Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ త్రినవతితమో7ధ్యాయః

అథ వాస్తుపూజావిధానమ్‌.

ఈశ్వర ఉవాచ :

తతః ప్రాసాదమాసూత్య్ర వర్తయేద్వాస్తుమణ్డపమ్‌ | కుర్యాత్కోష్ఠచతుఃషష్టిం క్షేత్రే వేదాస్రకే సమే. 1

కోణషు విన్యసేద్వంశౌ రజ్జవో7ష్టాదికోణగాః | ద్విపదాః షట్పదాస్తాస్తు వాస్తుం తత్రార్చయేద్యాథా. 2

ఆకుఞ్చితకచం వాస్తుముత్తానమసురాకృతిమ్‌ | స్మరేత్పూజాసు కుడ్యాది నివేశే త్వధరాననమ్‌ . 3

జానునీ కూర్పరౌ సక్థి దిశి వాతహుతాశయోః | పైత్య్రాం పాదవుటే రౌద్ర్యాం శిరో7స్య హృదయే7ఞ్చలిః.

అస్య దేహే సమారుఢా దేవతాః పూజితాః శుభాః | అష్టౌ కోణాధిపాస్తత్ర కోణార్దే ష్వష్టసు స్థితాః. 5

షట్పదాస్తు మరీచ్యాద్యా దిక్షు పూర్వాదిషు క్రమాత్‌ | మధ్యే చతుష్పదో బ్రహ్మా శేషాస్తు పదికాః స్మృతాః. 6

సమస్తనాడీసంయోగే మహామర్మామ్బుజం ఫలమ్‌ | త్రిశూలం స్వస్తికం వజ్రం మహాస్వస్తికసంపుటౌ. 7

త్రికటుం మణిబన్దం చ సువిశుద్దం పదం తథా | ఇతి ద్వాదశ మర్మాణి వాస్తోర్భిత్త్యాదిషు త్యజేత్‌. 8

సాజ్యమక్షతమీశాయ పర్జన్యాయామ్బుజోదకమ్‌ | దదీతాథ జయన్తాయ పతాకాం కుజ్కు మోజ్జ్వలామ్‌. 9

రత్నవారి మహేన్ద్రాయ రవౌ ధూమ్రం వితానకమ్‌ | సత్యాయ ఘృతగోధూమమాజ్యభక్తం భృశాయ చ.

విమాంసమన్తరిక్షాయ శకున్తేభ్యస్తు పూర్వతః| మధుక్షీరాజ్యసంపూర్ణాం ప్రదద్యాద్వహ్నయే స్రుచమ్‌. 11

లాజాన్‌ పూర్ణం సువర్ణామ్బు వితథాయ నివేదయేత్‌ | దద్యాదద్రక్షఃపతౌ క్షౌద్రం యమరాజే పలౌదనమ్‌. 12

గన్దం గన్దర్వనాధాయ జిహ్వా భృఙ్గాయ పక్షిణః | మృగాయ పద్మపర్ణాని యామ్యామిత్యష్ట దేవతాః. 13

పరమేశ్వరుడు చెప్పెను-స్కందా! పిమ్మట ప్రాసాదమును ఆసూత్రించి వాస్తు మండలరచన చేసి చతురశ్రమైన సమతల క్షేత్రము నందు అరువది నాలుగు కోష్ఠములు నిర్మించవలెను. కోణములందు రెండు వంశముల విన్యాసము చేయవలెను. వికోణములకు పోవునట్లుగా ఎనిమిది రజ్ణువులు గుర్తించవలెను. అవి ద్విపద - షట్పదస్థానముల రూపమున విభక్తములై యుండును. వాటిపై వాస్తుదేవతాపూజ చేయవలెను. కుంచితకేశధారి యగు వాస్తు పురుషుడు వెల్లగితల పండుకొని యుండును. ఆతని ఆకారము అసురసదృశముగా నుండును పూజాసమయమున అతనిని ఆ విధముగనే స్మరించవలెను. కాని గోడ మొదలైన వాటికి పునాది వేయునపుడు అతడు ముఖము క్రిందికి వంచి పండుకొని యున్నట్లు ధ్యానము చేయవలెను. అతని మోకాళ్ళు మోచేతులు తొడలు వాయవ్య ఆగ్నేయ దిక్కులవైపు పడియుండును. ఒక దానితో ఒకటి కలసి యున్న పాదములు నైరృతి దిక్కువైపున ఉండును, ఆతని శిరస్సు ఈశాన్యదిక్కు వైపున నుండును. చేతులు దోసిలిగా ఏర్పడి వక్షఃస్థలముపై నుండును. ఆ వాస్తుపురుషుని శరీరముపై ఎక్కియున్న దేవతలను పూజించుటచే శుభకర మగును ఎనమండుగురు దేవతలు కోణాధిపతులు. వారు ఎనిమిది కోణార్థములందుందురు. వరుసగా పూర్వాది దిక్కులందున్న మరీచ్యాది దేవతలు ఆరేసి పదముల అధిపతులు. వారిమధ్యనున్న బ్రహ్మ నాలుగుపదముల అధిపతి. మిగిలిన దేవతలు ఒక్కొక్క పదమున కధిపతులు. సమస్తము, నాడీసంపాతము మహామర్మ, కమలము, ఫలము,త్రిశూల-స్వస్తిక-వజ్ర-మహాస్వస్తిక-సంపుట-త్రికటి-మణిబంధ-సువిశుద్ధ పదములు పండ్రెండు మర్మస్థానములు వాస్తుభిత్త్యాదులందు వీటి నన్నింటిని పూజించవలెను. రుద్రునకు ఘృతాక్షతలు సమర్పింపవలెను. పర్జన్యునకు కమల-జలములు, జయంతునకు కుంకుమరంజిత మగు నిర్మలపతాక, మహేంద్రునకు రత్నమిశ్రితోదకము, సూర్యునకు ధూమ్రవర్ణ మగు చాందని సత్యదేవతకు ఘృత యుక్తగోధుమలు, భృశునకు ముద్గాన్నము, అంతరిక్షునకు పక్షిమాంసము లేదా సక్తువులు సమర్పించవలెను. వీరు తూర్పుదిక్కునకు సంబంధించిన ఎనమండుగురు దేవతలు. అగ్నికి మధువు, పాలు, నెయ్యి నింపిన స్రుక్కు సమర్పించవలెను. పూషకు పేలాలు, వితథునకు సువర్ణమిశ్రిత జలము, గృహక్షతనకు మధువు, యమునకు మాంసోదనము, గంధర్వనాధునకు గంధము, భృంగరాజునకు పక్షిజిహ్వ, మృగమునకు యవపర్ణములు సమర్పించవలెను. ఈ ఎనమండుగురు దేవతలు దక్షిణమున పూజింపబడుదురు.

పిత్రే తిలోదకం క్షీరవృక్షజం దన్తధావనమ్‌ | దౌవారికాయ దేవాయ ప్రదద్యాద్దేనుముద్రయా. 14

సుగ్రీవాయ దిశేత్పుష్పాన్‌ పుష్పదన్తాయ దర్భకమ్‌ | రక్తం ప్రచేతసే పద్మమసురాయ సురాసవమ్‌. 15

ఘృతం గుడౌదనం శేషే రోగాయ ఘృతమండకాన్‌ | లాజాన్వా పశ్చిమాశాయాం దేవాష్టకమితీరితమ్‌ . 16

éమారుతాయ ధ్వజం పీతం నాగాయ నాగకేసరమ్‌ | ముఖ్యే భక్ష్యాణి భల్లాటే ముద్గుసూపం సుసంస్కృతమ్‌.

సోమాయ పాయసం సాజ్యం శాలూకం మూషయే దిశేత్‌ | లోపీమదితయే దిత్త్యె పురీమిత్యుత్తరాష్టకమ్‌.

మోదకాన్‌ బ్రహ్మణః ప్రాచ్యాం షట్పదాయ మరీచయే | సవిత్రే రక్తపుష్పాణి వహ్న్యధః కోణకోష్ఠకే. 19

తదధః కోష్ఠకే దద్యాత్సావిత్త్య్రెచ కుశోదకమ్‌ | దక్షిణ చన్దనం రక్తం షట్పదాయ వివస్వతే. 20

హరిద్రౌదన మిన్ద్రాయ రక్షోధఃకోణకోష్ఠకే |ఇన్ద్రజాయ చ మిశ్రాన్నమిన్ద్రాధస్తాన్ని వేదయేత్‌. 21

వారుణ్యాం షట్పదాసీనే మిత్రే సగుడమోదనమ్‌ | రుద్రాయ ఘృతసిద్ధాన్నం వాయుకోణాధరే పదే. 22

తదధో రుద్రదాసాయ మాంసమార్గమథోత్తరే | దదీత మాషనైవేద్యం షట్పదస్థే ధరాధరే 23

ఆపాయ శివకోణాధస్తద్వత్సాయ చ తత్థ్సలే | క్రమాద్ధద్యాద్దధిక్షీరం పూజయిత్వా విధానతః. 24

చతుష్పదే నివిష్టాయ బ్రహ్మణ మధ్యదేశతః | పఞ్చగవ్యాక్షతోపేతం చరుసాజ్యం నివేదయేత్‌.

పితృదేవతకు తిలోదకమును సమర్పించవలెను. దౌవారికదేవతకు క్షీరవృక్షదంతధావనకాష్ఠమును ధేనుముద్రాప్రదర్శన పూర్వకముగా సమర్పించవలెను. సుగ్రీవునకు పుష్పములు, పుష్పరంతునకు కుశలు, వరుణునకు ఎర్రని కమలములు, అసురునకు సురాసవములు, శేషునకు నేతిలో తడిపిన అన్నము. రోగునకు ఘృతమిశ్రమండికములు సమర్పించవలెను. వీరు పశ్చిమదిగ్దేవతలు, మారుతునకు పచ్చని రంగు గల ధ్వజము, నాగదేవతకు నాగకేసరము ముఖ్యునకు భక్ష్యపదార్థము, భల్లాటునకు ముద్గసూపము, సోమునకు ఘృతమిశ్రపాయసము. చరకునను శాలూకము, అదితికి లోపి, దితికి పూరీ సమర్పించవలెను. ఈ ఎనమండుగురు ఉత్తరదిగ్దేవతలు, మధ్యనున్న బ్రహ్మకు మోదకములు సమర్పించవలెను. పూర్వదిక్కునందు ఆరు పదముల ఉపభోక్తయగు మరీచికి కూడ మోదకములు అర్పించవలెను. బ్రహ్మక్రింద అగ్నేయ కోష్ఠమునందున్న సవితకు ఎర్రటి పుష్పములు, సవిత క్రింద ఆగ్నేయ కోష్ఠమునందున్న సావిత్రికి కుశోదకములు సమర్పించవలెను. బ్రహ్మకు దక్షిణమున ఆరు పదముల అధిష్ఠాతయగు వివస్వంతునకు రక్తచందనము, బ్రహ్మకు నైరృతి దిక్కునందున్న క్రింది కోష్ఠమునందున్న ఇంద్రునకు పసుపు అన్నము, ఇంద్రుని క్రింద నైరృతి కోణమునందున్న ఇంద్రజునకు మిష్టాన్నము, బ్రహ్మకు పశ్చిమమున ఆరుపదములందున్న మిత్రునకు గుడమిశ్రాన్నము, వాయవ్యకోణము క్రింద పదమునందున్న రుద్రునకు ఘృతపక్వాన్నము, రుద్రుని క్రింది కోష్ఠమునందుద్న రుద్రదాసునకు ఆర్ద్రమాంసము, ఉత్తరమునందున్న ఆరు పదములకు అధిపతియగు వృథ్వీధరునకు పెనులతో చేసిన నైవేద్యము ఈశాన్యము నందు క్రిందనున్న పదమునందలి ఆపుని, దాని కింకను క్రిందనున్న ఆపవత్సుని యథావిధిగా పూజించి పెరుగు, పాయసము సమర్పించవలెను. మధ్యభాగమున నాల్గు పదములలో నున్న బ్రహ్మకు పంచగవ్యములు, అక్షతలు, ఘృతసహితమగు చరువు సమర్పించవలెను.

ఈశాదివాయుపర్యన్తకోణష్వథ యథాక్రమమ్‌ | వాస్తుబాహ్యే చరక్యాద్యాశ్చతస్రః పూజయేద్యథా. 26

చరక్యై సఘృతం మాంసం విదార్యై దధిపఙ్కజే | పూతనాయై పలం పిత్తం రుధిరం చ నివేదయేత్‌. 27

ఆస్థీని పాపరాక్షసై#్య రక్తపిత్తపలాని చ | తతోమాషౌదనం ప్రాచ్యాం స్కన్దాయ చినివేదయేత్‌. 28

అర్యవ్ణుె దక్షిణాశాయాం పూపాన్‌ కృసరయా యుతాన్‌ | జమ్భకాయ చ వారుణ్యా మామిషం రుధిరాన్వితమ్‌.

ఉదీచ్యాం పిలిపిజ్ఞాయ రక్తాన్నం కుసుమాని చ | యజేద్వా సకలం వాస్తుం కుశదధ్యక్షతైర్జలైః. 30

గృహే చ నగరాదౌ చ ఏకాశీతిపదైర్యజేత్‌ | త్రిపదా రజ్జవః కార్యాః షట్పదాశ్చ వికోణకే. 31

ఈశాద్యాః పాదికాస్తస్మిన్‌ నాగాద్యాశ్చ ద్వికోష్ఠగాః | షట్పదస్థా మరీచ్యాద్యా బ్రహ్మా నవపదః స్మృతః 32

నగరగ్రామఖేటాదౌ వాస్తుః శతపదో7పివా | వంశద్వయం కోణగతం దుర్జయం దుర్భరం సదా. 33

యథాదేవాలమే న్యాసస్తథా శతపదే హితః గ్రహాః స్కన్దాదయస్తత్ర విజ్ఞేయాశ్చైవ షట్పదాః. 34

చరక్యాద్యా భూతపదా రజ్జువంశాది పూర్వవత్‌ | దేశసంస్థాపనే వాస్తుశ్చతుస్త్రింశచ్ఛతం భ##వేత్‌. 35

చతుఃషష్టిపదో బ్రహ్మా మరీచ్యాద్యాశ్చ దేవతాః | చతుష్పఞ్జాశత్పదికా అపాద్యష్టౌ రసాగ్నిభిః. 36

ఈశానాధ్యా నవపదాః స్కన్దాద్యాః శక్తి కాః స్మృతాః | చరక్యాద్యాస్తద్వదేవ రజ్జువంశాది పూర్వవత్‌. 37

జ్ఞేయో వింశతిసాహస్త్రెర్వాస్తుమణ్డలగైః పదైః | న్యాసో నవగుణన్తత్ర కర్తవ్యో దేశవాస్తువత్‌. 38

పఞ్చవింశతిపదో వాస్తుర్వేతాలాఖ్యశ్చితౌ స్మృతః | అన్యోనవపదో వాస్తుః షోడశాఙ్ఘ్రిస్తథాపరః. 39

షడస్రత్య్రస్రవృత్తాదేర్మధ్యేస్యాచ్చతురస్రకమ్‌ | ఖాతే వాస్తోః సమం పృష్ఠే న్యాసే బ్రహ్మశిలాత్మకే. 40

శాలూకస్య నివేశే చ మూర్తిసంస్థాపనే తథా | పాయసేన తు నైవేద్యం సర్వేషాం వా ప్రదాపయేత్‌. 41

ఉక్తాను క్తే తు వై వాస్తుః పఞ్చహస్తప్రమాణతః | గృహప్రాసాదమానేన వాస్తుః శ్రేష్ఠస్తు సర్వదా. 42

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే వాస్తుపూజావిధిర్నామ త్రినవతితమో7ధ్యాయః

అథ చతుర్నవతిత మోధ్యాయః

అథ శిలావిన్యాస విధానమ్‌ :

ఈశ్వర ఉవాచ:

పిదప ఈశాన్యము మొదలు వాయవ్యదిక్కువరకును. నాల్గువిదిశలలో నున్న చరకి మొదలగు నలుగురు మాతృకలను వాస్తుబాహ్యభాగమున పూజించవలెను. చరకికి సఘృతమాంసము, విదారికి పెరుగు, కమలములు, పూతనకు మాంసపిత్తమాంసములును సమర్పింపవలెను. పాపరాక్షసికి ఎముకలు, మాంసము, పిత్తము, రక్తము సమర్పింపవలెను. తూర్పున స్కందునకు ముర్గౌదనము, దక్షిణమున అర్యమకు కిచడి, పుష్పము, పశ్చిమదిక్కునందు జంభకునకు రక్తమాంసములును సమర్పింపవలెను. ఉత్తరదిక్కునందు పిలిపిచ్చకు రక్తవర్ణాన్నము, పుష్పములు సమర్పించవలెను. లేదా సకల వాస్తుమండపమును కుశ - దధ్యక్షత - జలములతో పూజించవలెను. గృహనగరాదులలో ఎనుబది ఒక పదములతో గూడిన వాస్తుమండలమును పూజించవలెను. ఈ వాస్తుమండలమునందు త్రిపద షట్పదరజ్జువులను వెనుకటివలెనే నిర్మింపవలెను. దానియందు ఈశాది దేవతలు పదికు లని చెప్పబడుదురు. 'ఆప' మొదలగునవి రెండేసి పదములపై నుండును. మరీచ్యాదిదేవతలు ఆరు పదములందును, బ్రహ్మతొమ్మిది పదములందును ఉండును. నగర-గ్రామ-ఖేటాదులందు శతపదవాస్తు విధానము కూడ చెప్పబడినది. వాటిలో రెండు వంశములు కోణగతములు. అవి సర్వదాదుర్జయములు, దుర్ధరము లని చెప్పబడుచున్నది. శతపదవాస్తు మండలమునందు గూడ దేవాలయమునందు వలెనే న్యాస ముండును. అందు స్కందాదులు షట్పదాధిష్ఠాతలు చరకి మొదలగు వారు ఐదేసి పదములను అధిష్ఠించి యుందురు. రజ్టువంశాదులను వెనుకటి వలెనే చేయవలెను. దేశ రాష్ట్ర స్థాపనకొరకు వాస్తుమండలమున మూడువేల నాలుగు వందల పదము లుండును. మధ్యలో నుండు బ్రహ్మ అరువదినాలుగు పదములకు అధిపతి. మరీచి మొదలగు దేవతల అధికారమున ఏబదినాలుగు చొప్పున పదములుండును. ఆప మొదలగు ఎనమండుగురు దేవతలకు ముప్పదియారు చొప్పున స్థానములుండును. ఈశానుడు మొదలగు వారు తొమ్మిదేసి పదములకును, స్కందాదులు వందేసి పదములకును అధిపతులు, చరకి మొదలగువారి పదములు గూడ తదనుసారముగనే ఉండును. రజ్జువంశాదికల్పన వెనుకటి వలెనే చేయవలెను. వాస్తుదేవపూజ ఇరువదివేల పదముల వాస్తు మండపముమీద కూడ చేయవచ్చును. దానియందు, దేశవాస్తువునందు వలె తొమ్మిది రెట్లు న్యాసముచేయవలెను. చితాస్థాపన సమయమున ఇరువది యైదు పదముల వాస్తు మండలము విహితము. దానికి వతాల మని పేరు. తొమ్మిది పదముల మండలము కూడ ఉండవచ్చును షట్కోణ - త్రికోణ - వృత్తాదిమధ్యమున - చతుర స్రవాస్తుమండలము కూడ విహితమైనది. ఈ వాస్తువు పునాదులు మొదలగువాటికై త్రవ్వు గోతులకు ఉపయోగింపబడును. బ్రహ్మశిలాత్మక పృషన్యాసము నందును శారాకనివేశనమునందును, మూర్తిస్థాపనమునందును గూడ వాస్తువు ఉపయోగించును. వాస్తుమండలమునందున్న సమస్తదేవతలకును క్షీరాన్నము నైవేద్యము చేయవలెను. ఉక్తానుక్తము లగు సకలకార్యములందును, సాధారణముగ, ఐదు హస్తముల వెడల్పు, పొడవు గల వాస్తుమండలము నిర్మింపవలెను. గృహప్రాసాదమానానుసారముగ నిర్మించిన వాస్తు మండలమే సర్వదా శ్రేష్ఠ మని చెప్పబడినది.

అగ్ని మహాపురాణమునందు వాస్తుపూజావిధివర్ణన మను తొంబది మూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters