Jagadguru divyacharithra   Chapters   Last Page

 

14. శ్రీచరణుల

చాతుర్మాస్యములు

ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశివరకు గల నాలుగు మాసాలకు 'చాతుర్మాస్యం' అని పేరు. ఇందు మొదటి దానిని శయనైకాదశి అంటారు. రెండవ దానిని ఉత్థానైకాదశి అని పిలుస్తారు. ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించాలి.

యతీశ్వరుల కీదీక్ష ఆషాడ పూర్ణిమనాడు ఆరంభమౌతుంది. భవిష్యపురాణం, హేమాద్రి గ్రంథాలలో ఈ వ్రత విశేషాలు వివరించబడినవి. పరమాత్ముని యోగనిద్ర సమయంగా ఇది వర్ణింపబడినది. యతిధర్మాలను వివరించే 'నారదపరివ్రాజకోపనిషత్తు' సన్న్యాసులు ఒక చోట స్థిరంగా ఉండకూడదని నిర్దేశించుతోంది. కాని యతులు వర్షాకాలమైన ఈ చాతుర్మాస్యంలో మాత్రం ప్రయాణాలు మాని ఒక్కచోటనే నివసించాలి. ఇది నియమం.

'పక్షావైమాసాః' అని చెప్పబడంటచే నాలుగు పక్షాలు అనగా రెండు మాసాలు ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఈ సమయంలో సన్న్యాసులు తమ గురువుల సమక్షంలోగాని, తమకంటే వృద్ధుల సమక్షంలోగాని ఉండి బ్రహ్మవిచారణ చెయ్యాలి.

ఆషాడ శుద్ధపూర్ణిమను 'గురుపూర్ణిమ'అంటారు. ఆనాడు అద్వైత సంప్రదాయంలోని యతీశ్వరులు బ్రహ్మవిద్యా గురుపూజను నిర్వర్తించుతారు. దీనినే 'వ్యాసపూజా పర్వం' అనికూడ అంటారు. ఈనాడు ఐదేసి దైవముల సమూహంగల ఆరు పీఠాలను ఏర్పరచి పూజించుతారు.

మొదట శ్రీకృష్ణుని మధ్యగ ఆహ్వానించి, ఆ దేవుని చుట్టును, తూర్పు-దక్షిణం-పడమర-ఉత్తరదిశల్లో వరుసగా వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్దుల నాహ్వానించుతారు. వీటినే నాలుగు వ్యూహాలంటారు.

సనకాది పంచకం : మధ్య సనకుడు, పై పంచకంవలెనె చుట్టుసనందన, సనత్సుజాత, సనాతన, సనత్కుమారులను ప్రతిష్ఠించుతారు.

వ్యాసపంచకం : మధ్యతో శ్రీ వ్యాసులు, నాలుగు దిక్కులలో వరుసగా సుమంత జైమిని, వైశంపాయన, పైల అనువారిని ప్రతిష్ఠించుతారు.

శంకరాచార్య పంచకం : శ్రీ శంకరులు మధ్య, నాలుగు దిక్కుల లోను, శ్రీపద్మపాదాచార్య, శ్రీ హస్తామలకాచార్య, శ్రీ తోటకాచార్య, శ్రీ సురేశ్వరాచార్యులను ప్రతిష్ఠిస్తారు.

ద్రవిడాచార్య పంచకం : ద్రావిడాచార్యులు మధ్య నాలుగు దిక్కులలోను, గౌడపాదాచార్యులు, గోవింద భగవత్పాదాచార్యులు, సంక్షేపశారీరకాచార్యులు, వివరణాచార్యులను ప్రతిష్టించుతారు.

గురుపంచకం : మధ్యలో గురువు-నాలుగు దిక్కులలోను, పరమగురు, పరమేష్ఠిగురు, పరాపరగురు, తక్కిన బ్రహ్మవిద్యా చార్యులను ప్రతిష్ఠించుదురు.

అలాగే దిక్పాలాదులనుకూడ ఆహ్వానించి పూజలు చేస్తారు.

గృహస్థుల అనుమతిని తీసికొని ఒక గ్రామంలో యతీశ్వరు తీవ్రతాన్ని ఆరంభించుతారు. అట్లే గృహస్థులును ఆ సమయంలో వారి ఆదేశాన్ని ఔదలదాల్చి వారిని సేవించి కృతార్థులౌతారు. ఈ సమయంలో యతీశ్వరులు తామీ వ్రతాన్ని ఆరంభించిన గ్రామసీమ దాటి వెళ్ళకూడదు.

శ్రీవారు పీఠాధిపత్యం వహించినప్పటినుండి వారు ఈ చాతుర్మాస్యవ్రతాన్ని ఆచరించి పూతములుగా నొనర్చిన ప్రదేశాలివి.

1. ప్లవంగ 1907 కుంభకోణం

2. కీలక 1908 తిరువనైక్కా

3. సౌమ్య #9; 1909 కుంభకోణం

4. సాధారణ 1910 కుంభకోణం

5. విరోధికృత్‌ 1911 తిరువనైక్కా

6. పరీధావి 1912 మహేంద్రమంగళం

7. ప్రమాదీచ 1913 మహేంద్రమంగళం

8. ఆనంద 1914 తిరువనైక్కా

9. రాక్షస 1915 కుంభకోణం

10. నల 1916 కుంభకోణం

11. పింగళ 1917 కుంభకోణం

12. కాళయుక్తి 1918 కుంభకోణం

13. సిద్ధార్థి 1919 వేపత్తూరు

14. రౌద్రి 1920 మాయూరుం

15. దుర్మతి 1921 కదిరామంగళం

16. దుందుభి 1922 ఆవుడైయార్కోయిల్‌

17. రుధిరోద్గారి 1923 తిరువనైక్కా

18. రక్తాక్షి 1924 తిరువైయూరు

19. క్రోధన 1925 ఇల్లయాత్తంగుడి

20. అక్షయ 1926 కాట్టుమన్నార్కోయిల్‌

21. ప్రభవ 1927 కంజిక్కోడు

22. విభవ 1928 తిరువేడగం

23. శుక్ల 1929 మనలూర్పేటై

24. ప్రమోదూత 1930 పూసామలై కుప్పం

25. ప్రజోత్పత్తి 1931 చిత్తూరు

26. అంగీరస 1932 బుగ్గ

27. శ్రీముఖ 1933 తంజావూరు

28. భావ 1934 ప్రయాగ

29. యువ 1935 కలకత్తా

30. ధాత 1936 బరహంపూరు

31. ఈశ్వర 1937 పాలకొల్లు

32. బహుధాన్య 1938 గుంటూరు

33. ప్రమాది 1939 కుంభకోణం

34. విక్రమ 1940 తువరనాకురుచ్చి

35. వృష 1941 నాగపట్టణం

36. చిత్రభాను 1942 నట్టం

37. స్వభాను 1943 తిరువనైక్కా

38. తారణ 1944 ఎసైయనల్లూరు

39. పార్థివ 1945 తిరుక్కరుకాపూరు

40. వ్యయ 1946 కుంభకోణం

41. సర్వజిత్తు 1947 వసంతకృష్ణాపురం

42. సర్వధారి 1948 వెంకటాద్రిఅగరం

43. విరోధి 1949 తిరువిడైమరుదూరు

44. వికృతి 1950 తిరువిశైనల్లూరు

45. ఖర 1951 ముడికొండన్‌

46. నందన 1952 సాత్తనూరు

47. విజయ 1953 కంచి

48. జయ 1954 కంచి

49. మన్మధ 1955 కంచి

50. దుర్ముఖి 1956 కంచి

51. హేవిలంబి 1957 కంచి

52. విలంబి 1958 మదరాసు

53. వికారి 1959 వానగరం

54. శార్వరి 1960 కామానాయకన్పాలైయం

55. ప్లవ 1961 ఇలయాత్తంగుడి

56. శుభకృత్‌ 1962 ఇలయాత్తంగుడి

57. శోభకృత్‌ 1963 నారాయణపురం

58. క్రోధి 1964 కంచి

59. విశ్వావసు 1965 కాట్టుపల్లి

60. పరాభవ 1966 కాళహస్తి

61. ప్లవంగ 1967 రాజమహేంద్రవరం

62. కీలక 1968 సికిందరాబాదు



'భవ శంకరదేశిక మే శరణం'

Jagadguru divyacharithra   Chapters   Last Page