Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ చతుఃషష్టితమో7ధ్యాయః

అథ కూపాది ప్రతిషా కథనమ్‌

శ్రీ భగవానువాచ:

కూపవాపీతడాగానాం ప్రతిష్ఠాం వచ్మి తాం శృణు | జలరూపేణ హి హరిః సోమో వరుణ ఉత్తమః . 1

అగ్నీపోమంమయం విశ్వం విష్ణురాపస్తు కారణమ్‌ | హైమం రౌప్యం రత్నం వా వరుణం కారయేన్నరః. 2

ద్విభుజం హంసపృష్ఠస్థం దక్షిణ నాభయప్రదమ్‌ | వామేన నాగపాశంతునదీనాగారి సంయుతమ్‌. 3

యాగమణ్డపమధ్యే స్యాద్వేదికా కుణ్డమణ్డితా | తోరణం వారుణం కుమ్భంన్యసేచ్చ కరకాన్వితమ్‌. 4

భద్రకే చార్దచన్ద్రం వా స్వస్తికే ద్వారి కుమ్భకాన్‌ | అగ్న్యాధానం చాప్యకుణ్డకృత్యా పూర్ణాం ప్రదాపయేత్‌. 5

హయగ్రీవుడు చెప్పెను:- బ్రహ్మదేవా! ఇపుడు కూపములు, దిగుడుబావులు, చెరువులు ప్రతిష్ఠచేయు విధిని చెప్పెదను; శ్రీహరియే జలరూపముచే దేవ శ్రేష్ఠుడైన సోముడుగాను, వరుణుడు గాను ఆయెను. ప్రపంచ మంతయు అగ్నిషోమమయము. జలరూపుడైన నారాయణుడు దానికి కారణము. బంగారముతో, లేదా వెండితో, లేదా రత్నములతో వరుణుని ప్రతిమ చేయించవలెను. వరుణదేవునకు రెండు భుజములతో, హంసారుఢుడై, నదులతోడను, కాలువలతోడను కూడియుండును. అతని కుడి చేతిలో అభయముద్రయు, ఎడమచేతిలో నాగపాశము ప్రకాశించుచుండును. యజ్ఞమండప మధ్యభాగమున కుండముతో ప్రకాశించు వేదిక నిర్మించి దాని తోరణమున పూర్వద్వారమున కమండలసహితముగా వరుణకలశము స్థాపింపవలెను, భద్రకమున (దక్షిణద్వారమున)ను, అర్ధచంద్రమునను (పశ్చిమద్వారముదను) స్వస్తికమునను (ఉత్తరద్వారమునను) వరుణగకలశములు స్థాపించవలెను. కుండమునందు అగ్న్యాధానము చేసి పూర్ణాహుతి ఇవ్వవలెను.

వరుణం స్నానపీఠే తు యే తే శ##తేతిసంస్పృశేత్‌ | ఘృతేనాభ్యఞ్జయేత్పశ్చాన్మూల మన్త్రేణ దేశికః. 6

శన్నోదేవీతి ప్రక్షాల్య శుద్ధవత్యా శివోదకైః | అధివాసయేదష్టకుమ్భాన్సాముద్రం పూర్ణకుమ్భకే. 7

గాఙ్గమగ్నౌ వర్షతోయం దక్షే రక్షస్తు నైర్ఘరమ్‌ | నదీతోయం పశ్చిమే తు వాయవ్యే తు నదోదకమ్‌. 8

ఔద్భిజ్జం చోత్తరే స్థాప్యమైశాన్యాం తీరసంభవమ్‌ | అలాభేతు నదీతోయం యాసాం రాజేతి మన్త్రయేత్‌. 9

దేవం నిర్మాజ్య నిర్మథ్య దుర్మిత్రియేతి విచక్షణః | నేత్రే చోన్మీలయేచ్చిత్రతచ్చక్షురమ్మధురత్రయైః. 10

జ్యోతిః సంపూరయేద్ధైమ్యాం గురవే గామథర్పయేత్‌.

"యే తే శతం వరుణ" ఇత్యాదిమంత్రముతో స్నానపీఠముపై వరుణుని స్థాపింపవలెను. మూలమంత్రము నుచ్చరించుచు, ఆచార్యుడు, వరుణదేవతాప్రతిమకు ఘృతము పూయవలెను. "శం నో దేవీ" ఇత్యాదిమంత్రముతో ప్రక్షాళనముచేసి, "శుద్ధవాలః," "సర్వశుద్ధవాలః" ఇత్యాదిమంత్రములతో, పవిత్ర జలముచే స్నానము చేయించవలెను. పిమ్మట స్నానపీఠమునకు పూర్వాది దిక్కులందు కలశములను స్థాపించవలెను. తూర్పుననున్న కలశమున సముద్రజలము, అగ్నేయమున నున్న కలశమున గంగాజలము, దక్షిణ కలశమున వర్షాజలము, నైరృతికలశమున సెలయేరు నీరు, పశ్చిమకలశమున నదీజలము వాయవ్య కలశమున కొండకాలువ నీరు, ఉత్తరకలశమున కాలువల నీరు, ఈశాన్యకలశమున తీర్థజలములను ఉంచవలెను. ఈ వివిధజలములు లభించనిచో నదీజలమే ఉంచవలెను. ఈ అన్ని కలశములను "యాసాం రాజా" ఇత్యాది మంత్రముచే అభిమంత్రించవలెను. విద్వాంసుడైన పురోహితుడు "సుమిత్రయా" ఇత్యాది మంత్రముతో మార్జననిర్మంథనములు చేయవలెను. "చిత్రం దేవానామ్‌" "తచ్చక్షుర్దేవహితమ్‌" అను మంత్రములతో తేనె, నెయ్యి పంచదార అను మధురత్రయముచే నేత్రములను తెరువలెనుః ఆ సువర్ణమయ వరుణ ప్రతిమపై జ్యోతిస్సును పూజించి ఆచార్యునకు గోదాన మీయవలెను.

సముద్రజ్యేష్ఠేత్యభిపిఞ్చేద్వరుణం పూర్వకుమ్భతః. 11

సముద్రం గచ్ఛ గాఙ్గేయాత్సోమో ధేన్వితి వర్షకాత్‌ | దేవీరాపో నిర్ఘరాద్బిర్నదాద్భిః పఞ్చ నద్యతః. 12

ఉద్భిదద్భ్యశ్చోద్భిదేన పావమాన్యాథ తీర్థకైః | ఆపోహిష్ఠాపఞ్చగవ్యాద్ధిరణ్యవర్ణేతి స్వర్ణజాత్‌. 13

అపో అస్మేతి వర్షోత్థైర్వ్యాహృత్యా కూపసంభ##వైః | వరుణం చ తడాగోత్థైర్వరుణాద్భిస్తు పశ్యతః. 14

అపోదేవీతి గిరిజైరేకాశీతిఘటైస్తతః | స్నాపయేద్వరుణస్యేతి త్వన్నో వరుణ చార్ఘకమ్‌. 15

వ్యాహృత్యా మధుపర్కంతు బృహస్పతేతి వస్త్రకమ్‌ | వరుణతి పవిత్రం తు ప్రణవేనోత్తరీయకమ్‌. 16

యద్వారణ్యన పుష్పాది ప్రదద్యాద్వరుణాయ తు | చామరం దర్పణం ఛత్రం వ్యజనం వైజయంతికామ్‌. 17

మూలేనోత్తిష్ఠేత్యుత్థాప్య తాం రాత్రిమధివాసయేత్‌ | వరుణం చేతి సాన్నిధ్యం యద్వారణ్యన పూజయేత్‌. 18

సజీవీకరణం మూలాత్పునర్గనాదినా యజేత్‌ | మణ్డపే పూర్వవత్ర్పార్చ్య కుణ్డషు సమిధాదికమ్‌. 19

వేదాదిమన్త్రైర్గఙ్గాద్యాశ్చతస్రో ధేనవో దుహేత్‌ | దిక్ష్వథో వై యవచరుం తతః సంస్థాప్య హోమయేత్‌.

వ్యాహృత్యా వాథ గాయత్ర్యా మూలేనామన్త్రయేత్తథా | సూర్యాయ ప్రజాపతయే ద్యౌః స్వాహా చాన్తరిక్షకః.

తసై#్య పృథివ్యై దేహధూత్యై ఇహ స్వధృతయే తతః | ఇహ రత్యై చేహ రమత్యా ఉగ్రో భీమశ్చ వరౌద్రకః

విష్ణుశ్చ వరుణో ధాతా రాయస్పోషో మహేన్ద్రకః | అగ్నిర్యమోనైరృతో7థ వరుణో వాయురేవ చ 23

కుబేర ఈశో7ననో7థ బ్రహ్మరాజా జలేశ్వరః | తసై#్మ స్వాహేదం విష్ణుశ్చ తద్విప్రానేతి హోమయేత్‌.

సోమో ధేన్వితి షడ్‌హుత్వా ఇమం మేతి చ హోమయేత్‌ |

అపో హి ష్ఠేతి తిసృభిరిమా రుద్రేతి హోమయేత్‌.

"సముద్రజ్యేష్ఠాః" ఇత్యాదిమంత్రముతో పూర్వకలశజలముచేతను, "సముద్రం గచ్ఛ" ఇత్యాదిమంత్రముతో అగ్నేయకలశస్థిత గంగాజలముచేతను. "సోమో ధేనుమ్‌" ఇత్యాదిమంత్రముతో దక్షిణకలశస్థితివర్షాజలముచేతను, "దేవీరాప," ఇత్యాదిమంత్రముతో నైరృతికలశస్థితి నిర్ఘర జలముచేతమ, ''పఞ్చ నద్యః'' ఇత్యాదిమంత్రముతో పశ్చిమకలశస్థిత నదీజలము చేతను, "ఉద్భిద్భ్యః" ఇత్యాదిమంత్రముతో ఉత్తరకలశస్థితోద్భిజ్జ జలముచేతను, పావమానీ ఋక్కులతో ఈశాన్యకలశస్థిత తీర్థజలముచేతను వరుణునకు అభిషేకము చేయవలెను. పిమ్మట యజమానుడు 'అపోహిష్ఠా' మంత్రముతో పంగనవ్యముల చేతను, 'హిరణ్యవర్ణామ్‌' ఇత్యాదిమంత్రముతో స్వర్ణజలముచేతను, "ఆపో అస్మాన్‌" అను మంత్రముచే వర్షాజలముచేతను, వ్యాహృతులతో కూపజలముచేతను, "అపో దేవీః" ఇత్యాదిమంత్రముతో తడాగజలముచేతను, తోరణమునందున్న వరుణ కలశజలముచేతను వరుణునికి స్నానము చేయించవలెను. కొండకాలవల జలము నింపిన ఎనుబది యొక్క కలశములలోని జలముచే "వరుణస్యోత్తమ్భనమసి" ఇత్యాది మంత్రము పఠించుచు స్నానము చేయించవలెను. "త్వం నో అగ్నే వరుణస్య" ఇత్యాదిమంత్రముతో అర్ఘ్యప్రదానము చేయవలెను. వ్యాహృతుల నుచ్చరించుచు మధుపర్కమును, "జృహస్పతే అతియదర్యో" ఇత్యాది మంత్రముతో, వస్త్రముతో, వస్త్రములను, "ఇమం మే వరుణ" ఇత్యాది మంత్రముతో పవిత్రకమును, ప్రణవ ముచ్చరించుచు ఉత్తరీయమును సమర్పింపవలెను. వరుణసూక్తము పఠించుచు పుష్ప-చామర-దర్పణ-ఛత్ర-పతాకలను సమర్పింపవలెను. మూలమంత్రము చదువుచు, 'ఉత్తిష్ఠ' అని పనికి లేవదీసి, ఆ రాత్రికి అధివాసనము చేయించవలెను. 'వరుణం వా' అను మంత్రముచే సంనిధీకరణము చేసి వరుణ సూక్తముచే పూజింపవలెను. మూలమంత్రముచే సజీవీకరణము చేసి చందనాదులతో పూజించవలెను. మండలమున వెనుక చెప్పిన విధమున అర్చన చేయవలెను. అగ్నికుండమున సమిధులతో హోమము చేయవలెను. వైదికమంత్రములతో గంగ మొదలగు నాలుగు గోవులను పిదుకవలెను. అన్నిదిక్కులందును యవలతో వండిన చరువు ఉంచి హోమము చేయవలెను. చరువును వ్యాహృతులచేతను, గాయత్రిచేతను లేదా మూలమంత్రముచేతను అభిమంత్రించిసూర్య-ప్రజాపతి-దివ్‌-అంతకనిగ్రహ-పృథ్వీ-దేహధృతి-స్వధృతి-రతి-

రమతీ-ఉగ్ర-భీమ-రౌద్ర-విష్ణు-వరుణ-ధాతా-రాయస్పోష-మహేంద్ర-అగ్ని-యమ-నిరృతి-వరుణ-వాయు-కుబేర-ఈశ-అనంత-బ్రహ్మ-వరుణ నామములను చతుర్థ్యంతములు చేసి పలుకుచు అంతమున "స్వాహా" చేర్చి బలి ఇవ్వవలెను.. "ఇదం విష్ణుః" "తద్విప్రాసః" అను మంత్రములచే అహుతుల నీయవలెను. "సోమో ధేనువు" ఇత్యాది మంత్రములతో ఆరు ఆహుతు లిచ్చి "ఇమం మే వరుణ" అను మంత్రముతో ఒక ఆహుతి ఇవ్వవలెను. 'అపో హిష్ఠా' ఇత్యాది మంత్రత్రయముతోను 'ఇమా రుద్రా' ఇత్యాదిమంత్రముతోను కూడ ఆహుతుల నీయవలెను.

దశదిక్షు బలిం దద్యాద్గన్ధపుష్పాదినార్చయేత్‌ | ప్రతిమాం తు సముత్థాప్య మణ్డలే విన్యసేద్బుధః. 26

పూజయేద్గన్థ పుష్పాద్యైర్హేమపుష్పాదిభిః క్రమాత్‌ | జలాశయాంస్తు దిగ్భాగే వితస్తిద్వయసంమితాన్‌. 27

కృత్వాష్టౌ స్థణ్డిలా న్రమ్యాన్సైకతాన్‌ దేశికోత్తమః | వరుణస్యేతి మన్త్రేణ సాజ్యమష్టశతం తతః. 28

చరుం యవమయం హుత్వా శాన్తిహోమం సమాచరేత్‌ | సేచయేన్మూర్ధ్ని దేవం తు సీజవకరణం చరేత్‌.

ధ్యాయేత్తు వరుణం యుక్తం గౌర్యా నదనదీ గణౖః |

ఓం వరుణాయ నమో7భ్యర్చ్య తతః సాన్నిధ్యమాచరేత్‌. 30

ఉత్థాప్య నాగపృష్ఠాద్యైర్భ్రామయేత్తైః సమఙ్గలైః | అపో హిప్ఞేతి చ క్షి పేత్త్రిమధ్వాక్తేఘటేజలే. 31

జలాశ##యే మధ్యగతం సుగుప్తం వినివేశ##యేత్‌ |

పిమ్మట పది దిక్కులందును బలు లిచ్చి గంధపుష్పాలతో పూజించవలెను. ప్రతిమను ఎత్తి మండపము మీద స్థాపించి గంధపుష్పాదుల చేతను, సువర్ణ పుష్పాదుల చేతను పూజించవలెను. పిమ్మట శ్రేష్ఠుడైన ఆచార్యుడు ఎనిమిది దిక్కులందును రెండేసి జానల చెరువులను, ఇసుకతో ఎనిమిది వేదికలను నిర్మింపవలెను. 'వరుణస్య' ఇత్యాది మంత్రము చదువుచు, ఘృతముతోను, యవలతో వండిన చరువుతోను వేరు వేరుగ నూటఎనిమిది హోమములు చేయవలెను. శాంతి జలము తీసికొని వచ్చి దానితో వరుణుని శిరస్సుపై అభిషేకము చేసి, సజీవీకరణము చేయవలెను. తన ధర్మపత్నియగు గౌరితో కూడిన వరుణుడు నదీనదములతో పరివేష్టితుడై యున్నట్లు ధ్యానము చేయవలెను. ఓం వరుణాయ నమః అను మంత్రముతో పూజించి సాంనిధ్యకరణము చేయవలెను. పిమ్మట వరుణదేవుని లేవదీసి మంగళ ద్రవ్యములతో గజ పృష్ఠాదులపై ఎక్కించి ఊరేగించవలెను. పిమ్మట ఆ వరుణమూర్తిని "ఆపో హి ష్ఠామ యో భువః" ఇత్యాది మంత్రము పఠించుచు మదురత్రయయుక్త మగు కలశములో ఉంచి కలశసహితు డగు వరుణుని జలాశయ మధ్య భాగమునందు సురక్షితరూపము స్థాపింపవలెను.

స్నాత్వా ధ్యాయేచ్చ వరుణం సృష్టి బ్రహాణ్డసంజ్ఞితామ్‌. 32

అగ్నిబీజేన సందగ్ద్య తద్భస్మ ప్లావయేద్దరామ్‌ | సర్వమాపోమయం లోకం ధ్యాయేత్తత్రం జలేశ్వరమ్‌. 33

తోయమధ్యస్థితం దేవం తతో యూపం నివేశ##యేత్‌ | చతురస్రమథాష్టాస్రం వర్తులం వా ప్రవర్తితమ్‌. 34

ఆరాధ్య దేవతాలిఙ్గం దశహస్తం తు కూపకే. |

యూపం యజ్ఞీయవృక్షోత్థం మూలే హైమం ఫలం స్యసేత్‌. 35

వాప్యాం పఞ్చదశకరం పుష్కరిణ్యాంతు తు వింశకమ్‌ | తడాగే పఞ్చవింశాఖ్యం జలమధ్యే నివేశ##యేత్‌. 36

యాగమణ్డపాఙ్గణ వా యూపవ్రస్కేతి మన్త్రతః | స్థాప్య తద్వేష్టయేన్మన్త్రైర్యూపోపరి పతాకికామ్‌. 37

తదభ్యర్చ్య చ గన్ధా ద్యైర్జగచ్ఛాన్తిం సమాచరేత్‌ | దక్షిణాం గురవే దద్యాద్భూగోహేమామ్బుపాత్రకమ్‌. 38

ద్విజేభ్యోదక్షిణా దేయా ఆగతాన్‌ భోజయేత్తథా | ఆబ్రహ్మస్తమ్బపర్యన్తా యే కేచిత్సలిలార్థినః. 39

తే తృప్తిముపగచ్ఛన్తు తడాగస్థేన వారిణా | తోయముత్సర్జయేదేవం పఞ్చగవ్యం వినిక్షి పేత్‌. 40

అపో హి ష్ఠేతి తిసృభిః శాన్తితయం ద్విజైః కృతమ్‌ |

తీర్థతోయం క్షిపేత్పుణ్యం గోకులం చయార్చయేద్ద్విజాన్‌. 41

అనివారితమన్నాద్యం సర్వజన్యం చ కారయేత్‌ | అశ్వమేధసహస్రాణాం సహస్రం యః సమాచరేత్‌ 42

ఏకాహం స్థాపయేత్తోయం తత్పుణ్యమయుతాయుతమ్‌ |

విమానే మోదతే స్వర్గే నరకం న స గచ్ఛతి. 43

గవాది పిబతే యస్మాత్తస్మాత్కర్తుర్న పాతకమ్‌ | తోయదానాత్సర్వదానఫలం ప్రాప్య దివం వ్రజేత్‌. 44

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే కూపవాపీతడాగాది ప్రతిష్ఠా కథనం నామ చతుష్షష్టితమోద్యాయః

పిమ్మట యజమానుడు స్నానము చేసి వరుణుని ధ్యానించవలెను. అనంతరము బ్రహ్మాండసంజ్ఞక మగు సృష్టిని అగ్నిబీజముచే (రం) దహించి, దాని భస్మరాశిని ఉదకముచే ముంచెత్తి నట్లు భావన చేయవలెను. జగ మంతయు జలమయమైనది" అని భావన చేసి ఆ జలమునందు జలేశ్వరు డైన వరుణుని ధ్యానించవలెను. ఈ విధమున జల మధ్యభాగమున వరుణదేవతా ధ్యానము చేసి అచట యూపమును స్థాపించవలెను. యూపము చతుష్కోణముగ గాని, అష్ణకోణముగ గాని, గోలాకారము గాని ఉండుట మంచిది. పది హస్తముల పొడ వుండవలెను. దానిపై ఉపాస్యదేవతా చిహ్నము లుండవలెను. దానిని యజ్ఞమున కుపయోగించు చెట్టు కఱ్ఱతో నిర్మింపవలెను. కూపమునకు అట్టి యూపమే ఉపయోగించును. దాని మూలభాగమున బంగారు ఫలక ముంచవెలను. దిగుడు బావిలో పదునైదు హస్తముల యూపమును, పుష్కరిణిలో ఇరువది హస్తముల యూపమును, తటాకమున ఇరువదియైదు హస్తముల యూపముస్థాపించవలెను. యజ్ఞప్రాంగణము "యూపబ్రహ్మ" ఇత్యాది మంత్రముతో యూపమును స్థాపించి, దానికి వస్త్రములు చుట్టబెట్టి, పై భాగమున పితాక ఏర్పరుపవలెను. దానిని గంధాదులతో పూజించి, జగత్తుకొరకై శాంతికర్మ చేయవలెను. ఆచార్యునకు భూమి, గోవు, సువర్ణము, జలపాత్రము మొదలగునవి దక్షిణగ ఇవ్వవలెను. ఇతర బ్రాహ్మణులకు గూడ దక్షిణ లిచ్చి, వచ్చిన వారికి ఖోజనము పెట్టవలెను. "బ్రహ్మ మొదలు తృణమువరకు, లేదా కీటకము వరకు దప్పికొన్న వారి కందరికిని ఈ తడాగములో నున్న జలముచే తృప్తి కలుగు గాక" అని పలుకుచు జలము విడిచిపెట్టి. జలాశయములో పంచగవ్యము లుంచవలెను. పిమ్మట 'ఆపో హి ష్ఠామ' ఇత్యాది ఋక్త్రయము పఠించుచు, బ్రాహ్మణులు సమకూర్ఛిన శాంతి జలమును, పవిత్రతీర్థ జలమును ఉంచి, బ్రాహ్మణులకు గోవృషభాదిదానము చేయవలెను. ఎట్టి అడ్డులు చెప్పకుండగ అందరికిని అన్నదానము చేయు ఏర్పాట్లు చేయవలెను. ఒక్క జలాశయమును నిర్మించువాని పుణ్యము లక్ష అశ్వమేధయాగములు చేసిన వాని పుణ్యము కంటె వేయి రెట్లు అధికము. అతడు స్వర్గము చేరి విమానమునందు ఆనందించుచుండును. ఎన్నడును నరకమునకు వెళ్ళడు జలాశయమునందు గోవులు మొదలుగు పశువులు జలము త్రాగును గాన దానిని నిర్మించినవాడు పాప వినిర్ముక్తు డగును. జలదానము చేసిన మానవుడు సకల దానములు చేసిన ఫలముపొంది స్వర్గమునకు వెళ్ళును.

అగ్నిమహాపురాణము నందు కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథన మను ఆరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters