Kamakoti   Chapters   Last Page

 

శ్రీమదాదిశంకరభగవత్పాదకృత

స్తోత్త్రరత్నములు

2. కనకధారాస్తవము

శ్రీశంకర భగవత్పాదుల వారు బాల్యమున యొకగృహమునకు భిక్షార్ధియై వెళ్ళగా ఆ ఇల్లాలు బీదతనముచేత ఆయనకు భిక్షమిడుటకు ఇంటయేమియూ లేకపోగా, దొడ్డిలో ఉసిరిక చెట్టుక్రింద పండి రాలిపడియున్న యెండు యుసిరికాయ నొకదానిని ఆర్తితో సజలనయనయైవారిభిక్షాపాత్ర యందుంచెను. ఆ దృశ్యముతో శ్రీవారి హృదయము కరిగి కనకధారాస్తవముతో లక్ష్మీదేవిని మెప్పించి ఆ గృహిణికి దారిద్ర్యబాధ తొలగించ వలసినదిగా ప్రార్ధించిరి. దయానుపవన యగు లక్ష్మిదేవి శ్రీశంకరులస్తవమునకు మెచ్చి ఆ గృహ ప్రాంగణమున అమలకవర్షము కురిపించినది. ఈ స్తోత్రమును ప్రతిదినము పూటకు 3పర్యాయములు చొప్పున మూడు పూటలా నిత్యముభక్తితో పారాయణ చేసినవారు లక్ష్మీకటాక్ష పాత్రులగుదురని పెద్దల వాక్యము.

వన్దే వన్దారుమన్దార మిందిరానన్దకన్దలం,

అమన్దానన్దసన్దోహబన్థురం సిన్ధురానమ్‌.

అజ్గం హరేః పులకభూషణమాశ్రయన్తీ

భృజ్గాంగ నేవ ముకుళాభరణం తమాలం,

అజ్గీకృతాఖిలవిభూతిరపాజ్గలీలా

మాంగల్యదాస్తు మమ మజ్గల దేవతాయాః 1

మొగ్గలతో నొప్పారు కానుగుచెట్టును పెంటితుమ్మెద యాశ్రయించినట్లు గగుర్పాటుతో జెన్నుమీరెడి వెన్నుని ఱొమ్మున వసించు లక్ష్మిదేవి సకలైశ్వర్యములకునికిపట్టయిన తనక్రీగంటిచూపునునాపైబ్రసరింపజేసి, నాకునన్ని శుభములునొసంగుగాక.

ఇట వెన్నునిమేను నల్లనౌటచే నల్లనైనకానుగుతోను, మేనిరోమములు సన్నగ నుండునుగాన మొగ్గలతోను సరిపోల్పబడినవి. లక్ష్మీదేవీయొక్క యనురాగభరితమైన క్రీగంటిచూపు వెన్నునిపై బ్రసరించి, సకలైశ్వర్యములను బొందియొప్పుచున్నది. అట్టియాదేవిచూపు నాపై బ్రసరించిన నాకును మే లొసంగునని భావము.

ముగ్ధా ముహుర్విదథతీ వదనే మురారేః

ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని,

మాలాదృశోర్మథకరీవ మహోత్పలే యా

సా మే శ్రియం దిశతు సాగర సమ్భవాయాః

నల్లగలువపైకి పెంటితుమ్మెద వాలినట్లు లక్ష్మీదేవియొక్క సొగసైన కన్దొయియు ననురాగముచేత బ్రియుని జూడ బ్రవర్తించెడి; ప్రియుడు తన్నుజూడ సిగ్గుచే మఱలుచున్నది. అట్లనురాగముచేత బ్రియుని జూచుచు, అతనిదృష్టితనదృష్టితో గలియగ సిగ్గుచే మఱల్చుచు నుండినట్టి యాలక్ష్మీ దేవియొక్క కన్దొయిచూపు నాపై బ్రసరించి నన్ను ధన్యునిజేసి, నాకు గలిమనొసంగునుగాక.

ఈ శ్లోకమున విష్ణుని మేనిచాయ నల్లగలువతో బోల్చబడినది.

విశ్వామరేన్ద్ర పదవిభ్రమదానదక్ష

మానన్ద హేతురధికం మురవిద్విషోపి

ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్ధ

మిన్దీవరోదరసహోదర మిన్దిరాయాః

లక్ష్మిదేవిచూపు నల్లగలువయొక్క లోపలిభాగమువోలె నల్లని కాంతితో మెఱయుచు, దనభక్తుల కెల్లరకు నింద్రపదమును సైతముకరుణింపగలిగి విష్ణువునకు సైతము మిక్కిలి యానంద మొదవ జాలియున్నది. అట్టి యాలక్ష్మిదేవి యరచూపు నాయందు గొంత తడవు నిల్చి నాకైశ్వర్యము నొసంగు గాక! అందఱకు దేవేంద్రపదవి నీయజాలినది గాన లక్ష్మికటాక్షార్థమునాకును సకల సంపదల నొసంగుట కేసందియమును లేదు.

అమీలితాక్ష మధిగమ్య ముదా ముకున్ద

మానన్దకన్ద మనిమేష మనంగ తన్త్రమ్‌,

ఆకేకరస్థిత కనీనికపక్ష్మ నేత్రం

భూత్యై భ##వేన్మమ భుజజ్గశయాజ్గనాయాః.

మదనపరవశుండయు ఇంచుకంత మూసికొన్న కనులు గల మనోహరుడగు ముకుందుని బ్రేమ వెల్లివిరియ ఱప్పపాటులేకయు జూచి సిగ్గుచే సగము ఱప్ప మూసికున్నదై కంటిపాప నోరకుజేర్చి చూచునట్టి యావన్నగ శాయిదేవేరి యగు లక్ష్మి దేవియొక్క చూడ్కినాకు సంపద నొసంగుగాక.

కాలామ్బుదాళిలలితోరసి కైటభారే

ర్ధారాధరే స్ఫురతి యా తటిదజ్గనేన,

మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తి

ర్భద్రాణి మే దిశతు భార్గవనన్దనాయాః.

క్రోక్కాఱుమబ్బునందు మెఱపుదీగ మెఱసినట్టుల, నీల మేఘ శ్యాముడగు

విష్ణువునం దేచూడ్కి(మూర్తి) మెఱయుచున్నదో, అట్టి జగజ్జనని యగు లక్ష్మీదేవియెక్క (సొగసైనచూపు) మూర్తి నాకు సకలశుభముల నొసంగుగాక.

బాహ్వాన్తరే మురజితః శ్రితకౌస్తుభేయా

హారావళీవ హరినీలమయీ విభాతి,

కామప్రదా భగవతోసి కటాక్షమాలా

కల్యాణ మావహతు మే కమలాలయాయాః.

ఏలక్ష్మీదేవియొక్క క్రీగంటిచూడ్కులు కౌస్తుభహారముతో నొప్పువెన్నునిఱొమ్మును చూచుచు నతనికంఠమున నింద్ర నీలమణుల హారపు శోభను గల్గించు చున్నవో, ఏ చూడ్కులు భగవంతుని కోర్కులను సైతము దీర్పగలవో, అట్టి యామెచూడ్కులు నాకు మేలు నొసంగుగాక.

ప్రాప్తం పదం ప్రధమతః ఖలు యత్ప్రభావాత్‌

మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన,

మయ్యా పతేత్తదిహ మన్ధరమీక్షణార్ధం

మన్దాలసం చ మకరాలయకన్యకాయాః.

ఏ శ్రీదేవి యొక్క క్రీగంటిచూపు వాలగనే యే మంగళధాముడగు మహావిష్ణువు మన్మధపరవశుడై జగత్పరిపాలనాధికారమునకు గడగెనో, అట్టి యా శ్రీదేవియొక్క తిన్నని క్రీగంటి చూపు నాయందు దిన్నగా బ్రసరించును గాక.

దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా

మస్మిన్నకిఞ్చన విహంగశిశౌ విషణ్ణ,

దుష్కర్మఘర్మ మపనీయ చిరాయ దూరం

నారాయణప్రణయనీ నయనామ్బువాహః.

చాతకపక్షి శిశువు బెట్టచే దపించుచుండగా గాలికి రేగిన మేఘమువర్షించి, దానిబెట్టనుదీర్చి నీటిచే దనివినొందినట్లు, లక్ష్మీకటాక్ష మనెడి మేఘము దయయను గాలిచే బ్రోత్సాహపఱుపబడినదై, నాచిరకాలపు దుష్కర్మ మనెడి బెట్టను దీర్చి ద్రవ్యమనెడి వర్షమును వర్షించి నేననెడి చాతకపోతమునకు దనివి గలిగించుగాక. అనగా లక్ష్మిదేవి దరిద్రుడనగు నాపాపకర్మములను దూరమునకు బారదోలి, నాపైగటాక్షము ప్రసరింపజేసి పక్షికూనవంటి వాడనగు నాదారిద్ర్యమును దొలగించి, నాకుభాగ్యము నొసంగుగాక.

ఇష్టా విశిష్టమతయోపి నరా యయా ద్రాగ్‌

దృష్టా స్త్రివిష్టపపదం సులభం భజన్తే.

దృష్టిః ప్రహృష్టకమలోదరదీ ప్తిరిష్టాం

పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః.

యాగములు మొదలయిన పుణ్యకర్మలు చేయుటయందు బుద్దిలేనివారైనప్పటికిని మనుజులు ఏలక్ష్మిదేవిదృష్టి సోకినందున పొందనలవికాని యింద్రపదవిసైతము పొందుచున్నారో, అట్టి తామరపువ్వు చాయకల లక్ష్మీదేవియొక్క కీగంటిచూడ్కి నాకు వలసినంత సంపద నొసంగుగాక.

గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి

శాకంభరీతి శశిశేఖరవల్ల భేతి,

సృష్టిస్థితిప్రళయ కేళిషు సంస్థితా యా

తసై#్య నమస్త్రిభువనైకగురో స్తరుణ్యౖ.

సృష్టికాలమున బ్రహ్మభార్యయై సరస్వతియను పేరును, సంరక్షణ కాలమున విష్నుభార్యయై లక్ష్మీయను పేరును, కాలరూపిణియై శాకంభరి యనియు లయకాలమున శంకరప్రియయై పార్వతియనియు బరిగిన మజ్జగముల నేలు వెన్నురాణి యగు లక్ష్మిదేవికి మ్రొక్కెదను.

శ్రుత్యై నమోస్తు శుభకర్మఫల ప్రసూత్యై

రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై

శ##క్త్యై నమోస్తు శతపత్రని కేతనాయై

పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై.

యజ్ఞాదిఫలములకు గారణమయిన వేదరూపము దాల్చిన లక్ష్మికి నమస్కారము. దయాదాక్షిణ్యాదిగుణములకెల్ల నునికిపట్టగు రతిరూపురాలగు లక్ష్మికి మొక్కెదను. పద్మాసనయగు శక్తిరూపురాలగు లక్ష్మికి నమస్కారము. పురుషోత్తముడగు వెన్నుని రాణియై పుష్టిరూపురాలగు లక్ష్మీదేవికి నమస్కారము.

నమోస్తు వాళీకనిభాననాయై

నమోస్తు దుగ్ధోదథిజన్మభుమ్యై

నమోస్తు సోమామృతసోదరాయై

నమోస్తు నారాయణవల్లభాయై

చంద్రునిబోలు మోము గలదియు, క్షీరసముద్రమున జంద్రునికిని నమృతమునకును దోడబుట్టినదియునగు విష్ణువల్లభయగు లక్ష్మీదేవికి నమస్కారము.

''నాళీకనిభానన'' అను విశేషణముచేత నుత్తమాంగనయనియు, క్షీరసముద్రము పుట్టుచోటు గావున, గొప్పవంశమున బుట్టినది యనియు, చంద్రామృతముల దోడబుట్టినదన్నందున, వారివలెనే చల్లనిది యనియు, ఆహ్లాదకరురాలనియు''నారాయణవల్లభ'' అన్నందున జ్ఞానప్రదునకు బ్రియురాలు గాన దానును జ్ఞానప్రద యనియు సూచింపబడినది.

నమోస్తు హేమామ్బుజపీఠికాయై

నమోస్తు భూమణ్డలనాయికాయై

నమోస్తు దేవాదిదయాపరాయై

నమోస్తు శార్‌ఙ్గాయుధవల్లభాయై.

బంగారు తామరసింహాసనముపై గూర్చున్నదియు, భూమండలమునకెల్ల నాయికయు, దేవతలు మున్నగువారియెడ గరుణగలదియునైన శార్‌ఙధన్వువిరాణియగు లక్ష్మీదేవికి వేనవేలుగ నమస్కారములు సలిపెదను.

నమోస్తు దేవ్యై భృగునన్దనాయై

నమోస్తు విష్ణోరురసి స్థితాయై

నమోస్తు లక్ష్మై కమలాలయాయై

నమోస్తు దామోదరవల్లభాయై.

భృగుమహర్షి పుత్రికయు, విష్ణువక్షస్థ్సల నివాసినియు కమలాసనయు, విష్ణుపత్నియునగు లక్ష్మీదేవికి నమస్కరములు సలిపెదను.

నమోస్తు కాన్త్యై కమలేక్షణాయై

నమోస్తు భూత్యై భువనప్రసూత్యై

నమోస్తు దేవాదిభిరర్చితాయై

నమోస్తు నన్దాత్మజ వల్లభాయై

తామరరేకులం బోలు కన్నులు గలదియు, కాంతిరూపురాలును, లోకములకు జననియు, ఐశ్వర్యరూపురాలును, వేల్పులు మొదలగువారిచే బూజికయు కృష్నునికి బ్రియురాలును నైన లక్ష్మిదేవికి నమస్కారము.

సమ్పత్కరాణి సకలేన్ద్రియనన్దనాని

సామ్రాజ్య దాననిరతాని సరోరుహాక్షి

త్వద్వన్దనాని దురితాహరణోద్యతాని

మామేవ మాత రనిశం కలయన్తు మాన్యే

తామరరేకులంబోలు కన్నులు గలదానవై, యెల్లరచే గొనియాడబడునోతల్లీ! నిన్ను నమస్కరించినవారికి సకలసంపదలు గలుగును. ఇంద్రియములెల్ల సంతసము నొందును. సకలసామ్రాజ్యములు గలుగును. పాపములును దప్పక తొలగును. కావున, ఓ దేవీ నీ పాదములకు సదా మ్రొక్కులిడెదను. నన్ను ధన్యుం జేయుము తల్లీ.

యత్కటాక్షసముపాసనావిధిః

సేవకస్య సకలార్ధసంపదః

సన్తనోతి వచనాంగమానసై

స్త్వాం మురారిహృదయేశ్వరీం భ##జే.

ఓదేవీ! ఏకటాక్షము పారినంతన నీభక్తులకు సంపదలు కలుగునో, అట్టి నిన్ను త్రికరణముతో సదా కొల్చుచున్నాను.

సరసిజనయనే సరోజహస్తే

ధవళతమాంశుకగంథమాల్యశోభే,

భగవతి హరివల్ల భే మనోజ్ఞే

త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్‌.

తామరరేకులంబోలు కన్నులు గలదానా, కమలహస్తురాలా, తెల్లనైన గంధమాల్యముల ధరించుదానా, మజ్జగములకు నైశ్వర్యము నొసగుదానా, సౌందర్యవతీ విష్నునిరాణీ, షడ్గుణౖశ్వర్య ములుగల యోదేవీ, నాయెడ ననుగ్రహింపుము.

దిగ్ఘస్తిభిః కనకకుమ్భముఖావసృష్ట

స్వర్వాహినీ విమలచారుజలప్లుతాఙ్గీమ్‌.

ప్రాతర్నమామి జగతాం జననీ మశేష

లోకాధినాధగృహిణీ మమృతాబ్ధిపుత్రీమ్‌.

దిగ్గజములు గంగానదినుండి బంగారుగిండ్లతో నీటిని దెచ్చి, తమ తొండములతో నెత్తి యభిషేకింపబడిన సకలాంగములు గలదియును, లోకములను దల్లివలె బోషించునదియు మజ్జగంబుల కేలియగు వెన్నునిరాణియు, సముద్రరాజపుత్రికయు నగు లక్ష్మిదేవికి నమస్కరించెదను.

కమలే కమలాక్షవల్లభేత్వం

కరుణాపూరతరఙ్గితై రపాఙ్గైః

అవలోకయ మా మకించనానాం

ప్రధమం పాత్రమకృత్రిమం దయాయాః

విష్నుమూర్తికి వల్లభ##యైన యోలక్ష్మీదేవీ రిక్తులలో ముఖ్యుడను దయకు ముఖ్యపాత్రుడనునైన నన్నుదయారసముతో నిండిన క్రీగంటిచూపులతో చూచి, నన్ను ధన్యునిజేయుము.

స్తువ న్తి యే స్తుతిభి రమూభిరన్వహం

త్రయీమయీం త్రిభువనమాతరం రమాం

గుణాధికా గురుతరభాగ్యభాజినో

భవ న్తి తే భువి బుధభావితాశయాః

ఎవరు ప్రతిదినము వేదస్వరూపురాలైన త్రిలోకమాతయగు లక్ష్మిదేవిని ఈ స్తోత్రములతో స్తుతించుచున్నారో, అట్టివారు విస్తారమగు సుగుణములు గల వారును, ఎక్కువ భాగ్యము నొందినవారును, లోకమున బండితులలో బొగడ్తకెక్కినవారును నగుచున్నారు.

సువర్ణ ధారాస్తోత్రం య

చ్చంకరాచార్య నిర్మితమ్‌,

త్రిసంధ్యం యః పఠేన్నిత్యం

స కుబేరసమో భ##వేత్‌.

ఇతి శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్యవర్యస్య

శ్రీమచ్ఛంకరభగవతః కృతిషు కనకథారాస్తోత్రం సంపూర్ణమ్‌.

తాళపత్రలిఖిత గ్రంథములలోనున్న యథికపాఘశ్టోకములు.

బిల్వాటవీమథ్యలసత్సరోజే

సహస్రపత్రే సుఖసన్నివిష్టాం,

అష్టాపదామ్భోరుహపాణిపద్మాం

సువర్ణ పర్ణాం ప్రణమామి లక్ష్మీమ్‌.

బిల్వవనమధ్యమున వేయిరేకుల కమలమున గూర్చుండి, బంగారు తామర పువ్వుల జేతులందు దాల్చిన బంగారువన్నె మేని చాయగల లక్ష్మీదేవిని మ్రొక్కెదను.

కమలాసనపాణినా లలాటే

లిఖితామక్షరపంక్తి మస్య జంతోః

పరావమార్జయ మాతరంఘ్రిణా తే

ధనిక ద్వారనివాసదుఃఖదోగ్థ్రీమ్‌.

ఓ తల్లీ! యీ ప్రాణి నొసట బ్రహ్మ ధనికుల వాకిళ్ళు నిలబడి వారిచ్చు ధనముతో జీవించునట్లు వ్రాసియున్న తలవ్రాతను నీ పాదముతో దుడిచి, యతనిని ధన్యుని జేయుము.

అంభోరుహం జన్మగృహం భవత్యా

వక్షస్థ్సలం భర్తృగృహం మురారేః

కారుణ్యతః కల్పయ పద్మవాసే

లీలాగృహం మే హృదయారవిన్దమ్‌.

ఓ తల్లీ! నీకు కమలము పుట్టినిల్లును, విష్ణువక్షస్థలము మగని యిల్లును నయిన చందమున నా హృదయారవిందమును నీకు క్రీడాగృహ మగునట్లు దయసేయుము.

Kamakoti   Chapters   Last Page