Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ సప్తాశీతితమో7ధ్యాయః

అథ నిర్వాణదీక్షాయాం శాన్తిశోధనమ్‌.

ఈశ్వర ఉవాచ :

సన్దద్యాదధానా విద్యాం శాన్త్యా సార్థం యథావిధి | శాన్తౌ తత్త్వద్వయం లీనం భావేశ్వరసదాశివౌ. 1

హకారశ్చ క్షకారశ్చ ద్యౌ వర్ణౌ పరికీర్తితౌ | రుద్రాః సమాననామానో భువనైః సహ తద్యథా. 2

ప్రభవః సమయః క్షుద్రో విమలః శివ ఇత్యపి | ఘనౌ నిరఞ్జనాకారౌ స్వశివౌ దీప్తికారణౌ. 3

త్రిదశేశ్నరనామా చ త్రిదశః కాలసంజ్ఞకః | సూక్ష్మామ్బుజేశ్వరశ్చేతి రుద్రాః శాన్తౌ ప్రతిష్ఠితాః. 4

వ్యోమవాపినే వ్యోమవ్యాప్యరూపాయ సర్వవ్యాపినే శివాయ

అనన్తాయ అనాథాయ అనాశ్రితాయ ధ్రువాయ శాశ్వతాయ

యోగపీఠసంస్థితాయ నిత్యయోగినే ధ్యానాహారాయేతి ద్వాదశ పదాని

పురుషః కవచౌ మన్త్రౌ బీజీ బిన్దూపకారకౌ | అల్పమ్బుషాయసా నాడ్యౌ వాయూ కృకరకూర్మకౌ. 5

ఇన్ద్రియే త్వక్కరారస్యాః స్పర్శస్తు విషయో మతః | గుణౌ స్పర్శనినాదౌ ద్వావేకః కారణమీశ్వరః 6

తుర్యావస్థేతి శాన్తిస్థం సంభావ్య భువనాదికమ్‌ | విదధ్యాత్తాడనం భేదం ప్రవేశం చ వియోజనమ్‌. 7

ఆకృష్య గ్రహణం కుర్యాచ్ఛాన్తేర్వదనసూత్రతః | ఆత్మన్యారోప్య సంగృహ్యకలాం కుణ్డ నివేశ##యేత్‌. 8

ఈశ తవాధికారే7స్మిన్‌ ముముక్షుం దీక్షయామ్యహమ్‌ | భావ్యం త్వయానుకూలేన కుర్యాద్విజ్ఞాపనామితి. 9

ఆవాహనాదికం పిత్రోః శిష్యస్య తాడనాదికమ్‌| విధాయాదాయ చైతన్యం విధినాత్మని యోజయేత్‌. 10

పూర్వవత్పితృసంయోగం భావయిత్వోద్భవాఖ్యయా | హృత్సమ్పుటాత్మబీజేన దేవీగర్భే నియోజయేత్‌. 11

దేహోత్తత్తౌ హృదా పఞ్చ శిరసా జన్మహేతవే | శిఖయావాధికారాయ భోగాయ కవచాణునా. 12

లయాయ శస్త్రమన్త్రేణ స్తోతః శుద్ధౌ శివేన చ | తత్త్వశుద్ధౌ హృదా హ్యేవం గర్భాధానాది పూర్వవత్‌. 13

పరమేశ్వరుడు చెప్పెను : పూర్వోక్త విధానముచే విద్యాకళను శాంతికళతో విధిపూర్వకముగ సంధానము చేయవలెను. అందుకు ''ఓం హాం హూం హాం'' అనునది మంత్రము. శాంతికళలో ఈశ్వరుడు, సదాశివుడు అను రెండు తత్త్వములు ఇమిడియున్నవి. దీని వర్ణములు హకారక్షకారములు. భువనములలో సమాన నామధేయములు గల రుద్రులు వీరు-ప్రభవ-సమయ-క్షుద్ర-విమల-శివ-ఘన-నిరంజన-అంగార-సుశిరా-దీప్తకారణ-త్రిదేశేశ్వర- కాలదేవ- సూక్ష్మ-అంబుజేశ్వరు లను పదునాలుగురు రుద్రులు శాంతికళలో ప్రతిష్ఠితులు. ''వ్యోమవ్యాపినే, వ్యోమరూపాయ, సర్వవ్యాపినే, శివాయ, అనన్తాయ, అనాధాయ, అనాశ్రితాయ, ధ్రువాయ, శాశ్వతాయ, యోగపీఠసంస్థితాయ, నిత్యయోగినే, ధ్యానాహరాయ'' అనునవి పండ్రెండు పదములు. పురుష-కవచములు రెండు మంత్రములు. బిందుజకారములు బీజములు. అలంబుష, యశఅనునవి రెండు నాడులు. కృకర-కూర్మములు రెండు ప్రాణవాయువులు. త్వక్కు, హస్తములు రెండు ఇంద్రియములు. విషయము స్పర్శ. స్పర్శ-శబ్ధములు రెండు గుణములు. ఈశ్వరుడు ఏకైక కారణము. దీని అవస్థ తురీయావస్థ. ఈ విధముగ భువనాది సకలతత్త్వములును శాంతికళలో ఉన్నట్లు భావన చేసి, వెనుకటి వలెనే, తాడన-భేదన-హృదయప్రవేశ-చైతన్యవియోజన-ఆకర్షణ గ్రహణములు చేయవలెను. పిదప శాంతిముఖసూత్రముచే చైతన్యమును తనలో ఆరోపించుకొని, కళను గ్రహించి,కుండమునందు ఉంచవలెను. పిమ్మట ఈశ్వరుని ఈ విధముగ ప్రార్థించవలెను. ''ఓపరమేశా! నేను ఈ ముముక్షువునకు నీ అదికారమునందు దీక్ష ఇచ్చుచున్నాను. ఈతనికి అనుకూలుడవుగ నుండుము.'' మాతాపిత్రా వాహనాదికము, శిష్యతాడనాదికము చేసి, చైతన్యము గ్రహించి ఆత్మతో యోజనముచేయవలెను. వెనుకటి వలెనే మాతాపితృసంయోగభావన చేసి. హృదయమంత్రసంపుటితమగు ఆత్మబీజము ఉచ్చరించుచు, ఉద్భవవాడితో ఆ చైతన్యమును దేవీగర్భము నందుంచవలెను. దేహోత్పత్తికొరకు హృదయమంత్రముతోను, జన్మకొరకు శిరోమంత్రముతోను, అధికారసిద్ధికొరకు శిఖా మంత్రముతోను, భోగముకొరకు కవచ మంత్రముతోను, లయకొరకు శస్త్రమంత్రముతోను, స్రోతఃశుద్ధికొరకు శివమంత్రముతోను, తత్త్వశోధనము కొరకు హృదయమంత్రముతోను ఐదేసి హోమములు చేయవలెను. గర్భాధానాది సంస్కారములుగూడ వెనుకటివలెనే చేయవలెను.

వర్మణా పాశ##శైథిల్యం నిష్కృత్యైవం శతం జపేత్‌ | మలశక్తితిరోధానే శ##స్త్రేణాహుతిపఞ్చకమ్‌. 14

ఏవం పాశవియోగే7పి తతః సప్తాస్త్రజప్తాయా | భింద్యాదస్త్రేణ కర్తర్యా పాశాన్‌ బీజవతా యథా. 15

ఓం హూం శాన్తికలాపాశాయ హః హుం ఫట్‌ | విసృజ్య వర్తులీకృత్య పాశమన్త్రేణ పూర్వవత్‌. 16

ఘృతపూర్ణేస్రువే దత్త్వా కలాస్త్రేణౖవ హోమయేత్‌ | అస్త్రేణ జహుయాతృఞ్చ పాశాజ్కురనివృత్తయే. 17

ప్రాయశ్చిత్తనిషేధాయ దద్యాదష్ణాహుతీరథ |

ఓం హః అస్త్రాయ హుం ఫట్‌. హృదేశ్వరం సమావాహ్య కృత్వా పూజనతర్పణ. 18

నిదధీత విధానేన తసై#్మ శుల్కసమర్పణమ్‌ |

ఓం హాం ఈశ్వర బుద్ధ్యహఙ్కారౌ శుల్కం గృహేణ స్వాహా |

నిఃశేషదగ్దపాశస్య పశోరస్యేశ్వర త్వయా. 19

న స్థేయం బన్దకత్వేన శివాజ్ఞాం శ్రావయేదితి |విసృజేదీశ్వరం దేవం రౌద్రాత్మానం నియోజయేత్‌. 20

సూత్రే సంయోజయోదేనం శుద్దయోద్భవముద్రయా | దద్యాన్మూలేన శిష్యస్య శిరస్యమృతబిన్దుకమ్‌. 21

విసృజ్య పితరౌ వహ్నేః పూజితౌ కుసుమాదిభిః |

దధ్యాత్పూర్ణాం విధానజ్ఞో నిఃశేషవిధిపూరణీమ్‌. 22

అస్యామపి విధాతవ్యం పూర్వత్తాడనాదికమ్‌ | స్వబీజం తు విశేషః స్యాచ్ఛుద్ధిః శాన్తేరపీడితా. 23

ఇత్యాదిమహాపురాణ అగ్నియే నిర్వాణదీక్షాయాం శాన్తిశోధనం నామ సప్తాశీతితమో7ధ్యాయః.

పాశ##శైథిల్యముకొరకును. నిష్కృతికొరకును. కవచమంత్రము నూరు సార్లు జపించవలెను. మలశక్తితిరో ధానము కొరకు శస్త్రమంత్రముతో ఐదు హోమములు చేయవలెను. పాశవియోగముకొరకు గూడ ఐదు హోమములు చేయవలెను. పిమ్మట అస్త్రమంత్రమును ఏడుపర్యాయములు జపించి, బీజయుక్తాస్త్రమంత్ర రూప ఖడ్గముతో (ఓం హౌం శాన్తి కలాపాశాయ నమః హాం హూం ఫట్‌) పాశమును ఛేదించవలెను. వెనుకటి వలెనే అస్త్రమంత్రముతో పాశవిమర్దన వర్తులీ కరణములు చేసి నేతితో నింపిన స్రువములో ఉంచి, కలాస్త్రమంత్రముతో దానిని హోమము చేయవలెను. పాశాంకుర నివృత్తికొరకై అస్త్రమంత్రముతో ఐదు ఆహుతు లిచ్చి ప్రాయశ్చిత్త నివారణార్థమై ఎనిమిది హోమములు చేయవలెను. ''ఓం హంః అస్త్రాయ హూం ఫట్‌'' అనునది మంత్రము. హృదయమంత్రముతో ఈశ్వరుని ఆవాహన చేసి పూజతర్పణాద్యనంతరము ''ఓం హాం ఈశ్వర బుద్ధ్యహఙ్కారౌ శుల్కం గృహాణ స్వాహా'' అను మంత్రముతో యథాశాస్త్రముగ శుల్కమును సమర్పించవలెను. పిదప ఈశ్వరునకు శివాజ్ఞ వినిపింపవలెను. ''ఈశ్వారా! ఈ పశువు పాశములన్నియు దగ్ధములైనవి. ఇక నీవు వీనికి బంధములు కలిగించరాదు.'' పిమ్మట ఈశ్వరుని విసర్జించి ఆత్మలో రౌద్రిశక్తిని చేర్చవలెను. ఈశ్వరుడు చంద్రునకు తన శిరస్సుపై ఆశ్రయ మిచ్చి నట్లు శిష్యుని జీవాత్మను గురువు తన ఆత్మతో సంబంధింపచేయవలెను. పిదప దానిని శుద్దా- ఉద్భవముద్రతో సూత్రమునందుచేర్చి, అమరబిందు స్వరూప మగు ఆ చైతన్యసూత్రమును, మూలమంత్రముతో, శిష్యుని శిరముపై నుంచవలెను. పిదప అగ్నిని, పితరులను పుష్పాదులతో పూజించి, విసర్జనము చేసి. సమస్తవిధానసంపూర్తి కొరకై, పూర్ణాహుతి ఇవ్వవలెను. తాడనాదికము వెనుకటివలెనే చేయవలెను. ఈ కళకు సంబంధించిన బీజము నుపయోగించుట యొక్కటియే విశేషము. ఈ విధముగ శాంతికళాశుద్ధి చెప్పబడినది.

శ్రీ ఆగ్నేయపురాణమునందు నిర్వాణదీక్షలో శాంతికళాశోధన మను ఎనుబది యేడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters