Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

అథ షోడశో7ధ్యాయః

(పతంజలి, వ్యాఘ్రపాదప్రసంగము)

శ్లో|| ఏవం శమ్భునిదేశతః సభగవానాసాద్య తిల్వాటవీం

మైత్రీం వ్యాఘ్రపదోపగమ్య మునినా శేషః శివారాధకౌ

అర్చన్తౌ శివగఙ్కికాం చ సమయాశ్రీమూలనాథం శివం

చాస్తాం తాణ్డవమీక్షితం చ సమయం తావీక్ష మాణౌహృదా||

ఈవిధముగా శివుని యాజ్ఞవలన ఆపూజ్యుడగు శేషుడు తిల్వవనమునకు చేరి వ్యాఘ్రపాదమునితో మేత్రిబొందెను. అశివపూజాపరు లిద్దరుమూలనాధేశ్వరునిదగ్గరనున్న శివగంగను పూజించుచు తాండవమును జూచుటకు హృదయముతో సమయమును నిరీక్షంచుచుండిరి.

శ్లో|| శివానన్దవిలీనాత్మా ధారానన్దాశ్రులోచనః|

మహితే మస్తకే సద్యస్సంకుచత్పాణిపఙ్కజః||

ఘణారత్న ప్రభాజాలైర్మోహధ్వాన్తవిమోచకః|

ప్రాదురాస బిలద్వారాద్బోధభానుర్యథాఫణీ||

శివానందమున మునిగిన మనస్సుగలవాడు, ఆనంద బాష్పములు ధారగా ప్రవహించుచున్న కన్నులుగలవాడు? పూజ్యమైన శిరస్సున జోడించిన హస్తపద్మములుగలవాడు, పడగలమీది రత్నముల కాంతిసమూహములతో మోహమనెడు చీకటిని బొగొట్టువాడునగు శేషుడు జ్ఞాననూర్యుడు వలె బిలద్వారమునుండి ప్రాదుర్భవించెను.

శ్లో|| ప్రాదుర్భాయ సలోకానామవం తద్వనం మహత్‌|

తద్విశేషాంశ్చ సంపశ్యన్నమస్కృత్య కృతాదరః||

ప్రావిశ త్తద్వనందివ్యమాత్మదర్శనవిస్మితమ్‌|

వ్యాఘ్రాపాదం మునిం తత్ర తపస్యన్తం వ్యలోకయత్‌||

అతడు బిలద్వారమునుండి బయటికి వచ్చి లోకములను రక్షించు నాపెద్దవనమును, దానిలో విశ్షములను చూచుచు ఆదరముతో నమస్కరించి దివ్యమైన ఆవనమును ప్రవేశించి అక్కడ తపస్సుచేయుచు, తననుచూచి ఆశ్చర్యపడిన వ్యాఘ్రపాదమునిని జూచెను.

శ్లో|| దివ్యరూపీ మునిస్సో7పి తదాలోకనహర్షితః|

ప్రార్థయన్నివ తం పాణిం సముద్ధృత్యజగాద చ||

దివ్యమాన రూపముగల ఆమునియు వానిని జూచుటచే సంతోషించి ప్రార్థించువాడువలె ఆచేతినెత్తి పలికెను.

శ్లో|| ఆయాతో7సి కుతశ్స్రీమన్‌ కుత్ర వా వసతి స్తవ|

కస్త్వం కి నామధేయో7సి కం వా దేశం చ వాంఛసి||

అయ్యా! ఎచ్చచనుండి వచ్చితివి? నీనివాసమెచ్చట? నీవెవరు? ఏప్రదేశముకావలెను?

శ్లో|| ఏతత్సమ స్తం విస్తార్య వద నిస్సంశయం మమ|

త్వన్ముఖాచ్ఛ్రోతుమిచ్ఛామి మహదస్తి కుతూహలమ్‌||

దీనినంతను విస్తరించి సందేహములేకుడం నాకు జెప్పుము. చాలకుతూహహమరుగలదు. నీనోటినుండి వినగోరు చుంటిని.

శ్లో|| ఇతి పృష్టస్స తేనాథ ప్రహర్షమతులం గతః|

ప్రత్యువాద మునిశ్రేష్ఠం ప్రవృత్తిం స్వాంపతజ్ఞలిః||

వ్యాఘ్రాపాదుడట్లుడుగగా పిమ్మట పతంజలి మిగుల సంతసించి ఉత్తమమైన తనవిషయమునుగూర్చి మునికి సమాధానముచెప్పెను.

శ్లో|| వ్యాఘ్రపపాదమునే! వక్ష్యే సర్వం తమ సువి స్తరమ్‌|

సమాహితమనా స్తత్త్వం శ్రోతుమర్హసి సువ్రత!||

సువ్రత! వ్యాఘ్రపాదమునీ! నాకు సమస్తము విస్తరముగా జెప్పెదను. ఏకాగ్రచిత్తుడవై నీవు వినదగుదువు.

శ్లో|| యో ధత్తేసకలాం పృథ్వీంసశై లవనసాగరామ్‌|

తం మామనన్తం త్వం విద్ధి సాక్షాద్విష్ణ్వంశసమ్భవమ్‌||

కేవలము విష్ణువుయొక్క అంశమువలన బుట్టి పర్వత వనసముద్రములతో కూడిన సమస్తభూమండలమును మోయునట్టి అనంతునిగా నన్ను నీవు తెలిసికొనుము.

శ్లో|| మయి తల్పత్వమాయాతే శయానోమధుసూదనః|

కదాచిదద్భుతం దృష్ట్వా షృచ్ఛతః ప్రాహ మే ప్రభు||

దేవదారువనే శమ్భోర్దృష్టమానన్దతాణ్డవమ్‌|

దిదృక్షమాణం తం శ్రుత్వా ప్రాహిణోత్తపసే చ మామ్‌||

నేను శయ్యగానుండ పరుండిన నాప్రభువగు మధుసూదనుడు ఒకప్పుడద్భుతమును జూచి యడుగుచున్న నాకు దేవదారువనమున జూచిన శివుని వయానందతాండవమును గూర్చి చెప్పెను. దానిని నేను చూడగోరుచున్నట్లు విని నన్నుతపస్సనకు పంపెను

శ్లో|| ప్రేషితో7హం ట నాథేనగత్వాకైలాసభూధరమ్‌|

అసంఖ్యేయదినం కాల ం కృతవాన్‌సుమహత్తపః||

ప్రభువు పంపగా నేను కైలాసపర్వతమునకు వెళ్లి లెక్కలేనంతకాలము మహాతపస్సు చేసితిని.

శ్లో|| ప్రథమ ధాతృరూపేణ ప్రాదుర్భూతో మహేశ్వరః|

మమాచలం తపస్థ్సైర్యం దృష్ట్వా ముదితమానసః||

పశ్చాత్ప్రవాలసచ్ఛాయం స్వరూపం చప్రకాశ్యమే|

పాణిం విన్యస్య భూతేశః పాశనాసాయ మూర్ధని||

తత్రోపదిస్య బదవాన్‌ దుష్ప్రాపమకృతాత్మభిః|

శ్రుత్యన్తవేద్యందయయాస్వస్వరూపనిరూపణమ్‌||

దేశకాలసదృక్షం చ దత్వా రూపమిదం మునే!

నామధేయం చ భగవాన్‌ పతఞ్జలిరితీహ మే||

పరమం భారతే వర్షే భూమేర్హృదయపఙ్కజమ్‌

స్థానం తిల్లవనా న్తస్థమస్తి సాగరపార్శ్వతః||

తత్ర మాధ్యన్దినిస్సాక్షాన్మత్తాణ్డవదిదృక్షయా|

వ్యాఘ్రపాద ఇతి క్యాతస్తపశ్చరతి దుష్కరమ్‌||

తవ తస్‌%ాపి తత్రాహం దర్శయిష్యామి తాణ్డవమ్‌|

తత్త్వం ప్రాప్యాత్మనో లోకం బిలద్వారేణ సత్వరమ్‌||

నిర్గత్య పూర్ణజ్ఞానేన సాకం తేన మహాత్మనా|

తత్రా స్వేతి సమాదిశ్య శఙ్క రోమాం వ్యసర్జయాత్‌||

మునీ! మొదట బ్రహ్మరూపముతో ప్రత్యక్షమైన మహేశ్వరుడు చలింపని తపసస్నందలి నాపట్టుదలను జూచి మనస్సున సంతసించి పిమ్మట పగడముతో సమానమైన రంగుగల తనరూపమునుగూడ నాకు జూపి యాభూతేశుడు పాశములు తొలగుటకు చేతిని నాతలమీద నుంచి యాభదవంతుడు పుణ్యహీనులకు దుర్లభమానది, ఉపనిషత్తులచే తెలియదగినదియునగు తన స్వకూపనిపూరణము నచ్చట దయతో నుపదేశించి దేశాలములకు దగిన యీహూపమూను, పతంజలియను పేరును నాకిచ్చి భారతవర్షమున సముద్రముప్రక్కతిల్లవనములో భూమికి హృదయపద్మమువంటి ఉత్తమమైన స్థానము గలదు. అచ్చట వ్యాఘ్రసాదుని ప్రసిద్ధిజెందిన మధ్యందినపుత్రుడు ప్రత్యక్షముగా నాతాండవమును జూడగోరిదుష్కరమైన తపస్సు చేయుచుచున్నాడు. అక్కడ నీకును వానికిని నేను తాండవమును జూపెదను. కనుక నీవు వెంటనే నీలోకమునకేగి బిలద్వారమున పరిపూర్ణమైన జ్ఞానముతో పైకి వెడలి ఆమహాత్మునితో నచట నుండుమని యాజ్ఞాపించిశంకరుడు నన్ను విడచెను.

సూతః :

శ్లో|| పతఞ్చలివచశ్శ్రుత్వా వ్యాఘ్రపాదో మునీశ్వరః|

ముమూర్ఛ పరమానన్దపులకాఞ్చితవిగ్రహః||

సూతుడు :

పతంజలిమాట విని వ్యాఘ్రపాదమునీశ్వరుడు మహానందముచే పులకించిన శరీరముగలవాడై మూర్ఛపోయెను.

శ్లో|| తతశ్చ పరమాశ్వాస్య త్య క్త మూర్ఛః క్షణాదసౌ|

ప్రోవాచ వినయావిష్టః పతఞ్జలిమునిం తదా||

పిమ్మట నతడు క్షణములో మూర్ఛను విడచి తేరుకొని యపుడు వినయముతో పతంజలిమునినిగూర్చి పలికెను.

వ్యాఘ్రపాదః :

శ్లో|| యేషాం సకృన్నిపతనమిచ్ఛన్తి ద్రుహిణాదయః|

తేషాం శమ్భుకటాక్షాణామాసం పాత్రం ఫణీశ్వర!||

వ్యాఘ్రపాదుడు :

ఫణీశ్వర! బ్రహ్మాదులుగూడ ఏశివకటాక్షము లొక్కసారి తమమీదపడవలెనని కోరుదురో అట్టి కటాక్షములకు నేను పాత్రుడనైతిని.

శ్లో|| దేవస్య గిరిజాభర్తు: కారుణ్యాంబుధివీచిషు|

ముఙ్త్కం కిన్నామ సుకృతం పురాకార్షమహం ఫణిన్‌||

ఫణీ! దేవదేవుడగు పార్వతీపతియొక్క కారుణాసము ద్రుపు తరంగములలో మునుగుటకు పూర్వము నేనేని పుణ్యము చేసితినో.

శ్లో|| ఇత్యానన్దమహామ్భోధౌ మగ్నోన్మగ్నోవ మునీశ్వరః|

పరమేశమివాలోక్య భగవన్తం పతఞ్జలిమ్‌||

త్వత్త ఏవ మమైతాని మఙ్గలానీతి సంస్తువన్‌|

ఉత్కూలప్రమదో నాగమాలిలిఙ్క పునఃపునః|

ఇట్లానందమహాసముద్రములో మునుగుచు తేలుచు నావ్యాఘ్రపాదుడు పూజ్యుడైన పతంజలిని పరమేశ్వరునిగా జూచి నీవలననే నాకీశుభములు కలిగినవి స్తుతించుచు పొంగి వచ్చు సంతోషముతో మరలమరల నాఫణిని కౌగిలించుకొనెరు.

శ్లో|| జ్ఞానదృష్ట్యాథ స మునిః దృషటం నృత్తమివాధికమ్‌|

పరమానన్దహృష్టాత్మా వ్యాఘ్రపాదమునిస్తదా||

తస్మిం స్తీర్థవరే పుణ్య తం సంస్నాప్య యథావిధి|

మహేశ్వరం తు తేనైవ శ్రీమూలస్థానవాసినమ్‌||

సమస్తభువనాధారం చన్ద్రమణ్డితమ స్తకమ్‌|

కారుణ్యసిన్దుపూర్ణేన్దుం తం హిపూజామకారయత్‌||

పిమ్మట నావ్యాఘ్రపాదముని జ్ఞానదృష్టితో నధికమైన నృత్తమును చూచినటుల హృదమయున పరమానందముతో సంతసించి అపుడాపవిత్రమైన తీర్థరాజమున వానిని యథా విధిగా స్నానముచేయించి సమస్తలోకముల కాధారభూతుడు, చంద్రునిచే నలకంరింపబడిన శిరసస్సుగలవాడు, కరుణాసముద్రమునకు పూర్ణచంద్రుడు, మూలస్థాననివాసియునగు నాపరమే శ్వరుని వానిచేతనే పూజింపజేసెను.

శ్లో|| ప్రదక్షికృత్య చ మునిః తమీశమథనిర్గతః|

స్వాశ్రమాభ్యర్ణతీర్థే చ తం సంస్థాస్య పతఞ్జలిమ్‌||

స్వాశ్రమే యో విధానేనస్థాపితో7 భూన్మహేశ్వరః|

తస్యాపి ఫణినాథేన పుష్పాంజలిమకారయత్‌||

పిమ్మట వ్యాఘ్రపాదు డాయీశ్వరునకు ప్రదక్షిణము చేసి బయలుదేరి తనయాశష్రమసమీపతీర్థమున నాపతంజలి నుంచి తనయాశ్రమమున యథావిధిగా నెలకొల్పిన మహేశ్వరునకుదూడ నాఫణిరాజుచే పుష్పాంజలిని సమర్పింపజేసెను.

శ్లో|| తతస్స పర్ణశాలాయాం సన్నివేశ్య వరాసనే

é సాదరం పూజయామాస సోపనాం మునీశ్వరః||

పిమ్మట నామునీశ్వరుడు పతంజలిని పర్ణశాలలో శ్రేష్ఠమైన ఆసమునకు కూర్చుండబెట్టి ఆదరముతో ఉపావాసముండి పూజించెను.

శ్లో|| అన్యేద్యుః కన్దమూలాని విహితాని వనౌకసామ్‌|

తసై#్మ స్వాదూని నవ్యాని ప్రదదౌ శ్రద్ధయా మునిః||

మరునాడు ముని వనవాసుల కర్హమైన రుచిగల క్రొత్త కందమూలములను శ్రద్ధతో నాతనికి పెట్టెను.

శ్లో|| తతశ్చ జ్ఞానపూర్ణాత్మ ధీమాన్పో7పి పతఞ్జలిః |

నాతిదూరే మునేస్తస్టయ పశ్చాద్భాగే మనోహరే||

తటాకం మహాదుత్ఖాయ పూర్వస్యాం దిశి తీరతః|

ప్రతిష్ఠాప్య విధానేన దయామూలముమాపితమ్‌||

తటాకస్యోత్తరే తీరే విరచయ్యోటజం ఫణీ|

తత్రో వాస ప్రసన్నాత్మా తాణ్డవాలోకలాలసః||

పిమ్మట జ్ఞానముచే పరిపూర్ణడు బుద్ధిమంతుడునగు నాపతంజలి %ామునిక సమీపమున మనోహరమైన వెనుక భాగమున పెద్దతటాకమును త్రవ్వి తూర్పుదిక్కుఒడ్డున దయకు మూలమైన ఉమాపతిని యథావిధిగా ప్రతిష్ఠించి తాను చెరువున కుత్తరతీరమున పర్ణశాలను నిర్మించి ప్రసన్నమనస్కుడై తాండవమును చూడవలెనను కోరికతో నివసించెను.

శ్లో|| తపస్యన్తౌ నిరస్యన్తౌ తావుభౌ లోకికిల్భిషమ్‌|

శ్రీమూలస్థాననిలయం స్వాశ్రమాన్తే నివాసినమ్‌||

పూజయన్తౌ మహేశానం ముదితావమితౌ జసౌ|

శమ్భోః కారుణ్యరూపస్య నృత్తదర్శనకాంక్షిణౌ||

చిత్తలఙ్క రణోపేతౌ ప్రసన్న తరమావసౌ|

ప్రవృద్ధతపసావేతావాసాతామమితద్యుతీ||

వారిద్దరును, తపస్సచేయుచు, లోకముయొక్క పాపమును బోగొట్టుచు, తమయాశ్రమసమీపమున మూలస్థానమందున్న ఈశ్వరుని పూజించుచు,సంతోషించుచు, మహాతేజోవంతులై, కారుణ్యస్వరూపుడైన శివుని నృత్తమును చూడగోరుచు, శమదమాదులుగలవారు. ప్రసన్నమైనమనస్సు గలవారు, వృద్ధిచెందిన తపస్సగలవారు, ఎక్కువకాంతిగల వారునైయుండిరి.

శ్లో|| ఏతస్మిన్నన్తరే సర్వే మృగాస్తద్వనచారిణః|

వ్యాఘ్రరూపీ పురే తస్మిన్‌ మసత్యేవ మహామునిః||

పునరన్యస్సమాయాతః ఫణిరూపో7ధునామునిః|

ఇతి త్రాసోర్ధ్వకణ్ఠాశ్చ వలమానాయతేక్షణాః ||

ఇతస్థతశ్చ గచ్ఛన్తః వ్రస్ఫురద్రోమసంచయాః||

తేనాపిమునినా సాకమాపుః కాలేన మిత్రతామ్‌ ||

ఇంతలో నావనములో సంచరించు మృగములన్నియు ఆపురములో వ్యాఘ్రరూపముగల మహాముని ఉండనేయున్నాడు. మరల ఇప్పుడు సర్పరూపముగల ముని లోపలికి వచ్చెను అని భయముచే కంఠములెత్తి తిరుగుచున్న పెద్ద కన్నులతోను లేచిన రోమములతోను ఇటునటు తిరిగుచు కొంతకాలమున కామునితోకూడ స్నేహము బొందితివి.

శ్లో|| ఏవం చ చరతోస్తత్ర తపః పరమదుష్కరమ్‌ |

తయోర్దిదృక్షావశతో బహవో మునిపుఙ్గవాః ||

సమాగత్య నమస్కృత్య మూలస్థానపతిం శివమ్‌ |

తరుచ్ఛాయాం సమాశ్రిత్య స్థిత్యా తాభ్యాంసమం సదా ||

చిన్తయన్తో మహేశస్య శ్రీమత్పాదామ్బజ ద్వయమ్‌ |

ఈశేనోక్తాం కథాముక్త్వా స్వాగతం చ బభాషిరే ||

ఈ విధముగా వారిద్దరు నచ్చట మిక్కిలి కష్టమైన తపస్సు చేయుచుండగా వారిని చూడవలెనను కోరికతో చాలమంది మునిపుంగవులు వచ్చిరి మూలస్థానప్రభువగు శివుని నమస్కరించి చెట్టునీడకు చేరి వారిద్దరితో కలసియుండి మహేశ్వరుని శ్రీపాదపద్మములను ధ్యానించుచు ఈశ్వరుడు చెప్పిన కథను చెప్పి స్వాగతము పలికిరి.

శ్లో|| తేషామథ వచః శ్రుత్వా తావుభౌ విశ్వవిశ్రుతౌ|

చిదమ్బరం హృది ధ్యాత్వా తాణ్డవం చామ్బికా పతేః ||

సముద్భూతపరానన్దౌ ప్రసన్నముఖవఙ్కజౌ |

స్థానే తత్రైవ సుచిరం కాలమేవం వినిన్యతుః ||

పిమ్మట వారిమాట విని ప్రపంచప్రసిద్ధులైన వారిద్దరును చిదంబరమును, శివుని తాండవమును హృదయముతో ధ్యానించి పరమానందము కలుగగా ప్రసన్నమైన ముఖపద్మములలు గలవారై ఆప్రదేశముననే చాలకాల మీవిధముగా గడపిరి.

శ్లో|| యశ్చేతసా భక్తియుతేన పుణ్యమద్యాయమేనం పఠతిత్రిసన్ధ్యమ్‌ |

పూజ్యస్స లో కైరఖిలైర్మహాత్మా పాతఞ్జలింవిన్దతి కీర్తిమేషః || 49

భక్తితో కూడిన మనస్సుతో నెవడీపవిత్రమైన యధ్యాయమును చదువునో ఆ మహాత్ముడఖిలలోకములకు పూజ్యుడై పతంజలియొక్క కీర్తిని పొందును.

ఇతి శ్రీస్కాన్దే మహాపురాణ సనత్కుమారసంహితాయాం

శ్రీమహేశ్వరనన్తిసంవాదే చిదమ్బరమహాత్మ్యే

శ్రీపతఞ్జలివ్యాఘ్రపాదప్రసజ్గో నామ షోడశో7ధ్యాయః

ఇతి ప్రథమోభాగః

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters