Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ అశీతితమో7ధ్యాయః

అథ దమనకారోహణవిధిః

ఈశ్వర ఉవాచ :

వక్ష్యేదమనకారోహవిధిం పూర్వవదాచరేత్‌ | హరకోపాత్పురా జా భైరవో దమితాః సురాః 1

తేనాథ శప్తో విటపో భ##వేతి త్రిపురారిణా | ప్రసన్నేనేదితం చేదం పూజయిష్యన్తి యే నరాః. 2

పరిపూర్ణం ఫలం తేషాం నాన్యథా తే భవిష్యతి | సప్తమ్యాం వా త్రయోదశ్యాం దమనం సహితాత్మభిః. 3

సంపూజ్య బోధయేద్వృక్షే భవ వాక్యేన మన్త్రవిత్‌ | హరవ్రసాదసంభూత త్యమత్ర సన్నిదౌ భవ. 4

శివకార్యం సముద్దిశ్య నేతవ్యో7సి శివాజ్ఞయా | గృహేప్యామన్త్రణం కుర్యాత్నాయాహ్నే చాధివాసనమ్‌. 5

యథావిధి సమభ్యర్ఛ్య సూర్యశఙ్కరపావకమ్‌ | దేవస్య పశ్చిమే మూలం దద్యాత్తస్య మృధాయుతమ్‌ 6

వామేన శిరసా వాథ నాలంధాత్రీం తథోత్తరౌ | దక్షిణ భగ్నపత్రం చ ప్రాచ్యాం పుష్పం చ ధారణమ్‌. 7

పుటికాస్థం ఫలం మూలమథై శాన్యాం యజేచ్ఛివమ్‌ | పఞ్చాఙ్గమఙ్గలౌ కృత్వా అమన్త్య్ర శిరసి న్యసేత్‌. 8

ఆమన్త్రితో7సి దేవేశ ప్రాతః కాలే మయా ప్రభో | కర్తవ్యస్తపసో లాభః పూర్ణం సర్వం తవాజ్ఞయా. 9

మూలేన శేషం పాత్రస్థ పిధాయాధ పవిత్రకమ్‌ | ప్రాతః స్నాత్వా జగన్నాథం గన్దపుష్పాదిభిర్యజేత్‌. 10

నిత్యం నైమిత్తికం కృత్వా దమనైః పూజయేత్తతః | శేషఞ్జవిమాదాయ ఆత్మవిద్యాశినవాత్మభిః. 11

మూలద్యైరీశ్వరోన్తైశ్చ చతుర్ధాఞ్జవినాతతః |

ఓం హౌం మహేశ్వరాయ మఖ పూరయ పూరయ శూలపాణయే నమః.

శివం వహ్నిం చ సంపూజ్య గురుం ప్రార్చ్యాథ బోధయేత్‌. 12

భగవన్నతిరిక్తం వా హీనం వా యన్మయా కృతమ్‌ | సర్వ తదస్తు సంపూర్ణం సర్వం దమనకం మమ.

సకలం చైత్రమాసోత్థం ఫలం ప్రాప్య దివం వ్రజేత్‌ |

ఇత్యాది మహాపురాణ అగ్నేయే దమనకారోహణవిధిర్నా మాశీతితమో7ధ్యాయః

ఈశ్వరుడు పలికెను-ఇపుడు దమనకారోహణవిధి చెప్పెదను, అన్ని కార్యములను వెనుకటివలెనే చేయవలెను. పూర్వము శివుని కోపమునుండి భైరవుడు జనించి దేవతలను పీడింప ప్రారంభించెను. ఇది చూచి కోపించిన శివుడు "నీవు వృక్షమగుదుగాక" అని భైరవుని శపించెను. అతడు క్షమింపు మని ప్రార్థించగా శివుడు-"నీ పత్రములతోగాని, నీకు గాని పూజించువారి మనోవాంఛితములు సిద్దించును. వారి కోరికలు నిష్పల మగుట అనునది ఉండదు" అని అనుగ్రహించెను. సప్తమి లేదా త్రయోదశి యందు మంత్రవేత్త సంహితా మంత్రములచే దమనక వృక్షమును పూజించి- "ఓ దమనక వృక్షమా! నీవు శివుని ప్రసాదముచే ఆవిర్భవించితివి. నీవు ఇచట సంనిహితుడవు కమ్ము. శివుని అజ్ఞననుసరించి నేను నిన్ను శివకార్యార్థమై తీసికొని వెళ్లవలసియున్నది." అని ప్రార్థించవలెను. ఆ వృక్షమును ఇంటికి తీసికొని వచ్చి సాయంకాలమున అధివాసనకర్మ చేయవలెను. యథావిధిగ సూర్య-శివ-అగ్నుల వూజచేసి, ఇష్టదేవతకు పశ్చిమమున, మట్టితో చేర్చి ఆ వృక్షము మూలమును స్థాపించవలెను. వామదేవ మంత్ర-శిరోమంత్రములతో ఆవృక్షనాళములను ఉసిరి పండ్లను ఉత్తరమునందుంచవలెను. రాలిపోయిన, దాని అకులను దక్షిణమునందును, పుష్పములను, తూర్పునను ఉంచవలెను. ఈశాన్యమునందు ఒక దొన్నెలో దాని ఫలములను, మూలమును ఉంచి శివుని పూజచేయవలెను. ఆ వృక్షమునకు సంబంధించిన వేళ్లు, కాడలు, పత్రములు, పువ్వులు, ఫలములు అను పంచాంగములను దోసిటగ్రహించి, ఆ మంత్రముచేయుచు శిరస్సుపై ఉంచుకొని "దేవేశ్వరా! నేడు నిన్ను ఆహ్వానించుచున్నాను. రేపు ప్రాతఃకాలమున నేను తపఃఫలమును సంపాదింపవలెను. చేసిన ఉపాసనమ సఫలము చేయవలెను. ఇదంతయు నీ ఆజ్ఞచే పూర్ణమగుగాక" అని ప్రార్థించవలెను. పిమ్మట పాత్రలో నుంచిన మగిలిన పవిత్రకములను మూలమంత్రముతో ఆచ్ఛాదించి ప్రాతఃకాలము హ్ననానంతరము శివుని గంధపుహ్పాదులతో పూజించవలెను. పిమ్మట నిత్యనైమిత్తిక కర్మలు పూర్తిచేసికొని దమనకమును పూజించి, దానిని దోసిలిలో గ్రహించి "ఓం హాం ఆత్మతత్త్వాధిపతయే శివాయస్వాహా", "ఓం హాం విద్యాతత్త్వాధిపతయే శివాయస్వాహా", "ఓం హాం శివతత్త్వాధిపితయే శివాయస్వాహా" ఓం హాం సర్వతత్త్వాధిపదతయే శివాయ స్వాహా" అను మంత్రములతో శివునిపై ఉంచి, పూజించి నాల్గవ అంజలిలో దమనకము గ్రహించి "ఓం హూం మహేశ్వరాయ మఖం పూరయ పూరయ శూలపాణయే నమః" అను మంత్రముతో దానిని శివునకు అర్పించవలెను. ఈ విధముగ శివుని, అగ్నిని పూజించి, గురువునకు విశేషపూజ చేసి - "పూజ్యుడా! నేను దమనకముతో పూజలో ఏవై ఎక్కువతక్కువలున్నచో అవి నీ కృపచే సరి యగుగాక" అని ప్రార్ధించవలెను. ఈవిధముగ దమనకారోహణకర్మ చేసినవాడు చైత్రమాసజనిత మగు సంపూర్ణఫలము పొంది అంతమున స్వర్గమునకు పోవును.

అగ్ని మహాపురాణమునందు దమనకారోపణవిధివర్ణన మను ఎనుబదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters