Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

అథ వింశాధ్యాయః

(సింహవర్మచరితము)

శ్లో || కల్పాన్తే ప్రతిసంహృతం జగదిదం సృష్ట్వా పునః స్వాత్మనా

బ్రహ్మక్షత్రకులద్వయం చ విదధే తద్రక్షణయే శ్వరః|

తత్ర క్షత్రకులే7ర్కవంశజనితః శ్రీసింహవర్మానృపః

లబ్దం రాజ్యమపి త్యజన్స తపసే7యా సీచ్చ దేశానృహూన్‌||

కల్పాస్తమున ఉపసంహరింపబడిన ఈ ప్రపంచము నీశ్వరుడు మరల తన ఆత్మచే సృజించి దానిరక్షణకొరకు బ్రహ్మణక్షత్రియకులముల నేర్పరచెను. ఆక్షత్రియకులములో సూర్యవంశమునుబుట్టిన శ్రీనృసింహవర్మయను రాజు లభించిన రాజ్యమును గూడ విడచి తపస్సుకొరకు బహుదేశములకేగెను.

సూతః :

శ్లో || ఏతస్మిన్న న్తరే రాజా సింహవర్మా మహాయశాః|

తత్ర తిల్లవనే కర్తుమాజగామ మహ త్తపః||

సూతుడు :

ఇంతలో మహాకీర్తిగల సింహవర్మయను రాజు ఆతిల్లవనమున మహాతపస్సుచేయుటకు వచ్చెను.

ఋషయః :

శ్లో || కస్స రాజా మహాభాగస్సింహవర్మేతి విశ్రుతః|

కిమర్థం చ తపః కర్తుమిహాయాత్తద్బ్రవీహి నః||

ఋషులు :

సింహవర్మయని ప్రసిద్ధుడైన మహాత్ముడగు ఆరాజెవరు? ఎందుకొరకు తపస్సు చేయుటకిచ్చటకు వచ్చెను? దానిని మాకు చెప్పుము.

శ్లో || ఇతి తేషాం వచశ్శ్రుత్వా సూతః పౌరాణికోత్తమః|

యథావత్కథయామాస సింహవర్మాశ్రితాం కథామ్‌ ||

ఈవిధముగా వారిమాటను విని పౌరాణికశ్రేష్టుడగు సూతుడు సింహవర్మకు సంబంధించిన కథను జరిగినవిధమును చెప్పెను.

సూతః :

శ్లో || పురా మహేశో భగవాన్సురాసురనిషేవితః

కృత్వా చతుర్విధాం మాయాం సంహారమకరోత్ప్రభుః||

సూతుడు :

పూర్వము దేవదానవులచే సేవింపబడు భగవంతుడగు మహేశ్మరుడు నాలుగువిధములైన మాయను బ్రయోగించి సంహారముచేసెను.

శ్లో || తదా జగదింద భీమమప్రజ్ఞాతమలక్షణమ్‌|

అనిర్దేశ్యమనిర్ణేయమభూత్సుప్తమివాఖిలమ్‌||

అప్పుడీప్రపంచమంతయు భయంకరమైనది, తెలియబడినిది, లక్షణములేనిది , చూపరానిది, నిశ్చయింపరానిది యునై సమస్తము నిద్రించినట్లయ్యెను.

శ్లో || తస్మిన్నహని సంహారసమయే పరమేశ్వరః|

రుద్రరూపధరస్సాక్షాదకరోచ్చణ్డతాణ్డవమ్‌||

ఆదినము సంహారసమయమున పరమేశ్వరుడు కేవలము రుద్రరూపమును ధరించి భయంకరమైన తాండవము చేసెను.

శ్లో || పునస్స్వతన్త్రో భగవానిచ్ఛాశక్తి ప్రచోదితః|

సంహారస్యా న్తసమయే సర్గం స్థాప్య స్వశక్తిషుః||

ప్రకాశ్య చ మహామాయాం తస్యామద్భుతసంసది

నాదాదిపఞ్చతత్వాని ససర్జ జగతః ప్రభుః||

సంహారమైన పిమ్మట స్వతంత్రుడైన భగవంతుడు ఇచ్ఛాశక్తి ప్రేరేపింప మరల తన శక్తులయందు సృష్టినుంచి ఆయద్భుతసభలో మహామాయను విస్తరింపజేసి నాదము మొదలై దుతత్వముల నాజగత్రభువు సృజించెను.

శ్లో || శుద్ధమార్గం తతశ్శైవం సృష్ట్వా వాచం చతుర్విధామ్‌||

మాతృకాయాస్తురీయాయా వర్ణానుత్పాద్య శఙ్కరః||

ససర్జ తేషాం ప్రథమం మాత్రాత్రితయలక్షణమ్‌|

సర్గాదికృత్యసహితం ప్రణవం స్వప్రకాశకమ్‌||

పిమ్మట శంకరుడు శుద్ధమార్గమును, శైవమార్గమును , పరామొదలగు నాలుగువాక్కులను సృజించి చతుర్థమాతృకావర్ణములను బుట్టించి వానలో మొదటిది, మూడురాత్రులస్వరూపముగలది, సృష్టిమొదటికృత్యములతో కూడినది, తనను వెల్లడించునదియునగు ఓంకారమును సృష్టించెను.

శ్లో || తతశ్చ వ్యాహృతీస్తాభ్యోగాయత్రీం లోకమాతరమ్‌|

తస్యాస్ససర్జ భగవాన్సర్వాన్వేదానతన్ద్రితః||

భగవంతుడు దానినుండి 'భూః' మొదలగు వ్యాహృతులను వానినుండి లోకములకు తల్లియైను గాయత్రిని దాని నుండి శ్రద్ధతో సమస్తవేదములను సృజించెను.

శ్లో || తేభ్యస్ససర్జ భగవాన్సప్తకోటిమహామనూన్‌|

ఉపమన్త్రాం స్తతస్తేభ్య స్తత్సంఖ్యాతాన్ససర్జ హ|

వానినుండి భగవంతుడు ఏడుకోట్ల మహామంత్రములను వానినుండి ఏడుకోట్ల ఉపమంత్రములను సృష్టించెను.

శ్లో || తదన్యస్యాశ్చ మాయాయా స్తత్త్వజాతంససర్జ హ|

కాలాద్యవనిపర్యన్తం చరాచరసమన్వితమ్‌||

వేరొకమాయనుండి కాలము మొదలు భూమిపర్యం తము స్థావరజంగమములతో కూడిన తత్త్వసమూహమును సృజించెను.

శ్లో || తత్రస్థానాత్మనస్స్వాని పుణ్యపాపాని భూతలే|

కాలక్రమేణ పర్యాయాచ్చనైర్భోజయితుం పునః|

బ్రహ్మవిష్ణుసముత్పాద్య స్వాఙ్గాదమితతే జసౌ|

సర్గపాలకనకర్తారౌ శైలసాగరయోరుభౌ||

అక్కడనున్న జీవులను భూతలమున తమపుణ్యపాపము లను మెల్లగా కాలక్రమమున పర్యాయముగా అనుభవింపజేయుటకు తన శరీరమునుండి మిక్కిలి తేజస్సు గలిగి సృష్టిని పాలనమును జేయు బ్రహ్మవిష్ణువులను పుట్టించి ఇద్దరిని పర్వతసముద్రములందు నెలకొల్పి పిమ్మట హితము గోరుచు నీసమస్తమును జెప్పెను.

శ్లో || మహాన్తో వైదికా మన్త్రాస్సర్వే యాగాయ మత్కృతాః|

తేషామధ్యయనార్థాయ సృహ్టాశ్చైవ ద్విజాతయః|

యాగస్యాపి చ సిద్ధ్యర్థం గావస్ససృజిరే మయా||

యజ్ఞము కొరకు గొప్ప వైదిక మంత్రములను నేను జేసితిని. వానిని జరుపుటకు ద్విజులను సృజించితిని. యజ్ఞము నెరవేరుటకు నేను గోవులను సృస్టించితిని.

శ్లో|| హవిర్భిస్తద్భవైరేవ తైశ్చ మన్త్రైర్ద్వి జాతయః|

మత్ప్రీణనాయమన్మూర్తావగ్నౌ జుహ్వతియేనరాః|

దుష్ప్రాపమన్యైస్తే స్వర్గం లభ##న్తే నాత్ర సంశయః||

ఆమంత్రములచేత నాగోవులనుండి పుట్టిన పాలతో నాప్రీతికొరకు నామూర్తియైన అగ్నియందు హోమము చేయు ద్విజులైన మానవులు ఇతరులకు లభింపని స్వర్గమును పొందుదురు. దీనిలో సందేహము లేదు.

శ్లో || మదాగమేషు యేసక్తాశ్చర్యా యోగక్రియా పరాః|

సారూప్యాదధికాముక్తి స్తేషాంసిద్ధా న సంశయః||

శై వాగమములలో తత్పరులై చర్యాయోగక్రియయం దాసక్తులైన వారికి సారూప్యముకంటె అధికమైన ముక్తి లభించును. సందేహములేదు.

శ్లో || యే వైదికాః పుననర్యాగాన్‌ నిష్కామాః కుర్వతే ద్విజాః|

త్రివిధామపి విన్దన్తి ముక్తిం తే నాత్ర సంశయః||

కోరికలేకుండ యాగములను జేయుచు వైదికమార్గము ననుసరించి ద్విజులు మూడువిధములైన ముక్తిని బొందుదురు. దీనిలో సందేహము లేదు.

శ్లో|| వేదాన్తనిరతా యే తు జ్ఞానినో వీతకల్మషాః|

మదాగమపరా యే చ జ్ఞానపాదే వ్యవస్థితాః|

ఉభయోపి చ విన్దన్తి సాయుజ్యమతి దుర్లభమ్‌||

వేదాస్తమందాస క్తులై పాపముపోయిన జ్ఞానులును శైవాగమమందాసక్తులై జ్ఞానపాదమున ప్రవర్తించువారును రెండువిధములైన వారును మిక్కిలి దుర్లభ##మైన సాయుజ్యమును పొందుదురు.

శ్లో || ఉభ##యేషు చ మార్గేషు కర్మబ్రహ్మపరేషు చ |

వేదాగమప్రసిద్ధేషు యే నతిష్ఠన్తి పాపినః||

చతుర్వేధైశ్చతే దణ్డ్యాఃదణ్డౖశ్శాస్త్రప్రచోదితైః||

వేదాగమములయందు ప్రసిద్ధమైన కర్మమార్గము జ్ఞానమార్గము అను రెండువిధములైన మార్గముల యందును బ్రవర్తింపని పాపులను శాస్త్రమందు విధింపబడిన నాలుగువిధములైన దండములచేతను శిక్షింపవలెను.

శ్లో || ఆస్మాద్గ్రాహయితుం ముక్తాన్శాస్త్రా ర్థానధికారిణః|

ప్రవర్తయితుమేతాంశ్చ ధర్మాన్థ్రాపయితుంతతః|

నివర్తయితుమేవాస్మాదసతో7నధికారిణః||

ప్రవృత్తానప్యనుచితే మార్గే శాసయితుం తథా|

అత్ర రాజా హి శక్నోతి ప్రజాపాలనదీక్షితః|

రాజా దురాత్మనశ్శాస్తి రాజా కాలస్య కారణమ్‌|

ఇందువలన అధికారముగలవారిని విడచిన శాస్త్రవిషయములనుగ్రహింపజేయుటకు, వానిని ప్రవర్తింపజేయుటకు దాని వలన ధర్మములను నెలకొల్పుటకు, అధికారములేనివారిని ఈ అసన్మార్గమునుండి మరలించుటకు, అట్లే అనుచితమార్గమున ప్రవర్తించినవారలనుగూడ దండించుటకును ప్రజలను పాలించు టకు దీక్షితుడైన రాజు సమర్ధుడగును. రాజు దుష్టులను శిక్షించును. రాజు కాలమునకు కారణము.

శ్లో|| శశాఙ్కమౌలిర్భగవానితి నిశ్చిత చేతసా|

సర్వలోకాధిరాజ్యస్య శక్తిం కిఞ్చిన్ని రూప్యచ|

తతస్త్వా హూయ ధర్మజ్ఞో సవితు స్తనయావుభౌ||

నిగ్రహానుగ్రహాభ్యాం చ ధర్మస్థాపనతత్పరౌ|

తయోరేకస్య భగవాన్దణ్డిం దత్వా జగత్ప్రభుః||

దక్షిణాశాపతిం చక్రేత్రైలోక్యసమవర్తినమ్‌||

భగవంతుడు, జగత్ప్రభువు, ధర్మము తెలిసినవాడునగు చంద్రశేఖరుడు ఇట్లు చిత్తమున నిశ్చయించిన సమస్తలోక సామ్యాజ్యమునకు కొంతశక్తిని నిర్ణియించి పిమ్మట నిగ్రహానుగ్రహములతో ధర్మమును స్థాపించుటకాసక్తులైన సూర్యకుమారులనిద్దరను (ధర్మరాజును, వైవస్వతమనువును) పిలిచి వారిద్దరిలో నొకనికి (యమధర్మరాజునకు) దండమునిచ్చి మూడులోకములను సమముగా జూచునట్టి దక్షిణదిక్పాలకునిగా జేసెను.

శ్లో || రాజ్ఞాంకకుదమన్యం చ కృత్వా మకుటధారిణమ్‌||

అలఙ్కృత్య చ భూషాభిరార్పయన్నాకినాం కరే|

మరియొకనిని కిరీటధారియైన రాజశ్రేష్ఠునిగా జేసి ఆభరణములతో నలంకరించి దేవతలకప్పగించెను.

శ్లో|| నాకిన స్తం మహాభాగం తపనస్య తపఃఫలమ్‌|

శనకైః ప్రాపయామాసురగ్రం మేరుమహీభృతః|

దేవతలు సూర్యుని తపస్సునకు ఫలరూపమైన యా మహాత్ముని మెల్లగా మేరుపర్వతశిఖరమునకు తీసికొనివెళ్లిరి.

శ్లో|| సమ హేన్ద్రసభామధ్యే సమసింహాసనే స్థితః||

స శాస్తి సకలాముర్వీం సప్తసాగరసంవృతామ్‌|

అతడు ఇంద్రునిసభలో సమానమైన సింహాసనమున కూర్చుండి ఏడుసముద్రములు చుట్టియున్న భూమినంతను పాలించుచుండెను.

శ్లో|| తమారభ్య హి చత్వార స్తత్సమానపరాక్రమాః|

సదసద్వ్యక్తినిపుణాశ్శశాసుః పృథివీమిమామ్‌||

అతడు మొదలు నలుగురు వానితో సమానమైన పరాక్రమముగలవారు మంచిచెడ్డలను వివేకింపసమర్థులు ఈ భూమిని పాలించిరి.

శ్లో|| తేషాం చ పఞ్చమః శ్రీమావ్రాజా రేఖేన్ద్రసంజ్ఞకః|

ఆసీద్భాగీరథీపూరపరిపన్థిమశో7ఙ్కురః||

వారిలోనైదవవాడు గంగాప్రవాహమువంటి కీర్త్యం కురముగలవాడు లేఖేంద్రుడను పేరుగల శ్రీమంతుడుండెను.

శ్లో|| చిత్తజ్ఞే తస్య భూపస్య మహిష్యౌ శీలభూషణ|

ప్రథమాయాం తయోరాసీత్సింహరూపధరస్సుతః||

అన్యాయాం చ తథాఖ్యాతౌ పుణ్యలక్షణభూషణౌ

సుమతిర్వేదవర్మేతి పుత్రావాస్తాం మహౌజసౌ||

ఆ రాజునకు మునస్సునెరిగినవారు, శీలమేఆభరణముగా గలవారునగు ఇద్దరు భార్యలుండిరి. వారిలో మొదటిభార్యయందు సింహరూపముగల కుమారుడు పుట్టెను. రెండవ భార్యయందు శుభలక్షణములుగలవారు మహాతేజోవంతులు ప్రసిద్ధులునగు సుమతి, వేదవర్మయను ఇద్దరుపుత్రులు పుట్టిరి.

శ్లో|| తతః పితా తయోశ్శాన్తః తపః కర్తుంకృతోద్యమః|

ఆభిషేక్తుం సుతం జ్యోష్ఠమాధిరాజ్య ఇయేష సః||

పిమ్మట ఆంతడ్రి వారిద్దరియందు శాన్తుడై తపస్సు చేయదలచి పెద్దకుమారునికి సామ్రాజ్యమున పట్టాభిషేకము చేయదలచెను.

శ్లో|| తతస్తయోస్సుతో జ్యాయాన్‌ సింహవర్మేతి విశ్రుతిః|

పితరం ప్రణిపత్యాహ వినయేన కృతాఞ్జలిః||

పిమ్మట సింహవర్మయని ప్రసిద్ధుడైన వారి పెద్దకుమారుడు తండ్రికి నమస్కరించి వినయముతో దోసిలొగ్గిపలికెను.

శ్లో|| యవీయ సే గుణవతే తాత! శుశ్రూషవే తవ|

అభిరూపాయ పుత్రాయ దేహిరాజ్యశ్రియం త్విమామ్‌||

నాయనా! గుణవంతుడై నీకుసేవచేయుచు తగియున్నచిన్న కుమారునకీరాజ్యసంపదనిమ్ము.

శ్లో|| తపోవనమహం ప్రాప్య తపశ్చరితుముత్స హే|

ఈదృశస్య విరూపస్య నాధికారో7వనే భువః||

ఏతౌ తే తన¸° తాత! రాజ్యరక్షావిచక్షణౌ|

తస్మాదనుజ్ఞాం తప సే దేహీతి ప్రాణమత్పునః||

నేను తపోవనమునకేగి తపస్సుచేయుట కుత్సాహపడుచున్నాను. ఇట్టి వికృతరూపముగలవానికి రాజ్యపాలనమందధికారము లేదు. తండ్రీ! నీయొక్క ఈకుమారులిద్దరు రాజ్యరక్షణమందు నేర్పరులు కనుక తపస్సున కనుమతినిమ్మనిమరల నమస్కరించెను.

శ్లో|| పితా తస్య వచశ్ర్శుత్వా తనయస్య మహామతేః|

తద్భావదర్శనాద్దుఃఖీ జగాద మధురం వచః||

మహాబుద్ధిమంతుడైన ఆకుమారుని మాట విని తండ్రి వానిభావము తెలియుటవలన దుఃఖితుడై మధురమైన మాటపలికెను.

శ్లో|| జరయా పరిభూతో7హం బాలావేవ తవానుజౌ|

అద్య త్వయి తు నిర్యాతే తపసే చ తపోవనమ్‌||

గృహ్యేత రాజ్యమస్మాకమామిషగ్రాహిభిః పరైః|

తస్మాచ్చతుర్విధాం సేనాం పరిగృహ్య క్రమాగతమ్‌||

పాలయ త్వమిదం రాజ్యమేతదేవ తుప స్తవ

సన్ను ముసలితనమావరించినది. నీతమ్ములు బాలురు. ఇప్పుడు నీవు తపస్సునకు తపోవనమున కేగినయెడల రాజ్యమును అనుభవింపదగిన మాంసమునువలె శత్రువులు స్వాధీనముచేసికొందురు. కనుక ఏనుగులు మొదలగు నాలుగువిధములైన సేనను గ్రహించి వంశక్రమముగావచ్చిన నీరాజ్యమును పాలింపుము. ఇదియే నీకు తపస్సు.

శ్లో|| పితుస్తథావిధం వాక్యం స నిశమ్య స హేతుకమ్‌|

ఉవాచ పునరప్యేవం తప సే కృతనిశ్చయః|

తండ్రియొక్క సహేతుకమైన యట్టిమాటనతడు వినితపస్సుచేయుటకే నిశ్చయించుకొని మరల ఇట్లు పలికెను.

శ్లో|| తతా! విశ్వమ్భరాచక్రం ధౌరేయస్య తవ ప్రభో|

తప ఏవ మమానన్దం సుఖమాయుశ్చ దాస్యతి||

తండ్రీ! ప్రభూ! భూమండలము భారమునుమోయగల నీకానందమునిచ్చును. నాకు తపస్సే ఆనందమును, సుఖమును, ఆయుర్థాయమును ఇచ్చును.

శ్లో|| తప స్తప్తుం సదా శక్తః నైవ రాజ్యమహంక్షణమ్‌|

తస్మాత్ర్పీతమనా దేహి తదనుజ్ఞామిహాద్య మే||

నేను ఎల్లప్పుడు తపస్సు చేయగలను. రాజ్యమునొక్క క్షణమైనను పాలింపలేను. కనుక మనస్సున సంతోషముతో నాకిపుడాతపస్సున కనుమతినిమ్ము.

శ్లో|| ఏవముక్తస్స పుత్రేణ రాజ్యనిప్పృహచేతసా|

కేవలంనమయామాస మూర్ధానం చింతయాకులః||

రాజ్యమునందు కోరికలేని కుమారుడీవిధముగా జెప్పరాజు విచారముతో కలతజెంది కేవలము తలవంచుకొనెను.

శ్లో|| అనుజ్ఞాతః కిలాసౌ తు శమ్భుస్మరణతత్పరః|

ఏకఏవినిర్గత్య ప్రత స్థే ధరణీతలమ్‌||

ఇట్లనుమతింపబడి అతడు శివుని స్మరించుటలో నిమగ్నుడై ఒకడే బయటకువచ్చి భూమండలము తిరుగుటకు బయలుదేరెను.

