Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ త్రిషష్టితమో7ధ్యాయః

అథ సుదర్శనచక్రాదిప్రతిష్ఠాకథనమ్‌.

శ్రీ భగవానువాచ:

ఏవం తార్‌క్ష్యస్య చక్రస్య బ్రహ్మణో నృహరేస్తథా | ప్రతిష్ఠా విష్ణువత్కార్యా స్వస్యమన్త్రేణ తాం శృణు. 1

సుదర్శన మహాచక్ర శాన్త దుష్టభయంకర | ఛిన్ధి ఛిన్ధి ఛిన్ధి ఛిన్ధి విదారయ విదారయ. 2

పరమన్త్రాన్‌ గ్రస గ్రస భక్షయ భూతాన్‌ త్రాసయ త్రాసయ హుం ఫట్‌ సుదర్శనాయ నమః"

అభ్యర్చ్య చక్రం చానేన రణ దారయతే రిపూన్‌. 3

ఓం క్షౌం నరసింహా ఉగ్రరూప జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల |

స్వాహా నరసింహస్య మన్త్రో7యం పాతాలఖ్యస్య వచ్మి తే. 4

హయగ్రీవుడు చెప్పెను: గరుడ - సుదర్శన - బ్రహ్మ-నృసింహమూర్తుల ప్రతిష్ఠకూడ, వారి వారి మంత్రములతో, విష్ణుమూర్తిని స్థాపించిన విధముననే స్థాపింపవలెను. ఆ విధానమును వినుము " ఓం సుదర్శన....సుదర్శనాయ నమః" అను (మూలములో వ్రాసిన) మంత్రముతో చక్రపూజ చేసిన వీరుడు యుద్ధమునందు శత్రువులను చీల్చివేయగలడు "ఓం క్షౌ నరసింహ ఉగ్రరూప జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల స్వాహా" అనునది నరసింహా మంత్రము. ఇపుడు నీకు పాతాలనృసింహమంత్రముపదేశించుచున్నాను.

ఓం క్షౌం నమో భగవతే నరసింహాయ, ప్రదీప్త సూర్యకోటి సమతేజసే

వజ్రనఖదంష్ట్రాయుధాయ, స్ఫుటవికట వరీర్ణకేసర సటాగ్ర ప్రక్షుభిత

మహార్ణవామ్భోదున్దుభిర్ఘోషాయ, సర్వమన్త్రోత్తారణాయ, ఏహ్యేహి

భగవన్నరసింహా, పురుష, పరాపరబ్రహ్మ, సత్యేన స్ఫుర-స్ఫుర, విజృమ్భ

విజృమ్భ, అక్రమ- అక్రమ, గర్జ-గర్జ, ముఞ్చ-ముఞ్చ, సింహనాదాన్‌,

విదారయ-విదారయ, విద్రావయ-విద్రావయ, ఆవిశ -ఆవిశ, సర్వమన్త్ర

రూపాణి సర్వన్త్ర జాతీశ్చ హన-హన, ఛిన్ద-చిన్ద, సంక్షిప-సంక్షిప,

సర-సర, (దర-దర) దారయ-దారయ, స్ఫుట-స్ఫుట, స్ఫోటయ-స్ఫోటయ, జ్వాలా మాలాసంగాతమయ, సర్వతోనన్తజ్వాలావజ్రాశనిచక్రేణ సర్వపా

తాలాన్‌ ఉత్సాదయ-ఉత్సాదయ, సర్వతో7నన్తజ్వాల

వజ్రశరపఞ్జరేణ సర్వపాతాలాన్‌ పరివారయ-పరివారయ, సర్వపా

తాలాసురవాసినాం హృదయాన్యాకర్షయ ఆకర్షయ. శీఘ్రం దహ-

దహ, పచ-పచ, మథ-మథ, శోషయ-శోషయ, నికృన్తయ-నికృన్తయ,

తావద్యావన్మే వశమాగతాః పాతళేభ్యః (ఫట్‌సురేభ్యః) ఫట్‌ అసురేభ్యః, ఫట్‌

మన్త్రరూపేభ్యః ఫట్‌, మన్త్రజాతిభ్యః ఫట్‌, సంశయాన్మాం భగవన్నరసిం

హరూప విష్ణో సర్వాపద్భ్యః సర్వమన్త్రరూపేభ్యో రక్ష రక్ష హుం ఫట్‌

నమో నమస్తే."

ఇది పాతాలనృసింహమంత్రము దీనిని ఈ విధముగ జపించగనే సత్ఫలము లభించును. శత్రువులను, నాకు అపకారము చేయు అసురులు మొదలగువారిని, పరులు ప్రయోగించిన మంత్రములను నశింపచేయుము. అని దీని తాత్పర్యము. మధ్యనున్న 'హుం' 'ఫట్‌' అనువాటికి ప్రత్యేకముగ అర్థమేమియు ఉండదు. కాని ఉచ్చారణమాత్రముచేతనే అవి నశింపచేయుట అను అర్థమును సూచించును 'ఫట్‌' అనుదానికి మారకాస్త్రమని పేరు.]

"ప్రకాశించుచున్న కోటిసహన్రసూర్యలతో సమాన మైన తేజస్సు కలవాడును, వజ్రము వంటి నఖములు కోరలు ఆయుధముగా కలవాడును, పైకి విడివడి లేచిన జూలుచేత క్షోభింపచేయబడిన మహాసముద్ర జలముచే ఏర్పడిన దుందుభిధ్వని కలవాడును, సర్వమంత్రప్రయోగములనుండి తరింపచేయువాడును అగు భగవంతుడైన నరసింహునకు నమస్కారము భగవంతుడవైన నరసింహా! రమ్ము; రమ్ము. పురుషా! పరాపరబ్రహ్మరూపా! సత్యముచే ప్రకాశించుము ప్రకాశించుము. విజృంభించుము, విజృంభించుము. ఆక్రమించుము, అక్రమించుము గర్జించుము, గర్జించుము. సింహనాదము చేయుము, చేయుము. చీల్చుము, చీల్చుము, పారద్రోలుము, పారద్రోలుము, ఆవేశించుము, ఆవేశించుము. సర్వ సంత్రరూపములను, మంత్రజాతులను చంపుము, చంపుము. భేదించుము, భేదించుము. సంక్షేపించుము, సంక్షేపించుము. నడుపుము, నడుపుము. చీల్చుము, చీల్చుము. బ్రద్దలుకొట్టుము, బ్రద్దలుకొట్టుము. జ్వాలామాలాసముదాయస్వరూపా! అంతటను వ్యాపించిన అనంతమైన జ్వాలలయొక్క, వజ్రములయొక్కయు, అశనులయొక్కయు సముదాయముచే పాతాలము లన్నింటిని నశింపచేయుము, నశింపచేయము. అంతటను వ్యాపించిన, అనంతమైన జ్వాలలచేతను, వజ్రముల చేతను, శరపంజరముచేతను పాతాళముల నన్నింటిని చుట్టుముట్టుము. సర్వపాతాళములందు నివసించు ఆసురల హృదయములను లాగుము, లాగుము, శీఘ్రముగ కాల్చివేయుము. కాల్చివేయుము. వండుము, వండుము, మథించుము, మంథించుము, ఎండచేయుము, ఎండచేయుము. వారందరును నాకు వశ మగునంతవరకు ఖండించుము, ఖండించుము. "పాతాలేభ్యః ఫట్‌, అసురేభ్యః ఫట్‌, మన్త్రరూపేభ్యః ఫట్‌, మంత్రజాతిభ్యః ఫట్‌" భగవంతుడవైన, నరసింహ రూపములో నున్న ఓ విష్ణూ! నన్ను సందిగ్ధస్థితి నుండియు, సర్వాపదల నుండియు సర్వమంత్ర రూపములనుండియు రక్షింపుము, రక్షింపుము, "హుం" "ఫట్‌" నీకు నమస్కారము, నమస్కారము."

నరసింహాస్య విద్యేయం హరిరూపార్థసిద్దిదా. 3

త్రైలోక్యమోహనైర్మన్త్మైః స్థాప్యసై#్త్రలోక్యమోహనః | గదీ దక్షే శాన్తికరో ద్విభుజో వా చతుర్భజః. 4

వామోర్ధ్వే కారయేచ్చక్రం పాఞ్చజన్యమథో హ్యధః | శ్రీపుష్టిసంయుతం కుర్యాద్భవేన సహభద్రయా. 5

ప్రసాదే స్థాపయేద్విష్ణుం గృహే వా మణ్డపేపి వా | వామనం చైవ వైకుణ్ఠం హయాస్యమనిరుద్ధకమ్‌. 6

స్థాపయేజ్జలశయ్యాస్థం మత్స్యాదీంశ్చావతారకమ్‌ | సఙ్కర్షణం విశ్వరూపం లిఙ్గం వై రుద్రమూర్తికమ్‌. 7

అర్దనారీశ్వరం తద్వద్ధశఙ్కరమాతృకాః | భైరవం చ తథా సూర్యం గ్రహాంస్తనద్వద్వినాయకమ్‌. 8

గౌరీమిన్ద్రాదిభిః సేవ్యాం చిత్రజాం చ బలాబలామ్‌ |

ఇది శ్రీహరిరూపిణి యగు నృసింహవిద్య, సర్వర్థములను ఒసగునది. త్రైలోక్యమోహన శ్రీవిష్ణుమూర్తి ప్రతిష్ఠత్రైలోక్యమోహనమంత్ర సమూహముతో చేయవలెను. ద్విభుజవిగ్రహమునకు ఎడమ చేతిలో గద, కుడి చేతిలో ఆభయ ముద్ర ఉండవలెను. చతుర్భుజరూప మైనచో పై కుడిచేతిలో చక్రము, పై ఎడమచేతిలో పాంచజన్యము ఉండవలెను. ఈ విగ్రహముతో శ్రీపుష్టులను గాని, బలరామ-సుభద్రలను గాని స్థాపింపవలెను. శ్రీవిష్ణు-వామన-వైకుంఠ-హయగ్రీవ-అనిరుద్ధులను ప్రాసాదములో గాని గృహములో గాని, మండమునందు గాని స్థాపింపవలెను. మత్స్యాద్యవతారములలో జల శయ్యపై స్థాపించి పరుండబెట్టవలెను. సంకర్షణ- విశ్రూప-రుద్రమూర్తిలింగ-అర్ధనారీశ్వర-హరిహార-మాతృకాగణ-భైరవ-సూర్య-గ్రహ-వినాయకులను, ఇంద్రాదులచే సేవింపబడు గౌరిని, చిత్రజను, బలాబలవిద్యను కూడ ఈ విధముగనే స్థాపింపవలెను.

పుస్తకానాం ప్రతిష్ఠాం చ వక్ష్యే లిఖనతద్విధిమ్‌. 9

స్వస్తి కే మణ్డలేభ్య7ర్చ్య శరపత్రాసనే స్థిరమ్‌ |

లేఖ్యం చ లిఖితం పుస్తం గురుర్విద్వాం హరిం యజేత్‌. 10

యజమానో గురం విద్వాం హరిం లిపికృతం నరమ్‌ | ప్రాజ్ముఖః పద్మినీం ధ్యాయోల్లిఖిత్వా శ్లోకపఞ్చకమ్‌.

రౌప్యస్థమష్యా హైమ్యా చ లేఖన్యా నాగరాక్షరమ్‌ | బ్రహ్మణాన్‌ భోజయే చ్ఛక్త్యా దద్యాచ్చ దక్షిణామ్‌.

గురుం విద్యాం హరిం ప్రార్చ్య పురాణాది లిఖేన్నరః | పూర్వవన్మణ్డలాద్యైశ్చ ఐశాన్యాం భద్రపీఠ కే. 13

దర్పణ పుస్తకం దృష్ట్వా సేచయోత్పూర్వవద్ఘటే |

నేత్రోన్మీలనకం కృత్వా శయ్యాయాంతు న్యసేన్నరః. 14

న్యసేత్తు పౌరుషం సూక్తం వేదాద్యం తత్రపుస్తకే | కృత్వా సజీవీకరణం ప్రార్చ్యహుత్వా చరుం తతః.

సంప్రార్చ్య దక్షిణాభిస్తు గుర్వాదీన్భోజయేద్ధ్విజన్‌ |

రథేన హస్తినా వాపి భ్రామయేత్పుస్తకం నరైః. 16

గృహే దేవాలయాదౌ తు పుస్తకం స్ధాప్య పూజయేత్‌ | వస్త్రాదివేష్టితం పాఠాదాదావన్తే సమర్చయేత్‌. 17

జగచ్ఛాన్తిం చావధార్య పుస్తకం వాచయేన్నరః | అధ్యాయమేకం కుమ్భాద్బిర్యజమానాది సేచయేత్‌. 18

ద్విజాయ పుస్తకం దత్వా ఫలస్యాన్తో న విద్యతే | త్రీణ్యాహురతిదానాని గావః పృథ్వీ సరస్వతీ. 19

విద్యాదానఫలం దత్త్యా మష్యాక్తం పత్రసంచయమ్‌ | యావత్తు పత్రసంఖ్యానమక్షరాణాం తథానషు. 20

తావద్వర్షసహ స్రాణి విష్ణు లేకే మహీయతే | పఞ్చరాత్రం పురాణాది భారతాది దదన్నరః. 21é

కులైకవింశముద్ధృత్య పరే తత్త్వేతు లీయతే.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే దేవతాదిప్రతిష్ఠాకథనం నామ త్రిషష్టితకమో7 ధ్యాయః

ఇపుడు నేను గ్రంథప్రతిష్ఠను దానిలేఖన విధానమును గూర్చి చెప్పెదను. ఆచార్యుడు స్వస్తికమండలముపై శరయంత్రా సనము మీద నున్న లేఖ్యమును (వ్రాయదగిన దానిని) లిఖిత పుస్తకమును. విద్యను, శ్రీహరిని పూజించవలెను. పిదప యజమానుడు గురువును, విద్యను, శ్రీ మహావిష్ణువును, లేఖకుని పూజించవలెను. పిమ్మట పూర్వాభిముఖుడై పద్మినిని ధ్యానించి వెండి సిరాబుడ్డిలో నున్న సిరాలో ముంచి బంగారు కలముతో ఐదు శ్లోకములు దేవనాగరీ లిపిలో వ్రాయవలెను. పిదప బ్రాహ్మణులకు యథాశక్తి భోజనము పెట్టి, దక్షిణ ఇవ్వవలెను. ఆచార్య-విద్యా-శ్రీ మహావిష్ణువులను వూజించి లేఖకుడు పురాణాదులను వ్రాయుట ప్రారంభింపవలెను. వెనుకటివలె మండలాదులపై ఈశాన్యము నందున్న అద్దముమీద పుస్తకము నుంచి, మొదట చెప్పినట్లుగనే కలశములచే తడపవలెను . పిదవ యజమానుడు నేత్రములను తెరచి, ఈ పుస్తకమును శయ్యపై ఉంచవలెను. పిమ్మట దానిపై పురుషసూక్తవేదాదిన్యాసము చేయవలెను. ప్రాణప్రతిష్ఠా పూజా-చరుహోమములు చేసి, పూజించి, ఆచార్యుని దక్షిణాదులతో సత్కరించి బ్రహ్మణ భోజనము ఏర్పరుపవలెను. అంతమున ఆ పుస్తకమును గృహమునందు గాని, దేవాలయమునంరు గాని స్థాపించి పూజించవలెను. గ్రంథమును వస్త్రముతో అచ్ఛాదించి పాఠ ప్రారంభమునందును, అంతరమునందును దానిని పూజించవలెను. పుస్తకమును చదువువాడు విశ్వశాంతి కలుగవలెను. నని సంకల్పించి ఒక అధ్యాయమును చదువవలెను. గురువు కుంభములోని జలముతో యజమానుడు మొదలగు వారికి అభిషేకము చేయించవలెను. బ్రహ్మణునకు పుస్తకదానము చేసినచో అనంతఫలము లభించును. గోదాన-భూదాన-విద్యాదానము లను మూడు దానములకును అతిదానము లని పేరు పాలుపిదుకు, విత్తనములు, చల్లుట అను పనులు చేయగనే ఆ దానములు చేసిన వాడు నరకము నుండి ఉద్ధరింపబడును. సిరాతో రాసిన పత్రములను దానము చేసినచో విద్యాదానఫలము లభించును. ఆ పత్రము లెన్ని యున్నవో, అక్షరము లెన్ని యున్నవో అన్ని వేల సంవత్సరములు దాత వుష్ణులోకములో పూజింప బడును. పంచరాత్రము, పూరాణములు, మహాభారతము దానము చేసిన వాడు తన వంశములో ఇరువది యొక్క తరముల వారిని ఉద్ధరించి తాను పరమ తత్త్వమునందు విలీను డగును.

అగ్ని మహాపురాణమునందు దేవతాప్రతిష్ఠాకథన మను అరువదిమూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters