Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

అథ పఞ్చవింశో7ధ్యాయః

(మహోత్సవవిధి)

శ్లో|| వ్యాఘ్రాఙ్ఘ్రిప్రముఖై ర్మునీశ్వరగణౖ రాజ్యే7భిషిక్తః స్వకే|

సోదర్యౌ యువరాజుకౌ స నృపతిః శ్రీహేమవర్మాకరోత్‌||

భక్తానమ్య నటేశ్వరం పురమిదం దేవాలయం శిల్పిభిః|

నూత్నికృత్య చ పూజనోత్సవవిధిన్శమ్భో ర్వ్యధాద్ధీక్షితైః|

ఆరాజగు శ్రీహేమవర్మ, వ్యాఘ్రపాదుడు మొదలగు మునీశ్వరులచే తనరాజ్యమున అభిషకముచేయబడి సోదరుల నిద్దరను యవరాజులచే చేసెను. భక్తితో నటేశ్వరునకు నమస్కరించి శిల్పులచే పురమును, దేవాలయమును క్రొత్తదిగా చేయించి దీక్షితులచే శివునకు పూజలు ఉత్సవములు చేయించెను.

శ్లో|| అథ తస్మిన్మహాభాగే శివాజ్ఞాపరిపాలకే|

చకీర్షతి మహీపాలే శ్రీకార్యాణి దినేదినే||

పశ్యన్‌ సునియతం శమ్భోః పరమానన్దతాణ్డవమ్‌|

స్థితేషు తేషు సర్వేషు మునిష్వద్భుతశక్తిషు||

కదాచిదాగతశ్శ్రీమాన్‌ వ్యాఘ్రపాదో మహాతపాః|

సాదరస్తాన్మునీన్పశ్యన్నిదం వచనమబ్రవీత్‌|

పిమ్మట పరమపవిత్రుడు, శివజ్ఞను నెరవేర్చువాడునగు ఆరాజు నియతముగా శివుని పరమానందతాండవమును చూచుచు ప్రతిదినమున శివకార్యములను చేయదలచుచుండ అద్భుతమైన శక్తిగల మునులందరునుండుగా నొకప్పుడు శ్రీయతుడు మహాతపస్వియునగు వ్యాఘ్రపాదుడు వచ్చి ఆదరముతో నామునులను జూచి ఈ మాట పలికెను.

వాఘ్రపాదః :

శ్లో|| సత్యసన్ధో మహావీర్యో మనువంశసముద్భవః|

ఏనామేవ సదా పృథ్వీం పాలయత్వేష సువ్రతః||

వ్యాఘ్రపాదుడు :

సత్యసంధడు, మహాపరాక్రమవంతుడు, మనువంశోద్భవుడనగు నీపుణ్యవ్రతుడే ఈభూమిని ఎల్లప్పుడు పాలించుగాక.

శ్లో|| అక్షీణసంపదం కృత్స్నా మాత్మీయా వనుజావుభౌ|

¸°వరాజ్యే స్థితావేతౌ పాలయేతామరిన్దమౌ||

శత్రువిజేతలై ¸°వరాజ్యమునందున్న వీనిసోదరు లిద్దరలు మిగిలినయసంతసంపదను పాలించెదరుగాక.

శ్లో|| ఇతి తస్వచశ్శ్రుత్వా తే సర్వే మునిపుఙ్గవాః|

వ్రహర్షమతులం ప్రాపుఃప్రశశంసుశ్చ తంమునిమ్‌||

వాని యీమాటలువిని యామునిశ్రేష్ఠులందరు మిక్కిలి సంతసించి యామునిని పొగడిరి.

శ్లో|| యథావిధి విధాయైనం కృతవైవాహికక్రియమ్‌|

అభిషేకాయ తస్యాథ సమయాహేమసంపదమ్‌||

దేవతాభిస్సమస్తాభిస్సర్వదిక్షు నిషేవితమ్‌|

మణ్డపం కారయామాసుస్సర్వమణ్డనమణ్డితమ్‌||

యథావిధిగా వానికి వివాహముచేసి అభిషేకముకొరకు హేమసభకుదగ్గరగా అన్నిదిక్కులయందు దేవతలతో కూడినదియు; సర్వాలంకారముతో నలంకరింపబడినదియు నగు మండపమును నిర్మింపుజేసిరి.

శ్లో|| మనోహరాభిర్మాలాభిరథ కాఞ్చనతోరణౖః|

సింహాసనేన దివ్యేన మణిదీపైర్మనోహరైః |||

సమ్బద్ధతన్తుభిః కుమ్భైః కలశానాం చ మాలయా

కల్యాణకలితైః పుషై#్పర్లాజైరాజ్యైస్సమిత్కుశైః||

తస్య మధ్యమలఙ్కృత్య మణ్డిపస్య మనోహరమ్‌|

సర్వే తత్ర నిశీథిన్యామధివాసం వితేనిరే ||

పిమ్మట మనోహరమైన మాటలతోను, బంగారపు తోరణములతోను, దివ్యమైన సింహాసనముతోను, మనోహరమైన మణిదీపములతోను, దారములతోకట్టిన కడవలతోను, కలశలవరుసలతోను, శుభ్రలప్రదమైన పుష్పలములతోను, పేలాలతోను, నేతులతోను, సమిధలతోను, కుశలతోను, ఆమండపముయొక్క మధ్యభాగమును మనోహరముగా నలంకరించి అందరునారాత్రి అక్కడనే ఉండిరి.

శ్లో|| అన్యేద్యుః ప్రత్యుషస్యేవ యతావిహితక్రమభిః |

సుముహూర్తే మునీన్ద్రైసై#్తరభిషిక్తో7భవన్నృపః||

మరునాడు మునీంద్రులుషఃకాలముననే యథావిధిగా కృత్యములు నెరవేర్చుకొని మంచిముహూర్తమున రాజునకభిషేకముచేసిరి.

శ్లో|| మకుటం హేమమాలాం చ దధత్ఖడ్గం జయావహమ్‌|

స్వముద్రయా తదా చక్రే దివసగ్రహణం ప్రభుః||

కిరీటమును, బంగారుమాలను, జయమునుకలిగించు ఖడ్గమును ధరించుచు ప్రభువుతనముద్రతో దినవ్యాపారమును చేసెను.

శ్లో|| అథౌసౌ వ్యాఘ్రపాదాయ శిరసా మౌలిశోభినా|

ప్రహృష్టాయ నమశ్చక్రే పితృకల్పాయసాదరమ్‌||

పిమ్మట రాజు కిరీటముతో ప్రకాశించు శిరస్సుతో సంతోషించునట్టియు, తండ్రితో సమానుడైన వ్యాఘ్రపాదునకు ఆదరముతో నమస్కరించెను.

శ్లో|| సో7పి చైనం సముత్థాప్యం పరిష్వజ్య పునఃపునః|

అశీర్వాదఞ్చ దత్వాసై#్మసామ్రాజ్యపదోశోభినే||

వ్యాఘ్రధ్వజం దదావసై#్మ వరం రాజ్ఞాం సుదుర్లభమ్‌||

అతడు వీనిని లేవదీసి మరలమరల కౌగిలించుకొని సామ్రాజ్యపదమున ప్రకాశించు వానినాశీర్వదించి రాజులకు మిక్కిలి దుర్లభ##మై శ్రేష్ఠమగు వ్యాఘ్రధ్వజమునిచ్చెను.

శ్లో|| అవలమ్బ్య కరేణౖనం ప్రవిశ్యాశు చిదమ్బరమ్‌|

పుష్పాఞ్జలిం నటేశాయ కరాయిత్వా మహీభుజా||

నిదధే తత్పదామ్భోజమస్య మూర్ధ్ని చిరంమునిః|

చేతితో వానిని పట్టుకొని చిదంబరమును ప్రవేశించి నటేశ్వరునకు రాజుచే పుష్పాంజలిసమర్పింపజేసి నటేశునిపాదపద్మమును రాజుతలమీద ముని చాలసేపుంచెను.

శ్లో|| అథ దృష్ట్వాస్యమాహత్మ్యం దేవై రపిసుదుర్లభమ్‌|

ప్రశశంసుర్మహీనాథమధికం తే మునీశ్వరాః ||

పిమ్మట దేవతలకుకూడ దుర్బభ##మైన వానిగొప్పతనమును చూచి మునీశ్నరులు రాజును మిక్కిలిపొగడిరి.

శ్లో|| తదనుగ్రహలాభేన రాజా సన్తుష్టమానసః|

ఇతి విజ్ఞాపయామాస దేవదేవం కృతాఞ్జలిః ||

వానియనుగ్రహము లభించుటచే రాజు మనస్సున సంతసించి దోసిలొగ్గి దేవదేవునికిట్లు విన్నవించెను.

శ్లో|| అస్మద్వంశ్యైర్యథానీతి యద్ధనం సముపార్జితమ్‌|

తత్సర్వమధునా దేవ! భవతో7స్తు మహేశ్వర!

దేవ! మహేశ్వర! నావంశీయులు నీతననుసరించి సంపాదించిన ధనమంతయునిపు నీదగుగాక.

శ్లో|| అతఃపరం మయాప్యత్రనీత్యాయస్తు ప్రలభ్యతే|

అంశషష్ఠో మహీదత్తః తస్మాదంశో7పి పంచముః ||

ఇటుపిమ్మట భూమినుండివచ్చినదానిలో నీతితో పాలించినందులకు నాకువచ్చెడి యారవభాగములో అయిదవభాగముకూడ నీదగుగాక.

శ్లో|| సైనికాశ్చ మహేశాన! యేచాన్యే మమవంశజాః|

అజ్ఞానాదథవా మోహాద్యది కుర్యుస్తవాప్రియమ్‌||

మహేశ్వర! సైనికులు, నావంశీయులు ఆజ్ఞానము వలనగాని మోహమువలనగాని నీకప్రియముచేసినయెడల దేవ! ప్రభూ! దయాదృష్టితో వారినికూడ తరింపజేయుము.

శ్లో|| తతో మాధ్యన్దినిశ్శీమాన్‌ వ్రహృష్టం తం జనేశ్వరమ్‌|

మూలస్థానమహేశానం ప్రణమ్యయ్‌ వినిర్య¸°||

పిమ్మట శ్రీవ్యాఘ్రపాదుడు సంతసించన యానృపతిచే మూలస్థానేశ్వరునకునమస్కరింపజేసి వెడలిపోయెను.

శ్లో|| వారణన్ద్రం సమారుహ్య తతస్తత్ర మహీపతిః |

జయావహైర్మహాశంఖైః ధీరనాదైశ్చ కాహలైః ||

గచ్చద్భిః పురతో మన్దం కృతస్తోత్రైశ్చ వన్డిభిః |

ధ్వజచ్ఛన్ననభోభాగైః సైనికైః పార్శ్వయాయిభిః ||

సేవితశ్శనకైః కృత్వా పురస్యాస్య ప్రదక్షిణమ్‌|

వివేశ భవనం స్వీయం సర్వమఙ్గలసంయుతమ్‌||

పిమ్మట నచ్చట రాజు గజేంద్రమునెక్కి జయమును తెలుపు మహాశంఖములచేతను గంభీరధ్వనిగల కాహలములచేతను, స్తోత్రములచేయుచు ముందు మెల్లగానడచు వందులచేతను, జండాలతో ఆకాశమును కప్పుచున్న సైనికులచేతను, ప్రక్కల అంగరక్షకులచేతను, సేవింబడుచు మెల్లగానాపుర మునకు ప్రదక్షిణముచేసి సర్వమంగళముతో కూడిన తనభవనమును ప్రవేశించెను.

శ్లో|| తత్ర సింహాసనం చారుసమధ్యాస్యస పైకృతకమ్‌|

అనుజౌ తౌ సమాహూయ వీరౌ కల్యాణలక్షణౌ||

రాజచిహ్నాని సర్వాణి తాభ్యాం ద్వత్వా మహీపతిః|

హేమకుమ్భగతై స్తీర్థైః ¸°వరాజ్యే7భిషిచ్య తౌ||

సేనయా సహ రాజానౌ అనుజౌ మనుజాధిపౌ||

పాతుం ప్రస్థాపయామాస పితృపైతామహీం మహీమ్‌|

అక్కడ తండ్రిసంబంధమై అందమగు సింహాసనము నెక్కి వీరులు శుభలక్షణములుగలవారునగు తమ్ములనిద్దరను పిలచి రాజచిహ్నములన్నిటిని వారికిచ్చి రాజు బంగారుకల శములలో తీర్థములతోవారిద్దరికి ¸°వరాజ్యమున నభిషేకముచేసి సోదరులగు యువరాజుల నిద్దరను తండ్రితాతల నుండి వచ్చుచున్న రాజ్యమును పాలించుటకు పంపెను.

శ్లో|| అథాభిషిక్తౌ తౌ ప్రీతౌ ప్రణిపత్య నటేశ్వరమ్‌|

జగ్మతు స్సేనయా సాకం స్వీయం రాజ్యం శ##నైశ్శనైః ||

పిమ్మట అభిషిక్తులైన వారిద్దురును సంతుష్టులైనటేశ్వరునకు నమస్కరించి సేవతోకూడ మెల్లమెల్లగా తమరాజ్యమునకేగిరి.

శ్లో|| తతస్స వసుధానాథః వ్యాఘ్రపాదతపోనిధిమ్‌|

వినయేన నమస్కృత్య మన్దమేవం వ్యజిజ్ఞపత్‌||

పిమ్మట ఆరాజు వ్యాఘ్రపాదమునికి వినయముతో నమస్కరించి మెల్లగానిట్లు విన్నవించెను.

శ్లో|| చిదమ్బరంమిదం దివ్యం నవీకర్తుమిహోత్సహే|

ఏతేషాం చ సమస్తానాం మునీనాం దివ్యతేజసామ్‌||

అశ్రమాణి విశాలాని చికీర్షామి సమన్తతః |

ఈదివ్యమైన చిదంబరమును క్రొత్తదిగాజేయ నుత్సాహపడుచున్నాను. దివ్యతేజోవంతులైన ఈమునులందరియాశ్రమములనుగూడ అంతట విశాలముచేయదలచుచుంటిని.

శ్లో|| తదర్థమనుజానీహీత్యుక్త్వా తేనాథ సమ్మతః |

విశ్వకర్మాణమాహూయ వ్యాదిదేశోభయంనృపః ||

రాజు దానికొరకనుమతింపుమని యడిగి అతుడ సమ్మతింప విశ్వకర్మను పిలచి రెండుపనుల నాజ్ఞాపించెను.

శ్లో|| స తధేతి ప్రతిజ్ఞాయ సర్వశాస్త్రవిశారదః |

బహుప్రపఞ్చవిలసత్పఞ్చావరణసంయుతమ్‌||

ఉత్తుఙ్గతోరణోత్తాలసాలగోపురశోభితమ్‌|

అనేకమణ్డపాకీర్ణమాభాతమణికుట్టిమమ్‌||

అలక్ష్యచిత్రసోపానమాధారో త్తమ్భితధ్వజమ్‌|

అష్టాపదమహాపట్టబద్ధాట్టాలకసంయుతమ్‌||

మహార్ఘవజ్రఘటితజ్వాలాజౌలవిశోభితమ్‌|

తప్తచామీకరాలి ప్తసర్వభిత్తివిరాజితమ్‌||

విలసద్విద్రుమోత్కీర్ణవిటఙ్కోట్టఙ్కితామ్బరమ్‌|

వలమానమహోవీచీవైడూర్యమకుటోజ్జ్వలమ్‌||

మహానీలస్ఫురద్వేదిమాణిక్యస్తమ్భమణ్డితమ్‌|

ముక్తావిరచితోద్వీచిరోచిఃకవచితామ్బరమ్‌||

హరిన్ముణిశిలాపట్టఘటితాలిన్దవిభ్రమమ్‌|

అనేకాశ్చర్యనిలయమనేకదిత్యసన్నిభమ్‌|

అనకచన్ద్రప్రతిమమవనీతలభూషణమ్‌|

హరిగేహతిరస్కారిహసితేన్ద్రమహాగృహమ్‌||

అధరీకృతదిక్పాలభవనస్తోమవైభవమ్‌|ష

అవర్ణీనీయవైచిత్ర్యమవాఙ్మనసగోచరమ్‌||

శ్రీ మచ్చకార పరమం దేవతక్షా చిదమ్బరమ్‌|

సమస్తశాస్త్రములలో నిపుణుడైన యాదేవశిల్పిఅట్లేయని ప్రతిజ్ఞచేసి శోభతోకూడిన ఉత్తమమైన చిదంబరమును నిర్మించెను. అదియనేకరచనలే ప్రకాశించు ఐదుప్రాకారములుగలది. ఎత్తైన గృహద్వారములతోను ఉన్నతప్రాకారములతోను ఆకాసమునంటు గోపురుములతోను అలంకరింపబడినది, చాలమండపములతో కూడినది. ప్రకాశించు మణులునాటిన ప్రదేశములుగలది. కనబడని చిత్రములతో కూడిన మెట్లుగలది. అడుగున ఎత్తబడిన జెండాలుగలది. పెద్ద బంగారపురేకులతో కట్టబడిన మేడలుగలది. విలువగల వజ్రములచే కూర్చబడిన కాంతిసమూహములచే ప్రకాసింపజేయబడినది. గోడలన్నియు మేలిబంగారముతో పూయుటవలన ప్రకాశించునది. విలసిల్లు పగడములునాటిన పావురపుగూళ్ళచే ఆకాశమునంటుచున్నది. వ్యాపించు కాంతిరంగములుగల వైడ్యూర్యశిఖరములతో వలిరాజిల్లునది. పెద్ద ఇంద్రనీలములతో ప్రకాశించు అరుగులచేతను మాణిక్య స్తంభములచేతను అలంకరిపంబడినది. ముత్యములనుండి పుట్టి పైకిప్రసరించు కాంతులచే ఆకాశమునుకప్పుచున్నది. పచ్చలచే నిర్మింపబడిన ఇంటి ముంగిలగదులుగలది. అనేకాశ్చర్యములకు తావైనది. అనేక సూర్యులతో సమానమైనది. అనేకచంద్రులతో సమానమైనది. భూమికి అభరణమువంటిది. విష్ణుమందిరమును తిరస్కరించు నది. ఇంద్రునిగృహమును నవ్వునది. దిక్పాలుర గృహముల వైభవమును తక్కువచేయునది. వర్ణింపశక్యముకాని వైచిత్య్రముగలది. వాక్కునకు మనస్సునకు గోచరముకానిది.

శ్లో|| తథామునీనాం సర్వేషాం సహస్రత్రిత యాత్మనామ్‌|

సహర్మ్యాణి మనోజ్ఞాని సశృఙ్గాణి సమన్తతః ||

సశాతకుమ్భకుమ్భాని ససాలవలయాని చ|

ద్వారతోరణకాన్తాని సువీథీపథభాఞ్జ చ||

అనేకాశ్చర్య సంయుక్తావ్యాశ్రమాణి యథాసుఖమ్‌|

విచిత్రాణి తథా చక్రే విశ్వకర్మా మహాతపాః||

మహా తపస్వియైన విశ్వకర్మ అట్లే మూడు వేల మంది మునులందరి యాశ్రములను భవనములతో కూడినవిగను మనోహరములుగను అంతట శిఖరములు కలవిగను బంగారు కలశములు కలవిగను, చుట్టు ప్రాకారములు కలవిగను ద్వారమందలి తోరణములచే సుందరములుగను సుఖముగలవిగను విచిత్రములుగను జేసెను.

శ్లో|| తతస్స రాజా పుణ్యాయాం తిథావృక్షే ధ్రువాభిధే|

మహనీయే మహాలగ్నే వాస్తుశాన్తి పురస్సరమ్‌||

సర్వాన్ర్పవేశయామాస వితతానాశ్రమాన్మునీన్‌|

పిమ్మట ఆ రాజు పవిత్రమైన తిథియందు ధ్రువానక్షత్రమున ఉత్తమమైన మహాలగ్నమున వాస్తు శాంతి చేయించి విశాలమైన ఆశ్రయములన్నిటియందు మునులను ప్రవేశ##పెట్టెను.

శ్లో|| అథ తత్ర నటేశస్య లోకానుగ్రహకారిణః||

శ్రీమన్మజ్జన పూజాద్యం సర్వమవ్యుత్సవక్రమమ్‌||

వేదోక్తసుప్రకారేణ సర్వలోక ప్రవృద్ధయే|

మునిభిస్తెస్సమం రాజా శ్రీమాన్కర్తుంకృతాదరః||

వ్యక్తంపాతఞ్జలం శాస్త్రం దేవోత్సవవిధాయకమ్‌|

అరోప్య వారణస్కన్ధం తూర్యవాదపురస్సరమ్‌||

పురం ప్రదక్షిణీకృత్య సభాం ప్రావేశయచ్ఛనైః|

పిమ్మట లోకక్షేమము కొరకు రాజక్కడ లోకమును గ్రహించెడి నటేశునకు తిరుమంజనము, పూజ, మొదలగు ఉత్సవక్రమమునంతను వేదోక్తమైన మంచి విధానమున ఆ మునులతో కూడ చేయుట కారరము కలవాడై స్పష్టముగా దడేవోత్సవవిధానమును తెలుపు పాతంజల శాస్త్రమును ఏనుగుమూపు మీదబెటి%్‌ట మంగళ ధ్వనులతో పురమును ప్రదక్షిణము చేసి మెల్లగా సభలో ప్రపవేశ##పెట్టెను.

శ్లో|| తతస్తే మేయస్సర్వే తాదాలోక్య ధ్రుతాదరాః|

మాసర్త్వయన నక్షత్రం నిశ్చత్య సమయోచితమ్‌||

తద్దృష్టవిధివా జ్ఞాత్వా తాణ్ణవేశమహోత్సవాన్‌|

హిరణ్యవర్మణ రాజ్ఞే సర్వమేవం న్యవేదయన్‌|

పిమ్మట ఆ మనులందరు దానిని చూచి ఆదరముకల వారై సమయమునకు తగినమాసమును ఋతువును ఆయన మును నక్షత్రమును నిశ్చయించి దానిలో చెప్పిన విథమున నటేశ్వరుని మహోత్సవములను తెలిసికొని దాని నంతను రాజగు హిరణ్యవర్మకు తెలిపిరి.

శ్లో|| నివేదితమసౌ శ్రుత్వా బూపస్తెరుత్సవక్రమమ్‌|

యథా దృష్టం తథా కర్తుం మనసాకృత నిశ్చయంః||

జ్యేష్ఠమాసి తతః పూర్వం పార్ధివాఖ్యే చవత్సరే|

ఫల్గున్యోః పూర్వయోః రాజా చ్రన్ద చూడస్య శూలినః||

ఉత్సవం కల్పయామీతి తథా కర్తుం వ్రచక్రమే||

రాజు వారు తెలిసిన ఉత్సవక్రమునంతను విని శాస్త్రములో నున్న విధమున చేయుటకు మనస్సులో నిశ్చయించి పిమ్మట మొదట పార్ధివ సంవత్సరమున జ్యేష్ఠ మాసమున పూర్వ ఫల్గునీ నక్షత్రమున రథోత్సవము నేర్పాటు చేయుదునని అప్పుడు చేయుటకారంభించెను.

శ్లో|| వైదికైసై#్తస్తపశ్శుద్ధైస్సంహితై ర్మునిసత్తమైః|

దేవయాగక్రియా యోగ్యం త్రిగుణం నవవాసరమ్‌|

నటేశభ్రమనం తీర్థాత్పూర్వేద్యుః ప్రవిధాయచ|

సమాహూయ క్రమాత్సద్యః సర్వానేవ సురో త్తమాన్‌|

సంకల్పం మ కారయామాస ధ్వజారోహణిమగ్రతః|

వేదవేత్తలు, తపస్సుచే పవిత్రులునగు మునులందరితో పూర్వదానమున తీర్థము నుండి నటేశుని ఊరేగించి యపుడు క్రమముగా దేవతలనందరను పిలచి దేవవయాగ చేయుటకు తగిన ఇరువది యేడు రోజులు ధ్వజారోహణము మొదలుగా ఉత్సవము చేయుటకు సంకల్సము చేయించెను.

శ్లో|| తతస్సర్వే దివిషదో నిఖిలా దివ్యయోషితః|

మానవాశ్చ మహీపాశ్చ మునయో దివ్యతేజసః||

గోపురాణి ధ్వజం కాన్తం సత్కృతం నగరీపథమ్‌|

దృష్ట్వా చ బహవస్త్సుత్వాననృతుః పరయాముదా||

పిమ్మట అందరు దేవతలు, దేవాంగనలు, మానవులు, మహీపాలురు, దివ్యతేజోవంతులగు మునులు గోపురములను సుందరమైన ధ్వజమును అలంకరించిన నగర మార్గమును చూచి చాల మంది స్తోత్రముచేసి మిక్కిలి సంతోషముతో నృత్యము చేసిరి.

శ్లో|| భానువారాదివారాణాం భూషణాన్యపి సాదరమ్‌|

పారిబర్హాణ్య శేషాణి తుఙ్గసింహాసనం శుభమ్‌|

రత్నదణ్ణం సితచ్ఛత్రమనేకానృషభధ్వజాన్‌|

బద్ధ్వా చ ద్వారదేశేషు తోరణాని నిరన్తరమ్‌||

క్షణన తాం పురీం దివ్యామలఞ్చక్రుః పురాఙ్గనాః|

ఆదివారము మొదలేడు వారముల నగలు, సమస్తమైన పెండ్లి కానుకలు, శుభ##మైన ఉన్నత సింహాసనము, రత్నదండము, తెల్లని గొడుగు అనేకమైన ఋషధ్వజములను నటరాజుకిచ్చి పురస్త్రీలు ద్వార ప్రదేశములందు దట్టముగా తోరణములు కట్టి దివ్యమైన యాపురమును క్షణములో నలంకరించిరి.

శ్లో|| అమ్బికారమణ వీథీమలం కుర్వతి మన్థరమ్‌|

దేవాస్సేన్ద్రాస్స మాసాద్య పుల్లపద్మసమాననాః||

తన్మయత్వాచ్చ భావానాం తన్మయత్వేన చేతసాన్‌|

ఆనన్దలహరీ పూర్ణాః దృష్టతత్వా ఇవాభవన్‌||

పార్వతీపతి మెల్లగా వీథిలో బ్రవేశింపగా విడిచిన తామర పువ్వు వంటి ముఖముగల దేవతలింద్రునితో గూడ వచ్చి భావములు, చిత్తములు శివమయమగులవలన ఆనందప్రవాహముతో నిండి తత్త్వదర్శనము చేసిన వారువలెనైరి.

శ్లో|| ఆషాఢాఖ్యేచ తేమాసి వారిదాకులితామ్బరే|

కల్పయామాసురీశస్య జలక్రీడా మహోత్సవమ్‌||

న్యూవాధిక్య వినాశాయకల్సయా యాసురాదరాత్‌|

మేఘములతో నిండిన యాకాశముగల ఆషాడమాసమున వారీశ్వరునకు జలక్రీడా మహోత్సవమును (తెప్ప ఉత్సవము) ఏర్పరచిరి. ఈ యుత్సవమును పూర్వము చేసి యుత్సవములోని హెచ్చుతగ్గు దోషములు పోవుట కాదరముతో చేసిరి.

శ్లో|| శ్రవాణ మాసి దేవస్య మఖదీక్షాపురస్సరమ్‌

సహ పుష్పవిమానేన పవిత్రారోవణోత్సవమ్‌|

యథావిధి వితేసుస్తే మునయశ్చ మహీపతిః|

ఆ మునులు, రాజు శ్రావనమాసమున యజ్ఞదీక్ష వహించి పుష్పవిమానముతో దేవునకు పవిత్రారోపణోత్సవమును యథావిధిగా జేసిరి.

శ్లో|| శుభే భాద్రపదే మాసి సర్వసస్య సమృద్ధయే|

కారుణ్య రూపిణశ్శమ్భోరష్టమీదివసోత్సవమ్‌||

శుభ##మైన భాద్రపదమాసమున సమస్తమైన పంటల వృద్ధి కొరకు దయాస్వరూపుడైన శివునకు అష్టమీ దివసోత్సవము నేర్పరచిరి.

శ్లో|| మాసి చాశ్వయుజే హృష్టే నీలకణ్ఠకులాకులే|

తారే చభానుదై వత్యే సర్వలోకహితోత్సవమ్‌||

నెమిళ్ళతో నిండి సంతోషముతో కూడిన ఆశ్వయుజ మాసమున సూర్యదేవతాకమైన పూర్వఫల్గునీ నక్షత్రమున సర్వలోకహితోత్సవమును (కళ్యాణోత్సవము) చేసిరి.

శ్లో|| జగన్మాతురుమాదేవ్యాః నయనానన్దకారణమ్‌|

కార్తికే మాసి దేవస్య పరం దీపావలీమహమ్‌||

దేవునకు కార్తీక మాసమున జగన్మాతయగు పార్వతి కన్నులకానందమును గలుగ జేయు నుత్కష్టమైన దీపావళీ యుత్సవము జేసిరి.

శ్లో|| మార్గశీర్షే తథా మాసి రౌద్రయుక్తే శుభే దినే|

తపోధనాస్తు సంభూయ సేవార్థం కృతసంవిదః||

అగస్తశ్చ పుల స్త్యశ్చ విశ్వామిత్రః పరాశరః|

వామదేవో వసిష్ఠశ్చ జై మినిర్మునిభిర్వృతః||

భరద్వాజో భృగుశ్చైవ కణ్వః కాశ్యప ఏవ చ|

యేచైవాన్యే మునిశ్రేష్ఠాః తే సర్వే తిల్లకావనమ్‌||

అవాస్య శివగజ్గాయామవగాదహ్యాప్యనుత్తమమ్‌|

ప్రదక్షిణత్రయం కృత్వానమస్కృత్య సభేశ్వరమ్‌||

పరమానన్ద సన్దోహసాన్ద్రస్వాన్తాశ్చ తుష్టువుః|

అట్టే మార్గశీర్ష మాసమున రుద్రసంబంధమైన ఆర్ద్రా నక్షత్రముతో కూడిన శుభదినమున తపోధనులు కలిసి సేవ కొరకేర్పాటు చేసికొని అగస్త్యుడు , పులస్త్యుడు

విశ్వామిత్రుడు, పరాశరుడు, వామదేవుడు, వసిష్ఠుడు, శిష్యులతో కూడిన జైమిని, భరద్వాజుడు, భృగువు, కణ్వుడు, కాశ్యపుడు, ఇతరమైన మునిశ్రేష్ఠులు అందరును తిల్లవనమునకు వెళ్ళి ఉత్తమమైన మూడు ప్రదక్షిణములు చేసి నటేశ్వరుని నమస్కరించి పరమానందముతో నిండిన మనస్సుతో స్తుతించిరి.

శ్లో|| హరిణా కోల రూపేణ బ్రహ్మణా హంసరూపిణా|

యస్యాద్యన్తౌ న దృష్టౌ తం ప్రణమామి నటేశ్వరమ్‌||

వరాహరూపముతో విష్ణువు, హంసరూపముతో బ్రహ్మయు ఎవని మొదలు, చివర చూడలేకపోయిరో అట్టి నటేశ్వరునకుయ నమస్కారము.

శ్లో|| నమస్తే విశ్వరూపాయ నమస్తే కామవైరిణ|

నమస్తే కాలకాలాయ నమస్తే శూలపాణయే||

నమస్సృష్టిస్థితిధ్వంసకారిణ కరుణాత్మనే|

ప్రపంచ స్వరూపుడవు, మన్మధునకు వైరివి, యమునకు గూడ యముడవు, శూలమునుచేతిలో ధరించినవాడవు, సృష్టి స్థితి లయయులను జేయువాడవు, దయాస్వరూపుడవునగు నీకు నమస్కారము.

శ్లో|| ఇతి స్తుత్వా మునిశ్రేష్ఠాః సాష్ఠాఙ్గం ప్రణిపత్య చ|

ఐశ్వర్యమతులం లబ్ధ్వా గచ్ఛన్తి స్మయథాగతమ్‌|

ఈ విధముగా స్తోత్రము చేసి ముని పుంగవులు సాష్టాంగముగా నమస్కరించి సాటిలేని యైశ్వర్యమును పొంది వచ్చిన విధమున వెళ్ళిరి.

వ్యాఘ్రపాదః

శ్లో|| తస్మాత్త్వయాద్య కర్తవ్య ఉత్సవః పరమేష్ఠినః|

దివసస్యాస్య మహాత్మ్యం వక్తుం వర్షశ##తైరపి||

నశక్నోమి నృపశ్రేష్ఠ! తస్మాత్కర్తవ్య అదరాత్‌|

వ్యాఘ్రపాదుడు ః

కనుక నీవిప్పుడు పరమేశ్వరునకుత్సవము చేయవలెను. రాజపుంగవ! ఈ దినము యొక్క మహాత్మ్యమును నూరు సంవత్సరములకైనను చెప్పలేను. కనుక ఆదరముతో జేయవలెను.

సూతః :

శ్లో|| ఇతి తస్య వచశ్శ్రుత్వా త్రిసహస్రద్విజాతయః|

విజ్ఞప్తాస్తేన భూపేన స్నానార్థన్తు సభాపతేః||

తస్మాత్స్వమిన్మహద్దివ్యమద్యేతి ప్రీతచేనసః|

నవతీర్థసముద్భూతం తోయమాదాయ సాదరాత్‌||

సమ్భూయ పరమాభక్త్యామన్త్రపూతేన వారిణా|

అభిషేకవిధిం చక్రురమలస్య సభాపతేః||

అని వాని మాటవినివ రాజు సభాపతి స్నానము కొరకు మూడు వేలమంది బ్రాహ్మణులకు విన్న వించెను. స్వామీ! ఇప్పుడు చాల దివ్యమైన సమయమని సంతుష్టచిత్తులై వారు తొమ్మిది తీర్థములందు పుట్టిన నీటిని తీసికొని వచ్చి కలసి మిక్కిలి భక్తితో మంత్రములచే పవిత్రమైన నీటితో నిర్మలుడైన సభాపతికభిషేక క్రియను నిర్వర్తించిరి.

శ్లో|| కృత్వాభిషేకం కృతమామాలమాలామాబద్ధ్య

మూర్ధ్యన్యవనీసురేన్ద్రాః|

నైవేద్యమావేద్య నటేశ్వరాయ సంప్రీణయామాసు

రథోవచారైః|| 84 1/2

బ్రాహ్మణులు నటేశ్వరునకు అభిషేకముచేసి శిరస్సున కృతమాలపుష్పముల మాలను కట్టి నైవేద్యము పెట్టి ఉపచారములతో సంతోషింపజేసిరి.

ఇతి శ్రీ స్కాన్దే మహాపురాణ సనత్కుమార సంహితాయాం

శ్రీమహేశ్వరనన్దిసంవాదే చిదమ్బర మహాత్మ్యే

మహోత్సవవిధిర్నామ పఞ్చవింశోధ్యాయః

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters