వర్ణనం నామ ద్విసప్తతి తమోధ్యాయః
గౌతమ మహర్షి పలికెను :-
మీరందరు నాయాశ్రమ సమీపమున నివసించుడు. కరువు ఉన్నంతవరకు మీకు భోజనము నిత్తును. ఇట్లు మునులందరిని ఓదార్చి గౌతమ మహర్షి తపోబలముచే ప్రసన్నమగు మనసుతో సర్వార్ద సాధని యగు గంగను ధ్యానించెను. తలచినంతనే గంగాదేవి అచట భూమినుండి ఉద్భవించెను. భూమిని తడిపిన గంగను చూచి గౌతమ మహర్షి ప్రాతః కాలమున బీజముల నాటి మధ్యాహ్నమున కోసిన ఆ వరియన్నముతో ఋషులను భుజింపచేసెను. ఆయన్నమును భుజించి మునులు తృప్తిని పొందిరి. ఆ గౌతమాశ్రమముననే నివసించిరి. ఇట్లు ప్రతిదినము పండిన వరిధ్యానముచే భక్తి భావముచే వారికి అతిధ్యము నిచ్చెను. ఇట్లు గౌతమ మహర్షి వారిని భుజింప చేయు చుండగా పన్నెండు సంవత్సరముల తరువాత దుర్బిక్షము తొలగి పోయెను. తరువాత ఆ ఋషులందరూ సుభిక్షము రాగానే గౌతమ మహర్షికి చెప్పి తమ తమ ప్రదేశములకు వెళ్ళిరి. ఆగౌతమ మహర్షి ఇంతటి ప్రభావము కలవాడు. చాలాకాలము ఇంద్రియ నిగ్రహముతో తపమునాచరించెను. తపస్సునకు సంతోషించిన శంకరుడు గణములతో ప్రత్యక్షమై వరమును కోరుమని పలికెను. అంతట గౌతమ మహర్షి దేవదేవుడగు ఉమాపతిని చూచి భూమి మీదపడి నమస్కరించెను. వెంనటే లేచి చేతులు జోడించి నాకు నిత్యము నీ పాద భక్తిని ప్రసాదించుము అని పలికెను. నా ఆశ్రమ సమీపమున ఈ పర్వతము మీద ఉన్న నిన్ను ఎప్పుడూ చూచుచుండవలయును. ఇదియే నాకు వరము. ఇట్లు పలుకగా భక్తవాంఛితప్రదుడగు పార్వతీనాధుడు అచట నిలిచి గౌతముని సంతోషింప చేసెను. అప్పటి నుండి ఆ పర్వతమునకు త్య్రంబకాచలమని పేరు కలిగెను. గోదావరి గంగను చేరి భక్తితో స్నానమాడు వారు సంసార సాగరము నుండి విముక్తులగుదురు. గోదావరీ జలమున స్నానమాడి పర్వతమున ఉన్న శంకరుని ఉపచారములచే పూజించు వారు సాక్షాత్తు మహేశ్వరులగుదురు. ఇట్లు నేను త్ర్యంబక మాహాత్మ్యమును సంక్షేపముగా తెలిపితిని. విస్తరముగా మీతండ్రి యగు బ్రహ్మకూడా వివరించ జాలడు. అచట గోదావరి కనుపడు వరము పవిత్రములగు ఆశ్రమము లనేకము కలవు. ఆయాశ్రమములలో స్నానమాడి పితృ దేవతలకు తర్పణము గావించిన వారు వాంఛితార్థములను తప్పక పొందెదరు. పవిత్రమగు గోదావరి నది కొన్నిచోట్ల ప్రకాశముగా కొన్ని చోట్ల గుప్త ముగా ఈ భూమిపై ప్రవహించుచు తడిసెను. గోదావరి ప్రకాశముగా నున్న ప్రాంతము పరమ పావనము. అచట స్నాన మాత్రమునకే సర్వపాప మరము. అచట నుండి పంచవటిని చేరి గోదావరి ప్రకాశ రూపమును పొందెను. పంచవటిలోని గోదావరి యందు స్నానమాడు వారు సకలాభీష్టములను పొందును. త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు భార్యతో అను జునితో పంచవటిని చేరి అచటి గోదావరిని పావనతమమును చేసెను. ఇట్లు నీకు గౌతమాశ్రమ మాహాత్మ్యమంతయూ వివరించితిని. ఈ మాహాత్మ్యము చదువు వారికి విను వారికి సకలాభీష్టములను ప్రసాదించును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున
వసుమోహినీ సంవాదమున గౌతమాశ్రమ మాహాత్మ్యమను
గౌతమ తపశ్చర్యా ప్రభావ వర్ణనమను డెబ్బది రెండవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page