Maa Swami    Chapters   

15. పాల్‌బ్రంటన్‌ సందేశం

పీఠారోహణ వజ్రోత్సవ సందర్భంలో పాల్‌బ్రంటన్‌ తమసందేశాన్ని ఇలా పంపారు;

''దాదాపు నలభైఏళ్ళ క్రితం స్వాములను నేను దర్శించాను. ఆయన నాకిచ్చిన ఉత్తరాలు, ఉపదేశం, వివరణలు, సలహాలు, ఎంతగొప్పవో నేను వెనుదిరిగి చూస్తే తెలుస్తున్నది. రమణుల సన్నిధికి నన్నుపొమ్మని చెప్పినదీ వారే. వారిని దర్శంచి మద్రాసుకు తిరిగివచ్చిననాటి రాత్రి నాకు కల్గిన దివ్యానుభవం- ఏ సర్చ్‌ ఇన్‌ సీక్రెటు ఇండియాలో ఇదివరకే వ్రాసి వున్నాను.

అప్పటికీ ఇప్పటికీ గడచిన సంవత్సరాలలో నేను వారిని పలుమారులు స్మరించాను. ఈ పావనమూర్తి, ఆధ్యాత్మశక్తి మనలలో ప్రవహించడానికి ఒక మహత్తర స్రవంతి: సనాతన ధర్మ ప్రతిష్టాపకులు ఆయన నాగరిక జీవనంలో తగుల్కొన్న భారతీయులు ఆయన ఉపదేశాలను విస్మరిస్తే అంతకంటే విచారకరమైన విషయం మరొకటి ఉండదు.

ఈకాలపు చదువులు చదివిన భారతీయులు తమమతాన్ని నిరాకరిస్తే ఏమవుతుందనే విషయం, పశ్చిమ దేశీయులనుండి తెలుసుకోవచ్చును. ఇపుడిపుడు మతపు విలువలు, ఆధ్యాత్మికలావశ్యకత పాశ్చాత్యులు గుర్తించి వెనుకకు తిరుగుతున్నారు''.

మనభాగ్యవశమున మన మధ్య తిరుగుతూ ద్రాఘీయమైన తనకటాక్ష దీక్షా వల్లరులతో మనలను ప్రేమబంధములోకి త్రోస్తున్న సిద్దపురుషుడు, మహనీయుడు ఆయిన మాస్వామి సంగ్రహకథ ఇది.

Maa Swami    Chapters