Jagadguru divyacharithra   Chapters   Last Page

 

1. కాంచీక్షేత్రం

అస్తువ శ్ర్శేయసే నిత్యం వస్తువామాంగ సుందరం |

యతస్తృతీయం విదుషాం తురీయం త్రైపురం మహః ||

- శ్రీలలితోపాఖ్యానమ్‌.



శ్రీ కాంచీక్షేత్రం భారతదేశంలోని సప్త మోక్షపురులలో ఒకటి. అది సర్వసౌభాగ్యాలకు పుట్టినిల్లు. మోక్ష విద్యకు మూలపీఠం. అద్వైతవిద్యకు ఆధారభూమి. ఆదిశంకరు లధిష్ఠించిన కామకోటి పీఠ వైభవంతో ఈ నగరశోభ మరింత దేదీప్యమానమై ఉన్నది. ఆదిశంకరులనుండి నేటివరకు అవిచ్ఛిన్నంగా ఆ కామకోటి పీఠ జగద్గురు పరంపరను సాక్షాత్కరింపజేస్తున్న గురుపీఠాని కిది ఆవాసభూమి. శైవ, శాక్త, వైష్ణవక్షేత్రమేకాక సత్యజ్ఞానానంద గురువగు షణ్ముఖ స్వామికి కూడ ఇది నివాస ప్రదేశం. మొత్తం భారతభూమి కిది నాభిస్థానం. అతి ప్రధానమైన శక్తి క్షేత్ర మీ కాంచీ క్షేత్రం. అంతేకాక పరమ పూజ్యులగు ఆదిశంకరులు విదేహముక్తి నందిన పుణ్యస్థలమిది.*

___________________________________________

* ఆదిశంకరులు సిద్ధిపొందిన స్థలం కాంచీక్షేత్రం కాగా - ఈ చరిత్ర కంచి నుండి క్రమంగా మాహురిపురికి, అటునుండి బదరి, కేదారం, ఇవే కాకుండ కాశ్మీరానికి కూడ ఎలా మార్చబడినదో 'ప్రెసెప్టర్స్‌ ఆఫ్‌ అద్వైత' 411 వ పుటనుండి 418 వ పుట వరకు వివరింపబడినది.

అంతే కాకుండా 419వ పుటలో-ప్రసిద్ధ మోక్షపురియైన కంచిలోనే శ్రీపృథ్వీధరాచార్యులు, శ్రీ విద్యారణ్యస్వామి వారు తమ తుది సమయం.

మోక్షపురి :- భారతదేశం అంతా పుణ్యభూమియే. ఐనప్పటికి అందులోని ఏడు పట్టణాలు మోక్షపురులుగా పేర్కొనబడుతున్నవి.

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా |

పురీ ద్వారవతీ చైవ సపై#్తతే మోక్షదాయకాః ||

ఇందలి కాశీ, అవంతికా (ఉజ్జయినీ - మహాకాళేశ్వరుడు) పట్టణాలు శివక్షేత్రాలు. అయోధ్య, మధుర, పూరి పట్టణాలు విష్ణుక్షేత్రాలు. మాయా (హరిద్వారం) పట్టణం శక్తి క్షేత్రం. కాని కంచి - శివ, విష్ణు, శక్తి షణ్ముఖక్షేత్రము. ఇది కంచి యొక్క ప్రత్యేకత. ఇది దక్షిణ భారతావని కంతకు ఏకైక మోక్షపురిగా ఉన్నది.

హయగ్రీవ, అగస్త్యులు :- బ్రహ్మాండ పురాణోత్తర ఖండాంతర్గతమైన 'శ్రీ లలితోపాఖ్యానం' ప్రథమాధ్యాయంలో ఇలా వివరించబడి ఉన్నది. దేవర్షి ఐన అగస్త్యుడు తీర్థాటనంచేస్తూ కాంచీక్షేత్రానికి విచ్చేశాడు. కలిదోషాలను హరింపజేసే కామాక్షీదేవిని పూజించాడు.

'కామాక్షీం కలిదోషఘ్నీ మపూజ యదథాత్మవా9 ||'

ఆయన అచట చేసిన తపస్సునకు మెచ్చి హయగ్రీవుడు ప్రత్యక్షమైనాడు. అగస్త్యుని ప్రార్థన ననుసరించి హయగ్రీవుడు

___________________________________________

గడిపి సిద్ధపొందిన అంశంకూడ 18వ శతాబ్దం వరకు సంప్రదాయ చరిత్రగా శృంగేరీ మఠం వారితో సహా అందరు ఎలా విశ్వసించారో వివరింపబడినది.

'కామాక్షి-అమ్నాయశక్తి' అనే గ్రంథంలో కూడ ఈ అంశాలున్నవి.

ఇవికాక ఈ విషయమై ప్రత్యేక గ్రంథం ముద్రణలో ఉన్నది. త్రిపురారాథనం భుక్తిని ముక్తిని కూడ ప్రసాదించుతుందని వివరించాడు.

'తస్మా ద శేషలోకానాం త్రిపురారాధనం వినా|

నస్తో భోగాపవర్గౌతు ¸°గపద్యేనకుత్రచిత్‌ ||

ఇచటనే 'శ్రీ లలితోపాఖ్యానం' 'లలితా సహస్త్రనామ స్తోత్రం' లలితాత్రిశతీ' స్తోత్రాదులు-ఈ సంవాద ప్రసంగంలోనే హయగ్రీవుడు అగస్త్యునకు ఉపదేశించటం జరిగింది.

శ్రీరామచంద్రుడు :- శ్రీరామచంద్రుడు సీతావియోగంతో అడవిలో సంచరిస్తూ కాంచీనగరానికి విచ్చేశాడు.

తదా వియోగదుఃఖేన లక్ష్మణన సరాఘవః |

పర్యటన్నటవీం సర్వాం ప్రాప కాంచీం క్రమేణసః ||

కాం. మా. 17 అధ్యా.

తరువాత శ్రీరామచంద్రునకు అగస్త్య మహర్షికి సంభాషణం జరిగింది. ఆముని వాక్యాన్ని పాటించి శ్రీరామచంద్రుడిచట ఈశ్వరార్చనం చేశాడు.

పూజయామాస పుష్పాద్యైః పురారిం రఘునందనః |

కాం. మా. 17 అధ్యా.

కాంచీ అంటే ఏమిటి :- ఆది నుండి మహాతపస్వులకు కన్న తల్లిఐన భారతదేశం ఒక దివ్యాంగన. ఆమెకు నాభిస్థానమైనది కంచి. అనగా ఆమె కిది'కాంచీ'గా (మొలనూలు లేక ఒడ్డాణం) ఉన్నది గనుక దీని కీపేరు గలిగింది.

... భూర్వధూః ప్రోక్తా తస్యా నాభి బిలంత్విదం |

కాంచీస్థాన మిదం ప్రొక్తం నాభిస్థానంతు యోషితాం ||

కాంచీస్థాన మితి ప్రోక్త మస్మాత్కాంచీ పురీత్వియం||

కాం. మా. 36 అ.

ఈ అధ్యాయంలోనే 'కాంచీ' పదాని కనేకములైన అధ్యాత్మిక వివరణలున్నవి. తంత్ర పరిభాషలో ''ఓడ్యాణం'' (ఒడ్డాణం) అనే పేరుతో కూడ ఈపురి వ్యవహరింపబడుతోంది.

కామకోటిపురి :- శ్రీమద్భాగవతంలో, బలరాముని తీర్థాటన ప్రసంగంలో ఆయన ఇచటకు విచ్చేసినట్లున్నది.

''కామకోటిపురీం కాంచీ కావేరీంచ సరిద్వరాం''

భాగవతం. 10 స్కం 79 అధ్యా.

సర్వతీర్థం :- కంచికి పశ్చిమాన 'సర్వతీర్థం' అనే సరస్సు ఉన్నది. ఇది సర్వతీర్థాలకు సమాహార రూపమై సార్థకమైన పేరుతో ఉన్నది. ప్రహ్లాదుడు, విభీషణుడు, పరశురాముడు, రామలక్ష్మణులు, అర్జునుడు మున్నగువా రాయాకాలాల్లో ఇందుస్నాతులై పవిత్రతను సంపాదించుకొన్నట్టు కాంచీ మాహాత్మ్యం 29 వ అధ్యాయంలో వివరింపబడి ఉన్నది.

ముక్తి మంటపం : - సర్వతీర్థ సరస్సు తీరాన ముక్తిమంటపం ఉన్నది. ఇది సాక్షాత్తు ముక్తి ప్రదమైనది. కనుక దీని కీపేరు సార్థకమైనదిగా ఉన్నది.

సాక్షాన్ముక్తి ప్రదత్వేన ముక్తి మంటప ముచ్యతే ||

కాం. మా. 29 అధ్యా.

ఆమ్ర వృక్షం : - ఈ కంచిలోని ఏకామ్రేశ్వరాలయంలో వేదాలన్నీ మామిడిచెట్టు రూపంలో ఆవిర్భవించాయి. ఇప్పటికి ఈ ఆమ్రవృక్షాన్ని ఏకామ్రనాథాలయంలో కన్నులారా కాంచి నమస్కరించి ధన్యతనంద వచ్చును. షడంగాలతో కూడిన వేదాలు, సమస్త ఉప మంత్రాలతో కూడిన సప్తకోటి మహామంత్రాలు ఈ ఆమ్రవృక్ష స్వరూపాన్ని పొందినవి. దీని వల్లనే ఇచటి ఈశ్వరునికి ఏకామ్రేశ్వరుడనే పేరు ప్రసిద్ధమైంది. ఈ వృక్షదర్శనం సర్వసిద్ధులను ప్రసాదించుతుంది.

వేదస్సహస్రశాఖో7త్ర షడంగోపనిషద్గణౖః |

ఏకామ్రద్రుమతామేత్య స్వమూలం సర్వదం శివం ||

మూలదేశేస్థితం ప్రాప సర్వేషాం సర్వసిద్ధయే |

సప్తకోటి మహామంత్రై రుపమంత్రై ర పిస్వయం||

తత్సారూప్య మనుప్రాపై#్త రివ రేజేవృతా పురీ ||

కాం. మా. 3 అధ్యా.

కామాక్షిదేవి * :- శ్రీ చక్రాకృతిలో నిర్మింపబడిన ధీ కాంచీ క్షేత్రం. దీనికి మధ్యగా - బిందుస్థానీయంగా కామాక్షి దేవ్యాలయం.

___________________________________________

* ఆదిశంకరులు స్థాపించిన ప్రాక్‌, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, ఊర్ధ్వామ్నాయం మొదలైన పీఠ విషయాలను పేర్కొంటున్న (1) యతిసంధ్య (1957 లో ద్వారకాపీఠం వారిచే నాగరిలిపిలో ప్రచురింపబడినది) (2) శంకరాచార్య జగద్గురు మఠామ్నాయం (1930 పూరిలో బలభద్ర ప్రెస్సులో ముద్రింపబడి పండిత యోగేంద్ర అష్టావధాన శర్మచే ప్రచురింపబడినది) (3) 'అన్‌ పబ్లిష్‌డ్‌ ఉపనిషద్స్‌' ఉంటుంది. అనగా ఈమె ఇచట ప్రధాన దేవత. ఈ కంచిలో దేవాలయ విమానగోపురాలన్నీ ఈ కామాక్షీ దేవ్యాలయానికి అభిముఖాలై ఉంటవి. సామాన్యంగా అయితే ఈ గోపురాలు తూర్పునకో, పడమర అభిముఖాలుగా ఉండవలసినవి.

సాక్షాత్తు బ్రహ్మవిద్యాస్వరూపిణి ఐన ఆ పరాశక్తి యొక్క స్థూలరూపమే ఈ ఆలయంలోని శ్రీ కామాక్షీదేవి విగ్రహం. 'శ్రీలలితా సహస్రనామావళి'లో పరాశక్తి 'కామాక్షి-కామకోటికా' అని పేర్కొనబడినది. శ్రీ రాజరాజేశ్వరీ స్వరూపిణి ఐన ఆ తల్లి ఇచట సిద్ధాసనంలో ఆసీనురాలై ఉంటుంది. ఈమె చతుర్భుజ. కుడివైపున క్రిందిచేతిలో పంచపుష్పబాణాలు, పై చేతిలో పాశము ఉంటవి. ఎడమవైపు క్రింది

___________________________________________

(1937 లో అడయార్‌ లైబ్రరీ వారిచే ప్రచురింపబడినది) (4) శంకర గ్రంథ రత్నావళి (బెంగాలీ లిపిలో శ్రీ రాజేంధ్రనాథఘోష్‌గారు ప్రచురించినది) (5) మైసూరు - ఓరియంటల్‌ ఇనిస్టిట్యూట్‌లోని 'మఠామ్నాయ' వ్రాతప్రతి (6) భండార్కర్‌ ఓరియంటల్‌ రీసర్చి ఇనిస్టిట్యూట్‌ పూనా నెం. 1517 ఆఫ్‌ 1891-95- అను వానిలో కామాక్షీదేవి 'దక్షిణామ్నాయ శక్తి' అని పేర్కొనబడినది.

ప్రెసెప్టర్స్‌ ఆఫ్‌ అద్వైత-అనే గ్రంథం పుట-406. లేదా'కామాక్షి-అమ్నాయశక్తి' అనే ప్రత్యేక గ్రంథంలో చూడవచ్చు.

సుప్రసిద్ధ కాశీపండితులు, వృద్ధులు - మహామహోపాధ్యాయ శ్రీగోపీనాథకవిరాజ్‌, పద్మవిభూషణ, ఎం.ఏ., డి.లిట్‌ గారు జగద్గురు శ్రీ ఆదిశంకరులు అనే గ్రంథంలో సైతం మఠామ్నాయాన్ని వ్రాస్తూ కామాక్షీదేవి దక్షిణామ్నాయశక్తి అని పేర్కొన్నారు.

ఈ గ్రంథాలను పరిశీలింపకపూర్వం నాకుకూడ ఈ విషయాలు తెలియవు. పాఠకులు మన్నింపగోరెద. -రచయిత.

చేతిలో ఇక్షుధనుస్సు, పై చేతిలో అంకుశము ఉంటవి. వీని ధ్యానంవల్ల సాధకుడు-క్రమంగా పంచేద్రియాలు స్వాధీనం కావటం, అశాపాశం తెగిపోవటం, మనస్సునకు చాంచల్యం తగ్గిపోవటం, అహంకారం తొలగిపోవటం అనే ఫలాలను పొందవచ్చును.

ఇచట అమ్మవారు వరదాభయముద్రలను చూపుట లేదు. ఆదిశంకరులు సౌందర్యలహరిలో 'తవహి చరణావేవనిపుణౌ' అని చెప్పినట్లు, ఆ తల్లి చరణాలే వాంఛాసమధికాలైన వరాలను, అభయాలను మనకు ప్రసాదించుతవి. ఇది శ్రీ కామాక్షీదేవి చరణ ప్రభావం అని అర్థం.

ఈ అమ్మవారి విగ్రహానికి ముందు శ్రీ ఆదిశంకరులు సాలగ్రామ శిలపై స్వయంగా లిఖించి ప్రతిష్ఠించిన శ్రీచక్రాధిష్ఠాత్రిగా ఆ పరాశక్తి సూక్ష్మరూపిణిగా దర్శనమిచ్చును. ఇదియే కామకోటిపీఠం.

ఇచటి చిదాకాశ (బిలాకాశం) రూపమే ఆమె కారణరూపము. ఈ విధంగా ఆ అఖండ సచ్చిదానందరూపిణియైన పరదేవతయొక్క స్థూల, సూక్ష్మ, కారణ రూపాల నిచట మనం దర్శింపవచ్చును.

కంచిలోని ఏకామ్రనాథుని రథోత్సవం, వరదరాజ స్వామి రథోత్సవం మొదలైనవి-ఏ దేవునకు ఏ ఉత్సవం జరిగినా అది ఆ కామాక్షీదేవ్యాలయ ప్రదక్షిణ రూపంగా ఈ అమ్మవారి ఆలయంచుట్టూ ఉండే నాలుగు ప్రధాన వీథులగుండా వెళ్ళటం ఇప్పటికిని సంప్రదాయ సిద్ధమైన ఆచారంగా ఉన్నది. సర్వోత్కష్టయగు మంగళ##దేవత యే కామాక్షీదేవి.

''కామాక్షీ సదృశీదేవీ నాస్తి మంగళ##దేవతా''

కా. మా. 50 అధ్యా

కామరాజపీఠం :- పదునెనిమిది శక్తి పీఠాలలో ప్రధానమైనవి మూడున్నవి. అందు కామరాజపీఠము మొదటిదిగా ప్రశంసింప బడుతోంది. దీనిని హయగ్రీవు డర్చించాడు. రెండవది జాలంధరపీఠం. ఇది భృగువుచే అర్చింపబడినది. మూడవది ఓడ్యాణము. ఇది వ్యాసునిచే ఉపాసింపబడినది. ఈ మూడు పీఠాలలోను ఒకటైన ఈ కామరాజపీఠము కాంచీ క్షేత్రంలో ఉన్నది. ఈ కామరాజ పీఠమే కామకోటిగా ప్రసిద్ధినందినది. ఈ విషయము మార్కండేయ పురాణాంతర్గతమైన కామకోటి మహిమాదర్శంలో వర్ణింపబడినది.

ఆకాశ శక్తి క్షేత్రం :- కంచిలో అంతటా పరాకాశం వ్యాపించి ఉంటుంది. అట్టి పరాకాశవ్యాపృతమైన ఈ క్షేత్రంలో ప్రవేశించిన వారందరు ఆ పరాకాశ స్వరూపాన్ని పొంది ముక్తులౌతారు. పంచభూత శక్తి క్షేత్రాలలో ఇది ఆకాశశక్తి క్షేత్రంగా ఉన్నది. ఇందువల్లనే ఇచటి ఏ శివాలయంలోను ప్రత్యేకం దేవ్యాలయం ఉండదు.

తత్ర సర్వాపి భూః కాంచ్యాం పరాకాశస్మృతో బుధైః|

తత్రయే పరమాకాశే ప్రవిశంతి జనాహరే||

తేసర్వే మన్మయాస్యుర్వై ముక్తాత్మాసస్తు తేస్మృతాః ||

కాం. మా. 44 అధ్యా

శివజిత్‌ క్షేత్రం :- కంచిలోని ఏ శివాలయంలోను అమ్మవారికి ప్రత్యేకంగా విగ్రహం లేకపోవటాన్ని గూర్చి కామాక్షీ విలాస పురాణంలో ఈ విశేషం చెప్పబడినది.

శివుని నేత్రాగ్నిచే మన్మథుని శరీరం భస్మమైంది. తరువాత మన్మథుడు మరల శరీరాన్ని పొందుటకోసం తపస్సు చేశాడు. అందుకు ప్రీతురాలైన కామాక్షీదేవి దివ్యకటాక్ష ప్రసారంచేత మన్మథుడు పరమసుందర శరీరాన్ని పొందాడు. అపుడే మన్మథుడు మరొకవరంగా తాను శివుని జయించాలని ఆమెను కోరుకొన్నాడు. అందుకు చిహ్నంగా ఆ కామాక్షీదేవి సృష్టిలోని తన దివ్యశక్తులన్నింటిని కామకోటి బిలాకాశంలోని కాకర్షించుకొన్నది.

అపుడు బ్రహ్మదేవుడు తన దివ్యదృష్టితో ఈ అంశాన్ని గ్రహించి కంచిలో తపస్సు చేసి మరల ఆ దివ్యశక్తులన్నీ అన్ని శివక్షేత్రాలలోను ఉండేటట్టు ఆ కామాక్షీదేవి అనుగ్రహాన్ని పొందాడు. కాని మన్మథుడు శివుని జయించినందుకు చిహ్నంగా కాంచీక్షేత్రంలో మాత్రం ఏకామ్ర దేవాలయంతో సహా ఏ శివాలయంలోను అమ్మవారికి ప్రత్యేక విగ్రహం ఉండదు. ఈ కంచినగరసీమల్లో అంతటా ఆశక్తి వ్యాపించి ఉంటుంది. ఈ విధంగా ఇది ''శివజిత్‌ క్షేత్రం''గా ప్రసిద్ధి నందింది.

వేదవ్యాసులు :- కాంచీమాహాత్మ్యం 10వ అధ్యాయం అంతా శ్రీ వేదవ్యాసులు కాంచీక్షేత్రంలో వ్యాసశ్రాంతాశ్రయేశ్వరు డను పేరుతో శివలింగ ప్రతిష్ఠ చెయ్యటం మొదలైన అంశాలతో నిండిఉన్నది. అనగా వేదవ్యాసుల కీ క్షేత్రంలో గల ఘనిష్ఠమైన సంబంధం దీనివల్ల తెల్లమౌతోంది.

కంచిలోని వరదరాజస్వామి ఆలయంలో కూడ నూట యెనిమిది స్తంభాల మంటపంలో వేదవ్యాస ఆదిశంకరుల శిల్పం ఉన్నది. అది బ్రహ్మసూత్రభాష్యంపై బ్రాహ్మణ రూపంలో ఉన్న వేదవ్యాసులకు ఆదిశంకరులకు జరిగిన చర్చకొక చిహ్నమై ఉండవచ్చును. అలాగే అదే దేవాలయంలో తాయారు (అమ్మవారు) సన్నిధికి ఉత్తరాన ఒక స్తంభంపై ఏకదండ సన్యాసిగా ఉన్న ఆదిశంకరులు వేదవ్యాసులకు దండం వందనం చేస్తున్న శిల్ప ప్రతిమ లున్నవి. పదహారు సంవత్సరాల వయస్సులో ఉన్న ఆదిశంకరులకు అద్వైత వైదిక ధర్మోద్ధ రణానికై మరొక పదహారేండ్ల ఆయువును వేదవ్యాసులు ప్రసాదించిన చారిత్రాకాంశాని కిది ఒక చిహ్నం ఐ ఉండవచ్చు.

వేదవ్యాసులు విశేషానుష్ఠానార్చన లొనర్చిన 'వ్యాసశ్రాంతా శ్రయేశ్వ'రాలయంలో పై భాగంలోని పై పూతలో ఉన్న శిల్పం - పై చెప్పిన వరదరాజస్వామి ఆలయంలోని శిల్పాన్ని పోలి ఉన్నది.

ఐతిహాసిక ప్రశస్తి :- ఈ కాంచీక్షేత్రం వైదిక ధర్మపోషణ ప్రచారాలకు కేంద్రస్థానమై సింహళం, ఇండోనేషియా మొదలైన పలు ప్రాంతాలకు వైదిక ధర్మాన్ని వ్యాపింపజేస్తూ ఉండేది. ప్రాచీన పురాణాల్లో 'బ్రహ్మశాల' 'దివ్యక్షేత్రం' అని ఈ పట్టణం వర్ణింపబడినది. 'నగరేషుకంచి' అని కూడ ప్రసిద్ధి ఉన్నది. ప్రాచీన సాహిత్యంలోను శిలాశాసనాదులలోను ఈ నగరవైభవం వర్ణింపబడి ఉన్నది.

స్థలపురాణం :- శ్రుతి, స్మృతులతో సమంగా ప్రమాణ స్థానం పొందిన స్కాందపురాణంలోని 50 అధ్యాయాల భాగంలో 'కాంచీ మాహాత్మ్యం' వర్ణింపబడినది. ఈ గ్రంథాన్ని క్రీ.శ. 1889లో కార్వేటినగరాధీశులు ముద్రింపించారు. శ్రీ ఈదర వేంకట్రామయ్యగారు (వేంకట్రామ అండ్‌ కో) ఈ గ్రంథాన్ని సంస్కృత మూలం మాత్రం తెలుగు లిపిలో (1967) ముద్రించి ప్రచురించారు. ఈ గ్రంథం కాంచీ వైభవ జిజ్ఞాసువులకు మహోపకారిగా ఉన్నది.

ఆదిశంకరులు :- పరమ శివాంశావతారులు అద్వైతసిద్ధులునైన ఆదిశంకరులు యావద్భారతంలోని అద్వైత సిద్ధాంతాన్ని వైదిక ధర్మాన్ని సుప్రతిష్ఠం చేసి తమ మాతృ భూమికి నాభిస్థానంలో ఉండి మోక్షపురిగాను, మహాశక్తి పీఠంగాను విశేషమహిమాన్వితమైన కంచికి విజయం చేశారు. ఇచటి కామకోటి పీఠానికి తామే అధిపతులై తమ దివ్యావతారంలోని తుదిదిగానున్న పరిశిష్టవిభూతి నిచటనే విరాజిల్లజేశారు. తాము కైలాసం నుండి తెచ్చిన పంచస్పటిక లింగాలలో ఒకటైన యోగలింగమును శ్రీ మేరువుల నర్చించుకొంటూ కామకోటి పీఠాన్ని శిష్యపరంపరతో ప్రవర్తిల్లునట్లు చేశారు.

తుదకు ఈ మోక్షపురిలోనే కామాక్షీ దేవ్యాలయం రెండవ ప్రాకారంలో తమ విదేహముక్తినందారు.

నైషధకావ్యం :- శ్రీహర్ష మహాకవి తన నైషధకావ్యం 12వ సర్గలో దమయంతీ స్వయంవరానికి విచ్చేసిన రాజవర్ణనలో కంచిని పేర్కొనెను. అందలి 'యోగేశ్వర' పదం ఆదిశంకరులు కైలాసం నుండి తెచ్చిన పంచస్పటిక లింగాలలో ఒకటియై వారి శిష్యపరంపరలోని జగద్గురువులచే నేటికి అర్చింపబడుతున్న 'యోగలింగా'న్ని సూచిస్తోంది. ఇచట 'యోగలింగ' శబ్దమే సందర్బశుద్ధి గల పాఠమని మహాపండితులగు శాస్త్రపరిశోధకులు మన్నించారు.*

ఈ కాంచీక్షేత్రంలో ఏకామ్రనాథాలయంతో పాటు 50కి పైగా శివాలయాలు, కామాక్షీదేవ్యాలయం, షణ్ముఖస్వామి ఆలయం. శ్రీవరదరాజస్వామి ఆలయం మాత్రమేకాక ప్రతినిధిలోను ఒక దేవాలయం ఉన్నది. దేవాయతనం లేని వీధియేలేదు.

ఇది 'మహాపీఠస్థాన' మని బెంగాలీవిశ్వకోశం 3వ సంపుటంలో పేర్కొనబడి ఉన్నది.

సర్వసిద్ధులను ప్రసాదించే 'కంచి'తో సమమైన క్షేత్రం, సర్వతీర్థంతో సమమైన తీర్థము లేవు.

నాస్తి కాంచీ సమంక్షేత్రం సర్వసిద్ధి ప్రదంభువి|

సర్వతీర్థ సమం తీర్థం నాస్తి పాపనిబర్హణం||

కా. మా. 50 అధ్యా.

''కాంచ్యాం సంచరణాన్ముక్తిః''

ఈ కాంచీక్షేత్రం ''తమిళనాడు''లోని మదరాసు నగరానికి 47 మైళ్ళు లేదా 75 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దీనినే కాంచీ నగరం లేక కంజీవరం అని కూడ పిలుస్తారు.

__________________________________________

*సుప్రసిద్ధ కాశీపండితులు 'వ్యాకరణాచార్య' శ్రీ స్వామీ రామానంద సన్న్యాసి, వేదాచార్య, పండిత శ్రీ విద్యాధరశర్మ, వ్యాకరణ సాహిత్యాచార్య 'పండిత' శ్రీ మహాదేవశాస్త్రి. మీమాంసాచార్య 'పండిత' శ్రీ పట్టాభిరామశాస్త్రి అను పండితులు ఈ 'యోగేశ్వర' పాఠం సరియైనదని సప్రమాణంగాను, సోపపత్తికంగాను నిరూపించారు. విస్తర భీతిచే ఆ విషయాన్ని అంతను ఇచ్చట వ్రాయటంలేదు. ఇంకా అనేక మంది పండితపరిశోధకు లీ పాఠసాధుత్వాన్ని నిరూపించారు. పండిత పరిశోధకులు దాన్ని మన్నించుతు ఉల్లేఖించారు.



Jagadguru divyacharithra   Chapters   Last Page