Upanyasamulu    Chapters   

శంకరులు

గా మాక్రమ్యపదే7ధికాంచి నిబిడైస్స్కంధై శ్చతుర్భిర్యుతః వ్యావృణ్వ& భువనాంతరం పరిహరం స్తాపం స మోహజ్వరం యశ్శాఖీ ద్విజసంస్తుతః ఫలతి తత్స్వాద్యం రసాఖ్యంఫలం తసై#్మ శంకరపాదపాయ మహతే తన్మః త్రిసంధ్యం నమః.

సంధ్యాకాలమున శంకరునికి నమస్కరించుట మాకర్తవ్యము. నేను చదివిన ఈశ్లోకమున శంకరుడొక వృక్షముతో పోల్పబడినాడు. మనమెవరినేని తిట్టదలచినచో నట్టివానిని చెట్టులతో పోల్చుట కలదు. చెట్టు, అనగా ప్రజ్ఞోల్లాసములులేని వ్యక్తి అని అర్థము. అట్లే భాషాంతరములయందును కలదు. ఇక మనము శంకరుని పరిశీలించినచో నంతటి మేధావి ఇంతవఱకును ప్రపంచమున మఱియొకడు లేడని చెప్పవచ్చును. ఈవిషయమును మనమేగాక పాశ్చాత్యులుగూడ నంగీకరించియే యున్నారు. సాక్షాదీశ్వరుడే శంకరుని యవతారమున నుద్భవించినాడు.

ఈశ్వర స్సర్వ విద్యానామ్‌.

విద్య అనగా తెలివి. అట్టి విద్యలకంతయు నధిపతి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే శంకరుడు. అట్టివారిని ప్రజ్ఞోల్లాసములేని చెట్టు అని చెప్పుట న్యాయమా? అని శంకింపవలదు. అది రూపకాలంకారము: (ఉపమానభేదము ఉపమేయమున భాసించుట రూపకాలంకారము) ఉపమానము సుందరముగ నుండవలయును. అందుకనియే మన యాలంకారికులు ముఖమును చంద్రునితోడను కమలముతోడను తఱచుగ పోల్చి చెప్పెదరు. ఉపమానము ఉపమేయముకన్న తక్కువగుణములు కలదిగాని, సమానమగునదిగాని యుండరాదు, మఱిప్రకృతము శంకరు డుపమేయముగదా! పాదపము అనగా చెట్టు ఉపమానముగదా! అట్టి శంకరునికి చెట్టును ఉపమానముగ జెప్పుటెట్లు? అని సందేహముకలుగవచ్చును? వాస్తవముగ మన మాలోచించినచో మేధాశక్తియందు శంరునికి బృహస్పతికూడ సమానుడుకాడని చెప్పవచ్చును. జీవసృష్టిలో శంకరుని సరిపోల్చుటకు దగినపదార్థము లేకపోవుటచేతనే అచేతనమగు వృక్షముపమానముగ గ్రహింపబడినది. అనగా నిచ్చట ఏర్పడు ప్రధానోద్దేశ్యమేమి? ప్రపంచమందలి పదార్థములన్నిటిలోను ఎక్కువగ నుపయోగపడు వస్తువు వృక్షమునకన్న మరియొకటి లేదని చెప్పవచ్చును. జంతువుగనుక అయినట్లుయిన కొందఱికి గాకపోయన గొందఱికైనను భయమును కలిగించితీరును. మానవుని స్థూలశరీర మెందుకును పనికిరాదు. ఇక బ్రహ్మసృష్టిలో పరోపకరాము కొఱకే సృష్టింపబడిన పదార్థము చెట్టుతప్ప మఱొకటిలేదు. దాని నీడ సర్వప్రాణుల గాధారమౌచున్నది. పక్షులు వానిమీద గూండ్లను కట్టుకొని వాసము చేయుచున్నవి. దాని ఆకులు, కాయలు అనేక జీవజంతువుల కాహారమౌచున్నవి. అది ఎండిపోయినను, ఇండ్లు కట్టుకొనుట, వంటచేసికొనుట మొదలగు అనేక కార్యము కుపయోగపడుచున్నది. అట్లే శంకరుడుకూడ పరోపకారముకొఱకే, జగదుద్ధరణముకొఱకే అవతరించిన మహాపురుషుడని మనకీ రూపకాలంకా%ీరమువలన నేర్పుడుచున్నది. వారు 24 సంవత్సరముల కాలముమాత్రమే భూమండలమున సంచరించినారు. అంతలోనే జగద్గురువులని ప్రసిద్ధివడసినారు.

శంకరునికి పూర్వము మనదేశముం దేనేక మతములు విజృంభించియుండినవి. కాని వానిలో కపిల, జైనమతములు ప్రధానములు, ఇంగ్లీషు చదివినవారు శంకరునికి ముందు బుద్ధమతముమాత్రము ఎక్కువ ప్రచారమునందుడినదని చెప్పుదురు. అందు కుపష్టంభకముగ కొన్ని శాసనములను, కొన్ని ఆలయములను ప్రమాణముగజూపెదరు. కాని మన శాస్త్రములను పరికించినచో శంకరులను పూర్వ మొక్క బుద్ధమంతమేగాక సాంఖ్య, మీమాంసాది మతములుకూడ నెక్కడు ప్రచారము నందుండినటుల తెలియుచున్నది.

ఆచార్యులవారికి పూర్వమునుండి బౌద్ధులు అక్కడక్కడ కొన్నికొన్ని శానములను, కొన్ని కొన్ని ఆలయములను స్థాపించిరి, కాని సాంఖ్య, మీ మాంసాది మతకర్తలట్టి చిహ్నములనేర్పఱచియుండలేదు. అంతమాత్రముచే శంరునికి పూర్వము బుద్ధమతముతప్ప తక్కినమతములు లేవనుటతప్పు. దక్షిణదేశమునశ్రీరామానుజాచార్యులవారికున్న విగ్రహప్రతిష్ఠలు శంకరులవారికి లేవు. కాని ఇటీవల అనగా 50 సంవత్సరముల కివతకల శంకరుని మూర్తిప్రతిష్ఠలు ప్రబలినవి. అంతకుపూర్వము కంచి, కాలడి మొదలగు ఒకటి రెండు స్థలములలో మాత్రము శంకరుల విగ్రహములుండెడివి. కాని రానురాను ప్రజలలో జ్ఞానము సన్నగిల్లుటచేత మూర్తిప్రతిష్ఠలు హెచ్చయినట్లు తెలియుచున్నది. మనము శంకరుల పూజించుట అనగా వారి గ్రన్ధముల జదివి తదర్థము ననుష్ఠించుటయేతప్ప వేఱుగాదు.

బౌద్ధులు మనమిప్పుడనుకొనునంతటి పాషండులుకారు. కారణమేమన సంస్కృతములో శ్రీహర్షుడనురాజు రత్నావళి, నాగానందము, ప్రియదర్శిక అనుమూఁడు నాటకములను వ్రాసియున్నాడు. అతడొక గ్రంథారంభమున శివుని ధ్యానించినాడు. మఱియొక గ్రన్థాదియందు విష్ణువును ధ్యానించినాడు. ఇంకొక గ్రన్థారంభమున బుద్దుని స్తోత్రమొనర్చినాడు. బుద్ధుడుకేవలము పాషండుడే యగు పక్షమున ఆ రాజు శివకేశమవులతో పాటు బుద్ధునికూడనేల స్తోత్రమొనర్చును?

బుద్ధమతము అశోకుని ప్రాపున వృద్ధిపొందినది. అశోకుడు కొన్ని శాసనముల వ్రాసినాడు. వానిలో కొన్నింటిని నేను స్వయముగ చూచినాను. వానిలో అంతకుముందు తన యింటిలో దినమునకు 2000 నెమల్ళు ఆహారము కొఱకై చంపబడుచుండెననియు, ఇప్పుడు 200 మాత్రము చంపబడుచున్నవనియు కలదు. దీనిని వినినయెడల మన కాశ్చర్యముకలుగును - కాని దినమునకు తగ్గింపబడినవి అనిన, ఆ కాలమునకదియే గొప్పగనుండినది మఱియు నా శాసనములలో బుద్ధులందఱును శ్రమణులు, బ్రహ్మణులు, వీరుయందు భక్తిశ్రద్ధులు కలిగియుండవలెనని వ్రాయబడియున్నది. వైష్ణవులలో చాలమంది శివాలయముకు వెళ్ళరు. కాని కొందఱు నాయుళ్ళు, కోమట్లు మున్నుగువారు మాత్రము రామానుజ మతమును పరిగ్రహించియు శివాలయములకు వెళ్ళుటకలదు. ఆ విధముగనే బుద్ధమతస్థులందఱును కేవలము మన మత ధర్మములను విరుద్ధు లని చెప్పరాదు.

శ్రీ ఆచార్యులవారకి ముందు సాంఖ్య, మీమాంసా, బుద్ధాదిమతములు ప్రబలియుండినవి. దానిలో మొదటి రెంటిని నిరాకరించుటకై శంకరుల వారెక్కువ కష్టపడినట్లు తెలియుచున్నది. ఆసేతు హిమాచలమువఱకు గల ప్రదేశములలో శంకరుని మతము వ్యాపించని ప్రదేశములేదు.

తనకు ముందుకాలమునందుండిన మతములనెల్ల స్వరూపనాశనమొనర్చి తన మతమునే ప్రపంచమునందెల్లెడలను వ్యాపింపజేసినవారు శంకరులుతప్ప మరొకరు లేరు. ఉత్తరమున చైతన్యమతముకలదు-బొంబాయి ప్రాంతమున వల్లభమతముకలదు- కన్నడదేశమున మధ్వమతముకలదు-కాని ఆయా మతము లాయప్రదేశములలో మాత్రము పేరు గాంచినవి-ఆమతములు ఉన్నవని తెలియనివారుకూడ చాలమందికలరు- కాని శ్రీ శంకరుల మతము వ్యాపించని ప్రదేశముగాని, ఆయన పేరువినని వ్యక్తిగాని లేడని చెప్పవచ్చును- శంకరులకు పూర్వముండిన మతములిప్పుడు కలవని చెప్పలేము-

శంకరుడు పరోపకార ప్రవణుడని చెప్పినాను. అందులకొక తార్కాణము చెప్పెదను. ఒకప్పుడు శంరుని తల్లి శంకరునికి వివాహముచేయ సంకల్పించినది. శంకరు దండుల కంగీకరింపలేదు. ఇట్లుండగా నామెకు జబ్బుజేసినది. రోగనివృత్తికై శంకరుడామెను గంగకువెళ్ళి స్నానముచేయవసినదిని చెప్పినాడు ఆమె నడచివెళ్ళలేనన్నది. శఁకరుడు తన మహిమచే గంగను యింటివద్ద ప్రవహించునట్లు చేసినాడు. తల్లి స్నానమొనర్చినది శంకరుడు గంగలో దిగినాడు. మొసలి పాదము పట్టుకొన్నది అప్పుడు శంకరుడు తల్లితో 'అమ్మా! నే నేమో మొసలిచే పట్టుబడినాను, మరణము నిశ్చయము-కాబట్టి నేను మానసికముగానైనా సరే సన్న్యాసమును స్వీకరించినచో నీవుతరించెదవు- నేను తరించెదను-సన్న్యాసమున గ్రహించనిచోదుర్మరణము తటస్థించును-ఇందులకు నీవేమనెదవు' అని యడిగెను. అప్పడామెకు నేమియుతోచక 'నాకేమియు స్ఫురించుటలేదు నీయిష్టము' అని చెప్పినది- శంకరుడు తన మనోరథము సిద్ధించినదని సంతసించినాడు- అంతలో మొసలి మాయమైనది- తరువాత కొంతకాలము గడచినది. మరల తల్లి కుమారునకు వివాహమొనర్పవలెనని సంకల్పించినది. అప్పుడు శంకరులవారు తన తల్లితో:_

'నీకుటుంబమునకు మాత్రము నేనుద్ధారకుడనుగాను-దేశమునంతయు నుద్ధరించువలసియున్నది- నాకు ప్రపంచమునందలి స్త్రీలందఱును తల్లులే- ప్రపంచమందలి పురుషులందఱను తండ్రులే- నాకు ఆత్మశాంతియే భార్య- నేనామెనుమాత్రమే వివాహమాడదలచినాను' అని చెప్పినాడు-

ఈకథవలన శంకరులెంతటి విశాలభావము కలవారో, ఎంత దేశ##సేవపరతంత్రులో, ఎంత పరోపకార నిరతులో అనువిషయము మీకు స్పష్టముకాగలదు- అందుచేతనే మొదట నేను చదివిన శ్లోకములో శంకరులవారు వృక్షముతో సరిపోల్పబడినారు- మీరందఱును అశంకరులయెడ భక్తివిశ్వాసములు కలిగి ఉండవలసినది- ప్రతివారును వారివారి మత ధర్మముల యెడ విశ్వాసము కలవారు కావలెను - కేవలము ఉపన్యాసములు వినుటతో ప్రయోజనములేదు- కొంతకు కొంతఅయినను. ఆచరణకు తేవలెను-

ఓంతత్సత్‌-

-

Upanyasamulu    Chapters