Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ పఞ్చసప్తతితమోధ్యాయః

అథ అగ్నిస్థాపనాదివిధిః.

ఈశ్వర ఉవాచ :

అర్ఘపాత్రకరో యాయాదగ్న్యగారం సుసంవృతః | యాగోపకరణం సర్వం దివ్యదృష్ట్యా చ కల్పయేత్‌. 1

ఉదఙ్ముఖః కుణ్డమీక్షేత్ర్పోక్షణం తాడనం కుశైః | విదధ్యాదస్త్రమన్త్రేణ వర్మణాభ్యుక్షణం మతమ్‌. 2

ఖడ్గేన ఖాతముద్ధారం పూరణం సమతామపి | కుర్వీత వర్మణాసేకం కుట్టనం తు శరాత్మనా. 3

సంమార్జనం సమాలేపం కలారూపప్రకల్పనమ్‌ | త్రిసూత్రీపరిధానం చ వర్మణాభ్యర్చనం సదా. 4

రేఖాత్రయముదక్కుర్యాదేకాం పూర్వాననామధః | కుశేన చ శివాస్త్రేణ యద్వా తాసాం విపర్యయః. 5

మహేశ్వరుడు పలికెను : పూజానంతరము, ఉపాసకుడు శరీరమును వస్త్రాదులతో ఆచ్ఛాదించుకొని, అర్ఘ్య పాత్రను చేత ధరించి, అగ్నిశాలలోనికి వెళ్ళి దివ్యదృష్టిచే యజ్ఞమున కావశ్యకములగు సమస్త ఉపకరణములను సమకూర్చుకొనవలెను. ఉత్తరాభిముఖుడై అగ్ని కుండమును చూచి కుశలతో దానిని ప్రోక్షించి మార్జనము చేయవలెను. తాడనము (మార్జనము) అస్త్రమంత్రముతో (ఫట్‌) చేయవలెను. అభ్యుక్షణము కవచ మంత్రముతో (హుం) చేయవలెను. కవచమంత్రముచే (హుం) దానికి అభిషేకము, శరమంత్రముచే (ఫట్‌) భూకుట్టనము చేయవలెను. సంమార్జనము, ఉప లేపనము, కలాత్మ కరూపకల్పన త్రిసూత్రీపరిధానము, అర్చనము ఇవన్నియు కవచమంత్రముతోడనే చేయవలెను. కుండమునకు ఉత్తరమున మూడు రేఖలు గీయవలెను. ఒక రేఖ పూర్వాభిముఖమై క్రిందికి వచ్చు నట్లు గీయవలెను. రేఖలు కుశతో గాని, త్రిశూలముతో గాని గాయవలెను. లేదా ఆ రేఖ లన్నింటిని క్రిందుమీదుగా నున్నట్లు కూడ చేయవచ్చును.

వజ్రీకరణమన్త్రేణ హృదా దర్త్భేశ్చతుష్పథమ్‌ | అక్షపాత్రం తనుత్రేణ విన్యసేద్విష్టరం హృదా. 6

హృదా వాగీశ్వరీం తత్ర ఈశమావాహ్య పూజయేత్‌ | వహ్నిం సదాశ్రయానీతం శుద్ధపాత్రోపరి స్థితమ్‌. 7

క్రవ్యాదాంశం పరిత్యజ్య వీక్షణాది విశోధితమ్‌ | ఔదార్యం చైన్దవం భౌతమేకీకృత్యానలత్రయమ్‌. 8

ఓం హూం వహ్నిచైతన్యాయ వహ్నిబీజేన విన్యసేత్‌ |

అస్త్రమంత్రము (ఫట్‌) నుచ్చరించి వజ్రీకరణము చేసి, 'నమః' ఉచ్చరించి కుశలచే చతుష్పథన్యాసము చేయవలెను. కవచమంత్రము (హుమ్‌)తో అక్షపాత్రను, హృదయమంత్ర (నమః) విష్టరమును స్థాపించవలెను. ''వాగీశ్వర్యైనమః'' ''ఈశాయ నమః'' అను మంత్రము లుచ్చరించి వాగీశ్వరిని, ఈశుని ఆవాహన చేసి పూజించవలెను. పిమ్మట మంచి స్థానమునుండి అగ్నిని, శుద్ధమైన పాత్రలో నుంచి తీసికొని వచ్చి, దాని నుండి, ''క్రవ్యాదమగ్నిం ప్రహిణోమి దూరమ్‌'' ఇత్యాది మంత్రము పఠించుచు క్రవ్యాదాంశ##మైన అగ్నికణమును తొలగించవలెను. పిమ్మట నిరీక్షణాదులచే శోధిత మగుఔదర్య-ఐన్దవ-భౌత-అగ్నిత్రయమును ఏకము చేసి ''ఓం హూం వహ్నిచైతన్యాయ నమః'' అను మంత్ర ముచ్చరించి అగ్ని బీజముతో (రం) స్థాపించవలెను.

సంహితామన్త్రితం వహ్నిం ధేనుముద్రామృతీకృతమ్‌. 9

రక్షితం హేతిమన్త్రేణ కవచేనాగుణ్ఠితమ్‌ | పూజితం త్రిః పరిభ్రామ్య కుణ్డస్యోర్ధ్యం ప్రదక్షిణమ్‌. 10

శివబీజమితి ధ్వాత్వా వాగీశాగర్భగోచరే | వాగీశ్వరేణ దేవేన క్షిప్యమాణం విభావయేత్‌. 11

భూమిష్ఠజానుకో మన్త్రీ హృదాత్మసంముఖం క్షిపేత్‌ | తతో7న్తః స్థితబీజస్య నాభిదేశే సమూహనమ్‌. 12

సంభృతిం పరిధానస్య శౌచమాచమనం హృదా | గర్భాగ్నేః పూజనం కృత్వా తద్రక్షార్థం శరాణునా. 13

బద్నీ యాద్గర్భజం దేవ్యాః కంకణం పాణిపల్లవే| గర్బాధానాయ సంపూజ్య సద్యోజాతేన పావకమ్‌. 14

తతో హృదయమన్త్రేణ జుహుయాదాహుతిత్రయమ్‌ | పుంసవనాయ వామేన తృతీయే మాసి పూజయేత్‌. 15

ఆహుతిత్రితయం దద్యాచ్ఛిరసా7మ్బుకణాన్వితమ్‌| సీమన్తోన్నయనం షష్ఠే మాసి సంపూజ్య రూపిణా. 16

జుహుయాదాహతీస్తిస్రః శిఖయా శిఖయైవ తు | వక్త్రాఙ్గకల్పనాం కుర్యాద్వక్త్రోద్ఘాటన నిష్కృతీ. 17

జాతకర్మనృకర్మభ్యాం దశ##మే మాసి పూర్వవత్‌ |

వహ్నిం సన్ధుక్ష్య దర్భాద్యైః స్నానం గర్భమలాపహమ్‌. 18

సువర్ణబన్దనం దేవ్యా కృతం ధ్యాత్వా హృదార్చయేత్‌| సద్యః సూతకనాశాయ ప్రోక్షయేదస్త్రవారిణా. 19

సంహితామంత్రముచే అభిమంత్రతమై, ధేనుముద్రాప్రదర్శన పూర్వకముగ అమృతీకరణక్రియచే సంస్కృతమై అస్త్రమంత్రముచే సురక్షితమై, కవచ మంత్రముచే అవగుంఠితమై, పూజింపబడిన అగ్నిని, అగ్నికుండముపై మూడు పర్యాయములు ప్రదక్షిణముగా త్రిప్పి, ''ఇది శివుని బీజము'' అని భావన చేసి, ''వాగీశ్వరదేవునిచే ఈ బీజమును వాగీశ్వరీ గర్భమునందు స్థాపింపడెను'' అని ధ్యానము చేసి, మంత్రసాధకుడు మోకాళ్లు భూమిపై ఆన్చి నమస్కారపూర్వకముగ ఆ అగ్నిని తన ఎదుట కుండమునందు స్థాపించవలెను. పిమ్మట ఏ కుండమునందు బీజరూపాగ్ని ధ్యానము చేయబడినదో దాని వాభిదేశమునందు కుశలచే పరిసంవహానము చేయవలెను. పరిధాన- సంభారము, శుద్ధి, అచమనము. నమస్కారము చేసి గర్భాగ్నిని పూజించి, ఆగర్భజాగ్నిరక్షణముకొరకై అస్త్రమంత్రముచే, వాగీశ్వరీదేవి పాణిపల్లవమునందు కంకణము (రక్షౌసూత్రము) కట్టి నట్లు భావన చేయవలెను. సద్యోజాతమంత్రముతో, గర్భాదానముకొరకై, అగ్నిపూజనము చేసి, హృదయ మంత్రముతో మూడు ఆహుతులివ్వవలెను. మూడవమాసమున జరుగు పుంసవనసంస్కారమును భావన చేసి, అది సిద్ధించుటకై వామదేవమంత్రముతో అగ్నిని పూజించి "శిరసే స్వాహా" అని పలుకుచు, మూడు హోమములుచేయవలెను. పిమ్మట ఆ అగ్నిపై జలబిందువును చల్లవలెను. పిమ్మట ఆరవ మాసమున జరుగు సీమంతోన్నయమును భావనచేసి అఘోర మంత్రముతో అగ్ని పూజించి, "శిఖాయై వషట్‌" అని ఉచ్చరించుచు మూడు హోమములు చేసి, ఆ మంత్రముతోడనే ముఖాద్యంగ కల్పన చేయవలెను. ముఖోద్ఘాటనము ప్రకటీకరణమును చేయవలెను. పిమ్మట వెనుకటి వలెనే పదవ మాసమున జయగు జాతకర్మ-నరకర్మలను భావించుచు తత్పురుషమంత్రముతో దర్భాదులతో అగ్నిని పూజించి, జ్వలింపచేసి, గర్భమలమును తొలగించుటకై స్నానము చేయించి, దేవి హస్తమునందు సువర్ణ బంధనముచేసి నట్లు భావన చేసి, హృదయమంత్రముతో పూజించవలెను. సూతకము వెంటనే నివర్తించుటకై అస్త్రమంత్రముతో అభిమంత్రించిన జలముతో అభిషేకము చేయవలెను.

కుమ్భం తు బహిరస్త్రేణ తాడయేద్వర్మణోత్‌క్షిపేత్‌ | అస్త్రేణో త్తరపూర్వాగ్రాన్మేఖలాసు బహిః కుశాన్‌. 20

అస్థాప్య స్థాపయేత్తేషు హృదా పరిధివిస్తరమ్‌ | వక్త్రాణామస్త్రమన్త్రేణ తతో నాలా పనుత్తయే. 21

సమిదః పఞ్క హోతవ్యాః ప్రాన్తే మూలే ఘృతప్లుతాః |

బ్రహ్మణం శఙ్చరం విష్ణుమనన్తం చ హృదార్చయేత్‌. 22

దూర్వాక్షతైస్తత్పర్యన్తం పరిధిస్థాననుక్రమాత్‌ | ఇన్ద్రాదీశానపర్యన్తాన్విష్టరస్థాననుక్రమాత్‌. 23

అగ్నేరభిముఖీభూతాన్ని జదిక్షు హృదార్చయేత్‌ | నివార్య విఘ్న సంఘాతం బాలకం పాలయిష్యథ. 24

శైలీమాజ్ఞాం తేషాం శ్రావయేత్తదనన్తరమ్‌ | గృహీత్వా స్రుక్స్రువాపూర్ధ్వవదనాధోముఖైః క్రమాత్‌. 25

ప్రతాప్యాగ్నే త్రిధా దర్భమూలమధ్యాగ్రకైః స్పృశేత్‌ | కుశస్పృష్టప్రదేశేతు ఆత్మవిద్యాశివాత్మకమ్‌. 26

క్రమాత్తత్త్వత్రయం న్యస్య హీం హీం హూం సంరవైః క్రమాత్‌ |

స్రుచి శక్తిం స్రువే శమ్భుం విన్యస్య హృదయాణునా. 27

త్రిసూత్రీవేష్టిత గ్రీవౌ పూజితౌ కుసుమాదిభిః | కుశానాముపరిష్టాత్తౌ స్థాపయిత్వా స్వదక్షిణ. 28

గవ్యమాజ్యం సమాదాయ వీక్షణాది విశోధితమ్‌ |

స్వకాం బ్రహ్మమయీం మూర్తిం సంచిన్త్యాదాయ తద్‌ ఘృతమ్‌.

కుణ్డస్యోర్ధ్వం హృదావర్త్య భ్రామయిత్వాగ్నిగోచరే | పునర్విష్ణుమయీం ద్యాత్వా ఘృతమీశానగోచరే. 30

ధృత్వాణాయ కుశాగ్రేణ స్వాహాన్తం శిరసాణునా | జుహుయాద్విష్ణవే బిన్ధుం రుద్రరూపమనన్తరమ్‌. 31

భావయన్ని జమాత్మానం నబౌ ధృత్వాప్లవేత్తతః |

కుండమును, బైటనుండి, అస్త్రమంత్రము చదువుచు కుశలతో మార్జనము చేయవలెను. 'హుం' అని ఉచ్చరించుచు ఉదకముతో తడపవలెను. కుండము వెలుపల నున్న మేఖలలపై, అస్త్రమంత్రముతో, ఉత్తర-దక్షిణదిక్కులందు పూర్వా గ్రముగాను, పూర్వపశ్చిమములందు ఉత్తరాగ్రముగాను కుశలు పరవవలెను వాటిపై హృదయమంత్రముతో పరిధివిష్టరము స్థాపింపవలెను. పిమ్మట సద్యోజాతాది ముఖపంచకమునకు సంబంధించిన మంత్రములు చదువుచు, అస్త్రమంత్ర ముచ్చరించుచు, నాలచ్ఛేదనము కొరకై, ఐదు సమిధుల మూలములను అజ్యమునందు ముంచి హోమము చేయవలెను. పిమ్మట నూర్వాక్ష తాదులతో బ్రహ్మ-శివ-విష్ణు-అనంతులను వారి నామములకు "నమః" చేర్చుచు పూజించవలెను. కుండమునకు నాల్గు వైపులందును పరచిన ఎనిమిది అసనములపై పూర్వాదిదిక్కులందు వరుసగ ఇంద్రాది దిక్పాలకులను అవాహన చేసి, స్థాపన చేసి వారందరును అగ్నివైపు ముఖములతో కూర్చున్నట్లు భావన చేయుచు, వారి నామములకు 'నమః' చేర్చుచు పూజచేయవలెను. "ఓ దేవతలారా! మీరందరును విఘ్నములను తొలగించి ఈ బాలకుని (అగ్నిని) సంరక్షించుడు" అను శివాజ్ఞను ఆ దేవతలకు వినిపించి, స్రుక్‌-స్రువములను ఊర్ధ్వముఖములుగ గ్రహించి వాటిని మూడేసి సార్లు అగ్నిపై వెచ్చచేయవలెను. కుశమూల-మధ్య-అగ్రభాగముతో వాటిని స్పృశించుచు ఆ స్థానములందు క్రమముగ ఆత్మతత్త్వ-విద్యాతత్త- శివతత్త్వముల న్యాసము చేయవలెను. "ఓం హాం ఆత్మతత్త్వయ నమః" "ఓం హీం విద్యాతత్త్వాయ నమః" "ఓం హుం శివతత్త్వాయ నమః" అమనని న్యాసమంత్రములు పిమ్మట 'శ##క్త్యైనమః' "శివాయ నమః" అను మంత్రముతో స్రుక్‌ స్రువములపై శివశక్తిన్యాసము చేయవలెను. మూడు పేటల రక్షాసూత్రమును స్రుక్‌ స్రువముల కంఠభాగమునందు చుట్టబెట్టవలెను. పుష్పాదులతో వాటిని పూజించి కుడి ప్రక్కన ఉన్న కుశలముపై ఉంచవలెను. గోఘృతము గ్రహించి దర్శనాదులచే దానిని పరిశుద్ధము చేసి. తాను బ్రహ్మమయుడని భావన చేయుచు ఆ ఘృతపాత్రమును హృదయమంత్రముతో అగ్నికుండముపై అగ్నేయమున త్రప్పి. మరల నేను విష్ణుస్వరూపుడనని భావన చేయుచు, ఘృతమును ఈశాన్యమునం దుంచి, కుశాగ్రభాగముచే ఘృతము తీసి "శిరసే స్వాహా" "విష్ణువే స్వాహా" అను మంత్రములతో విష్ణువునకు ఆ ఘృతబిందువులను హోమము చేయవలెను. నేను రద్రమయుడ నని భావన చేయుచు, ఘృతమును కుండనాభిస్థామందుంచి, దాని అప్లావనము చేయవలెను.

ప్రాదేశమాత్రదర్భాభ్యామజ్గుష్ఠానామికాగ్రగైః 32

ధృతాభ్యాం సంముఖం వహ్నేరస్త్రేణ ప్లవమాచరేత్‌ |

హృదాత్మసంముఖం తద్వత్కు ర్యాత్సంప్లవనం తతః. 33

హృదాలబ్ధ దగ్ధదర్భం శస్త్రక్షేపాత్పవిత్రయేత్‌ | దీప్తే నాపరదర్భేణ నివాహ్యానేన దీపయేత్‌. 34

అస్త్రమన్త్రేణ నిర్దగ్ధం వహ్నౌ దర్భం పునః క్షిపేత్‌ |

క్షిప్త్వా ఘృతే కృతగ్రన్థి కృతం ప్రాదేశసంమితమ్‌. 35

పక్షద్వయమిడాదీనాం త్రయం చాజ్యే విభావయేత్‌ |

క్రమాద్భాగత్రయాదాజ్యం స్రువేణాదాయ హోమయేత్‌. 36

స్వేత్యగ్నౌ హాఘృతే భాగం శేషమాజ్యం క్షిపేత్క్రమాత్‌|

ఓం హాం అగ్నయే స్వాహా. ఓం హాం సోమాయ స్వాహా. ఓం హాం.

అగ్నీపోమాభ్యాం స్వాహా. ఉద్ఘాటనాయ నేత్రాణామగ్నేర్నేత్రత్రయే ముఖే. 37

స్రువేణ ఘృతపూర్ణేన చ తుర్థీమాహుతిం యజేత్‌.

ఓం హం ఆగ్నయే స్విష్టకృతే స్వాహా.

అభిమన్త్య్రషడజ్గేన బోధయేద్ధేనుముద్రాయా. 38

అవగుణ్ఠ్య తనుత్రేణ రక్షేదాజ్యం శరాణునా | హృదాజ్యబిన్దు విక్షేపాత్కు ర్యాదభ్యుక్ష్యశోధనమ్‌. 39

వక్త్రాభిఘాతసన్థానం వక్త్రైకీకరణం తథా |

ఓం హాం సద్యోజాతాయ స్వాహా | ఓం హాం వామదేవాయ స్వాహా.

ఓం హాం అఘోరాయ స్వాహా | ఓం హాం తత్పురుషాయస్వాహా.

ఓం హాం ఈశానాయ స్వాహా | ఇత్యేకైకఘృత్యాహుత్యా కుర్యాత్వక్త్రాభిఘారకమ్‌ 40

ఓం హాం సద్యోజాతవామదేవాభ్యాం స్వాహా.

ఓం హాం వామదేవాఘో రాభ్యాం స్వాహా.

ఓం హాం అఘోరతత్పురుషాభ్యాం స్వాహా.

ఓం హాం తత్పురషేశానాభ్యాం స్వాహా. ఇతివక్త్రానుసంధానం మంత్త్రెరేభిః క్రమాచ్చరేత్‌. 41

ప్రాదేశ (చాపిన బొటనవ్రేలు చివని నుంచి చూపుడు వ్రేలు చివరవరకుఉన్న పొడవు ప్రాదేశము) ప్రమాణము గల రెండు కుశలను అంగుష్ఠ-అనామికతాంగుళులతో పట్టుకొని, వాటితో, అస్త్రమంత్రో (ఫట్‌) చ్ఛారణము చేయుచు, నేతిని, అగ్నివైపు కదపవలెను. హృదయమంత్రము (నమః) ఉచ్చరించుచు, చేతిలోని దర్భను కాల్చి, దానిని 'ఫట్‌' తో అగ్నిచే పవిత్రము చేయవలెను. మండుతున్న కుశతో దానికి హారతి ఇచ్చి, మరొక కుశతో దానిని కాల్చవలెను. మండిన కుశమ అస్త్రమంత్రముతో అగ్నిలో పడవేయవలెను. పిమ్మట, ముడి వేసిన, ప్రాదేశప్రమాణము గల కుశను చేతిలో ఉంచవలెను. ఘృతములో రెండు పక్షములు, ఇడాది నాడీత్రయము ఉన్నట్లు భావన చేయవలెను. ఇడ మొదలగు ముడు భాగముల నుండి క్రమముగ స్రువముతో ఘృతము గ్రహించి హోమము చేయవలెను. 'స్వా' అని ఉచ్చరించి స్రువములోని ఆజ్యము అగ్నిలో వేయవలెను. 'హా' ఉచ్ఛరించుచు, హోమము చేయగా మిగిలిన ఘృతమును, వేరుగా ఉంచిన పాత్రలో ఉంచవలెను. ఇడాభాగము నుండి ఆజ్యము గ్రహించి "ఓం హాం అగ్నేయే స్వాహా" అను మంత్రము నుచ్చరించుచు హోమము చేసి, హుతశేషమును ఒక పాత్రలో ఉంచవలెను. పింగలా భాగము నుండి ఆజ్యము గ్రహించి "ఓం హాం సోమాయ స్వాహా" అని ఉచ్చరించుచు హోమము చేసి, హుతశేషమును ఒక పాత్రలో ఉంచవలెను. సుషువ్ణూనాడీ భాగము నుండి ఆజ్యము గ్రహించి "ఓం హాం అగ్నీ షోమాభ్యాం స్వాహా" అని ఉచ్చరించుచు స్రువముతో హోమము చేసి, హుతశేషమును ఒక పాత్రలో ఉంచుకొనవలెచు. పిమ్మట బాలకుడైన అగ్ని యొక్క ముఖమునందున్న నేత్రత్రయస్థానమున మూడు నేత్రముల ఉద్ఘాటనము చేయుటకై, ఘృతపూర్ణ మగు స్రువముతో "ఓం హామగ్నయే స్విష్టకృతే స్వాహా" అను మంత్రమునుచ్చరించుచు నాల్గవ ఆహుతి ఇవ్వవలెను., "ఓం హాం హృదయాయ నమః" ఇత్యాద్యంగ మంత్రములు ఆరును ఉచ్చరించుచు ఆజ్యమును అభిమంత్రించి, ధేనుముద్రతో మేల్కొల్పవలెను. కవచమంత్రముచే (హుం) ఆచ్ఛాదించి, శరమంత్రముచే ఘృతబిందూత్‌క్షేపణము చేసి, అభ్యుక్షణశోధనములు చేయవలెను. శివస్యరూప డగు అగ్ని యొక్క ఐదు ముఖములకు అభిఘూరహోమము, అనుసంధానహోమము, ముఖముల ఏకీకరణమునకై చేయు హోమమును చేయవలెను. "ఓం హాం సద్యోజాతాయ స్వాహా, ఓం హాం వామదేవాయ స్వాహా, ఓం హాం అఘోరాయ స్వాహా, ఓం హాం తత్పురుషాయ స్వాహా, ఓం హాం ఈశానాయ స్వాహా" అను ఐదు మంత్రములచే, ఐదు ముఖములకొరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అజ్యాహుతిచేసి, ఆ ముఖములను అభిఘారము చేసిన ఆజ్యముతో అప్లావితము చేయవలెను. ఇది ముఖాభిఘారహోమము. పిమ్మట రెండేసి ముఖములకు ఒక ఆహుతి ఇవ్వవలెను. ఇది ముఖానుసంధానమహోమము. దానిని_"ఓం హాం సద్యోజాత వామదేవాభ్యాం స్వాహా, ఓం హాం వామదేవా ఘోరాభ్యాం స్వాహా, ఓం హాం అఘోరతత్పురుషాభ్యాం స్వాహా, ఓం హాం తత్పురుషేశానాభ్యాం స్వాహా" అను మంత్రములతో చేయవలెను.

అగ్నితో గతయా వాయుం నిరృతోదిశి వాన్తయా 41

వక్త్రాణామేకతాం కుర్యాత్సృవేణ ఘృతధారయా.

ఓం హాం సద్యోజాతవామదేవా ఘోరతత్పురుషే శానేభ్యః స్వాహా.

ఇతీష్టవక్త్రేవక్త్రాణామన్తర్భా వస్తదాకృతిః. 42

ఈశేన వహ్నిమభ్యర్చ్య దత్త్వాస్త్రేణాణాహుతిత్రయమ్‌ |

కుర్యాత్సర్వాత్మనా నామ శివాగ్నిస్త్వం హుతాశన. 43

హృదార్చితౌ వినృష్టాగ్నౌ పితరౌ విధిపూరణీమ్‌ | మూలేన వౌషడన్తేన దద్యాత్పుర్ణాం యథావిధి. 44

తతో హృదమ్భుజే సాఙ్గం భాసురం పరమ్‌.

యజేత్పూర్వవదావాహ్య ప్రార్థ్యాజ్ఞాం తర్పయేచ్ఛివమ్‌. 45

పిమ్మట కుండమునందు అగ్నేయము నుండి వాయవ్యమువరకును నైరృతి నుండి ఈశాన్యమువరకును. "ఓం హాం సద్యోజాత, వాసుదేవా ఘోర తత్పురుషేశానేభ్యః స్వాహా" అను మంత్రముతో అవిఛ్ఛిన్నాజ్యధారాహోమము చేసి పంచముఖముల ఏకీకరణము చేయవలెనను. ఈ విధముగ ఇష్టముకమునందు అన్ని ముకములును అంతర్భూతములగును. అందుచే ఒకే ముఖము అన్ని ముఖముల ఆకారమును ధరించును.కుండమునందు ఈశాన్యమున అగ్నిని పూజించి, అస్త్రమంత్రముతో మూడు ఆహుతుల నిచ్చి, అగ్నికి నామకరణము చేయవలెను. 'ఓ అగ్ని దేవా! నీవు అన్ని విధముల శివుడవు-మంగళప్రదుడవు. అందుచే నీ పేరు శివుడు" అని నామకరణము చేసి, పూజింపబడిన మాతాపితరులగు వాగీశ్వరీ వాగీశ్వరులను, నమస్కార పూర్వకముగ అగ్నియందు విసర్జించి, వారికొరకై విధిపూర్వకముగ పూర్ణాహుతి ఈయవలెను. మూలమంత్రము చివర 'వౌషట్‌' చేర్చి శివశక్తులకు యథావిధిగ పూర్ణాహుతి ఈయవలెను. పిమ్మట అంగ-సేనాసమేతుడగు, పరమతేజఃశాలియైన శివుని హృదయకమలమునందు ఆవాహనచేసి, వెనుకటివలెనే పూజించి ఆశివుని ఆజ్ఞగైకొని ఆయనునుపూర్తిగ తృప్తుని చేయవలెను.

యగాగ్ని శివయోః కృత్వా నాడటీసన్ధానమాత్మనా | శక్త్యామూలాణునా హోమం కుర్యాదజ్గైర్థశాంశతః. 46

ఘృతస్య కార్షికో హోమః క్షీరస్య మధునస్తథా | శు క్తిమాత్రాహుతిర్దధ్నః ప్రసృతిః పాయసస్య తు 47

యథావత్సర్వభక్షాణాం లాజానాం ముష్టిసంమితమ్‌ | ఖణ్డత్రయం మూలానాం ఫలానాం స్వప్రమాణతః.

గ్రాసార్ధమాత్రమన్నానాం సూక్ష్మాణి పఞ్చ హోమయేత్‌ | ఇక్షోరాపర్వికం మానం లతానామజ్గులద్వయమ్‌.

పుష్పం పత్రం స్వమానేన సమిధాం తు దశాజ్గులమ్‌|

యజ్ఞాగ్నికిని,శివునకును తనతో నాడీసంధానము చేసి శక్త్యను సారముగ మూలమంత్రముతో అంగసహితముగ దశాంశహోమము చేయవలెను. ఒక్కొక్క కర్షప్రమాణము గల ఘృత-క్షీర-మధులను,శుక్తిప్రమాణము గల పెరుగును. చారెడు పాయసమును హోమము చేయవలెను. లాజలు, సర్వభక్ష్యములు పిడికిలి ప్రమాణమున గ్రహించి హోమము చేయవలెను. మూలములు మూడు ముక్కలు ఒక ఆహుతిగా ఈయవలెను-ఫలములో వాటిప్రమాణ మెంత ఉండునో అంతే చేయవలెను. అన్నము ప్రమాణము గ్రాసములో సగము. చిన్న (కిన్‌మిస్‌ వంటి) వాటిని పర్యాయమునకు ఐదేసి గ్రహించి హోమము చేయవలెను. చెరకు ఒక కణుపు గ్రహించవలెను. లతలు రెండేసి అంగుళము లుండవలెను. పుష్పపత్రముల ప్రమాణము వాటి ప్రమాణము ననుసరించి ఉండవలెను. సమిధలు పది అంగుళములు పొడవుండవలెను.

చన్ద్ర చన్దన కాశ్మీరకస్తూరీయక్షకర్దమాన్‌. 50

కలాయసంమితానేతాన్‌ గుగ్గులుం బదరాస్థివత్‌ | కన్దానామష్టమం భాగం జుహుయాదత్విధివత్పరమ్‌. 51

హోమం నిర్వర్తయేదేవం బ్రహ్మబీజపదైస్తతః |

వృతేన సృచి పూర్ణాయాం నిధాయాధోముఖం స్రువమ్‌. 52

స్రుగగ్రే పుష్పమారోప్య పశ్చాద్వామేన పాణినా | పునః సవ్యేన తౌ ధృత్వా శఙ్ఖసన్నిభముద్రయా. 53

సముద్గతోర్ధ్వకాయశ్చ సమపాదః సముత్థితః | నాభౌ తన్మూలమాదాయ స్రుగగ్రవ్యగలోచనః 54

బ్రహ్మాదికారణాత్యాగాద్వినిస్సృత్య సుషుమ్నయా | వామస్తనాన్తమానీయ తయోర్మూలమతన్ద్రితః. 55

మూలమన్త్రమవిస్పష్టం వౌషడన్తం సముచ్చరేత్‌ | తదగ్నౌ జుహుయాదాజ్యం యవసంమితధారయా. 56

ఆచామం చన్దనం దత్వా తామ్బూలప్రభృతీనపి | భక్త్యా తధ్భూతిమావన్ద్య విదధ్యాత్ప్రణతిం పరామ్‌. 57

తతో వహ్నిం సమభ్యర్చ్య ఫడన్తాస్త్రేణ సంవారన్‌ | సంహారముద్రయాహృత్య క్షమస్వేత్యభిధాయ చ. 58

భాసురాన్పరిధీంస్తాంశ్చ పూరకేణ హృదాణునా | శ్రద్ధాయా పరమాత్మీయే స్థాపయేత హృదమ్భుజే. 59

సర్వపాకాగ్ర మాదాయ కృత్యా మణ్డలకద్వయమ్‌ | అన్తర్బలిం దద్యాదాగ్నేయ్యాం కుణ్డ సన్నిధౌ. 60

ఓం హాం రుద్రేభ్యః స్వాహా పూర్వే మాతృభ్యో దక్షిణ తథా|

వారుణ హాం గణభ్యశ్చ స్వాషా తేభ్యస్త్వయం బలిః. 61

ఉత్తరే హాం చ యక్షేభ్య ఈశానే హాం గ్రహేభ్య ఉ | అగ్నౌ హామసురేభ్యశ్చ రోక్షోభ్యనైరృతే బలిః.

వాయవ్యే హాం చ నాగేభ్యో నక్షత్రేభ్యశ్చ మధ్యతః |

హాం రాశిభ్యః స్వాహా వాహ్నౌ విశ్వభ్యోనైరృతే తథా. 63

వారుణ్యాం క్షేత్రపాలాయ అన్తర్బలిరుదాహృతః | ద్వితీయ మణ్డలే బాహ్యా ఐన్ద్రాయాగ్నియమాయ చ. 64

నైరృతాయ జలేశాయ వాయవే ధనరక్షిణ | ఈశానాయ చ పూర్వాదౌ హీశామే బ్రహ్మణ నమః . 65

నైరృతే విష్ణవే స్వాహా వాయసాదేర్బహిర్భలిః | బలిద్వయగతాన్మన్త్రాన్సంహారముద్రయాత్మని. 66

ఇత్యాది మహాపురాణ అగ్నేయే శివపూజాఙ్గ హేమవిధి నిరూపణం

నామ పఞ్చసప్తతితమో7ధ్యాయః

కర్పూర-చందన-కేసర-కస్తూరీ-యక్షకర్దమములు కలాయ ప్రమాణమున (శనగగింజంత) ఉండవలెను. గుగ్గులు రేగి గింజంత ఉంచడవలెను. కందముల ఎనిమిదవ వంతుతో ఒక ఆహుతి చేయవలెను. ఈ విధముగ ఆలోచించి, యథావిధిగ ఆహుతుల నీయవలెను. ఈ విధముగ ప్రణవముతోను, బీజాక్షరములతోను హోమము సుసంపన్న మగు నటులచేయవలెను. పిమ్మట ఘృతముతో నింపిన స్రుక్కు పైన అధోముఖ మగు స్రువము ఉంచి, స్రుక్కునకు చివర పుష్పములుంచవలెను. రెండు చేతులతోడను ఆ రెండింటిని, శంఖముద్రతో పట్టుకొనవలెను. శరీరము పై భాగము ఉన్నతమగునట్లుచేసి లేచి పాదములు సమముగా ఉంచి నిలచి, స్రుక్స్రువముల మూలభాగములను నాభికి అన్చి, దృష్టికి స్థిరముగ నిలిపి, భావనచే బ్రహ్మాదికారణములను విడచుచు, సుషుమ్నా నాడీ మార్గమున బైటకు వచ్చి పైన నిలబడవలెను. స్రుక్స్రువముల మూలభాగములను నాభినుండి పైకి లేపి ఎడమ స్తనమువైపు తీసికొని రావలెను. శరీరము చేతను, మనస్సు చేతను ఆలస్యమును రూపము చేసి, ల్‌షట్‌, వరకును మూలమంత్రములు (ఓం లమః శివాయ వోషట్‌) మెల్లగ చదువుచు ఆ ఘృతమును యవ వలె సన్ననైన ధారతో హోమము చేయవలెను. పిదప, అచమన - చందన - తాంబూలాదులా సమర్పించి భక్తి భావముతో శివుని ఐశ్వర్యమునకు సాష్టాంగవందనము చేసి మరల అగ్నిపూజ చేపి, 'ఓం హః అస్త్రాయ ఫట్‌" అని ఉచ్చరించుచు సంహారముద్రచే శంబరాహరణము చేసి, భగవంతుడా? నా అపరాధములను క్షమింపుము. అని ఇష్టదేవతను ప్రార్థించి హృదయ మంత్ర ముచ్చరించుచు పూరక ప్రాణాయామముచే, శ్రద్ధతో, తేజఃశాలు లగు ఆ సంధులను తన హృదయ కమలమునందు నిలుపవలెను. వండిన పదార్థములలోని అగ్రభాగము తీసి, కుండసమీపమున అగ్ని కోణమునందు, రెండు మండలములు చేసి ఒక దానిలో అంతర్బలి ఈయవలెను. రెండవదానియందు బాహ్యాబలి ఈయవలెను. ప్రథమమండలమునందు, పూర్వదిక్కున, "ఓం హాం రుద్రేభ్యః స్వాహా" అను మంత్రముతో రుద్రలకు బలి ఈయవలెను. రక్షిణమున "ఓం హాం మాతృభ్యః స్వాహా" అను మంత్రముతో మాతృకలకును, పశ్చిమమున ఓం హాం గణభ్యః స్వాహా, తేభ్యో7యం బలిరస్తు అను మంత్రముతో గణములకును, ఉత్తరమున ఒం హాం యక్షేభ్యః స్వాహా, తేభ్యో7యం బలిరస్తు అను మంత్రముతో యక్షులకును, ఈశాన్యమునందు ఓం హాం గ్రహేభ్యః స్వాహా తేభ్యోయం బలిరస్తు" అని చెప్పి గ్రహములకును, అగ్నేయమున ఓం హాం అసురేభ్యః స్వాహా తేభ్యోయం బలిరస్తు అని చెప్పి అసురులకును, నైరృతియందు ఓం హాం రక్షోభ్యః స్వాహా, తేభ్యోయం బలిరస్తు అని చెప్పి రాక్షసులకును, వాయవ్యమునందు ఓం హాం నాగేభ్యః స్వాహా, తేభ్యోయం బలిరస్తు అని నాగలకును, మండల మధ్య భాగమున ఓం హాం నక్షత్రేభ్యః స్వాహా తేభ్యోయం బలిరస్తు అని చెప్పి నక్షత్రములకును బలి ఇవ్వవలెను. ఓం హాం రాశిభ్యః స్వాహా తేభ్యోయం బలిరస్తు అని చెప్పి అగ్నేయమునందు రాశులకును, ఓం హాం విశ్వేభ్యో దేవేభ్యఃస్వాహా తేభ్యోయం బలిరస్తు అనిచెప్పి నైరృతి యందు విశ్వేదేవతలకును, ఓం హాం క్షేత్రపాలాయ స్వాహా, తస్మా ఆయం బలిరస్తు అని చెప్పి పశ్చిమమునందు క్షత్రపాలునకును బలి ఈయవలెను. పిమ్మట రెండవ బాహ్యమండలము నందు, పూర్వాది దిక్కులందు వరుసగ ఇంద్ర - అగ్ని - యమ - నిరృతి - వరుణ - వాయుక - కుబేర - ఈశానులకు బలి సమర్పించవలెను. పిదప ఈశాన్యమునందు ఓం బ్రహ్మణ నమః స్వాహా అని చెప్పి బ్రహ్మకును, నైరృతి యందు ఓం విష్ణవే నమః స్వాహా అని చెప్పి విష్ణువునకు, బలి ఇవ్వవలెను. మండలము వెలుపల కాకాదులకు గూడ బలి ఆంతర - బాహ్యబలుల నిచ్చునపుడు ఉపయోగించిన మంత్రములను సంహారముద్రచే తనలో లీనము చేసికొనవలెను.

అగ్ని మహాపురాణమునందు శివపూజాంగ హోమ విధి నిరూపణ మగు డెబ్బదియైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters