Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

అథ త్రయోవింశో7ధ్యాయః

(వ్యాఘ్రపాదహిరణ్యవర్మసంవాదము)

శ్లో|| శ్రీమాన్‌ వ్యాఘ్రపదోపదిష్టమనురాగత్యాథ రాజా సభాం|

అద్రాక్షీచ్ఛివాతాణ్డవం స ముదితస్తుష్టావ భక్త్యా శీవమ్‌||

శ్రీమూలేశ్వరమర్చయన్నథ గతో మాధ్యంది నేరాశ్రయం|

అశ్రౌషీచ్చ చిదమ్బరస్య మహిమానన్యాదృశం వైభవమ్‌||

పిమ్మట శ్రీయుతుడైన రాజు వ్యాఘ్రపాదునిచే మంత్రముపదేశింపబడి సభకువచ్చి శివతాండవమునుజూచి సంతోషించి భక్తితో శివుని స్తుతించెను. పిమ్మట మూలస్థానేశ్వరుని పూజించి వ్యాఘ్రపాదుని యాశ్రమమునకేగి చిదంబరముయొక్క మహిమను సాటిలేనివైభవమును వినెను.

శ్లో|| తతో మాధ్యందిని స్తస్య మహీపస్య మహాతపాః|

ఉపదిశ్య మహామన్త్రమక్షయానన్దకారణమ్‌||

వేదానామపి తం మృగ్యం యోగిబృన్దని షేవితమ్‌|

దర్శయామాస భూపాదివ్యంతత్రచిదమ్బరమ్‌||

పిమ్మట మహాతపస్వియైన వ్యాఘ్రపాదుడు ఆరాజునకు అక్షయమైన యానందమునిచ్చెడు మహామస్త్రమునుపదేశించి వేదములకుగూడ వెతుకదగినది, యోగిసమూహముచే సేవింపబడునది, దివ్యమైనదియునగు చిదంబరము నారాజున కచ్చటజూపెను.

శ్లో|| నటేశో7పి తదా తసై#్మ కారుణ్యార్ణవచన్ద్రమాః|

తాణ్డవం దర్శయామాస సచ్చిదానన్దలక్షణమ్‌||

దయాసముద్రమనకు చంద్రుడైన నటేశ్వరుడుకూడ వానికపుడు సచ్చి దానందరూపమైన తాండవమును జూపెను.

శ్లో|| ఆలోక్యాక్షిసుథాసారమంగహారమనోహరమ్‌|

ఆనన్దతాణ్డవం శమ్భోరవాఙ్మానసగోచరమ్‌||

ప్రస్విన్నసర్వావయవః ప్రస్ఫురత్పులకోత్కరః|

ప్రసృతానన్దసలిలః ప్రౌఢగద్గదికస్వరః||

ప్రణమ్య దణ్డవద్భూమౌ దేవదేవం సబాపతిమ్‌|

బద్ధాఞ్జలిరథోత్థాయ స్తుత్వాస్తుతిభిరీశ్వరమ్‌||

పరమానన్దవివశస్స రాజేతివ్యజిజ్ఞపత్‌|

ఆ రాజు కన్నులకమృతసారమైనది, శరీరముకదలికలచే మనోహరమైనది, వాక్కునకు, మనస్సునకు గోచరముకానిది యునగు ఈశ్వరుని యానందతాండవమును చూచి సమస్తావయవములు చెమటపట్టినవాడు, ఒడలుగగుర్పొడిచినలవాడు, ఆనందాశ్రువులుస్రవించినవాడు, ప్రౌఢమైన గద్గదస్వరము గలవాడునై దేవదేవుడగు సభాపతికి సాష్టాంగముగా నమస్కరించి పిమ్మట లేచి దోసిలొగ్గి ఈశ్వరుని స్తుతించి పరమానందముచే వివశుడై ఇట్లు విన్నవించెను.

శ్లో|| ఇన్ద్రోపేన్ద్రాదిదుర్దర్శమిన్దులేఖావతంసకమ్‌|

అనన్దతాణ్డవమహమద్రాక్షం త్వదనుగ్రహాత్‌||

ఇంద్రునకు విష్ణువునకుగూడ చూడశక్యముకానిది, చంద్రరేఖను శిరోభూషణముగా ధరించినదియునగు ఆనందతాండవమును నేను నీయనుగ్రహము జూచితిని.

శ్లో|| తత్త్వాతీతమహానన్దమయమానందతాణ్డవమ్‌|

ఉరరీకుర్వతో యోగిధ్యేయస్యాప్యేతయోః కృతే||

అవతీర్య భువం హైమీం సబామాశ్రిత్య తిష్ఠతః|

యాని తే శివకార్యాణి తాని కర్తుం త్వదాజ్ఞయా||

శక్తిం దేహి మమ బ్రహ్మన్‌! శైలాదేరివ శఙ్కర!

బ్రహ్మస్వరూపుడవైన శంకరా! బ్రహ్మను మించిన మహానన్దస్వరూపమైన ఆనందతకాణ్డవము నంగీకరించినట్టియు, యోగులచే ధ్యానింపబడదగినవాడవై నను వీరిద్దరికొరకు భూమికిదిగి కనకసభయందున్నట్టియు, నీయొక్క మంగళప్రదమైనకార్యములను నీయనుమతితో చేయుటకు నంది కేశ్వరునకువలెనే నాకు శక్తినిమ్ము.

శ్లో|| భగవానితి విజ్ఞప్తిః ప్రీతచేతా మహీభుజా|

ముఞ్చన్నివ సుధావృష్టిం నిజగాద మహీపతిమ్‌||

రాజిట్లు విన్నవింపగా భగవంతుడు ప్రీతిజెంది అమృతవర్షమును కురియుచున్నటుల రాజుతో పలికెను.

శ్లో|| త్వద్భక్త్యా పరితుష్టో7స్మి నృపశార్దూల! సువ్రత!

క్రియతే యత్త్వయాకృత్యమేతయోరేవసర్వదా||

ప్రీతయే మే భవత్యేవ తదేతత్ర్కియతామిహ|

రాజశ్రేష్ఠ! సువ్రత! నీభక్తిచే సంతోషించితిని. నీవు వీరిద్దరికి ఏపనిచేసెదవో అది ఎల్లప్పుడును నాప్రీతికొరకే అగును. కనుక అట్లు చేయుము.

శ్లో|| దేవస్యాజ్ఞాం తథేత్యాశు కృత్వా శిరసి భూపతిః|

ప్రసన్నవదనో దేవం ప్రణిపత్య వినిర్య¸°||

రాజు దేవునియాజ్ఞను వెంటనే అట్లేయని శిరసావహించి ప్రసన్నముఖుడై దేవునకు నమస్కరించి వెడలి పోయెను.

శ్లో|| మునినా వ్యాఘ్రపాదేన తతో విశ్వహితై షిణా|

శ్రీమూలస్థానదేవస్య సన్నికర్షమనీయత||

పిమ్మట ప్రపంచశ్రేయస్సునుగోరు మునియగు వ్యాఘ్రపాదుడు రాజును శ్రీమూలశ్థానదేవునిదగ్గరకు తీసికొనివెళ్లెను.

శ్లో|| మాధ్యన్దినిరసౌ తసై#్మ దర్శయన్నత్రతాణ్డివమ్‌|

జగాద మధురం వాక్యం వినయావనతం నృపమ్‌|

ఆవ్యాఘ్రపాదుడు వానికక్కడ తాండవమునుజూపుచు వినయముతో సమ్రుడైన రాజుతో తియ్యనిమాట పలికెను.

శ్లో|| ప్రథమం నృపశార్దూల! పూజితో7యం మయాశివః

ఏతత్ప్రసాదలాభేన దృష్టవానస్మి తాణ్డవమ్‌||

రాజోత్తమ! మొదట నేనీశివుని బూజించితిని. వీని యనుగ్రహము లబించుటచేతనే తాండవమును జూచితిని.

శ్లో|| ఇత్యుక్త్వాతం మహాలిఙ్గం మూలస్థాననికేతనమ్‌|

నత్వా స్వయం తథా భూమేర్న మయామాస నాయకమ్‌||

ఇట్లు చెప్పి మూలస్థానమునందున్న మహాలింగమునకు తాను నమస్కరించి యట్లే భూపతి నమస్కరింపజేసెను.

శ్లో|| స్వనామచిహ్నే స్థానే చ యల్లిఙ్గం స్థాపితంపురా!

తస్యాప్యకారయత్పూజాం సాదరేణ మహీభుజా||

తనపేరుగల స్థానమున పూర్వము స్థాపింపబడిన లింగమునకుగూడ ఆదరముగల రాజుచే పూజచేయించెను.

శ్లో|| తతో నాగపురం సద్యః ప్రాపయిత్వా జనేశ్వరమ్‌|

ప్రణమయ్య చ దేవేశం భాగధేయం పతఞ్జలేః||

ఉపమన్యుప్రసూపాదావుపసఙ్గ్రాహ్య పార్థివమ్‌|

ప్రద్రర్శ్య తసై#్య రాజానమేవం పతత్న్యై వచో7బ్రవీత్‌||

పిమ్మట వెంటనే, రాజును నాగపురమునకు తీసికొని వెళ్లి పతంజలిభాగ్యమైన దేవదేవునకు మ్రొక్కించి ఉపమన్యునితల్లి పాదములకు నమస్కరింపజేసి తనభార్యయగునామెకు రాజునుజూపి ఈవిధముగా బలికెను.

శ్లో|| ప్రియే! త్వం హి పురా యత్నైరుపమన్యుమజీ జనః|

అయత్నలబ్ధస్సో7యం తే నూనురద్యసమాగతః||

ఇతి ప్రీత్యా దదౌ తసై#్య పుత్రం త్వేతం మహామతిః||

ప్రియురాలా! నీవు పూర్వము యత్నములచే నుపమన్యుని కంటివిగదా. అప్రయత్నముగా లభించిన కుమారుడిప్పుడు వచ్చెను. అని యామహాబుద్ధిమంతుడు ప్రీతితో నా కుమారునామెకొసగెను.

శ్లో|| ఇతి దత్తో మునీన్ద్రేణ పుత్రత్వేన నరాధిపః|

సహసా జననీం ప్రితో వవన్దే తత్పదౌ పునః||

ఈవిధముగా మునీంద్రునిచేత పుత్రుడుగానీయబడిన రాజు సంతోషించి వెంటనే తల్లికి నమస్కరించి ఆమెపాదములకు మరల ప్రణమిల్లెను.

శ్లో|| సాధ్వీ సాపి మునేర్భార్యా పుల్లపద్మసమానవా|

వంశకూడా మణిర్దత్తో దేవేనేతి తమాదదే||

పతివ్రతయగు నామునిభార్యయు వికసంచినపద్మము వంటి ముఖముగలదై దేవునిచే వంశమునకు శిరోభూషణ మీయబడెనని వానిని గ్రహించెను.

శ్లో|| అథప్రసన్నహృదయే తాభ్యాం ప్రీత్యుపలాలితే|

మనువంశధరే తస్మిన్వర్తమానే తదాశ్రమే||

పాతయన్నితరాం తస్మిన్‌ దృష్టిం కారుణ్యగర్భితామ్‌|

స మునిస్థ్సానమహాత్మ్యముపదేష్టుం ప్రచక్రమే||

పిమ్మట నిర్మలమైన హృదయముగలవాడు, వారిద్దరి చేతను వాత్సల్యముతో నానందింపజేయబడినవాడు, మనువంశోద్ధారకుడునగు నాతడాశ్రమమున నివసించుచుండగా నాముని ఆతనియందు మిక్కిలి దయజూపి స్థానమహాత్మ్యమును చెప్పనారంభించెను.

వ్యాఘ్రపాదః :

శ్లో|| అమ్బికారణశ్శమ్భురవాఙ్మనసగోచరః |

అఖణ్డపరిపూర్ణో7పి నై వకేనాపి లక్ష్యతే||

వ్యాఘ్రపాదుడు :

వాక్కునకు, మనస్సునకు గోచరముకాని పార్వతీపతి యగు శివుడు భాగములులేని పరిపూర్ణుడైనను ఎవ్వనికి కనబడడు.

శ్లో|| తథాపి నృపశార్దూల! దయయా చోదితశ్శివః|

దృశ్యో నృత్యతి జన్తూనాం చార్మణనాపి చక్షుషా||

అయినను రాజోత్తమ! దయప్రేరేపింపగా శివుడు ప్రాణులచర్మచక్షుస్సుచేగూడ చూడదగినవాడై నృత్యము చేయుచుండెను.

శ్లో|| కిఞ్చ ముక్తిప్రదాయీని జన్తునాం చన్ద్రశేఖరః|

అదౌ స్థానాన్యనేకాని భువి దివ్యాని నిర్మమే||

మరియు శివుడు ప్రాణులకు ముక్తినిచ్చు దివ్యమైన స్థానములననేకములను పూర్వము భూమిలో సృష్టించెను.

శ్లో|| తేష్వష్టషష్ఠిస్థానాని ముక్తిదాయీని భూతలే|

é ప్రథితాని మహేశస్య సదా సాన్నిధ్యహేతవే||

భూతలమున వానిలో ముక్తినిచ్చునట్టి అరువదియెనిమిది స్థానములు ఈశ్వరసాన్నిధ్యమునకు కారణములుగా ప్రసిద్ధమైనవి.

శ్లో|| తేషు స్థానేషు ముఖ్యాని ప్రాహుష్షోడశ పార్థివ!|

తేషుచాత్యన్తముఖ్యాని త్రీణ్యవాహుర్మహర్షయః||

రాజా! ఆస్థానములలో పదునారుస్థానములు ముఖ్యములని చెప్పిరి. వానిలో మూడుస్థానములు మిక్కిలి ముఖ్యములని మహర్షులు చెప్పిరి,

శ్లో|| పుణ్ణరీకపుర న్త్వేతత్కాశీ చ కమలాలయః|

తేషు స్థానేషు యే నిత్యముషిత్వా కుర్వతేతపః||

కాలక్రమేణ ముచ న్తే తే సర్వే క్షేత్రవైభావాత్‌||

ఈపుణ్డరీకవురము, కాశీ, కమలాలయము అనునవి మూడు ఆస్థానములు, ఆస్థానములలో నెల్లప్పుడు నివసించుచు తపసల్సుచేయువారు అందరు క్షేత్రమహిమవలన కాలక్రమముగా ముక్తిని బొందుదురు.

శ్లో|| ఏషాం త్రయాణాం స్థానానాం కో వర్ణయతి వైభవమ్‌|

యజ్జన్తర్లభ##తే ముక్తిం దర్శనాన్మరణాజ్జనేః||

దర్శనమువలన, మరణమువలన, పుట్టుకవలన, ముక్తి నిచ్చునట్టి యాముడుస్థానముల వైభవమునెవడు వర్ణింపగలడు?

శ్లో|| తత్రాప్యస్య మహాభాగ! స్థానవర్యస్య వైభవమ్‌|

పర్వాతిశాయి శ్రోతవ్యం తాపత్రయహరంసతామ్‌||

మహాత్మా! వానిలోకూడ శ్రేష్ఠమైన ఈస్థానముయొక్క వైభవము అన్నిటిని మీరినది, వినదగినది, సత్పురుషులతాపత్రయమును బోగొట్టునది.

శ్లో|| కదాచిన్న వయం జాతాః కమలాలయసీమని|

కాష్ఠవచ్చ పరిత్యక్తం కాశ్యాం నైవ కలేబరమ్‌||

కమలాలయపుసరిహద్దులో మేమెప్పుడు పుట్టలేదు. కాశీలో కఱ్ఱవలె శరీరమును విడిచిపెట్టలేదు.

శ్లో|| అత్ర కేవలమాసినా ముక్తా వర్తామహే వయమ్‌|

సభాయాంనృత్యతశ్శమ్భోస్సదతాపాదాబ్జదర్శనాత్‌||

కేవలమిక్కడ కూర్చుని సభలో నృత్యముచేయుచున్న శివుని పాదపద్మముల నెల్లపుడు జూచుచు ముక్తులమై యుంటిమి.

శ్లో|| స చ ముక్తో భవత్యేవ యస్తు తిల్లవనం సకృత్‌|

యదృచ్ఛయా సమాగత్య పశ్యత్యానన్దతాణ్డవమ్‌||

తిల్లవనమునకొక్క పర్యాయమైనను ఆకస్మికముగా నైనను వచ్చి యానందతాండవమును చూచినవాడుకూడ ముక్తిపొందును.

శ్లో|| కిముతాత్ర నరో నిత్యం నివసంశ్చిత్సభా న్తికే|

అనన్దతాండవం పశ్యన్‌ నిత్యం నేష్యత్యనేహసమ్‌||

ఇక్కడ చిత్సభకుసమీపమున నిత్యము నివసించుచు నిత్యము ఆనందతాండవమును జూచుచు కాలమునుగడుపుమనుష్యుని ముక్తివిషయమును జెప్పనేల?

శ్లో|| చిదమ్బరమిదం తావత్కాశీవన్నైవ ముక్తిదమ్‌||

ఇతీదం యే పరిత్యజ్య కాశీం గచ్చన్తి మానవాః||

తేషాం దేహావసానే7పి ముక్తిం నైవ దదాతిసః|

ఈచిదంబరము కాశీవలె ముక్తినిచ్చునది కాదు అని దీనినివిడచి కాశషికివెళ్లుమానవులకు చనిపోవుసమయమున గూడ అతడు ముక్తినీయడు.

శ్లో|| చిదమ్బరావమానేన ప్రసీదేచ్చ న శఙ్కరః|

వసన్తస్తత్రమనుజా మహేశసమతేజసః||

జీవన్ముక్తాశ్చ దృశ్యన్తే జగద్వ్యాపారనిష్ఠితాః|

చిదంబరమునపమానించినయెడల శంకరుడనుగ్రహింపుడ అక్కడనివసించు మనుష్యులు మహేశ్వరునితో సమానమైన తేజస్సుగలవారు. జీన్ముక్తులైనను ప్రపంచవ్యాపారములో నన్ను వారుగా కనబడచుందురు.

శ్లో|| తదీదృశం త్వయా దృష్టం స్థానే శఙ్గరతాణ్డవమ్‌|

సర్వమఙ్గలయ దృష్టం భవతః కిమతః పరమ్‌|

మాన్యో7సి భువనై స్సర్వైరస్మాదప్యధికం నృప|

43

పార్వతిచే చూడబడిన ఇట్టిశంకరతాండవమును ఈస్థానమున నీవుచూచితివి. నీకింతకంటె ఏమి కావలెను? రాజా! మాకంటెను ఎక్కువ లోకములచే పూజింపదగినవాడవైతివి.

ఇతి శ్రీ స్కాన్దే మహాపురాణ సనత్కుమారసింహితాయాం

శ్రీమహేశ్వరనన్దిసంవాదే చిదమ్బరమహాత్య్మే

వ్యాఘ్రపాదహిరణ్యవర్మసంవాదోనామ

తయ్రోవింశో7ధ్యాయః

-0-

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters