Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

'ఆప్తకాముడు' అనగా ఎవరు?

వేదములను అధ్యయనం చేయవలసిందని, అందువలన వచ్చిన ఫలితమును ఈశ్వరార్పణ చేయవలసిందని పెద్దలు చెప్పారు. ఈ విషయాన్నే శ్రీశంకరులు ''సోపాన పంచకస్తోత్రములో'' ''వేదోనిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్టీయతాం'' అను మొదటి శ్లోకములో చెప్పారు. ఈ రోజున మేము వస్తుంటే అధ్యయనపరులు ఉపనిషత్‌ పారాయణం చేశారు. అది తైత్తిరీయోపనిషత్‌, మన దేశములో ప్రచారములో ఉన్న కృష్ణయజుర్వేదము లోనిది. ఈ ఉపనిషత్తు సామాన్యంగా ఋగ్వేదమునకన్నా యజుర్వేదమునకే ఎక్కువ ప్రచారం. వేదములో కొన్ని భాగాలు ''పద్యములు'' గా ఉన్నాయి, కందపద్యములు, సీసపద్యమునకు ఉన్నట్లు వాటికిని పాదములు, ఛందోనియమములు ఉన్నవి. వాటిని ఋక్కులు అంటారు. అవి ఋగ్వేదములో భాగాలు, వేదములో మరి కొన్ని భాగములు వాక్యములుగా, గద్యములుగా ఉన్నవి. వాటిని యజుస్సులంటారు. అవి యజుర్వేదములో భాగములు, యజుర్వేదము ఒకప్పుడు చెప్పుతూ చెప్పుతూ మధ్యమధ్య ఋక్‌ యిలా ఉన్నదని ''కోట్‌'' చేసి చెప్పుతూ ఉంటుంది. అట్టి సమయమున ''తదేషాభ్యుక్తా'' ''తదేత దృచాభ్యుక్తం'' ''తదుక్తమృషిణా'' మొదలగు వాక్యములు వస్తాయి. ఋషి అంటే మంత్రద్రష్ట, ఆయనకు తెలిసిన మంత్రానికి గూడా ''ఋషి'' అదే పేరు అందువలన ''తదుక్తమృషిణా'' అంటే అక్కడ ఋక్‌ ఇలా చెప్పినది అని అర్థం, తైత్తిరీయోపనిషత్తులో ఆనందవల్లి ఒకభాగం. దీనినే ''బ్రహ్మానందవల్లీ'' అనికూడా అంటారు. వల్లీ అంటే తీగ అని అర్థం. ఈ వల్లీ ''బ్రహ్మవి ప్నోతి వరమ్‌'' అనే వాక్యమున్నది. ఇందులో బ్రహ్మవిత్‌, ఆప్నోతి, పరమ్‌ అనే నాలుగు మాటలున్నవి. బ్రహ్మను తెలిసికొన్నవాడు సర్వశేష్టమైన దానిని పొందుతాడు అని అర్థము. ఈ నాలుగుమాటలకు సంబంధించిన విషయమును గూర్చి ''ఋక్‌'' ఇలా చెపుతోంది అనుటకు ''తదేషా భ్యుక్తా'' అన్నారు. ఏషా అనునది స్త్రీలింగము. ఋక్‌ గూడ స్త్రిలింగమే తత్‌ - ఆ విషయము ఏషా - ఈ ఋక్‌ (ఈవిధముగా) అభ్యుక్తా -చెప్పబడినది- అని అర్థం, ఆ ఋక్‌ నాలుగు పాదములుగా ఉన్నది. మన పద్యానికి నాలుగు పాదములు ఉన్నట్లే పైన చెప్పిన నాలుగు పదాలకు ఋక్‌ లోని నాలుగు పాదాలు వివరణగా ఉన్నవి. ''సత్యంజ్ఞాన మనంతం బ్రహ్మ'' ఈ వాక్యము బ్రహ్మ శబ్దమునకు వివరణ. సత్యము, జ్ఞానము, అనంతము- అను మూడులక్షములు ఒకే వస్తువుకు చెందినవి. కాని వేరువేరుకావు. ఆ వస్తునే బ్రహ్మ.

8-4ొ

''యో వేదం నిహితం గుహాయాం పరమే వ్యోమన్‌'' -

ఈ వాక్యము విత్‌ అన్న పదానికి వివరణ. మన మనస్సులో, హృదయములో బుద్ధికి వెనుక బాగుగా గుహలో దాగి ఉన్నట్లు దాగుకొని ఉన్న ఆత్మన ఎవరు తెలిసికొంటున్నారో- బయట ఉన్న ఆకాశమునకు వ్యోమ మని పేరు, ఆత్మను ''పరమేవ్యోమన్‌ ''-అని చెప్పుచున్నారు. విశాలమైన బాహ్యజగత్తు, బాహ్యకాశము తనలో యిమిడి ఉన్నవని ఆత్మ వీటికన్నా విశాలమైనదని తెలుస్తుంది.

''సో7శ్నుతే సర్వాన్‌ కామాన్‌ సః '' ఈ వాక్యము ఆప్నోతి అంటే పొందుతారు. అని అర్థము ఎలా పొందుతారు అంటే-ఈ జగత్తులో ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరిక గూడా ఎంతో శ్రమ పడితేగాని తీరదు. ప్రతివానికి ఎన్నో కోరిక లుంటాయి. ''సహ'' అంటే ''యుగపత్‌'' ఒకే పర్యాయమని అర్థము, అందరియొక్క అన్ని కోరికలు ఒకే పర్యాయము ఒకడికి తీరితే ఎంతటి ఆనందముకలుగునో అంతటి ఆనందము బ్రహ్మవేత్త పొందుతాడు. ''బ్రహ్మణా వివశ్చి తేతి'' - అను వాక్యము ''పరమ్‌'' అనే పదానికి వివరణ, విపశ్చిత్‌ అంటే విద్వాంసుడు. బ్రహ్మను తెలుసుకొన్న విద్వాంసుడు ఇట్టి సర్వోత్కృష్టతన పొందును. లోకములో ఏవస్తువునైనా తెలుసుకున్నవాడు ఆ వస్తువుకన్నా భిన్నముగా ఉంటాడు. కాని బ్రహ్మను తెలిసికొన్నవాడు బ్రహ్మ అవుతాడు. అందువలన ''బ్రహ్మణా వివశ్చితా'' అంటే బ్రహ్మరూపమైన విద్వాంసుడు అనే అర్థము, ఈ విషయమై విష్ణుసహస్రనామములతో ''తత్త్వం తత్త్వవిత్‌ ఏకాత్మాజన్మమ్మత్యుర్జ రాతిగః '' అని ఉన్నది. తత్త్వము, తత్త్వవిత్‌ కూడా ఒక్కరే.

ఇందాక ''కామకోటి సరస్వతి'' అనే మకుటముతో శ్లోకాలు చదివారు. కామము అంటే కోరిక. అమ్మవారు అందరి కోరికలను-కోట్లకొలది కోరికలనుకూడా-తీరుస్తుంది. ఆవిషయంలో ''సో7శ్ను తే సఠ్వాన్‌ కామాన్‌ సహ'' - అన్న మంత్రము జ్ఞాపకము వచ్చింది. అమ్మవారి అనుగ్రహము ఎవరిపై కలుగునో వారి కోర్కెలు తీరుతవి. కాని ఏవో ఒకటి రెండు కోర్కెలు తీరుతే పూర్ణానుగ్రహము కలిగినట్లు కాదు. పూర్ణానుగ్రహము కలిగితే ''సర్వాన్‌ కామాన్‌ సహా '' అని కోర్కెలు ఒకేమారు తీరాలి. వానినే ఆప్తకాముడు, పూర్ణకాముడు అంటారు. అట్టి వానికి భవనము, అరణ్యము-మిత్రులు శత్రులు-ఇటుకరాయి, బింబోష్టి అనేవి ఒకే విధముగా ''సమ''ముగా కనబడుతాయి. భగవద్గీతలో యిట్టివారిని గూర్చి ''సమంవశ్యన్‌ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరమ్‌'' -అని చెప్పేరు. కోటి శబ్దానికి అంచు అని కూడా అర్థం. కిరీటికోటి అంటే కిరీటముయొక్క అంచు, ధర్మార్థ కామమోక్షములలో కామము తరువాతేది మోక్షపురుషార్థము. కామకోటి అంటే కామము యొక్క తుది అయిన ''మోక్షము'' అని కూడ అర్థము. అమ్మవారు అన్ని కోర్కెలూ తీర్చి తుదకు మోక్షముగూడ యిస్తుంది. శ్రీ కామాక్షీదేవి అనుగ్రహమువలన అందరు సుఖముగా నుందురుగాక!

కామకోటి మహాపీఠ కామాక్షి పూతమూర్తయే |

చంద్రశేఖర రూపాయ భక్తతీర్థాయతే నమః ||

యద్భారతీయా సర్వస్వం సంస్కృతే ః మూలకారణమ్‌|

సా రాజతే కామకోటి ః శ్రీ కాంచీపుర సున్దరీ ||

కామానాం యా పరాకాష్ఠ కామధు క్కామలోచనా |

కామకోటి ర్విజయతే చన్ద్రశేఖర సున్దరీ ||

కామైః పరం కోటితానాం కామం సంసరతాం సదా |

కామాంస్తు కోటయత్యేషా కామకోటి స్త్రయీమయీ ||

ఋషిభిర్దర్శితం ప్రాఞ్చం వేదమూలం జగద్ధితం |

ధర్మ్యమర్థం వితనుతే కామకోటి సరస్వతీ ||

పరకీయ మతోద్బోధై ర్నూనం పరవశీకృతాన్‌ |

అల ముద్ధర్తు మేషైవ కామకోటిసరస్వతీ ||

ఇడా సరస్వతీ భారతీ దేవ్యః వేదవిశ్రుతాః |

తత్తత్స్వరూపమహతీ కామకోటిసరస్వతీ ||

ఈడ్యతే కర్మను సదా భారతీయైర్గృహేగృహే |

ఇడేయం దేవహూ ర్విద్యా కామకోటిసరస్వతీ ||

జీవేశ్వరా వశ్వినౌ తౌ యత్సంపృక్తా సరస్వతీ ||

తదనన్యత్వ సంధా త్రీ కామకోటి సరస్వతీ ||

యా భారతీ తత్త్వమయీ స్వస్థా సామన్యరూపిణీ |

సైవేయం భారతీవిద్యా కామకోటిసరస్వతీ ||

అసందిగ్థా స్మృతిరియం శ్రుతి శ్ర్శీ రమృతా సతాం |

నిధి రద్వైత తత్త్వస్య కామకోటిసరస్వతీ ||

కామకోటి మహాపీఠ వాసినీం కామితార్థదామ్‌

వందేమహి చ తాం దేవీం చంద్రశేఖర సున్దరీమ్‌ ||

కామాన్‌ పరం కోటయ న్తీం కామం ధర్మావిరోధినమ్‌ |

కల్పయన్తీం కామకోటిం వన్దే కాంచీపుర ప్రభామ్‌ ||

పరార్థ జీవినాం నైవ విశ్రాన్తి రితి బోధితుమ్‌ |

దేశేదేశే సంచరన్తీం వన్దే కాంచీపుర ప్రభామ్‌ ||

దేవాలయో వేదశిల్ప మితి బోధయితుం ముహుః |

నిర్వహన్తీం శిల్పసదః వన్దే కాంచీపుర ప్రభామ్‌ ||

గజే గవి చ పూజ్యత్వం శ్రుత్యుక్తం బోధితుం స్వయమ్‌ |

పూజయన్తీం గజం గాం చ వన్దే కాంచీపుర ప్రభామ్‌ ||

శ్రుతి ర్య ఏవం వేదేతి | బూతే యత్తత్త్వ మద్వయమ్‌ |

బోధయన్తీం తత్తదర్ధం వన్దే కాంచీపుర ప్రభామ్‌ ||

కుమారః ప్రథమాం వాచం తత్తతేతి బ్రనీతి యామ్‌ |

తత్స్వరూప ప్రకాశాం తాం వన్దే కాంచీపుర ప్రభామ్‌ ||

యావచ్చ విష్టితం బ్రహ్మ తావతీ వాగితి శ్రుతి ః |

తద్వాక్స్వరూప మహతీం వన్దే కాంచీపుర ప్రభామ్‌ ||

నిరుక్తభారతి ర్యేషాం సమైక్యామృతవరిణీ |

తత్పాదసేవనాసక్తాః వన్దన్తే హరిసోదరాః ||


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page