Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ సప్తనవతితమో7ధ్యాయః

అథ శివప్రతిష్టావిదానమ్‌.

ఈశ్వర ఉవాచ :

ప్రాతర్నిత్యవిధిం కృత్వా ద్వారపాలప్రపూజనమ్‌ | ప్రవిశ్య ప్రాగ్వధానేన దేహశుద్ధ్యాది మాచరేత్‌ 1

దిక్పతీంశ్చ సమభ్యర్చ్య శివకుమ్భం చ వర్థనీమ్‌ | అష్టముష్టిక యా లిఙ్గం వహ్నిం సన్తర్ప్య చ క్రమాత్‌ #9; 2

శివాజ్ఞాత న్తతో గచ్ఛేత్ర్పాసారం శస్త్రముచ్చరన్‌ | తద్గతాన్‌ ప్రక్షిపేర్విఘ్నాన్‌ హుం ఫడన్త శరాణునా. 3

న మధ్యే స్థాపయేల్లిజ్గం వేధధోషవిశజ్కయా | తస్మాన్మధ్యం పరిత్యజ్య యదార్థేన యవేన వా. 4

కి ఞ్చిదీశాన్య మాశ్రిత్య శిలామధ్యే నివేశ##యేత్‌ | మూలేన తామనన్తాఖ్యాం సర్వధారస్వరూపిణీమ్‌. 5

సర్వగాం సృష్టి యోగేన విన్యసేదచలాం శిలామ్‌ | అధవానేన మన్త్రేణ శిరస్సాసనరూపిణీమ్‌. 6

ఓం నమో వ్యాపిని భగవతి స్థిరే7చలే ద్రులే హ్రం లం హ్రీం స్వాహా

త్వయా శివాజ్ఞయా శ##క్తే స్థాతన్యమిహ సన్తతమ్‌.7

ఇత్యుక్త్వా చ సమభ్యర్చ్య నిరుధ్యాద్రౌద్రముద్రయా | వజ్రాదీని చ రత్నాని తథోశీరాది కౌషధీః. 8

లోహాన్‌ హేమ్యాది కాంస్యాన్తాన్‌ హరితాలాదికాం స్తథా | ధాన్యప్రభృతిసస్యాంశ్చ పూర్వముక్తాననుక్రియాత్‌. 9

ప్రభారాగత్వదేహత్వవీర్యశక్తిమయానిమాన్‌ | భావయన్నేకచిత్తస్తు లోకపారేశశమ్బరైః. 10

పూర్వాదిషు చ గర్తేషు న్యసేదేకైకశః క్రమాత్‌

హేమజం తారజం కూర్మం వృషం వా ద్వారసంముఖమ్‌| 11

సరిత్తటమృదా యుక్తం పర్వతాగ్రమృదాథవా | ప్రక్షిపేన్మధ్యగర్తాదౌ యద్వా మేరుం సువర్ణజమ్‌. 12

మధూకాక్షతసంయుక్తమఞ్జనేన సమన్వితమ్‌ | పృథివీం రాజతీం తుద్వా యద్వా హేమసముద్భవామ్‌. 13

సర్వబీజసువర్ణాభ్యాం సమాయుక్తాం వినిక్షిపేత్‌ | స్వర్ణజం రాజతం వాపి సర్వలోహ సముద్భవమ్‌ . 14

సువర్ణం కృశరాయుక్తం పద్మనాలం తతోన్యసేత్‌ | దేవదేవస్య శక్త్యాదిమూర్తిపర్యన్తమాసనమ్‌ 15

ప్రకల్ప్య పాయసేనాధ లిప్త్వా గుగ్గులునాధ వా | శ్వభ్రమాచ్ఛాద్య వస్త్రేణ తనుత్రేణా స్త్రరక్షితమ్‌. 16

పరమేశ్వరుడు పలికెను - స్కందా! ప్రాతః కాలమున నిత్యకర్మలు ముగించుకొని, ద్వారదేవతలను పూజించి, మండప ప్రవేశము చేసి, పూర్వోక్త విధానము దేహశుద్ధ్యాదులు చేసికొనవలెను. దిక్పాలకులను, శివకలశమును, వర్ధనిని పూజించి, అష్టపుష్టికతో శివలింగమును పూజించి, క్రమముగా హోమము చేసి, అగ్నిదేవుని తృప్తుని చేయవలెను. పిదప శివుని ఆజ్ఞ గ్రహించి, ''అస్త్రాయ ఫట్‌'' అని ఉచ్చరించుచు మందిరమునందు ప్రవేశించి, ''అస్త్రాయ హూం ఫట్‌'' అని ఉచ్చరించుచు విఘ్నములను తొలగించుకొనవలెను. శిలకు సరిగా మధ్యయందు శివలింగ స్థాపన చేయగూడదు. అట్లు చేయుటచే వేధదోష శంకకు అవకాశముండును. అందుచే మధ్యభాగమును విడచి, ఒక యవ లేదా అర్ధయవ ఈశాన్యమువైపు జరిగి శివలింగమును ఆధారశిలయందు స్థాపించవలెను. మూలమంత్రమును ఉచ్చరించుచు, అనంతనామధారిణియు, సర్వాధార స్వరూపిణియు, అగు శిలను సృష్టి యోగముతో స్థిరముగ స్థాపించవలెను. లేదా ''ఓం నమో వ్యాపిని భగవతి స్థిరే7చరే ధ్రువే హ్రీం లం హ్రీం స్వాహా'' అను మంత్రముతో శివాసన స్వరూప యగు ఆ శిలను పూజించవలెను. పూజ చేయుటకు ముందు -''ఆధారశక్తిస్వరూపిణియగు ఓ శిలా! శివుని ఆజ్ఞప్రకారము నీవు ఇచట ఎల్లప్పుడును స్థిరముగా నుండుము'' అని ప్రార్థించవలెను. పూజానంతరము అవరోధినీ ముద్రతో శిలను స్థిరముగాస్థాపించవలెను. వజ్రము మొదలైన రత్నములు, వట్టివేళ్లు మొదలగు ఔషధులు, లోహము, సువర్ణము, కాంస్యము మొదలగు ధాతువులు, హరితాళాదులు, ధాన్యాది సస్యములు, వెనుక చెప్పిన ఇతర వస్తువులు, క్రమముగ ఒక్కచోటచేర్చి, ఇవన్నియు కాంత్యారోగ్యదేహవీర్య శక్తిరూపములు అని భావన చేయవలెను. ఈ విధముగ ఏకాగ్ర చిత్తముతో భావన చేసి లోకపాలకులను, శివునకును, సంబంధించిన మంత్రములతో ఈ వస్తువులను ఒక్కొక్కటిగ, పూర్వాదికుండములందు వేయవలెను. బంగారముతో లేదా రాగితో చేసిన తాబేలు గాని, వృషభమును గాని ద్వారమునకు ఎదురుగా ఉండునట్లుచేసి, నదీతీరము నందలి మట్టిగాని పర్వత శిఖరమునందలి మట్టిగాని, కలిపి, మధ్యము నందున్న గర్తమునందు వేయవలెను. లేదా సువర్ణ నిర్మితమగు మేరువును, మధూక-అక్షత అంజనములతో కలిపి ఆకుండమునందు వేయవలెను. లేదా బంగారముతోగాని, వెండితోగాని చేసిన పృథివిని, సకల బీజములతో, సువర్ణముతో మధ్యనున్న కుండములో వేయవలెను. లేదా బంగారము, వెండి లేదా సకలలోహములు కలిపిచేసిన, సువర్ణమయకేసరములుగల పద్మమునుగాని, అనంత నాగమూర్తి గాని అచట వేయవలెను. శక్తి మొదలు మూర్తి వరకును, లేదా శక్తి మొదలు శక్తి వరకును గల తత్త్వములను దేవాదిదేవునకు ఆసనముగా ఏర్పరచి, దానిపై పాయసము గుగ్గులు పూయవలెను. పిదప వస్త్రముతో గర్తమును కప్పి కవచ అస్త్రమంత్రములతో రక్ష చేయవలెను.

దిక్పతిభ్యో బలిం దత్త్వా సమాబాన్తో7ధ దేశికః | శివేన వా శిలా శ్వభ్ర సంగోదోషనివృతయే. 17

శ##స్త్రేణ వా శతం సమ్యగ్జుహుయాత్పూర్ణయా సహ | ఏకైకాహుతిదానేన సన్తర్ప్య వాస్తుదేవతాః 18

సముత్థాప్య హృదా దేవమాసనం మఙ్గలాదిభిః | గురుద్దేవాగ్రతో గచ్ఛేన్మూర్తిపైశ్చ దిశి స్థితైః. 19

చతుర్భిః సహ కర్తా తు దేవయజ్ఞస్వ పృష్ఠతః ప్రాసాదాది పరిభ్రమ్య భద్రాఖ్యాద్వారసంముఖమ్‌. 20

లిజ్గం సంస్థాప్య దత్త్వార్ఘ్యం ప్రాసాదం సన్నివేశ##యేత్‌ | ద్వారేణ ద్వారబనన్థేన ద్వారాదేశేన తచ్ఛిలా | 21

ద్వారబన్ధే శిఖాశూన్యే తదర్దేనాథ తదృతే | వర్జయన్‌ ద్వార సంస్పర్శం ద్వారేణౖవ మహేశ్వరమ్‌ . 22

దేవగృహ సమారమ్భే కోణ నాపి ప్రవేశ##యేత్‌ | అయమేవ విధిర్జేయో వ్యక్తలిజ్గే7పి సర్వతః 23

గృహే ప్రవేశనం ద్వారే లోకైరపి సమీరితమ్‌ | అపద్వారప్రవేశేన విదుర్గోత్రక్షయం గృహమ్‌ . 24

అథ పీఠే చ సంస్థాప్య లిఙ్గం ద్వారస్య సమ్ముఖమ్‌ | తూర్యమఙ్గలనిర్ఘోషైర్ధూర్వాక్షర సమన్వితమ్‌. 25

సముత్తిష్ఠ హృదేత్యుక్త్వా మహాపాశుపతం పఠేత్‌ | అపనీయ ఘటం శ్వభ్రాద్ధేశికో మూర్తిపైః సహ. 26

మన్త్రం సంధారయిత్వాతు విలిప్తం కుఙ్కుమాదిభిః | శక్తి శక్తిమతోరైక్యం ధ్యాత్వా చైవతు రక్షితమ్‌. 27

లయాన్తం మూలముచ్చార్య స్పృష్ట్యా శ్వభ్రీ నివేశ##యేత్‌.

ఆచార్యుడు దిక్పాలకుల బలి ఇచ్చి అచమనము చేసి, శిలాగర్త సంగదోషనివృత్తికొరకై శివమంత్రముతో గాని, అస్త్రమంత్రముతో గాని విధిపూర్వకముగ నూరు హోమములు చేసి, పూర్ణాహుతి కూడ ఇవ్వవలెను. వాస్తుదేవతలకొరకై ఒక్కొక్క హోమము చేసి; తృప్తి పరచి, హృదయమంత్రముతో దేవుని ఎత్తి మంగలవాద్య - మంగల పాఠాదులతో తీసి కొనిరావలెను. గురువు దేవునకు ముందు నడచుచుండగా, యజమానుడు నాలుగు దిక్కులందు ఉన్న మూర్తిపాలులతో, దేవుని వాహనమునకు వెనుక నడవలెను. దేవాలయాదులకు నాల్గు వైపుల త్రిప్పి, శివలింగమునకు భద్రద్వారము ఎదుట స్నానము చేయించి, అర్ఘ్యమిచ్చి. లోనికి తీసికొని వెళ్ళవలెను. తెరచిన ద్వారముగుండా గాని, ద్వారముకొరకై నిశ్చయించిన స్థానముగుండా గాని దేవుని దేవాలయములోనికి తీసికొని వెళ్లవలెను. ఇది ఏదియు లేనిచో, ద్వారమును బంధించు శిలమీదుగా గాని, శూన్యమార్గమునుండి గాని, లేదా ఆ శిలపైనుండి గాని ఆలయములోనికి తీసికొని వెళ్లవలెను. మహేశ్వరుని ద్వారమునుండియే లోనికి తీసికొని వెళ్ళవలెను. కాని ద్వారస్పర్శ కలుగకుండ తీసికొనివెళ్లవలెను. దేవాలయ ప్రారంభము జరుగుచున్నప్పుడు మాత్రము ఏమూలనుండి యైనను శివలింగమును లోనికి తీసికొని వెళ్ళవచ్చును. స్థూల శివలింగమునులోనికి తీసికొనివెళ్ళునపుడు ఇదియే విధానము. గృహములో ప్రవేశించుటకు ద్వారమే మార్గ మను విషయము సాధారణమానవులకు గూడ తెలియును. ద్వారము లేని గృహమునందు ప్రవేశించినచో గోత్రనాశన మగు నని శాస్త్రము. శివలింగమును ద్వారము ఎదుట ఉంచి నానావిధము లగు వాద్యములతోను, మంగళధ్వనులతోను దూర్వాక్షతాదులు సమర్పించి ''సముత్తిష్ఠ నమః'' అని అనుచు మహాపాశుపతమంత్రమును పఠించవలెను. ఆచార్యుడు గర్తమునందుంచిన ఘటమును బైటకు తీసి, మూర్తిపాలకులతో కూడ దానిని యంత్రమునందు స్థాపించి, దానిపై కుంకుమాదిలేపముచేసి, శక్తి-శక్తిమంతుల ఏకత్వమును భావించుచు, లయాంతమూలమంత్రము ఉచ్చరించుచు ఆలంబన లక్షిత మగు ఆ ఘటమును స్పర్శపూర్వకముగ గర్తమునందు స్థాపించవలెను.

అంశేన బ్రహ్మభాగస్య యద్వా అంశద్వయేన చ | 28

అర్ధేన వాష్టమాంశేన సర్వస్యాథ ప్రవేశనమ్‌ | పిధాయ సిసకం నాభిదీర్ఘభిః సుసమాహితః. 29

శ్వభ్ర వాలకయా పూర్య బ్రూయాత్థ్సిరీభ##వేతి చ | తతో లిఙ్గే స్థిరీభూతే ధ్యాత్వా సకలరూపిణమ్‌. 30

మూలముచ్చార్య శక్త్యన్తం సృష్ట్వా చ నిష్కలం న్యసేత్‌ |

స్థాప్యమానం యదా లిఙ్గం యాం యాం దిశమథాశ్రయేత్‌. 31

తత్తద్దిగీశమన్త్రేణ పూర్ణాన్తం దక్షిణాన్వితమ్‌ | సవ్యే స్థానే చ వక్రే చ చలితే స్ఫుటితే7పి వా. 32

జుహూయాన్మూలమన్త్రేణ బహురూపేణ వా శతమ్‌ | కిఞ్ఛాన్యేష్వపి దోపేషు శివాశాన్తిం సమాశ్రయేత్‌. 33

యుక్తం న్యాసాదిభిర్లిఙ్గం కుర్వన్నేవం న దోషభాక్‌ | పీఠబన్దమతః కృత్వా లక్షణ స్యాంశ లక్షణమ్‌. 34

గౌరీమన్త్రం లయం నీత్వా సృష్ట్వా పిణ్డీం చ విన్యసేత్‌ | సంపూర్య పార్శ్వ సన్దిం చ వాలుకావజ్రలేపనమ్‌.

తతో మూర్తిధరైః సార్ధం గురుః శాన్తిషుటోర్ధ్వత ః సంస్నాప్య కలశైరన్యై స్తధ్వతృఞ్చామృతాదిభిః. 36

విలిప్య చన్దనాద్యైశ్చ సంపూజ్య జగదీశ్వరమ్‌ | ఉమామహేశముద్రాభ్యాం తౌ స్పృశీల్లిఙ్గముద్రయా. 37

తతస్త్రితత్త్వవిన్యాసం షడర్భాదిపురః సరమ్‌ | కృత్వా మూర్తిం తదీశానామఙ్గానాం బ్రహ్మణామథ. 38

జ్ఞానీ లిజ్గే క్రియాపీఠే విన్యస్య స్నాపయేతత్తః గన్ధైర్విలిప్య సంధూప్య వ్యాపిత్వేన శివేన్యసేత్‌. 39

స్రగ్దూపదీపనైవేద్యైర్హృదయేన ఫలాని చ | వినివేద్య యథాశక్తి సమాచమ్య మహేశ్వరమ్‌. 40

దత్త్వార్ఘ్యం చ జపం కృత్వా నివేద్య వరదే కరే | చన్ద్రార్కతారకం యావన్మన్త్రేణ శైవమూర్తిపైః. 41

స్వేచ్ఛయైన త్వయా నాథ స్థాతవ్యమిహ మన్దిరే | ప్రణమ్యైవం బహిర్గత్వా హృదావా ప్రణవేన వా. 42

సంస్థాప్య వృషభం పశ్చాత్పూర్వవద్బలిమాచరేత్‌.

బ్రహ్మభాగములు ఒక అంశము గాని, రెండు అంశములుగాని, సగము అంశముగాని, ఎనిమిదవ అంశముగాని, లేదా పూర్తి బ్రహ్మభాగమును గాని గర్తములో నుంచవలెను. నాభిపర్యంతము దీర్ఘలతో కూడ సీసమును కప్పి, ఏకాగ్రచిత్తుడై, క్రింది గర్తమును ఇసుకతో పూడ్చి, ''దేవా! నీవు సుస్థిరముగా నుండుము'' అని ప్రార్థించవలెను. లింగము స్థిరమైన పిదప, రూపవంతు డగు పరమేశ్వరుని ధ్యానము చేసి, శక్త్యంతమూల మంత్రోచ్చారణము చేయుచు, శివలింగమును స్పృశించి, దానిపై నిష్కలీకరణన్యాసము. చేయవలెను. శివలింగ ప్రతిష్ఠ జరుగుచున్నప్పుడు ఏ దిక్కులవైపున ఉండునో ఆ యా దిక్కుల పాలకుల మంత్రము లుచ్చరించుచు పూర్ణహుతిపర్యంతము హోమములు చేసి దక్షిణ ఈయవలెను. శివలింగమునుండి శబ్దము వచ్చినను, దాని ముఖభాగము కదలినను, బ్రద్దలై నను మూలమంత్రముతో గాని, బహురూపమంత్రముతో గాని నూరు హోమములు చేయవలెను. ఇట్టి ఇతర దోషములేవైన వచ్చినచో జీవశాస్త్రోక్తప్రకారము శాంతి చేయవలెను. ఈ విధముగ శివలింగమునందు న్యాసము చేసినచో కర్తకు దోష మేదియు అంటదు. పిదప లక్షణస్పర్శరూపమగు పీఠబంధము చేసి గౌరీమంత్రముతో దాని లయము చేసి, మరల పిండిపై సృష్టిన్యాసము చేయవలెను. లింగముప్రక్కనున్న గర్తఛిద్రమును ఇసుకతోను, వజ్రలేపముతోను పూడ్చివేయవలెను. పిదప గురువు మూర్తిపాలకసమేతుడై శాంతి కలశమునందలి అర్ధజలముతో శివలింగమునకు స్నానము చేయించి, ఇతరకలశలతోను, పంచామృతముతోనుకూడ స్నానము చేయించి, చందనాదులు పూసి, శివుని పూజించి ఉమామహేశ్వర మంత్రములతో, లింగముద్రతో ఆ ఇరువురిని స్పృశించవలెను. షడధ్వన్యాసపూర్వకముగా త్రితత్త్వన్యాసము చేసి, మూర్తి న్యాస- దిక్పాలన్యాస-అంగన్యాస-బ్రహ్మన్యాస పూర్వకముగ లింగమున జ్ఞానశక్తిని, పీఠమున క్రియాశక్తిని న్యాసము చేసి, పిదప స్నానము చేయించవలెను. గంధముపూసి, ధూపము సమర్పించి, వ్యాపకధూపమున శివుని న్యాసముచేసి, హృదయమంత్రముతో పుష్పమాలా-ధూప-దీప-నైవేద్య-ఫలములు సమర్పించవలెను. పిదప శివునిచే అచమనము చేయించవలెను. విశేషార్ఘ్యమిచ్చి, మంత్రము జపించి పరమేశ్వరుని వరదాయకహస్తమున ఆ జపమును అర్పించి, ''దేవా! సూర్యచంద్ర నక్షత్రములు ఉన్నంతరవరకును నీవు మూర్తీశులతోడను మూర్తీపాలకులతోడను కలిసి స్వేచ్ఛాను సారముగా ఈ ఆలయమున సర్వదా నివసింపుము'' అని ప్రార్థించవలెను. పిదప ప్రణామము చేసి బైటకు వెళ్ళి హృదయమంత్రముతో గాని వృషభస్థాపన చేసి వెనుకటివలెనే బలి నివేదనము చేయవలెను.

న్యూనారిదోషమోషాయ తతో మృత్యు జితా శతమ్‌. 43

శివేన స శివో హుత్వా శాన్త్యర్థం పాయసేన చ | జ్ఞానాజ్ఞానకృతం యచ్చ తత్పూరయ మహావిభో. 44

హిరణ్యపశుభూమ్యాది గీతవాద్యాదిహేతవే | అమ్బికేశాయ తద్భక్త్యా శక్త్వా సర్వం నివేదయేత్‌. 45

దానం మహోత్సవం పశ్చాత్‌ కుర్యాద్దిన చతుష్టయమ్‌|

త్రిసన్ద్యం త్రిదినం మన్త్రీ హోమయేన్మూర్తిపైః సహ. 46

చతుర్థే7హని పూర్ణాం చ చరుకం బహురూపిణా | నివేద్య సర్వకుణ్డషు సంపాతాహుతిశోధితమ్‌. 47

దినచతుష్టయం యావత్తన్నిర్మాల్యం తదూర్ధ్వతః

నిర్మాల్యాపనయం కృత్వా స్నాపయిత్వాతుపూజయేత్‌. 48

పూజాసామాన్యలిఙ్గేషు కార్యాసాధారణాణుభిః | విహాయ లిజ్గచైతన్యం కుర్యాత్థ్సాణువిసర్జనమ్‌ . 49

అసాధారణలిజ్గ్యేషు క్షమస్వేతి విసర్జనమ్‌ | ఆవాహనమభివ్యక్తిర్విసర్గః శక్తిరూపతా. 50

ప్రతిష్ఠాన్తే క్వచిత్ప్రోక్తం స్థిరాద్యాహుతి సప్తకమ్‌ | స్థిరస్తథాప్రమేయశ్చానాదిబోధ స్తథైవ చ. 51

నిత్యో7ధ సర్వగశ్చైవాదినాశీ దృష్ట ఏవ చ | ఏతే గుణా మహేశస్య సన్నిధానాయ కీర్తితాః. 52

పిదప న్యూనత్వాదిదోషశనిరాకరణము కొరకై మృత్యుంజయ మంత్రముతో సమిధలతో నూరుహోమములు చేయవలెను. శాంతికొరకు పాయసహోమము చేయవలెను. పిదప ''దేవా జ్ఞానపూర్వకముగ గాని అజ్ఞానపూర్వకముగ గాని ఏవైన లోపములు జరిగినచో వాటిని నీవు పూర్ణము చేయుము'' అని ప్రార్థించి యధాశక్తిగ సువ్రణ-పశు-భూమ్యాది సంపత్తి సమిర్పించి, గీతావాద్యాద్యుత్సవములను గూడ సర్వకారణభూతుడును, అంబికానాథుడును అగు శివునకు ఏర్పరచవలెను. పిదప నాలుగు దివసములు, అవిచ్ఛిన్నముగ దానములు, ఉత్సవములు చేయవలెను. ఈ నాలుగు దివసములలో మూడు దివసములు మంత్రజ్ఞుడైన ఆచార్యుడు మూర్తిపాలకులతో కలసి హోమములు చేసి నాల్గవ దివసమున పూర్ణహుతి ఇచ్చి, బహురూపమంత్రముతో చరునివేదనము చేయవలెను. అన్ని కాండములనుండియు,

సంపాతాహుతిచే శోధితమైన చరువును అర్పించవలెను. ఆ నాలుగు దినములును నిర్మాల్యము తీయకూడదు నాల్గుదినములు తరువాత నిర్మాల్యము తొలగించి, స్నానము చేయించి, పూజ చేయవలెను. సాధారణలింగములందు సాధారణమంత్రములతో పూజ చేయవలెను. లింగ చైతన్యమును విడిచి స్థాణువిసర్జనమును చేయవలెను. అసాధారణలింగముల విషయమున 'క్షమస్వ' ఇత్యాదికము చెప్పి విసర్జనము చేయవలెను. ఆవాహనము, అభివ్యక్తి విసర్గము, శక్తిరూపత అను ఈ ఐదు విషయములును ముఖ్యమైనవి. ప్రతిష్ఠాంతమును స్థిరతాదిగుణ సిద్ధికై ఏడు హోమములు చేయు పత్థతి కూడ ఉన్నది. శివుడు స్థిరుడు, అప్రమేయుడు, అనాది బోధస్వరూపుడు, సర్వవ్యాపి, అవినాశి, ఆత్మతృప్తుడు. మహేశ్వరసన్నిధి విషయమున ఈ నోములు చెప్పబడినవి.

ఓం నమః శివాయ స్థిరో భ##వేత్యాహుతినాం క్రమః. ఏవమేతచ్చ సంపాద్య విధాయ శివకుమ్భవత్‌. 53

కుమ్భద్వయం చ తన్మథ్యాదేకకుమ్భామ్భసా భవమ్‌ |

సంప్నాప్య తద్ద్వితీయం తు కర్తృస్నానాయ ధారయేత్‌. 54

దత్త్వా బలిం సమాచమ్య బహిర్గచ్ఛేచ్ఛివాజ్ఞయా | జగతీబాహ్యతశ్చణ్డమైశాన్యాం దిశ మన్దిరే. 55

ధామగర్భప్రమాణ చ సుపీఠేకల్పితాసనే | పూర్వవన్న్యాసహోమాది విధాయ ధ్యానపూర్వకమ్‌. 56

సంస్థాప్య విధివత్తత్ర బ్రహ్మాజ్గైః పూజయే త్తతః అఙ్గాని పూర్వయుక్తాని బ్రహ్మణి త్వర్చనా యథా. 57

ఓం వం సద్యోజాతాయ ఓం హ్రూం ఫట్‌ నమః ఓం విం వామదేవాయ హ్రూం ఫట్‌ నమః.

ఓం వుం అఘోరాయ హ్రూం ఫట్‌ నమః . ఓం వేం తత్పురుషాయ ఓం వోం ఈ శానాయ చ

హ్రుం ఫట్‌ నమః.

జపం నివేద్య సన్తర్ప్య విజ్ఞాప్య నతిపూర్వకమ్‌ | దేవః సన్నిహతో యావత్తావత్త్వం సన్నిధౌ భవ. 58

న్యూనాధికం చ యత్కిఞ్ఛిత్కృతమజ్ఞానతో మయా | త్వ త్ప్రసాదేన చణ్డశ తత్సర్వం పరిపూరయ. 59

బాణలిఙ్గే బాణరోహే సిద్దలిఙ్గే స్వయంభువి | ప్రతిమాసు చ సర్వాసు న చణ్డో7ధికృతో భ##వేత్‌. 60

అద్వైతభావనాయు క్తే స్థణ్డివేశవిధావపి | అభ్యర్చ్య చణ్డం ససుతం యజమానం హి భార్యయా. 61

పూర్వస్థాపితకుమ్భేన స్నాపయేత్స్నాపకః స్వయమ్‌ | స్నాపకం యజమానోపి సంపూజ్య చ మహేశవత్‌.

విత్తశాఠ్యం వినా దద్యాద్భూహిరణ్యాది దక్షిణామ్‌.

''ఓం నమః శివాయ స్థిరో భవ నమః స్వాహా'' ఇత్యాదికము ఆహుతి క్రమము. పిదప శివకలశమువంటి రెండు కలశములను సిద్ధము చేయవలెను. ఒక కలశ##చే శివునకు స్నానము చేయించి రెండవది యజమానుని స్నానము కొరకు ఉంచవలెను. బలియిచ్చి ఆచమనము చేసి, శివానుజ్ఞ పొంది బైటకు రావలెను. యాగమండపము వెలుపల ఈశాన్యమున చండుని స్థాపించి పూజించవలెను. పిదప మండపమున, స్నానగర్భముతో సమానమైన ఉత్తమ పీఠముపై ఆసనము కల్పించి, వెనుకటి వలె న్యాసహోమాదుల చేయవలెను. ధ్యానపూర్వకముగా సద్యోజాతాది స్థాపన చేసి, అచట బ్రహ్మాంగములతో యథావిధిగా పూజచేయవలెను. బ్రహ్మాంగములు వెనుక చెప్పబడినవి. మంత్రములతో పూజ చేయు విధానమును వినుము. ''ఓం వం సద్యోజాతాయ హూం ఫట్‌ నమః ఓం విం వామదేవాయ హ్రూం ఫట్‌ నమః ఓం ఆఘోరాయ హ్రూం ఫట్‌ నమ్‌. ఓం వేం తత్పురుషాయ హూం ఫట్‌ నమఃఓం వోం ఈశానాయ హూం ఫట్‌ నమః అనునవి మంత్రములు. ఈ విధముగ జపము తర్పణము చేసి, స్తుతి పూర్వకముగ ''ఓం చండేశా! శివుడు ఉన్నంత వరకు నీవు కూడ ఇచటనే ఉండుము. అజ్ఞానవశమున నేను చేసిన కర్మదోషము లన్నియు నీ కృపచే పూర్ణము లగు గాక. ఆ లోపములను నీవే పూర్ణము చేయవలెను. అని ప్రార్థించవలెను. బాణలింగమునందును, లోహమయ లింగమునందును, సిద్దలింగమునందును, స్వయంభూ లింగమునందును, ఇతర ప్రతిమలయందును ఉన్న నిర్మాల్యము విషయమున చండేశ్వరునకు అధికారము లేదు. అద్వైతభావనాయుక్తుడగు యజమానుని విషయమునందును, స్థండివేశవిధియందును. గూడ చండేశునకు అధికారములేదు. చండుని పూజచేసి, స్నానము చేయించు గురువే పత్నీపుత్ర సమేతుడైన యజమానునకు పూర్వము స్థాపించిన కలశలోని జలముతో స్నానము చేయించవలెను. స్నానము చేయించిన గురువును యజమానుడు మహేశ్వరుని వలె పూజించి, ధనలోభము చేయక, భూసువర్ణాది దక్షిణ ఈయవలెను.

మూర్తి పాన్‌ విధి తత్పశ్చ జ్ఞాపకాన్‌ బ్రాహ్మణాం స్తథా | 63

దైవజ్ఞం శిల్పినం ప్రార్చ్య దీనానాథాది భోజయేత్‌ | యదత్ర సంముఖాభావే ఖేదితో భగవన్‌ మాయా. 64

క్షమస్వ నాథ తత్సర్వం కారుణ్యామ్భునిధే మమ | ఇతి విజ్ఞప్తి యుక్తాయ యజమానాయ సద్గురుః. 65

ప్రతిష్ఠా పుణ్యసద్భావం స్ఫురత్తారక సప్రభమ్‌ | కుశపుష్పాక్షతోపేతం స్వకరేణ సకర్పయేత్‌. 66

తతః పాశుపతోపేతం ప్రణమ్య పరమేశ్వరమ్‌ | తతో7పి బలిభిర్భూతాన్‌ సన్నిధాయ నిబోధయేత్‌. 67

స్థాతవ్యం భవతా తావద్యాపత్సన్నిహితో హరః | గురుర్వస్త్రాది సంయుక్తం గృహ్ణీయాద్యాగమణ్డపమ్‌. 68

సర్వోపకరణం శిల్పీ తథా స్థాపన మణ్డపమ్‌ | అన్యే దేవాదయః స్థాప్యా మన్త్రైరాగమసంభ##వైః. 69

ఆదివర్ణస్య భేదాద్వ సుతత్త్వవ్యాప్తి భావితాః | సాధ్యప్రముఖదేవాశ్చ సరిదోషధయస్తథా. 70

క్షేత్రపాః కిన్న రాద్యాశ్చ పృథివీతత్త్వమాశ్రితాః | స్నానం సరస్వతీలక్ష్మీనదీనామమ్భసిక్వచిత్‌. 71

భునాదిపతీనాం చ స్థానం యత్ర వ్యవస్థితిః | అణ్డవృద్ది ప్రధానాన్తం త్రితత్త్వం బ్రాహ్మణ పదమ్‌. 72

తన్మాత్రాదిప్రధానాన్తం పదమేతత్త్రికం హరేః | నాట్యేగణమాత్రృణాం యక్షేసశర జన్మనామ్‌ . 73

అణజాః శుద్దవిద్యాన్తం పదం గణపతేస్తథా | మాయాంశ##దేశ శక్త్యన్తం శిలాశివోప్తరోచిషామ్‌. 74

పద్యమీశ్వర పర్యన్తం వ్యక్తార్భాసు చ కీర్తితమ్‌ | కూర్మాయచ్చ కీర్తితం యచ్చ రత్నాది పఞ్చకమ్‌. 75

ప్రక్షిపేత్పీఠగర్తే చ పఞ్ఛ బ్రహ్మశిలాం వినా |

పిదప, మూర్తి పాలకులను, జపకర్తలను, జ్యౌతిష్కుని, శిల్పిని యధావిధిగా పూజించి, దీనానాధాదులకు భోజనము పెట్టవలెను. పిదప యజమానుడు గురువును - ''పూజ్యా! సంముఖకరణమునకై మీకు కష్టము ఇచ్చినందులకు క్షమింపుము. నీవు కరుణాసాగరుడవు. అందువలన సకలాపరాధములను క్షమింపుము'' అన్ని ప్రార్థించవలెను. ఈ విధముగ ప్రార్దించు యజమానునకు, గురువు కుశ-పుష్ప-అక్షతలతో, నక్షత్రమువలె ప్రకాశించుచున్న ప్రతిష్ఠాజన్యపుణ్య సత్తను, అర్పించవలెను. పాశుపత మంత్రజపము చేసి,నమస్కారము చేసిన పిదప భూతగణములకు బలిఇచ్చి, వాటి నన్నింటిని ఈ విధముగ దగ్గరకు తీసికొని ''పరమేశ్వరుడు ఉన్నంతకాలము మీరిచట ఉండవలెను.'' అని ప్రార్థించవలెను. వస్త్రాదియుక్తమగు యాగమండపమును గురువు తీసికొనవలెను. ఉపకరణ సహితముగు స్నాపన మండపమును శిల్పి తీసికొనవలెను. ఆగమోక్త మంత్రములతో అన్యదేవతా స్థాపన చేయవలెను. సూర్యుని యందున్న వివిధ వర్ణముల ప్రకారము ఆ దేవతల వర్ణములుండును. ఆ దేవతలు తమ తైజస తత్త్వమున వ్యాప్తులై యున్నారని భావన చేయవలెను. సాధ్యాది దేవతలు, నదులు, ఔషధులు, క్షేత్రపాలులు, కింనరులు మొదలగు వారు పృథివీ తత్త్వాశ్రితులు సరస్వతీ-లక్ష్మి-నదుల స్థానము జలమునం దని కొని చోట్ల చెప్పబడినది. భువనాధిపతులకు వారున్నదేస్థానము. అహంకారము, బుద్ధి, ప్రకృతి అను మూడు తత్త్వములు బ్రహ్మస్థానము తన్మాత్రలు మొదలు ప్రధానము వరకును ఉన్న మూడు తత్త్వములు విష్ణుస్థానములు. అండజాతి శుద్ధ విద్యాంతతత్త్వములు నాట్యేశ-గణమాతృకా-యక్షరాజ కార్తికేయ గణశుల స్థానములు, మాయాంశ##దేశము మొదలుశక్తి పర్యంతముఉన్న తత్త్వములు శివాశివులకును, ఉగ్రతేజఃశాలియగు సూర్యునకును స్థానములు వ్యక్తప్రతిమలకు పదము ఈశ్వర పర్యంతమని చెప్పబడినది. స్థాపన సామగ్రిలోవున్న కూర్మాదులను, రత్నాది పంచవస్తువులను, దేవపీఠము క్రింద నున్న గర్తములో వేయవలెను. ఐదు బ్రహ్మ శిలలకు మాత్రము వేయగూడదు.

షడ్భిర్విభాజితే గర్తే త్యక్త్వా భాగం చ పృష్ఠతః. 76

స్థాపనం పఞ్చమాంశే చ యది వా వసుభాజితే | స్థాపనం సప్తమే భాగే ప్రతిమాసు సుఖావహమ్‌. 77

ధారణాభిర్విశుద్ధిః స్యాత్థ్సాపనే వేపచిత్రయోః | స్నానాది మానసం తత్ర శిలారత్నాదివేశనమ్‌. 78

నేత్రోద్ఘాటమన్త్రేష్టమాసనాది ప్రకల్పనమ్‌ | పూజాదినిరమ్భుభిః పుషై#్పర్యాధా చిత్రం న దుష్యతి. 79

విధిస్తు చలవిజ్ఘేషు సంప్రత్యేవ ని గద్యతే | పఞ్చభిర్వా త్రిభిర్వాపి పృథక్కుర్యా ద్విభాజితే. 80

భాగత్రయేణ భాగాంశో భ##వేద్భాగద్వయేన వా | స్వపీఠేష్వపి తద్వాత్స్యాల్లిఙ్గేషు తత్త్వభేదతః. 81

సృష్ణిమన్త్రేణ సంస్కారో విధివత్స్ఫాధికాదిషు | కిఞ్చ బ్రహ్మశిలారత్న ప్రభూతేశ్చానివేదనమ్‌ . 82

యోజనం పిణ్డికాయాశ్చ మనసా పరికల్పయేత్‌ | స్వయమ్బు బాణలిఙ్గాదౌ సంస్కృతా నియమో న హి. 83

స్నాపనం సంహితామన్త్రైర్న్యాసం హోమం చ కారయేత్‌|

నదీ సముద్రరోహాణాం స్థాపనం పూర్వన్మతమ్‌ 84

ఐహికం మృన్మయం లిఙ్గం షిష్టకాది చ తత్కతమ్‌| కృత్వా సంపూజయేచ్చుద్ధం దక్షిణాది విధానతః. 85

సమాదాయ తతోమన్త్రానాత్మానం సంవిధాయ చ | తజ్జలేప్రక్షిపేల్లిఙ్గం వత్సరాత్కామదం భ##వేత్‌ 86

విష్ణ్వాది స్థాపనం చైవ పృథఙ్మన్రైః సమాచరేత్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే శివప్రతిష్ఠావిధిర్నామ సప్తనవతి తమో7ధ్యాయః

ఆలయగర్భమును ఆరు భాగములుగా విభజించి ఆరవ భాగమును విడచి ఐదవ భాగమునందు దేవతాప్రతిష్ఠ చేయవలెను. లేదా ఆలయగర్భమును ఎనిమిది భాగములు చేసి ఏడవ భాగమున విగ్రహప్రతిష్ఠ చేసినచో సుఖావహ మగును. చిత్రమయ విగ్రహములను స్థాపించినపుడు ధారణ ద్వారా పంచభూతశుద్ధి కలుగును. స్నానాదికమును జలముతో కాక మానసికముగా చేయవలెను. విగ్రహములను శిలా-రత్నాదిభవనములందు ఉంచవలెను. నేత్రోన్మీలన ఆసనాదులు కల్పన చేయుట మంచిది. చిత్రములు చెడిపోకుండుటకై వాటి పూజ, జలరహితపుష్పములతో చేయవలెను. ఇపుడు చలలింగస్థాపనావిధానము చెప్పబడుచున్నది. గర్భస్థానమును మూడు లేదా ఐదు భాగములు చేసి ఒక భాగము విడచి, మూడవ భాగమునందు గాని రెండవ భాగమునందు గాని లింగమును స్థాపించవలెను. వాటి పీఠములు కల్పన గూడ ఈ విధముగనే చేయవలెను. లింగముల తత్త్వభేదమును బట్టి పూజాప్రక్రియలో భేద ముండును. స్ఫటికాదిలింగముల సంస్కారము ఇష్టమంత్రముచే చేయవలెను. బ్రహ్మశిలా- రత్నాదుల నివేదనము ఆవశ్యకము కాదు. పిండికాయోజనము గూడ మానసికముగనే చేయవలెను. స్వయంభూలింగ-బాణలింగాదులను సంస్కారాదినియమము లేదు.సంహితామంత్రములతో వీటికి స్నానము చేయించవలెను. వాటికి న్యాసహోమాదులు వైదిక విధిచేతనే చేయవలెను. నదీ-సముద్రాద్యుద్గతలింగముల స్థాపన వెనుకటివలెనే చేయవలెను. ఇహలోకమున మృత్తికాపిష్టాదులతో చేసిన శివలింగము తాత్కాలికము. పూజనకాలము నందు మాత్ర మాత్రమే లింగ నిర్మాణము చేసి వీక్షణాదులతో దానికి శుద్ది చేయవలెను. పిదప యధావిధిగ పూజ చేయవలెను. పూజాసంతరము మంత్రోచ్ఛారణము చేయుచు, లీనలు స్థాపించుకొని ఆ లింగమును జలములో పడవేయవలెనను. ఒక సంవత్సరము అట్లు చేయుటచే ఆ లింగము, ఆ లింగపూజయు మనోవాంఛిత ఫలముల నిచ్చును. విష్ణ్వాదిదేవతాస్థానోపయుక్తము లగు మంత్రములు వేరుగా నుండును. ఆ మంత్రములతోడనే ఆ దేవతల స్థాపన చేయవలెను.

ఆగ్నేయమహాపురాణమునందు శివప్రతిష్ఠావిధివర్ణన మను తొంబదియేడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters