Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

అర్థములు



శ్రీ సూరి రామకోటిశాస్త్రి (సంస్కృత కళాశాలాధ్యక్షులు, తెనాలి.)

పుట 3 ''కాతే కాన్తా''

భ్రాతః = ఓసోదరా ! తే = నీకు, కాన్తా = భార్య; కా ఎవ్వతే? తే = నీకు; పుత్రః = కుమారుడు; కః = ఎవ్వడు? భోః - ఓయీ ! త్వం = నీవు; కస్య = ఎవనివాడవు? కుతః = ఎక్కడినుండి, ఆయాతః = వచ్చినవాడవు? తద్‌ ఇదమ్‌ = ఇదియంతయు; మనసి = మనసు=లో; విచిన్తయ = ఆలోచింపుము.

పుట 9-21 ''అలంకార ప్రియో''

విష్ణు = విష్ణువు; అలఙ్కారప్రియః = అలఙ్కరణయందు ప్రీతిగలవాడు; శివః = శివుడు; అభిషేకప్రియః = అభిషేకమున ప్రీతిగలవాడు;

పుట 10 ''ఆ పాతాళ'' (చూ.1, 2 భాగాలు)

పుట 13 ''శ్రీశైల శృంగే''

వివిధప్రసంగే = అనేకవిధములైన ఓషధులు, వృక్షములుగల; శ్రీ శైలశృంగే = శ్రీశైల శిఖరమున; శేషాద్రిశృంగేచ = వేఙ్కటాచలమున, సదా వసన్తః = ఎల్లపుడు వసించుచున్న, తం, అర్జునం, మల్లికపూర్వం, ఏనమ్‌ = మల్లికార్జున నామధేయముతో ఒప్పిన పరమేశ్వరుని.

పుట 19 ''సిద్ధిం తధావిధ''

సమాధీ = సమాధియందు; తధా విధమనో విలయామ్‌ = అట్టి మనోలయము కల; సిద్ధిం = సిద్ధిని శ్రీశైల శృఙ్గ కుహరేషు = శ్రీ శైలశిఖరగుహలయందు; కదా-ఎప్పుడు; ఉపలపే=్య = పొందెదనో కదా!

పుట 22.9 ''ఆత్మైవహ్యాత్మనో''

ఆత్మాఏవ = తానే. ఆత్మనః = తనకు, బంధుఃహి = బంధువుకదా! ఆత్మనః = తనకు; ఆత్మాఏవ = తానే, రివుః = శత్రువు,

పుట 22-20 ''శ్రీశైల శిఖరం దృష్ట్వా''

శ్రీ శైల శిఖరందృష్ట్వా = శ్రీ శైల శిఖరమునుచూచి ; పునర్జన్మ విద్యతే = మఱల జన్మలేదు-

పుట 24-4 ''వేదో నిత్య మధీయతాం''

వేదః = వేదము; నిత్యం = ప్రతిదినము; అధీయతామ్‌ = అధ్యయనము చేయబడుగాక; తదుదితం = ఆవేదముచే చెప్పబడిన; కర్మ = ధర్మము; స్వనుష్ఠీయతామ్‌ చక్కగా అనుష్ఠింప బడుగాక.

పుట 25-20 ''సత్యం జ్ఞాన''

సత్యం జ్ఞాన మనన్తం బ్రహ్మ = బ్రహ్మ సత్యమ్‌ = త్రికాలాబాధ్యము, జ్ఞానః = చైతన్య స్వరూపము; అనన్తమ్‌ = దేశ కాలవస్తుపరిచ్ఛేద రహితము;

పుట 26-3 ''యో వేదం''

యః = ఎవ్వడు; పరమేవ్యోమన్‌ = శ్రేష్ఠమైన ఆకాశమున పరమాత్మను; గుహాయాం నిహితం = బుద్ధి గుహయందు దాగియున్న వానిని; వేద = తెలిసికొనునో.

పుట 28 ''కామకోటి''

కామకోటి... పూతమూర్తయే = కామకోటి మహాపీఠమునందు కామాక్షి దేవిచే, పవిత్రీకృతమైన మూర్తి కలిగినట్టియు; భక్తతీర్థాయ = భక్తులపాలిటి తీర్థస్వరూపుడునగు; చంద్రశేఖరరూపాయ తే నమః = చంద్ర శేఖర స్వరూపు డవగు నీకు నమహ్కరము.

పుట 28 ''యద్భారతీయ''

భారతీయ సర్వస్వం = భారతీయుల పాలిటి పెన్నిధియు; సంస్కృతేః = భారతీయ సంస్కృతికి, మూలకారణం యత్‌ = ఆదికారణ మేదియో : కామకోటిః సా కాంచీపురసుందరీ విరాజతే = కామకోటిస్వరూపిణి యగు ఆ కాంచీపుర సుందరి విరాజిల్లుచున్నది. ఇట

--------------------------------------------------------------------------------------------------------

శ్రీ కాంచీ జగద్గురువులు తొలిసారి (27-4-67) విజయవాడ విచ్చేసినపుడు హరిసోదరులచే జరుప బడిన శ్లోకములు.

--------------------------------------------------------------------------------------------------------------

కామాక్షీ దేవికిని తదారాధక శ్రీ కామకోటి స్వామి వారికి అభేదభావన.

పుట 28 ''కామానాం''

యా కామానాం పరాకాష్ఠా = కామములకు ఏది ఉత్తమమైన పర్యవసానమో; కామధుక్‌ = కోరికలను గురియునదియు; కామలోచనా = కామాక్షీ స్వరూపిణియు, కామకోటిః చంద్రశేఖర సుందరీ విజయతే = కామకోటి స్వరూపిణి యగు చంద్రశేఖర సుందరి సర్వోత్కృష్టముగా విరాజిల్లుచున్నది. ఇట చంద్రశేఖర సుందరి యనగా చంద్రశేఖరునియొక్క సుందరి కామాక్షి యనియు; చంద్రశేఖరేంద్ర సరస్వతి యనియు రెండర్థములు.

పుట 28 ''కామైః పరం''

కామైః = కోరికలచేత: పరం = మిక్కిలి; కోటి తానాం = క్రుంగి పోవునట్టియు; కామం = యథేచ్ఛముగా; సంసరతాం = సంసారమున బ్రవర్తించు వారల యొక్క; కామాంస్తు = కోరికలనయితే. సదా = ఎల్లప్పుడు; త్రయీమయీ = వేదవిద్యాస్వరూపిణియయిన: ఏషాకామకోటి ః = ఈ కామకోటి (ఈకామకోటిసరస్వతి) కోటయతి నశింపజేయుచున్నది.

పుట 28 ''ఋషిభిర్ధర్శితం''

ఋషిభిః = మహరులచేత; దర్శితం = దర్శింపబడిన; ప్రాఞ్చం = సనాతనమైన. వేదమూలం = వేదప్రమాణకమైన; జగద్ధితం = లోకహితమైన; ధర్మ్యం = ధర్మబద్ధమైన, అర్థం = అర్థములో; కామకోటి సరస్వతీ = శ్రీ కామకోటి సరస్వతీస్వామి, వితనుతే = అనుగ్రహించుచున్నాడు.

పుట 28 ''పరకీయ''

పరకీయ మతోద్బోధైః = అన్యమత ప్రచారములచే; నూనం = నిశ్చయముగా; పరవశీకృతాన్‌ = మోహితులైన వారిని, ఉద్ధర్తుం = ఉద్ధరించుటకు; ఏషా = ఈ, కామకోటి సరస్వతీ ఏవ = కామకోటి సరస్వతియే; అలం = సమర్థమైనది.

పుట 29 ''ఇడాసరస్వతీ''

ఇడా సరస్వతీ భారతీదేవ్యః = ఇడా-సరస్వతీ-భారతియను దేవతలు మువ్వురు; వేదవిశ్రుతాః = వేదప్రసిద్ధులు; కామకోటి సరస్వతి = శ్రీ కామకోటి సరస్వతి; తత్తత=్వరూప మహతీ = ఆయా ఇడాది దేవతాస్వరూపములతో విలసిల్లుచు పూజనీయ యగు చున్నది.

826ొ

ఇడా సరస్వతీ భారతీ:- వీరు నిరంతర సాహచర్యము గల మువ్వురు దేవతలు, వీరు అగ్ని - వాయు-ఆదిత్యులతో కలసి యజ్ఞభూమి నలంకరించు చుందురు. ఇడ, సరస్వతి, భారతి యని వాగ్దేవతకు, వేదవాక్కునకును నామధేయములు. ఒకే వేదవాక్కు అధియజ్ఞముగ = కర్మానుష్ఠాన సమయమున ఇడారూపిణి, ఉపాసనాదశ యందు సరస్వతీ రూపిణి, జ్ఞానభూమికయందు భారతీ రూపిణియై పొడగట్టుచుండును. శ్రీ స్వామివారును వేదవిద్యాస్వరూపులు, అందుచే వీరును కర్మో పాసనా జ్ఞానభూమికలయందు ఇడాది స్వరూపములతో దర్శింపబడుచుందురని భావము. ఈ విషయము క్రింది శ్లోకములవలన స్పష్టమగును.

పుట 29 ''ఈడ్యతే కర్మసు''

భారతీయైః = భారతీయులచే, గృహేగృహే = ప్రతి గృహమందును, సదా = ఎల్లప్పుడు; కర్మసు = కర్మల యందు; ఈడ్యతే = ఆరాధింపబడున్నది; కావున, ఇడా = ఇడారూపిణియై; దేవహూః = వివిధ దేవతాహ్వాన కర్త్రియై వెలయు; విద్యా = వేదవిద్యయే; ఇయం కామకోటి సరస్వతీ = ఈ కామకోటిసరస్వతి.

కర్మానుష్ఠాన సమయమునందు వేదమంత్రములచే వివిధ దేవతాహ్వానము, స్తుతియ జేయబడుచుండును. అట దేవతాతత్త్వవిచారముతో నిమిత్తము లేక కేవల దేవతాహ్వానస్తుతుల కుపయోగపడెడి వేదవిద్యకు 'ఇడా' యని ప్రసిద్ధి. 'ఇడా దేవహూ ర్మనుర్యజ్ఞనీః ' = తై, సం, 3, 3, 2, 1; ''ఇడావై మానవీ యజ్ఞానూ కాశిన్యాసీత్‌'' తై బ్రా, 3, 1, 4, 'ఇడాయేషాం గణ్యా మాహినాగీః' - ఋ, 3, 7, 5 - ఇత్యాది శ్రుతులు ఈ ఇడాస్వరూపమును జక్కగ వివరించుచున్నవి.

పుట 29 'జీవేశ్వరా'

జీవేశ్వరౌ = జీవేశ్వరులే, తౌ అశ్వినౌ = ఆ ప్రసిద్ధులైన అశ్వినిదేవతలు; యత=ంపృక్తా = ఏ అశ్వినులతో నిత్యసాహచర్యము గలిగినదై; తదనన్యత్వ సంధాత్రీ ఆ జీవేశ్వరుల కభేదమును దర్శింపజేయు, యా సరస్వతీ = ఏ సరస్వతి కలదో; సా = ఆమెయే; కామకోటి సరస్వతి. అధికారి భేదము ననుసరించి సాధకులకు అధియజ్ఞముగను, అధిదైవముగను, ఆధ్యాత్మికముగను దేవతాస్వరూపము సాక్షాత్కరించును. అశ్వినీదేవతల యొక్క రూపము ఆదిభౌతికముగా ద్యావాపృథువులు; లేక అహోరాత్రములు: ఆధిదైవికముగ సూర్యచంద్రులు (చూ, నిరుక్తము (12-1). ఆధ్యాత్మికముగ జీవేశ్వరు లశ్వినులు. ఈ విషయము మహాభారతము పౌష్యపర్వమున ఉపమన్యుకృత - అశ్వినీస్తోత్రము వలన స్పష్ట మగును. స్తోత్రరూపములగు ఋక్కులను వ్యాఖ్యానించుచు నీలకంఠ పండితుడు 'తత్‌ -త్వం' పదవాచ్యులైన జీవేశ్వరులే ఇట అశ్విను లని వివరించినాడు (చూ, నీలకంఠీయము). అశ్వినులతో సరస్వతికి నిత్యసాహచర్యము వేదప్రసిద్ధము ''సరస్వతి మనసా పేశలం వసు నాసత్యాభ్యాం వయతి దర్శితం వపుః; సరస్వతీ యోన్యాం గర్భ మన్తః'' ''ఆశ్విభ్యాం పత్నీ సుకృతంబి భర్తి'' తై. బ్రా. 2-6-4; 5. ఉపాసనా పరుడగు సాధకుని యందుడెడి వేదవాణియే సరస్వతి. శ్రవణముచేసి శ్రుత్యర్థమును జక్కగ మననము జేయు విద్వాంసుని మనసు= వివిధ విజ్ఞానములకు నిలయమై 'సరస్వా&' అగుచున్నది. తద్గతమగు వాక్కు (వేదవాణి) సరస్వతి యగునని సంప్రదాయము. ''మనో హిసరస్వాన్‌; వాక్‌ సరస్వతీ: ఏతౌ సారస్వతా వుతౌ='' - శ. బ్రా. 7-5-1-31. ( చూ. సా. భా.) ఈ సరస్వతి మననము చేయు కాలమున జీవేశ్వరుల కనన్యత్వము నుపదేశించుచుండును. 'వేదా భ్యాసకాలే సరస్వతీ స్వార్థమేభ్యః ప్రకాశయతీ త్యర్థః' సా.భా.ఋ.10-71-11. వేదవిద్యా స్వరూపిణియైన ఈ కామకోటి సరస్వతియు తగిన యధికారుల కిట్టి యుపదేశముల ననుగ్రహించుచు తన సరస్వతీ నామమును సార్థక పఱచు కొనుచుండును.

పుట 29 ''యాభారతీ''

తత్త్వమయీ = తత్త్వస్వరూపిణియు; సామస్వరూపిణీ = సామస్వరూపిణియు; స్వస్థా = ఆత్మ తత్త్వ ప్రతి పాదికయు నగు; యా భారతీ = ఏ వేదవిద్యగలదో, ఇయం కామకోటి సరస్వతీ = ఈ కామకోటి సరస్వతి; సైవ భారతీవిద్యా = ఆ వేదవిద్యా స్వరూపిణియే.

ఆత్మవేత్తయం దున్న వేద విద్య భారతీ స్వరూపిణి, భరతః = ఆదిత్యః; ఈశ్వరః; తస్య ఇయం భారతీ; ఛాయాం విద్యాయాం రతః భారతః; తస్య ఇయం భారతీ; భారం విజ్ఞాన సర్వస్వం తనోతీతి భారతి; ఒకే వేదవిద్య కర్మయోగమున యజూరూపిణియై; ఉపాసనా యోగమున ఋగ్రూపిణియై, జ్ఞానయోగమున సామస్వరూపిణియై సాక్షాత్కరించువని సంప్రదాయము.

'యోగేన దాక్ష్యేణ దమేన బుద్ధ్యా, బాహుశ్రుత్యేన తపసా నియోగైః ఉపాస్యాస్తా కృత=్నశో దేవతా యాః ఋచో హ యో వేద సవేద వేదాన్‌, యజూంషి యో వేద సవేద యజ్ఞాన్‌, సామాని యో వేద సవేదతత్త్వమ్‌' -బృహద్దేవత 8-130.

కాన తత్త్వప్రతిపాదికయు, సామస్వరూపిణి యగు వేదవిద్య భారతిగా కీర్తింపబడినది. ఆత్మవేత్త యగు ఈ కామకోటి సరస్వతియు అట్టి భారతీ స్వరూపిణి.

పుట 29 ''అసందిగ్ధా''

ఇయం కామకోటి సరస్వతీ = ఈ కామకోటిసరస్వతి, అసందిగ్ధాస్మృతిః = సందేహమున కెడ మీయని; శ్రుతి మార్గాను సారిణియైన స్మృతి, శ్రుతిః = వేదస్వరూపిణి, సతాం = సత్పురుషులకు, అమృతా = అమరణధర్మము గల, శ్రీః = సిరి. (సా హి శ్రీ రమృతా సతామ్‌), అద్వైత తత్త్వస్య నిధిః = అద్వైత తత్త్వమునకు నిలయము.

వేదబాహ్యములైన శ్రుతులు కేవల పురుషబుద్ధి కల్పితములు గాన సందేహాస్పదము లగును. కాన నవ్రమాణము లగును. మన్వాది స్మృతులు పురుషబుద్ధి కల్పితములు గావు. అసందిగ్ధశ్రుతి మార్గానుగాములు, అందుచే నసందిగ్ధములై ప్రమాణము లగుచున్నవి.

(శ్రీ జగద్గురువులు హైదరాబాదు నుండి మరల విజయవాడ విచ్చేసినపుడు చదువబడిన శ్లోకములు)

పుట 29 ''కామకోటి''

కామకోటి. . . వాసినీం = కామకోటి మహాపీఠము నధివసించి యున్నట్టియు, కామితార్థదాం = అభిమతార్థముల నొసగునట్టియు, చంద్రశేఖర సుందరీం తాం దేవీ వందేమహి = చంద్రశేఖర సుందరి యగు ఆ దేవికి నమస్కారము.

పుట 29 ''కామాన్‌ పరం''

కామాన్‌ = కోరికలను, పరం = మిక్కిలి; కోటయన్తీ = దహించునట్టియు; ధర్మావిరోధినం = ధర్మవిరుద్ధముగాని; కామం = కామమును; కల్పయన్తీం = సిద్ధింపజేయునట్టి; కామకోటిం = కామకోటి స్వరూపిణియైన; కాంచీపురప్రభావం వందే = కాంచీనగరజ్యోతికి నమస్కారము.

పుట 29 ''పరార్ధ జీవినాం

పరార్థ జీ­©ాం = పరుల కొఱకయియే జీవించువారలకు; నైవ విశ్రాంతి అతిబోధితుం = విశ్రాంతి యుండదని బోధించుటకై; దేశేదేశే సంచరన్తీం = దేశ దేశములందు సంచరించుచున్న, కాంచీపుర ..... వందే.

పుట 29 ''దేవాలయో''

వేదశిల్పం దేవాలయః = వేదశిల్పమే దేవాలయము, ఇతి బోధయితుం = అని ప్రబోధించుటకై; ముహుః = ఏటేట; శిల్పసదః నిర్వహన్తీః = ఆగమశిల్ప సదసు=ను నిర్వహించుచున్న, కాంచీపుర...... ........ వందే.

పుట 30 ''గజేగవిచ''

శ్రుత్యుక్తం = వేదబోధితమైన; గజే గవి చ పూజ్యత్వం = గజమునందును! గోవునందును, గల పూజ్యత్వమును, బోధితుం = ప్రబోధించుటకు; స్వయం = స్వయముగా; గజంగాం చ పూజయన్తీ = గజమును గోవును పూజించెడి, కాంచీపుర.................... వందే.

మత్తవారణము రాజలాంఛనము పట్టపు టేనుగును ఔపవాహ్య మందును, 'రాజవాహ్యస్త్వౌపవాహ్యః'- అమరము, రాజవాహ్యమైన యిట్టి మత్తవారణమునకు భద్రగజః, భద్రః - అనియు ప్రసిద్ధి, పరమేశ్వరునకు 'భద్రః' అనియు, వరాదేవతకు 'భద్రా, భద్రాకాళీ' యనియు ప్రసిద్ధి. వేదము వేదవాక్కును 'భద్రా'యని కీర్తించుచున్నది. 'భద్రం కర్ణేభిః శ్రుణుయామ'; 'భద్రం పశ్యేమాక్షిభిః - అని శ్రుతి - భద్ర వాక్యశ్రవణము, భద్రవస్తు దర్శనము కర్తవ్య మని శాసించు చున్నది. భద్రంకరములై దర్శనీయములగు వస్తువులలో గో-గజములు ప్రశస్తములు, వీని దర్శన-పూజనాదులు శ్రుతి స్మృతి సమ్మతములు, శిష్టాచార పరిగృహీతములునై వరలుచున్నవి. శ్రీ జగద్గురువు లట్టి సంప్రదాయమును ప్రబోధించుచు స్వయముగ దైనందిన మాచరించు చున్నారు.

పుట 30 ''శ్రుతిర్య ఏవం''

య ఏవం వేదేతి = య ఏవం వేద (ఎవడీ తత్త్వము నెఱుగునో) యనుచు, శ్రుతిః = వేదము, యత్‌ అద్వయం తత్త్వం బ్రూతే = ఏ అద్వయతత్త్వమును ప్రబోధించుచున్నదో, తత్తదర్ధం బోధయన్తీం = అట్టి తత్త్వమును ప్రబోధించెడి, కాంచీ ................... వందే.

పుట 30 ''కుమారః''

కుమారః = శిశువు; తత్తతేతి = తత -తాతయనుచు; యాం ప్రథమాం వాచం బ్రవీతి = తొలి పలుకుగా ఏ 'తత్‌' శబ్దమును పలుకుచున్నాడో: తత=్వరూప ప్రకాశికాం = 'తత్‌' శబ్దవాచ్యుడైన ఆ పరమేశ్వరునియొక్క స్వరూపమును ప్రకాశింపజేయు; తాం కాంచీ................ వందే.

ఈ విషయమును శ్రుతి యిట్లు చెప్పుచున్నది.

ఏతాం వావ ప్రజాపతిః ప్రథమాం వాచం వ్యాహరత్‌, ఏకాక్షర ద్వ్యక్షరాం తతేతి తాతేతి, తథైవైత త్కుమారః ప్రథమవాదీ వాచం వ్యాహ రత్యే కాక్షర ద్వ్యక్షరాం తతేతి, తయైవ తత్తత వల్యా వాచా ప్రతిపద్యతే | తదుక్త మృషిణా - 'బృహస్పతే ప్రథమం వాచో అగ్ర 'మితి' - ఐత రేయూరణ్యకమ్‌.

827ొ

సంస్కృత భాషయందు 'తత్‌' శబ్దమునకు ప్రసిద్ధుడైన పరమేశ్వరుడని యర్ధము. శిశువులు మాటలు రాకపూర్వము తొలుదొలుత ఉచ్చరించెడి 'తత- తాతే' త్యాదిశబ్దములు 'తత్‌' శబ్దమున కుపలక్షకములు- అని శ్రుతి చెప్పుచున్నది. తచ్ఛబ్దవాచ్య పరమేశ్వర తత్త్వమును ఈ కాంచీపుర జ్యోతి దేశ దేశములందు ప్రకాశింప జేయుచున్నది.

పుట 30 ''యావచ్చ విష్టితం''

బ్రహ్మ = పరబ్రహ్మ; యావ ద్విష్టితం = జగద్రూపమున నెంతవరకు వ్యాప్తమైనదో; తావతీ వాక్‌ = అంతవరకు వాక్కు తద్వాచక రూపమున వ్యాప్తమై విలసిల్లును-అని శ్రుతి. తద్వాక=్వరూప మహతీం = కాంచీపుర..........వందే వాగర్థతత్త్వము నుద్దీపింప జేయు ఆవేదవిద్యా స్వరూపిణియై పూజనీయ యగు కాంచీపుర జ్యోతికి నమస్కారము.

'యావద్బ్రహ్మ విష్టితం తావతీ వాక్‌'

ఋ 10-1-4-8.

'యాద ద్బహ్మ విష్టితం తావతీ వాగితి యత్రహ క్వచ బ్రహ్మ తద్వాక్‌, యత్ర వా వాక్‌ తద్వా బ్రహ్మే త్యేత దుక్తం భవతి' -ఐతరేయ బ్రాహ్మణ-

1-3-8-16

పుట 30 ''నిరుక్తభారతీ''

యేషాం = ఎవరికి; నిరుక్తభారతిః = 'నిరుక్త భారతి' యను వేదవాఙ్మయ పరిశోధనాత్మకమగు సంస్థ; సమైక్యామృతవరిణి = సర్వశాస్త్ర సమన్వయ మనెడి యమృతమును గురియునో: ఐహికముగ సోదరుల మధ్య సమైక్యభావ మనెడి యమృతంపు భావము వెల్లివిరియ జేయునో; తత్పాదసేవనాసక్తాః అట్టి వేదమాతృ పాదసేవా తత్పరులగు, హరిసోదరాః = హరిసోదరులు; వందందే = నమస్కరించు చున్నారు.

పుట 32 ''సరస్వతి'' ''పద్మపత్ర''

సరస్వతీ! = ఓ సరస్వతీ!, తుభ్యం = నీ కొఱకు; నమః = నమస్కారము, వరదే! = వరముల నిచ్చుదానా: కామరూపిణి ! = స్వేచ్ఛచే రూపముల ధరించుదానా? విద్యారంభం కరిష్యామి = చదువు మొదలు పెట్టుటను చేతును: మే = నాకు; సదా = ఎల్లప్పుడు; సిద్ధిః = సిద్ధి, భవతు = కలుగుగాక-పద్మపత్రవిశాలాక్షీ! = తామరాకులవంటి విశాలమైన కన్నులు గలదానా! = పద్మ కేసరవర్ణినీ = పద్మకింజల్కముల రంగులకలదానా!, నిత్యం పద్మాలయా = ఎల్లపుడు పద్మము లందు నివసించు దేవీ! దేవి, పూర్ణేందు బిమ్బాననా! = పూర్ణ చంద్ర బింబమువంటి ముఖము కల, సా భగవతీ సరస్వతీ = ఆ సరస్వతీ దేవి; మాం = నన్ను; పాతు = రక్షించుగాక.

పుట 38-8 ''స్త్రియంపురుష''

స్త్రియం పురుషవిగ్రహమ్‌ = పురుషాకారములో నున్న స్త్రీవి;

పుట 47 ''యతౌ=శీల్యం''

జనకతనయాయాః = జనకచక్రవర్తి కూతురగు సీతా మహాసాధ్వికి, యత్‌ సౌశీల్యమ్‌ = ఏ సుశీలము (కలదో!) త్వయి = నీయందు; యః ప్రేమభూమా = ఏ ప్రేమాతిశయము, త్వ చ్ఛౌర్యప్రణయ గరిమాయః = నీపరాక్రమమునందు ప్రేమాతిశయము ఏది కలదో, యా అపి అవజ్ఞా దశాస్యే = రావణాసురుని యందు ఏతృణీకారభావము కలదో; నిశిచరవతేః = రావణాసురునకు; యా చ అహంతా = ఏ అహంకారము; కలదో తత్‌ సమస్తం దాని నంతయు, రఘువర! = ఓ రఘు శ్రేష్ఠా మేప్రత్యక్షం = నా కన్నుల ఎదుట. తయోః = వారిద్దరికి; ప్రవృత్తః = జరిగిన, వివాదః = వివాదము; వ్యనక్తి = ప్రకటించుచున్నది.

పుట 49 ''అతల్పం''

జనకజే ! = ఓ సీతా!, రజనిషు = రాత్రులందు, (రాముడు) అతల్పం నిద్రాళుః = శయ్యలేకుండా నిద్రించువాడు; కువాక్‌ = చెడుమాటలు పలుకువాడు; దుర్గతతమః = పరమదరిద్రుడు; మహాకాతర్యాఢ్యః = మిక్కిలి పిఱికివాడు; విధుత ప్రోజ్జ్వలయశాః = యశోహీనుడు; వధాత్‌ మాంసాదానం = మృగములను చంపి మాంసము తినువాడు; బహువిమతలాభః = చాలా కష్టముల పొందినవాడు.

పుట 56 ''నారాయణం''

నారాయణం = నారాయణుని; నరోత్తమం = మనుష్య శ్రేష్ఠుడైన: నరం = నరుని; సరస్వతీం దేవీం చ = సరస్వతిదేవిని; నమస్కృత్య = నమస్కరించి, తతః = పిమ్మట, జయమ్‌ = భారతమును; ఉదీరయేత్‌ = పఠింపవలయును.

పుట 57-5 ''వాయవ్యమ్‌''

వాయవ్యం వాయుదేవతాకమగు; శ్వేతం = తెల్ల పశువును ఆలభేత = ఆలంబనము చేయ వలయును.

పుట 58-14 ''మహామోహ''

మహామోహధ్వాన్త వ్రశమనరవిః = గొప్ప అజ్ఞాన మనెడి చీకటిని నశింపజేయుట యందు సూర్యుడు;

పుట 59-7, 8 ''కురుకర్మైవ'' ''తస్మాత్‌''

తస్మాత్‌ = అందువలన; త్వం = నీవు; కర్మైవ = కర్మనే; కురు = చేయుము,

తస్మాత్‌ = అందువలన; యుధ్యస్వ = యుద్ధము చేయుముః భారత ! = ఓ అర్జునా!

పుట 60 ''యావానర్థః''

సర్వతః సంప్లుతోదకే = అంతట జలసమృద్ధిగల; ఉదపానే = సరోవరమున; యావాస్‌ అర్థః = ఎంత ప్రయోజనము కలదో; విజానతః బ్రాహ్మణస్య = అఖణ్డబ్రహ్మజ్ఞానము సంపాదించినవానికి; సర్వేషు వేదేషు = సమస్తమైన వేదములందు; తావాన్‌ = అంత ప్రయోజనము.

పుట 65 ''నారాయణం'' (చూ 56 పుట)

పుట 75 ''భక్త్యామాం''

భక్త్యా = భక్తితో; మాం = నన్ను; అభిజానాతి = తెలిసికొనుచున్నాడు. (అహం = నేను) తత్త్వతః = యథార్థముగా; యావాన్‌ = ఎంతటివాడనో; యశ్చ అస్మి = ఎట్టిస్వరూపము కలవాడనో; తతః = తరువాత; మాం = నన్ను; తత్త్వతః = యథార్థముగా; జ్ఞాత్వా = తెలిసికొని; తదనన్తరం = తరువాత; విశ##తే = ప్రవేశించును.

పుట 70 ''బ్రాహ్మణన''

బ్రాహ్మణన = బ్రాహ్మణునిచేత; నిష్కారణః = ఫలా పేక్షలేకుండా; షడంగో వేదః = ఆరు అంగములతో కూడిన వేదము; అధ్యేయః = అధ్యయనము చేయబడవలయును; జ్ఞేయః చ = అర్థము తెలిసికొనబడవలయును.

పుట 72 ''ఉచ్చైర్గతి''

జగతి = లోకమున; ఉచ్చైఃగతి = ఉన్నతి; ధర్మతః చేత్‌ సిధ్యతి = ధర్మము చేతనే సిద్ధించినచో; తస్య = ఆధర్మమునకు; ప్రమా = ప్రమితి; కృతకేతరైః వచనైఃచేత్‌ అపౌరుషేయ = వేదవచనముల చేతనే; అయినచో, తేషాం ప్రకాశన దశాచ = వానిని లోకము ప్రకాశింపజేయుట భూసురులచేతనే అయినచో; తా& అన్తరేణ = వారిని వదలిపెట్టి, మత్ర్పణామః = నా నమస్కారము. క్వను = ఎచ్చట? నివతేత్‌ = పడును?

పుట 78-15 ''యాదేవీ''

యా దేవీ = ఏ దేవి;

సర్వభూతేషు = సమస్తప్రాణులందు; (ఉన్నదో!)

పుట 83-7, 8 ''ఆత్మానం''

ఆత్మానం = తనను; శివరూపం = శివస్నరూపిగా; భావయేత్‌ = భావింపవలయును. ఆత్మానం దేవీ రూపేణ = భావయేత్‌ = తనను దేవీ స్వరూపముగా భావింపవలయును.

పుట 94 ''జ్ఞానేమౌనం''

జ్ఞానే మౌనం = జ్ఞానమున్నను ప్రదర్శింపక ఊరకుండుట; శక్తౌక్షమా = శక్తి యున్నను ఓరిమివహించుట; త్యాగేశ్లాఘా విపర్యయః = దానము చేసినను తనను పొగడుకొనకుండుట.

పుట 95-4 ''గురోస్తు''

గురోః తు మౌనం వ్యాఖ్యానమ్‌ = గురువు యొక్క మౌనమే తత్త్వబోధ.

శిష్యాః తు ఛిన్న సంశయః = శిష్యులైతే సంశయములు తీరినవారు ఐరి.

మాం = నన్ను, నిత్యం = ఎల్లప్పుడు

పుట 100-6 ''కీర్తయంతః''

కీర్తయంతః = కీర్తించుచు; నామస్మరణ చేయుచు; బోధయన్తః = బోధించుచు; కథయన్తః చ = చెప్పుచు;

పుట 101 ''అనన్యాశ్చింతయంతః ''

యే జనాః = ఏ జనులు; అనన్యాః చిన్తయన్తః = మఱియొక దానిమీద మనసు= పోనీయక; మాం = నన్ను; పర్యుపాసతే = సేవించుచున్నారో, నిత్యభి యుక్తానాం = సంతతము భగవంతునే నమ్మి నడచుకొను; తేషాం = వారియొక్క; యోగక్షేమం = యోగక్షేమములను; అహం = నేను; వహామి = వహించుచున్నాను.

పుట 107 ''దేవపితృ కార్యా''

దేవపితృ కార్యా భ్యాం న ప్రమదితవ్యమ్‌ = దేవకార్య పితృకార్యము లందు ఏమఱువరాదు.

పుట 107 ''సర్వదేవ''

సర్వ దేవనమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి = ఏదేవునికి నమస్కారము చేసినను కేశవునికి చెందును.

పుట 107 ''తైర్దత్తా''

తైర్దత్తాన్‌ = వారిచే ఇవ్వబడిన వస్తువులను!, భ్యః = వీరికొఱకు; అప్రదాయ = ఇవ్వక; యః ఎవడు; భుఙ్కే = భుజించునో; సః = అతడు; స్తేనః ఏవ = దొంగయే;

పుట 120 ''రామాయ''

రామభద్రాయ = లోకమును రంజింపజేయు మంగళ మూర్తియైనటు వంటిన్నీ, రామచంద్రాయ = చంద్రునివలె ఆహ్లాదకరుడైనటువంటిన్నీ, వేధసే = సర్వవిధారకుడై నట్టియు, రఘునాథాయ = రఘుకులమున కధినాథుడైనట్టియు,

828ొ

నాథాయ = ప్రభువైనట్టియు, సీతాయాః పతయే = సీతా ప్రాణనాథుడైన, రామాయ = శ్రీరామునకు, నమః = నమస్కారములు.

ఈ శ్లోకమున మొదటిపాదమున శ్రీరాముని పారమైశ్వర్యము. రెండవ పాదమున శ్రీరామావ తార విభూతియు వర్ణితము.

పుట 129 ''విశుద్ధ''

త్రివేదీయజ్ఞచక్షుషే = వేదత్రయాత్మకము; వేదత్రయాత్మకమగు యజ్ఞమునకు నేత్రమై నట్టియు; విశుద్ధజ్ఞానదేహాయ = సంశుద్ధ జ్ఞానమే శరీరముగాగల; సోమార్థథారిణ = చంద్రశేఖరుడు, ఉమార్థధారి, సోమరసఫలస్వరూపుడు, అగుపరమేశ్వరునకు; శ్రేయః ప్రాప్తినిమిత్తాయ = సకల ప్రాణికోటి శ్రేయసు= నిమిత్తము; నమః = నమస్కారము.

పుట 129 ''షడ్భిరంగై''

వేదాయ, భవాయ చ తుభ్యం నమః = వేదమునకు, పరమేశ్వరునకు నమస్కారము, షడ్భిః అంగైః ఉపేతాయ = శిక్ష, వ్యాకరణము, ఛందసు=, నిరుక్తము, జ్యౌతిషము, కల్పము అను ఆఱు అఙ్గములు కలది వేదము. అట్లే భవుడు ఆఱు అఙ్గములు కలవాడు; అవి యెవ్వి యనగా : - సర్వజ్ఞత, తృప్తి, అనాదిబోధ స్వతంత్రత, నిత్యమలుప్తశక్తి; అనన్తశక్తి; యనునవి. వివిథైరవ్యయైః అపి ఉపేతాయ చ, = మొదలగు అవ్యయములు వేదమున కలవు; జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, తపసు=, సత్యము, క్షమ, ధృతి, ద్రష్టృత్వము, ఆత్మసంబోధము, అను అవ్యయములు వది పరమేశ్వరునకు కలవు. శాశ్వతాయ = వేదము సనాతనము నిత్యము, భవుడు, నిత్యుడు, సనాతనుడు, వేదము పరమేశ్వరస్వరూపమని భావము.

పుట 129 ''త్యక్తవ్యో''

బ్రహ్మణ = బ్రహ్మకొఱకు; మమకారః = నాది యను భావము; త్యక్తవ్యః విడువదగినది అది, త్యక్తుం = విడచుటకు; నశక్యతేయది = సాధ్యము కానిచో; మమ కారః కక్తవ్యః = మమకారము చేయదగినదే; కింతు = కాని; న = పుత్రమిత్ర కళత్రాదు లందు మాత్రమే కాదు; సర్వత్ర కర్తవ్యం = అంతట అందఱియందు చేయతగినది.

పుట 146-2 ''శివశ్శ క్త్యా''

శివః శక్త్యాయుక్తః యది భవతి శక్తః ప్రభవితుం = శివః = శివుడు; శక్త్యాయుక్తం యది = శక్తితో కూడి యున్నప్పుడే; ప్రభనితుం = ప్రభువగుటకు; శక్తః భవతి = సమర్ధుడు అగుచున్నాడు.

829ొ

పుట 155-1 ''అంకోలం''

అఙ్కోలం నిజ బీజసన్తతిః = ఊడుగచెట్టును తన గింజలు, అయాస్కాన్తోపలం సూచికా = సూదంటుఱాయిని సూది; సాధ్వీనైజవిభుం = పతివ్రత తన భర్తను; లతాక్షితిరుహం = తీగెచెట్లును;

పుట 161-7 ''తస్మాచ్ఛాస్త్రం''

కలిః సాధుః = కలియుగము మంచిది, తస్మాత్‌ = అందువలన, కార్యాకార్యవ్యవస్థితౌ = మంచిచెడ్డ (ధర్మాధర్మము)ల నిర్ణయమున, శాస్త్రం = శాస్త్రము, ప్రమాణమ్‌ = ప్రమాణము.

పుట 162 ''అయోధ్యా''

అయోధ్య, మధుర, మాయ (హరిద్వారము) కాశి, కాఞ్చి, ఉజ్జయిని, ద్వారక సప్తఏతే = ఈయేడు పురములు, మోక్షదాయకాః = ముక్తిప్రదములు.

పుట 165 ''త్వ దన్యః''

త్వదన్యః దైవతగణః = నీకంటే ఇతరులైన దేవతలు; పాణిభ్యాం = హస్తములచేత; అభయవరదః = అభయవరద ముద్రలధరించినారు. ఏకా త్వమేవ = నీవొక్కతేవే; ప్రకటిత వరాభీత్యభినయా = పరాభయాభి నయము ప్రకటించుదానవు; స ఏవ అసి = కావు; లోకా నాం శరణ్య ! = లోకములకు రక్షకురాలా!; భయాత్‌ త్రాతుం = భయమువలన రక్షించుటకు; అపిచ = మఱియు; వాఞ్చాసమధికం ఫలందాతుం = కోరినదాని కంటే అధికమగు ఫలమును ఇచ్చుటకు; తన నీయొక్క; చరణౌఏవ = పాదములే, నిపుణౌహి = సమర్థములుకదా!

పుట 167 ''గగనం''

గగనం గగనాకారం = ఆకాశము ఆకాశముతో సాటి; సాగరః సాగరోపమః = సముద్రము సముద్రమును పోలినది.

పుట 1969 ''శంకరః''

శఙ్కరః శఙ్కరః సాక్షాత్‌ = శఙ్కరులు సాక్షాత్పరమేశ్వరుడే; వ్యాసో నారాయణో హరిః = వ్యాసుడు సాక్షాత్‌ శ్రీ మహావిష్ణువు నారాయణావతారము.

పుట 170 ''యోగక్షేమం''

శమ్భో! యోగక్షేమ ధురంధరస్య = ఓ శంభూ! భక్తుల యోగక్షేమ భారము వహించువాడవు; సకల శ్రేయః ప్రదోద్యోగినః = అందఱికి శ్రేయసు= నిచ్చుటకు ఉద్యమించువాడవు; దృష్టాదృష్ట మతోపదేశ కృతినః = కనుపడిన, కనువడని మతముల నుపదేశించుటలో దిట్టవు; బాహ్యాన్తర వ్యాపినః = వెలుపల, లోపల వ్యాపించి యున్నవాడవు; సర్వజ్ఞస్య = సర్వము తెలిసిన వాడవు, దయామయస్య = దయామయుడవు భవతః = అట్టి నీకు; మయా = నాచేత, కిం వేదితవ్యమ్‌ ఏమి తెలుపదగినదికలదు? త్వం = నీవు; పరమాంతరంగః ఇతి = పరమాంతరంగుడవు అని; అన్వహం = ప్రతిరోజు; మే = నాయొక్క; చిత్తే = మనసు=నందు; స్మరామి = స్మరించుచున్నాను.

పుట 173 ''యావర్ణ''

యా = ఏ సరస్వతి; వర్ణ, పద, వాక్య, అర్థ గద్యపద్య స్వరూపిణీ = స్వరూపిణియో; సా మేధా సరస్వతి ఆ మేధాసరస్వతి; మాం = నన్ను; క్షిప్రం శీఘ్రముగా, వాచి = వాక్కునందు; నర్తయతు = నృత్యము చేయించుగాక.

పుట 174 ''యస=ర్వజ్ఞః''

యః సర్వజ్ఞః సర్వవిద్‌ = ఎవడు సామాన్యవిశేషజ్ఞాన సమ్పన్నుడో; యస్య జ్ఞానమయ తవః = ఎవని తపసు= జ్ఞానస్వరూపమో.


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page