Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

అథ నవమో7ధ్యాయః

(వ్యాఘ్రపాదచరితము)

శ్లో || మాధ్యన్దై నసుతో7త్ర తిల్లవిపినే వాసే రతస్సన్‌ ప్రబోః |

శ్రీమూలస్య సమర్హణాయ కుసుమాన్యాహర్తు కామః చరన్‌|

కీటాదుష్టసుమగ్రహాయ నిశి సఞ్చారోపయోగి స్వయం|

వైయాఘ్రం పదమాప శమ్భుకృపయా క్షేత్రం చ తన్నామభాక్‌||

మధ్యందినుని కుమారు డాతిల్లవనమున నివసించుట యం దాసక్తి గలిగి శ్రీమూలేశ్వరుని పూజకై పూవులు తేదలచి తిరుగుచు పురుగులుకొట్టని పువ్వులు తెచ్చుటకు ఈశ్వరుని కృపచే తాను రాత్రి సంచరించుటకు తగిన వ్యాఘ్రపాదములను పొందెను. ఆక్షేత్రముకూడ వాని పేరును పొందెను.

సూతః :

శ్లో || తపఃక్లాన్త శరీరస్య తత్రైవ వసతశ్చిరమ్‌|

శివపూజాపరస్యాస్య కాలో7నన్తో గతో7భవత్‌||

సూతుడు :

అతడు శివపూజాపరుడై తపస్సుచే కృశించిన శరీరముతో అచ్చటనే నివసించుచుండగా చాల కాలము గడచినది.

శ్లో || జాతు భస్మకృతస్నానః ప్రాతరుత్థాయ సువ్రతః |

దణ్డం కమణ్డలుం చైవ బిభ్రత్పుష్పకరణ్డకమ్‌||

జటాభిరయమష్టారలంకృతశిరా మునిః |

జగామ విపినం శమ్భోః పూజాకుసుమహేతవే||

మంచి వ్రతముగల యాముని యొకప్పు డుదయమున లేచి భస్మస్నానముచేసి దండ కమండలములను పువ్వుల బుట్టను తీసికొని ఎనిమిది జడలచే నలంకరింపబడిన శిరస్సు గలిగి శివుని పూజాపుష్పములకొర కరణ్యమునకేగెను.

శ్లో || తత్ర పుష్పాణి పుల్లాని సుగన్ధీని మహాన్తి చ|

స్వాదూని కన్దమూలాని జీవధారణ హేతవే||

కుశాన్పత్రాణి సమిధస్సమాదాయ వనా త్తతః |

ఆగతస్స్వాశ్రమాన్తం చ యత్ర సన్నిహితశ్శివః ||

పూజాం విధాతు మీశస్య పుష్పాణి పరిశోధయన్‌|

ప్రసూనం కృపిసన్దష్టం దృష్ట్వా భీతస్సమబ్రవీత్‌||

అచ్చట మంచి వాసనగల విడిచిన పెద్ద పువ్వులను, జీవనాధారమునకై రుచిగల కందమూలములను, కుశలను, ఆకులను, సమిధలను తీసికొని ఆవనమునుండి శివుడున్న తన యాశ్రమమునకు వచ్చి ఈశ్వరుని పూజ చేయుటకు పుష్పములను పరీక్షించుచు పువ్వులను పురుగులు కొరికినటుల జూచి భయపడి పలికెను.

శ్లో || ఉదయం భాస్కరే ప్రాప్తే యద్యహం స్యాం గతో వనమ్‌|

తావద్భవన్తి పుష్పాణి దూషితాని మధువ్రతైః ||

సూర్యుడుదయించిన పిమ్నట నేనరణ్యమునకు వెళ్లినచో నంతలో తేనెటీగలు పువ్వులను కొరికివేయును.

శ్లో || ప్రత్యుషస్యేవ చోత్థాయ యది గస్తుం కృతోద్యమః |

నిశాన్ధకారసంఛన్నాస్తస్య మార్గా నిరన్తరాః ||

తెల్లవారుజాముననే వెళ్లుటకు యత్నించినయెడల దట్టని యరణ్యపు మార్గములన్నియు చీకటితో కప్పబడి యుండును.

శ్లో || తథాప్యహం గత స్తత్ర పూజాకుసుమహేతవే|

కేవలం గమనాయాసో నైవ కిఞ్చిత్కృతం భ##వేత్‌||

అయినను పూజాపుష్పములకొర కడవి కేగితిని. వెళ్లు టవలన కేవల మాయాసమేతప్ప ఏ కొంచముపని చేసినటులను కాలేదు.

శ్లో || ప్రస్యన్దితైర్హి మైస్సమ్యగభిషిక్తా ఇవ ద్రుమాః |

ఆభ్రంలిహాశ్చ నిశ్శాఖా ఋజువో విపులా భృశమ్‌|

స్రవించు మంచుధారలచేత చెట్లు బాగుగా నభిషేకము చేయబడినట్లుండెను. అవియు మిక్కిలి పెద్దవి, కొమ్మలు లేక నిలువుగా ఆకాశము నంటుచున్నవి.

శ్లో || #9; ప్రస్యన్దిహిమధారేషు భూరుహేషు సమన్తతః |

అరురుక్షోర్న సజ్యేతే హస్తౌ పాదౌ చ కుత్రచిత్‌||

చెట్టెక్కదలచిన నాకాళ్లు చేతులు అంతటను స్రవించు మంచుధారలుగల చెట్లయందెక్కడను పట్టుబట్టుటలేదు.

శ్లో || భృఙ్గభుక్తాని పుష్పాణి ముకులైస్సంయుతాని చ |

పూర్వవాసరపుల్లాని నిర్గన్ధాని విశేషతః ||

వర్జ్యాన్యాగమవాక్యేన తాని సర్వాణి పూజనే|

కిం కరోమీతి చిన్తాభిః భృశం నిర్విణ్ణమానసః ||

తుమ్మెదలు తినిన పూవులను మొగ్గలతో కూడిన వానిని ముందురోజు విడిచినవానిని విశేషముగా వాసనలేని వానిని వీని నన్నిటిని ఆగమవాక్యమునుబట్టి పూజ కుయోగింపరాదు. ఏమి చేయుదును. అని చింతతో మనస్సున విచారించెను.

శ్లో || #9; చన్ద్రచూడ! మహేశాన! గఙ్గాధర! జటాభర!

ప్రసీద భగవన్‌ మే7ద్య శంకరేశ! దయానిధే||

శిరమున చంద్రుని దాల్చినవాడా! మహేశ్వర! గఙ్గాధర! జటాధరీ! శంకర! దయానిధీ! భగవన్‌! నన్నిపు డనుగ్రహింపుము.

శ్లో || మామద్య రక్షింతుం నిత్యం కారుణ్యం యదితే విభో! |

భక్తిహీనస్య మే వాంఛాం దేహి దేహి, జగద్గురో||

ప్రభూ! జగద్గురూ! నన్ను నిత్యము రక్షించుటకు నీకు దయయున్నయెడల భక్తిహీనుడనైన నాకోరిక నిపుడు తీర్చుము.

శ్లో || త్వయా వినా శరణ్యన న హి మే గతిరీశ్వర|

ఇతి నిశ్చితచిత్తో7పి నిర్వేదాత్పునరబ్రవీత్‌||

ఈశ్వర! రక్షకుడవైన నీవుతప్ప నాకు వేరొక దిక్కులేదు. అని మనస్సున నిశ్చయమున్నను విచారమువలన మరల పలికెను.

శ్లో || #9; క్వ భక్తి పరిహీనో7హం క్వ చ పూజా మయా కృతా|

క్వ భవాన్‌ పరమేశానో బ్రహ్మవిష్ణుసురార్చితః ||

భక్తిలేని నేనెక్కడ? నేను చేసిన పూజ యెక్కడ? బ్రహ్మ విష్ణు దేవాదులచే పూజింపబడు పరమేశ్వరుడవైన నీవెక్కడ?

శ్లో || నరాణాం భక్తిహీనానాం తవ రూపం న దృశ్యతే|

ఇత్యాగమానాం వాక్యాని జానే గూఢాని తత్వతః||

భక్తిలేని మానవులకు నీరూపము కనబడదను రహస్యమైన ఆగమ వాక్యములను యథార్థముగా నెరుగుదును.

శ్లో || #9; ఇతి దుఃఖితచి త్తస్య తస్య బాలమునేః పురః |

ఆరూఢవృషభస్సామ్బో గణ సేనాసమావృతః ||

అభితస్త్సూయమానశ్చ హరిబ్రహ్మసురాసురైః

ఆవిర్భభూవ భగవానఖణ్డానన్దనిగ్రహః ||

ఈవిధముగా చిత్తమున దుఃఖించు ఆబాలముని యెదుట వృషభవాహనము నెక్కి గణసేనా సహితుడై హరి బ్రహ్మసురాసురులు అన్నివైపుల స్తుతింప అఖండానంద విగ్రహుడైన భగవంతుడగు పార్వతీపతి యావిర్భవించెను.

శ్లో || ఆవిర్భూతమజం దృష్ట్వా సుకృతిర్మునిస త్తమః|

ధారారూపసముద్భూతహర్షాశ్రురుచిరేక్షణః||

అఞ్చతోద్భూతపులకై ర్వహన్నా నన్దసమ్పదః|

ప్రణనామ చిరం భూమౌ సమ్యక్‌ ప్రీతిసమాకులః ||

పుణ్యాత్ముడగు నామునిపుంగవు డావిర్భవించిన శివుని జూచి ప్రీతిజెంది ధారగా ప్రవహించు ఆనందాశ్రువులతో నందమైన కన్నులుగలవాడై ఆనంద సంపదచే శరీరము బాగుగా పులకరింప చాలసేపు సాష్టాంగముగా నమస్కరించెను.

శ్లో || ప్రణతం పుణ్యతపసం ముదితం తముమాపతిః|

పశ్యన్‌ సుధాముచం వాచం జగాద పురశాసనః ||

త్రిపురాసురసంహారకుడగు నా పార్వతీపతి సంతోషముతో ప్రణమిల్లిన యా పుణ్యతాపసిని చూచి అమృతమును కురియు వాక్కును పలికెను.

మహేశ్వరః :

శ్లో || తుష్టో7స్మి తవ శీలేన తపసాపి తపోధన|

సశ్రద్ధం కృతయా నిత్యం పూజయాస్యనఘాన యా||

మహేశ్వరుడు :

పాపరహితుడవైన యోతపోధన! నీస్వభావముచేతను తపస్సుచేతను, శ్రద్ధతో నిత్యము చేసిన యీపూజచేతను సంతసించితిని.

శ్లో || యత్ర వస్తుని తే వాంఛా భౌమే దివ్యే థ వాన్తరే |

తద్వద త్వం మహాభాగ ప్రదాస్యామి తవేప్సితమ్‌||

మహాభాగ! నీకు భూమిలోగాని స్వర్గమునగాని మధ్యలోగాని ఏవస్తువుయందు కోరిక గలదో చెప్పుము. నీకోర్కెతీర్చెదను.

సూతః :

శ్లో || ఏవముక్తం గిరీశేన వచశ్రుత్వా తపోనిధధిః |

ముదితః ప్రార్ధయామాస వరమేతన్మహాద్భుతమ్‌||

సూతుడు:

ఈశ్వరుడు పలికిన యామాట విని తపోధనుడు సంతసించి మిక్కిలి యాశ్చర్యకరమైన యీ వరము కోరెను.

శ్లో || #9; పుష్పార్థం గచ్ఛతః కల్యే తవ పూజావిధాయినః |

నియతం హస్తపాదేషు వ్యాఘ్రరూపం శివాస్తు మే||

శివ! నీపూజకొరకు పువ్వులు తెచ్చుట కుషఃకాలమున వెళ్లునపుడు తప్పక నాచేతులయందు, కాళ్ల యందును పులి రూపము కలుగుగాక.

శ్లో || #9; నేత్రే చ కిఞ్చ మే స్యాతాం తత్ర తత్రైవ సుప్రభే|

యథా పురా మహేశాన తవ పూజా కృతా మయా||

వ్యాఘ్రరూపధరేణాపి తథైవ క్రియతాం సదా|

న్యూనాతిరి క్త సంభూత స్తస్యా దోషో7పి శామ్యతు||

మహేశ్వర! కన్నులుగూడ అక్కడికక్కడే మంచి కాంతిగలవి యగుగాక, నేను నీ పూజ పూర్వమెట్లు చేసితినో పులిరూపముతో గూడ అట్లే యెల్లప్పుడు చేయుదునుగాక. ఆపూజయొక్క ఎక్కువ తక్కువల వలన గలిగిన దోషము కూడ లేకుండుగాక.

శ్లో || అద్యారభ్య దయాసార! మమ నామ్నా పూరంత్విదమ్‌|

ఖ్యాతమస్తు సమస్తేషు భువనేష్వమ్బికాపతే||

పార్వతీపతీ!దయాసార! ఈపుర మిప్పటినుండి నాపేరుతో సర్వలోకములలో ప్రసిద్ధమగుగాక.

శ్లో || తేనైవం వాంఛితం తత్ర సర్వేషామతిదుర్లభమ్‌|

సుప్రసన్న ముఖస్తసై#్మ దదౌ హర్షేణ శఙ్కరః ||

అందరికి నతిదుర్లభ##మైన యాకోరిక నాత డీవిధమున నక్కడ కోరెను. శంకరుడు ప్రసన్నముఖుడై వానికి దానిని సంతోషంముతో నొసగెను.

శ్లో || #9; ఆమితాత్మా సురైస్సర్వై ర్దేవదేవో7పి దుర్లభమ్‌|

దదాత్యేవ వరం సర్వం కృపయా మునిసత్తమాః ||

మునిపుంగవులారా! దేవత లెవ్వరిచేతను ఊహింపరాని స్వరూపముగల దేవదేవుడు దుర్లభ##మైనను ఏవరమునైనను దయతో తప్పక యిచ్చును.

శ్లో || అథసన్తుష్ట చిత్తస్య మునేస్సుకృతశాలినః |

ప్రావర్తత మహత్తస్య భృశమానన్దజం పయః ||

పిమ్మట మనస్సులో సంతోషించిన పుణ్యాత్ముడగు నాముని కెక్కువ ఆనందాశ్రువులు వచ్చినవి.

శ్లో || తథావిధో మునిస్సో7యం శఙ్కరం లోకశఙ్కరమ్‌

సాదరో వినయావిష్టః ప్రణనామ పునః పునః ||

అట్టి యీముని యాదరముగలిగి లోకమునకు సుఖము నిచ్చు శంకరుని వినయముతో మరలమరల నమస్కరించెను.

శ్లో || #9; తత స్తస్య వరం దత్వా భగవాన్‌ భక్తి భావనః |

తిరోదధే తథాకాశే సాకమద్ద్రీకన్యయా||

భక్తిచే భావింపదగిన శివుడు వానికి వరమిచ్చి పిమ్మట పార్వతితో గూడ నాకాశమున నదృశ్యమయ్యెను.

శ్లో || #9; తదారభ్య మునేస్తస్య తపోరాశేర్మహాత్మనః |

వ్యాఘ్రపాద ఇతి ఖ్యాతి రాసీదద్భుతకారిణీ||

తపోరాశియు మహాత్ముడునగు నాముని కదిమొదలు వ్యాఘ్రపాదుడను నాశ్చర్యమును గలిగించు కీర్తి కలిగెను.

శ్లో || తతశ్చ సుమతి శ్ర్శీమాన్‌ శివపూజాపరాయణః |

ఉషస్యేవ సముత్థాయ నిత్యం భక్తి సమన్వితః||

సర్వం కర్మ యథాపూర్వం కృత్వా దినముఖోచితమ్‌|

నిర్భయస్సర్వసత్వానాం భీతిమాపాదయన్‌ స్వయమ్‌||

నజిఘ్రన్తి ప్రసూనాని యావద్భ్రమరపంక్తయః ||

తావదేవ వనం గత్వా తై సై#్తస్సద్యస్స మావృతైః||

శ్లాఘ్యగన్ధై కురవకై ః చమ్పకై ః హేమకాన్తిభిః |

మాణిక్యాఙ్కురసచ్ఛాయైః పాటలైః పుణ్యసౌర భైః ||

మాలతీకుసుమైర్నవ్యైః మల్లికాకుసుమైస్తథా|

పద్మైః కుపలయైః పుల్లైః కహ్లారైశ్చ సుగన్ధిభిః ||

పాదారవిన్దమీశస్య తస్య నిత్యం నమర్చయన్‌|

ఉవాస పరమప్రీతః చిరం తత్త్రైవ సువ్రతః ||

పిమ్మట ధీమంతుడు శివపూజాపరాయణుడునగు నాముని నిత్యము భక్తితో ఉషః కాలముననే లేచి ప్రాతఃకాల మున చేయవలసిన కర్మనంతను పూర్వమువలెనే చేసి తాను నిర్భయుడై మృగములకన్నిటికి భయమును గలిగించుచు తుమ్మెదలు పువ్వులను వాసన చూడకముందే వనముకేగి అప్పుడే విడిచి మంచి వాసనగల గోరింటలు, బంగారపురంగు గల సంపెంగలు, మాణిక్యపు మొలకలరంగు, మంచివాసన గల పాటలములు, క్రొత్త మాలతీపుష్పములు, మల్లెపూవులు, విడిచిన పద్మములు, పరిమళించు ఎఱ్ఱకలువలు తెచ్చి ఆయీశ్వరుని పాదారవిందమును నిత్యము పూజించుచు మంచి వ్రతాచరణముగలవాడై సంతోషముతో చాలాకాల మచ్చటనేనివసించెను.

శ్లో || య ఇమం పునరధ్యాయం యః పఠేచ్చ శృణోతి వా|

స సర్వకామసంయుక్తః శివసాయుజ్యమాప్ను యాత్‌ || 43

ఎవరీయధ్యాయమును చదువుదురో లేక విందురో వారు అన్నికోరికలు తీరి శివసాయుజ్యమును పొందుదురు.

ఇతి స్కాన్దే మహాపురాణ సనత్కుమారసంహితాయాం

శ్రీమహేశ్వరనన్దిసంవాదే చిదమ్బరమాహాత్మ్యే

వ్యాఘ్రపాదవరలాభో నామ నవమో7ధ్యాయః

-----0-----

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters