Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ అష్టాశీతితమో7ధ్యాయ

అథ నిర్వాణదీక్షావిధిః

ఈశ్వర ఉవాచ :

సన్దానం శన్త్యాతీతాయాః శాన్త్యా సార్దం విశుద్దయా | కుర్వీత పూర్వవత్తత్ర తత్త్వవర్ణాది తద్యథా. 1

ఓం హీం క్షౌం హౌం హాం ఇతి సన్దానాని |

ఉభౌ శక్తిశివౌ తత్త్వే భువనాష్టకసిద్ధికమ్‌ | దీపకం రోచకం చైవ మోచకం బోర్ధ్వగామి చ. 2

వ్యోమరూప మనాథం చ స్యాదనాశ్రితమష్టవమ్‌ | ఓంకారపదమీశానే మన్త్రో వర్ణాశ్చ షాడశ. 3

అకారుదివిసర్గాన్తా బీజేన దేహకారకౌ | కుహుశ్చ శఙ్ఖినీ నాడ్యౌ దేవదత్తధనఞ్జ¸°. 4

మారుతౌ స్పర్శనం శ్రోత్రమిన్ద్రియే విషయో నభః | శబ్దో గుణో7స్యావస్థా తు తుర్యాతీతా తు పఞ్చమి. 5

హేతుః సదాశివో దేవ ఇతి తత్త్వాని సఞ్చయమ్‌ | సఞ్చిన్త్య శాన్త్యతీదాఖ్యం విదధ్యాత్తాడనాదికమ్‌. 6

కలాపాశం సమాసాడ్య ఫడన్తేన విభిద్య చ | ప్రవిశ్యాన్తర్నమోన్తేన ఫడన్తేన వియోజయేత్‌ . 7

శిఖాహృత్సమ్పుటేభూతం స్వాహాన్తం సృణిముద్రయా | పూరకేణ సమాకృష్య పాశం మస్తకసూత్రతః. 8

కుమ్భకేన సమాదాయ రేచ కేనోద్భవాఖ్యయా | హృత్సమ్పుటనమో న్తేన వహ్నిం కుణ్డ నివేశ##యేత్‌. 9

అస్యాః పూజాదికం సర్యం నివృత్తేరివ సాధయేత్‌ | సదాశివం సమావాహ్య పూజయిత్వా ప్రతర్ప్య చ. 10

సదాఖ్యాతే7ధికారే7స్మిన్ముముక్షుం దీక్షయామ్యహమ్‌ | భావ్యం త్వయానుకులేన భక్త్యా విజ్ఞాపయేదితి. 11

మహేశ్వరుడు చెప్పెను. విశుద్ధశాంతికళతో శాంత్యతీతకళను సంధానము చేయవలెను. దానియందు కూడ వెనుకటి వలెనే తత్త్వవర్ణాది భావన చేయవలెను. ఎట్లనగా - సంధానసమయమునందు ''ఓం హాం హౌం హూం హాం'' అను మంత్రము నుచ్చరించవలెను. శాంత్యతీతకళలు శివ-శక్తులు రెండు తత్త్వములు. ఇంధక-దేపక-రోచక-మోచక-ఊర్ధ్వగామి వ్యోమరూప-అనాథ-అనుశ్రితము లను ఎనిమిది భువనములు. ఓంకారము పదము. ఈశానము మంత్రము. అకారము మొదలు విసర్గవరకును ఉన్నవి పదునారు అక్షరములు. నాద-హకారములు బీజములు. కుహూ, శంఖినులు రెండు నాడులు. దేవదత్త-ధనంజయములు రెండు ప్రాణవాయువులు. వాక్‌-శ్రోత్రములు రెండు ఇంద్రియములు, శబ్దము విషయము అదియే గుణము కూడ. ఐదవ దైన తురీయాతీతావస్థ అవస్థ. సదాశివుడు ఏకైక కారణము. శాంత్యతీతకళలో ఈ తత్త్వాదులన్నియు ఉన్నవని భావన చేసి తాడనాదికము చేయవలెను. ఫడంత మగు మంత్రముచే కలాపాశతాడనము బోధనముచేసి, నమస్కారాంతమంత్రముతో శిష్యుని అంతఃకరణమునందు ప్రవేశము చేయవలెను. పిమ్మట ఫడంతమంత్రముతో జీవచైతన్యమును పాశవిముక్తము చేయవలెను. 'వషట్‌' 'నమః' అను మంత్రములతో సంపుటిత మైన స్వాహాంతమంత్రము నుచ్చరించి, అంకుశముద్రా పూరక ప్రాణాయామములతో పాశమును మస్తకసూత్రముతో ఆకర్షించి, దానిని కుంభక ప్రాణాయామముతో గ్రహించి, రేచకప్రాణాయామ - ఉద్భవముద్రలతో హృదయమంత్రసంపుటితము చేసి, నమస్కారాంత మంత్రముతో దానిని అగ్నికుండములో స్థాపించవలెను. దాని పూజనాదికము నంతను నివృత్తికళకు చేసినట్లే చేయవలెను. సదాశివుని ఆవాహన-పూజన-తర్పణములు చేసి భక్తిపూర్వకముగ విజ్ఞాపన చేయవలెను. ''భగవంతుడా! ఈ ముముక్షువునకు సత్పురుషులు చెప్పిన నీ అధికారమున దీక్ష ఇచ్చుచున్నాను. నీవు సర్వదా ఈతనికి అనుకూలుడవుగ ఉండవలెను.''

పిత్రోదావాహనం పూజాం కృత్వా తర్పణ సన్నిధా | హృత్సంపుటాత్మబీజేన శిష్యం వక్షసి తాడయేత్‌. 12

ఓం హాం హూం ఫట్‌.

ప్రవిశ్య చాప్యనేనైవ చైతన్యం వీభ##జేత్తతః | శ##స్త్రేణ పాశసంయుక్తం జ్యేష్ఠయాఙ్కుశముద్రయా 13

ఓం హాం హః హూం ఫట్‌.

స్వాహన్తేన తదాకృష్య తేనైర పుటితాత్మనా | గృహీత్వా తన్నమోన్తేన నిజాత్మని నియోజయేత్‌. 14

ఓం హాం హాం హ్రీం ఆత్మనే నమః

పూర్వవత్పితృసంయోగం భావయిత్వోద్భవాఖ్యయా | వామయా తదనేనైవ దేవ్యా గర్భే నియోజయేత్‌. 15

గర్భాధానాదికం సర్వం పూర్వోక్తవిధినా చరేత్‌ | మూలేన పాశ##శైథిల్యే నిష్కృత్యైవ శతం జపేత్‌. 16

నలశక్తితిరోధానే పాశానాం చ వియోజనే | పఞ్చపఞ్చాహుతీర్దద్యాదాయుధేన యథా పురా. 17

పాశానాయుధమన్త్రేణ సప్తవారాభిజప్తయా | చిన్ద్యాదస్త్రేణ కర్తర్యా కాలబీజయుజా యథా. 18

ఓం హాం శాన్త్యతీతకలాపాశాయ హః హూం ఫట్‌.

విసృజ్య వర్తులీకృత్య పాశానస్త్రేణ పూర్వవత్‌ |ఘృతపూర్ణేస్రువే దత్త్వా కలాస్త్రేణౖవ హోమయేత్‌. 19

అస్త్రేణ జుహుయాత్పఞ్చ పాశాజ్కుశనివృత్తయే | ప్రాయశ్చిత్తనిషేదార్థం దద్యాదష్టాహుతీ స్తతః. 20

సదాశివం హృదావాహ్య కృత్వా పూజనతర్పణ | పూర్వోక్తవిధినా దద్యాదధికారసమర్పణమ్‌. 21

ఓం హాం సదాశివమనోబిన్ధుం శుల్కం గృహాణ స్వాహా

నిఃశేషధగ్దపాశస్య పశోరస్య సదా శివ | బిన్ధాయ న త్వయా స్థేయం శివాజ్ఞాం శ్రావయేదితి. 22

మాతాపితరుల ఆవాహన-పూజన-తర్పణ సంవిధానములు చేసి, హృదయసంపుటిత మగు ఆత్మబీజముతో శిష్యుని వక్షఃస్థలమున తాడనము ''ఓం హాం హాం హః హూం ఫట్‌'' అను మంత్రముతో చేయవలెను. ఆ మంత్రముతోడనే శిష్యుని హృదయమునందు ప్రవేశించి అస్త్రమంత్రముతో చైతన్యమును పాశమునుండి విముక్తము చేయవలెను. పిదప జేష్ఠాంకుశముద్రతో సంపుటితమైన ఆ స్వాహాంతమంత్రముతో దానిని ఆకర్షించి, గ్రహించి, నమోంతమంత్రముతో దానిని ఆత్మయందు కూర్చవలెను. ''ఓం హాం హాం హాం హః హూం ఫట్‌'' అనునది ఆకర్షణమంత్రము. ''ఓం హాం హాం హాం ఆత్మనే నమః'' అనునది ఆత్మనియోజన మంత్రము. వామా ఉద్భవముద్రతో వెనుకటివలెనే మాతాపితృసంయోగభావన చేసి, ఆ మంత్రముతోడనే జీవచైతన్యమును దేవీగర్భమునందుంచవలెను. పిమ్మట పూర్వోక్తవిధానానుసారము గర్భాధానాది సంస్కారము లన్నియు చేయవలెను. పాశబంధశైథిల్యము కొరకై, ప్రాయశ్చిత్తముగా మూలమంత్రమును నూరు సార్లు జపించవలెను. మలశక్తితిరోధానము కొరకును, పాశపవియోజనము కొరకును అస్త్రమంత్రముతో వెనుకటివలెనే ఐదేసి హోమములు చేయవలెను. కళకు సంబంధించిన బీజముతో కూడిన ఆయుధమంత్రముతో ఏడు పర్యాయములు అభిమంత్రించిన ఖడ్గరూప మగు అస్త్రముతో పాశములను భేదించవలెను. ''ఓం హః హాం శాన్త్యతీతకళాపాశాయ హుం ఫట్‌'' అనునది మంత్రము.పిదప ఆ పాశములను వెనుకటివలె అస్త్రమంత్రముతో సలిపి, వర్తులా కారము చేసి, నేతితో నింపిన స్రువములనుంచి, కళాస్త్రమంత్రముతో హోమము చేయవలెను. పాశాంకుర నినృత్తికొరకై ఐదు హోమములును, ప్రాయశ్చిత్తనిషేధము కొరకు ఎనిమిది హోమములను చేసి హృదయమంత్రముతో సదాశివుని ఆవాహన - పూజాతర్పణములు చేసి, వెనుక చెప్పిన విధముగ అధికారసమర్పణము చేయవలెను. అందుకుమంత్రము- ''ఓం హాం సదాశివ మనోబిన్దుం శుల్కం గృహాణ స్వాహా'' అనునది. పిదప సదాశివునకు కూడ శివుని ఆజ్ఞను వినిపించవలెను-సదాశివా ! ఈ పశువునందలి పాపములన్నియు దగ్ధములైనవి. కావున ఈతనికి బంధనము కలిగించుటకై నీ విచట ఉండరాదు''.

మూలేన జుహుయాత్పూర్ణాం విసృజేత్తు సదాశివమ్‌ | తతో విశుద్దమాత్మానం శరచ్చన్ద్రమివోదితమ్‌. 23

సంహారముద్రయా రౌద్య్రా సంయోజ్య గురురాత్మని | కుర్వీత శిష్యదేహన్థముద్ధృత్యోద్భవముద్రయా. 24

దద్యాదాప్యాయనాయాస్య మస్తకే7ర్ఘ్యామ్బుబిన్దుకమ్‌ | క్షమయిత్వా మహాభక్త్యా పితరౌ విసృజేత్తదా. 25

ఖేదితా శిష్యదీక్షాయై యన్మయా పితరౌ యువామ్‌| కారుణ్యాన్మోక్షయిత్వా తద్వ్రజధ్వం స్థానమాత్మనః.

శిఖామన్త్రితకర్తర్యా బోధశక్తిస్వరూపిణీమ్‌ | శిఖాం ఛిన్ద్యాచ్ఛివాస్త్రేణ శిష్యస్య చతురజ్గులామ్‌. 27

ఓం క్లీం శిఖాయై హూం ఫట్‌ ఓం అస్త్రాయ హూం ఫట్‌

స్రుచి తాం ఘృత పూర్ణాయాం గోవిడ్గోలకమధ్యగామ్‌|

సంవిధాయస్త్రమన్త్రేణ హూం ఫడన్తేన హోమయేత్‌. 28

ఓం హౌం హః అస్త్రాయ హూం ఫట్‌

ప్రక్షాళ్య స్రుక్‌ స్రువౌ శిష్యం సంస్నాప్యాచమ్య చ న్వయమ్‌ |

యోజనికాస్థమాత్మానం శస్త్రమన్త్రేణ తాడయేత్‌. 29

వియోజ్యాకృష్య సంపూజ్య పూర్వవద్ధ్వాదశాన్తతః | ఆత్మీయహృదయామ్భోజకర్ణికాయాం నివేశ##యేత్‌. 30

పూరితం స్రువమాజ్యేన విహితాధోముఖస్రుచా | నిత్యోక్తవిధినాదాయ శంఖసస్నిభముద్రాయా. 31

ప్రసారితశిరోగ్రీవో నాదోచ్చారానుసారతః | సమదృష్టిః స్థిరాశ్చాన్తః పరభావసమన్వితః. 32

కుమ్భమణ్డలవహ్నిభ్యః శిష్యాదపి నిజాత్మనః | గృహిత్వా షడ్విధాధ్వానం స్రుగగ్రే ప్రాణినాడికమ్‌. 32

సంచిన్త్య బిన్దువద్ధ్యాత్వా క్రమశః సప్తధా యథా|

మూలమంత్రముతో పూర్ణాహుతి ఇచ్చి సదాశివుని విసర్జించవలెను. శరత్కాలచంద్రదృశ మై విశుద్ధమైన శిష్యుని జీవాత్మను రౌద్రీసంహారముద్రతో తనలో సంయోజితము చేసికొనవలెను. శిష్యుని శరీరములో నున్న జీవాత్మను ఉద్భవ ముద్రతో ఉద్దరించి,దాని పోషణము కొరకై, శిష్యుని తలపై అర్ఘ్యజలబిందు వొకటి ఉంచవెలను. పిదప పరమభక్తి భావముతో క్షమార్పణము చెప్పుకొని, ఈ విధముగ పలుకుచు మాతాపితరుల విసర్జనము చేయవలెను. ''శిష్యునకు దీక్ష ఇచ్చుటకై మిమ్ముల నిరువురిని కష్టపెట్టితిని. అందులకు నున్న క్షమించి, మీ యిరువురును తమ స్థానమునకు వెళ్ళుడు'' అస్త్రమంత్రముచే అభిమంత్రించిన కర్తరితో, ''ఓం హూం శిఖాయై హూం ఫట్‌'' ''ఓం అస్త్రాయ హూం ఫట్‌'' అను ఛేదనమంత్రములతో, శిఖాస్త్రముతో, బోధనశక్తి స్వరూపిణి యగు, శిష్యుని నాలుగు అంగుళముల శిఖను ఛేదించవలెను. దానిని ఘృతపూర్ణ మగు స్రువమునందుంచి 'హూం ఫట్‌' ఆని అంతమునందు గల అస్త్రమంత్రముతో అగ్నిలో హోమము చేయవలెను. ''ఓం ఓం హః అస్త్రాయ హూం ఫట్‌'' అనునది మంత్రము. పిదప స్రుక్‌స్రువములు కడిగి, శిష్యునకు స్నానము చేయించి. తాను అచమనము చేసి, యోజనాస్థానము కొరకై అస్త్రమంత్రముతో తనను తాను తాడనము చేసికొనవలెను. పిమ్మట వియోజన - ఆకర్షణ - సంగ్రహణములు చేసి వెనుకటి వలె ద్వాదశాంతము (లలాటముపైభాగము) నుండి జీవచైతన్యమును తీసికొని తన హృదయకమలకర్ణికామధ్యమునం దుంచవలెను. స్రుక్కును నేతితో నింపి, దానిపై స్రువమును అధోముఖముగా నుంచి, శంఖతుల్యముద్రతో, నిత్యోక్తవిధి ప్రకారము హస్తమునందు గ్రహించవలెను. పిమ్మట నాదోచ్చారణానుసారము శిరస్సును, కంఠమును చాపి, దృష్టిని సమభావములో నుంచి, స్థిర - శాంత-పరభావసంపన్నుడై కలశ-మండల-అగ్ని-శిష్యులనుండియు, తననుండియు ఆరు విధము లగు అధ్వలను గ్రహించి, స్రుక్కుఅగ్రభాగమునందు, ప్రాణమయనాడిలోపల నుంచి, దానిని ఆ భావముతోడనే భావన చేయవలెను. ఈ విధముగ చింతించి క్రమముగ ఏడు విధములగు విషువలను ధ్యానించవలెను.

ప్రథమం ప్రాణసంయోగస్వరూపమపరం తతః. 34

హృదయాదిక్రమోచ్చారవిసృష్టం మన్త్రసంఙ్ఞకమ్‌ | పూరకం కుమ్భకం కృత్వా వ్యాదాయ వదనం మనాక్‌.

సుషుమ్నానుగతం నాదస్వరూపం తు తృతీయకమ్‌ | సప్తమే కారణ త్యాగాత్ప్రశాన్తం విశ్వరం లయః.

శక్తినాధోర్ధ్వసఞ్చారస్తచ్ఛక్తి విస్వరం మతమ్‌ | ప్రాణస్య నిఖిలస్యాపి శక్తిప్రమేయవర్జితమ్‌. 37

తత్కాల విశ్వరం షష్ఠం శక్త్యతీతం చ సప్తమమ్‌ | తదేతద్యోజనాస్థానం విశ్వరం తత్త్వసంజ్ఞకమ్‌. 38

పూరకం కుమ్భకం కృత్వా వ్యాదాయ వదనం మనాక్‌ |

శ##నైరుదీర యేన్మూలం కృత్వా శిష్యాత్మనో లయమ్‌. 39

ఫట్‌కారే తడిదాకారే షడధ్వప్రాణరూపిణి | ఫట్‌ కారం పరతో నాభేర్వితస్తిం వ్యాప్య సంస్థితమ్‌. 40

తతః పరమకారన్తు హృదయాచ్చతురజ్గులమ్‌ | ఉకారం వాచకం విష్ణోస్తతో7ష్టాజ్గుళ కణ్ఠకమ్‌. 41

చతురజ్గులతాలుస్థం మకారం రుద్రవాచకమ్‌ | తద్వల్లలాటమధ్యస్థం బిన్దుమీశ్వరవాచకమ్‌. 42

నాదం సదాశివం దేవం బ్రహ్మరన్ద్రావసానకమ్‌ | శక్తిం చ బ్రహ్మరన్ద్రస్థా త్యజ్యన్నిత్యమనుక్రమాత్‌. 43

దివ్యం పిపీలికాస్పర్శం తస్మిన్నేవానుభూయ చ | ష ద్వాదశాన్తే పరే తత్త్వేపరమానన్ద లక్షణ. 44

భావశూన్యే మనోతీతే శివే నిత్యం గుణోదయే | విలీయ మాననే తస్మిన్‌ చ్ఛిష్యాత్మానం విభావయేత్‌. 45

మొదటిది ప్రాణసంయోగస్వరూపము. రెండవది హృదయాదిక్రమమున ఉచ్చరింపబడిన మంత్రము. మూడవది సుషుమ్నానుగతనాదరూపము. నాడీసంబద్ధ మగు నాదము శక్తితో లీన మగుటకు ప్రశాంతవిషువ మని పేరు. శక్తిలోలీనమైన నాదము పున రుజ్జీవితిమైన పైకి సంచారము చేసి, సమతలో లయము అయినచో అది శక్తియను విషువము. సంపూర్ణనాదము శక్తిసీమను లంఘించి, ఉన్మనిలో లీనమైనచో ''కాలవిషువము,'' ఆరవ దగు ఇది శక్త్యతీతము. ఏడవ విషువము ''తత్త్వసంజ్ఞకము'' ఇదియే యోజనాస్థానము. పూరక కుంభకములు చేసి, ముఖము కొంచెము తెరిచి, మెల్ల మెల్లగా మూలమత్రము నుచ్చరించుచు శిష్యాత్మలయ భావనచేయవలెను. దానిక్రమము ఇది - షడధ్వప్రాణరూపమును విద్యుత్సదృశములగు షడధ్వల ప్రాణరూపముగ ఫట్కారమునుచింతన చేయవలెను. అది నాభికి పైన జానెడు దూరమునందు ఉండును. దాని పైన హృదయమునుండి నాలుగు అంగుళముల దూరమునందు అకారమున చింతన చేయవలెను. దానిపైన ఎనిమిది అంగుళముల దూరమున విష్ణువాచక మగు ఉకారము, దాని పైన నాలుగు అంగుళముల దూరమున తాలుస్థానమున రుద్రవాచక మకారమును ఉండును. లలాటమధ్యమున ఈశ్వరవాచక మగు బిందువు ఉండును. లలాటముపైన బ్రహ్మరంధ్రము వరకును నాదమయు డగు సదాశివు డుండును. శక్తికూడ అచటనే యుండును. ఈ తత్త్వముల నన్నింటిని క్రమముగ చింతన చేయుచు, త్యజించి చివరికి శక్తి తత్త్వమును కూడ త్యజించవలెను. అచట దివ్యపిపీలికాస్పర్శానుభవము పొంది లలాటము పైన పరమతత్త్వము, పరమానందస్వరూపము, భావశూన్యము, మనోతీతము, నిత్యము గుణోదయశాలి అగు శివతత్త్వమునందు శిష్మాత్మ విలీనమై నట్లు చేయవలెను.

విముఞ్చన్‌ సర్పిషో ధారాం జ్వాలాన్తే7పి పరే శివే | యోజనికాస్థిరత్వాయ వౌషడన్త శివాణునా. 46

దత్త్వా పూర్ణాం విధానేన గుణాపాదనమాచరేత్‌.

ఓం హాం ఆత్మనే సర్వోజ్ఞో భవ స్వాహా. ఓం హాం ఆత్మనే పరితృప్తో

భవ స్వాహా. ఓం హుం ఆత్మనే అనాదిబోధో భవస్వాహా. ఓం హౌం

ఆత్మనే న్వతన్త్రో భవ స్వాహా. ఓం హౌం ఆత్మనే అలుప్తశకర్భవ స్వాహా. 47

ఇత్థం షడ్గుణమాత్మానం గృహీత్వా పరమాక్షరాత్‌.

విధినా భావనోపేతః శిష్యదేహే నియోజయేత్‌ | తీవ్రాణుశక్తిసంపాతజనితశ్రమశాన్తయే. 47

శిష్యమూర్దని విన్యస్యే దర్ఘ్యాదమృతబిన్దుకమ్‌ | ప్రణమయ్యేశకుమ్భాదీఞ్ఛీవాద్దక్షిణమణ్డలే. 49

సౌమ్యవక్త్రం వ్యవస్థాప్య శిష్యం దక్షిణమాత్మనః | త్వయైవాను గృహీతో7యంమూర్తిమాస్థాయ మామకీమ్‌.

దేవే వహ్నౌ గురౌ తస్మాద్భక్తిం చాప్యస్య వర్ధయ | ఇతి విజ్ఞాప్య దేవేశం ప్రణమ్య చ గురుః స్వయమ్‌.

తతః పరమయా భక్త్యా దత్త్వా దేవే7ష్టపుష్పికామ్‌ | పుత్రకం శివకుమ్భేన సంప్నాప్య విసృజేన్మఖమ్‌. 52

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నిర్వాణ దీక్షావిధిర్నామాష్టాశీతితమోధ్యాయః.

పరమశివునియందు యోనిస్థిరత్వముకొరకై ''ఓం నమః శివాయ వౌషట్‌'' అను మంత్ర ముచ్చరించుచు అగ్ని జ్వాలలో ఘృతధార విడచుచుండవలెను. పిదప విధిపూర్వకముగ పూర్ణాహుతి ఇచ్చి గుణాపాదనము చేయవలెను. పిదప విధిపూర్వకముగ పూర్ణాహుతి ఇచ్చి గుణాపాదనము చేయవలెను. అందులకై ''ఓం హాం ఆత్మనే సర్వజ్ఞోభవ స్వాహా'' ఇత్యాది మంత్రములను (మూలములో ఉన్నవి) పఠించుచు ఆగ్నిలో హోమము చేయవలెను. ఈ విధముగ షడ్గుణసంపన్నమగు ఆత్మను పరమశివునినుండి గ్రహించి, యథావిధిగా, శిష్యుని శరీరమునందు కూర్చినట్లు భావన చేయవలెను. తీవ్రము, మందము అయిన శక్తిపాతముచే కలిగిన శ్రమ శాంతించుటకై శిష్యుని శిరముపై న్యాసపూర్వకముగ అమృతబిందువు ఉంచవలెను. ఈశానకలశాదిరూపమున పూజింపబడిన శివస్వరూపకలశములకు నమస్కారము చేసి, దక్షిణమండలమునందు, శిష్యుని తనకు కుడి ప్రక్కన ఉత్తరాభిముఖునిగా కూర్చుండబెట్టి దేవేశ్వరుడైన ఈశ్వరుని ఈ విధముగా ప్రార్థించవలెనరు. ''ప్రభూ! నా శరీరమునందుండి నీవే ఈజీపుని అనుగ్రిహంచినావు. అందుచే దేవా! వీనికి దేపతా - అగ్ని-గురువులందు భక్తిని అధికము చేయుము.'' ఈ విధముగ ప్రార్థించి శివునకు నమస్కరించి పిదప గురువు శిష్యునకు ఆదరపూర్వకముగ ''నీకు శుభమగుగాక ''

అని ఆశీర్వదించవలెను. పిమ్మట శివునకు భక్తితో ఎనిమిది పష్పములు సమర్పించి శివకలశములోని ఉదకముతో శిష్యునకు స్నానము చేయించి యజ్ఞ సమాప్తి చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు నిర్వాణదీక్షావర్ణన మను ఎనుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

అ (33)

Sri Madhagni Mahapuranamu-1    Chapters