Jagadguru divyacharithra   Chapters   Last Page

 

20. తెలిసికోదగిన అంశాలు

పూరీ గోవర్ధన జగన్నాథ మఠ గరుపరంపర :

బి. సి. 5వ శతాబ్దినుండి నేటివరకుగల పూరీ పీఠగురుపరంపర 'ఆదిశంకరుల మఠ సంప్రదాయ చరిత్ర' అనే ఆంగ్ల గ్రంథంలో 175వ పుటలో పేర్కొనబడి ఉన్నది. ఈ పరంపరనుగూర్చి గ్రంథకర్తలు ఆ గ్రంథారంభంలోనే 'Preface' లో ఇలా పేర్కొన్నారు.

"We thank His Holiness Sri Yogeswarananda tirtha, Sankaracharya of the Govardhana Matha of the Vimala pitha of Jagannath, for the Acharya parampara of the Govardhana matha that he so graciously favoured us with."

శంకరభగవత్పాదులు

1 పద్మపాదాచార్య

2 శూలపాణి

3 నారాయణ

4 విద్యారణ్య

5 వామదేవాచార్య

6 పద్మనాభాచార్య

7 జగన్నాథాచార్య

8 మాధురేశ్వర

9 గోవిందాచార్య

10 శ్రీధరస్వామి

(భగవద్గీత వ్యాఖ్యాత)

11 మాధవానంద

12 కృష్ణబ్రహ్మానంద

13 రామానంద

14 వాగీశ్వర

15 శ్రీపరమేశ్వర

16 గోపాలేశ్వర

17 జనార్ధన

18 జననానంద

19 బృహదారణ్యతీర్థ

20 మహాదేవతీర్థ

21 పరమబ్రహ్మానంద

22 రామచంద్రతీర్థ

23 సదాశివతీర్థ

24 హరీశ్వరానందతీర్థ

25 బోధానంద

26 శ్రీరామకృష్ణతీర్థ

27 చిద్బోధాత్మతీర్థ

28 తత్వాక్షరముని

29 శ్రీశంకరతీర్థ

30 శ్రీవాసుదేవతీర్థ

31 హయగ్రీవతీర్థ

32 శ్రుతిశ్వరతీర్థ

33 విద్యానందతీర్థ

34 ముకుందానందతీర్థ

35 హిరణ్యగర్భతీర్థ

36 నిత్యానంద తీర్థ

37 శివానందతీర్థ

38 యోగీశ్వరతీర్థ

39 సుదర్శనతీర్థ

40 వ్యోమకేశతీర్థ

41 దామోదరతీర్థ

42 యోగానందతీర్థ

43 గోలోకేశ తీర్థ

44 కృష్ణానందతీర్థ

45 దేవానందతీర్థ

46 చంద్రచూడతీర్థ

47 హలాయధ తీర్థ

48 శ్రీధరతీర్థ

49 నారాయణతీర్థ

50 సదాశివతీర్థ

51 జయకృష్ణతీర్థ

52 విరూపాక్షతీర్థ

53 విద్యారణ్యతీర్థ

54 సిద్ధేశ్వరతీర్థ

55 తారకాత్మతీర్థ

56 బోధాయనతీర్థ

57 విశ్వేశ్వరతీర్థ

58 విబుధేశ్వరతీర్థ

59 మహేశ్వరతీర్థ

60 మధుసూదనతీర్థ

61 రఘూత్తమతీర్థ

62 రామచంద్రతీర్థ

(సిద్ధాంత చంద్రికాకర్త)

63 యోగీంద్రతీర్థ

64 మహేశ్వరతీర్థ

65 ఓంకారతీర్థ

66 నారాయణతీర్థ

88 జగన్నాథతీర్థ

68 శ్రీధరతీర్థ

69 రామానందతీర్థ

70 తామ్రకతీర్థ

71 ఉగ్రేశ్వరతీర్థ

72 ఉద్ధానందతీర్థ

73 సంకర్షణతీర్థ

74 జనార్థనతీర్థ

85 అంఖాత్మతీర్థ

76 దామోదరతీర్థ

77 శివానందతీర్థ

78 గదాధరతీర్థ

79 విద్యాధరతీర్థ

80 వామనతీర్థ

81 శంకరతీర్థ

82 నీలకంఠతీర్థ

83 రామకృష్ణతీర్థ

84 రఘూత్తమతీర్థ

85 దామోదరతీర్థ

86 గోపాలతీర్థ

87 మృత్యుంజయతీర్థ

88 గోవిందతీర్థ

89 వాసుదేవతీర్థ

90 గంగాధరతీర్థ

91 సదాశివతీర్థ

92 వామదేవతీర్థ

93 ఉపమన్యుతీర్థ

94 హయగ్రీవతీర్థ

95 పూరితీర్థ

96 రఘూత్తమతీర్థ

97 పుండరీకాక్షతీర్థ

98 పరశంకరతీర్థ

99 వేదగర్భతీర్థ

100 వేదాంతభాస్కరతీర్థ

101 విజ్ఞానాత్మతీర్థ

102 శివానందతీర్థ

103 మహేశ్వరతీర్థ

104 రామకృష్ణతీర్థ

105 వృషధ్వజతీర్థ

106 శుద్ధబోధతీర్థ

107 సోమేశ్వరతీర్థ

108 బోపదేతీర్థ

109 శంభుతీర్థ

110 భృగుతీర్థ

111 కేశవానందతీర్థ

112 విద్యానందతీర్థ

113 వేదానందతీర్థ

114 బోధానందతీర్థ

115 సుతాపానందతీర్థ

116 శ్రీధరతీర్థ

117 జనార్థనతీర్థ

118 కామనాశానందతీర్థ

119 హరిహరానందతీర్థ

120 గోపాలతీర్థ

121 కృష్ణానందతీర్థ

122 మాధవానందతీర్థ

123 మధుసూదనతీర్థ

124 గోవిందతీర్థ

125 రఘూత్తమతీర్థ

126 వాసుదేవతీర్థ

127 హృషీకేశ తీర్థ

128 దామోదరతీర్థ

129 గోపాలానందతీర్థ

130 గోవిందతీర్థ

131 రఘూత్తమతీర్థ

132 రామచంద్రతీర్థ

133 గోవిందతీర్థ

134 రఘునాథతీర్థ

135 రామకృష్ణతీర్థ

136 మధుసూదనతీర్థ

137 దామోదరతీర్థ

138 రఘూత్తమతీర్థ

139 శివతీర్థ

140 లోకనాథతీర్థ

141 శ్రీ దామోదరమహరాజ్‌

142 శ్రీ శంకరమధుసూదన స్వామి

143 భారతికృష్ణతీర్థ

144 యోగీశ్వరానందతీర్థ



ప్రస్తుతం ఆచార్యులు

శ్రీ స్వామీ నిరంజన దేవతీర్థజీమహరాజ్‌,

-(జాగృతి 8-5-1967)

ద్వారకాపీఠ ఆచార్య పరంపర

బి.సి 5వ శతాబ్దినుండి నేటివరకుగల ద్వారకాపీఠ గురుపరంపర 'ఆదిశంకరుల మఠసంప్రదాయచరిత్ర' అనే ఆంగ్లగ్రంథంలోనే 170వ పుటలో ఇలా పేర్కొనబడిఉన్నది.

పీఠాధిరోహణ సిద్ధిపొందిన

సంవత్సరం సంవత్సరం

శ్రీశంకర భగవత్పాదులు : 2961

(యు. శ)

1 బ్రహ్మా స్వరూపాచార్య 2691 2715

(యుధిష్ఠిరశకం)

2 చిత్సుఖాచార్య 2714 యు. శ. ......

3 సర్వజ్ఞానాచార్య 2714 యు. శ. 2823

4 బ్రహ్మానందతీర్థ 2823 యు. శ. 2890

5 స్వరూపాభిజ్ఞాచార్య 2890 యు. శ. 2942

6 మంగళమూర్తి ఆచార్య 2942 యు. శ. 2965

7 భాస్కరాచార్య 2965 యు. శ. 3008

8 ప్రజ్ఞానాచర్య 3008 యు. శ. 3040

9 బ్రహ్మజ్యోత్స్నాచార్య 3040 యు. శ. 9

(విక్రమశకం)

10 ఆనందావిర్భావాచార్య __ __

11 కళానిధితీర్థ 9 వి.శ. 8

12 చిద్విలాసాచార్య 82 వి.శ. 142

13 విభూత్యానందాచార్య 114 వి.శ. 154

14 స్ఫూర్తినిలయపాద 154 వి.శ. 203

15 వరతంతుపాద 203 వి.శ. 249

16 యోగరుద్ధాచార్య 249 వి.శ. 360

17 విజ్ఞానడిండిమాచార్య 360 వి.శ. 394

18 విద్యాతీర్థ 394 వి.శ. 438

19 చిచ్ఛక్తి దేశిక 438 వి.శ. 483

20 విజ్ఞానేశ్వరతిర్థ 483 వి.శ. 511

21 ర్తుంభావాచార్య 511 వి.శ. 572

22 అమరేశ్వరగురు 572 వి.శ. 608

23 సర్వముక్తతీర్థ 608 వి.శ. 669

24 స్వనందదేశిక 669 వి.శ. 721

25 నమరరాశికాచార్య 721 వి.శ. 799

26 నారాయణశ్రమ 799 వి.శ. 836

27 వైకుంఠాశ్రమ 836 వి.శ. 885

28 త్రివిక్రమాశ్రమ 885 వి.శ. 911

29 శశిరేఖరాశ్రమ 911 వి.శ. 960

30 త్య్రంబకాశ్రమ 960 వి.శ. 965

31 చిదంబరాశ్రమ 965 వి.శ. 1001

32 కేశవాశ్రమ 1001 వి.శ. 1050

33 చిందంబరాశ్రమ 1052 వి.శ. 1083

34 పద్మానాభాశ్రమ 1083 వి.శ. 1100

35 మహాదేవాశ్రమ 1109 వి.శ. 1184

36 సచ్చిదానందాశ్రమ 1184 వి.శ. 1207

37 విద్యాశంకరాశ్రమ 1207 వి.శ. 1265

38 అభినవసచ్చిదానందాశ్ర 1265 వి.శ. 1293

39 నృసింహాశ్రమ 1293 వి.శ. 1326

40 వాసుదేవాశ్రమ 1326 వి.శ. 1361

41 పురుషోత్తమాశ్రమ 1361 వి.శ. 1384

42 జనార్ధనాశ్రమ 1384 వి.శ. 1408

43 హరిహరాశ్రమ 1408 వి.శ. 1411

44 భావాశ్రమ 1411 వి.శ. 1421

45 బ్రహ్మాశ్రమ 1421 వి.శ. 1436

46 వామనాశ్రమ 1436 వి.శ. 1463

47 సర్వజ్ఞానాశ్రమ 1463 వి.శ. 1489

48 ప్రద్యుమ్నాశ్రమ 1489 వి.శ. 1496

49 గోవిందాశ్రమ 1495 వి.శ. 1523

50 చిదాశ్రమ 1523 వి.శ. 1576

51 విశ్వేశ్వరాశ్రమ 1576 వి.శ. 1608

52 దామోదరాశ్రమ 1608 వి.శ. 1615

53 మహాదేవాశ్రమ 1615 వి.శ. 1616

54 అనిరుద్ధాశ్రమ 1616 వి.శ. 1625

55 అచ్యుతాశ్రమ 1625 వి.శ. 1629

56 మాధవాశ్రమ 1629 వి.శ. 1635

57 ఆనందాశ్రమ 1635 వి.శ. 1716

58 విశ్వరూపాశ్రమ 1716 వి.శ. 1721

59 చిద్ఘనాశ్రమ 1721 వి.శ. 1726

60 నృసింహాశ్రమ 1726 వి.శ. 1735

61 మనోహరాశ్రమ 1735 వి.శ. 1761

62 ప్రకాశానందసరస్వతీ 1761 వి.శ. 1775

63 విశుద్ధానందాశ్రమ 1775 వి.శ. 1831

64 వామనేశ 1831 వి.శ. 1878

65 కేవలాశ్రమ 1878 వి.శ. ?

66 మధుసూదనాశ్రమ 1848 (?) 1862 (?)

67 హయగ్రీవాశ్రమ 1862 (?) #9; 1863 (?)

68 ప్రకాశాశ్రమ ? ?

69 హయగ్రీవాశ్రమసరస్వతి 1863 వి.శ. 1874

70 శ్రీధరాశ్రమ 1874 వి.శ. 1914

71 దామోదరశ్రమ 1914 వి.శ. 1928

72 కేశవాశ్రమ 1928 వి.శ. 1935

73 శ్రీరాజరాజేశ్వర శంకరశ్రమ 1935 వి.శ. 1957

74 మాధవతీర్థ 1957 వి.శ. 1972

75 త్రివిక్రమతీర్థ __ __ __

76 భారతికృష్ణతీర్థ __ __ __

77 స్వరూపానంద __ __ __

78 యోగేశ్వరానంద #9; .... ..... .....

79 అభినవసచ్చిదానందతీర్థస్వామివారు (ప్రస్తుతం ఆచార్యులు)

శృంగేరీ సాక్ష్యాధారాలు

ఈ విధంగా పూరీ, ద్వారకపీఠగురుపరంపరలు బి.సి. 5వ శతాబ్దినుండి స్పష్టంగా కన్పించుచున్నవి, కాని ఈ గ్రంథంలో ఇంతకు పూర్వమే నేనుచూపిన శృంగేరీపీఠపక్షాన వివరింపబడే అంశాలనుబట్టి, ఆదిశంకరుల జననం కొన్నాళ్ళు బి. సి. 36, మరి కొన్నాళ్ళు బి.సి. 44. ఈ సమయంలో 'సురేశ్వరా చార్యులవారి పీఠాధిపత్యం 800 సంవత్సరాలని తెలుస్తోంది. అంతటితో సరిపోవలేదు. మరల వారే ఆదిశంకరుల జననం ఎ. డి. 805 అని, మరల ఎ. డి. 788 అని అంతేకాక ఎ.డి. 684 అని కూడ వెల్లడించుతున్నారు. ఈ సమయంలో సురేశ్వరుల పీఠాధిపత్య కాలాన్ని 800 నుండి 72 సంవత్సరాలకు కుదించారు. ఈ విధంగా అనేక పరిణామాలు కన్పించుతున్నవి.

అలాగే వీరికి ప్రమాణమైన గురువంశ కావ్యానికి ఆనందగిరీయం ప్రమాణమన దానిలోనే 1. అధ్యా. 6వ శ్లోకంలో వున్న 'కవీంద్రైః' అనే పదానకి, కవీంద్రైc =ఆనందగిరి యతీంద్రాదిభిః -అని వ్రాసుకొన్నారు. వ్యాఖ్య ప్రతిరూపాన్ని ఇచట చూడండి. :

आर्याणामिति । कवीन्द्‌ै: आन्दगिरिययतीन्द्रादिभि: । उप दर्शितं प्रकटिकृतम्‌ । आर्याणां श्रीमदाचार्यादीताम्‌ । कुलं परं-पराम्‌ । प्रस्मोतु: प्रकर्षेण स्तोतु: ।मम । मनाक्‌ ईषत्‌ । वचसौ वाच: । प्रचार: प्रसरणम्‌ । वात्सल्यस्नुतं वांत्सल्येव स्नुतं प्रस्नुतम्‌ । सौरभेय्या: गो: । अमृतं क्षीरम्‌ । जवेन वेगेन । पातु गृहीतुम्‌ । वत्सस्य । उपगतिरिव समीपगमनमिव । अस्तु भवनु । सौरमेय्या: आर्याणां कुलस्य अमृतस्य वात्सल्यकवीन्द् यो: स्ववत्सयोश्च बिम्ब- प्रतिबिम्बभाव: । स्नुतोपदशितपदार्थयो: वस्तुप्रतिवस्नुभाव: । पूणोपमा ।।६।।

ఆనంద గిరీయ ప్రతులన్నిటియందును ఆదిశంకరుల సిద్ధిస్థానము కాంచీక్షేత్రమని పేర్కొనబడియుండగా ఈ గురువంశ కావ్యమునందు 3వ సర్గలో 70 శ్లోక వ్యాఖ్యలో తత్ర = మాహురీపురే-అని పేర్కొనబడినది. ఆ వ్యాఖ్యరూపాన్నిచట చూడండి.

तृतीय: सर्ग:'

१२७

दत्तात्रेयमिति । भुवनविनुतं भुवनेषु त्रिषु लोकेषु विनुत साक्षान्महाविरिति प्रशंसितं दत्तात्रेयं दत्तश्चासावात्रेयश्च अत्रेर- पत्यं पुमानात्रेय: 'इतश्चानित:' इति इकारान्तान्‌ घच अपत्ये ढक्‌ । स च विष्णुना स्वांशत्वेन दत्त: । तयोक्तं दत्तात्रेयं वीक्ष्य आलोक्य नत्वा नसस्कृत्य सकलमपि स्वीयं वृत्तं चरित्रं दिक्षु प्रेषि- तान्‌ तान्‌ शिष्यानपि न्यगादीत्‌ अवोचत्‌ । सोपि दत्तात्रेयोपि मुनिपतिर्विशरुपाचार्यादिभ्य: आशिष: अदात्‌ दत्तवान्‌ । तत्र माहुहीपुरे भाषमाणौ संलपन्तौ तौ दत्तात्रेयशक्कराचायौ चिरं बहुकालम्‌ अव्सतां उषितवन्तौ । मन्दाकान्तावृत्तम्‌ । 'मदाकान्ता जलधिषडगैम्तै नतौ ताद्नुरु चैत्‌' लक्षणात्‌ ।। ७।:

इति गुरुवंशव्याश्वयायां भावबोधिन्यां

तृतीय: सर्ग: ।।

రేవణాసిద్ధ మహాయోగి :

మరొక అంశ మేమన ఈ గురువంశ కావ్యంలోనే 3వ సర్గ 33వ శ్లోక వ్యాఖ్యలో వీరికి చంద్రమౌళీశ్వర లింగము వీరశైవాచార్యుడైన 'రేవణాసిద్ధ మహాయోగి'వల్ల లభించినట్లున్నది. సుసిద్ధేన = రేవణాసిద్ధ మహాయోగినా-అని ఉన్న వ్యాఖ్యారూపాన్నిచట చూడండి.

ఆనందగిరీయం ;

ఆదిశంకరుల చరిత్రను తెలిపే ప్రాచీన గ్రంథాలలో శివ రహస్యం-ఆనందగిరీయము ప్రధానమయిన ప్రమాణ గ్రంథాలుగా అంగీకరింపపడుచున్నవి. ఐతే ఆనందగిరి ఆదిశంకరులకు వారి సమకాలీన శిష్యులు కావటం చేత ఈ గ్రంథం అతి ప్రాచీనమైనది. ఈ మధ్యలో అద్వైతేతరులు వైదికేతరులు తమ ఘనతను వెల్లడించుకొనుటకై ఈ గ్రంథంలో తమ అధిక్యాన్ని నిరూపించుకునే-కొన్ని అంశాలను వారికి ప్రాబల్యంగల రోజుల్లో చేర్చి ప్రచారం చేసినట్లు పండితు లభిప్రాయపడుదురు. దీన్ని ప్రమాణ గ్రంథంగా మాత్రం ఎల్లరు అంగీకరించుతున్నారు.

కాశీలోని వల్లభరామ సాలగ్రామ సాంగవేద పాఠశాలా పక్షాన శ్రీ రాజేశ్వరశాస్త్రిగారు ప్రచురించిన 'శంకర పూజాక్రమం' అనే గ్రంథంలో ఆనందగిరీయ ప్రామాణ్యాన్ని విస్పష్టం చేశారు. కాశీలోని 'రామతారక మఠం'లో ఇప్పటికి 150 సంవత్సరాలకి పూర్వం వ్రాసి యుంచబడిన లిఖిత ఆనందగిరీయ ప్రతి గూర్చి వ్రాశారు. అలాగే శాంకర పీఠ తత్త్వదర్శనంలో కూడ 'ధర్మప్రాణ' శ్రీ ద్రవిడ లక్షణ శాస్త్రిగారు (అఖిల భారతీయ వర్ణాశ్రమ స్వరాజ్య సంఘ వ్యవస్థాపకులు) వంగదేశీయ తారకేశ్వర మహస్త్వభియోగ సమయంలో సాక్ష్యం ఇస్తూ పంచాగ్ని విద్యా న్యాయాదులతో శాస్త్రీయంగా ఆనందగిరీయ ప్రామాణ్యాన్ని నిరూపించినట్లు పేర్కొన్నారు.

అంతేకాక మాధవీయ గ్రంథ వ్యాఖ్యానములయిన 'డిండిమం- అద్వైతలక్ష్మి-అను వానిలో సైతం మాధవీయ ప్రామాణ్యాన్ని నిరూపించుకోవటం కోసం అచటచట ఆనందగిరీయ పంక్తులను ఉదాహరించుకొంటూ వ్యాఖ్యానించిన విషయం కూడ విస్మరింపకూడదు.

మాధవీయం :

మాధవీయమనబడే ఈ గ్రంథాన్ని గూర్చి సమగ్ర విమర్శకు ప్రత్యేకంగా ఒక గ్రంథాన్ని వ్రాయవలసి ఉన్నది. విద్యారణ్యుల వారి పేరుతో దీని గౌరవం హెచ్చి అనేక మందిని ఇది ఇప్పటికి భ్రమింపచేస్తున్నది. ప్రొఫెసర్‌ యం. హిరియన్న, కె. టి. తెలాంగ్‌ మున్నగు పండితులు విశేష పరిశోధన చేసి ఇది మాధవకృతం కాదనే నిర్ణయానికి వచ్చారు. ఇంకా అనేకాంశాలను మైసూర్‌ ఓరియంటల్‌ రీసర్చి ఇన్‌స్టిట్యూట్‌ రిటైర్డు సూపరింటెండెంటు శ్రీ హెచ్‌. ఆర్‌. రంగస్వామి అయ్యంగారు, మైసూరు ఆర్కియాలజీ డిపార్టుమెంటులో అసిస్టెంటుగా పనిచేసి రిటైరైన శ్రీ ఆర్‌. చక్రవర్తిగారు. తాము వ్రాసిన 'శ్రీ శంకర వేర్‌ హి ఎటైన్డ్‌ సిద్ధి అనే పరిశోధనాత్మకమయిన ఆంగ్ల వ్యాసంలో స్పష్టంగా పేర్కొన్నారు.

ప్రెసెప్టర్స్‌ ఆఫ్‌ అద్వైత ;

ఇది ఆంగ్లంలో ప్రచురింపబడిన గ్రంథము. సికింద్రాబాద్‌లోని కంచికామకోటి శంకర మందిరమువారు దీన్ని ప్రచురించారు. అద్వైత సంప్రదాయంలో వసిష్ఠుని మొదలు 61 మంది అద్వైత సిద్ధులచరిత్రలు ముఖ్యంగా వారి అద్వైత సిద్ధాంత ప్రతిపాదనాంశములు వ్రాయబడినవి. మొత్తం 54 మంది మహా విద్వాంసుల వ్యాసములివి. ఇందులోని 1. 'శంకర అండ్‌ శంకరైట్‌ ఇనిస్టిట్యూషన్సు', 2. 'కామాక్షి-ఆమ్నాయశక్తి', 3. 'శ్రీ కామకోటి పీఠం' అనే మూడు న్యాసములు కూడ ఉన్నవి. ఈ మూడు వ్యాసములు మిక్కిలి ఆసక్తి జనకములైన అనేకాంశాలను పేర్కొనుచున్నవి. అద్వైత సంప్రదాయ విశేషములందాసక్తిగల వారికి గ్రంథము తప్పక చదువదగియున్నది.

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము :

ఈ విజ్ఞాన సర్వస్వం రెండవ సంపుటం శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు, ఎం. ఏ. గారి ముఖ్య సంపాదకత్వాన వెలువడినది. 1934 సంవత్సరంలో ఆంధ్రపత్రికా ముద్రణాలయమున ముద్రింపబడినది.

''దేశోద్ధారక, విశ్వదాత, కళాప్రపూర్ణ శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు పై సంపుటంలో 'అపరోక్షానుభూతి' అనే శీర్షికతో వ్రాసిన వ్యాసంలో (114వ పుట) ఆది శంకరులు స్థాపించిన ద్వారక, పూరి మున్నగు పీఠాలతో పాటు కాంచీ క్షేత్రంలోని కామకోటి విషయములను పేర్కొన్నారు.

17-12-1921న ఆంధ్రపత్రికలో శంకరవిజయ కర్తృత్వాన్ని గూర్చిన కుతూహల జనకములయిన అంశాలతో గూడిన వ్యాసం ప్రచురింపబడింది.

18-7-1954న 'శ్రీ కాంచీమఠము-శాసనప్రశంస' అనెడి శీర్షిక గలిగి అనేక అమూల్యాంశాలకు వెల్లడించే పరిశోధనా వ్యాసం ఆంధ్ర పత్రికలో ప్రచురింపబడినది.

19-5-1967 'అద్వైత మత స్థాపకులు-ఆదిశంకరులు'అను శీర్షికగల వ్యాసాన్ని శ్రీ మల్లెల శ్రీరామమూర్తిగారు (విజయవాడ)ఆంధ్రపత్రికలో వ్రాశారు.

ఈ వ్యాసంలోని అంశాలకు సమాధానంగా శ్రీకల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులుగారు వ్రాసిన వ్యాసాన్ని ఆంధ్రపత్రిక వారుగాని స్వయంగా 'విజయవాణి' పత్రికా సంపాదకులైన పై శ్రీరామమూర్తి గారు తమ పత్రికలోగాని ప్రచురింపలేదని శ్రీ దీక్షితులుగారు చెప్పుచున్నారు.

పాఠకుల సౌకర్యంకోసం శ్రీ దీక్షితులగారీ సమాధాన వ్యాసం ఇచ్చట ప్రచురింప బడుచున్నది.

అద్వైతమతస్థాపకుల ఆదిశంకరులు ;

ఈప్ల వంగ సంవత్సర శంకరజయంతి శుభ సందర్భంలో 19-5-67న ఆంధ్రపత్రికయందు పై శీర్షిక గల ఒక వ్యాసం ప్రకటింపబడినది. శంకర భక్తుల కందరకు ఇది సందర్భానుగుణంగానే వున్నది. అందులో గ్రహింపబడిన ఆచార్య చరిత్ర అందరకు ప్రబోధకరంగా వున్నది. ఇందులో పేర్కొనబడిన భగవత్పాదుల చరిత్ర సంప్రదాయముల విషయంలో నాకు తెలిసిన కొన్ని అంశములను బుద్ధిమంతు సన్నిధిని ఉంచుతున్నాను

1. ఈ వ్యాసంలో 7-5-65న జరిగిన శంకర జయంతి సమయంలో ''శృంగేరీ, పూరీ, ద్వారక మఠాధిపతులు ఇచ్చిన సందేశంలో శ్రీ శంకర భగవత్పాదులు జన్మించిన పవిత్ర కాలడి క్షేత్రమును దర్శించుట ప్రతివారి కర్తవ్యం. మరియు మోక్షేచ్ఛగల వారికి సన్యాసులకు ఉపనిషత్ర్పోక్తమైన అద్వైత మతం అవలంభించు వారికి ఈ క్షేత్రదర్శనం ప్రత్యేకంగా ముఖ్యము'' అని పలికినట్లున్నది. శంకరవిజయములలో మాధవీయ శంకర విజయం, చిద్విలాసీయ శంకర విజయంలోను శ్లోకములు ఈ విధంగా కనపడుతున్నవి.

శ్లో|| ఆద్యాపితద్ధేశభవాన వేదమయధీతేనోయమినాంచభిక్షా |

తదా ప్రభృత్యేనగృహోపకం ఠేష్వాసీత్‌ శ్మశానంకిల హంతేషామ్‌ ||

(మాధవీయశంకర విజయం, 14 అధ్యాయం-50 శ్లోకం)

శ్లో|| భవద్ధేశోపియమినాం వాసయోగ్యోనజాయతాం|

అథవాయది హాయాతః పతితస్సభవిష్యతి||

(చిద్విలాసీయ శంకరవిజయం 10 అధ్యాయం-42వ శ్లోకం)

కావడిలో జన్మించువారు నేటికి వేదాధ్యయనం చేయటం లేదు. అక్కడ యతులకు భిక్షలేదు. ఆనాటి నుండి (ఆదిశంకరులు తల్లిని పెరటిలో సంస్కరించినది మొదలు) అక్కడివారి యింటి పెరటిలోనే శ్మశానము ఉంటున్నది. కాలడిలోని విప్రులను గూర్చి శంకరులు పలికినమాట. ''మీ జన్మభూమి అయిన కాలడి యతులకు నివాస యోగ్యంకాదు. ఎవడయినా ఇక్కడకు వచ్చినచో పతితుడు కాగల''డని ఈ శ్లోకాల తాత్పర్యం.

2. శ్రీ శంకరుల సమాప్తిని గూర్చి : హిమాలయములలో కేదరక్షేత్రములో శ్రీ ఆదిశంకరుల అవతార సమాప్తి చిహ్నంగా జగద్గురు శ్రీ శంకరాచార్య ద్వారకా పీఠాధిపతుల ఆశీస్సులతో ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, నేటి రాజస్థాన్‌ గవర్నరు శ్రీ బాబు సంపూర్ణానంద ప్రభృతులైన పెద్దలు శ్రీ శంకరాచార్య కైవల్యధామమను దివ్యసుందర మందిరం కొన్ని వేల రూపాయలతో నిర్మించినారు. ''శ్రీ శంకర విజయాది చరిత్రలలో ఆదిశంకరుల అవతార సమాప్తి హిమాలయములలో అని స్పష్టంగా ఉండగా, అందుకై చిహ్నంగా పెద్దలు భవన నిర్మాణం చేయగా ఇంకెక్కడనో ఆదిశంకరుల అవతార సమాప్తియైనట్లు వ్రాయుట సమంజసంగాదు'' అని పై వ్యాసంలో ఉన్నది.

ఈ విషయం పర్యాలోచన చేయగా ఆదిశంకరులు హిమాలయంలోకాక వేరొకచోట సిద్ధిపొందినట్లు వ్రాసినవారెవరని కొంతకాలానికిముందు వెదుకగా ''శ్రీ శృంగేరీ మఠ గురు వంశ కావ్యము'' అను గ్రంథంలో ఈ అంశం దొరికింది. ఇది 1705 మొదలు 1741 వరకు శ్రీ శృంగేరీ జగద్గురువులై యున్న శ్రీ సచ్చిదానంద భారతీ స్వామివారు ఒక కాశీ పండితులచే మఠము యొక్క పరంపరను వర్ణింపజేయించిన కావ్యము. అందులో ప్రతి సర్గ చివరను ''ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య బిరుదాంకిత శ్రీమన్నృసింహ భారతీకర కమల సంజాత సకల విద్యావిశారద పండిత పుండరీకమండలీ మార్తాండ శ్రీసచ్చిదానంద భారతీస్వామిభి ర్నిర్మాపితే'' అని ఉన్నది. ఈ గ్రంథము శృంగేరీ మఠం నుంచి ''గురుభక్త శిఖామణి'' అనే బిరుదుపొందిన శ్రీరంగం వాణీవిలాస ముద్రణాలయాధిపతులైన శ్రీ టి. కె. బాలసుబ్రహ్మణ్యం గారిచే వ్యాఖ్యానంతో ముద్రితమైనది. వీరిచేతనే శంకర గ్రంథావళి ఇరువది గ్రంథములుగా ముద్రింపబడి కాలడిలో శ్రీ సచ్చిదానంద శివాభి నవభారతీ స్వామివారికి సమర్పింపబడినవి. ఈ గురువంశ గ్రంథకర్తయే వ్యాఖ్యానము రచించియున్నారు. ఈ కావ్యంలో 3వ సర్గ-70, 71 శ్లోకాలు :

శ్లో|| దత్తాత్రేయం భువన వినుతం వీక్ష్యనత్వాన్యగాదీత్‌,

వృత్తంస్వీయం సకలఅమపితాన్‌ ప్రేషితాన్‌దిక్షుశిష్యాన్‌ |

సో7 పిశ్రుత్వా మునిపతిరదా దాశిషో విశ్వరూపా,

చార్యా దిభ్య స్సుఖమవసతాం తత్రతౌభాషమాణౌ ||

శ్రీశంకరులు దత్తాత్రేయులవారికి నమస్కరించి తమ వృత్తాంతమెరిగించిరి. ఆయా దిక్కులకు పంపిన తమ శిష్యులను గూర్చియు తెలిపిరి. దత్తాత్రేయులవారు విని విశ్వరూపాచార్యులు మొదలైన ఆ శిష్యులకు దీవన లొసంగిరి. ఆమీద శంకరులుదత్తాత్రేయులు పరస్పరం సంభాషించుకొంటూ అక్కడనే ఉండిరి.

వ్యాఖ్యానంలో కూడ; తత్ర = మహురీపురే, భాషమాణౌ = సంలపంతౌ, దత్తాత్రేయ శంకరచార్యౌ, చిరం = బహుకాలం, ఆ వసతాం = ఉషితవంతౌ అని ఉన్నది. ఈ మాహురీపురి - అదిలాబాద్‌-హైదరాబాద్‌ సెక్షనులో కిన్వెట్‌ స్టేషన్‌నుంచి వెళ్లేమరాట్వాడాలో ఉన్నది. దీనికే మాహురీగడ్‌ అని మరొక పేరున్నట్లు, ఇక్కడ దత్తాత్రేయాలయం ఉన్నట్లు ఘోరక్‌పూరు కల్యాణపత్రిక 1957 తీర్థాంకలో ప్రకటితమైనది.

ఉత్తరప్రదేశ్‌ వారున్నూ రాజస్థాన్‌ గవర్నరున్నూ అయిన సంపూర్ణానందగారు 1958 జూలై 7 వ తేదీన ఢిల్లీలో ఉండే ఆర్కలాజికల్‌శాఖ జాయింటు డైరెక్టరు శ్రీ టి. యస్‌. రామచంద్రయ్యకు వ్రాసిన లేఖలో :-

"Recently I had occasion to discuss this matter with the Sankracharya of Dwaraka peetha also. In the irst place the word 'Samadhi' misnomes in this connection. There is nothing to prove that Sri Sankarachrya died at this spot. Ali that tradition says is that the came to kedaraaath and disappeared thereafter. So what is called 'Samadhi' is really not Samadhi but a memorial. I myself do not treat it as a samadhi" అని ఉన్నది.

19-6-59 హిందూపత్రికలో బదరీనాథ్‌ నుంచి గురువాయూర్‌ సహజానందస్వామి అనే వారు వ్రాసిన లేఖలో ;-

"On enquiry from Joshi muth, they say that it is a 'Sankalitha Samadhi' and that the actual Samadhi is not on this spot." అని ఉన్నది. ఇది శ్రీ శంకరుల అవతార సమాప్తి విషయం :

3. మహావాక్య విషయం : పై వ్యాసంలో ఒక్కొక్క మహా వాక్యం ఒక్కొక్క మఠానికి శ్రీ శంకరులు ఇచ్చినట్లు గలదు. కాని శ్రీ గోవిందభగవత్పాదులు శ్రీ ఆదిశంకరులకు నాల్గు మహావాక్యములనూ ఉపదేశించినట్లు 'మాధవీయ శంకర విజయ' మందే గలదు.

భక్తి పూర్వకృత త త్పరిచర్యా తోషితో7ధికతరం యతివర్మః |

బ్రహ్మ తా ముపదిదేశ చతుర్భి ర్వేదశేఖర వచో భి ర ముషై#్మ ||

సర్గ - 103 శ్లో ||

ఈ సంప్రదాయం నేటికి 'ఇంద్రసరస్వతీ' సంప్రదాయంలో అనుభవంలో ఉన్నట్లు తెలియుచున్నది.

4. పీఠపరంపర ? పై వ్యాసములో ఆదిశంకరులు స్థాపించిన చతురామ్నాయ పీఠములు వాని అధిపతులు గురుపరంపరగా నేటికిని అవిచ్ఛిన్నంగా వైదిక అద్వైత మత ప్రచారమును సాగించుచు ప్రజల ప్రభుత్వం మన్ననల నందుకొనుచున్నారు.'' అను వాక్యమున్నూ - చివర ''ఆదిశంకరులు స్థాపించిన పీఠములను గురించిన చరిత్రకు సంప్రదాయమునకు వ్యతిరేకములయిన వాదనలు నేడు వినవచ్చుచుండుట శోచనీయము'' అనియు గలదు.

ఈ విషయంలో గూడ బదరీపీఠములో రమారమి 30 సంవత్సరములకు ముందు ఒక పీఠధిపతిగారు అభిషిక్తులైనారని తెలియుచున్నది. అదియు ఇప్పుడు 2 శాఖలుగా భిన్నమైనది. 30 సంవత్సరములకు పూర్వము బదరీలో పీఠమున్నట్లు తెలియుటలేదు. లేకుండెనో ఉండెనో లేక అనేక శతాబ్దములకు ముందు విచ్ఛిన్నమైనదో తెలియదు.

శృంగేరీపీఠమున 1912 వ సంవత్సరంలో శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీస్వామివారు సిద్ధిపొందిన తరువాత పరంపర 22 రోజులు విచ్ఛిన్నమైయుండి తర్వాతనే శ్రీ చంద్రశేఖరభారతీ స్వాములు వచ్చినారు.

పూరీమఠములో ఇప్పుడు ఉండేవారికి ముందు రెండేండ్లు విచ్ఛినముగానే యుండెను. ద్వారకాపీఠంగూడ పీఠస్వాములు సిద్ధిపొందిన పెక్కు సంవత్సరాలకు తర్వాత భారత ధర్మమండలివారిచే స్థాపింపబడిన తివిక్ర తీర్థ స్వామిద్వారా భారతీకృష్ణతీర్థ స్వామివారికి సంభవించినది. ఇదియు అవిచ్ఛిన్నమన వీలులేదు.

ఈ భారతీకృష్ణా స్వామివారే మరల పూరీపీఠాధిపతులైనారు. ఇప్పుడుండే పూరీపీఠాధిపతులు పూర్వపీఠాధిపతులయొద్ద సన్న్యసించిన వారుకారు. భారతీ కృష్ణ స్వాములు నిర్యాణం పొందిన తరువాత రమారమి 2 సంవత్సరములకు ఇప్పుడుండే పూరీ పీఠాధిపతులు పీఠానికి వచ్చినారు.

విచ్ఛిన్నమో, అవిచ్ఛిన్నమో ఈ పీఠాలన్నీ సురక్షితంగా ఉన్నవి అనేది ఆస్తికుల కందఱకూ సంతోషస్థానం. విశ్వహిందూ పరిషత్తువారిచే నిర్వహింపబడిన 1966 జనవరి 22 నుంచి 24 దాకా జరిగిన ప్రయాగ సమ్మేళన 'హిందూవిశ్వ' విశేషాంకలో ఆదిశంకరులద్వారా ''భారత్‌ పాంచమఠస్థాపిత కియే గయే 1. ద్వారక - శారదామఠ 2. జగన్నాథపూరీ గోవర్థనమఠ 3. హరిద్వార - జ్యోతిర్మఠ 4. మైసూరు - శృంగేరీ 5 వారణాసి - సుమేరుమఠం.

అని ఆమ్నాయపీఠములు తెలుపబడినవి. ఈ సుమేరు మఠం అడయారులో ఈ సంవత్సరం ప్రచురింపబడిన "Unpublished Upanishaths" అనే పుస్తకంలో ఊర్ధ్వామ్నాయంక్రింద ప్రకటింప బడినది.

UNESCO వారి Bulletin of institute of traditional Culture 1957లో శృంగేరీని చెప్పేటపుడు one of the five muths established by Sankaracharya అని చెప్పబడినది.

ఇలా ఉండగా ''ఈక్రమం నాల్గుదిక్కులందుగల చతురామ్నాయపీఠములలోను ఏకవిధముగా స్పష్టముగా చెప్పబడియున్నది'' అని ఆంధ్రపత్రిక వ్యాసంలో వ్రాయబడినది. కాని పూరీద్వారక మఠామ్నాయములందు దక్షిణామ్నాయమునకు దేవత 'కామాక్షి'అని, ఆచార్యులు పృధ్వీథరాచార్యులు అనియు చెప్పబడినది. చూడుడు అట్లే :

1. విక్రమశకం 2013 (1957 A.D. )లో ద్వారకా పీఠం వారివల్ల ప్రచురింపబడిన 'యతిసంధ్య' అనే గ్రంథం.

2. 1930 సంవత్సరంలో పూరీ బలభద్ర ప్రెస్సులో డి. మిశ్రాగారిచే ముద్రితమై పండిత యోగీంద్ర అష్టావధాన శర్మగారిచే ప్రచురింపబడిన ''శంకరాచార్య జగద్గురు మఠామ్నాయ'' అనే పుస్తకం,

3. "Unpublished Upanishads" అడయారు లైబ్రరీ ప్రచురణ.

4. రాజేంద్రఘోషుగారిచే బెంగాలీ లిపిలో ప్రచురింపబడిన శంకర గ్రంథ రత్నావళి.

ఐతే శ్రీరంగం వాణీవిలాస ప్రెస్సులో ముద్రితమైన మఠామ్నాయములో 'దక్షిణామ్నాయ దేవత' శారద అని, ఆచార్యులు సురేశ్వరులు అనియు వ్రాయబడియున్నది. ఇదికాక ఇంకాకొన్ని విషయాలలోగూడ భేదం ఉన్నది.

పైన పేర్కొన్న విషయాలన్నీ శాంతంగా పరిశోధన చేయుటకు వీలుగా ఉపయోగపడవలెనని ఇందు వ్రాసితిని. ఇంకను ఏవేని దోషాలు ఉన్నా సహృదయులు పత్రికద్వారా గాని, నాకేగాని తెలిసి నచో కృతజ్ఞుడనై యుండెదను.

చిరునామా : (సం) కల్లూరి వేంకట సుబ్రహ్మణ్యదీక్షితులు.

పండితులు

ఓరియంటల్‌ సంస్కృత కాలేజీ.

భీమవరం (P.O.) పశ్చిమ గోదావరిజిల్లా



కేంద్రపీఠం : సర్వజ్ఞపీఠం :

న్యాయమూర్తి శ్రీ ప్రత్తిపాటి సత్యనారాయణగారు చెప్పిన సి.పి.యమ్‌. 2591 ఆఫ్‌ 1951 రిపోర్టెడ్‌ ఇన్‌ 1952 I.M.L.J., 557) తీర్పుతో ఇలా ఉన్నది.

''సంప్రదాయం ప్రకారం ఇలా ఉన్నది. ఆదిశంకరులు వ్యతిరేకమతాలను ఖండించారు. అద్వైత సిద్ధాంతాన్ని సుస్థిరం చేశారు. విశాల భారతదేశంలో నాలుగు భాగాలలోను నాలుగు మఠాలను స్థాపించారు. శృంగేరీ శారదాపీఠం (మైసూరులో దక్షిణం) ఇది మహా మహులైన విద్యారణ్యులతో సంబంధం గలది. ఉత్తరాన హిమాలయాల్లో బదరీనాథం, తూర్పున జగన్నాథం లేక పూరీ, పడమర బొంబాయి రాష్ట్రంలో ద్వారక-అనునవి ఈ మఠాల కన్నింటికి తమ ప్రధాన శిష్యుల నొక్కొక్కరని అధిపతులుగా జేశారు. ఆది శంకరులు కంచి లేక ఇప్పటి కాంచీపురంలో సర్వజ్ఞపీఠం' లేక The Central seat of knowledge) కేంద్రపీఠమునకు తామే అధిపతులుగా ఉన్నారు. ఈ కేంద్రపీఠం మొదట తంజావూరునకు, అట నుండి కుంభకోణమునకు మార్చబడినది. ఇది అప్పటినుండి ఇప్పటివరకు అవిచ్ఛిన్నంగా కార్యనిర్వహణం జరుపుతోంది.'' (పె.అ.అ. పుట 398)

శృంగేరీపీఠం - పుస్తక సన్న్యాసం :

ఈ అంశాన్ని గూర్చి శ్రీ వెంకటేశ్వర స్టీమ్‌ ప్రెస్‌లో (బొంబాయి) ముద్రింపబడిన 'బ్రహ్మసూత్రభాష్య' గ్రంథపీఠికలో 'మహావిద్వాన్‌' శ్రీ వేంకటాచలశర్మగారు (మైసూరు) కొన్ని విషయాలను వ్రాశారు.

ఈ అంశాన్ని గూర్చే కాశీలోని విద్యావిలాస ప్రెస్సులో ముద్రింపబడిన 'శాంకర పీఠతత్వ దర్శనం' అనే గ్రంథం 11, 12, 13 పుటల్లో కూడ వివరణమున్నది.



1

'ఆదిశంకరలి మఠ సంప్రదాయ చరిత్ర' అనే ఆంగ్ల గ్రంథంలోనే పై 'బొంబాయి' గ్రంథంలోని అంశాలుకూడ సమీక్షిస్తూ సప్రమాణంగాను, సోపపత్తికంగాను మరికొన్ని అంశాలను వ్రాశారు. తుది విషయ మిది :

''సుమారు ఏ. డి. 1 570 ప్రాంతంలో కుడలి పీఠాధిపతులైన శ్రీనృసింహభారతీస్వామివారు (వీరికి అమ్మాజీ స్వామి అనే పేరున్నది) బదరీక్షేత్రయాత్రకై వెళ్ళారు. చాల సంవత్సరాలవరకు తిరిగిరాలేదు. అచటి స్థానికులే 'నృసింహభారతీ' అనే పేరుతో వేరొకరిని పీఠాధిపతిగా ఏర్పాటుచేశారు. వీరిది 'పుస్తక సన్న్యాసం' కావటంచేత ఇది శాస్త్రీయమైనది కాదు. తరువాత శ్రీనృసింహభారతీ స్వామి (1547-1609) బదరి క్షేత్రంనుండి తిరిగివచ్చారు. ఈ పుస్తకసన్న్యాసం తీసికొన్న స్వామివారిని 'శృంగేరి'కి పంపించారు. వారు అచటనే ఉండాలని, విజయయాత్రకై ఎచ్చటకు వెళ్ళకూడదనే నిశ్చయాన్ని కూడ చేశారు.

............ సంకేశ్వర మఠచరిత్ర ననుసరించే 'కుడలి స్వామి, వారినే ప్రధానులనుగా పూజించినట్లు వెల్లడి ఔతోంది.

....... .... 1851లో 58వ ఆచార్యులైన కుడలి పీఠాధిపతులు మైసూరుకు విజయంచేసి రాజమర్యాదలను పొందారు.

తరువాత కర్నాటకం మఠ విషయికంగా నాలుగు భాగాలుగా విభజింపబడినది. అందులో పశ్చిమం కుడలి, తూర్పు పుష్పగిరి, దక్షిణం ఆమని, ఉత్తరం సంకేశ్వరగా విభాగం చేయబడినది. 1792 ప్రాంతంలోనే ఆమని మఠం వారు సేలం, కోయంబత్తూరు జిల్లాల్లో పర్యటించారు. (ఆ సమయంలో వారు కామకోటిపీఠానికి పంపిన 'శ్రీముఖమే' ప్రస్తుతం ఈ గ్రంథంలో 'చారిత్రకాంశాలు' అనే అధ్యాయంలో ప్రచురింపబడినది. పుట. 278)

............ 1854 లో శ్రీకృష్ణ రాజఉడయార్‌ బహదూర్‌ వారు శృంగేరీ శ్రీ నృసింహ భారతీస్వామి వారివల్ల మంత్రోపదేశంపొంది 'శృంగేరీ మఠ గురుపరంపర' -గురువుగారిపైన 'అష్టోత్తర శతనామావళి'ని రచించి ప్రకటించారు. వీరి హయాంలోనే శృంగేరీ స్వామివారు 'విజయయాత్రను' ఆరంభించారు. ఆ సందర్భంలోనే 1860లో వీరు మదరాసుకు విజయం చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఈ గ్రంథం 'చారిత్రకాంశాలలో ప్రకటించబడినది శ్రీముఖము (పుట 280)



2

18-9-1961న ప్రస్తుత ఆవనిమఠాధిపతులు 'తాతహల్లి' మకాం నుండి మల్లేశ్వరంలోని 'గురుభక్తమణి' శ్రీ ఎ. రామస్వామి అయ్యర్‌ గారికి వ్రాసిన లేఖలో ఈ విశేషములున్నవి.

''ఇప్పటికి ఐదారువందల సంవత్సరాల క్రిందట ఆదిశంకరుల శిష్యపరంపరలోని వారైన శృంగేరీ స్వామివారొకరు కాశీమున్నగు ప్రదేశాల తీర్థయాత్రకై వెళ్లారు. వారు తిరిగి యధాస్థానానికి రావటానికి చాలాకాలం పట్టింది. వారు తిరిగి వచ్చేలోగా శృంగేరీ పీఠంలోని అధికారులు వారింక తిరిగి రాకపోవచ్చునని తలచి ఒక బ్రాహ్మణునకు పుస్తక సన్న్యాసం ఇచ్చి పీఠాధిపతిగా ఏర్పాటు చేశారు. మొదటి ఆచార్యులవారు క్రమంగా కొంతకాలానికి తిరిగివచ్చారు. శృంగేరీని సమీపించుతూ తమరాకనుగూర్చి శృంగేరీకి కబురంపారు. తాము నియమించిన ఆచార్యుని పదబ్రష్టులను చేస్తారేమో నని అచటి అధికారులు వీరిని ఆహ్వానింపలేదు. వారాహ్వానింపక పోయినా తాము సర్వాధికారాలు గలవారై వారు వెళ్ళి తమస్థానాన్ని తాము పొందవచ్చును. కాని వారు సన్న్యాసిగా త్యాగభావంతో ఆ అంశాన్ని పట్టించుకోలేదు. తరువాత వారు కుడలిలో స్థిరపడ్డారు. (ఈ విషయమైన కోర్టువ్యవహారాలు, జడ్జిమెంటు కుడలికి అనుకూలంగా జరగటం కూడ జరిగింది.) తరువాత వారు కొంత కాలానికి రామేశ్వరయాత్రకు వెళ్లారు. కాని వారీ పర్యాయం తమ కాశీయాత్రలో జరిగినట్టు జరగకుండా ఒక శిష్యుని కుడలిలో ఏర్పాటుచేసి, కుడలి చుట్టు ప్రదేశాలను పర్యటించుతూ ఉండవలసిందిగా వారి నాదేశించాడు. వారు రామేశ్వరాన్ని సేవించి కంచి, కాళహస్తి, తిరుపతి క్షేత్రాలమీదుగా కోలారుకు (కొల్హారుపురి) విజయం చేసేవారు. కోలారులో శతశృంగ పర్వతం మీద అంతర్గతంగా ప్రదేశాన్ని పరిసరాన్ని చూచి తమ తపస్సునకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో అచట ఒక మఠాన్ని ఏర్పాటు చేసికొన్నారు. దానివల్ల అక్కడ ఒకమఠం ఏర్పడింది. కొన్ని శతాబ్దాల పిమ్మట మహమ్మదీయుల పరిపాలనా కాలంలో కొన్ని రాజకీయ కారణాలవల్ల అవంతీక్షేత్రానికిది మార్చబడినది దీనిని ఆవని అని ఇప్పుడు అంటున్నారు. కాగా ఆదిశంకరులు శృంగేరీలో స్థాపించిన సంప్రదాయమే ఇచ్చట ఉన్నది.

(ప్రెసెప్టర్స్‌ ఆఫ్‌ అద్వైత పుట 385)

సత్యం - శివం - సుందరం.

--- : 0 :----

____________________________________________

ఈ గ్రంథంలో 82వ పుటలో 20వ పంక్తిలో 1958 అని పొరపాటు పడినది. 1950గా దానిని సవరించి చదువుకొనవలెను.



Jagadguru divyacharithra   Chapters   Last Page