శ్లో|| జాహ్నవీతోయంసయుక్తే కృతస్నానో7థసాగరే|

సవిధే తస్య తీరస్య వఙ్గదేశమవాప్య సః||

ఆన్యేద్యుః ప్రావిశద్రాజ్యం తస్మాద్యావకనామకమ్‌|

అతడు గంగాసాగరసంగమమున స్నానముచేసి దాని ఒడ్డునకు చేరువనున్న వంగదేశమునకేగి మరునాడు అక్కడ నుండి యావకమను రాజ్యమును ప్రవేశించెను.

శ్లో|| తదతీత్య పునస్సో7యమోఢ్రదేశం సువిస్తృతమ్‌|

ప్రవిశ్య తన్నమస్కృత్య భీమానాథం తద న్తరే||

స్థానాన్యపి తదన్యాని తత్ర నత్వా మహాయశాః|

విపులం సమ్పదా పూర్ణమాన్ధ్రరాజ్యం వివేశ సః||

అది దాటి కీర్తిమంతుడైన యతడు మరల విశాలమైన యాయోఢ్రదేశమును ప్రవేశించి దానిమధ్యలో భీమనాథునకు నమస్కరించి ఇతరమైన ప్రదేశములకుగూడ నమస్కరించి సంపదతో నిండి విశాలమైన యాంధ్రరాజ్యమును బ్రవేశించెను,

శ్లో|| శ్రీపర్వతం తతో నత్వా తత్ర భూధరనాయకమ్‌!

తద్గతేషు చ తీర్థేషు స్నాత్వా సమ్యగతన్ద్రితః||

తతశ్చ సర్వలోకేశపార్వతీపతిభూషితమ్‌|

కాలహ స్తిగిరిం నత్వా నిర్గచ్ఛన్స శ##నైశ్శనైః||

కిరాతం తత్ర గచ్ఛన్తం దృష్ట్యా చాపధరం వనే|

ఆహూయాత్ర నిషీదేతి వాచమూచే మహీపతిః||

పిమ్మట నక్కడ పర్వతశ్రేష్ఠమగు శ్రీశైలమునకు మ్రొక్కి అక్కడనున్న తీర్థములయందు బాగుగా శ్రద్ధతో స్నానముచేసి పిమ్మట సర్వలోకప్రభువగు పార్వతీపతిచే అలంకరింపబడియున్న కాళహస్తిపర్వతమునకు నమస్కరించి మెల్ల మెల్లగా బయలుదేరుచు విల్లుచేతబట్టుకొని యచ్చట అడవిలో వెళ్లుచున్న బోయవానిని జూచి పిలచి ఇచ్చట కూర్చుండుమని రాజు పలికెను.

రాజా :

శ్లో|| విపినే7స్మిన్కిమాశ్చర్యం పర్వతే చ వనేచర!

ఆచక్ష్వ మమ తత్సర్వమితి పప్రచ్ఛ తం నృపః||

రాజు :

వనచరా! ఈయరణ్యమందును పర్వతమందును ఏమేమి యాశ్చర్యములుగలవో వానినన్నిటిని నాకుజెప్పుమని రాజు వానినడిగెను.

శ్లో|| అథ పృష్టస్స భూపేన కిరాతో7పి కృతానతిః|

ఉపవిష్టస్తరోర్మూలే స్నిగ్ధప్రచ్ఛాయశీతలే||

దృఢబద్ధేషుధిః పశ్చాదఙ్కాస క్తశరాసనః|

కృశాఙ్గం పాదచారేణ ప్రత్యువాచ మహీపతిమ్‌|| 59 1/2

రాజు అడుగగా కిరాతుడును నమ్రుడై దట్టమైన నీడచే చల్లనై న చెట్టు మొదట కూర్చుండి వెనుక అమ్ముల పొదిని గట్టిగాకట్టి వింటిని ఒడిలో పెట్టుకొని కాలినడకచే చిక్కిన శరీరముగల రాజునకు సమాధానము చెప్పెను.

ఇతి శ్రీ స్కాన్దే మహాపురాణ సనత్కుమారసంహితాయాం

శ్రీమహేశ్వరనన్దిసంవాదే చిదమ్బరమాహాత్మ్యే

హిరణ్యవర్మకిరాతసంవాదోనామ వింశో7ధ్యాయః

--0--

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters