Sri Naradapuranam-3    Chapters    Last Page

ఏకషష్టి తమోsధ్యాయః = అరువది యొకటవ అధ్యాయము

పురుషోత్తమ క్షేత్ర యాత్రా ఫల వర్ణనమ్‌

వసురువాచ :-

ఏవం తదా విధిసుతే కృష్ణం రామేణ సంగతమ్‌ l సుభద్రాం చ మహాభాగాం సంస్తువన్తి ముదాన్వితాః 1

వసువు పలికెను ః ఓ బ్రహ్మపుత్రీ! ఆ మహానుభావులగు దేవతలందరు బలరాముని శ్రీకృష్ణుని సుభద్రను స్తోత్రము చేయుదురు.

దేవా ఊచుః

éజయ జయ లోకపాల ! జయ పద్మనాభ! భూధరణ! l జయ జయ చాదిదేవ! బహుకారణ!

జయ జయ వాసుదేవ! జయసచ్చరణ! సత్కరణ! l జయ జయ దివ్య మీన! జయత్రిదశేశ్వర! 3

జయ జయ జలధి శయన! జయ జయ యోగీశ! జయ వేదధర! l జయ జయ విశ్వమూర్తే ! జయ చక్రధర! 4

జయ జయ భూతనాధ! జయ శ్రీనివాస! జయ జయ యోగివర! l జయ జయ సూర్యనేత్ర! జయ ధేవవరాహ! 5

జయ జయ కైటభారే! జయ జయ వేదవర! l జయ జయ కమలనాభ జయ శైలధర!

జయ జయ యోగీశ ! జయ వేగధర! జయ జయ భూతనాధ! జయ ధరణీ ధర! 8

జయ జయ శేషశాయి ఞ్జయ పీతవాస! l జయ సోమకాన్త! జయ యోగవాస! జయ జయ 9

గుణనిధాన జయ శ్రీనివాస జయ జయ 10

గరుడాసన! జయ సుఖనివాస! జయ జయ l జయ జయ దర్మకాంత! జయ జయ మతినివాస! 11

జయ జయ గహన గేహ నివాస!l జయ జయ యోగిగమ్య జయ మఖనివాస 12

జయ జయ వేదవేద్య! జయ శాంతికర!l జయ జయ యోగిచిన్త్య ! జయ పుష్టికర!

13

జయ జయ జ్ఞానమూర్తే ! జయ కమలాకర! జయ జయ భావవేద్య ! జయ ముక్తికర! 14

జయ విమల దేహ జయ జయ సత్త్వ నిలయ!l జయ జయ గుణ సమూహ! జయ జయ యజ్ఞకర! 15

జయ జయ గుణ విహీన! జయ జయ మోక్షకర ! l జయ జయ భూహిరణ్య జయ జయ కాంతియుత! 16

జయలోకవరణ జయ జయ లక్ష్మీపతే !l జయ పంకజాక్ష జయ జయ సృష్టికర! 17

జయ యోగయుత జయాతసీ కుసుమ శ్యామదేహ!l జయ జయ సముద్రా విష్టదేహ! జయలక్ష్మి పంకజ భోగదేహ! 18

జయ జయ భక్తి భావన లోకగేయ l జయ లోకకాంత! జయ పరమశాంత! 19

జయ జయ పరమసార! జయ చక్రధర! l జయ భోగియుత! జయనీలాంబర! 20

జయ సాంఖ్యనుత జయ కలుష హర! l జయ కృష్ణ జగన్నాధ! జయ సంకర్షణానుజ 21

జయ జయ పద్మపలాశాక్ష జయ వాంచిత ఫలప్రద! l జయమాలావృతోరస్క! జయ చక్రగదాధర! 22

జయ పద్మాలయాకాంత! జయ విష్ణో! నమోsస్తుతే l ఏవం స్తుత్వా తదా దేవా శక్రాద్యా హృష్ట మానసాః 23

సిద్ద చారణ గంధర్వా యే చాన్యే స్వర్షవాసినః l దృష్ట్వా స్తుత్వా నమస్కృత్య తద్గతేనాంతరాత్మనా 24

కృష్ణం రామం సుభద్రాంచ యాంతి స్వం స్వం నివేశనమ్‌ l కపిలా శతదానేన యత్ఫలం సముదాహృతమ్‌ 25

తత్ఫలం కృష్ణ మాలోక్య మంచస్థం సహలాయధమ్‌ l శతనిష్కసువర్ణేన భూమి దానేన యత్ఫలమ్‌ 26

కన్యాశతప్రదానేన యత్ఫలం సముదాహృతమ్‌ l తత్ఫలం కృష్ణమాలోక్య మంచస్థం/ లభ##తే నరః 27

తత్ఫలం చాన్నదానేన సర్వాతిధ్యేన యత్ఫలమ్‌ l వృషోత్సర్గేణ విధివత్‌ గ్రీష్మే తోయ ప్రదానతః 28

తిలధేను ప్రదానేన గజాశ్వరధదానతః l చాంద్రాయణన చీర్ణేన తధా మాసోపవాసనతః 29

యత్ఫలం సర్వతీర్దేషు వ్రతైర్దానైశ్చ యత్ఫలమ్‌ l ససుభద్రౌ రామకృష్ణౌ తల్లభీద్వీక్ష్య మంచగౌ 30

తస్మాన్మరోsధవా నారీ! పశ్యేత్తం పురుషోత్తమమ్‌ l స్నానశేషేణ కృష్ణస్య తోయేనయది మోహిని! 31

వంధ్యామృతప్రజావాపి దుర్భగా గ్రహపీడితాl సద్యస్తాశ్శుద్ది మాయాన్తి విధి నాహ్యభిషేచితాః 32

ప్రాప్నువన్తీప్సితాన్కామా న్యాన్యాన్వాంఛన్తి సుప్రభే 33

దేవతలు పలికిరి ః లోకపాలా! నీకు జయమ, పద్మనాభా! భూదరణా జయము. ఆదిదేవా! బహుకారణా! జయము. వాసుదేవా! సచ్చరణా! సత్కరణా! నీకు జయము. దివ్యమీనా! త్రిదశేశ్వరా ! జయము. జలధిశయనా! యోగీశా! వేదధరా! జయము. విశ్వమూర్తీ! చక్రధరా! జయము. భూతనాధా! శ్రీనివాసా! యోగివరా! జయము. సూర్యనేత్రా! దేవవరాహ! జయము కైటభారే! వేదవరా! జయము. కూర్మరూపా! యజ్ఞవరాహా కమలనాబ్రా! శైలధరా! జయము. యోగీశా ! వేగధరా! విశ్వమూర్తే! చక్ర8ధరా! జయము. భూతనాధా! శ్రీనివాసా! యోగివరా! జయము. సూర్యనేత్రా! దేవవరాహ! జయము కైటభారే! వేదవరా! జయము. కూర్మరూపా! యజ్ఞవరాహా కమలనాభ్రా! శైలధరా! జయము. యోగీశా! వేగధరా! విశ్వముర్తే! చక్రధరా! భూథనాధ! ధరణీధరా! జయము. శేషశాయీ! పీతాంబరధారీ ! జయము. సోమకాన్తా! యోగివాసా!సుఖనివాసా! ధర్మకాంతా మతినివాసా! జయము. గహన గేహనివాసా! యోగిగమ్యా! మఖనివాసా! జయము. వేదవేద్యా! శాంతికరా! యోగిచిన్త్యా! పుష్టికరా! జయము. జ్ఞానముర్తీ ! కమలాకరా ! భావవేద్యా ! ముక్తికరా! విమలదేహ! సత్త్వనిలయ! గుణసమూహ! యజ్ఞకరా! జయము! గుణవిహీనా! మోక్షకరా! భూహి రణ్యా! కాంతియతా! జయము. లోకవరణా! లోకపతీ! పంకజాక్షా! సృష్టికర్తా! యోగము అత సీకుసుమ సిసుమ శ్యామదేహ! జయము. సముద్రావిష్టదేహ! లక్ష్మీ పంకజ భోగదేహ! భక్తిభావనా ! లోకగేయా ! లోకకాంతా! పరమ శాంతా! జయము. పరమసారా! చక్రధారా! భోగియుతా! నీలాంబరా! జయము. సాంఖ్యనుతా! కలుషహరా ! కృష్ణా! జగన్నాధా! సంకర్షణానుజా! జయము. పద్మపలాశాక్షా! విష్ణో! నీకు నమస్కారము. ఇంద్రాది దేవతలు, సిద్ధ చారణ గందర్యులు ఇతర స్వర్గవాసులు ఇట్లు స్తుతించి సంతుష్ట మనస్కులై దర్శించి స్తుతించి., నమస్కరించి వారి యందే మనసు నుంచి బలరామకృష్ణ సుభద్రలను ధ్యానించుచు తమ తమ స్థానములకు వెళ్ళెదరు. శత కపిలాదానముచే కలుగు ఫలము వేదికపై నున్న బలరామ సహితకృష్ణ సందర్శనముచే లభించుంను. శతనిష్కసువర్ణదానముచే భూమి దానము వలన కలుగు ఫలమును, కన్యాశతదానముచే కలుగు ఫలము మంచముపై నున్న శ్రీకృష్ణ సంపదర్శనముచె కలుగును. అన్నదానము వలన, సర్వాతిధ్యము వలన, యధావిధగా చేసిన వృషభోత్సర్జనము వలన, వేసవిలో జలదానము వలన, తిలధేను ప్రదానము వలన, గజాశ్వరధదానముల వలన, సర్వతీర్థసేవనము వలన, సర్వవ్రతా చరణము వలన, సర్వదానముల వలన కలుగు ఫలములన్నియ సుభద్రాసహిత బలరామకృష్ణ సందర్శనమున కలుగును. కావున నరుడు కాని, నారి కాని మంచస్థుడగు పురుషోత్తముని దర్శనము చేసుకొనవలయును. శ్రీకృష్ణుని స్నానశేష జలమును ప్రోక్షణ చేసుకొనినచో గొడ్డురాలు, మృతసంతానవతి, దౌర్బాగ్యపీడితులు, అందరూ పరిశుద్దిని పొంది అభీష్టములను పొందెదరు. ఇతరములను అభిలషించరు కూడా.

పుణ్యాని యాని తోయాని సంత్యన్యాని ధరాతలే | తాని స్నాతావశేషస్య కలాం నార్హని షోడశీమ్‌ 34

తస్మాత్స్నానా వశేషేణ జలేన జలశాయినః | అభ్యుక్షేత్సర్వగాత్రాణి సర్వకామ ప్రదేన చ 35

స్నాతం పశ్యన్తి యే కృష్ణం వ్రజన్తం దక్షిణా ముఖమ్‌ | బ్రహ్మహత్యాది భిర్పాపై ర్ముచ్యన్తే తే న సంశయః 36

శాస్త్రేషు యత్ఫలం ప్రోక్తం త్రిః ప్రదక్షిణయా భువః | దృష్ట్వా నరో లభేత్కృష్ణం తత్ఫలం దక్షిణాముఖమ్‌ 37

తీర్థయాత్రా ఫలం యత్తు పృధివ్యాం సముదాహృతమ్‌ | దృష్ట్వా యాంతం లభేత్కృష్ణం తత్ఫలం దక్షిణాముఖమ్‌ 38

గంగా ద్వారే చ కుబ్జామ్రే కురుక్షేత్రేర్కపర్వాణి |పుష్కరాదిషు చాన్యేషు యత్ఫలం స్నానత స్స్మతమ్‌ 39

యత్ఫలం దక్షిణాస్యంచ కృష్ణం యాంతం నిరీక్ష్యచ | అధ కిం బమునోక్తేన యత్ఫలం పుణ్యకర్మణః 40

వేద శాస్త్ర పురాణషు భారతే సంహితాదిషు | తత్ఫలం వీక్ష్యదక్షాస్యౌ సుభద్రౌలై బలకేశ 41

గుండిలామండపం యాంతం యే పశ్యంతి రధే స్థితమ్‌ | సభద్రం సబలం కృష్ణం తే యాన్తి భవనం హరేః 42

గుండిలాయానసమయే ఫాల్గున్యాం విషువే తధా | సకృద్యాత్రాం నరః కృత్వా విష్ణులోకం ప్రగచ్ఛతి 43

యావతీః కురుతే మర్త్యో యాత్రాశ్శ్రీ పురుషోత్తమే | తావత్కల్పం విష్ణులోకే వసేదితి వినిశ్చయః 44

యాత్రా ద్వాదశ సంపూర్ణా యదిస్యుర్విధినందిని | తదా ప్రతిష్ఠాం కుర్వీత విధినా పాపనాశిని ! 45

జ్యేష్ఠ మాసే సితే పక్షే హ్యేకాదశ్యాం సమహితః | గత్వా జలాశయం పుణ్యం ఆచమ్య ప్రయతశ్శుచిః 46

ఆవాహ్య సర్వతార్ధాని ధ్యాత్వా నారాయణం తధా | తతస్స్నానం ప్రకుర్వీత విధి బోధిత వర్త్మనా 47

స్నాత్వా సమ్యక్తతతో దేవా నృషీంశ్చాపి పితౄన్స్వకాన్‌ | సంతర్పయే త్తధాన్యాంశ్చ నమగోత్రోక్తి పూర్వతః 48

ఉత్తీర్య వాససీ ధౌతే నిర్మలే పరిధాయ చ | ఉపస్పృశ్య విధానేన తధోపస్థాయ భాస్కరమ్‌ 49

వేదమాతర మావర్త్య పుణ్యామ ష్టోత్తరం శతమ్‌ | సౌరమంత్రాంస్తధాచాన్యాం స్త్రిః పరీత్య నమేద్రవిమ్‌ 50

వేదోక్తం త్రిషు వర్ణేషు స్నానం జప్యము దాహృతమ్‌ 51

స్త్రీ శూద్రయోర్వరారోహె వేదోక్త విధి వర్జితమ్‌ | తతో వ్రజేన్మన్దిరస్థం భక్త్యా శ్రీ పురుషోత్తమమ్‌ 52

పక్షాల్య హస్తే పాదౌచ ఉపస్పృశ్య యధావిధి | ఘృతేన స్నాపయేద్దేవం క్షీరేణ తదన్తరమ్‌ 53

మధుగందోదకేనాసిపి తీర్థ చన్దన వారిణా | తతో వస్త్రయుగం శ్రేష్ఠం భక్త్యా తం పరిధాపయేత్‌ 54

చందనా గురుకర్పూరైః కుంకుమేన విలేపయేత్‌ | పూజయేత్పరయా భక్త్వా పద్మేశ్చ పురుషోత్తమమ్‌ 55

సంపూజ్యైవం జగన్నాధం భుక్తి ముక్తి ప్రదం హరిమ్‌ | ధూపం చాగురు సంయుక్తం దేహే దేవస్య చాగ్రతః 56

గుగ్గలం చ సు ని ఘ్పాతం దహేద్ఘృత సమన్వితమ్‌ | దీపం ప్రజ్వాలయే ద్భక్త్యా యధాశక్తి ఘృతేనవై 57

అన్యాం శ్చదడీపకాన్దద్యా ద్ద్వాదశైవ సమాహితః | గోఘృతేన తు దేవేశి తిలతైలేన వా పునః 58

నైవేద్యం పాయసాపూప శష్కులీవేష్టకానిచ | మోదవం పాణికం చాన్య త్ఫలాని చ ని వేదయేనత్‌ 59

ఏవం పంచోప చారేణ సంపూజ్య పురుషోత్తమమ్‌ | ఓం నమః పురుషోత్తమా యేతి జపూదష్టోత్తరం శతమ్‌ 60

తతః ప్రసాదయేద్దేవం దండవత్ప్రణి పత్యచ | తతోర్చయే ద్గురుం భక్త్యా పుష్ప వస్త్రానులేపనైః 61

ఈ భూమండలమున నున్న సకల పుణ్యములు శ్రీకృష్ణస్నాన శేషజలము యొక్క ఒక అంశతో కూడా సాటి రాజాలవు. కావున శ్రీకృష్ణ స్నాన శేషజలముచే శరీరమంతటిని ప్రోక్షణ చేసుకొనవలయును. స్నానము చేసిన శ్రీకృష్ణు భగవానుని, దక్షిణాభిముఖముగా వెళ్ళు శ్రీకృష్ణుని దర్శించినవారు బ్రహ్మహత్యాది పాపముల నుండి విముక్తులగుదురు. భూమిని మూడుమార్లు ప్రదక్షిణము చేసినచో శాస్త్రబోధితమగు పలము దక్షిణాముఖ కృష్ణ సందర్శనముచే లభించును. భూమండలమున తీర్థయాత్రల వలన కలుగు ఫలము దక్షిణాముఖముగా వెళ్ళుచున్న శ్రీకృష్ణుని సందర్శనము వలన లభించును. గంగాద్వారముఖ, కుబ్జామ్రమున, కురుక్షేత్రమున, అర్కపర్వమున, పుష్కరాది పుణ్యతీర్థములందు స్నానమాడికందు వలన కలుగు పలము దక్షిణముగా వెళ్ళుచున్న శ్రీకృష్ణుని దర్శనమును కలుగును. వేద శాస్త్రపురాణాది పఠనము వలన, భారతాది సంహితా పఠనము వలన, భారతాది సంహితా పఠనము వలన కలుగు ఫలము దక్షిణాముఖముగా నున్న బలరామకృష్ణుని దర్శించినవారు శ్రీహరి లోకమునకు వెళ్శెదరు. గుండి చామండపమునకు వెళ్ళు సమయమున, ఫాల్గున పూర్ణిమనాడు, విషువమున ఒకమారు శ్రీకృష్ణ సందర్శన వలన చేసినచో శ్రీహరిలోకమును పొందును. ఎన్నిమార్లు పురుషోత్తమయాత్ర చేసిన అన్ని కల్పములు విష్ణులోకముల నివసించును. ద్వాదశయాత్రలు పూర్ణములైనచో బలరామకృష్ణ సుభద్రలను ప్రతిష్ఠించవలయును. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు సావధాన మనస్కుడై పవిత్రమగు జలాశయమునకు వెళ్ళి, అచమనమును చేసి భక్తి కలిగి పవిత్రుడై అచట అన్ని తీర్థములను ఆవాహనమును గావించి, నారాయణుని ధ్యానించి యదోక్త విధిననుసరించి స్నానము చేయవలయును. ఇట్లు స్నానము గావించి చక్కగా దేవతలను, ఋషులను, తమ పితరులను, ఇతరులను నామగోత్రోచ్చారణ పూర్వకముగా తర్పణము చేయవలయును. తీరమును చేరి, నిర్మలములు ధౌతములగు వస్త్రములను ధరించి, ఆచన గావించి, సూర్యోపస్థాము నాచరించి, గాయత్రీ మంత్రమును అష్టోత్తర శతము జపించి, ఇతర సూర్యమంత్రములను మూడబు మార్లు పఠించి సూర్యుని నమస్కరించవలయును. మూడు వర్ణములలో స్నానము జపము వేదోక్తము. స్త్రీ శూద్రులకు వేదోక్త విధివర్జితముగా స్నాన జపములు చేయవలయును. తరువాత భక్తిచే మందిరములోనున్న పురుషోత్తముని వద్దకు వెళ్ళవలయును. హస్త పాదప్రక్షాళనమును గావించుకొని ఆచమనము చేసి శ్రీహరిని మొదటనేతితో, తరువాత పాలతో మధువుతో గంధోదకముతో, తీర్థ చందన జలముతో స్నానమును చేయించవలయును. తరువాత శ్రేష్ఠమగు వస్త్రయుగ్మమును కట్టించవలయును. చందనాగురు కర్పూర కుంకుమలచే లేపనము గావించవలయును. పరమభక్తిచే పద్మములచే పురుషోత్తముని పూజించవలయును. ఇట్లు జగన్నాధుడు భక్తి ముక్తి ప్రదుడగు శ్రీహరిని చక్కగా పూజించి అగురు సంయుక్త ధూపమును దేవదేహమున అగ్రభాగమున వేయవలయును. ఘృతసమన్వితమగు గగ్గులమును దహించవలయును. తరువాత శక్తిననుసరించి నేతితో దీపమును వెలిగించవలయును. మరియు పన్నెండు దీపములను వెలిగించవలయును. ఈ దీపములను గోఘృతముచే కాని నువ్వులనూనె చే కాని వెలిగించవలయును. తరువాత పాయసమును, అపూపములను, సకిలములను, మోదకములను, అరిసెలను ఇతర ఫలములను నివేదన చేయవలయును. ఇట్లు పంచోపచారములచే పురుషోత్తముని చక్కగా పూజించి ''ఓం నమః పురుషోత్తమాయ'' అను మంత్రమును అష్టోత్తర శతము జపించవలయును. తరువాత దేవుని ప్రార్థించి దండవత్ప్రణామములనాచరించి తరువాత గురువును భక్తిచే పుష్ప/ చందనాదులచే పూజించవలయును.

నానయో రన్తరం యస్మాత్‌ విద్యతే విధినందిని ! | దేవస్యో పరి కుర్వీత మండపం సుసమాహితః 62

నానా పుషై#్పస్సువిశదం విచిత్రం మండలం పురః | కృత్వావధారణం పశ్చా జ్జాగరం కారయేన్నిశి 63

కధాం చ వాసుదేశస్య గీతికాం చాపి కారయేత్‌ | ధ్యాయ న్పఠన్త్సువన్దేవం ప్రణయే ద్రజనీం బుధః 64

తతః ప్రభాతే విమలే ద్వాదశ్యాం ద్వాదశైవ తు | నిమన్త్రయే ద్ర్వ త స్నాతా న్బ్రాహ్మణా న్వేదపారగాన్‌ 65

ఇతిహాస పురాణ జ్ఞా ఞ్ర క్ఛో త్రియాన్సంయతేంద్రియాన్‌

స్నాపయే త్పూర్వవద్భక్త్వా తత్రస్థం పురుషోత్తమమ్‌ | గంధైః పుషై#్ఫస్తూపహార్తె ర్నైవేద్యైర్దూపకైస్తధా 67

ఉపచారైర్భమువిధైః ప్రణిపాతైః ప్రదక్షిణౖః | జాప్యస్తుతినమస్కారై ర్గీత వాద్యైర్మనోహరైః 68

సంపూజ్యైవం జగన్నాధం బ్రాహ్మణాన్పూజయేత్తతః | ద్వాదశైవతు గాస్తేభ్యో దత్తాకనకమేవ చ 69

ఛత్రోపానద్యుగం చాస్య కాంస్యపాత్రం చ భక్తితః | తత్రస్థాన్భోజయే ద్విప్రా న్భోజ్యం పాయస పూర్వకమ్‌ 70

పక్వాన్నం భక్ష్యభోజ్యంచ సగుడం శర్కరానిత్వమ్‌ | తతో భుక్త్వా సుసంతృప్తాన్‌ బ్రాహ్మణాన్సుస్థమానసాన్‌ 71

ద్వాదశైవోదకుంభాంశ్చ గ్రాహాయేత్తాన్సమోదకాన్‌ | దక్షిణాంచ యధాశక్తి విష్ణుతుల్యం విరించిజే 72

సువర్ణవస్త్ర గోధాన్యై ర్ద్ర్వసై#్య్రశ్చాన్యైర్వరైర్బుధ | సంపూజ్య తాన్నమస్కృత్య ఇమం మస్త్రముదీరయేత్‌ 73

''సర్వవ్యాపీ జగన్నాధః శంఖ చక్రగదాధరః | అనాది నిధనో దేవః ప్రీయతాం పురుషోత్తమః '' 74

ఇత్యు చ్చార్య తతో విప్రాం స్త్రిః పరిక్రమ్య సాదరమ్‌ | ప్రణమ్య శిరసా భక్త్యా సాచార్యాం స్తాన్విర్జయేత్‌ 75

తతస్తా న్బ్రాహ్మణాన్భక్త్యా చాసీమాంతమనువ్రజేత్‌ | అనువ్రజ్య తు తాన్విప్రా న్నమస్కృత్వ నివర్త్య చ 76

బాంధవై స్స్వజనైర్యుక్త స్తతో భుంజీత వాగ్యతః | ఏవం కృత్వానరస్సమ్యక్‌ నారీ వా లభ##తే ఫలమ్‌ 77

అశ్వమేధ సహస్రస్య రాజసూయశతస్యచ | అతీతం శతముద్ధృత్య పురుషాణాం నరోత్తమః 78

భవిష్యచ్చ శతం దేవి దివ్యరూపధరోవ్యయః | సర్వలక్షణ సంపన్న స్సర్వాలంకార భూషితః 79

సర్వకామ సమృద్దాత్మా గుణరూపవయోన్వితః | స్తూయమానోఢ గంధర్వై రప్సరోభిస్సమన్తతః 80

విమానే నార్క వర్ణేన కామగేన స్థిరేణ చ | పతాకాధ్వజయుక్తేన శతసూర్య ప్రభేణ చ 81

ఉద్యోగయన్దిశస్సర్వా ఆకాశే విగతక్లమః | యువా మహాబలో ధీమా న్విష్ణులోకం స గచ్ఛతి 82

తత్ర కల్పశతం యావ ద్భుజ్త్కే భోగాన్యధేప్సితాన్‌ | స్తుతో ముని వరైర్దేవి తిష్ఠేచ్చ విగత జ్వరః 83

యధా వేదే జగన్నాధ శ్శంఖ చక్రగదాధరః | తధాస్తే ముదితో దేవి దృత్వా రూపం చతుర్భుజమ్‌ 84

భుక్త్వా తత్ర వరాన్భోగా న్క్రీడిత్వా సుచిరం సతి | తదన్తే బ్రహ్మసదన మాయాత్యకిల కామదమ్‌ 85

సిద్ద విద్యాధరైశ్చాపి శోభితం సురకిన్నరైః | కాలం నవతికల్పం తు తత్ర భుక్త్వా సుఖం నరః 86

రుద్రలోకం సమాయాతి సుఖదం సేవితం సురైః | సిద్దవిద్యాధరైర్యక్షై ర్భూషితం దైత్యదానవైః 87

అశీతి కల్పకాలం తు తత్ర భుక్త్వా సుఖం నరః | తదంతే యాతి గోలోకం సర్వభోగ సమన్వితమ్‌ 88

సురసిద్దాప్పరోభిశ్చ శోభితం సుమనోహరమ్‌ | తత్ర సప్తతి కల్పం తు భుక్త్వా భోగానభీప్సితాన్‌ 89

పశ్చాదాయాతి వై లోకం ప్రాజాపత్యమనుత్తమమ్‌ | షష్టికల్పం సుఖం తత్ర భుక్త్వా నానావిధం ముదా 90

తదంతే శుక్రభవనం నానాశ్చర్యం సమావ్రజేత్‌ | ఆగత్య తత్ర పంచాశ త్కల్పం భుక్త్వా సుఖం నరః 91

ప్రద్యత్యే మరగృహా న్విమానై స్సమలంకృతాన్‌ | చంత్వారిం శత్కల్పకాలం బోగాన్భుక్త్వా సుదుర్లభాన్‌ 92

నాక్షత్రం లోకామాయాతి నానాసౌఖ్యసమన్వితమ్‌ | తత్ర భుక్త్వా వరాన్బోగాం స్త్రింశత్కల్పంయధేప్సితాన్‌ 93

తస్మాద్గ చ్ఛతి తం లోకం శశాంకస్య విరించిజే | యత్ర తిష్ఠతి సోమోసౌ సర్వదైవై రలంకృతః 94

త్రయో వింశతి కల్పంతు భుక్త్వా భోగం సుదుర్లభమ్‌ | ఆదిత్యస్య తతో లోక మాయాతి సురపూజితమ్‌ 95

తత్రభుక్త్వా శుభాన్భోగా న్దశకల్పం సునిర్వృతః | తస్మాదాయాతి భవనం గంధర్వాణాం సుదుర్లభమ్‌ 96

తత్ర భోగాన్సమస్తాంశ్చ కల్పమేకం యధాసుఖమ్‌ | భుక్త్వాచాయాతి మేదిన్యాం రాజా భవతి ధార్మికః 97

చక్రవర్తీ మహావీర్యో గుణౖస్సర్వైరలంకృతః | కృత్వా రాజ్యం తు ధర్మేణ యజ్ఞేరిష్ట్వా సదక్షిణౖః 98

తదంతే యోగినా లోకం గత్వా మోక్షప్రదం శివమ్‌ | తత్ర భుక్వా వరాన్బోగా న్యావదాభూతసంప్లవమ్‌ 99

తస్మాత్పునరిహాయాతో జాయతే యోగినాం కులే | 100

ప్రవరే వైష్ణవే భ##ద్రే దుర్లభే సాధుసమ్మతే | చతుర్వేదీ విప్రవరో బ్రహ్మయజ్ఞ పరస్సతి 101

వైష్ణవం యోగమాసాద్య కైవల్యం మోక్షమాప్నుయాత్‌ | ఏవం యాత్రాఫలం తుభ్యం ప్రోక్తం శ్రీపురుషోత్తమే భుక్తి ముక్తి ప్రదం నౄణాం కిమన్యచ్ర్ఛోతు మిచ్ఛసి 103

ఇతి శ్రీ బృహన్నారదీయ నామ మహాపురాణ ఉత్తర భాగే

మోహినీ వసుసంవాదే పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యే

పురుషోత్తమ క్షేత్ర యాత్రా ఫల వర్ణనం నామ ఏకాషష్టితమోధ్యాయః

దేవునకు గురువునకు భేదము లేదు. తరువాత ఉపరిభాగమున దేవునకు మండపమును నిర్మించవలయును. ఇచట విశాలముగా నానాపుష్పములచే విచిత్రమండలమును నేర్పరచవలయును. అవధారణము గావించి రాత్రి జాగరణము చేయవలయును. రాత్రి పూట వాసుదేవ కథను కాని గీతములను కాని వినుచుండవలయును. దేవుని ధ్యానించుచు కీర్తించుచు స్తుతించుచు ఆ రాత్రిని గడుపవలయును. తరువాత స్వచ్ఛమగు ప్రభాతకాలమున ద్వాదశి నాడు వేదపారగులగు పన్నెండు మంది బ్రాహ్మాణులను వ్రతస్నాతులను నిమస్త్రణ చేయవలయును. వీరు ఇతి హాస పురాణజ్ఞులు, శ్రోత్రియులు, జితేంద్రియులు కావలయును. యధావిధిగా స్నానమాచరించి ధౌత వస్త్రములను ధరించి జితేంద్రియుడై భక్తిచే అచట నున్న పురుషోత్తముని పూర్వము వలె స్నానము చేయించవలయును. గంధ పుష్ప ఉపహారములచే ధూపనైవేద్యములచే, బహు విధోపచారములచే, ప్రదక్షిణ నమస్కారములుచేయించవలయును. గంధ పుష్ప ఉపహారములచే ధూపనైవేద్యములచే విధోపచారములచే, ప్రదక్షిణ నమస్కారములచే జపస్తోత్ర నమస్కారములచే, మనోహర గీతవాద్యములచే చక్కగా పూజించి, తరువాత బ్రాహ్మణలును పూజించవలయును. బ్రాహ్మణులకు పన్నెండు గోవులను బంగారమును, ఛత్రమును, పాదరక్షలను కాంస్యపాత్రను భక్తిచే అర్పించి, వారిని పాయసపూర్వకముగా భుజింప చేయవలయయును. పక్వాన్నము, భక్ష్యభోజ్యములు, శర్కరాన్వితమగు గుడము భోజనమును అర్పించవలయును. భుజించి తృప్తి చెందిన బ్రాహ్మణులను స్వస్థమానసులను ద్వాదశ ఉదకుంభములను గ్రహింప చేసి మోదకములనర్పించవలయును. యధాశక్తి దక్షిణలనర్పించవలయును. సువర్ణ వస్త్ర గోధాన్యములను ఇతర ద్రవ్యములను సమర్పించి చక్కగా పూజించి నమస్కరించి ఈ మంత్రమును పఠించవలయును.

''సర్వవ్యాపీ జగన్నాథః శంక చక్రగదాధరః

అనాది నిధనోదేవః ప్రీయతాం పురుష్తోతమః''

అని సర్వవ్యాపకుడు, జగన్నాధుడు, శంఖ చక్రగదాధరుడు, అనాది నిధనుడగు పురుషోత్తముడు ప్రీతి చెందుగాక అని అర్థము. ఇట్లు ఉచ్చరించి బ్రాహ్మణులను మూడు మార్లు ప్రదక్షిణము నాచరించి శిరస్సుచే నమస్కరించి ఆచార్య సహితునిగా వారిని విసర్జించవలయును. బ్రాహ్మణుల వెంట సీమ వరకు వెళ్ళవలయును. వెంటవెళ్ళి నమస్కరించి తిరిగి వచ్చి స్వజనులతో బంధువులతో కలిసి భుజించవలయును. ఇట్లు చక్కగా ఆచరించిన పురుషులు స్త్రీలు సహస్రాశ్వమేధముల ఫలమును, శతరాజసూయ యాగముల ఫలమును పొందును. అతీతములను నూటిని రాబోవు నూరు పురుషులనుద్దరించి దివ్యరూపధరుడై, అవ్యయుడై, సర్వలక్షణ సంన్నుడై, సర్వాలంకార భూషితుడై సర్వకామసమృద్ధుడై రూపగుణ ¸°వనములతో అంతట గంధర్వాప్సరసలచే స్తుతించబడుచు, కామగతి గల స్థిరమగు అర్కవర్ణముగల విమానముచే పతాకధ్వజయుతముగా శతసూర్యకాంతియుతముతో పది దిక్కులను ప్రకాశింప చేయుచు శ్రమరహితుడై అకాశమున యువకునిగా మహాబలునిగా ధీమంతునిగా విష్ణులోకమునకు వెళ్ళును. విష్ణులోకమున నూరు కల్పముల కాలము యధేష్ఠ భోగములను అనుభవించును. మునివరులచే స్తుతించబడుచు శ్రరహితుడై యుండును. శ్రీ హరి శంఖచక్రగదాధరుడై నాలుగు భుజములతో ఉండునట్లు ఇతను కూడా చతుర్భుజరూపమును ధరించి సంతోషముతో ఇష్టభోగములననుభవించి చాలాకాలము విహరించి, తరువాత అఖిల కామప్రదమగు బ్రహ్మలోకమును చేరును. ఈ బ్రహ్మలోకము సిద్ధులచే విద్యాధరులచే దేవతలచే కిన్నరులచే శోభితమై యుండును. బ్రహ్మలోకమును తొంబది కల్పములు భోగముల ననుభవించి దేవతలచే సేవించబడు సుఖప్రదమగు రుద్రలోకమునకు వచ్చును. ఇచట కూడా సిద్ధులు విద్యాధరలు దైత్యులు దానవులు ప్రకాశించుచుందురు. రుద్రలోకమున ఎనుబది కల్పములు భోగములననుభవించి తరువాత సర్వబోగసమన్వితమగు గోలోకమునకు వెళ్ళును. ఈ గోలోకము సురసిద్ధ అప్సరసలచే శోభితము సుమనోహరము. ఇచట డెబ్బది కల్పములు భోగముల ననుభవించి ప్రాజాపత్యలోకమును చేరును. ఇచట అరువది కల్పములు భోగములననుభవించి సర్వాశ్చర్య సమన్వితమగు ఇన్ద్రలోకముననకు వచ్చును. ఇచట యాబది కల్పములు భోగములనుభవించి విమానాలంకృతములగు అమరగృములను చేరును. ఈ గృహములలో నలుబది కల్పములు సదుర్లభములగు భోగములననుభవించి నానా సౌఖ్యసమన్వితమగు నక్షత్రమలోకమును చేరును. ఇచట ముప్పది కల్పములు యధేష్ట భోగములననుభవించి చన్ద్రలోకమును చేరును. ఇచటనే సర్వదేతలచే అలంకరించబడు చంద్రుడుండును. ఇచట ఇరువది కల్పములు సుదుర్లభములగు భోగములననుభవించి సురపూజితమగు ఆదిత్యలోకమును చేరును. ఇచట పదికల్పములు భోగముల ననుభవించి గంధర్వలోకమును చేరును. ఇచట యధాసుఖముగా ఒక కల్పము భోగములనుభవించి మరల భూలోకమున రాజుగా పుట్టును. ధార్మికుడు, చక్రవర్తి, మహాబలపరాక్రమములు కలవాడు స్వరగుణాలంకృతుడుగా నుండును. దర్మబద్ధముగా రాజ్య పరిపాలనము గావించి సదక్షిణముగా యజ్ఞములచే శ్రీహరిని సేవించి అంతమున మోక్షప్రదము శివకరమగు యోగిలోకమునకు వెళ్ళి ఇచట ప్రళయకాలము వరకు ఉత్తమ భోగములననుభవించి మరల భోలకమున కొచ్చి యోగుల కులమున ఉత్తమమగు విష్ణుభక్తుల వంశమున దుర్లభము సాధుసమ్మతవగు వంశమున నాలుగు వేదములు తెలిసిన బ్రాహ్మణోత్తమునిగా బ్రహ్మ యజ్ఞపరునిగా పుట్టును. తరువాత వైష్ణవయోగమును చేరి కైవల్యమగు మోక్షమును పొందును. ఇట్లు పురషోత్తమ తీర్థయాత్రా ఫలమును, మాలవులకు భుక్తి ముక్తి ప్రదమగు దానిని విపులముగా వివరించితిని. ఇంకనూ ఏమి వినదలచితవో తెలుపుము.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున

ఉత్తర భాగమున మోహినీ వసుసంవాదమున

పురషోత్తమ క్షేత్ర మాహాత్మ్యమున

పురుషోత్తమ క్షేత్రయాత్రా ఫల

వర్ణనమను ఆరువది యొటవ

అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page