Bhakthi Rasaayanamu        Chapters   Last Page 

ప్రస్తావన

శ్రీమాత్రేనమః

జ్యోతిర్మయీం ప్రసూనాజ్గీ మానందలహరీం పరామ్‌,

ఉసాస్మహే శివాం దేవీం లలితాభినయాత్మికామ్‌.

యం శ్రుత్వా వికస త్యశేషభ##వై ర్హృత్సద్మ మార్ద్రాయతే

యం మత్వా నిరతం చ గచ్ఛతి ముదా విద్యార్ణవం మానసమ్‌,

యం ధ్యాయ న్నచిరేణ వేత్తి సకలాం శాస్త్రార్థబావన్మనః

తం భక్త్యా ప్రణమామి పూతచరితం దివ్యాంశయా సంశ్రితమ్‌.

1. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనునవి పురుషార్థము లని వ్యవహరించ బడుచున్నవి. జన్మ ముఖ్యఫల సమర్పకమై కామము, దృష్టోపాయ సమర్పకమై అర్థము గలవు. సాంఘీకచైతన్యమున నభివ్యక్తమై సాంఘీకలవ్యక్తిగా మానవుని పరిణమింపజేయు ధర్మము ప్రచోదనాత్మకము. దృష్టఫలము నాశ్రయించని ధర్మమునకు అపూర్వఫలమును చెప్పవలెను. మానవుడు కేవలము సాంఘీకవ్యక్తియే కాదు. సంఘమున నంతర్భూతుడై మానవుడు, సంఘమును సహితము తనలో నంతర్భూతము చేసికొనవలసి యున్నది. అనగా సంఘమును గూర్చిన ఆత్మవద్భావన యున్ననే సాంఘికచైతన్యము నిర్దేశించులక్ష్యము లవగతములు కాగలవు. ఈయవగతిలో నాత్మస్వభావ మగు స్వాతంత్ర్య మనుభూత మగును. స్వాతంత్ర్యమనగా కర్మబంధమునుండి విముక్తిని పొందుటయే. దీనినే మోక్షమను నాల్గవ పురుషార్థముగా పూర్వులు స్వీకరించిరి. ప్రతివ్యక్తియు తన నిజస్వభావమగు స్వాతంత్ర్యమును, పూర్ణమగు నానందమును అనుభవించుటయే మోక్షము. ఇట్టి మోక్షము పారలౌకికమని చెప్పుటలో మానవుడు దేశకాలా ద్యుపాధుల వశము కారాదని భావము. సాంఘికచైతన్య వినిర్ముక్తుడగు వ్యక్తికి వ్యక్తిత్వమే లేక పోవుటచే నీమోక్షము కేవలము వ్యక్తిగతము, వ్యక్తినిష్ఠము కాజాలదు. అనగా మోక్షముసాంఘిక చైతన్యమును తనయందు తన స్వభావమును సంఘమున అభిన్నముగా ననుభవింప గల్గుటయే మోక్షశబ్దార్థము. ఈ యార్థావగతికి ధర్మాచరణ మనవసరము. కాని ఇతరులు ప్రపంచించు ధర్మమును నే నాచరించవలసినచో తత్ఫలమునకు నేను బాధ్యుడను కాజాలను. బాధ్యత నాకు లేనపుడు నేజేసిన కర్మలఫలితము నన్ను బంధింప గూడదు. అనగా ధర్మము నాకంటె భిన్నమైన బాహ్యాధికారముచే విధింపబడునది కాజాలదు. కావున నిర్లిప్తము, నిర్వికారము, అతీంద్రియము, అనుపహితము నగునాధ్యాత్మతత్త్వము నాశ్రయించుకొని వచ్చునదియే ధర్మము కాగలదు. పరోపకారమును నే జేయవలె ననిన పరుడు పరుడు గాడని స్పష్టము. దీనినే సర్వభూతములయందు నాత్మవద్భావన యనినారు. ఈ యాత్మవద్భావన అతిశయితము కాగా కలుగు మానసిక పరిణామమున నుదయించు ప్రతీతిని భక్తి యందురు. భక్తి యనగా నిరుపాధిక మగుతత్త్వమును దేశకాలాదివశవర్తియగు జగమున నంతర్లీనముగా భాసించునది. అనగా దేశకాలా ద్యుపాధులలో నభివ్యక్తమగునది తత్త్వము. ఇందుచే దేశకాలాద్యుపాధు లగు ప్రాణులను, ఈ ప్రాణుల ఆదర్శము లగు సత్యధర్మ సౌందర్యములను చక్కగా తెలిసికొనవలసి యున్నది. ఏతదవగాహనకై శ్రద్ధ సునిశతమగు భావన, తీక్షుపరిశీలనాశక్తి మొదలగునవి కావలెను.వీటితోబాటు నిత్యానిత్యవస్తువివేకము, ఐహికాముష్మిక ఫల బోగ విరాగము, శమ దమాది సాధనసంపద చేకూరగా పరోపకారబుద్ధి పూర్వకమగు భక్తిభావ ముదయించును. కావుననే భక్తులను సేవించుట, ప్రాణుల నందరను ఆత్మవద్భావనతో గాంచుట, భగవద్ధర్మానుష్ఠానము, నిష్కామపూర్వకమగు ప్రేమ మొదలగువనవి యన్నియు భక్తి భావనలో గలవని చెప్పబడుచున్నవి. ఇట్టి భక్తిభావమునకు లోబడియున్న ధర్మార్థకామము% పురుషార్థములు కాగలవు.

2. సర్వభూతములను తనవలెను, తనను సర్వభూతముల వలెను భావించుట ధర్మాచరణమున కత్యవసరము. ఇట్టి యాచరణమే భక్తిలోగల విశిష్టత యగుటచే జ్ఞానమార్గమునకు, భక్తిమార్గమునకు పరస్పర విరోధము లేదని, ధర్మాచరణరూపమగు భక్తియోగము సర్వజనసామాన్యమగు సాధనమే గాక సాధ్యముగూడ నగుచున్నదని విశదమగును. సాధ్యరూపమున నున్న ధర్మమనబడు భక్తిని ఆత్మావగతి యని, బ్రహ్మా త్మైకత్వానుభూతి యని, మోక్షమని పునర్జన్మరాహిత్యమని వ్యవరింతురు. కనుకనే అర్థకామములు ధర్మసంవలితములై యుండవలెను. ఈవిషయము నుద్దేశించియే "సత్యంవద, ధర్మంచర" అని తైత్తిరీమోపనిషత్‌ పలికినది. సత్యము కేవలము వాక్యధర్మము గాదని ఉపనిషత్తు లనుచున్నవి. "సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ" యనుచో సత్యమనగా తత్త్వమగు బ్రహ్మయని అర్థము, ధర్మాచరణ మాత్మసాక్షాత్కారము నుద్దేశించి బయలుదేరుచు, ఆత్మాశ్రయమై ఉత్పన్నమగు ప్రవృత్తియగుటచే "ఆత్మావా అరే ద్రష్టవ్యః, శ్రోతవ్యో, మంతవ్యో, నిదిధ్యాసితవ్యః; ఆత్మావా అరే ద్రష్టవ్యః" అని ఆత్మదర్శన ప్రధానమని ఉపనిషత్తులు ఘోషించుచున్నవి.

3. విశిష్ట నిత్యకర్మానుష్ఠానుముద్వారా కేవల మంతః కరణ శుద్ధము కాగా ఆత్మాభిన్నముగా జగమంతయు భాసించగలదు. ఇట్టి స్థితియందు కలుగు చిత్తద్రవీకరణమున చిత్తము నిరుపహితము కాగా, తాత్త్వికమగు విషయాకారమును చత్తము పొందును. తాత్త్వికమగు విషయము చైతన్యస్వరూపమగు బ్రహ్మయగుటచే చిత్తమునకు చైతన్యాకారత కలుగునని భావము. శ్రవణ, మనన, నిదిధ్యాసనాదులద్వారా కలుగు నీ చైతన్యాకారమున నలౌకిక మగు ప్రేమ యంకురించును. ఈ ప్రేమనే_

"విద్యావినయసంపన్నే బ్రాహ్మణ గవి హస్తిని

శుని చైవశ్వపాకే చ పండితాః సమదర్శినః"

అని శ్రీ భగవద్గీత వివరించినది. సర్వవిషయముల యందు సమత్వబుద్ధి యనబడు ప్రేమ కలుగగా వర్ణశ్రమ వయో7వస్థాది ధర్మము లాత్మపై నారోపింపబడినవని తెలియబడ గలదు. అప్పుడు జన్మించు స్థితిని వైరాగ్యమని యందురు. వైరాగ్యము స్థితప్రజ్ఞుని స్వభావము జ్ఞానానుస్యూతమైనభక్తి యోగ మీ వైరాగ్యము నుత్పన్నము చేయును. వైరాగ్యమున సాంఘీకచైతన్యము, సాంఘీకధర్మములు తిరస్కృతములు కాజాలవు. సాంఘిక చైతన్య మీ వైరాగ్యమున పరిపుష్ట మగును.

4. ఏతద్భక్తియోగమును సమగ్రముగా వివరించగోరి విపశ్చిద గ్రేసరుడు పరివ్రాజకాచార్యుడు నగు శ్రీ మధుసూదన సరస్వతి శ్రీ భగవద్భక్తిరసాయన మను గ్రంథమును రచించెను. భక్తిసామాన్యస్వరూపము, భక్తి విశేషస్వరూపము అను విషయములను మొదటి రెండు ఉల్లాసములలో ప్రపంచించి, భక్తిరసమును మూడవ యుల్లాసమున ప్రతిపాదించినాడు. రసశబ్దము నాలంకారికులు శృంగారాది రసముల పరముగా వ్యవహరించిరి కాని ఉపనిషత్తులలో చెప్పబడిన "రసో వైనః" ఇత్యాది వాక్యముల నాలంకారికులు స్పృశించరైరి. అద్వితీయ మగు బ్రహ్మను రసముగా నిర్వచించవచ్చునా? రసప్రతీతిని బ్రహ్మావగతిగా స్వీకరించ వచ్చునా? యనుప్రశ్నల నక్కడక్కడ కొంద రాలంకారికులు చర్చించినమాట వాస్తవమే. భట్టనాయకుడు రసాస్వాదమును బ్రహ్మాస్వాదసవిధవర్తీ యని, బ్రహ్మాస్వాదస హూదర మని ప్రపంచించెను. ఈ భావమును పూర్తిగా విమర్శించక తర్వాతి ఆలంకారికు లందరు దీనినే ప్రపంచించసాగిరి. దీనిని పూర్తిగా విమర్శించి బ్రహ్మాస్వాదమే రసాస్వాద మని, బ్రహ్మ యనగా భగ్నమైన ఆవరణ గల చిదాత్మయే యని, రస మనగా నిట్టి ఆత్మయే యని సిద్ధాంతించిన అలంకారసార్వభౌముడు జగన్నాథుడు. కాని జగన్నాథునకు పూర్వమే ఈ సిద్ధాంతము శ్రీ మధూసూదనసరస్వతిచే ప్రవంచింపబడినది. శబ్దజ్ఞాన మగురసమున కపరోక్షత్వమును గూడ మధుసూదనుడే సాధించెను. ఇట్టి రసప్రతీతి నుద్దేశించియే ఉపనిషత్తులు బ్రహ్మ నానందముగా గూడ ప్రపంచించినవి.

5. అలంకారశాస్త్రము నాయా దర్శనములలోని దనిసమన్వయించిన వారనేకులు గలరు. పూర్వమీమాంసకు జెందిన దీ శాస్త్రమని లొల్లటుడు. న్యాయదర్శనములోని దిదియని శంకుకుడు. అద్వైత వేదాంతములోని దిదియని భట్టనాయకుడు, కాశ్మీర శైవాద్వైత దర్శనమునే అలంకార శాస్త్రము సమన్విత మగునని అభినవగుప్తుజడు, సాంఖ్యదర్శనము నకు జెందిన దిదియని ధనిక ధనంజయలువ్యాఖ్యానించిరి. అభినవునిసిద్ధాంతము ననుసరించిన అర్వాచీనులు చాలమందిగలరు. వీరిలో ననేకులకు కాశ్మీర శైవాద్వైత సమ్మతము గాదు. కాశ్మీర శివాద్వయదర్శనము నంగీకరించ జాలనివారు అభినవుని రసవాదము నంగీకరించుట హాస్యాస్పదము. భట్టనాయకుని వాదమును సమగ్రముగా పోషించి అభినవుని వాదమును సంద్భానుసారము సవరించి శాస్త్రీయముగా ప్రపంచించి, ఆద్వైతవేదాంత దర్శనమున కనుగుణముగా నలంకార శాస్త్రములోని రససిద్ధాంతమును వివరించినవారిలో శ్రీ మధుసూదన సరస్వతి, జగన్నాథుడు మాత్రమే కలరు. ఈవాదమే పరమ ప్రామాణిక మని వేరుగా జెప్పనక్కరలేదు. శ్రుతి వాక్యములు, ఉపపత్తులు, తర్కము, అనుభవము అనునవన్నియు ఈ వాదమునే 1బలపరచుచున్నవి.

నిత్యము, విషయానుభవసంవలితము, ఆనందస్వరూపము నగు ఆత్మయే రసము, ఈ రసమునే భక్తియని, శాంతమని వ్యవహరించవచ్చును. శాంతమును మధుసూదనుడు భక్తికంటెను, రసముకంటెను విలక్షణముగా గ్రహించుట అప్రామాణిక మని, అయుక్తిక మని ఆంధ్రవివృతిలో వివరించితిమి. భక్తిలో వివిధాంశములను భాగవతమునుండి మధు సూదనుడు తొలి యుల్లాసమున వివరించుచు, భాగవత సింహావలోకనము నొక్కసారి గావించినాడు. ఆధ్యాత్మిక గ్రంథ మగు భాగవత మద్వైతసిద్ధాంతములకు విరుద్ధముగా పోవుట లేదని, భాగవతమున గల భక్తియోగము జ్ఞానాను స్యూతమని, అవగతీ లేక ప్రతీతిగా కన్పించు జ్ఞానమునే భక్తి యనవలె నని ఇచ్చట సిద్ధాంతించితిమి.

6. మధుసూదనసరస్వతి వంగదేశములోని ప్రాచ్యభాగమున గల ఫరీద్‌పూర్‌ నగర సమీపమున రామచంద్ర భట్టాచార్య పంశము జన్మించెను. పురందమిశ్ర తనయుడగు కమలనయనుడు నవద్వీపమున హరిరామతర్కవాగీశునివద్ద న్యాయాదిదర్శనముల నభ్యసించి, విశ్వేశ్వర సరస్వతీ యనుయంతీంద్రుని ద్వారా సంన్యాసాశ్రమమును పొంది మధుసూదన సరస్వతీ యని వ్యవహరించబడెను. మధుసూదనుడు కాశిలో ననేక వర్షములుండి, అనేక శిష్యులకు విద్యనొసగెను. ఇతని శిష్యులలో నొకడగు శేషగోవింద పండితుడు, సర్వవేదాంత సిద్ధాంతర హస్యమను గ్రంథమున కొక టీకను రచించె నని ఆటీకాంతమున గల_

"గురుణా మధుసూదనేన యత్‌

కరుణా77పూరిత చేతసోపదిష్ఠమ్‌,

తదిదం ప్రకటీకృతం మయాస్మి &

భగవ చ్ఛంకర పూజ్యపాద మూలే"

అని శ్లోకముద్వారా తెలియుచున్నది. శేష గోవింద పండితుడు, శేష కృష్ణ విద్వద్వరుని పుత్రుడు. జగన్నాథుని తండ్రి యగు పేరుభట్టుయొక్క విద్యాగురు లీ శ్రీ శేషకృష్ణుడు. దీనివలన జగన్నాథునితండ్రి, మధుసూదనుడు సమకాలికు లని, మధుసూదనుని గ్రంథములు జగన్నాథునకు పరిచితము లని స్పష్టము. జగన్నాథుడు శాహ్జహా& కాలమువా డగుటచే, మధుసూదనుడింతకన్న కొంచెము పూర్వమే అనగా పదునేడవ శతాబ్దమున నివసించె నని చెప్పవచ్చును. అద్వైతసిద్ధి, వేదాంతకల్పలతా, అద్వైతతత్త్వరక్షణమ్‌, శ్రీ మద్భాగవతటీకా, శ్రీ భగవద్గీతావాఖ్యా గూఢార్థదీపికా, సంక్షేప శారీరక వ్యాఖ్యాసార సంగ్రహము, సిద్ధాంతబిందు, శివమహిమస్తవటీకా, హరలీలాగ్రంథటీకా, భగవద్భక్తిరసాయనమ్‌ మన్నగు గ్రంథములు మధుసూదనసరస్వతీ విరచితములు.

7. సంస్కృత సాహిత్య సమీక్షావాదముల ఆధారములను, స్వభావములను, స్వరూపమువలను, విచారించు ఆంగ్ల గ్రంథమును మద్రాసు విశ్వవిద్యాలయమువారి డి. లిట్‌. పరీక్షకు సమర్పించి యున్నాను. 1950 లో నేను రచించిన " Studies in the Physiological and Metaphysical Presuposition of Sanakrit Literary Criticism" అను ఈ గ్రంథమున నేనే అనువదింప వలెనని సంకల్పించు సమయమున అభినవభారతీసహిత మగు నాట్యశాస్త్రమును తెనుగున అను వదింప బయలుదేరితిని. 1951 లో నీ గ్రంథమునకు ఆంధ్రభారతి యని పేరుబెట్టి పదునే డధ్యాయములను పూర్తి గావించితిని. నా 'థిసిస్‌' లోని పది అధ్యాయములను ఆంధ్రభారతిలో ఆరవ అధ్యాయ వివరణావసరమున పూర్తిగా అనువదించి యున్నాను. స్థాయిభావములకు, సంచారిభావములకు, సాత్త్వికభావములకు చెందిన మూడధ్యాయములను భారతిలో ఖర సంవత్సరమున మాఘ పాల్గుణ సంచికలయందు, ఈ భాగములు నా ఆంధ్రభారితిలోనివి. మధుసూదనుని గ్రంథములో ఈ భావములు ప్రసక్తి పూర్తిగా గలదు గనుక పాఠకుల కావ్యసములతో పరిచయ మవసరము. రసస్వరూపమునకు చెందిన భాగము రెండధ్యాయములలో ఆంగ్లమున వ్రాసియుంటిని. వీటిని సంక్షేపించి మొదటి అనుబంధముగా నిచట ముద్రించుచుంటిని. శాంతరసమునకు చెందిన అధ్యాయమును మూడవ అనుబంధముగా అనువదించి ఇట ప్రచురించుచున్నాను. ఈ అనువాదము లన్నియు నా ఆంధ్రభారతిలో చేర్చియున్నాను.

భరతుని నాట్యశాస్త్రము చాల అయోమయస్థితిలో గలదు. అభినవభారతి సహితము సరిగాలేదు. వాటిని సంస్కరించి, నేటి విజ్ఞానమున కనుగుణముగా వివరించవలసిన ఆవశ్యకత కలదు. తదర్థము_

"ప్రక్షిప్తానథ వ్యఘాతా& శ్లోకానేవ పరిత్యజ&

సంప్రదాయానుసారేణ వివృణోమ్యాంధ్రభారతీమ్‌"

అని ప్రతిజ్ఞాశ్లోకముతో నా వివృతిని ప్రారంభించి, అభినవుడు పఠించిన నాట్యశాస్త్రమును సముద్ధరించగోరి, మూలగ్రంథమును ఇరువది యారవ అధ్యాయమువరకు పరిష్కరించితిని. అభినవుని వివృతిని పూర్తిగా అనువదించుచు అవసరమైన ప్రదేశములలో తదుపోద్బలకము లగు వివరణములను, అభినవుని వ్యాఖ్యఅంగీకార్యము కానిచోట్లనాయక్షేప సిద్ధాంతములను సమగ్రముగా నిచ్చుచు వ్రయుచున్నాను నా ఆంధ్రభారతిలో ఇప్పటికి మొదటి మూడధ్యాయములు ఐదవ అధ్యాయము, ఆరవ అధ్యాయములో ఏబది పుటలు ముద్రింపబడి యున్నది. త్వరలో ఆంధ్రభారతిని సమగ్రముగ ప్రచురింపగలను.

ప్రకృతగ్రంథము సులభముగా బోధపడుటకు, శాస్త్రవిషయము చక్కగా తెలియగలందులకు నా ఆంగ్లగ్రంథములోనివి, ఆంధ్రభారతిలో ప్రవేశ##పెట్టబడినవియు నగు కొన్ని భాగములను ఇచట అనుబంధరూపమున ఇచ్చితిని. ఈ విధమగు వివరణ లేనిదే భరతుడుగాని, తర్వాతి ప్రధానలంకారికులు గాని పూర్తిగా బోధపడ జాలరు. ఈక్లిష్టపరిస్థితిని. తెలుపుటకే దురవగాహస్థితిలో నున్న భరతుని రెండవ అధ్యాయమునకు చెంది ఆంధ్రభారతిని "నాట్యగృహము" అనుపేర నందనసంవత్సరపు శ్రావణమాస భారతిలో ప్రచురించితిని.

8. రెండు మూడు సంవత్సరములనుండి తమ సాధన గ్రంథమండలి కొక గ్రంథమును వ్రాసి ఈయవలసిన దని శ్రీ బులును సూర్యప్రకాశశాస్త్రి గారు కోరుచున్నారు. ఈ ఉత్తమ గ్రంథమండలి ఆశయముల కుపకరించుచు ఈమండలిని పైకి తీసికొని రాగలిగిన గ్రంథముగా మధుసూదనుని భగవద్భక్తిరసాయనము స్ఫురించగా గతసంవత్సరాదికి నావివృతి పూర్తిచేసితిని. ఈ గ్రంథముద్రణకు తోడ్పడిన సాధన గ్రంథమతిడలికి నా కృతజ్ఞత.

నందన, కాక్తికశుక్ల ప్రతిపత్‌}

భానువానరము. పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి

 

సాధన గ్రంథ మండలి, తెనాలి

స్థాపితము : 1945

మహారాజ పోషకులు (శాశ్వతము రు 116 లు )

శ్రీ జిడ్డు లింగయ్యగారు బందరు

ఈదర వేంకట్రావు పంతులుగారు ఏలూరు

దరిశి జానకిరామయ్యగాదు కొత్తపాలెం (దరిశి తా||(

తూములూరు వెంకటశివరామియ్యగారు నెల్లూరు

బొంగరాల వీరాస్వామనాయుడుగారు కాకినాడ

యేజండ్ల శ్రీరాములుచౌదరిగారు తెనాలి

జిల్లెళ్ల వెంకట భానోజీ తామర్పు

జమీందారువారు పేరూరు

రాజపోషకులు (శాశ్వతము రు 58 లు )

శ్రీ రూపాకుల శివరాంగారు హత్త్రాస్‌

పాలుట్లు పాలంకయ్యగారు గుంటూరు

దోనేపూడి వెంకట రమణమూర్తిగారు కంభం

వేజెళ్ళ రాఘవయ్యచౌదరిగారు జూపూడి

కలగర నాగభూషణచౌదరిగారు ఏలూరు

యస్‌. కె. ప్రకాశరావుగారు తెనాలి

స్థానం నరశింహారావుగారు ||

కే. నరశింహారావుగారు

పులిపాటి వెంకటేశ్వర్లుగారు

బొంతా సత్యనారాయన సోదరులు

జొన్నాదుల రామస్వామిగారు

చదలవాడ నాగేశ్వరరావుగారు

సంకా వీరభద్రయ్యగారు

 

శ్రీ పెన్నా సీతారామారావుగారు (హనుకొండ) వరంగల్‌

పులిపాక చినపున్నయ్యగారు నిడుబ్రోలు

చెన్నుభొట్ల భానుమూర్తిగారు కాకినాడ

బులుసు సూరీడుగారు అయినవిల్లి

జయంతి బుచ్చిరామశర్మగారు ముక్తీశ్వరం

పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు చావలి

దొడ్ల వెంకటరామిరెడ్డి గారు కావలి

దువ్వూరి అప్పల నరసింహంగారు అనకాపల్లి

పోషకులు (ప్రతి సంవత్సరము రు 25 లు)

శ్రీ దుగ్గిరాల సూర్యనారాయణమూర్తిగారు తెనాలి

పులిపాటి లక్ష్మీనారాయణగారు

గట్టి లక్ష్మీనరసింహశాస్త్రిగారు తెనాలి

ప్రయాగ కృష్టమూర్తిగారు

చుండూరు రామయ్యగారు

బ్రహ్మాండం వెంకటలక్ష్మీనారాయణశాస్త్రిగారు బాపట్ల

పోలిశెట్టి సోమసుందరంగారు గుంటూరు

కొత్తూరు రామయ్య, కర్పూరపు

రామకృష్ణమూర్తిగార్లుకంపెనీ

వినపావనుల సీతారామయ్యగారు

బెండపూడి పేర్రాజుగారు వాల్తేరు

చీమలపాటి గణశ్వరరావు పంతులుగారు

స్వామ్య మృతానందతీర్థ

కలగ అంజనేయశాస్త్రి గారు విజయవాడ

కలగ వెంకటనారాయణగారు తోటవల్లూరు

సభ్యలు (ప్రతి సంవత్సరము రు 10 లు)

శ్రీ కోటంరాజు కృష్ణారావుగారు తెనాలి

ఖండ్రిక సాంబయ్యగారు

నేతి హరినారాయణగారు

విష్ణుభొట్ల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు

ముక్కామల వేంకటాచలపతిరావుగారు

కోగంటి తిరుపతయ్యగారు

గాడేపల్లి వెంకటసుబ్బారావుగారు

మట్టిగుంట వీరభద్రరావుగారు

సిరిపురపు శ్రీరాములుగారు

ప్రత్తి సూర్యనారాయణగారు

అన్నంరాజు మాధవరావుగారు

పరిమి వేంకట సుబ్బారావుగారు

ముదిగొండ మృత్యుంజయుడుగారు తెనాలి

కాజ వేంకట జగన్నాధరావుగారు

గుడివాడ హనుమంతరావుగారు

గోనుగుంట్ల సుబ్బారావుగారు

లక్కరాజు వేంకట పాండురంగ విఠల్‌ శర్మగారు

కాజ వేంకట నరసింహారావుగారు

అద్దేపల్లి శ్రీమన్నారాయణమూర్తిగారు

అక్కల వెంకటేశ్వర్లుగారు

ఈదర సుందరరామయ్యగారు

ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మగారు

ఏ. సుందరరావుగారు

దార్వేముల వేంకటేశ్వరశాస్త్రిగారు

అల్లాడి వీరరాఘవస్వామిగారు

ప్రోపై#్రటర్సు రూబీ యింక్స్‌

ప్రోపై#్రటర్సు సారధి ప్రెస్‌

త్రిపురముల్లు శ్రీరాములుగారు

తాడేపల్లి హరినారాయణగారు

ముక్కామల రామచంద్రరావుగారు

కోటంరాజు ప్రసాదరావుగారు

యమ్‌. సుబ్బారాయుడుగారు

రూపాకుల సూర్యనారాయణగారు

రావినూతల నరసింహారావుగారు ఒంగోలు

తూములూరి శ్రీరామమూర్తిగారు పినపాడు

వల్లూరు వెంకటేశ్వర్లుగారు బాపట్ల

కె. మధుసూధనరావుగారు

మామిడిపూడి వెంకటసుబ్బయ్యగారు తిరుచునాపల్లి

యం. లింగమూర్తిగారు మదరాసు

సి. అలవందరయ్యగారు

ఆర్‌. సాంబశివరావుగారు

పిసిపాటి పిచ్చయ్యగారు ఇంకొల్లు

జరుగుల హరినారాయణగారు

ఈదర సూరయ్యగారు అయితానగరం

ఇసుకపల్లి వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రీగారు గార్లపాడు

పన్నాల లక్ష్మీనరసింహంగారు గుంటూరు

పన్నాల రామకృష్టయ్యగారు

జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్యంగారు

మేళ్ళచెర్వు వీరాంజనేయశాస్త్రిగారు

శ్రీ నిడమానూరి కనకరాజుగారు

కూచిభొట్ల సుబ్బారావుగారు

గరిమేళ్ళ వేంకటరమణ కామేశ్వరరావుగారు గంగ.....

గరిమెళ్ల శ్రీరామమూర్తిగారు

శ్రీ దువ్వూరి వేంకటపతి సోమయాజులు జమీందారు

గొర్తి పళ్లయ్య పంతులుగారు అగ్రహం

మద్దింశెట్టి బ్రహ్మయ్యగారు అమినమి

విళ్ళ వెంకటస్వామిగారు

మద్దిరాల వెంకట కామేశ్వరరావుగారు శానవల్లిలంక

సమయమంతుల నాగేశ్వరరావుగారు ర్యాలి

అల్లవరపు అన్నప్పగారు ముక్తేశ్వరం

సలాది బాపయ్యగారు అనాతవరం

సరిపల్లె విశ్వనాధంగారు

కొప్పర్తి కృష్ణమూర్తిగారు ధవిళేశ్వరం

బులుసు పాపయ్యశాస్త్రిగారు రాజమండ్రి

బులుసు సత్యనారాయణగారు

చింతలూరి రామారావుగారు

ద్వారకదాస్‌ గిరిధరదాస్‌గారు

టి. కనకరాజుగారు

వాజపేయాజుల వెంకటేశ్వర్లుగారు

జి. వరదరావుగారు

ఉండవల్లి శంకర కోటేశ్వరరావుగారు రాజమండ్రి

యం. సోమేశ్వరరావుగారు

జిల్లా సుబ్బారాయశ్రేష్ఠిగారు

మానాప్రగాడ శ్రీరాములుగారు కొవ్వూరు

శ్రీ నండూరి రాఘవరాజుగారు

బులుసు వెంకటేశ్వర్లుగారు కాకినాడ

కాజ సూర్యనారాయణగారు విజయవాడ

వావిలాల శ్రీనివాసరావుగారు

నందిపాటి రామయ్యగారు

మంథా సుబ్బారావుగారు అమలాపురం

కోట పాలయ్యగారు

మంగళపల్లి లక్ష్మీనారాయణశాస్త్రిగారు

యం. వెంకటసుబ్బారావుగారు

కస్తూరి రామచంద్రమూర్తిగారు

కె. జగన్మోహనరావుగారు నేలకొండపల్లి

జి. లోకనాధశర్మగారు

ఆదిరాజు అన్నారాజీరావుగారు విజయనగరం

పసుపర్తి వీరభద్రస్వామిగారు

కె. యస్‌. యన్‌. పట్నాయిక్‌ గారు

జోస్యుల వెంకట సత్యనారాయణమూర్తిగారు భట్నవిల్లి

గొర్తి పళ్ళయ్యశర్మగారు నేదునూరు

నడింపల్లి సత్యనారాయణరాజుగారు అంబాజీపేట

నూకల అమ్మన్న పంతులుగారు నందంపూడి

వడ్లమాని కామేశ్వరరావుగారు

సూకల లక్ష్మీనారాయణగారు

గంటి సుబ్బారావుగారు

చల్లా సుబ్రహ్మణ్యంగారు నరేంద్రపురం

ద్విభాష్యం వెంకటసూర్యనారాయణగారు చింతలూరు

బూదరాజు వెంకటసుబ్బారావుగారు స్వర్ణ

శ్రీ బూదరాజు వాసుదేవమూర్తిగారు

జాగర్లమూడి కుప్పుసామి

కొల్లూరు కోటయ్యచౌదరిగారు

దిరిళాల రమణారెడ్డి గారు

బవరం కోటిరెడ్డిగారు వంకాలపా

కోట శ్రీనివాసరావుగారు నెల్లూరు

పులిగెళ్ళ వెంకటకృష్ణయ్యగారు

చతుర్వేదుల రామచంద్రయ్యగారు

పసుమర్తి సత్యనారాయణగారు కావలి

వద్దిరాజు రంగారావుగారు హనుమకొండ

కె. మధుసూదనరావుగారు

కురికాల వేణిరావుగారు పరకాల

కురికాల వేంకటేశ్వరరావుగారు

కరికాల వేంకటేశ్వరరావుగారు

వద్దిరాజు వెంకటరంగారావుగారు వరంగల్‌

ఐ. వెంకట్రావుగారు

యన్‌. సిద్ధాంతిగారు

టి. యన్‌. మూర్తిగారు

కె. గంగాధరరావుగారు

డి. జనార్దనరావుగారు

పొట్లపల్లి సత్యన్నారాయణరావుగారు బ్రహ్మన్వాడి

ఉప్పల శ్రీరామమూర్తిగారు అనకాపల్లి

వేదాంతం వెంకటసత్యనారాయణశర్మగారు అత్తోట

కోలగొట్ల సూర్యనారాయణరావుశ్రేష్టిగారు పార్వతీపురం

&. పి. విశ్వనాధశర్మగారు సికింద్రాబాదు

రామమూర్తిగారు

వడేపల్లి శివరామకృష్ణయ్యగారు

చిట్టా వెంకట్రామశాస్త్రిగారు

జూలూరి గజదీశ్వరయ్యగారు

జూలూరి లీరేశలింగంగారు

ఎ. కృష్ణమూర్తిగారు హైదరాబాద్‌

ఎమ్‌. కామేశ్వరరావుగారు

బి. వి. సుబ్బారాయుడుగారు

జి.మురహరిరావుగారు

వాడవల్లి మురహరిరావుగారు శర్కర్‌ నగర్‌

మాటూరి సీతారామారావుగారు మథిర

లొల్ల శంకరశాస్త్రిగారు కొల్లూరు

పురాణం వెంకటసత్యనారాయణశాస్త్రిగారు బందరు

తణికెళ్ల కృష్ణమూర్తిగారు కొత్తపేట

పి. పాపయ్య రాజుగారు పెదపాడు

డొక్కా రామావధానులుగారు వక్కలంక

'సభాపతి' శ్రీదుగ్గిరాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి కూచినపూడి

శ్రీ చావలి నారాయణ కూచినపూడి

 

కృతజ్ఞత

పుష్పము తనలోని సుగంధమును లోకమున వెదజల్లి, తన జన్మను సార్ధక్య మొనర్చుకొనును. అట్లే సత్పురుషు%ు తమ ఉత్తమ ధర్మమును నిర్వర్తించుచుందురు. అట్టి సత్పురుషులలో విద్యాపోషకులు, వదాన్యశేఖరులు, అగు ఆశ్రిత పారిజాత శ్రీ ఈదర వేంకట్రావుపంతులుగారు మా మండలి పురోభివృద్ధికై చేయుచున్నస హాయమునకు మా కృతజ్ఞత. భగవంతుడు వీరికి వీరికుటుంబమునకు ఆయురారోగ్య ఐశ్వర్యముల నిచ్చి సర్వదా సంరక్షించు గాక!

వ్యవస్థాపకుడు:

సాధన గ్రంథ మండలి.

Bhakthi Rasaayanamu        Chapters   Last Page