Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ అష్టపఞ్చాశత్తమో7ధ్యాయః

అథ స్నపనాది విధిః

శ్రీభగవానువాచ:

ఐశాన్యాం జనయేత్కణ్డం గురుర్వహ్నిం చవైష్ణవమ్‌ | గాయత్య్రష్టశతం హుత్వా సమ్పాత విధినాఘటాన్‌.

ప్రోక్షయేత్కారు శాలాయాం శిల్పిభిర్మూర్తి పైర్వజేత్‌ | తూర్యశ##బ్దైః కౌతుకంచ భిన్దయేద్దక్షిణ కరే. 2

విష్ణవే శిపివిష్టేతి ఊర్ణాసూత్రేణ సర్షపైః | పట్ట వస్త్రణ కర్తవ్యం దేశికస్యాపి కౌతుకమ్‌. 3

మండపే ప్రతిమాం స్థాప్య సవస్త్రాం పూజితాం స్తువన్‌ | నమస్తే7ర్చ్యే సురేశాని ప్రణీతే విశ్వకర్మణా. 4

ప్రభావితా శేషజగద్ధాత్రి తుభ్యం నమో నమః | త్వయి సంపూజయామీశే నారాయణమనామయమ్‌ . 5

రహితా శిల్పదేషైస్త్వ మృద్ధి యుక్తా సదాభవ | ఏవం విజ్ఞాప్య ప్రతిమాంనయేత్తాం స్నానమండపమ్‌. 6

హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఆచార్యుడు ఈశాన్యము నందు ఒక హోమకుండము నిర్మించి దానిలో వైష్ణవాగ్నిని స్థాపింపవలెను. గాయత్రీ మంత్రముతో నూట ఎనిమిది హోమములు చేసి సంపాతవిధిచే కలశలను ప్రోక్షించవలెను. మూర్తి పాలకులగు విద్వాంసులతోడను, శిల్పులతోడను కలిసి యజమానుడు, వాద్యములతో, శిల్పశాలకు వెళ్ళవెలను. అచట "విష్ణవేశిపివిష్టాయనమః" అను మంత్రముచ్చరించుచు, ఇష్టదేవతా ప్రతిమ కుడిచేతికి కౌతుక సూత్రము కట్టవలెను. ఆ సమయమున ఆచార్యుని హస్తమునకు గూడ ఉన్నిదారము, ఆవాలు, పట్టు వస్త్రము వీటితో కౌతుకము కట్టవలెను మండలముపై ఆప్రతిమను వస్త్రముచుట్టి స్థాపించి ఈ విధముగ స్తుతించవలెను. "విశ్వకర్మ నిర్మించిన, దేవేశ్వరి యైన ఓ ప్రతిమా! నీకు నమస్కారము సమస్త జగత్తును ప్రభావితము చేయు ఓ జగదంబా! నీకు మాటిమాటికి నమస్కిరించుచున్నాను. ఈశ్వరీ! నేను నీపై నిరామయుడగు నారాయణుని పూజించుచున్నాను. నీ యందు శిల్పసంబధి దోషములేవియు లేకుండగాక. నా విషయమున సర్వదా సమృద్ధి శాలినివిగా ఉండుము". ప్రతిమను ఈ విధముగ

ప్రార్థించి దానిని స్నానాగారమునకు తీసికొని వెళ్ళవలెను.

శిల్పినం తోషయేద్ద్రవ్యైర్గురవే గాంప్రదాపయేత్‌ | చిత్రందేవేతి మన్త్రేణ నేత్రేచోన్మీల యేత్తతః. 7

అగ్నిర్జ్యోతీత దృష్ణించ దద్యాద్త్వె భద్రపీఠకే | తతః శుక్లాని పుష్పాణీ ