Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ పఞ్చాశీతితమో7ధ్యాయః

అథ ప్రతిష్ఞాకలాశోధనమ్‌.

ఈశ్వర ఉనాచ :

తత్త్వయోరథ సన్దానం కుర్యాచ్ఛుధ్దవిశుద్ధయోః | హ్రస్వదీర్ఘప్రయోగేణ నాదనాదాన్త సఙ్గినా. 1

ఓం హాం హ్రూం హాం అప్తేజోవాయురాకాశం తన్మాత్రేన్ద్రియబుద్దయః.

గుణత్రయమహఙ్కారశ్చతుర్వింశః పుమానితి. 2

ప్రతిహ్ఠాయాం నివిష్టాని తత్త్వాన్యేతాని భావయేత్‌ | పఞ్చవింశతి సంఖ్యాదిఖాదియాన్తాక్షరాణి చ. 3

పఞ్చాశదధికా షష్టిర్భువనైస్తుల్యసంజ్ఞితాః | తావన్త ఏవ రుద్రాశ్చ విజ్ఞేయా స్తత్ర తద్యథా. 4

అమరేశః ప్రభావశ్చ నైమిషః పుష్కరో7పిచ | తథాపాదిశ్చ దణ్డిశ్చ భావభూతిరథాష్టమః. 5

నకురీశో హరిశ్చన్ద్రః శ్రీశైలో దశమః స్మృతః | అన్వీశో7భ్రాతికేశశ్చ మహాకాలోధ మధ్యమః. 6

కేదరో భైరవశ్చైవ ద్వితీయాష్టకమీరితమ్‌ | తతో గయాకురుక్షేత్రఖరానాదిక నాదికే. 7

విమలాశ్చాట్టహాసశ్చ మహేన్ద్రో భీమ ఏవ చ | వస్వాపదం రుద్రకోటిరవియుక్తో మహాబలః. 8

గోకర్ణో భద్రకర్ణశ్చ స్వర్ణాక్షః స్థాణురేవ చ | అజేశ్చైవ సర్వజ్ఞో భాస్వరః సూదనాన్తరః. 9

నుబాహుర్మత్తరూపేచ విశాలో జటిలస్తథా | రౌద్రో7థ పిఙ్గలాక్షశ్చ కాలరంష్ట్రీ భ##వేత్తతః. 10

విదురశ్చైవ ఘోరశ్చ ప్రాజాపత్యో హుతాశనః | కామరూపే తథా కాలః కర్ణే7ప్యధ భయానకః. 11

మతఙ్గః పిఙ్గలశ్చైవ హరో వై ధాతృసంజ్ఞకః | శజ్కుకర్ణో విధానశ్చ శ్రీకణ్ఠశ్చన్ద్రశేఖరః. 12

సహైతేన చ పర్యాన్తాః కథ్యాన్తే7థ పదాన్యపి |

ఈశ్వరుడు చెప్పెను : శాంతము, నాదాంతకము అను హ్రస్వదీర్ఘముల ప్రయోగముచే శుద్ధ-అశుధ్దకళల సంధానము చేయవలెను. ''ఓం హాం హ్రాం హ్రీం హాం'' అనునది సంధానమంత్రము. పిమ్మట ప్రతిష్ఠాకళలో నున్న జల-తేజో-వాయు-ఆకాశ-పంచతన్మాత్ర-దశేంద్రియ-బుద్ధి-గుణత్రయ-ఆహంకార-పురుషులను ఇరువదియైదు తత్త్వములను, 'క' మొదలు 'య' వరకును ఉన్న ఇరువదియైదు అక్షరములను చింతనచేయవలెను. ప్రతిష్ఠాకళలో ఏబదియారు భువనములున్నవి. వాటిలో అవే పేరులు గల రుద్రులు అంతమంది ఉన్నారు. వారి పేర్లు ఈ విధముగ నున్నవి :- అమరేశ-ప్రభాస-నైమిష-పుష్కర-అషాఢి-డిండి-భావభూతి-లకులీశులు (ఇరు మొదటి అష్టకము), హరిశ్చంద్ర-శ్రీశైల-జల్ప-ఆమ్రాతకేశ్వర-మహాకాల-మధ్యమ-కేదార-భైరవులు (ద్వీతీయాష్టకము), గయా-కురుక్షేత్ర-నాల-కనఖల-విమల-అట్టహాస-మహేంద్ర-భీములు (తృతీయాష్టకము),వస్త్రపద-రుద్రకోటి-అవిముక్త-మహాలయ-గోకర్ణ-భధ్రకర్ణ-స్వర్ణాక్ష-స్థాణువులు (చతుర్థాష్టకము), అజేశ-సర్వజ్ఞ-భాస్వర-తదనంతర-సుబాహు-మంత్రరూపి-విశాల-జిటిల-రౌద్రులు (ఐదవ అష్టకము), పింగలాక్ష-కాలదంష్ట్రి-విధర-ఘోర-ప్రాజాపత్య-హుతాశన-కాలరూపి-కాలకర్ణులు (ఆరవ అష్టకము). భయానక - పతంగ-పింగల-హర-ధాతృ-శంకుకర్ణ-శ్రీకంఠ-చంద్రమౌలు (ఏడవఅష్టకము) ఈ ఏబది యారుగురు రుద్రులు ఏబదియారు భువనములలో వ్యాపించియున్నారు. ఇపుడు ముప్పదిరెండు పదములు చెప్పబడుచున్నవి.

వ్యాపిన్‌ ఓం అనురూప ఒం ప్రమథ ఓం తేజః ఓం జ్యోతిః ఓం పురుష ఓం

అగ్నే ఓం అధోమ ఓం అభస్మ ఓం అనాది ఓం నానా ఓం ధూధూ ఓం

భూః ఓం భువః ఓం స్వః, అనిధన, నిధనోద్భవ, శివ, శర్వ, పరమాత్మన్‌,

మహేశ్వర, మహాదేవ, సద్బావేశ్వర, మహాదేజః, యోగాధిపతయే

ముఞ్చ ప్రథమ సర్వ సర్వేతి ద్వాత్రింశత్‌ పదాని |

బీజభావే త్రయో మంత్రాః వామదేవః శివః శిఖా.

గాన్థారీ చ సుషుమ్నా చ నాడ్యౌ ద్వౌ మారుతౌ తథా | సమానోదాననామానౌ రసనాషాయురిన్ద్రియే. 14

రసస్తు విషయో రూపశబ్దస్పర్శం రసా గుణాః | మణ్డలం వర్తులం తచ్చ పుణ్డరీకాఙ్కితం సితమ్‌. 15

స్వప్నావస్థా ప్రతిష్ఠాయాం కారణం గరుడధ్వజమ్‌ | ప్రతిష్ఠాన్తకృతం సర్వం సఞ్చిన్త్య భువనాదికమ్‌. 16

సూత్రం దేహే స్వమన్త్రేణ ప్రవిశ్యైనాం వియోజయేత్‌ |

ఓం హాం ఖీం హాం ప్రతిష్ఠాకలాపాశాయ ఓం ఫట్‌

స్వాహాన్తెనానేనైవ పూర కేణాఙ్కుశముద్రయా సమాకర్షేత్‌.

తతః ఓం హాం హ్రూం హ్రాం ప్రతిష్ఠాకలాపాశాయ హూంఫడి

త్యనేన సంహారముద్రయా కుంభ##కేన హృదయాదధోనాడీసూత్రా

దాదాయ ఓం హాం హ్రూం హ్రాం హాం ప్రతిష్ఠాకలాపాశాయ నమః

ఇత్యనేనోధ్బవముద్రయా రేచకేన కుమ్భే సమారోపయేత్‌.

తతో హాం హ్రీం ప్రతిష్ఠాకలాపాశాయ నమ ఇత్యనేనార్చయిత్వా

సంపూజ్య స్వాహాన్తే నాహుతీనాం త్రయేణ సన్నిధాయ తతః

హాం విష్ణవే నమ ఇతి విష్ణుమావాహ్య, సంపూజ్య, సంతర్ప్య,

విష్ణో రవాధికారేస్మిన్‌ ముముక్షుం దీక్షయామ్యహమ్‌.

భావ్యం త్యయానునకూలేన విష్ణుం విజ్ఞాపయేదితి.

త్యాపిన్‌, అరూపిన్‌, ప్రథమ, తేజః, జ్యోతిః, అరూప, పురుష, అగ్నే, అధూమ, అభస్మన్‌, అనాదే, నానానానా, ధూధూధూధూ, ఓం భూః, ఓం భువః, ఓం స్వః, అనిధన, నిధన, నిధవోద్భవ, శివ, శర్వ, పరమాత్మన్‌, మహేశ్వర, మహదేవ, సద్భావ, ఈశ్వర, మహాతేజః, యోగాధిపతే, ముంచ, ప్రమథసర్వ, సర్వసర్వ అనునవి ముప్పదిమూడు పదములు. రెండు బీజములు, వాసుదేవ-శిరస్‌-శిఖలను మూడు మంత్రములు. గాంధారీసుషుమ్నా నాడులు, సమానోదానము లను రెండు ప్రాణవాయువులు, రసనాపాయువు లను రెండు ఇంద్రియములు. రస మను విషయము, రూప-శబ్ద-స్పర్శ-రసము లను నాలుగు గుణములు, కమలాంకిత మైన అర్థచంద్రాకర శ్వేతమండలము, సుషుప్త్యవస్థ, ప్రతిష్ఠాకారణభూతు డైన విష్ణువు- ఈ విధముగ భువనాది సకల తత్త్వములను ప్రతిష్టలోపల భావన చేసి, ప్రతిష్ఠాకళామంత్రముతో శిష్యశరీరమున ప్రవేశించినట్లు భావన చేసి, దానిని ఆ కళాపాశమునుండి విముక్తుని చేయవలెను. ఓం హాం హీం హాం ప్రతిష్ఠాకలాపాశాయ హుం ఫట్‌ స్వాహా'' అను మంత్రముతో, పూరకప్రాణాయామాంకుశ ముద్రలతో కళాపాశాకర్షణము చేయవలెను పిమ్మట ''ఓం హూం హాం హీం హాం హూం ప్రతిష్ఠాకలాపాశాయ హుం ఫట్‌ '' అను మంత్రముతో, సంహారముద్రా కుంభక ప్రాణాయామములతో హృదయము క్రింద నాడీసూత్రము గ్రహించి, ''ఓం హూం హీం హాం ప్రతిష్ఠాకలాపాశాయ నమః'' అనుమంత్రముతో, ఉద్బవముద్రా-రేచక ప్రాణాయామములతో కుండమునందు ఉంచవలెను పిదప ''ఓం హాం హాం హీం హాం ప్రతిష్ఠాకాలా ద్వారాయ నమః'' అను మంత్రముతో అర్ఘ్య మిచ్చి, పూజించి, స్వాహావితమంత్రముతో మూడేసి హోమములు చేసి, సంతర్పణ సంవిధాపనములు చేయవలెను. ''ఓం హాం విష్ణవే నమః'' అను మంత్రముతో విష్ణువును ఆవాహన చేసి, పూజాతర్పణములు చేసి- ''ఓ విష్ణూ ! నీ అధికారమునందు ముముక్షు వగు శిష్యునకు దీక్ష ఇచ్చుచున్నాను. నీవు అనుకూలుడ వగుము'' అని ప్రార్థించవలెను.

తతో వాగీశ్వరీం దేవీం వాగీశమపి పూర్వవత్‌. 18

ఆవాహ్యాభ్యర్చ్య సన్తర్ష్య శిష్యం వక్షసి తాడయేత్‌ |

ఓం హాం హాం హం ఫట్‌

ప్రవిశేదప్యనేనైవ చైతన్యం విభ##జేత్తతః. 19

శ##స్త్రేణ పాశసంయుక్తం జ్యేష్ఠయాఙ్కుశముద్రయా

ఓం హాం హం హోం మ్రూం ఫట్‌ స్వాహాన్తేన హృదాకృష్య తేనైవ పుటితాత్మనా

గృహీత్వా తం నమోన్తేన నిజాత్మని నియోజయేత్‌

ఓం హాం హం హోం ఆత్మనే నమః | పూర్వవత్పితృసంయోగం భావయిత్వోద్బవాఖ్యయా. 21

వామమా తదనేనైవ దేవీగర్భే వినిక్షిపేత్‌

ఓం హాం హం హాం ఆత్మనే నమః | దేహోత్పత్తౌ హృదా హ్యేకం శిరషా జన్మనా తథా. 22

శిఖయా వాధికారాయ భోగాయ కవచాణునా | తత్త్వశుద్దౌ హృదా హ్యేవం గర్బాధానయ పూర్వవత్‌. 23

శిరసా పాశ##శైథివ్యే నిష్కృత్త్యెవం శతం జపేత్‌ | ఏవం పాశయోగేపి తతః శస్త్రాత్మజప్తయా. 24

ఛిన్ద్యాదస్త్రేణ కర్తర్యా కలాబీజకతా యథా |

ఓం హ్రీం ప్రతిష్ఠాకలాపాశాయ హః ఫట్‌ | విసృజ్య వర్తులీకృత్య పాశమన్త్రేణ పూర్వవత్‌. 25

ఘృతపూర్ణే స్రువే దత్త్వా కలాస్త్రేణౖవ హోమయేత్‌ | అస్త్రేణ జుహుయాత్పఞ్చ పాశాఙ్కుశనివృత్తయే. 26

ప్రాయశ్చిత్తనిషేదార్థం దద్యాదష్టాహుతీస్తతః

ఓం హః అస్త్రాయ హుం ఫట్‌ | హృదావాహ్య హృషీకేశం కృత్వా పూజనతర్పణ. 27

పూర్వోక్తవిధినా కుర్యాదధికారసమర్పణమ్‌

ఓం హాం రసశుక్లం గృహాణ స్వాహా | నిశ్శేషదగ్దసాశస్య పశోదస్య హరే త్వయా. 28

న స్థేయం బన్దకత్వేన శివాజ్ఞాం శ్రావయేదితి | తతో విసృజ్య గోవిన్దం విద్యాత్మానం నియోజ్య చ. 29

రాహుముక్తార్దదృశ్యేన చన్ద్రబిమ్బేన సన్నిభమ్‌ | సంహారముద్రయా స్వస్థం విధాయోద్భవముద్రయా. 30

సూత్రే సంయోజ్య విన్యస్య తోయబిన్దుం యధా పురా | విసృజ్య పితరౌ వహ్నే ః పూజితా కుసుమాదిభిః.

దర్యాత్పూర్ణాం విధానేన ప్రతిష్టాపి విశోదితా.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నిర్వాణదీక్షాయాం ప్రతిష్ఠాకలాసం శోధన విధిర్నామ పఞ్చాశీతితమోధ్యాయః.

పిమ్మట వాగీశ్వరీ వాగీశ్వరులను వెనుకటివలెనే ఆవాహన చేసి పూజనతర్పణములు చేసి, శిష్యుని వక్షమున తాడనము చేయవలెను. ''ఓం హాం హాం హంః హూం ఫట్‌'' అనునది తాడనమంత్రము. ఈ మంత్రముతోడనే శిష్యుని హృదయమున ప్రవేశించి పాశబద్ధ మగు ఆతని చైతన్యమును. అస్త్రమంత్ర-జ్యేష్ఠాంకుశముద్రలతో పాశవిముక్తము చేయవలెను. ఎట్లనలగా- ''ఓం హాం హం హః ఫట్‌'' ఈ మంత్రమునకే ''స్వాహా'' చేర్చి తత్సంప్రటిత మైన మంత్రముతో జీవ చైతన్యము ఆకర్షించి నమస్కారాంత మగు ''ఓం హాం హాం హాం ఆత్మనే నమః'' అను ఆత్మమంత్రముతో తన ఆత్మతో కలపవలెను. పిదప, ఆ జీవచైతన్యము పితృసంయుక్త మను భావన చేసి, దానిని వామా ఉద్భవముద్రతో దేవీగర్భమునందు స్థాపించవలెను. ఆ సమయమున ''ఓం హాం హాం హామాత్మనే నమః'' అను మంత్రము పఠించవలెను. దేహోత్పత్తి కొరకై హృదయమంత్రముతో ఐదు హోమములను, జీవాత్మస్థితికొరకై శిరోమంత్రముతో ఐదు హోమములు చేయవలెను. అధికారప్రాప్తి కొరకు శిఖామంత్రముతోను, భోగసిద్ధికొరకు కవచమంత్రముతోను, లయకొరకు అస్త్రమంత్రముతోను స్రోతః సిద్ధికొరకు శివమంత్రముతోను తత్త్వశుద్ధికొరకు హృదయమంత్రముతోను ఐదేసి హోమములు చేయవలెను. పిమ్మట వెనుకటివలె గర్భాదానాది సంస్కారములుచేసి, పాశ##శైథిల్య-ప్రాయశ్చిత్తములకొరకు శిరోమంత్రముతో నూరు హోమములు చేయవలెను. మలశక్తి నివారణముకొరకై స్వాహాంతమగు అస్త్రమంత్రముతో ఐదు హోమములు చేయవలెను. ఈ విధముగ పాశములు తొలగిన పిమ్మట అస్త్రమంత్రమును ఏడు పర్యాయములు జపించి, '' ఓం హీం ప్రతిష్ఠాకలాపాశాయ హూం ఫట్‌'' అను కలాబీజయుక్తమగు అస్త్రమంత్రరూపఖడ్గముతో కలాపాశమును ఛేదించవలెను. పాశశస్త్రముతో ఆ పాశమును నలిపి, వర్తులాకారము చేసి, వెనుకటివలెనే ఘృతపూర్ణ మగు స్రువమునందుంచి, దానిని కలాశస్త్రముతో హోమము చేయవలెను. పిమ్మట పాశాంకుర నివృత్తికొరకై అస్త్రమంత్రముతో ఐదు హోమములు చేసి ప్రాయశ్చిత్త నివారణార్థమై మరల ఎనిమిది హోమములు చేయవలెను. ''ఓం హః అస్త్రాయ హూం ఫట్‌'' అనునది హోమమున కుపయెగించు అస్త్రమంత్రము.

హృదయమంత్రముచే విష్ణువును అవాహనచేసి, పూనతర్పణాద్యనంతరము ''ఓం హాం విష్ణో రసం శుల్కం గృహాణ స్వాహా'' అను మంత్రముతో అధికార సమర్పణము చేయవలెను. పిదప ఈ విధముగ శివాజ్ఞ వినిపింపవలెను. ''ఓ విష్ణూ! ఈ పశువు పాశములు పూర్తిగా దగ్ధ మైనవి. ఇక నీవు వీనికి బంధనకారకుడవు కాకూడదు. '' పిదప రౌద్రీనాడితో విష్ణువును విసర్జించి రాహుముక్త మైన అర్థభాగము గల చంద్రమండలముతో సమాన మైన ఆత్మను నియుక్తము చేయవలెను. సంహారముద్రతో దానిని తనలోనుండి, ఉద్భవముద్రతో దానిని సూత్రముతో కలుపవలెను., పిదపవెనుకటివెలెనే, జలబిందుసదృశ మగు ఆ ఆత్మను శిష్యుని శిరముపై ఉంచవలెను. దీనివలన ఆతనికి అప్యాయనము కలుగును. పిదప పుష్పాదులతో అగ్ని యొక్క మాతాపితరులను పూజించి, విసర్జనము చేసి, విధిపూర్తి కొరకై యథాశాస్త్రముగా పూర్ణాహుతి ఈయలెలెను. ఇట్లు చేయటచే ప్రతిష్టాకళ కూడ శోధితమగును.

అగ్ని మమాపురాణమునందు, నిర్వాణదీక్షలో ప్రతిష్ఠాకళా సంశోధనవిధి యను ఎనుబదియైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters