Sri Naradapuranam-3    Chapters    Last Page

సప్త పంచాశత్తమోsధ్యాయః యాబది యేడవ అధ్యాయము

పురుషోత్తమమాహాత్యము

వసురువాచః-

దేవానృషీన్పితౄంశ్చాన్యా న్సంతర్ప్యాచమ్య వాగ్యతః l హస్తమాత్రం చతుష్కోణం చతుర్ద్వారం సుశోభనమ్‌ 1

పురం విలిఖ్య విధిజే తీరే తస్య మహోదధేః l మధ్యే తత్ర లిఖేత్పద్మం అష్టపత్రం సకర్ణికమ్‌ 2

ఏవం మండల మాలిఖ్య పూజయేత్తత్రమోహిని! | అష్ఠాక్షర విధానేన నారాయణమజం విభుమ్‌ 3

అధ తే సంప్రవక్ష్యామి కాయశోధనముత్తమమ్‌ l క్షకారం హృదయే చిన్త్యం రక్తం రేఫ సమన్వితమ్‌ 4

జ్వలంతం త్రిశిఖంచైవ దహంతం పాప సంచయమ్‌ l చంద్ర మండలమధ్యస్థ మేకారం మూర్ద్ని చింతయేత్‌ 5

శుక్లవర్ణం ప్రవర్షన్తం దివ్యదేహస్తతో భ##వేత్‌ 6

అష్టాక్షరం తతో మన్త్రం న్యసేద్దేహాత్యనోర్భుధః l వామపాదం సమారభ్య క్రమశ్త్చేవ విన్యసేత్‌ 7

పంచాంగ వైష్ణవం చైవ చతుర్వ్యూహం తథైవ చ l కరశుద్దిం ప్రకుర్వీత మూలమంత్రేణ సాధకః 8

ఏకైకం చైవ వర్ణం తు అంగులీషు పృధక్ఫృధక్‌ l ఓంకారం పృధివీ శుక్లం వామ పాదేతు విన్యసేత్‌ 9

నకారస్తు భువశ్శ్యామో దక్షిణతు వ్యవస్థితః l మోకారం కాలమేవాహు ర్వామ కట్యాం నిధాపయేత్‌ 10

నాకారం పూర్వ బీజం తు పదక్షిణస్యాం వ్యవస్థితమ్‌ l రాకారస్తే జ ఇత్యాహు ర్నాభిదేశే వ్యవస్థితమ్‌ 11

వాయవ్యోsయం యకారస్తు వామస్కాంధే సమాశ్రితః l ణాకార స్సర్వదా జ్ఞేయో దక్షిణాంసే వ్యవస్థితః 12

యకారో యం శిరస్థశ్చ యత్ర లోకా వ్యవస్థితాః l ఓంకారం హృదయే న్యస్య వికారం వా శిరస్యధ 13

ష్ణకారం వై శిఖాయాంతు వేకారం కవచే న్యసేత్‌ l నకారం నేత్రయో స్తు స్యా న్మకారం చాస్త్రమీరితమ్‌ 14

లలాటే వాసుదేవస్తు శుక్లవర్ణ స్సమాస్థితః l రక్తస్సంకర్షణశ్చైవ ముఖే వహ్న్యంక సన్నిభః 15

ప్రద్యుమ్నో హృదయే పీతోsనిరుద్దో మేహనే స్థితః l సర్వాంగే సర్వశక్తిశ్చ చతుర్వ్యూహార్చితో హరిః 16

మమాగ్రే వస్థితో విష్ణః పృష్ఠతశ్చాపి కేశవః గోవిందో దక్షిణ పార్శ్వే వామే తు మధు సూదనః 17

ఉపరిష్టాంతు వైకుంఠో వారాహః పృధివీతలో l అవాంతర దిశో యాస్తు తాసు సర్వాసు మాధవః 18

గచ్చతస్తిష్ఠతో వాపి జాగ్రతస్స్వపతోsపి వా l నరసింహకృతా గుప్తి ర్వాసుదేవమయోహ్యహమ్‌ 19

ఏవం విష్ణు మయో భూత్వా తతః కర్మ సమారభేత్‌ l యధా దేహా తధా దేహే తధా దేవే సర్వతత్త్వాని యోజయేత్‌ 20

ఫకారాన్తం సముద్దిష్టం సర్వవిఘ్నహరం శుభమ్‌ l తత్రార్క చన్ద్రవహ్నీనాం మండలాని విచింతయేత్‌ 21

పద్మ మధ్యే న్యసే ద్విష్ణుం భువన స్యాంతరస్యతు l తతో విచింత్య హృదయే ప్రణవం జ్యోతిరుత్తమమ్‌ 22

కర్ణికాయాం సమాసీనం జ్యోతీ రూపం సనాతనమ్‌ l అష్ఠాక్షరం తతో మన్త్రం న్యసే చ్చైవ యధాక్రమమ్‌ 23

తేన వ్యస్త సమస్తేన పూజనం పరమం స్మృతమ్‌ l ద్వాదశాక్షర మంత్రేణ యజేద్దేవం సనాతనమ్‌ 24

వసువు పలికెనుః-

దేవతలను, ఋషులను, పితరులను ఇతరులను తృప్తి పరిచి, ఆచమనము గావించి వాజ్నియముతో హస్తమాత్రముగా చతుష్కోణము, చతుర్ద్వారము, సుందరమగు పురమును, సముద్ర తీరమున లిఖించి పురమధ్యమున అష్టపత్రము కర్ణికా సహితముగా పద్మమును లిఖించవలయును. ఇట్లు మండలమును లిఖించి ఆ మండలమున అష్టాక్షర విధదదానము చే అజుడు విభుడగు నారాయణుని పూజించవలయును. ఇక ఇపుడు నీకు ఉత్తమమగు కాయ శోధనమును గురించి చెప్పెదను. రక్తము రేఫ సమన్వితమగు క్షకారమును హృదయమున చింతించవలయును. జ్వలించునది త్రిశిఖము, పాప సంచయమును దహించునది, చంద్ర మండల మధ్యస్థమగు ఏకారమును శిరసున చింతించవలయును. శుక్లవర్ణము కలది, భూమిని తడుపుచు అమృతమును వర్షించు చున్న ఏకారమును శిరమున చింతించ వలయును. ఇట్లు కాయ శుద్దిచే పాపములు నశించి దివ్య దేహము కలవాడగును. తరువాత దేహము నందు ఆత్మయందు అష్టాక్షర మంత్రమును న్యాసము చేయవలయును. వామపాదమున ఆరంభించి క్రమముగా న్యాసముగా గామించవలయును. పంచాంగమును, వైష్ణవమును, చతుర్వ్యూహము నుంచవలయును. తరువాత సాధకుడు మూలమంత్రముచే కరశుద్దిని చేయవలయును, విడివిడిగా అన్ని వ్రేళ్ళయందు ఒక్కొక్క దానిని ఒక్కొక్క వర్ణముతో నుంచవలయును. శ్యామ వర్ణముగల భూబీజముగు నకారమును దక్షిణపాదమున నుంచవలయును. కాలరూపమగు మోకారమును వామకటియందు ఉంచవలయును. పూర్వభీజమగు నాకారమును దక్షిణ కటియందుంచ వలయును. తేజో బీజమగు రాకారమును నాభిదేశమునందుంచవలయును. వాయు బీజమగు యకారమును వామస్కంధమున నుంచవలయును. ణాకారమును దక్షిణ భుజమున నుంచవలయును. సకలలోకములుండు శిరస్సున యకారముండును. ఓంకారమను హృదయమున నుంచి వికారమును శిరస్సున నుంచి ష్ణకారమును నేత్రములందుంచవలయును, వేకారము అస్త్రముగా చెప్పబడినది. శుక్లవర్ణుడగు వాసుదేవుడు లలాటమున నుండును రక్తవర్ణుడు వహ్ని సన్నిబుడగు సంకర్ణణుడు ముఖమున నుండును. పీత వర్ణుడగు ప్రద్యుమ్నుడుహృదయమున, అనిరుద్దుడు మేహనేంద్రియమున, సర్వాతిగములందు సర్వశక్తి చతుర్వాహుడగు శ్రీహరి ఉండును. నాకు ముందు భాగమున శ్రీవిష్ణువు, వెనుక భాగమున కేశవుడు, దక్షిణ పార్వ్శమున గోవిన్దుడు, వామ పార్శ్వమున మధు సూదనుడుండును. ఊర్థ్వ భాగమున వైకుంఠుడు, అధో భూగమున వరాహస్వామి, అవాంతర దిశలయందు మాధవుడుండును. నడుచు, నిలుచు, మేలుకున్న నన్ను నరసింహ స్వామి కాపాడును. ఇట్లు విష్ణుమయుడై, కర్మనారంభించవలయును. దేహమునందున్న విధముగా దేవునియందు అన్నితత్త్వములను న్యాసము చేయవలయును. సర్వ విఘ్నహరము, శుభమగు ఫకారాన్తము వరకు న్యాసము ఉద్దేశించబడినది. ఇచటనే అర్క చన్ద్ర వహ్నిమండలములను ధ్యానించవలయును. భువనాంతర్బాగమున పద్మమధ్యమున విష్ణున్యాసమును చేయవలయును. తరువాత హృదయమున ఉత్తమ జ్యోతి రూపమగు ప్రణవమును చింతించి, సనాతన జ్యోతిరూపమును కర్ణికయందు ఆసీనమైనట్టు భావించి తరువాత యధాక్రమమగా అష్టాక్షర మన్త్రమును యధాక్రమముగా న్యాసమును గావించవలయును. ఇట్లు వ్యస్తముగా సమస్తముగా చేయునది ఉత్తమ పూజగా పేర్కొనబడినది. తరువాత ద్వాదశాక్షర మంత్రముచే సనాతన దేవుని పూజించవలయును.

తతోsవధార్య హృదయే కర్ణికాయాం బహిర్న్యసేత్‌ l చతుర్భుజం మహాసత్త్వం సూర్యకోటి సమప్రభమ్‌ 25

చింతయిత్వా మహాయోగం తత శ్భావాహయే త్క్రమాత l మీనరూపావహశ్చైవ నరసింహశ్చ వామనః 26

అయాంతు దేవా వరదా మమ నారాయణాగ్రతః l సుమేరుః పాదపీఠం తే పద్మకల్పిత మాసనమ్‌ 27

సర్వతత్త్వ హితార్థాయ తిష్ఠ త్వం మధుసూదన! l పాద్యం తే పాదయోర్దేవ పద్మనాభ సనాతన! 28

విష్ణో కలమ పత్రాక్ష గృహాణ మధుసుధన! l మధుపర్కం మహాదేవ బ్రహ్మద్యైః కల్పితం మయా 29

నివేదితం చ భక్త్యార్ఝ్యం గృహాణ పురుషోత్తమ l మందాకిన్యాస్తతో వారి సర్వపాపహరం శివమ్‌ 30

గృహాణాచమనీయం త్వం మయా భక్త్యా నివేదితమ్‌ l త్వమాపః పృధివీ చైవ జ్యోతిస్త్వం వాయురేవ చ 31

లోక సంధృతి మాత్రేణ వారిణా స్నాపయామ్యహమ్‌ l దేవతంతు సమాయుక్తే యజ్ఞవర్ణ సమన్వితే 32

స్వర్ణవర్ణ ప్రభే దేవ! వాససీప్రతి గృహ్యతామ్‌ l శరీరం చ న జానామి చేష్టాం చ తవ కేశ 33

మయా నివేదితం గంధం ప్రతి గృహ్య విలిప్యతామ్‌ | ఋగ్యజుస్సామమంత్రేణ త్రివృతం పద్మయోనినా 34

సావిత్రీగ్రంధి సంయుక్త ముపవీతం తవార్వ్యతే l దివ్యరత్న సమాయుక్తా! వహ్నిభాను సమప్రభాః 35

గాత్రాణి శోభయిష్యన్తి అలంకారాస్తు మాధవ! సూర్యా చన్ద్రమసోర్జ్యోతి ర్విద్యుదగ్న్యోస్తదైవచ 36

త్వమేవ జ్యోతిషాం దేవ దీపో యం ప్రతిగృహ్యతామ్‌ l వనస్పతి రసో దివ్యో గంధాఢ్యస్సురభిశ్చతే 37

మయా నివేదితో భక్త్యా ధూపోsయం ప్రతి గృహ్యతామ్‌ l అన్నం చతుర్విధం స్వాదు రసై ష్షడ్భిస్సమన్వితమ్‌ 38

మయా నివేదితం భక్త్యా నైవేద్యం తవ కేశవ l పూర్వే దలే వాసుదేవం యామ్యే సంకర్షణం న్యసేత్‌ 39

ప్రద్యుమ్నం పశ్చిమే కుర్యా దనిరుద్దం తధోత్తరే l వారాహం చ పతధాగ్నేయే నరసింహం చ నైర్ర్‌ఋతే 40

వాయవ్యాం మాధవం చైవ తధేశానే త్రివిక్రమమ్‌ l తధాష్ఠాక్షర దేవస్య గరుడం పరితో న్యసేత్‌ 41

వామపార్శ్వే తథాచక్రం శంఖం దక్షిణతో న్యసేత్‌ l తథామహాగదాం చైవ న్యసేద్దేవస్య దక్షిణ 42

తతశ్శార్ఝధనుర్విద్వా న్న్యసే ద్దేవస్య వామతః l దక్షిణ చేషుధీ దివ్యే ఖడ్గం వామే చ విన్యసేత్‌ 43

శ్రియం దక్షిణత స్థా ప్య పుష్టిముత్తరతో న్యసేత్‌ l వనమాలాంచ పురత స్తత శ్శ్రీవత్సకౌస్తుభే 44

విన్యసే ద్ధృదయాదీని పూర్వాదిషు చతుర్ష్యపి l తతోs స్త్రందేవదేవస్య కోణ చైవ తు విన్యసేత్‌ 45

ఇన్ద్ర మగ్నిం యమం చైవ నైతిం వరుణం తధా l వాయుం ధనదమీశానం అనన్తం బ్రహ్మణా సహా 46

పూజయేత్తా న్స్వకైర్మంత్రై రధశ్చోర్ద్వం తథైవ చ l ఏవం సంపూజ్య దేవేశం మండలస్థం జనార్దనమ్‌ 47

పూజితం యస్తు పశ్యేత్స ప్రవిశేద్విష్ణు మవ్యరుమ్‌ l సకృతదప్యర్చితో యేన విధినానేన కేశవః 48

లభేదభిమతా న్కామా న్నరో నాస్త్యత్ర సంశయః l అనేనైవ విధానేన మండలస్థం జనార్దనమ్‌ 49

జన్మమృత్యు జరాస్తీర్త్వా విష్ణోః పదమ వాప్నుయాత్‌ l యస్స్మరేత్సతతం భక్త్యా నారాయణ మతంద్రితః 50

అన్వహం తస్య వాసాయ శ్వేత ద్వీపః ప్రకీర్తితః l ఓంకారాది సమాయుక్తం నమస్కారం తదీయకమ్‌ 51

సనామ సర్వతత్త్వానాం మన్త్ర ఇత్యభిదీయతే l అనేనైవ విధానేన గంధపుష్పం నివేదయేత్‌ 52

ఏకైకస్య ప్రకుర్వీత యధోద్దిష్టం క్రమేణ తు l ముద్రాస్తతో నిభధ్నీయా ద్యధోక్తి క్రమవేదితమ్‌ 53

జపం చైవ ప్రకుర్వీత మూలమంత్రేణ తత్త్వవిత్‌ l అష్టావింశతి మష్టౌ వా శతమష్టోత్తరం తథా 54

కామ్యేషు చ యధోక్తం స్యా ద్యధాశక్తి సమాహితః l పద్మం శంఖంచ శ్రీవత్సం గదాం గరుడమేవ చ 55

చక్రం ఖడ్గం చ శార్జంచ అష్టౌ ముద్రా! ప్రకీర్తితాః గచ్ఛ గచ్ఛ పరం స్థానం పురాణ పురుషోత్తమ! 56

యన్న బ్రహ్మాదయో దేవా విదంతి పరమం పదమ్‌ l అర్చనం యేన జానన్తి హరేర్మన్త్రైర్తర్యధోదితమ్‌ 57

తే త్వత్ర మూలమంత్రేణ పూజయన్త్యచ్యుతం శుభే 58

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తర భాగే

వసు మోహినీ సంవాదే పురుషోత్తమ మాహాత్మ్యే

సప్తపంచాశత్తమో ధ్యాయః

ఇట్లు హృదయావధారణ తరువాత కర్ణికయందు బహిర్భాగమున నుంచవలయును. చతుర్బుజుని మహాసత్త్వని సూర్యకోటి సమప్రభుని ధ్యానించి మహాయోగమును క్రమముగా అవాహన చేయవలయును. మీన రూపధారి, నరసింహ స్వామి, వామనుడు, వీరందరు నాకు నారాయణుని అగ్రభాగమున రావలయును. నీకు సుమేరువు పాదపాఠము. పద్మ కల్పితమగు ఆసనము. సర్వతత్త్వహిత ము కొరకు మధుసూధనా నీవుండము. ఓ సనాతనా! పద్మనాభా! నీ పాదములకు పాద్యమును, కమల పత్రాక్షా! మదుసూధనా! శ్రీవిష్ణూ! బ్రహ్మాదులచే కల్పించ బడిన పాద్యమును నాచేత స్వీకరించుము. ఓ పురుషోత్తమా? భక్తిచే నివేదించు అర్ఝ్యమును గ్రహించుము. సర్వపాపహారి, శుభప్రదము అగు. మందాకినీ జలమును నాచే భక్తి పూర్వకముగా నివేదించబడు ఆచమనీయమును స్వీకరించుము. నీవే జలము. నీవే పృథివి. నీవే అగ్నివి. నీవే వాయువు. లోకాచారము ననుసరించి జలముచే స్నానము చేయించు చున్నాను. దేవతంతు సమాయుక్తములు, యజ్ఞవర్ణసమన్వితములు స్వర్ణ వర్ణ ప్రభలు అగు వస్త్రములను స్వీకరించుము. నాకు నీ శరీరము తెలియదు. చేష్ఠ తెలియదు. నేను నివేదించు గంథమును స్వీకరించి లేపనము చేసుకొనుము. ఋగ్యజు స్సామమంత్రములచే బ్రహ్మచేత్రి వృతమగు, సావిత్రీ గ్రంథి సంయుక్తమగు ఉపవీతమును నీకర్పించు చున్నాను. దివ్యరత్న సమాయుక్తములు, వహ్ని భాను సమప్రభలు అగు అలంకారములు నీ అవయవములను అలంకరించును. సూర్య చంద్రుల మెరుపు అగ్నుల జ్యోతి నీ స్వరూపమగు జ్యోతి దీపమును స్వీకరించుము. వనస్పతిరసము, దివ్యము, గంధాడ్యము, సురభియగు ధూపమును నేను అర్పించు వానిని స్వీకరించుము. షడ్రస సమన్వితము స్వాదు యగు నాచే సమర్పించబడు చతుర్విధాన్నమును నైవేద్యముగా స్వీకరించుము. పూర్వదలమున వాసుదేవుని, దక్షిణదలమున సంకర్షణుని, పశ్చిమమున ప్రద్యుమ్నుని, ఉత్తరమున అనిరుద్దుని న్యాసము గావించవలయును. అగ్నేయమున వరాహస్వామిని నైఋతి దిక్కున నరసింహుని వాయవ్యమున మాధవుని, ఈశాన్యమున త్రివిక్రముని న్యాసము చేయవలయును. అష్టాక్షర మంత్రమునకు చుట్టూ గరుడన్యాసముగావించ వలయును. వామ పార్శ్వమున చక్రమును, దక్షిణ పార్శ్వమున శంఖమును, దేవునకు దక్షిణమున మహాగదను వామ భాగమున శార్దధనుపవును న్యాసము గావించవలయును. దక్షిణమున అమ్ముల పొదను, వామభాగమున ఖడ్గమునుంచవలయును. దక్షిణమున శ్రీని, ఉత్తరమున పుష్ఠిని ముందు వనమాలను, తరువాత శ్రీవత్సకౌస్తుభములనుంచవలయును. పూర్వాది చతుర్దిశలయందు హృదయాదిన్యాసము గావించవలయును. తరువాత మూలలందు దేవదేవుని అస్త్రన్యాసమును గావించవలయను. ఇంద్రుని, అగ్నిని, యముని నైతిని, వరుణుని వాయువును, కుబేరుని, ఈశుని బ్రహ్మతో అనన్తుని ఊర్థ్వాధోబాగములందు అయా మంత్రములచె పూజించవలయును. ఇట్లు మండలస్థుడగు జనార్థనుని పూజించి, పూజలనందిన శ్రీహరిని దర్శించిన వారు శ్రీహరిలోప్రవేశించెదరు. ఈ విధానము ననుసరించి మండలస్థుడగు జనార్దనుని ఒకమారు పూజించిననూ అభిమతకామనలను పొందును. జన్మ మృత్యు జరాభయములను విడిచి శ్రీవిష్ణు పదమును పొందును. సర్వకాలములందు భక్తిచే ఏమరుపాటు లేక నారాయణుని స్మరించు వానికి నివాసమునకు శ్వేతద్విపము లభించును. ఓంకారాది సమాయుక్తమగు తదీయనమస్కారము నామ సహితము సర్వ తత్త్వములను మన్త్రముగా చెప్పబడును. ఈ విధానముతోనే గంధపుష్పాదులను నివేదించవలయును. ఒక్కొకరికి యధోద్దిష్టముగా యధాక్రమముగా నాచరించవలయును. యధోక్త క్రమముగా ముద్రలను ప్రదర్శించవలయును. మూల మంత్రము చే జపమును చేయవలయును. అష్టావింశతికాని, అష్టకాని, అష్టోత్తర శతమును కాని జపించవలయును. కామ్య కర్మలందు యధోక్తమును యధాశ్తకి సావధానముగా జపించవలయును. పద్మము, పశంఖము, శ్రీవత్సము, గద, గరుడము, చక్రము ఖడ్గము, శార్జము, అను ఎనిమిది ముద్రలు చెప్పబడినవి. ఓపురాణ పురుషోత్తమా! పరమ స్థానమునకు వెళ్ళుము. నీ స్థానమును బ్రహ్మాదిదేవతలు కూడా తెలియరు. మన్త్ర పూర్వకముగా యధోక్త విధిగా అర్చనము తెలియని వారు ఇచట మూలమంత్రముచే అచ్యుతుని పూజింతురు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున

వసుమోహినీ సంవాదమున పురుషోత్తమ మాహాత్మ్యమున

యాబదియేడవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page