Aathmabodha         Chapters          Last Page

7. గురుసేవా నిరతి

ఆధ్యాత్మిక చింతన అంటేనే చాలా కష్టతరమైంది. అందునా ఆత్మజ్ఞానం విశ్లేషణతో కూడి, జ్ఞానులకు మాత్రమే పరిమితమైనట్లుగా కనిపించేదాన్ని చంద్రమోహన్‌గారు అందరూ సులభంగా అర్థంచేసుకొనేటట్లు రాయగలిగారు. సాంఖ్యం. చార్వాకం వంటివాటిని కూడా ఆత్మజ్ఞానంతో సమన్వయం చేసి వివరిస్తూ, శంకరాద్వైతాన్ని గురుమహారాజ్‌జీ ప్రబోధానికి అనుకూలంగా వివరించిన విధానం చాలా బాగుంది. గురుమహారాజ్‌జీ సత్సంగాల్లో చెప్పిన ఎన్నో రకాలైన ప్రబోధాలను, సమయసందర్భాలకు అనుకూలంగా వివరించిన పద్ధతి హృద్యంగా ఉంది. సామాన్య సాధకులు సహితం జ్ఞానాన్ని అర్థం చేసుకొని వారి సాధనలో లాభాన్ని పొందాలనే తపనతో కావించిన కృషి అనంతంగా ఇందులో అడుగడుగునా కనిపిస్తుంది. చంద్రమోహన్‌గారు జిజ్ఞాసువులకు, ప్రేమీలకు తన వంతు సేవగా భావించి చేసిన కృషిని ఆత్మబంధువులు సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను.

ది. 1-6-96 మేడం వీరన్న.

హైదరాబాదు #9; #9; #9; #9; ప్రేమీ,

పోస్టల్‌ డిపార్ట్‌మెంటు,

హైదరాబాదు.

Aathmabodha         Chapters          Last Page