Upanyasamulu    Chapters   

స్వరాజ్యము -- స్వారాజ్యము

సంస్కృతములో స్వారాజ్య సిద్ధియను వేదాన్త శాస్త్రసమ్మతమగుగ్రన్థమొకటికలదు. దానిని సురేశ్వరాచార్యులవారు రచించిరి. ఇయ్యది, ఇష్టసిద్ధి, నైష్కర్మ్యసిద్ధి, అద్వైతసిద్ధి స్వారాజ్యసిద్ధి యనుదానిలో నాల్గవది. ప్రతిదేశములోను ప్రజలయొక్క కష్టముల బాపుటకై కొందఱు కొందఱు పురుషులు నియమితులై యుందురు. ఏదేని రోగముచేత జనులందఱును బాధపడుచుండిరేని తత్‌ క్షణమే కొందఱు యువకులు ప్రథమ చికిత్సాదికార్యముల కై యొడిగట్టుదురు. తుపాను, భూకంపము ప్రవాహములు మొదలగువి యుప్పతిల్లినపుడు కొన్ని కొన్ని సంఘముల నేర్పఱఁచి తద్బాధాని వృత్తికై ప్రజలు పాటుపడుదురు. ఇట్టి యాపదలనుండి రక్షించుటకై మన పూర్వీకుల క్షత్త్రియాజాతిని నియమించిరి. 'క్షతాత్‌ - త్రాయతే - ఇతి క్షత్త్రియః' గాయమునుండి రక్షించుట కేర్పరుపఁబడిన జాతియే క్షత్త్రియుడు. దీనిఁబట్టి యాలోచించిన 'క్షత్త్రియ' పదము వేద సమ్మతమైనదేయని తోఁచును. వీరికే 'రాజులు' అనిపేరు. రాజ్యాదులందెట్టి యాందోళనలు లేకుండ సవరించి ప్రజల నానందింపఁజేయువారే రాజులు. ఇట్టి క్షత్రియ సంఘాధ్యక్షుడే రాజు (చక్రవర్తి); క్షాత్రధర్మమనఁగా నెదుటిజీవి సంరక్షణకై తన జీవనమునైన ధారవోయఁగలుగుటే. కడుముదిరిన యీ కలియుగములో -- పాపం! --మనవాండ్లీ ప్రత్యేకవర్ణమే యనవసర మని తీర్మానము చేసినారు: 'అందఱకు స్వరాజ్యము వలయును గదా యీ ప్రత్యేకవర్ణ సాంప్రదాయము లెందులకు?' అనిగదా అనుచున్నారు. ఇది ఎందుకంటేను-ఆకలికొనియున్న ప్రజలకుఁగడువునిండుగ తిండిలభింపజేయుటకు కృషికులు వలయును. ఆ పని మఱియొకఁడాచరింపలేడు. ఆకలిగొనియున్న కృషికులేమియుఁ జేయఁజాలరు.అందుచే నందఱకు శాంతి నెలకొల్పి యహింసాదుల స్థాపించుటకు వీలుండదు.

మనవారనుకొను పద్ధతిలో యుద్ధాభ్యాస మందఱకు నియామకముగా నుండవలయుననిగదా తలఁచుట--యీ పద్ధతి వలన వివిధ రాజ్యములకు ద్వేషభావ ముప్పతిల్లెనేకాని, నిజమైన శాంతి, యానందము లెన్నటికిని పొసఁగజాలవు. ఇట్టి సిద్ధాంతమునకులోఁబడిన ప్రపంచమేనరతుల్యమగును. అందుచేతనే వర్ణాశ్రమములందు, క్షత్రియవర్ణమనియు, క్షత్రియ ధర్మమనియుఁ జెప్పియున్నారు. పైపద్ధతివలన ప్రజలందఱను యుద్ధములందే యుండిన మనకు కావలసిన సకల యితర పనులు నిలచిపోవును. దేశమునకుఁ గాయకశక్తి వృద్ధియైనను, మేధాశక్తి తప్పక క్షీణించిపోవును. అందుకొఱకై మానవరక్షణార్థము క్షత్రియ వర్ణమనవసరమే యగుచున్నది. అట్లే జాతులును అవసరము. కాంగ్రెసు వాలంటీర్లు పలువురు నిలువఁబడబట్టే కొంతైన ఫలము సిద్ధించినది. పద్ధతివలన దేశాభిమానముతోఁబాటు పరద్వేషము పెంపుగాంచును. జాతీయతలేక దేశాభిమానములకు భంగము కల్గును. కడుపున కన్నమువలయును; గాని పద్ధతివలన కడుపు నకు వచ్చిన బుద్ధికాహారముండదు. కలి ప్రవేశమునకుముందు మహాభారత యుద్ధానంతరమందఱు క్షత్రియులు నశించిరి. మనదేశ##మే పరరాజుల పాలై పోయినందున ముఖ్యధర్మములే గతించినవి. కాని దేశకాలపరిస్థితుల నవలోకించియైన ధర్మనిర్ణయము స్థిరపరుపవలసియున్నది. కులక్రమాగతమైనదైనపుడు కొంతకాలమైనపిమ్నట మంచి చెడ్డల నాలోచించి సరిదిద్దుకొనుటయుక్తము.

ఉదా:- 'అహింసా పరమోధర్మః' మాంసమే తినఁగూడదని యొకనికి తోచినంతనే వాఁడు తనకది పంశక్రమాగత మైనప్పటికి దానిని వాఁడు మానుకున్న యెడల వాఁడు తనయాత్మ శుద్ధి కర్తయేగాక తన వంశపరంపరనెల్ల పవిత్రము కావించినవాఁడగును. అట్లే ఇంగ్లాండులో దహనపద్ధతి స్థాపించిరి. ఈ విధముగ వంశక్రమాగత ధర్మముల నిలువఁబెట్టుటమిగుల యుత్కృష్టము ఏయితర దేశములోనైనను, మద్యపానము సల్పువారును, మాం సముఁదినువారును, నూటికి రమారమి తొంబదివరకుండిననూ, మన భారత సీమపై యెన్ని సభ్యతావాతూలములు దండెత్తినను నూటికిరువదియైదు లేక ముప్పదికంటె మించకున్నది.ఇది వంశ క్రమాగత కులధర్మ మాచరణ యందుంచుటవలననే. అటులనే పరంపర ననుసరించియే పెక్కుపనులు నిర్వహింపఁబడుచున్నవి ఆచారముల ననుసరించియే మన పూర్వీకులు చాతుర్వర్మముల నేర్పరచిరి. పోటాపోటీలవలన, శాంతితగ్గి సామ్యవాదము మొదలగువానికి ప్రశస్తి హెచ్చెను.

శ్లో || శ్రేయా9స్వధర్మో విగుణః

పరధర్మా త్స్వనుష్ఠితాత్‌,

స్వధర్మే నిధనం శ్రేయః

పరధర్మో భయావహః. (గీత. అ 3 శ్లో35.)

అను శ్లోకమునుబట్టి క్షాత్రవృత్తి క్షత్రియునకేకాని సామాన్యులకుకాదు. రాజకీయములకై ప్రత్యేకవర్ణము లేమిచేత మన బ్రాహ్మణులందఱు నందుఁ బ్రవేశించుటచే బ్రాహ్మణధర్మమే నశించిపోయినది. అసూయలేక శుశ్రూషచేయవలసినవారు శూద్రులు. వీరివలననే పరదేశములకుఁగావలసిన కూలీల ఎగుమతి అంతయుఁ జక్కగా జరుపఁబడుచున్నది.

శ్లో || సఙ్కరో నరకాయైవ కులఘ్నానాం కులస్యచ

పతన్తి పితరో హ్యేషాం లుప్తపిణ్డోదకక్రియాః. (గీత. అ 1 శ్లో 42)

ఇపుడా లుప్తపింణ్డోదక క్రియలకు ప్రసక్తితగ్గిపోయెను.

ఏవంశము మిక్కిలి హీనస్థితికి వచ్చుచున్నదో యావంశోద్ధరణకై యందఱును పాటుపడి పనిచేయవలసినయున్నది. ఒక క్షత్రియవర్ణము క్షీణించిపోవుచున్నదన్నంతనే దాని పునరుద్ధరణకై ముందంజవేయవలయును. దానిని వృద్ధిచేయుటకుమాఱుదాని స్థానము నాక్రమింతమని యితరులాశపడుట శోచనీయము ప్రస్తుతమీ కాంగ్రెసు పరిపాలనమున అన్ని మతముల నొకటిగా, నన్నివర్ణముల నొకటిగా, నన్నివృత్తిదారుల కలిపివేయుటకు మాఱుగానేయేవృత్తి వారికాయావృత్తియందభినివేశముకల్పించితద్వృత్తుల వృద్ధిజేయవలయును. వడ్రంగికి వండ్రంగమును, సాలెకు నేఁత పనియును, శిల్పికిశిల్పమును, తెఱువులుగఁజూపించి వారివారి నా యావృత్తులందు పురికొల్పిన దేశము మిక్కిలి చక్కపడును. ఏ వృత్తి వంశీయుల కావృత్తియందే ఆధిక్యతలిచ్చి ప్రోత్సహించుట శ్రేయస్కరము. అప్పుడే ఎవరెవరి కామితఫలము వారికుండును. ఇదియంతయు రాజకీయమగు స్వరాజ్యవిషయము. దీనిని బట్టి ప్రజల కష్టముల నివృత్తిజేసి ఆనందింపఁజేయుటే స్వరాజ్య లక్షణము. దేశమునందలి రోగులందఱకు తగిన ¸°షధములివ్వవలెను. భయము లన్నింటిని బాపవలెను. ఇట్టి సుఖములు పరరాజుల పరిపాలనలో దుర్లభము. వారు స్వలాభప్రియులేకాని మన కష్టసుఖ నిరీక్షణ వారికుండదు. అందువలననే స్వరాజ్యము నకావశ్యకత ఏర్పడినది. ఇట్టి స్వరాజ్యములో, కడుపునిండుగ కూడు, ఒంటినిండుగబట్ట, కంటినిండుగ నిద్ర [యే యితర భయములు ఆతురతలు లేకుండుట]వ్యాధి నివృత్తికై మందులు, ప్రతివారికి తగిన నౌకర్లు, ప్రతివాని కొక్కొకయిల్లు, వలసినంత ధనము చేకూరును. కాని యింతటితో పరిపూర్ణానందము కల్గునా? లేదు. ధనవంతులకి బుద్ధిహీనతయు, దరిద్రునకు మేథాసంపత్తు నుండుట కలియుగ మహాత్యము. అన్ని కొఱతలు తీరిన మానవునికి బుద్దికొఱతచే పెక్కు పాపముల కాతఁడు కర్తయగును. దానివలన తన శరీర నష్టమేకాక యితరులకు కష్టము గూడ మూడును. మోటారు బండిలో పోవువానికన్న కాలినడకన పోవువాఁడు తక్కువ పాపములు చేయును. ఆసుపత్రులు హెచ్చినంతనే రోగములు హెచ్చును. ఆసుపత్రి కలదుగదాయను అలక్ష్యముచే మరికొంత అపథ్యముచేయుదురు. రోగములు హెచ్చును.

శాస్త్రేవాద భయమ్‌:

అని ప్రజాప్రభుత్వముకంటే వేరొకరిపబ్లిక్కు ఆరంభించిన సామ్యవాదము వగైరాలు హేచ్చును. ఎక్కువ స్వరాజ్యము వచ్చినందున భయము హెచ్చును. సామ్యవాదులను 'బాగా మేపిన పందులు' అంటారు ఆంగ్లేయులు. పైనుండి వచ్చు డబ్బువల్ల గాని గుడ్డవల్లఁగాని, కీర్తివల్లగాని యానందము పెంపొందును. ఆయానందమే స్వరాజ్యఫలము. ఈ ఆనందము మన ఆత్మలో నంతకుపూర్వమే యున్నదని చెప్పియుంటిని. ఈ యానందము, లేక ఈస్వారాజ్యము వచ్చువరకు మనము మధనముచేయవలెను. ఈ మధనమునకై ఈ తనువనుకుండయు, నొక కవ్వమును వలయును. కావున ఈ శరీరమును ప్రప్రధమమున రక్షించవలెను. ఆ యానందము కల్గినపుడు ప్రతివారు రాజులై స్వారాజ్యమున వెలుఁగుదురు. వారిపుడు పొందినది 'స్వారాజ్యము' స్వమేవ రాజ్యం- స్వారాజ్యం. స్వం- రాట్‌ అనఁగా తానేరాజ్యం, తానే రాజు ఏకచ్ఛత్రాధిపతి, వాఁడే రాజ్యమైనపుడు, వాఁడే ఆనంద స్వరూపమైనపుడు, వాఁడెరాజై, వాఁడే రాజ్యమైపోవును. అట్టి రాజ్యము నందఱకుఁదెలిపిన,

శ్లో || యంలబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః

యస్మిన్‌ స్థితో నదుఃఖేన గురుణాపి విచాల్యతే.

అనునట్లొక లాభముకల్గిన తర్వాత వేఱొకదానికొఱకాశ##లేనపుడే అది పరిపూర్ణ లాభమగును. యంలభ్థ్వా=దేనినిపొంది . అపరంలాభం= దీనికంటె మరియొకలాభమును తలపఁడో యస్మి9స్థితః=ఎంతపెద్ద దుఃఖమువచ్చినను, నవిచాల్యతే=చలింపఁడో- దానికే స్వారాజ్యమనిపేరు. స్వస్వరూపం, అనఁగానేను నేను వస్తువేమిటని విచారించిన కనుఁగొను ఫలితము అఘండానందము. దానికంతులేదు. ఊరకనొక పదివేలరూపాయలనొకరు నీకిచ్చినప్పటి సంతోషము క్షణికమైపోక ఆజన్మపర్యంతముండునేని దానికి అఘండానందమనిపేరు. 'నేను' అనునదీ యఘండానందమే. ఈ బుద్ధిని వెలికిపోనీక, యింద్రియములనెల్ల లోనికి వానివాని దృష్టి సారించిన ఈ ఆనందస్వరూపమెరుక పడును. ఇట్టి యానందము మనలో నంతకుముందేయుంటున్నదా లేక క్రొత్తగా నుద్భవించినదా? ఇది క్రొత్తగా రాలేదు. ఒక పిండివంటను దిన్నంతనే మనలోనుండు అఘండానందమను యూటనుండి ఒక యణువు తీయఁబడుచున్నది. అట్లే యొకానొక దివ్యశబ్దమును విన్నపుడు, ఒక మనోహరమగు వస్తువును జూచినపుడు, ఆనందముకలుగును, దీనికి శాస్త్రసమ్మతోదాహరణమొకటి పేర్కొందును. మన రామాయణ కధలోని సీతాదేవి తండ్రి జనకమహారాజు కలఁడుగదా. అతనికి వేదములో వైదేహుఁడు అనిపేరు. అతని గురువు యాజ్ఞవల్క్యుడు వానికిరువురు భార్యలుకలరు. వారికాతఁడాత్మజ్ఞానాది బోధనములఁగావించి వెనుక భావసన్యాసమును గైకొనెనని శాస్త్రము వచించును. వారి యుపదేశములో ముఖ్యముగా శారీర మీమాంసను గుఱించి విచారించిరి. దానిలో నఘండానంద స్వరూపమేమనిన, ఆనందమన్నచో నొకానొక ప్రియవస్తువే. ఆనందము-ఒక పుత్రుడు, ఒక భూమి, మంచిబట్టలు, మంచి గానము, మంచి సువాసనగల వస్తువు మొదలగు ప్రియవస్తువులెల్లయు నానందమే. యాజ్ఞ వల్క్యుడిఁట్లు వచింపుచు భార్యతో నిట్లనెను. "ఒకడికి ఒక పొలమున్నదనుకొనుము. అయ్యది ఈ 1937 - వ సంవత్సరములో వాడి స్వాధీనమందున్నది- ఆ సంవత్సరము పైరు చాలాచక్కగ నెదిగియున్న యొకదినమాతఁడా పొలమునకరిగి చూచి మిక్కిలి సంతోషపడెను. మరుసటి సంవత్సరమాతని పొలము తన అప్పులక్రింద మఱియొకనికి చెల్లుగాబోయెను. ఈ 1938 సంవత్సరంలోకూడానది చక్కగా పైరు వేసినది. ఆతఁడిప్పుడు వెళ్ళిచూచినాఁడు, కాని యీ పర్యాయము విపరీతమగు కడుపుమంటకలిగెను. ఈ మార్పుకు కాణమేమి. ఆపైరు కాదు, ఆ పొలము కాదు, కాని దానినుండి 'నా' యను స్వభావము తొలఁగుటయే. కావున ఆనందము తొలఁగుటకు కారణము 'మమత్త్వము' 'నాది' యను భావము తొలఁగుటయే, కావున, 'నేను' లోనున్నవి. అట్లే కాకరకాయకూరలో తీపినిచ్చునదిబెల్లము. అది ఈ 'నన్ను, బొందినిపుడే ఆనందమగును. వెన్న- అవ్యక్తమధురం. ఇట్టి ఈ 'నేను' లోని యానందమెఱుఁగక, దానికే మనమనశ్శక్తి నుపయోగించక, మన స్వస్వరూపమైన ఈ స్వయంరాజత్వము, ఈస్వారాజ్యము పోగొట్టుకొని పరవస్తువే యానందమని యెంచి హింసాదాయక కృత్యములఁ జేయుచున్నాము. లోపనుండు నీ స్వస్వరూప ప్రకాశానందమును దిలకింపకపోయిన నిజమైన గమ్యస్థానము చేరలేము.

దానినిపుడు మన మలవరచుకొనలేక పోయినను, పిమ్మటి కాలమున సాధించఁగలము. ఈ సూయజుకాలువ, ఈ మధ్యధరాసముద్రములు లేకుండిన ఆంగ్లేయులకు దుర్భిక్ష తప్పకుండెడిది. మనకున్నదానితో తృప్తి పడుచున్ననే, ఈ యానందమందఁగలము. పైననుండి యొకరు రానక్కరలేదు. ఎవరినుండి యిది కల్గుచున్నదో వాడేరాజు, వాడే రాజ్యము, అగుటచేత పరిపూర్ణజ్ఞానము వానికి లభించును. దీనిని స్థాపించుటకై యాదిశంకరులవతరించి అద్వైత సంస్థాపనముఁ గావిచిరి. ఇట్టిది స్వారాజ్య తత్త్వము.

-----

Upanyasamulu    Chapters