Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ షడశీతితమో7ధ్యాయః

అథ విద్యాశాదినవిధానమ్‌.

ఈశ్వర ఉవాచ :

సన్ధానమథ విద్యాయాః ప్రాచీనకలయా సహ | కుర్వీత పూర్వతమ్‌ కృత్వా తత్త్వం వర్ణయ తద్యథా. 1

ఓం హోం క్షీమితి సన్ధానమ్‌

రాగశ్చ శుద్ధవిద్యా చ నియతిః కలయా సహ | కాలో మాయా తథావిద్యా తత్త్వానామితి సప్తకమ్‌. 2

రలవాః శషసా ర్ణాః షడ్విద్యాయాం ప్రకీర్తితాః | పదాని ప్రణవాదీని ఏకవింశతి సంఖ్యయా. 3

ఓం నమః శివాయ సర్వప్రభ##వే హం శివాయ ఈశాన సూర్యాయ

తత్పురుషవక్త్రాయ ఆఘోరహృదయాయ వామదేవగుహ్యా

య సద్యోజాతమూ ర్తయే ఓం నమో నమో గుహ్యాతిగుహ్య

య గోప్త్రే అనిధానాయ సర్వాధిపాయ జ్యోతీరూపాయ

పరమేశ్వరాయ భావేన ఓం వ్యోమ

ఓం రుద్రాణాం భువనానాం చ స్వరూపం ప్రమథ కథ్యతే | ప్రమథో వామదేవః స్యాత్తతః సర్వభోవోద్భవః.

వజ్రదేహః ప్రభుర్దాతా క్రమవిక్రమసుప్రభాః | వటుః ప్రశాన్తనామా చ పరమాక్షరసంజ్ఞకః. 5

శివశ్చ సశివో బభ్రురక్షయః శమ్భురేవ చ | అదృష్టరూపనామానౌ తధాన్యో రూపవర్ధనః. 6

మవోన్మనో మహావీర్యశ్చిత్రాఙ్గస్తదనన్తరమ్‌ | కల్యాణ ఇతి విజ్ఞేయాః పఞ్చవింశతి సంఖ్యయా. 7

పరమేశ్వరుడు చెప్పెను. పూర్వమునందున్న కళాప్రతిష్ఠతో కూడ విద్యాకళాసంధానము చేసి, వెనుకటి వలెనే దానియందు తత్త్వవర్ణాదుల చింతనము చేయవలెను. ''ఓం హాం హీం హూం హాం'' అనునది సంధానమంత్రము. రాగ-శుధ్ద విద్యా-నియతి-కలా-కౌల-మాయా--అవిద్యలనెడు ఏడు తత్త్వములను, ర, ల, వ, శ, ష, స అను ఆరు వర్ణములును విద్యాకలాంతర్గతములు. ప్రణవము మొదలగు ఇరువది యొక్క పదములు గూడ తదంతర్గతములే.

''ఓం నమః శివాయ సర్వప్రభ##వే శివాయ ఈశానముర్ధ్నే తత్పురుష వక్త్రాయ అఘోరహృదయాయ, వాసుదేవగుహ్యాయ సద్యోజాతమూర్తయే, ఓం నమో నమః గుహ్యాతి గుహ్యాయ గోప్త్రే అనిధానాయ సర్వయోగాధికృతాయ సర్వయోగాధిపాయ జోతీరూపాయ పరమేశ్వరాయ అచేతన అచేతన వ్యోమన్‌ వ్యోమన్‌'' ఇవి ఇరువది యొక్క పదములు.

ఇపుడు రుద్రుల స్వరూపము, భువనములు స్వరూపము చెప్పబడుచున్నది. - ప్రమథ వామదేవ-సర్వదేవోద్భవ - భవోద్బవ - వజ్రదేహ -- ప్రభు-ధాతృ-క్రమ-విక్రమ-సుప్రభ-బుద్ద-ప్రశాన్తనామన్‌-ఈశాన- అక్షర -శివ - సశివ-బభ్రు అక్షయ-శంభు-అదృష్టరూపనామన్‌-రూపవర్ధన-మనోన్మన- మహావీర- చిత్రాఙ్గ-కల్యాణులు (ణములు)- ఈ ఇరువది యైదును భువనములు, రుద్రులును అని తెలియవలెను.

మన్త్రోఘోరో మరౌ బీజే నాడ్యౌ ద్వే తత్ర తే యథా | పూషా చ హస్తిజిహ్వా చ వ్యాననాగౌ ప్రభఞ్జనౌ.

విషయోరూపమేదైకమిన్ద్రియే పాదచక్షుషి | శబ్దః స్పర్శశ్చ రూపం చ త్రయ ఏతే గుణాః స్మృతాః. 9

అవస్థాత్ర సుషుప్తి శ్చ రుద్రో దేవస్తు కారణమ్‌ | విద్యామధ్యగతం సర్వం భావయేద్భువనాదికమ్‌. 10

తాడనం ఛేదనం తత్ర ప్రవేశం చాపి యోజనమ్‌ | ఆకృష్య గ్రహణం కుర్యాద్విద్యయా హృత్ర్పదేశతః.

ఆత్మన్యారోప్య సంగృహ్య కలాం కుణ్డ నివేశ##యేత్‌ | రుద్రం కారణమావాహ్య విజ్ఞాప్య చ శిశుం ప్రతి. 12

పిత్రోవాహనం కృత్వా హృదయే తాడయేచ్ఛిశుమ్‌ | ప్రవిశ్య పూర్వమన్త్రేణ తదాత్మని నియోజయేత్‌. 13

ఆకృష్యాదాయ పూర్వోక్తవిధినాత్మని యోజయేత్‌. | వామయా యోజయేద్యోనౌ గృహీత్వా ద్వాదశాన్తతః.

కుర్వీత దేహసంపత్తిం జన్మాధికారమేవ చ | భోగం లయం తథా స్రోతఃశుద్ధిత త్తవిశోధనమ్‌. 15

నిఃశేషమల కర్మాదిపాశబన్దనివృత్తయే | నిష్కృత్త్యెవ విధానేన యజేత శతమాహుతీః. 16

విద్యాకళలో ఆఘోరము మంత్రము. మరలు బీజములు, పూషా, హస్తిజిహ్వా అనునవి నాడులు. వ్యాన నాదములు రెండు ప్రాణవాయువులు. రూప మొక్కటియే విషయము. పాదములు, నేత్రములు ఇంద్రియములు, శబ్ద స్పర్శ రూపములు మూడు గుణములు. సుషుప్తి అవస్థ, రుద్రదేవుడు కారణము. భువనాది సమస్త వస్తువులును విద్యాంతర్గతములని భావన చేయవలెను. ''ఓం హూం హైం హాం'' అనునది సంధానమంత్రము, రక్తవర్ణము, స్వస్తిక చిహ్నాంకితము అగు త్రికోణాకారమండలమును భావన చేయవలెను. శిష్యుని పక్షమున తాడనము, కలాపాశ##చ్ఛేదనము, శిష్యహృదయ ప్రవేశము, వాని జీవచైతన్యమును పాశవిముక్తము చేయుట, ఆతని హృదయ ప్రదేశమునుండి జీవచైతన్యముల ఆకర్షణ గ్రహణములును చేయవలెను. జీవచైతన్యమును తన ఆత్మయందు ఆరోపించు కొనుట, కళాపాశసంగ్రహణము, దానిని కుండమునందు స్థాపించుట ఇవన్నియు వెనుకటి వలెనే చేయవలెను. కారణరూపు డగు రుద్రదేవుని ఆవాహన పూజాదులు చేసి, శిష్యునకు బంధము చేయవలదని ఆతనిని ప్రార్థించవలెను. మాతాపిత్రాదుల ఆవాహనము చేసి శిష్యుని హృదయమున తాడనము చేయవలెను. పూర్వోక్తవిద్యనుసారముగ అస్త్రమంత్రముతో హృదయమునందు ప్రవేశించి జీవచైతన్యమును కలాపాశ విముక్తము చేయవలెను. మరల దానిని ఆకర్షించి, గ్రహించి, తన ఆత్మలో చేర్చుకొనవలెను. వామా-ఉద్భవ ముద్రతో దానిని వాగీశ్వరీదేవీ గర్భమునందు స్థాపించి నట్లు భావన చేయవలెను. పిమ్మట దేహసంపాదనము చేసి, జన్మ-అధికార-భోగ-లయ-స్రోతఃశుద్ధి-తత్త్వశుద్ధుల కొరకును, సకల మలకర్మాది నిర్మూలనము కొరకును, పాశబంధనివృత్తి కొరకును, నిష్కృతి కొరకును స్వాహాంతాస్త్ర మంత్రముచే నూరు హోమములు చేయవలెను.

అస్త్రేణ పాశ##శైథిల్యం మలశక్తిం తిరోహితామ్‌ | భేదనం మర్దనం తేషాం వర్తులీకరణం తథా. 17

దాహం తదక్షరాభావం ప్రాయశ్చిత్తమథోదితమ్‌ | రుద్రాణ్యావాహనం పూజా రూపగన్ధసమర్పణమ్‌. 18

ఓం హ్రీం రూపగన్ధౌ శుల్కం రుద్ర గృహాణ స్వాహా |

సంశ్రావ్య శామ్భవీమాజ్ఞాం రుద్రం విసృజ్య కారణమ్‌ | విధాయాత్మని చైతన్యం పాశసూత్రే నివేశ##యేత్‌.

బిన్దుం శిరసి విన్యస్య విసృజేత్పితరౌ తతః | దద్యాత్పూర్ణాం విధానేన సమస్తవిధిపూరణీమ్‌. 19

పూర్వోక్తవిదినా కార్యం విద్యాయాం తాడనాదికమ్‌ | స్వబీజం తు విశేషః స్యాదితి విద్యా విశోధితా. 20

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే నిర్వాణ దీక్షాయాం విద్యాశోధనం నామ షడశీతితమో7ధ్యాయః.

పిమ్మట అస్త్రమంత్రముచే పాశబంధశిధిలీకరణము, మలశక్తితిరోధానము, కళాపాశ##చ్ఛేదనము, మర్దనము, వర్తులీ కరణము, దాహము, అంకురాభావ సంపాదనము, ప్రాయశ్చిత్త కర్మ-ఇవన్నియు వెనుకటి వలెనే చయవలెను. పిదప రుద్రుని ఆవాహన చేసి, పూజించి, ''ఓం హాం రూపగన్ధౌ శుల్కంరుద్ర గృహాణస్వాహా'' అను మంత్రముచే రూపగంధములను సమర్పించవలెను. పరమేశ్వరుని ఆజ్ఞ వినిపించి రుద్రుని విసర్జించవలెను. జీవచైతన్యమును తన ఆత్మలో నుంచి, దాని పాశసూత్రమునందు చేర్చవలెను. జలబిందుస్వరూప మగు ఆ చైతన్యమును శిష్యుని శిరముపై నుంచి మాతాపితరులను విసర్జించవలెను. సకలవిధి సంపూర్తి కొరకు పూర్ణాహుతి చేయవలెను. విద్యలో తాడనాదిక్రియ లన్నియు పూర్వోక్త విధాననానుసారమే చేయవలెను. అంతలోను దానికి సంబంధించిన బీజముల నుపయోగించుట యొక్కటియే భేదము. ఈ విధానమంతయు పూర్తియైనచో విద్యాకళాశోధన మగును.

అగ్ని మహాపురాణములో, నిర్వాణదీక్షలో విద్యాకలాశోధన మను ఎనుబదియారవ అధ్యాయము సమాప్తము..

Sri Madhagni Mahapuranamu-1    Chapters