Nadayadu Daivamu  Chapters  

 

శ్రీచంద్రశేఖర మాశ్రయే గురుసంయమీంద్ర సరస్వతీం

జంద్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి

1. కాంచికాపుర కామకోటి సుపీఠ సంస్థిత సద్గురుం

భక్తకోటి సురద్రుమం భవబంధమోచన తత్పరం

వేదచోదిత ధర్మ రక్షణ బద్ధకంకణ మీశ్వరం

చంద్రశేఖర మాశ్రయే గురు సంయమీంద్ర సరస్వతీం

2. కామరాగ వివర్జితం కరుణామృతాబ్ధి మనావిలం

శాన్తి దాన్తి గుణౌఘ భాసుర మాత్మబోధ విచక్షణం

నిత్యతృప్త మనాగసం నిఖిలార్తి శోషణ పండితం

చంద్రశేఖర మాశ్రయే గురు సంయమీంద్ర సరస్వతీం

3. భారతీయ సమైక్య సంస్కృతి ఘోషణాయ సముత్సుకం

షణ్మతస్థ విరోధభావ సమన్వయే పరినిష్ఠితం

పాదయాన నిషేవితాఖిల తీర్థసేవన దీక్షితం

చంద్రశేఖర మాశ్రయే గురు సంయమీంద్ర సరస్వతీం

4. శంకరార్య దిగంత విశ్రుత కీర్తి రక్షణ దీక్షితం

రామనాధ నివేశితాచ్ఛ సశిష్య శంకర విగ్రహం|

శ్రీగిరి స్థల కాలడీకృత కీర్తి కేతన తోషితం

చంద్రశేఖర మాశ్రయే గురు సంయమీంద్ర సరస్వతీం

5. కామకోటిసుపీఠ నిష్ఠిత మార్షధర్మ పురస్కృతం

శంకరం స్వయ మాగతం భువి పూర్వకర్మ నిరీక్షితం

వేద బోధిత ధర్మ మాశ్రుత విగ్రహం సుమనోహరం

చంద్రశేఖర మాశ్రయే గురుసంయమీంద్ర సరస్వతీం

Nadayadu Daivamu  Chapters