Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ షట్షష్టితమో7ధ్యాయః

అథ సాధారణప్రతిష్ఠావిధానమ్‌.

శ్రీ భగవానువాచ:

సముదాయప్రతిష్ఠాం చ వక్షే సా వాసుదేవవత్‌ | ఆదిత్యా వసవో రుద్రాః సాధ్యా విశ్వే7శ్వినౌ తథా. 1

ఋషయశ్చ తథా సర్వే వక్ష్యే తేషాం విశేషకమ్‌ |

యస్య దేశస్య యన్నామ తస్యాద్యం గృహ్య చాక్షరమ్‌. 2

మాత్రాభిర్భేదయిత్వా తు దీర్ఘాణ్యఙ్గాని భేదయేత్‌ | ప్రథమం కల్పయేద్బీజం సబిన్దుః ప్రణవం నతిమ్‌. 3

సర్వేషాం మూలమన్త్రేణ పూజనాం స్థాపనం తథా | నియమవ్రతకృచ్ఛ్రాణాం మఠసంక్రమవేశ్మనామ్‌. 4

మాసోపవాసద్వాదశ్యమిత్యాదిస్థాపనం వదే | శిలాం పూర్ణఘటం కాంస్యం సంభారం స్థాపయేత్తతః. 5

బ్రహ్మకూర్చం సమాహృత్య శ్రపేద్యవమయం చరుమ్‌ | క్షీరేణ కపిలాయాస్తు తద్విష్ణోరితి సాధకః. 6

ప్రణవేనాభిఘర్యైవ దర్వ్యా సంఘట్టయేత్తతః | సాధయిత్వావతార్యాథ విష్ణుమభ్యర్చ్యహోమయేత్‌. 7

వ్యాహృత్యా చైవ గాయత్ర్యా తద్విప్రాసేతి హోమయేత్‌ | విశ్వతశ్చక్షుర్వేదాద్యైర్భూరగ్నయే తథైవ చ. -

సూర్యాయ ప్రజాపతయే అన్తరిక్షాయ హోమయేత్‌|

ద్యౌః స్వాహా బ్రహ్మణ స్వాహా పృథివీమహారాజకః. 9

తసై#్మ సామం చ రాజానమిన్ధ్రాద్యైమర్హోమాచరేత్‌ | ఏవం హుత్వా చరోర్భాగాన్దద్యాద్ధిగ్బలిమాదరాత్‌. 10

హయగ్రీవుడు పలికెను. - ఇపుడు దేవసముదాయ ప్రతిష్ఠను గూర్చి చెప్పదను. ఇది కూడ వాసుదేవ ప్రతిష్ఠ వలెనే చేయవలెను. ఆదిత్య - వసు - రుద్ర - సాధ్య - విశ్వదేవ - అశ్వినీ కుమార - ఋషి - ఇతర దేవగణములకు దేవసముదాయ మని పేరు. వీరి స్థాపనలో నున్న విశేషములు చెప్పెదను. అయా దేవతల పేర్లలోని మొదటి అక్షరము గ్రహించి దానికి స్వరములు చేర్చవలెను. దీర్ఘ స్వరములతో కూడిన ఆ బీజాక్షరములతో అంగ న్యాసము చేయవలెను. ఆ ప్రథమాక్షరమునకు బిందువు, చేర్చి బీజముగ గ్రహింపవలెను. ప్రణవనమస్కారములు చేర్చవలెను. సమస్తదేవతలను మూలమంత్రముతోడనే పూజించి స్థాపింపవలెను. ఇవి కాక, స్థాపనావిషయమున ఆవలంబింపవలసిన నియమములను, వ్రతములను, కృచ్ఛృములను. మఠ-సేత-గృహాదులను-మాసోపవాస-ద్వాదశీవ్రతాదులను చెప్పెదను. ముందుగా శిలా-పూర్ణకుంభ-కాంస్య పాత్రలు తీసికొని వచ్చి ఉంచవలెను. పిమ్మట సాధకుడు బ్రహ్మకూర్చ గైకొని ''తద్విష్ణోఃపరమం పదమ్‌'' అను మంత్రముతో కపిలగోవుపాలతో యవచరువును వండవలెను. ఓం కారముతో దానిలో నేయిపోసి, గరటితో ఎనపవలెను. పిదప శ్రీవిష్ణు పూజ చేసి హోమము చేయవెలను. వ్యాహృతి గాయత్రులతో కూడిన ''తద్విప్రాసో'' ఇత్యాదిమంత్రముతో చరుహోమము చేయవలెను. ''విశ్వతశ్చక్షుః'' ఇత్యాది వైదిక మంత్రముతో భూమి-అగ్ని-సూర్య-ప్రజాపతి-అన్తరిక్ష-ద్యౌ-బ్రహ్మన్‌- పృథ్వీ-కుబేర-సోమశబ్దములను చతుర్థ్యంతములు చేసి, వాటికి ''స్వాహా''చేర్చి, ఆ దేవతల నుద్దేశించి ఆహుతు లీయవలెను, ఇంద్రాది దేవతలవకు ఆ దేవతలకు సంబంధించిన మంత్రములు చదువుచు ఆహుతు లివ్వవలెను. చరు భాగములను ఈ విధముగ హోమము చేసి ఆదర పూర్వకముగ దిగ్బలు లీయవలెను.

సమిదో7ష్టశతం హుత్వా పలాశాంశ్చాజ్యహోమకమ్‌ | కుర్యాత్పురుషసూక్తేన ఇరావతీతిలాష్టకమ్‌. 11

హుత్వా తు బ్రహ్మవిష్ణ్వీశ##దేవానామనుయాయినామ్‌ | గ్రహాణామాహుతీర్హుత్వా లోకేశానామథోపునః. 12

పర్వతానాం నదీనాం చ సముద్రాణాం తథాహుతీః | హుత్వా చ వ్యహృతీర్దద్యాత్స్రువపూర్ణాహుతిత్రయమ్‌. 13

వౌషడన్తేన మన్త్రేణ వైష్ణవేన పితామహా | పఞ్చగవ్యం చరుం ప్రాశ్య దత్త్వాచార్యాయ దక్షిణామ్‌. 14

ప్రియతాం భగవాన్విష్ణురిత్యుత్సృజేద్ర్వతం బుధః. 15

పిదప నూట ఎనిమిది పలాశసమిధలను హోమము చేసి, పురుష సూక్తముతో అజ్యహోమము చేయవలెన. ''ఇరావతీధేనుమతీ'' అను మంత్రముతో తిలాష్టక హోమము చేసి బ్రహ్మవిష్ణు మహేశ్వరుల పార్షదులకు, గ్రహములకు, లోకపాలులుకు, మరల ఆహుతు లీయవలెన. పర్వత నదీసముద్రములకు కూడ హోమములు చేసి, మహావ్యాహృతులనుచ్చరించుచు, స్రువముతో మూడు పూర్ణాహుతు లీయవలెను. పితామహా! 'వౌషట్‌' చేర్చిన వైష్ణవ మంత్రముతో పంచ గవ్యములను చరువును ప్రాశనము చేసి, ఆచార్యునకు సువర్ణయుక్త తిలపాత్రము, వస్త్రములు, అలంకృతమగు గోవు దక్షిణగా నీయవలెను. ''భగవాన్‌ విష్టుః ప్రీయతామ్‌'' అని పలుకుచు ప్రతవిసర్జనము చేయవలెను.

మాసోపవాసాదేరన్యాం ప్రతిష్ఠాం వచ్మి పూర్వతః | యజ్ఞేనాతోష్యదేవేశం శ్రపయేద్వైష్ణవం చరుమ్‌. 16

తిలతణ్డులనీవారైః శ్యామాకైరథవా యవైః | ఆజ్యేనాఘార్య చోత్తార్య హోమయేన్మూర్తిమన్త్రకైః. 17

విష్ణ్వాదీనాం మాసపానం తదన్తే హోమయేత్పునః |

ఓ విష్ణవే స్వాహా ఓం విష్ణవే విభూషణాయ స్వాహా; ఓం విష్ణవే శిపి

విష్ణాయ స్వాహా; ఓం నరసింహాయ స్వాహా; ఓం పురుషోత్తమాయ స్వాహా.

ద్వాదశాశ్వత్థసమిధో హోమయేద్ఘృతసంప్లుతాః | 18

విష్ణోరరాటమన్త్రేణతతో ద్వాదసచాహుతీః | ఇదం విష్ణోరిరావతీ చరోర్ధ్వదశ చాహుతీః. 19

హుత్వా చాజ్యాహుతీ స్తద్వత్తద్విప్రాసేతి హోమయత్‌ |

శేషహోమం తతః కృత్వా దద్యాత్పూర్ణాహుతిత్రియమ్‌. 20

యజ్ఞేతే త్వనువాకం తు జప్త్వా ప్రాశ్నీత వై చరుమ్‌ | ప్రణవేన స్వశబ్దాన్తే కృత్వా పాత్రే తు పైప్పలే . 21

తతో మాసాధిపానాం తు విప్రాన్‌ ద్వాదశ భోజయేత్‌.

త్రయోదశో గురుస్తత్ర తేభ్యో దద్యాత్త్రయోదశ. 22

కుమ్భాన్స్వాద్వమ్బుసంయుక్తా న్సచ్ఛత్రోపానహాన్వితాన్‌

సవస్త్రహేమమాల్యాఢ్యాన్వ్రతుపూర్త్యై త్రయోదశ. 23

గావః ప్రీతిం సమాయాన్తు ప్రచరస్తు ప్రహర్షితాః | ఇతి గోపథమత్సృజ్య యూపం తత్ర నివేశ##యేత్‌. 24

దశహస్తం ప్రపారామ మఠసంక్రమణాదిషు | గృహే చ హోమమేవం తు కృత్వా సర్వం యథావిధి. 25

పూర్వోక్తేన విధానేన ప్రవిశేచ్చ గృహం గృహీ | ఆనివారితమన్నాద్యం సర్వేత్వేతేషు కారయేత్‌. 26

ద్వీజేభ్యో దక్షిణా దేయా యథాశ క్తి విచక్షణౖః | ఆరామం కారయేద్యస్తు నన్దనే స చిరం వసేత్‌. 27

మఠప్రదానాత్స్వర్లోకే శక్రలోకే వసేత్తతః | ప్రపాదానాద్వారుణన సంక్రమేణ వసేద్దివి. 28

ఇష్టకాసేతుకారీ చ గోలోకే మార్గకృద్గవామ్‌ | నియమవ్రతకృద్విష్ణుః కృచ్ఛ్రకృత్సర్వపాపహా. 29

గృహం దత్వా వసేత్స్వర్గే యావదాభూతసంప్లవమ్‌ | సముదాయప్రతిష్ఠేష్టా శివాదీనాం గృహాత్మనామ్‌. 30

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సాధారణ ప్రతిష్ఠా కథనం నామ షట్‌షష్టితమోధ్యాయః.

ఇపుడు మరియొక మాసోపవాసాది విధిని చెప్పుచున్నాను. ముందుగా యజ్ఞముచే శ్రీహరిని సంతుష్టుని చేయవలెను. తిల - తండుల - నీవార - శ్యామాకములతో, శ్యామాకములకు బదులు యవలతో వండిన వైష్ణవ చరువును నేతితో కలిపి మూర్తిమంత్రముతో హోమము చేయవలెను. పిమ్మట మాసాధిపతులైన విష్ణ్వాదిదేవతల నుద్దేశించి మరల హోమము చేయవలెను. 'ఓం శ్రీవిష్ణవే స్వాహా' ఇత్యాది మంత్రములతో నేతిలో ముంచిన అశ్వత్థ సమిధలతో పండ్రెండు హోమములు చేయవలెను. ''విష్ణోరరాటమసి''అను మంత్రముతో కూడ పండ్రెండు హోమములు చేయవలెను. 'ఇరావతీ' ఇత్యాది మంత్రముతో పండ్రెండు చరు హోమములు చేయవలెను. 'తద్విస్రాసః' ఇత్యాది మంత్రముతో ఘృత హోమములు చేయవలెను. పిదప శేషహోమము చేసి మూడు పూర్ణాహుతులు ఇవ్వవలెను. ''యుజ్ఞతే'' ఇత్యాద్యనువాకమును చదువుచు, ప్రణవముతో రావి ఆకుల విస్తరులో వడ్డించుకొని ఛరువును భక్షించవలెన. పిమ్మట మాసాధిపతుల నుద్దేశించి పండ్రెండుగురు బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. ఆచార్యుడు వారిలో పదమూడవవాడుగా ఉండవలెను. వారికి మధుర జలపూర్ణములగు పదమూడు కలశముల, ఉత్తమమైన ఛత్రము పాదుకలు. వస్త్రములు, సువర్ణము, మాలలు దానము చేయవలెను.

వ్రతపూర్తికి అన్ని వస్తువులు పదమూడు చొప్పున చేయవలెను. ''గోవులు ప్రసన్నములుగాక, సంతోషముతో నవిచరించుగాక, అని పలుకుచు గోపథమును (గోవులు మేయుటకు స్థానము) విడచిపదిహస్తముల ఎత్తైన యూపస్తంభము పాతవలెను. గృహస్థుడు ఇంటిలో హోమాదికార్యములన్నియు యథాశాస్త్రముగ జరిపి, పూర్వోక్త విధ్యనుసారము గృహములో ప్రవేశించవలెను. అందరికిని, ఏ అడ్డులును లేకుండ అన్నదానము చేయవలెను. బ్రాహ్మణులకు యథాశక్తిగ దక్షిణ లీయవలెను. ఉద్యానమును నిర్మించువాడు చిరకాలము నందనోద్యానములో నివసించును. మఠ ప్రదానము చేయుటచే స్వర్గలోక ఇంద్ర లోకములు ప్రాప్తించును ప్రపా (చలివెందలి) దానము చేసినవాడు వరుణలోకమునందును., సేతునిర్మాణము చేసినవాడు దేవలోకమునందును నివసించును. ఇటుకలతో సేతవు నిర్మించువాడు కూడ స్వర్గము పొందును. గోపథమును నిర్మించు వాడు గోలోకము పొందును. నియములను వ్రతములను ఆచరించువాడు సాక్షాద్విష్ణు స్వరూపుడగును కృచ్ఛ్రవ్రతములు చేయువాడు సమస్తపాపములను నశింపచేసికొనును గృహదానము చేసినవాడు మహాప్రలయము వరకును స్వర్గములో నివసించును. గృహస్థుడు శివాదిదేవతల సముదాయ ప్రతిష్ఠ చేయవలెను.

శ్రీ అగ్నిమహాపురాణనందు సాధారణ ప్రతిష్ఠాకథనమను అరువది యారవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters