Upanyasamulu    Chapters   

సాహిత్యము -- స్త్రీల బాధ్యత

అనాయతప్రాణ మసంయతాక్షం

అబ్రహ్మచర్యా నశనాదిఖేదం

చిత్తే మహేశం నిభృతం నిధాతుం

సిద్ధఃకవీనాం కవితైవయోగః.

ఇప్పుడు చదివిన పత్రములలో ఈ సాహిత్యసమితికి యాజ్ఞ్యవల్క్య, వ్యాస, వాల్మీకి, తిక్కన, శ్రీనాథ, వేంకటరాయశాస్త్రి, షేక్స్పియర్‌, షెల్లి, కీట్‌ స్‌ ప్రభృతులు తొమ్మండుగురు గురువులని కలదు. వేదశిఖరములు ఉపనిషత్తులు. అట్టి బృహదారణ్యకమున యాజ్ఞ్యవల్క్య వచనములున్నవి. అట్లే వ్యాస వాల్మీకులును ఋషిసంప్రదాయమునకు చెందినవారు. తదితరులును మనకుపాదేయులే. కడపటి ముగ్గురుసూత్రము మనము ఏ భాషా సంపర్కమువలన కొంపల నాశనము చేసుకొంటిమో ఆ భాషకు సంబంధించినవారు.

ప్రతిమానవుడుకూడా మనమెందుకుద్భవించితిమి? మన శరీరోద్దేశ్యము పూర్తి అయినదా? అని ప్రతిదిన మాలోచింపవలెను. ఒకడు అట్లూరునుండి నెల్లూరికి వచ్చినాడనుకొనుడు. అతడెందుకొచ్చినాడో ఆ విషయమును మఱచినాడు. ఊరక తిరుగుచున్నాడు. ఏమి ప్రయోజనము? మనస్థితికూడా ఆలాగే వున్నదగి. మనకెందుకు ఈ శరీరమొచ్చినదో? మనమేమి చేయవలయునో మనము మరచిపోయినాము. అది వేదాంతుల పనిగాని మనపని కాదందురేమో అట్లుగాదు. అది సర్వమానవ సాధారణ ధర్మము. అట్టి విచారణ చేయకపోయినచో నరకము తప్పదు. దీనినే యాజ్ఞ్యవల్కుడు

'మహతీ వినష్ఠిః'

అనగా అట్టి విచారణ లేకపోవుట మానవజన్మకొక గొప్పనష్టము అని చెప్పినాడు. మరుజన్మలో మనమే నల్లిగనో, పిల్లిగనో, పందిగనో జన్మింతుము. అప్పుడీలాటివిషయములనాలోచింప నవకాశ##మేలేదు. కాబట్లి మనము నేటినుండియే ఆ విచారణకు బూనవలెను. దీనినే త్యాగరాజుగారు

'జన్మమెందుకు భక్తి లేని నర ||జ||'

అని గానమొనర్చినాడు. దీనిని గూర్చి అనేకమంది మహాపురుషులు, అనేకమంది భక్తులు ఆలోచించి ఒకనిర్ణయముచేసినారు. వారి మార్గములు భిన్న భిన్నములుగ నుండవచ్చునుగాని, గమ్యస్థాన మొక్కటియే. అది యేదనగా,

చిత్తే మహేశం నిభృతం నిధాతుం

సినిమాలలో సీనులు మారుచున్నట్లు క్షణక్షణానికి మారిపోవు చిత్తమును బంధించి యజమానుడైన పరమేశ్వరునకర్పింపవలెను. మనకెవరైనను అత్యంత ప్రీతిపాత్రమగు పదార్థమిచ్చిన దానిని మనము మనబిడ్డలు చూచుచుండగా మననోటిలో వేసుకొనుట న్యాయముకాదు. బిడ్డలకు పంచిపెట్టవలెను. అనగా మనకిష్టమైన వస్తువును ప్రేమపాత్రుల కర్పించవలెను. అట్లే మన కత్యంతము ఇష్టమైనదిచిత్తము. ప్రేమపాత్రమైనవాడు పరమేశ్వరుడు. కాబట్టి మనచిత్తమును పరమేశ్వరాధీనముచేయుట న్యాయము, ధర్మముకూడాను. ఈ చిత్తమను శబ్దమునకే సంస్కృతమున హృదయమను మరొకపేరు ఉన్నది. హృదిxఅయం: అయం-అనగా పరమాత్మ అని అర్థము. అతడెక్కడో లేడు. మన హృది అనగా చిత్తముననేకలడు అని భావము. అయం అనునదిఇదం శబ్దముయొక్క రూపము- ఇదంశబ్దమునకిక్కడనుండు *వ్యాకరణాచార్యులుగారు సమీపమని అర్థము చేప్పుచున్నారు. తర్కాచార్యులుగారు ప్రత్యక్షగతమని అర్ధము చెప్పుచున్నారు. మొదటిమతమున ఈశ్వరుడు ఎక్కడోగాక మనకత్యంత సమీపమునేయున్నాడనిభావము. రెండవమతమున ఆ సమీపమున నుండు ఈశ్వరుడుకూడా ప్రత్యక్షక్షగతుడు అని భావము. మొత్తము పై మనకీచర్చవలన ఈశ్వరుడికి హృదయము స్థానము అని తేలినది. కాబట్టిమనము మనచిత్తమును పరమేశ్వరునకే అర్పించవలెను. మరొకనిఅచ్చటికి చేర్చరాదు. మరొక పదార్థమున కవకాశమీయరాదు. అదే మానవకర్తవ్యము, అదియే మనందరి యొక్క ధర్మము.

ఉపాయమేమి?

అందులకుపాయము యోగముతప్ప సాధనానంతరము లేదు. యోగమనగా

'యోగ శ్చిత్తవృత్తి నిరోధ'

చిత్తవృత్తి నిరోధమే యోగమని యోగసూత్రములలో నిర్వచింపబడినది. అట్టి యోగమునకు బ్రహ్మచర్యము, శ్వాసనిరోధము,

-------------

* నడాదూరు రంగ రామానుజాచార్యులుగారు.

| కవితార్కికసింహ గోవిందాచార్యులుగారు.

--------------

ఆహారనియమము ఇవి చాలా ముఖ్యములు. ఈ యోగము చాల కష్టము. మాకు యింకొక యోగమున్నదన్నాడు ఒక కవీశ్వరుడు. అదేమిటనగా,

అనాయతప్రాణ మసంయతాక్షం.

ఈ యోగమునకు ప్రాణాపాయమేమీ అవసరములేదు ఇంద్రియనిగ్రహమవసరము లేదు బ్రహ్మచర్యమవసరములేదు ఆహార నియమమవసరములేదు అయితే కర్తవ్యమేమి?చిత్తమును దృఢముగ అనగా తనకవిత్వమునంతయు పరమేశ్వర విషయిక మొనర్చి చిత్తమును మరొకచోటికి వెళ్ళకుండా చేసినట్లయితే అదే యోగమవుతుంది. చిత్తవృత్తినిరోధాదులవల్ల సంప్రాప్తమగు యోగము సాధ్యము ఈయోగమన్ననో సిద్ధము ఆ కవిత్వము శృంగార రసమునుగురించి అయినాసరే మరొక రసమునుగురించి అయినాసరే లక్ష్యము పరమాత్మునిపై నుండినచాలును. అప్పుడు యోగి సమాధికాలమునందెట్టిశాంతిని, ఆనందమును అనుభవించునో కవికూడ అట్టి శాంతినే అట్టి ఆనందమునే అనుభవించును. అందులకు కేవలము సాహిత్యమే కాక సంగీతముకూడా అవసరమే త్యాగయ్య ప్రభృతులు సంగీతసాహిత్యములవల్లనే తరించిరని చెప్పవచ్చును.

శిష్టులలో సంగీతమన అసహ్యించుకొనువారు చాల మందికలరు. గాయకులను పంక్తిబాహ్యులనినారు. వారికేమీ దానము చెయ్యగూడదన్నారు. నాటకాలు చూడగూడదన్నారు. అట్లే వైద్యులను, జ్యోతిషుకులను, కూడా పంక్తి బాహ్యుల లోచేర్చినారు. నటవిటగాయక, అని గాయకులను విటులతో లెక్కించినారు. వీరి చిత్త మెల్లప్పుడును కామపరవశ##మై యుండునట. అందుచేవారికి దానము చెయ్యగూడదన్నారు. కాని నేను మీ కొకస్మృతి వాక్యము చెప్పెదను.

వీణా వాదనతత్వజ్ఞః శృతిజాతివిశారదః

తాళజ్ఞశ్చా ప్రయత్నేన మోక్షమార్గం స గచ్ఛతి.

అని యజ్ఞవల్క్య స్మృతిలో నున్నది. అనగా వీణావాదనకుశలుడు. సంగీతమందలి శృతి, జాతులయందు నేర్పరి, తాళముతెలిసినవాడు వీరంతాకూడా ప్రయత్నములేకనే మోక్షమార్గమును చెందెదరు అని భావము.

విరోధపరిహారమెట్లు?

వేదములు, శిష్టులు మొదలైన వారందఱును గాయకులను నిషేధిస్తున్నారు. స్మృతిమాత్రము నటగాయకులు అప్రయత్నంగా మోక్షమార్గమున కర్హులగుచున్నది. ఈ పరస్పరవిరోధ పరిహారమెట్లు? కాళిదాస భవభూతులు నాటకముల వ్రాసినారు. వారుకూడా శిష్టులే. సంకల్ప సూర్యోదయమనే వేదాన్త నాటకముకూడా వున్నది. దానినివ్రాసినది వేదాంతదేశకులు. కొన్ని కొన్ని నాటకాలు పవిత్రములైన యజ్ఞశాలల్లో ప్రదర్శింపబడుతుండినట్లు ప్రస్తావనములలోకలదు. నాటకములను దృశ్యకావ్యమనినారు. అది ఎవరో ఒకరు ఆడితే చూడదగినదేగాని స్వయముగా చదివి ఆనందింపదగినదికాదని ఆ పేరే చెప్పుచున్నది. అది అట్లుండ మన వైదికులు నాటకముచూచిన పాపమనుచున్నారు. ఈ కాంతాసన్నితములగు నాటకములకు సహృత్సమ్మితమగు 'వీణావాదన తత్వజ్ఞ' అను స్మృతి ఆకరము.

'కావ్యాలాపాంశ్చ వర్జయేత్‌'

అని స్మృతికూడావున్నది. నేనుమాత్రము ఇదే మోక్షాన్ని అప్రయత్నముగా లభింపజేస్తున్నదని చెప్పినాను. ఈ వాక్యము వల్ల నటులకు, గాయకులకు సంతోషము కలుగవచ్చును. కాని సంగీతము ఈశ్వర విషయకమని, శృంగార విషయకమనీ రెండు విధములు. అందులో మొదటిది జీవనార్థమగు సంగీతమనీ ,అది ఒక విద్య, దానిని అభ్యసింపవలె అను భావరూపమగు సంగీతము అని రెండువిధములు. అది మరలా ప్రత్యేకమొకటొకటి ఈశ్వర విషయకమని, ప్రాకృత విషయకమనీ రెండేసివిధములు-ఇప్పుడు నేను చెప్పిన రెండవభాగమందలి రెండవ విభాగరూపమగు సంగీతమునుగురించియే స్మృతి.

వీణావాదన తత్వజ్ఞః

ఇత్యాదిగ ననువదించినది. అయితే మన మావిద్యను జీవనార్థముపయోగించక పరిమేశ్వరుని అధీనమొనర్పవలెను. అది యే మోక్షసాధము. అదియే స్మృతికర్థము. విషయచర్చవలన ప్రణవనాదమున పరమేశ్వరుని నారాధింపవలెను అను విషయమేర్పడినది. అట్టి ప్రణవనాదమున యోగము నిలువకపోయినచో వైదిక సామవేద స్వరమున దృష్టినుంచమని చెప్పినారు. అట్లు గూడానిలువకపోయిన లౌకికసరణిలో 'వీణావాదనతత్వజ్ఞః'

ఇత్యాదిగ శాస్త్రకారులు విధించినారు. కాబట్టి అట్టి దాని నెవడైతే జీవనాధారమొనర్చుకొను చున్నాడో వాడు భ్రష్టుడే, తదితరుడు ముక్తుడే.

కాబట్టి కవియగుప్రతివాడుకూడా ఏ నవలలనో ఏ శృంగార ప్రబంధములనో వ్రాయక పరమేశ్వరుని కొనియాడుచు, అతని గుణగణముల నభివర్ణించుచు అతనియందు తన్మయుడుకావలెను. ఇప్పుడు మనకుండు శరీరాత్మభావమువంటి భావము పరమేశ్వరుని యందు కలుగవలెను. అట్లు కాకపోయినచో అసత్కావ్యాలాపములు, అసంత్సంగీతము మనలను మోక్షమార్గమునకు దూరులుగ నొనర్చును.

నాటకములనాడవచ్చునా?

స్త్రీ వేషమువేయు పురుషుని చూచినట్లయితే ప్రాయశ్చిత్తము చెప్పబడియున్నది. ఇప్పుడు పురుషవేషమువేయు స్త్రీలు కూడా వచ్చినారు. కాని దీనినిగురించి శాస్త్రములలో విచారింపబడలేదు. మనప్రాచీనగ్రంథములలో ఆయాజాతులవారి కాయావృత్తులని నిర్ణయింపబడి ఉన్నవి. కవిత్వములో య, మ, త, ర, జ, భ, న, స, అని యెనిమిది గణములు ఉన్నవి. వానినే ఒక కవి శ్లోకరూపముగ చమత్కరించి ఇట్లు చెప్పనాడు.

యమేతా రాజభాన శిలగః.

ఒకకవి రాజును స్తోత్రమొనర్చుచున్నాడు. ఓ రాజా! ఎవడునిన్ను పొందుచున్నాడో వాడు రాజువంటి తేజఃపరాక్రమముల నందుచున్నాడు. తనకుండు దారిద్ర్యమును విడచుచున్నాడు అని అర్థము. మరియు య, మ, త, ర, జ భ, వ, స ఇది ఎనిమిది గణములు. ల, అనగా లఘువు- గ, అనగా గురువు- ఈ గణముల వ్యత్యాసమువలన అసంఖ్యాకవృత్తము లేర్పడునట్లు చాతుర్వర్ణ్యములలోకూడా అనులోమప్రతిలోమ వివాహములవలన అనేక సంకరజాతులేర్పడుచున్నవి. అవన్నియు మనుస్మృతి, సున్నాలపన్నము మున్నగువానియందు వివరింపబడి యున్నవి. వారివృత్తులుకూడా ఆ గ్రన్థములందేకలవు. వారిలో భరతపుత్రులను వారొక జాతివారు. వారికి గాన, నృత్యములే జీవనాధారములు- వారిలోకూడా మొగవారాడవేషము వేయరాదు. నిజమగు దంపతులే నాటకమందును దంపతులవేషము వేయవలెను. అంతియేకాని ఎవనిభార్యయోవచ్చి నాయికపాత్ర ధరించుటయు, ఎవతెభార్త యోవచ్చి నాయకపాత్ర ధరించుటయు కూడదు. అటువంటి నాటకములే కాళిదాసాదులు వ్రాసినారు. అవే దదర్శనీయములు. పూర్వమట్టి అచారనియమము

--------------

యమేతా - యగణము. రాజభా - రగణము. శిలగః సగణము.

మేతారా - మగణము. జభాన - జగణము. ల లఘువు.

తారాజ - తగణము. నశిల - నగణము. గః - గురువు.

లతోనే నాటకములు జరుగుచుండినవి. అట్టి ధర్మము నతిక్రమించిన రాజదండనముండెడిది. తదితరులు అనగా భరతపుత్రజాతికి చెందనివారు ఆ వృత్తుల నవలంభించినదోషము. వైద్యము, జ్యోతిషము ఇవన్నియూ అంతియే. బ్రాహ్మణులు ఆవిద్యలగఱచి సంకరజాతులకు నేర్పవలెను. అంతియేగాని తాను ఉదరపోషణకై వినియోగించుకొనరాదు. విశ్వామిత్రుడు రామునికి విలువిద్య నేర్పుచుండినట్లు రవివర్మ వ్రాసిన పటమును మీరు చూచియే యుందురు. బ్రాహ్మణుడగు విశ్వామిత్రుడు విలువిద్యనేర్చియు, క్షత్రియులకు అనగా అర్హులకు నేర్పినాడు. గాని స్వోపయోగమొనర్చుకొనలేదు. అట్లే సమర్థ రామదాసు రాజ్యమును సంపాదించి శివాజికొసంగినాడు. విద్యారణ్యులు విజయనగరరాజ్యమును సంపాదించి కృష్ణదేవరాయల కొసంగినాడు. పూర్ణయ్య మంత్రి కూడా అట్లే చేసినాడు. అంతేగాని అందులో స్వార్థము లేదు. కాబట్టే అప్పుడు దేశమంతయూ సుభిక్షముగ నుండినది.

సాహిత్యమును జీవనార్థ మొనర్చుకొనువారు భట్రాజులు- గానము కళావంతులది- వారే భరతపుత్రులని చెప్పబడుచున్నారు. కాబట్టి ఇప్పుడైనా మరల నాటకముల వారి మూలకముగానే వృద్ధిపరచుటమంచిది, లేనియెడల నాటకములన్నియు చిత్తవిక్షేపమునకు హేతువులై మానవుని చెఱచును.

కీర్తిఃశ్రీ వాక్చనారీణాం.

అని గీతలో నిభూతియోగాధ్యాయమున కలది. ఒక ఉపనిషత్తులో నొకబాలకునిచూచి ఒకఋషి 'నీవుమంచి తల్లినికలవాడవు. మంచి తండ్రినికలవాడవు, మంచి గురువు కలవాడవు- అని నాకు తోచుచున్నది' అని చెప్పినట్లున్నది. అందులో మొదట 'మాతృమా9' అనికలదు. అనగా కుటుంబము స్త్రీల అధీనము. కాబట్టి తల్లి సద్గుణములుకలది అగుచో బిడ్డగూడా అట్టి గుణములు గలవాడేయగును- గీతల్లో చెప్పినట్లు ఏస్త్రీవద్ద మంచిగుణములు; కుటంబ నిర్వహణశక్తి; అతిథి; అభ్యాగతుల చక్కగ విచారించి ఆదరించుట యుండునో ఆకుటుంబము దినదినమభివృద్ధిగాంచును- పిదప పితృమా9;ఆచార్యవా9; అని కలదు-

స్త్రీమూలం జగత్సర్వం, స్త్రీమూలః సర్వధర్మః.

అనికూడా శాస్త్రములు చెప్పుచున్న­. కాబట్టి బిడ్డలను చదువు అను­ుషతో గాని మరొక కారణముతో గాని దూరదేశము లకంపక పదిసంవత్సరములైనను తల్లిదగ్గరనే ఉంచుటమంచిది. ఈవిషయమున తల్లులు బిడ్డల కెక్కుడు సాయమొనర్పవలెను. అందుకు సాహిత్యమత్యవసరము. ప్రభుసమ్మితము, సుహృసమ్మితము, కాంతాసమ్మితమని సాహిత్యము ముత్తెఱంగులు. ఇంతవరకు జీవుడుత్తమగతి పొందుటకు చిన్నప్పుడు తల్లి చాలా ప్రయోజనకారి అని చెప్పినాను. తల్లులంతయూ అట్టి ఘనకార్యమునకు పూనవలెను. భక్తిగా స్త్రీలంతయు భగవంతుని నామోచ్చారణమొనర్చి పిల్లలచే చేయించవలెను- అది తరించడానికి సులభమార్గము- మఱియు పిల్లలను సాధ్యమైనంతవరకు అసత్య మాడకుండునట్లు చేయవలెను-

'అశ్వమేధసహస్రాచ్చ సత్యమేవగరీయః'

వేయి అశ్వమేథయాగముల ఫలము నొకతట్టును; సత్యము నొకతట్టును పెట్టి తూచినప్పుడు యాగఫలముల 'సిబ్బి' చివ్వున పైకిపోయినదట. తండ్రి సత్యముగానుండిన అది తనకొరకే అవును. తల్లి సత్యముగా నుండినపక్షమున బిడ్డలుకూడా తరించెదరు. స్త్రీలందరును ముఖ్యముగ భగవద్భక్తిని; సత్యమును బాలులకలవాటు చేయించవలెను. అదియేవారిధర్మము-అందుకు రామాయణాది గ్రన్థముల సాధనముగ నుంచుకొనవచ్చును. స్త్రీలకింతకుమించిన దేశ##సేవలేదు. భగవన్నామస్మరణకు బ్రాహ్మముహూర్తము శ్రేష్ఠమైనది. కాబట్టి స్త్రీలు తెల్లవారుఝూముననేలేచి భగవంతుని స్మరించుచుండినచో బిడ్డలుకూడా కొంతకాలమునకా యలవాటే కలవారగుదురు-ప్రాచీనకాలమునందిట్టి యాచారము స్త్రీలయందధికముగ నుండెడిది- సత్యమును స్త్రీలందరును పాటించవలెను- అప్పుడు బిడ్డలు తల్లులజూచి సత్యప్రతపాలనమున కుపక్రమింతురు- అప్పుడు స్త్రీలందరును అందరకు ఆదర్శప్రాయములు కాగలరు. ఇదియే స్త్రీలధర్మము.

Upanyasamulu    Chapters