Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

అథషడ్వింశోధ్యాయః

(రథోత్సవతీర్థవిధానవర్ణనము)

శ్లో|| పౌషే మాసి మహోత్సవం నటపతేరత్యద్భుతం పావనం

లోకానామభివాఞ్చితార్థఘటకం ప్రావర్తయద్భూ పతిః

ప్రాచ్యం గుహ్యకతీర్థనామ్ని జలధేః శ్రీవారుణ ఘట్టకే|

శ్రీమన్మజ్జముత్సవం చ వ్యదధాచ్ఛమ్భోర్నృ పో మఙ్గలమ్‌|

పౌష మాసమున రాజు పటరాజుకు అత్యద్భుతము, పవిత్రము, లోకమునకు కోరిక కోర్కెల నిచ్చునదియునగు మహోత్సవమును చేయించెను. గుహ్యకతీర్థమను పేరు గల సముద్రము యొక్క వారుణఘట్టమున శివునకు తూర్పునందలి శుభ##మైన మజ్జనోత్సవము చేయించెను.

శ్లో|| పౌషమాసి విధించైవ శృణుధ్వం మునిసత్తమాః|

వక్ష్యామితద్యథావృత్తం నటేశస్య దయానిధేః||

ముని శ్రేష్ఠులారా! దయానిధియగు నటేశ్వరునకు పౌషమాసమున విధిని గూడ జరిగిన విధమున చెప్పెదను వినుడు.

ఋషయః :

శ్లో|| పౌషే మాసి నటేశస్య పూజనం కీదృశం విభో|

పౌషమాసస్య పూజార్థం వ్యాఘ్రపాదోమహాతపాః||

హిరణ్యవర్మణ రాజ్ఞే సమ్యగేతదువాచ హ|

ఋషులు :

ప్రభూ! పౌషమాసమున నటేశుని పూజయెట్లు? పౌష మాసమున పూజ కొరకు మహా తపస్వియైన వ్యాఘ్రపాదుడు రాజగు హిరణ్య వర్మకు బాగుగా నిట్లు చెప్పెను.

శ్లో|| పౌషమాసస్య పూజాం చ శృణుత్వమవనీపతే!

పౌషాభిధానే మాసే తు పుష్య నక్షత్రసంయుతే||

దివసే శుభలగ్నే చ మహానై వేద్యమాదరాత్‌|

యే కారయన్తి తే సర్వే ముక్తిమాయాన్తి శాశ్వతీమ్‌||

రాజా! పౌషమాసమందలి పూజను గూడ నీవు వినుము. పౌష మాసమున పుష్యమీ నక్షత్రముతో గూడిన దినమున శుభలగ్నమున ఆదరముతో మహానైవేద్యము ఎవరు చేయించెదరో వారందరు శాశ్వతమైన ముక్తిని బొందెదరు.

శ్లో|| ఇతి తస్య వచః శ్రుత్యా వ్యాఘ్రపాదస్య ధీమతః|

రాజా నివేదయామాస త్రిసహస్రద్విజన్మనః||

ఈ విధముగా బుద్ధిమంతుడైన వ్యాఘ్రపాదుని మాట విని రాజు మూడు వేల మంది బ్రాహ్మణులచే నివేదింపజేసెను.

శ్లో|| అన్నాని చావదాతాని కైలాససదృశాని చ|

భక్ష్యభోజ్యాని లేహ్యాని చోష్యాని వివిధాని చ||

రవిపాకాగ్ని పాకాశ్చ సూపాపూపనాన్యనేకశః|

కదలీఫలమిశ్రాణి నారికేలఫలాని చ||

అన్యాంశ్చ వివిధాన్పాకాన్సరసాంశ్చ న్యవేదయత్‌|

తెల్లనివి, కైలాసముతో సమానమైనవియునగు అన్నరాసులను, పలువిధములైన భక్ష్యములు, భోజ్యములు, చోష్యములు, లేహ్యములునను నాలుగువిధములైన ఆహారములను, సూర్యపక్వములునైన వానిని, అనేకములైన పప్పులను, పిండివంటలను, అరటి పండ్లు కొబ్బరి పండ్లు ఇతరమైన, వివిధములైన రసవంతములైన పాకములను రాజు నటేశునకు, నివేదించెను.

శ్లో|| మహానైవేద్య మాలోక్య సర్వే తే మునిసత్తమాః|

సన్తోషమతులం ప్రాపురవనీపతి సత్తమే||

ఆ ముని పుంగవులందరు మహానైవేద్యమును జూచి రాజశ్రేష్ఠుని మిక్కిలి సంతసించిరి.

శ్లో|| వ్యాఘ్రపాదస్తతస్తుష్టో భూపతిం ప్రత్యువాచ హ|

అన్యం చ కథయిష్యామి నటేశస్య మహోత్సవమ్‌||

పిమ్మట వ్యాఘ్రపాదుడు సంతోషించి రాజుతో పలికెను. నటేశుని యొక్క మరియొక మహోత్సవమును చెప్పెదను.

శ్లో|| మిథునే మాసి సంప్రాప్తే ఫల్గునీఋక్షసంయుతే|

దివసే ధరణీపాలదేవాశ్చ మునయ స్తథా||

సిద్ధవిద్యాధరా యక్షా రాక్షసాశ్చైవ మానవాః|

కిన్నరాశ్చైవ యేచాన్యే సర్వే సంభూయ

సాదరమ్‌||

శ్రీమత్తిల్లవనం ప్రాప్య పుణ్డరీక్సరోవరే|

స్నాత్వా గత్వా సభామధ్యే దేవ దేవం నటేశ్వరమ్‌||

నిర్మలం నిష్క్రియం నిత్యం నిష్కలఙ్కిత విగ్రహమ్‌|

మాయాతీతం మహాతీతం వ్యోమమన్దాకినీధరమ్‌||

చూడాశశాఙ్కజ్యోత్న్సాభిః ధవలీకృతదిఙ్ముఖమ్‌|

లలాటనయనజ్యోతిర్జ్వాలాదగ్ధస్మర ద్రుమమ్‌|

కరుణాసిన్దుకల్లోల తరఙ్గితకటాక్షకమ్‌|

మన్దస్మిత మనోహరి ముఖచన్ద్ర విరాజిమ్‌||

భుజగేన్ద్రఫణారత్న కిరణారుణగణ్ఢకమ్‌|

తుహినాద్రిసుతాతుఙ్గకుచకస్తూరి కాఙ్కితమ్‌||

వ్యాఘ్రచర్మపరీధానం వ్యాలయజ్ఞోపవీతినమ్‌|

మఞ్జంశిఞ్జానమఞ్జీరశిఞ్జితదిఙ్ముఖమ్‌||

దృష్టమాత్రేణ సర్వేషాం నిశ్రేయసవిధాయినాయినా|

ఇన్ద్రావరోధసీమన్తసిన్దూరేణా తిరగిణా

దక్షేణ చరణాబ్జేన తరుణామ్భుజభాసినా|

అపస్మారమధః కృత్వా చాపరేణ భ్రమోద్యతా||

ధరణీధరయూథాని చాలయన్తం సభేశ్వరమ్‌|

దృష్ట్వౌనన్దా శ్రుసంపూర్ణాః శ్రుత్వానత్వాపునఃపునః|

తద్భావభావితాస్సర్వే గచ్చేయుస్స్వం నికేతనమ్‌||

రాజా! మిధున మాసము వచ్చినతోడనే ఫల్గునీ నక్షత్రముతో కూడిన దినమున దేవతలు, మునులు, సిద్ధులు, విద్యాధరులు, యక్షులు, రాక్షసులు, మానవులు, కిన్నరులు ఇంకను ఇతరులు కలసి ఆదరముతో తిల్లవనమునకు చేరి పుండరీక సరోవరమున స్నానముచేసి సభలోనికి వెళ్ళి దేవదేవుడు, నటేశ్వరుడు, నిర్మలుడు, నిష్క్రియుడు, నాశములేనివాడు, మచ్చలేని శరీరముగలవాడు మాయను దాటినవాడు, మహత్తత్వమును దాటినవాడు, ఆకాశగంగను ధరించినవాడు, తలమీది చంద్రుని కాంతిచే దిక్కులను తెల్లగాజేసినవాడు, నుదుటియందలి కంటి మంటచే మన్మథుడను వృక్షమును కాల్చినవాడు, దయాసముద్రమందు కెరటములె కదలు కటాక్షములు గల వాడు, చిరునవ్వుచేత సుందరమైన ముఖచంద్రునితో ప్రకాశించువాడు, నాగేంద్రుని పడగలమీది రత్నముల కాంతులచే నెఱ్ఱనైన గండస్థలములు గలవాడు, పార్వతియొక్క ఎత్తైన రొమ్ములమీది కస్తూరీ చిహ్నములు గలవాడు, పులి చర్మమును కట్టుకొనినవాడు, సర్పమును యజ్ఞోపవీతముగా ధరించినవాడు, దిక్కులయందు వ్యాపించినర మనోహర ధ్వనిగల అందెను ధరించినవాడు, చూచిన మాత్రముననే అందరికి మోక్షమునిచ్చునది, శచీదేవి పాపిడిలోని సింధూరముచే మిక్కిలి ఎఱ్ణనైనది, వికసించిన పద్మమువలె ప్రకాశించునదియునగు కుడిపాదముతో అపస్మారుని అణగద్రొక్కి త్రిప్పి ఎత్తబడిన రెండవపాదముతో దిగ్గజములను కదలించువాడునగు సభేశ్వరుని చూచి ఆనందాశ్రవులతో నిండినవాడై వానిని గూర్చి విని మరల మరల నమస్కరించి అందరు నాశివభావముతో వా%్‌యపించిన చిత్తముగలవారై తమ ఇండ్లకు వెళ్ళుదురు.

వ్యాఘ్రపాదః

శ్లో|| తస్మాత్తత్సమయేసమ్యక్కర్తవ్యస్తుమహోత్సవః|

ఆసన్నశ్చ మహీపాల! తత్కాలో భావివత్సరే!

తస్మాత్సం పాదయాశుత్వం రథాదీనుత్సవార్థకమ్‌||

కనుక అసమయమున బాగుగా మహోత్సవమును చేయవలెను, రాజా! రాబోవు సంవత్సర మందా సమయము సమీపించినది. కనుక నీవుత్సవము కొరకు రథము మొదలగు వానిని తొందరగా సిద్ధపరపుము.

శ్లో|| ఇత్యుక్తస్తేన భూపాలో వ్యాఘ్రపాదేన ధీమతా|

సర్వం సమ్పాదయామాస సహసా ధరణీపతిః|

బుద్ధిమంతుడగు వ్యాఘ్రపాదుడీ విధమున జెప్పగా రాజు సమస్తమును సిద్ధపరచెను.

శ్లో|| అథ తత్సమయే సమ్యక్సమ్ప్రాప్తె మునిపుజ్గవాః|

కృత్తికాహ్వానకే ఋక్షే త్రిసహస్రద్విజాతయః||

సమ్భూయ సాదరాస్సర్వే ధ్వజారోహ నిమిత్తకమ్‌|

దేవతావాహనం చక్రుః పరమేశస్య సన్నిధౌ||

పిమ్మట నాసమయము ప్రాప్తింపగా ముని శ్రేష్ఠులు మూడు వేలమంది బ్రాహ్మణులు కలసి అందరు ఆదరముతో కృత్తికా నక్షత్రమున పరమేశ్వరుని దగ్గర ధ్వజారోహణము కొరకు దేవతల నాహ్వానించిరి.

శ్లో|| విష్ణుబ్రహ్మేన్ద్రహుతభుగ్యమరాక్షసపాశినః|

ప్రకమ్పనకే బేరేశదివానాథని శాకరాః||

గన్ధర్వరాక్షసా యక్షాః సిద్ధాః కింపురుషాదయః||

సర్వే సభేశ సేవార్థం సమాగచ్ఛన్త సత్వరమ్‌||

విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అను అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు, సిద్ధులు, కింపురుషులు మొదలగువారు అందరును నటేశ్వరుని సేవకొరకు వేగముగా వచ్చిరి.

శ్లో|| ఇతి దేవాన్‌ సమాహూయ ధ్వజం వృషభలాఞ్చితమ్‌|

పురం ప్రదక్షిణీకృత్య సభేస్యతు సన్నిధౌ||

దృఢమారోపయామాసుః వైదికేనైవవర్త్మవా|

ఈ విధముగా దేవతలను పిలచి వృషభ చిహ్నముగల ధ్వజమును పురప్రదక్షిణము చేయించి నటేశ్వరుని దగ్గర వైదిక విధానమున గట్టిగా పాతిరి.

శ్లో|| అపరే తు దినే రాత్రౌ ముర్దలం మరజం తథా|

పటహం వడేణువీణాం చ దున్దుభిం ఝుల్లరీం తథా||

అనేక ధ్వనిసంయుక్తం ఘోసయామాసురాదరాత్‌|

రెండవ రోజు రాత్రి సంతోషమున మద్దెల, మురజము, పటహము, పిల్లనగ్రోవి, వీణ, దుందుభి, ఝల్లరి అనువాద్యములను అనేక ధ్వనులతో వాయించిరి.

శ్లో|| ఘోషేణ తేన మహతా బ్రహ్మాణ్డాన్తర్విజృమ్భిణా|

బధిరీకృతకర్ణానాం లోకానామభవత్ర్పి యమ్‌||

బ్రహ్మాండములోనంతటను వ్యాపించు నా పెద్దధ్వనిచే చెవులకు చెవుడు కలిగిన లోకములకు ప్రీతిగలిగెను.

శ్లో|| అన్యేద్యురవనీదేవా దేవాశ్చ ఋషయస్తథా|

సస్త్రీకాస్సాదరాశ్చైవ శ్రీమద్దభ్రసభావతేః||

ఉత్సవస్య తు సేవార్థంతిల్లకారణ్య మాయయుః|

మరునాడు బ్రాహ్మణులు, దేవతలు, ఋషులు, స్త్రీలతో కూడ ఆదరముతో శ్రీ దభ్రసభాపతియుత్సవమను సేవించుటకు తిల్లవనమునకు వచ్చిరి.

శ్లో|| మధ్యార్జునేశ మాయూర శ్వేతకాన్తారనాయకౌ|

వేదకానన వల్మీక శ్రీమత్సఞ్చనదేశ్వరాః||

ఏకామ్ర్బేశాభిధాశ్చా ప్యరుణాచలనాయకః|

సున్దరేశాదయోప్యాశు సభేశం ద్రష్టుమాగతాః||

మధ్యార్జునేశుడు, మాయూరేశుడు, శ్వేతకాంతార (తిరువేంగాడు) నాయకుడు, వేదకానన (వీరారణ్యము) ప్రభువు, వల్మీక (తిరువాలూరు) నాయకుడు పంచనదేశ్వరుడు, ఏకామ్రేశ్వరుడు (కాంచీపురము) అరుణగిరినాధుడు, సందరేశ్వరుడు (మధుర) మొదలగువారు తొందరగా నటేశ్వరుని చూచుటకు వచ్చిరి.

శ్లో|| యేచాన్యే చ మునిశ్రేష్ఠాః భూతలే సముపస్థితాః|

దేవాస్తే నటరాజస్య సేవార్థస్తుసమాయయుః||

భూతలముననున్న ఇతరమైన మునిపుంగవులు, దేవతలు నటరాజు సేవకొరకు వచ్చిరి.

శ్లో|| ఏవమేవ ప్రకారేణ మఖఋక్షావసానకమ్‌|

వేదోక్తేన ప్రకారేణ చావనీసురస త్తమాః||

మహోత్సవవిధిం చక్రుః నవమే పూర్వఫల్గునే|

అలంచక్రుర్విమానేన రథంరత్నెఃఫలై రపి||

రథమారోపయామాసుర్దేవదేవం నటేశ్వరమ్‌|

ఈ విధముగనే మఖా నక్షత్రాన్తమువరకు వేదో క్తవిధానమున బ్రాహ్మణ శ్రేష్ఠులు మహోత్సవ విధానమును నెరవేర్చిరి. తొమ్మిదవ రోజున పూర్వఫల్గునీ నక్షత్రమున రథశిఖరమును రత్నములతోను ఫలములతోను అలంకరించి దేవదేవుడగు నటేశ్వరుని రథమెక్కించిరి.

శ్లో|| కపోతకోటివ్యాలమ్బిచామరై రుజ్వలాకృతిమ్‌|

మన్దారదామనిష్యన్దమకరన్ద విచిత్రితమ్‌||

స్థూలముక్తాఫలాభీశుజ్యోత్స్నాధవల విగ్రహమ్‌|

దర్పణౖర్హేమకుమ్భైశ్చ విరాజితశిఖాతలమ్‌||

క్షౌమచేలాసముద్భూతోల్లోచనాపిహితాన్తరైః|

పవనోద్ధూయమానైశ్చ నటేశస్యమహోత్సవమ్‌|

ద్రష్టుం దేవాశేషాంశ్చ ఆహ్వాననిరతై రివ|

కేతుభిర్ఘటిత ప్రాన్తం సకలానన్ద కారణమ్‌||

నవరత్న సముద్భూత మాలానికలభానుభిః|

అఖణ్డలధనుశ్శోభామాకుర్వాణంనభస్థలే|

మాణిక్యగాత్రయుక్తేన మల్లీకుసుమశోభినా|

చీనాంశుకప్రచ్ఛదేన సాదపీఠోపశోభినా||

సింహాసనేన దివ్యేన సదాలంకృతమధ్యమమ్‌|

కర్ణకూటశిఖాబద్ధరత్నకిఙ్కిణికారవైః||

ముఖరీకృతదిగ్భాగం మేరుశృఙ్గమివాపరమ్‌|

అధిష్ఠానాన్తరక్షిపై#్తః కృత్రిమైః ప్రతిమాగణౖః|

అనేక దేవతాపూర్ణం హేమశైల మివోజ్వలమ్‌||

రథమారోపయిత్వాశు దేవదేవం నటేశ్వరమ్‌|

దేవీం చ విఘ్న రాజం చ ప్రత్యేకం

రథయోర్ధ్వయోః||

అరోప్యచ నృపశ్రేష్ఠః వీథికాయాం శ##నైశ్శనైః|

ప్రదక్షిణవిధిం చక్రే సర్వాలఙ్కారసంయుతమ్‌||

కపోతపుటంచులకు వ్రేలాడుచున్న చామరములచే ప్రకాశించు ఆకారముగలది, మందార మాల నుండి స్రవించు మకరందముచే చిత్రింపబడినది. పెద్ద ముత్యముల కిరణముల కాంతిచే తెల్లనైన స్వరూపముగలది, అద్దముల చేతను బంగారు కలశముల చేతను విరాజిల్లు శిఖర భాగాముగలది. పట్టుబట్టచే తయారై చూపునకందక మధ్య అవకాశము లేక గాలికి కదలుచు నటేశుని మహోత్సవమును చూచుటకు దేవతల నందరను పిలుచుచున్నటులున్న జండాలు సమీపమున కూర్చబడియున్నది, సకలానందములకు కారణమైనది, నవరత్నముల మాలల కాంతులచే ఆకాశమున ఇంధ్రధనస్సు యొక్క అందమును కలుగజేయుచున్నది. మాణిక్యములచే జేయబడి మల్లె పువ్వులచే అలంకరింపబడి పట్టుబట్ట కప్పిన పాదపీఠముతో శోభిల్ల దివ్య సింహాసనముతో నెల్లప్పుడు మధ్య భాగమున అలంకరింపబడినది, కర్ణకూటముకొనకు కట్టిన రత్నపు చిరు గంటల ధ్వనులచే దిక్కులను ధ్వనింపజేయునది, మరియొక మేరు శిఖరమువలె నున్నది, చాల గొడుగులచే ఎండ అడ్డగింపబడినది, ఇతర ప్రదేశములలో పెట్టబడిన బొమ్మలచే అనేక దేవతలతో కూడిన కనకాద్రివలె ప్రకాశించునదియునగు రథమును వెంటనే దేవ దేవుడగు నటేశునెక్కించి దేవిని గణశుని వేరు వేరుగా రెండు రథములెక్కించి రాజు వీధిలో సర్వాలంకారములతో మెల్ల మెల్లగా ప్రదక్షిణము చేయించెను.

శ్లో|| వీథ్యాం విరాజమానే తు శ్రీ మద్దభ్రసభాపతౌ|

వీథికా రమణీయాసీదలం%్‌కారై రనేకశః||

శ్రీ నటేశుడు వీథిలో విరాజిల్లుచుండగా వీథి అనేకాలంకారములతో రమణీయముగా నుండెను.

శ్లో|| మన్దవాతక్యణత్కారికింకిణీతోరనారవైః

ప్రాసాదాగ్రశిఖాబద్ధక్షౌమనిర్మితకేతుభిః||

శాతకుమ్భమయైః కుమ్భైః రమ్భాస్తమ్భ

విరాజితైః|

నాలికేరఫలైశ్చాపి క్రముకాణాం చ మాలయా||

కృత్రిమైఃపుత్రికై శ్చైవ ప్రతిద్వారం నివేశితైః|

దర్ఫణౖః పూర్ణచన్ద్రాభైశ్చామరాణాంచ రాజిభిః||

నవమౌక్తి కహారైశ్చ నవరత్న విచిత్రితైః

వితానై ర్వివిధైస్స్నిగ్ధైశ్చీనాంశుక వినిర్మితైః||

అన్యైశ్చ వివిధైర్దివ్యైరలంకారై ర్విరాజితాః

సమ్మర్దఘృష్టగీర్వాణ కోటీరతటవిద్యుతైః||

అనఘైరతితేజోభిర్మాణిక్యైర్దన్తురీకృతా|

సమద్భూపాలమౌలిస్థమాలాకుసుమకేసరైః||

ధూసరీకృతభూభాగా వీథికాసీన్మహత్తరా

చిరుగాలిచే ధ్వనించు చిరుగంటల తోరణముల ధ్వనులచేతను, మేడల చిట్టచివలర కట్టబడిన పట్టుగుడ్డల జండాల చేతను, అరటి స్తంభములతో విరాజిల్లు బంగారు కలశముల చేతను, చామరముల వరుసల చేతను, నవరత్నములతో చిత్రించబడిన క్రొత్తముత్తెపు దండల చేతను, పట్టుగుడ్డలతో కట్టిన వివిధములైన దట్టని చాందినీల చేతను, ఇతరములైన వివిధ దివ్యాలంకారములచేతను విరాజిల్లుచున్నది, సమ్మర్దముచే రాచికొనుచున్న దేవతల కిరీటముల ప్రక్కల నుండి పుట్టిన మెరపులచేతను మిక్కిలి కాంతి గలిగి నిర్దుష్టమైన మాణిక్యముల చేతను వ్యాపించియున్నది, నమస్కరించు భూపాలుర తలలయందున్న దండలయందలి పువ్వుల కేసరములచే ధూసరవర్ణముగల భూభాగము గల వీధి మనోహరముగానయ్యెను.

శ్లో|| అథసౌరజవాస్సర్వే హర్షనిర్భరమానసాః|

కేచిత్తుషారసలిలైరసిఞ్చిన్‌ బాహ్యవేదికాః||

పిమ్మట పురజనులందరు సంతోషముతో నిండిన మనస్సుగలవారైరి. కొందరు నీటితుంపురలతో బయటి అరుగులను తడిపిరి.

శ్లో|| కేచిన్నానావిధైః పుషై#్పర్వీథికాయామవాకిరన్‌|

కేచిత్పాటీరసలిలైః కేచిత్కుఙ్కుమవారిభిః|

కేచి త్తీర్థజలై శ్శుద్దైస్సిఞ్చిన్తి స్మ చ వీథికామ్‌

కొందరు వీథిలో పలువిధములైన పువ్వులు చల్లరి. మరి కొందరు గంధపు నీరు చల్లిరి. కొందరు కుంకుమ జలము చల్లిరి. కొందరు పవిత్రమైన తీర్థజలముతో వీథిని తడిపిరి.

శ్లో|| కేచిచ్చన్దపఙ్కేన కేచిత్కస్తూరికాభ##వైః|

కేచిన్మగనుదైశ్చైవ కేచిన్నిర్యాసకైస్తథా||

కేచిచ్చాగనుజమ్బాలై రలిమ్పవ్బాహ్య వేదికామ్‌

కొందరు చందనపు ముద్దతోను కొందరు కస్తూరితో తయారైన సుగంధ ద్రవ్యములతోను కొందరు మృగమదములతోను కొందరు చెట్ల జిగురులతోను కొందరు అగురు ముద్దతోను బయటి అరుగును అలికిరి.

శ్లో|| మఙ్గలానాం నివాదేనదున్దుభీనాం చ ఘుష్యతామ్‌|

పటహానాం నినాదేన కాహలానాం చ నిస్వనైః||

మునీనాం సామగానేన ద్విజానాం వేదఘోషణౖః|

భక్తానాం జయశ##బ్దైశ్చ తురఙ్గణాం చ హేషయా||

బృంహితేన మహేభావాం రథిచక్రమహారవైః|

ప్రనృత్యద్రుద్రకన్యానాం మఞ్జంమఞ్జీరశిఞ్జితైః||

పుష్పమాలాసముత్పాతిభృంగఝుంకృతినిస్వనైః|

కోలాహలేన మహతా భువనాన్తరవర్తినా|

బధిరీకృతకర్ణాస్తు బద్ధేన్ద్రియచతుష్టయాః||

ఆవర్తన్త జనాస్సర్వే పరమానన్దనిర్భరాః|

మంగళధ్వని చేతను మ్రోగుచున్న దుందుభి ధ్వని చేతను పటహముల యొక్కయు కాహలముల యొక్కయు ధ్వనిచేతను మునులసామగానముచేతను బ్రాహ్మణుల వేదఘోషణచేతను భక్తులజయశబ్దములచేతను గుఱ్ఱముల సకిలింపులచేతను ఏనుగుల ఘీంకారములచేతను రథచక్రముల ధ్వనులచేతను నృత్యము చేయు రుద్రకన్యల మనోహరమైన అందెల ధ్వనుల చేతను పూల మాలలపైబడు తుమ్మెదల ఝంకారముల చేతను లోకలములోనున్న పెద్ద కోలాహలచే చేతను చెవులు చెవిటివికాగా నాలుగింద్రియములను బంధించి జనులందరు పరమానందముతో నిండి తిరుగుచుండిరి.

శ్లో|| కేచిన్నృత్తం కుర్వన్తో హర్షబాష్పాహితేక్షణాః|

రోమాఞ్చాఞ్చి తదేహాశ్చపరమానన్దమూర్చితాః||

కేచిద్గానవిశేషైశ్చ ప్రీణయామాసురీశ్వరమ్‌|

కొందరు నృత్తము చేయుచు సంతోష బాష్పములతో నిండిన కన్నులు, పులకరించిన శరీరములు గలవారై పరమానందముతో మైమరచి, కొందరు గాన విశేషములతో నీశ్వరుని సంతోషపెట్టిరి.

శ్లో|| ఏవం ప్రదక్షిణీకృత్య శ్రీమద్దభ్రసభాపతిమ్‌|

సభాం ప్రవేశయామాస భూపతిర్ద్విజస త్తమైః||

ఈ విధముగా రాజు మునిపుంగవులతో ప్రదక్షిణము చేసి నటేశ్వరుని సభలో ప్రవేశ##పెట్టెను.

శ్లో|| అథోత్సవేన సన్తుష్టో వ్యాఘ్రపాదో మహాతపాః|

తీర్థకర్మ విధానార్థం ప్రత్యువాచ హ భూపతిమ్‌||

పిమ్మట ఉత్సవముచే సంతుష్టుడైన మహాతపస్వియగు వ్యాఘ్రపాదుడు తీర్థకర్మ విధానము కొరకు రాజుతో పలికెను.

శ్లో|| అన్యం చ కథయిష్యామి శృణు భూప! సమాహితః

ఉత్తరే నటరాజస్య తీర్థకర్మవిధిం పరమ్‌||

యే కారయన్తి మనుజాః తేషాం ముక్తిర్న

సంశయః||

రాజా! మరియొక దానిని చెప్పెదను శ్రద్ధతో వినుము. ఉత్తరమున నటరాజునకుత్తమమైన తీర్థకర్మ విధినే మానవులు చేయింతురో వారికి ముక్తి తప్పక కలుగును. సందేహము లేదు.

హిరణ్యవర్మా ః

శ్లో|| కుత్రవాతత్కరిష్యామి కింవాతీర్థం మునీశ్వర!

హిరణ్యవర్మ ః

మునీశ్వర! దానినెచ్చట చేయవలెను? ఆ తీర్థమేమి?

వ్యాఘ్రపాదః ః

శ్లో|| పుణ్డరీకపురస్యాస్య ప్రాగుదీచ్యాం చ వారిధౌ|

కురుష్వ నృపతి శ్రేష్ఠతీర్థ కర్మ విధిం వరమ్‌||

రాజశ్రేష్ఠ! ఈ పుణ్డరీకపురమున కీశాన్యమున సముద్రమున నుత్తమమైన తీర్థకర్మ విధిని చేయుము.

శ్లో|| తత్కాలసా%్‌నశుద్ధో యః పాతకైశ్చ ప్రముచ్యతే|

అస్మిన్నర్థే పురావృత్తమాఖ్యానం కథయామి తే||

ఆ సమయమున స్నానముచే శుద్ధుడైనవాడు పాపముల నుండి విముక్తుడగును. ఈ విషయమున పూర్వము జరిగిన కథ నీకు చెప్పెదను.

శ్లో|| కేనచిద్దానవేన్ద్రేణ పరాభవవిధాయినా|

వరుణో యుద్ధమకరోత్పురా కిల శతం సమాః||

పూర్వమింద్రుడు పరాభవించుచున్న దానవ ప్రభువుతో నూరు సంవత్సరములు యుద్ధము చేసెనట.

శ్లో|| అస్మిన్కాలే నిశీథిన్యాం కశ్చిద్బ్రాహ్మణపుఙ్గవః|

స్వేచ్ఛయా తు సమాగచ్ఛత్సమాధానాయ

చోభయోః|

ఆ సమయమున అర్థరాత్రి యందొక బ్రాహ్మణుడు వారిద్దరిని సమాధానపరచుటకు తనంతటతాను వచ్చెను.

శ్లో|| అగచ్ఛన్తం సమాలోక్య తిమిరాయితలోచనః|

వరుణిః ప్రాహిణోత్పాశావ్రాక్ష సేన్ద్రమనీషయా||

వరుణుడు వచ్చుచున్న వానిని చూచి కన్నులు చీకట్లు కమ్మి రాక్షసేంద్రుడనుకొని పాశములను పంపెను.

శ్లో|| తేన పాశేన సమ్బద్ధః పఞ్చతామగమద్ద్విజః|

తతస్తయా సమాక్రాన్తో మహత్యా

బ్రహ్మహత్యయా||

అపాంపతిరభూత్తత్ర నిస్తేజాశ్చైవ తతణాత్‌|

బ్రాహ్మణుడాపాశముచే బంధింపబడి చనిపోయెను. పిమ్మట గొప్ప బ్రహ్మహత్య చుట్టుకొనిన వెంటనే వరుణుడు తోజోహీనుడయ్యెను.

శ్లో|| అక్రాన్తే తేన పాపేన వరుణ సలిలాధిపే|

సప్తాసి తతక్షణాదేవ శోషమాపుః పయోధయః||

సముద్రశోషణాల్లో కేత్వనావృష్టిరభూత్తదా|

అవిరాసీన్మహాతాపో లోకానాం పరితప్యతామ్‌||

జలాధిపతియైన వరుణునకాపాపము చుట్టుకొనగనే ఏడు సముద్రములెండిపోయినవి. సముద్రము లెండుటవలన లోకములో అనావృష్టి గలిగెను. దానివలన లోకములు మహాతాపముచే పరితపించెను.

శ్లో|| తతశ్శునాసీరముఖాశ్చ దేవాస్సమ్భూయ సర్వే

కృతసంవిధానాః|

అగత్య తిల్వావనిమధ్య భాగం సభేశ్వరం

తుష్టువురాదరేణ||

పిమ్మట ఇంద్రుడు మొదలగు దేవతలందురు కలసి యాలోచించి తిల్వవన మధ్యమునకు వచ్చి ఆదరముతో నటేశ్వరుని స్తుతించిరి.

శ్లో|| నమోస్తు పీయూషమయూఖ లేఖావతం సితోత్తుఙ్గ

జటాకలాప!

నమోస్తు కారుణ్యపయోధితుఙ్గతరఙ్గశృఙ్గార

కటాక్షవీక్ష!||

అమృతకిరణములుగల చంద్రలేఖను భూషణముగా ధరించిన ఎత్తైన జలాజూటముగలవాడా! నీకు నమస్కారము. కారుణ్య సముద్రము యొక్క ఎత్తైన తరంగముల వంటి శృంగార కటాక్షవీక్షణములు గలవాడా! నీకు నమస్కారము.

శ్లో|| నమోస్తు లాలటాటవిలోచనోద్యత్కృశానుకీలావలి

దగ్ధకామ !

నమోస్తు కుమ్భీననరాజదీప్యత్ఫణామనిద్యోతిత

గణ్ణభాగ !

నుదిటి కంటి నుండి పుట్టిన అగ్ని జ్వాలాసమూహముచే మన్మధుని కాల్చినవాడా! నమస్కారము, సర్పరాజు యొక్క పడగలమీద వెలుగు మణులచే ప్రకాశించు గండభాగముల వాడా! నమస్కారము.

శ్లో|| నమోస్తు మన్దస్మితకాన్తి పూరసన్దగ్ధదైత్యేన్ద్ర

నివాసభూయే!

నమోస్తు దుగ్ధామ్భుధిజాతహాలాహలేన

కాలీకృతకణ్ఢమూల!

చిరునవ్వు కాంతి ప్రవాహచే రాక్షసేంద్రుని నివాస భూమిని కాల్చినవాడా! నమస్కారము. పాలసముద్రము నుండి పుట్టిన హాలాహలముచే నల్లనైన కంఠమూలముగలవాడా! నమస్కారము.

శ్లో|| నమోస్తు హేమాద్రిసుతాకుచాబ్జపాటీరపఙ్కాఙ్కి

తవక్ష సేతే!

నమోస్తు మాతఙ్గమహత్తరత్వక్పటాభిరామోరు

కటిప్రదేశ!

తామరపువ్వు వంటి పార్వతి రొమ్ములమీది గంధముతో గూడిన రొమ్ముగల నీకు నమస్కారము. ఏనుగు యొక్క గొప్ప చర్మము రూపమైన బట్టచే మనోహరమైన పెద్దదైన మొలగలవాడా! నమస్కారము.

శ్లో|| నమోస్తు కలా%్‌యణసభాన్తరాతవితన్య మానామిత

లాస్యభూమిన్‌!

అపాంపతే రస్య మహత్తరాఘం విమోచయాజ్ఞానౌ

భవం నటేశ!

కల్యాణ సభామధ్యమున అమితమైన లాస్యమును విస్తరింపజేయుచున్నవాడా! నమస్కారము. నటేశ! ఈజలాధిపతి కజ్ఞానము వలన కలిగిన మహాపాపమును బోగొట్టుము.

శ్లో|| ఇతి బ్రువాణషు సురోత్తమేషు పురోశరీరీ కిల

వాగథాసీత్‌!

వయం సముద్రస్య తటం సమేత్య

విమోతయామో వరుణస్య పాపమ్‌||

ఇట్లు దేవతాశ్రేష్ఠులు విన్నవింప పిమ్మట మేము సముద్రపుటొడ్డునకు వచ్చి వరుణుని పాపమును విడిపించెదమని ఎదుట ఆశరీర వాక్కు వినబడెను.

శ్లో|| ఇత్యేవమాకర్ణ్య సురాస్సమస్తాః వాణీమథానన్దర

సేన పూర్ణామ్‌|

యయుర్యథా స్వేషు గృహేషు పశా%్‌చత్కదాచి

దీశః కరుణాపయోధిః|

సమాగమనా%్‌మఘమఘే పయోధిం తత్సన్నిధానేన

స ముక్త అసీత్‌!

ఈ విధముగా ఆనందముతో నిండిన మాటను విని దేవతలందరు పిమ్మట వచ్చిన విధమున తమ యిండ్లకు వెడలిరి అనంతర మొకప్పుడు మాఘమాసమున దయాసముద్రుడగు ఈశ్వరుడు సముద్రమునకు వచ్చెను. వాని సాన్నిధ్యముచే వరుణుడు పాపవిముక్తుడయ్యెను.

శ్లో|| పాపైర్విముక్తో వరుణః పయోధిస్త్సోత్రైర్నమ

స్కారముఖై రథాన్యైః|

సన్తోషయిత్వా తు సభాధినాథమథావృణోదేష

వరం చ కఞ్చిత్‌|

సముద్రరూపుడైన వరుణుడు పాపవిముక్తుడై పిమ్మట నమస్కారపూర్వకమైన స్తోత్రములచేతను, ఇతరమైన వానిచేతను సభేశ్వరుని సంతోసపెట్టి అనంతరమతడొక వరమును గూడ కోరెను.

శ్లో|| స్వామిన్యథాస్మిన్సమయే త్వయాయం సంరక్షి

తోభూదవగాహనేవ|

తథైవ కాలే సమవాప్య మర్త్యా మజ్జన్తి యే

యాన్తు పరం పదం తే||

స్వామీ! ఈ సమయమున స్నానము వలన నీ చేతనితడు రక్షింపబడినటులే ఈ కాలమున వచ్చి స్నానము చేయు మానవులు పరమపదమును పొందుదురుగాక.

శ్లో|| ఇత్యేవయుక్తస్సలిలాధిపేన మహేశ్వరో భక్తవర

ప్రదాయీ!

తథేతి దత్వా వరమమ్బికయేశస్తిరోదధే దభ్రసభాధి

నాథః||

తస్మాన్మహీపాల! రవంత్వయాద్య కర్తవ్యమేతత్కిల తీర్థకర్మ!

అట్లేయని వరమునిచ్చి యంతర్ధానము నొందెను. కనుక భూపాల! నీవిప్పుడు శ్రేష్ఠమైన యీతీర్థకర్మ చేయవలెను.

సూత ః :

శ్లో|| ఏవముక్తో మహీపాలో వ్యాఘ్రపాదేన ధీమతా|

ఉత్తరే చైవ నక్షత్రే తీర్థకర్మార్థమాదరాత్‌||

సముద్రస్య తటం సమ్యగలంకృత్య మునీశ్వరాః||

తస్మిన్‌ దభ్రసభానాథం తీర్థయాత్రాకారయత్‌||

మునీశ్వరులారా! ధీమంతుడగు వ్యాఘ్రపాదుడీ విధముగా జెప్ప నాభూపతి ఉత్తర నక్షత్రమున తీర్థకర్మకొరకాదరముతో సముద్రపుటొడ్డును బాగుగ నలంకరించి యచ్చట దభ్ర సభానాథుని తీర్థయాత్ర చేయించెను.

శ్లో|| తతస్తత్సమయే సర్వే తీర్థార్థం కృతసంవిదః|

దేవాశ్చ మునయస్సర్వే సిద్దవిద్యాధరాశ్చ యే||

యక్షాశ్చ రాక్షసాశ్చైవ మానవాశ్చైవ కిన్నరాః|

సమాగత్య పయోరాశౌ సన్నురానన్దనిర్భరాః||

మరియు నా సమయమున తీర్థయాత్రకేగుట కందరు నేర్పాటు చేసికొని దేవతలు, మునులందరు, సిద్ధులు, విద్యాధరులు, యక్షులు, రాక్షసులు, మానవులు, కిన్నరులు వచ్చి ఆనందముతో నిండి సముద్రమున స్నానము చేసిరి.

శ్లో|| కేచిద్ధేమమయైః శృఙ్గైః కేచిన్మౌక్తికసమ్భవైః|

కేచిన్మరకతోద్భూతైః కేచినా%్‌మణిక్యసమ్భవైః|

కేచిత్రవాలకలితైః కేచిద్గోమేదనిర్మితైః|

నానావిధై రథాన్యైశ్చ మహారత్నాన్వితై స్తథా||

జలక్రీడామకుర్వంస్తే చాప్సరోభిరకనేకథా!

కొందరు బంగారపు కొమ్ములతోను, కొందరు ముత్యములతో చేసినవానితోను కొందరు మరకతముల నుండి యుద్భవించినవానితోను కొందరు మాణిక్యముల నుండి సంభవించిన వానితోను కొందరు పగడములతో చేయబడినవానితోను, కొందరు గోమేదములతో నిర్మింపబడినవానితోను ఇతరమగు పలు విధముల మహారత్నములతో కూడిన కొమ్ములతో వారప్సరసలగూడి అనేక విధముల జలక్రీడల జేసిరి.

శ్లో|| ఏవం తీర్థవిధిం కృత్వా దేవ దేవం నటేశ్వరమ్‌|

సభాం ప్రవేశయామాసురలంకారైరనిన్దితైః||

ఈ విధముగా తీర్థకృత్యమును నెరపి దేవదేవుడైన నటేశ్వరుని ఉత్తమమైన అలంకారములతో సభలో ప్రవేశ##పెట్టిరి.

శ్లో|| ఇతి సురగురుతుల్యైః తిల్వకారణ్యవిపై#్రః|

సకలనిగమ పారావారపారీణచిత్తైః||

ఫణికులతిలకేన వ్యాఘ్రపాజ్జైమినిభ్యాం|

ప్రతిదినముపచారై రర్చితోభూన్నటేశః||

ఈ విధముగా బృహస్పతితో సమానులు సమస్త వేద నిష్ణాతులునగు తిల్వారణ్యమందలి బ్రాహ్మణులచేతను శేషుని చేతను వ్యాఘ్రపారజై మినులచేతను నటరాజు ప్రతిదినము ఉపచారములతో పూజింపబడెను.

శ్లో|| అధ్యాయమేతం య ఇమం పఠన్తి|

శృణ్వన్తి నన్దన్త్యథ వా లిఖన్తి||

తేషామసౌ స్వర్ణసభాధినాథః|

సాయుజ్యమిష్టం చ ఫలం దదాతి|| 102

                        1444 1/2

ఈ యధ్యాయమును చదువు వారికి, వినువారికి, ఆనందించువారికి, వ్రాయువారికి, స్వర్ణసభాపతి సాయుజ్యమును, ఇష్టమైన ఫలమును ఇచ్చును.

ఇతి శ్రీ స్కాన్దే మహాపురాణ సనత్కుమార సంహితాయాం

శ్రీమహేశ్వరనన్ది సంవాదే చిదమ్బర మహాత్మ్యే

మహోత్సవవిధిర్నామ షడ్వింశోధ్యాయః

చిదంబర మాహాత్మ్యం సమ్పూర్ణమ్‌

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters