Sri Naradapuranam-3    Chapters    Last Page

పంచత్త్రింశోsధ్యాయః = ముప్పది అయిదవ అధ్యాయము

శాపప్రాప్తిః

యమ ఉవాచ :

విబుధేశ జగన్నాధ ! చరాచరవిభో! గురో l మోహినీ నిష్ఫలా జాతా వంధ్యాస్త్రీ జననే యధా 1

రుక్మాంగద ప్రణీతేన మార్గేణ కుశలాంఛన! లోకః ప్రయాతి వైకుంఠం న మాం కశ్చిత్ర్పపద్యతే 2

గతేపి భూమి నాధేశే దేహా దేవస్య చక్రిణః l తధాపి సర్వభూతానాం న బుద్ధిః పరివర్తతే 3

ఉపోష్య వాసరం విష్ణో రాకుమారాత్తు మానవాః l ప్రయాంతి పరమం లోకం లుప్త పాపాః పితామహా 4

పుత్రీ తే వ్రీడితా దేవీ మోహినీ మోహమాగతా l నాయాంతి తవ సామీప్యం నభుంక్తే లోగర్హితా 5

నిర్య్వాపార స్త్వ హో జాతః కిం కరోమి ప్రశాధి మామ్‌ l రవిపుత్ర వచ శ్శ్రుత్వా ప్రోవాచ కమలాసనః 6

గచ్ఛాను స్సహితాస్సర్వే మోహినీం ప్రతిభోధితుమ్‌ l మోహిన్యాం ప్రతి బుద్దాయాం కరిష్యామో దివాకరే 7

తవ కార్యం న సందేహ స్సంభ్రమస్త్య జ్యతామవయమ్‌ l తతో దేవగణాస్సర్వే శతక్రతు పురోగమాః 8

బ్రహ్మణా సహితాః ప్రధ్వీం విమానై స్సూర్యసప్రభైః l సమాయాతా మహీపాల నాంం తాం ప్రతి భోధితుమ్‌ 9

తే విమానైస్సమంతాత్తు పరివార్య శుభాననామ్‌ l తేజోహీనాం నిరానన్దాం శుష్కతోయాం నదీమివ 10

శశిహీనాం నిశాం భూప ఋత్వీగ్ఝీనాం క్రియామివ lపరాజితోయధామర్త్య ః ప్రవ్లూన కుసుమం యధా 11

నివృత్తోత్సవ వేదీవ విద్రుమం ధవలం యధా l గతాశాలిస్తు కేదారో నిష్రభశ్చ భ##వేద్యదా . 12

గతమండా యధారాజన్‌ గతోద్దారా యధా సరః l మంధానం నవనీతే వా ఉద్ద్రతే ధరణీ పతే 13

అసంస్కృతా యధా వాణీ మర్దితా చ యధా చమూః l హతనాధాం తు యువతీం ధాన్యహీనాం ప్రజాం యధా 14

మన్త్రహీన విధిం యుద్ధం ధర్మంచ దయయా వినా l పృధ్వీం భూపాలహీనాం వా మంత్రహీనాం యధా నృప 15

ధనధాన్య విహీనం వా గృహం నృప వరోత్తమ l బలహీనం యధా కుంభం పంకస్థం గోపతిం యధా 16

గృహస్థం భార్యయా హీనం రాష్ట్ర భ్రష్ట్రం చ భూపతిమ్‌ l భగ్న క్రియం యధా వైద్యం భగ్న శాఖం యధా ద్రుమమ్‌ 17

తేజోహీనం యధాగారం నిర్జలం వా ధనం యధాl విధూమ ఇవసప్తార్చి ర్విరశ్మిరివ భాస్కరః 18

మతి భ్రష్టో యధా మర్త్యః పర్వసంగీ యధానరః l అతృప్తః కాంతరు%ా కాంతః పన్నగశ్చ విషోజ్ఝితః 19

లూనపక్షో యధా పక్షీ వృత్తిహీనో యధా ద్వి జః l శిరోభ్రష్టా యధా మాలా పర్వతో ధాతు వర్జితః 20

ప్రభ్రష్టలిపి శాస్త్రంవా ఋగ్యజుర్విస్వరం యధా l స్వరహీనం యధా సామ పద్మహీనం యధా సరః 21

యధా మార్గం తృణౖరుద్ధం పద్మం పత్ర వివర్జితమ్‌ l జ్ఞానం మమత్వ సంయుక్తం పుమాంసం ప్రకృతిం వినా 22

సాంఖ్యాని తత్త్వహీనాని ధర్మం దంభాన్వితం యధా l తేజోహీనాం తథా పశ్యన్‌ మోహినీం తే దివౌకసః 23

ధ్యాయమానాం నిరుత్సాహాం దృశ్యమానాం జనైః ప్రభో l ఆక్రోశవచనైః క్రూరై ః పుత్రహత్యాసమన్వితామ్‌ 24

దుశ్శీలాం ధర్మసంత్యక్తాం తద్వాక్యపరిమోహితామ్‌ l స్వవాక్య పాలనాం చండీ మూచుర్దేవా స్సమాగతాః 25

మాశోకం కురు వామోరు ! పౌరుషం హి త్వయా కృతమ్‌ న హి మాధవ భక్తానాం విద్యతే మాన ఖండనమ్‌ 26

సా త్వం హరిణ శాబాక్షి ! దేవ కార్యార్థ మాగతా l తన్నసిద్దం వరారోహా సప్రయాతోధునా భవమ్‌ 27

విఘ్న విధ్వంసినీ పూర్వం కృతా రుక్మాంపగదేన హి l ఏకాదశీ మహాపుణ్యా మోహినీ మాదవే సితే 28

సంవత్సరం విశాలాక్షి కృచ్చ్రపాద ప్రపూదితా l తసై#్య వాధ్యుష్టిరతులా యత్సత్యాచ్చలితో నహి 29

విఘ్న రాజ్ఞీ తు వై నారీ లోకేషు పరిణీయతే l కర్మణా మనసా వాచ పుత్ర వ్యాపాదనే మతిమ్‌ 30

కృత్వా చోధ్దృత్య ఖడ్గంచ త్యక్త్వా స్నేహం సుదూరతః l తాదృశం నికషం నికషం ప్రేక్ష్య భగవాన్మధు సూదనః 31

హనిష్యతి ప్రియం పుత్రం న భుంక్తే హరివాసరే l పుత్రస్య చ ప్రియా యాశ్చ భావం ప్రేక్ష్య న్పపస్యచ 32

విష్ణునా పరితుష్టేన నీతా స్స్వ భవనే త్రయః l సదేహా ః క్షీణ కర్మాణో హ్యంగా రోగ్ని రివాహితః 33

ఫలం కర్మణి చారబ్దే యది దేవీ న సిద్ద్యతి l సర్వయత్నేన సుభ##గే దోషః కోత్ర తవాధునా 34

ఏతస్మాద్వరదా స్సర్వే సంప్రాప్తా విబుధా శ్శుభే l సిద్దౌ వాప్య ధవాసిద్దౌ కర్మకృత్‌ స్యా ద్వృ ధ్యానహి 35

భర్తవ్యో భృత్యవర్గశ్చ భూభుజా ధర్మ మిచ్ఛతా l సద్భావే ఘటమానస్య యది కర్మన సిద్ద్యతి. 36

దేయం వేతన మాత్రం తు న చతుష్టి ఫలం భ##వేత్‌ l యో న తసై#్మ ప్రయచ్ఛేత జీవనం జీవనాయవై 37

గోవధం సమవాప్నోతి స నరో నాత్ర సంశయః l తస్మాద్దేయం వరారోహా అభీష్టం వరసున్దరి 38

సద్భావేన కృతే సమ్యక్‌ విఘ్నం కార్యం దివౌకసామ్‌ | కిం న కుర్వన్తి విబుధా స్త్వయాసహ వరాననే 39

ద్వాదశ్యాస్తేజసా భగ్నా యా మాహుర్విఘ్ననాశినీమ్‌ l విబుదైరేవముక్తా తు మోహినీ లోకమోహినీ 40

ఉవాచ సా నిరానన్దా పతిహీనాతిధుఃఖితా

యమధర్మరాజు పలికెను:

దేవేశా! జగన్నాధా ! చరాచర విభో ! గొడ్రాలు సంతానమును పొంద జాలనట్లుగా మోహినీ దేవి నిష్పలు రాలాయెను . ఓ కుశలాంఛనా రుక్మాందు డేర్పరించిన దారిలో లోకములన్నియూ వైకుంఠమునకు వెళ్ళుచున్నవి . నా వద్దకు ఒక్కడు కూడా వచ్చుట లేదు. రుక్మాంగద మహారాజు శ్రీహరి దేహమును చేరిననూ సర్వ భూతముల బుద్ది మాత్రము మారుటలేదు. రాజకుమారుని వలన మానవులందరు విష్ణువాసరమున ఉపవసించి పాపములను నశింప చేసుకొని పరమ పదమునకు వెళ్ళుచున్నారు. నీపుత్రికయగు మోహిని సిగ్గుపడి మూర్చనందినది. నీసమీపమునకు రాలేక పోపుచున్నది. లోకముచే నిందించబడి భుజించుటలేదు. నేను క్రియా శూన్యుడనైతిని. ఏమి చేయవలయునో అజ్ఞాపించుము. ఇట్లు యమధర్మరాజు మాటలను వినిన బ్రహ్మ ఇట్లు పలికెను. మన మందరము మోహినిని లేపుటకు వెళ్ళెదము. మోహినికి స్పృహ వచ్చిన తరువాత నీపనిచేయుదము. సందేహించ వలదు. ఈ తత్తరపాటును విడుపుము. అంతట ఇంద్రుడు మొదగు దేవగణములన్నియూ బ్రహ్మతో కలిసి సూర్య సన్నిభములగు విమానములచే మోహినిని లేపుటకు భూమండలమునకు వచ్చిరి. వారందరూ విమానములతో శుభానన, తేజోహీన, నిరానన్ద, శుష్కతోయయగునది వలె, చంద్రుడులేని రాత్రి వలె, బుత్విజులు లేని యజ్ఞమువలె, ఓడిన మనిషి వలె, వాడిన పూవు వలె, ఉత్సవము ముగిసిన వేదిక వలె తెల్లని పగడమువలె, ధాన్యములేని పైరు వలె, పీతమండ యగు సురవలె, జలము లేని సరస్సు వలె, వెన్న తీసిన కవ్వము వలె, సంస్కార హీనమగు వాక్కువలె, పీడించబడిన సైన్యము వలె, భర్త మరణించిన యువతి వలె, ధాన్యహీనమగు ప్రజవలె, మన్త్ర హీనమగు విధి వలె, ఆలోచన లేని యుద్ధమువలె, దయలేని ధర్మము వలె, రాజులేని రాజ్యమువలె, మన్త్ర హీనమగు క్రియ వలె, ధనధాన్య విహీనమగు గృహము వలె, బలహీనమగు కుంభమువలె, బురదలో చిక్కుకొనిన వృషభము వలె, భార్యా హీనుడగు గృహస్థుని వలె, రాజ్యభ్రష్టుడుగు రాజువలె, భగ్నక్రియయగు చికిత్సవలె, భగ్నశాఖమగువృక్షము వలె, తేజోహీన మగు గృహము వలె, నిర్జలమగు ధనము వలె, పొగలేని నిప్పువలె, కిరణములు లేని సూర్యుని వలె, మతి భ్రష్టుడగు మనిషి వలె, పర్వసంగియగుమానవుని వలె ప్రియురాలిచే తృప్తిని పొందని ప్రియిని వలె, విషమును విడిచిన పాము వలె, రెక్కలు తెగిన పక్షివలె, వృత్తి హీనుడగు బ్రహ్మణుని వలె, తలనుండి జారిన మాలవలె, ధాతువర్జిత మగు పర్వతము వలె, లిపి చెరిగిన శాస్త్రమువలె, విస్వరమగు ఋగ్యజుస్సుల వలె, స్వరహీన మగు సామమువలె, పద్మహీన మగు సరస్సువలె, తృణములచే నిండిన దారి వలె, రేకులు లీని పద్మము వలె,మమతతో నిండిన జ్ఞానము వలె, ప్రకృతిలేని పురుషుని వలె, తత్త్వహీనమగు సాంఖ్యము వలె, దంభాన్వితామగు ధర్మము వలె, నున్న తేజోహీనురాలగు మోహినిని దేవతలందరూ చూచిరి. అనంత శూన్యముగా ధ్యానించుచు జనులచే చూడబడుచు పుత్రహత్యగావించిన క్రూరురాలని క్రూరవచనములచే దూషించ బడుచున్న, దుష్టశీల, ధర్మమును విడిచినది, వారి వాక్యముల చే మోహిత, స్వవాక్యపాలన చేయునది, చండియగు మోహినిని గూర్చి వచ్చిన దేవతలిట్లు పలికిరి. ఓ సుందరీ ! దుఃఖించకుము. నీవు నీ ప్రయత్నమును చేసితివి. మాధవ భక్తులకు అవమానము కలుగదు. హరిణాక్షివగు నీవు దేవకార్యము కొరకొచ్చితివి . ఆ కార్యము సిద్దించలేదు. ఇపుడతను వెళ్ళి పోయెను. పూర్వమే రుక్మాంగద మహారాజు విఘ్ననాశకము, మహాపుత్య ప్రదమగు ఏకాదశి వ్రతము నాచరించి యుండెను. ఒక సంవత్సరము కృచ్ఛ్రవ్రతము నాచరించెను. ఆ వ్రత ప్రభావము వలననే రుక్మాంగదుడు సత్యమును తప్పలేదు. లోకమున నారి విఘ్నరాజ్ఞిగా చెప్పబడును. కాని సంధ్యావలీ దేవి మనోవాక్కాయములచే పుత్రసంహారమును సంకల్పించి, స్నేహమును విడిచి, స్వయముగా ఖడ్గము నందించెను. అంతటి ధృఢ దీక్షను చూచిన భగవంతుడగు మధు సూదనుడు సంతోషించెను.ప్రియుడగు పుత్రుని చుంపును కాని ఏకాదశి నాడు భుజించడు. పుత్రుని, భార్య యొక్క, రాజుయొక్క అభిప్రాయమును చూచి సంతోషించిన శ్రీ మహావిష్ణువు తల లొకమునకు గొని పోయెను. క్షీణకర్ములై అంగార సహితముగా నుండు ఆహితగ్ని వలె దేహముతో పాటు వెల్ళిరి. పని ప్రారంభించిన తరువాత ఫలము సిద్దించనిచో చేసిన ప్రయత్నములన్నియూ

వి ఫలములైనచో నీ దోషమేమి కలదు. కావుననే వరములనిచ్చుదేవతలందరూ నీవద్దకు వచ్చి యున్నారు . సిద్దించిననూ సిద్ధించక పోయిననూ పనిచేసిన వాడు వ్యర్థుడు కారాదు. ధర్మమును గోరు రాజు భృత్య వర్గమును పోషించ వలయును. కర్మ సిద్ధించక పోయినను సద్భావమున్నచో వేతనమును మాత్రమీయవలయును. బహు మానములు లభించవు. భృత్యుడు బతుకుటకు వేతనము నీయని వాడు గోహత్యా పాతకమును పొందును. కావున సద్భావముచే పని చేసిన వారికి ఫలమునీయ వలయును. దేవతలు నీకన్ని విధములా సహకరించి ఏ పని చేయలేదు. విఘ్ననాశిని యగు ద్వాదశీతేజస్సుచే భగ్నులైరి. ఇట్లు దేవతలు పలుకగా పతిహీనురాలై అతి దుఃఖముతో, ఆనంద శూన్యయగు మోహిని ఇట్లు పలికెను.

ధిగిదం జీవితం మహ్యం యేన కార్యం సాధితమ్‌ 41

నకృతో జనసంబాధో రుమమార్గోs మరాధిపాః నతు లుప్తం హరిదినం న భుక్తం హరివాసరే 42

భూభూజా తేన వీరేణ కృతః పుత్రవధో ముదా l గతో మూర్థ్ని పదం దత్త్వా మమ రుక్మాంగదో హరిమ్‌ 43

అప్రమే యగుణం విష్ణుం నిర్మలా శ్రయమ్‌ l హంసం శుచిపదం వ్యోమ ప్రణవం బీజ మవ్యయమ్‌ 44

నిరాకారం నిరాభాసం నిష్ప్రపంచం నిరంజనమ్‌ l శూన్యం వియత్స్వరూపం చ ధ్యేయం ధ్యాన వివర్జితమ్‌ 45

అస్తి నాస్తీతి యం ప్రాహు ర్నదూరే నాపి చాన్తికే l పరం ధామ మనోs గ్రాహ్యం పురుషాఖ్యం జగన్మయమ్‌ 46

హృత్పంక జ సవాసీనం తేజోరూప సనాతనమ్‌ l తస్మింల్లయ మను ప్రాస్తే కిం ను మే జీవతే ఫలమ్‌ 47

అసాధితే తు యః కార్యే నరో గృహ్ణాతి వేతనమ్‌ l స్వామినం తు పరిత్యజ్య ప్రయాతి నరకం ధ్రువమ్‌ 48

న సాధయున్తి యే కార్యం స్వామినాం తు దివౌకసః | భృత్యా వేతన భోక్తారో జాయన్తే భూతలే హయాః 49

అసాధి నీయం కార్యస్య భర్తృపుత్ర వినాశినీ l కథం వరం తు గృహ్ణామి భవతాం నాక వాసినామ్‌. 50

కార్యమును సాధించలేని నా ఈ జీవితము వ్యర్థము, యమ మార్గమున జనసమూహములను నిలుపలేక పోతిని. హరిదినమును లోపింప చేయలేక పోతిని. హరి వాసరమున భుజింప చేయలేక పోతిని. ఆరుక్మాంగద మహారాజు సంతోషముతో పుత్ర వధగావించెను నా శిరమున పాదమునుంచి రుక్మాంగద మహారాజు శ్రీహరిని చేరెను. అప్రమేయ గుణ్యుడు, నిర్మలుడు, నిర్మలాశ్రయుడు, హంస భూతుడు శుచిపదుడు, ప్రణవరూపుడు, బీజ భూతుడు, అవ్యయుడు, నిరాకారుడు, విరాభాసుడు, నిష్ప్రుపంచుడు, నిరంజనుడు, శూన్య రూపుడు, ఆకాశ స్వరూపుడు, ధ్యేయము, ధ్యాన వర్జితుడు, ఉన్నాడు లేడు అనబడువాడు, దూరమున దగ్గరలో ఉన్నవాడు, లేనివాడు, పరంధాముడు, మనసుచే గ్రహించబడని వాడు, పురుషాభిధుడు, జగన్మయుడు, హృత్పంకజ సమాసీనుడు, తేజోరూపుడు, సనాతనుడు అగు శ్రీహరియందు నా భర్త లీన మయినపుడు నా జీవితమున ఫలమేమున్నది. కార్యమును సాధించకనే యజమానిని విడిచి వేతనమును తీసుకొను భృత్యుడు నరకమును చేరును. స్వామికార్యమును సాధించకనే వేతనమును అనుభవించుభృత్యులు భూలోకమున అశ్వములుగా పుట్టెదరు. ఇపుడు నేను కూడా కార్యమును సాధించజాలక పోతిని. భర్తను పుత్రుని నశింప చేసితిని. అట్టినేను దేవతల నుండి వరమునేట్లు గ్రహించగలను.

దేవా ఊచు:

బ్రూహి మోహిని దాస్యామి యత్తే హృది సమీహితమ్‌ l అనృణాస్తు భవిష్యామః కృత్వా చోపకృతిం తవ 51

పరిశ్రమః కృతో దేవి త్వయా రాజ ప్రయోజనే l తస్య త్వం ఫలభాగ్దేవి తాదృశార్దే కృతస్యతు 52

ఏవముచ్చర మాణానాం దేవతానాం మహీపతే ! lనృపతే రాజగామాధ పురోధా ః పావకప్రభః 53

ఉషితో జలమధ్యేతు ప్రాణాయామరతో మునిః l ద్వాదశాబ్దే తతః పూర్ణే నిర్గతో జలమధ్యతః 54

నిర్గతేన శ్రుతం తేన మోహినీ చేష్టతం నృప l సక్రోధో ముని శార్దూలో దేవ బృన్దము పాగతః 55

ఉవాచ విబుధాన్సర్వా న్మోహినీ వరదాయిన ః l ధిగిమాం ధిగ్దేవ సంఘం కర్మధిక్పాప సంజ్ఞితమ్‌ 56

భవతో భావనాశాయ పురుషార్దే ప్రరోహకమ్‌ l భవన్తో యచ్చ దాతారో మోహిన్యా నాంఛితం వరమ్‌ 57

హత్యాయుతా భర్త్రసుతో పఘాతినీ విహీన వృత్తిశ్చ నరాశిరూపా lనాస్యాహిలోకే భవతీహ శుద్దిసమిద్ద మహ్నౌ పతన్యే పి దేవా ః 58

హత్యా యుతం భర్తృవధో నిరర్థర మేతత్సమం విప్రవరైః పురా కృతమ్‌ l న చాపి చాస్యా భవతీహ శుద్ది సమిద్ద వహ్నౌ పతనేపి దేవా 59

విమోహయిత్వా వచనై స్సుధామయై రుక్మాంగదం ధర్మవిభూషణంచ l ప్రియాయుతం మోక్షపదం నిహత్య చకార భూమిం నృపవర్జితాం చ 60

న చాపి వాసో నరకేషు దేవా అస్యాస్ద్నితిః క్వత్రిదివేల్ప బుద్దేః l న చాపి రాజ్ఞో నికటే చ దేవా నాప్యేతు విష్ణోః పదమవ్యయం యత్‌ 61

నలోక వాదేన విదూషతాయ లోకేషు కుత్రాపి భ##వేచ్చ వాసః l ధిగ్జీవనం కర్మవిగర్హితాయా దేవాస్సదా పాపసమారతాయాః 62

పతిం హత్యా సుతం హత్యా సపత్నీం జననీసమామ్‌ l హత్వా ధరాం సమస్తాం వాకాం గతిం యాస్యతే సురాః 63

ఇయం పాపతారా దేవా ధర్మవిధ్వంసీనీ హరేఃl సర్వదాప్యనయా ప్రోక్తం భుజ్యతాం హరి వాసరే 64

ప్రాణసంవర్దనార్ధాయ తేషామేవాప్య ధోగతిః l భుజ్యతాం వాసరే విష్ణో హన్యతాంగౌర్ద్వి జాన్వితా 65

అపేయం పీయతాముక్త్వా కధం వాసం లభేద్దివి l ఏతదజ్ఞానినాం ప్రోక్తం జ్ఞానినాం తున నిర్ణయః 66

అజ్ఞానాద్య్వాహృతే వాక్యే భుజ్యతాం హరివాసరే l తస్యాపి శుద్దిర్గదితా ప్రాణాయామ శ##తేన హి 67

అధవాప్యుపవాసేన ఏకాదస్యా దినౌకసః l ఋక్షేణ సంయుతాయాస్తు జ్యేష్ఠకుండాప్లవేనవా 68

శౌకరస్పర్శనాద్వాపి నరో దేవార్చనేన వా l వ్యాహృతే కధితం విపై#్ర సేయమద్య సునిష్ఠురా 69

భోజనే పాపనిరతా దేవేవిష్ణోర్దురాసదే l భర్తుర్వాక్యం వ్యపోహ్యైవ ఘాతయిత్వా సుతం ప్రియమ్‌ 70

వాక్యజ్ఞం వాక్యనిరతం మాత్పూణాం తు హితే రతమ్‌ l విష్ణుధర్మప్రలోప్త్రీయం బహుపాపసమన్వితా 71

నైషాస్సృశ్యాస్తి దేవేశాః కథమస్యా వరప్రదాః lభవంతో న్యాయయయుక్తేషు ధర్మయుక్తేషు తత్పరాః 72

పాలనం పాపయుక్తస్య న కుర్వన్తి దివౌకసః l ధర్మాధారా స్స్పతాదేవా ధర్మో వేదే సమాస్థితః 73

వేదైశ్శుశ్రూషణం భర్తు స్త్రీణాం ధర్మః ప్రకీర్తతః l యద్బ్రవీతి పతిః కించిత్‌ త్తత్కార్యమవిశంకయా 74

శుక్లం శుక్లమితి బ్రూయా త్‌ కృష్ణం కృష్ణేతి చామరా ః l శుశ్రూషా సా హి విజ్ఞేయా న శశ్రుషా హి సేవనమ్‌ 75

భర్తురాజ్ఞాస్థాహతా దేవా అత్మాజ్ఞాస్తాపనే చ్ఛయా l తస్మాత్పాపా న సందేహో మోహినీ సర్వయోషితామ్‌ 76

సత్యస్య సాధనార్థాయ శపదైర్యన్త్రితో నృపః l ఉవాచ వివిధం వాక్యం సానైచ్ఛత్పుత్రఘాతినీ 77

తేన మోక్షం గతో రాజా పాపమాస్యాం విసృజ్యచ l సేయం పాప శరీరా హి హత్యాయుత సమన్వితా 78

దాతారం సర్వదానానాం బ్రహ్మణ్యం హరిదైవతమ్‌ l ప్రజారంజన శీలంచ హరివాసర సేవినమ్‌ 79

పరదారేషు నిస్నేహం విషయే విగతస్పృహమ్‌ l పరార్థత్యక్తకామంచ సదా

మఖనిషేవిణమ్‌ 80

సదైవ దుష్టద మనే వర్తమానం ధరాతలే l వ్యసనై స్సప్తభి ర్ఝోరై రనాక్త్రాన్తం మహీపతిమ్‌ 81

సంనిరస్య దురాచారా వరయోగ్యా కథం భ##వేత్‌ l యోస్యాః పక్షేతు వర్తేత దేవో నా దానవోపి నా 82

తం చాపి భస్మసాత్కుర్యాం క్షణన సుర సత్తమాః l మోహిన్యా రక్షణ యస్తు ప్రయత్నం కురుతే సురాః 83

తస్య త జ్జాయతే పాపం యన్మోహిన్యాం వ్యవస్థితమ్‌ 84

స ఏవముక్త్వా న్పపతే ద్విజేన్ద్ర స్సంగృహ్య పాణౌ సలిలం చ తీవ్రమ్‌ l క్రోధేన సంవీక్ష్య విధి ప్రసూతాం చిక్షేప తన్మూర్ద్న్యసల ప్రకాశమ్‌ 85

నిక్షిప్తమాత్రే సలిలే మషీవ సద్యః ప్రజజ్వాల చ తచ్ఛరీరమ్‌ l సంపశ్యతాం నాకనివాసినాం తు తృణం యథా వహ్నిశిఖావలీఢ 86

కోపం విభో సంహర సంహరేతి యావద్గరః ఖే మరుతాం బభూవుః l తావత్స వహ్నిర్ద్విజ వాక్యసృష్టో భసటావశేషాం ప్రమాదాం చకార 87

ఇతి శ్రీబృహన్నారదీయ మహాపురాణ ఉత్తరభాగే

మోహినీ చరితే శాపప్రాప్తిర్నామ పంచత్రింశోsధ్యాయ

దేవతలు పలికిరి:- ఓ మోహినీ ! నీ హృదయమున నున్న దేమిటో చెప్పుము ఇచ్చెదను. నీకు ఉపకారమును చేసి ఋణ విముక్తులమగుదుము. రాజప్రయోజన విషయమున నీవు పరిశ్రమించితివి . కావున నీ పరిశ్రమకు తగిన ఫలమును పొందుటకు యోగ్యురాలవు. ఇట్లు దేవతలు పలుకుచుండగా అగ్ని సమతేజో వంతుడగు రాజపురోహితుడు వచ్చెను. ఈ పురోహితుడు పన్నెండు సంవత్సరములు జలమధ్యమున ప్రాణయామ పరుడై యుండి జలమధ్యమునుండి బయలువెడలి మోహినీ చేష్టితమును విని క్రోధముతో దేవబృన్దమును సమీపించెను. మోహీనీ దేవికి వరమునీయ సంకల్పించిన దేవతలతో ఇట్లు పలికెను. ఈమోహిని వ్యర్దురాలు ఈ దేవసంఘము వ్యర్దము ఈమె చేసిన పాపవు కర్మ నిత్యము. మీభావనాశము కొరకే పురుషార్ధ ప్రరోహణము చేయ సంకల్పించిరి. మీరు మోహినికి వరమునీరు సంకల్పించితిరి. హత్య చేసినది. భర్తను పుత్రుని చంపినది. వృత్తిని విడిచినది. రాక్షసిరూపమును ధరించినది. ఈమోహిని పబాగుగా జ్వలించు అగ్నిలో పడినను శుద్దురాలు కాజాలదు. హత్య చేసినది వ్యర్ధముగా భర్తవధను గావించినది. ఈమె మండు అగ్నిలో పడిననూ శుద్ధినొందజాలదు. రుక్మాంగద మహారాజును, ధర్మాంగదుని అమృతోపములగువచనములచే మోపింప చేసి, ప్రియరురాలితో పాటు మోక్షమునకు పంపి రాజులేని రాజ్యమును చేసెను. ఈ అల్పబుద్ధికి నరకమునకూడా నివాసము లభించదు. ఇక స్వర్గమున నెట్లుండును? రాజుసమీపమున నుండ జాలదు . అవ్యయమగు విష్ణుపదమునకు అర్హురాలుకాదు. లోకవాదదూషితయగు స్త్రీకి ఏలోకమున కూడా వసతి ఉండదు. ఎప్పుడు పాపరతురాలు నింద్యకర్మచేయు స్త్రీ జీవితము వ్యర్దము. భర్తను చంపి, పుత్రుని చంపి, తల్లివంటి సవతిని చంపి భూమిని శూన్యము చేసిన ఈమె ఏలోకమునకువెళ్లును. ఈ మోహినిక పాపరతురాలు. శ్రీహరిధర్మమును ధ్వంసము చేసినది. ఈమె ఎపుడూ హరివాసరమున భుజించమని పలికినది .ప్రాణములను కాపాడుకొనుటకు కూడా హరివాసరమున భుజించుము అని, గొవును బ్రాహ్మణుని వధించమని పలికినవారికి అధోగతియే ప్రాప్తించును. పానము చేయరానిదానిని త్రాగమనిననూ స్వర్గమున వాసము లభించదు ఇది తెలియక పలికినవారి గతి. ఇక తెలిసి పలికిన వారేమగుదురో నిర్ణయించిబడలేదు. తెలియక హరివాసరమున భుజించమని పలికిన వారికి శతప్రాణాయామములతో శుద్ది చెప్పబడినది. లేదా ఏకాదశ ఉపవాసములతో శుద్ది లభించును. జ్యేష్ఠా నక్షత్రయుతైకాదశ్యుపవాసమునకాని, కుండప్లవము చేకాని, శౌకరస్పర్శచేకాని, దేవార్చనముతో కాని శుద్ధిలభించును. కాని ఈమె పరమ నికృష్ఠురాలు. విష్ణుదినమున భోజనమును చేయమని నిరోధించెను. భర్తమాటను కాదని, ప్రియపుత్రుని చంపిచెను. ఆ పుత్రుడు కూడా వాక్యకోవిదుడు, వాక్యనిరతుడు, మాతృహితరతుడు. విష్ణుధర్మలోపకారిణి. బహుపాపసమన్విత, ఈమెనుస్పృశించరాదు. ఇక వరములనెట్టిత్తురు. మీరు న్యాయ ధర్మతత్పరులు. దేవతలు పాపులను రక్షించరు. దేవతలకాధారము ధర్మము. ధర్మమునకాధారము వేదము. ఆ వేదమున స్త్రీలధర్మము పతిని సేవించుటయని చెప్పబడినది. భర్త పలికిన దానిని సందేహించక నా చరించవలయును. తెలుపు అన్న తెలుపు అని నలుపు అనిన నలుపు అని చెప్పుటయే శుశ్రూషయనబడును. సేవించుట శుశ్రూషకాదు. తన ఆజ్ఞను స్థాపించు కోరికచే భర్త ఆజ్ఞను తిరస్కరించబడినది . కావున స్త్రీలందరిలో మోహిని పరమపాపాత్మురాలు. సత్యమును పాలించమని శపధముచే రాజును నిర్బంధించినది. ఎన్నిమాటలు చెప్పిననూ ఈమె అంగీకరించలేదు. పుత్రఘాతిని అయినది. కావున రాజు ఈమెయందు పాపమునుంచి మోక్షమును చేరెను. కావున ఈమోహిని రెండుహత్యలను గావించి పాపశరీరురాలైనది . సర్వదానములు చేయువాడు, బ్రహ్మణ ప్రియుడు, శ్రీహరి భక్తుడు, ప్రజారంజన శీలుడు, హరివాసరసేవకుడు, పందారలందు ప్రీతిలేనివాడు, విషయస్సృహలేనివాడు, పరార్దమునకు కామనలను వదిలినవాడు, సర్వకాలములందు యజ్ఞసేవకుడు, భూమండలమున ఎల్లపుడు దుష్టదమనము చేయువాడు, సప్తఘోర వ్యసనదూరుడు, అగు మహారాజునునిరసించిన దురాచార పరురాలు వరయోగ్యురాలెట్లగును. ఈమె పక్షమున నున్న దేవతులుకాని దానవులుకాని క్షణకాలమున భస్మము చేతును. మోహినిని రక్షించుటకు ప్రయత్నించు వానికి కూడా మోహినీ పాపము ప్రాప్తించును. పురోహితుడిట్లు పలకి చేతిలో తీర్థజలమును స్వీకరించి మోహినిని కోపముతో చూచి ఆమె శిరస్సున అగ్నితేజముకల జలమును చల్లెను. జలమునుచల్లినంతనే మోహినీ శరీరము మండసాగెను. దేవతలందరూ చూచుచుండగనే ఈమంటలంటిన గడ్డిపోచవలె మోహిని అయెను. ఆకాశమున మరుత్తులు కోపమును ఉపసంహరించుకోనుము, ఉపసంహరించుకొనుము అని అనుచుండగనే బ్రహ్మణవాక్యసృష్టయగు అగ్ని మోహినిని భస్మము గావించెను.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున

ఉత్తర భాగమున మోహినీ చరితమున శాపప్రాప్తియను ముప్పదియైదవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page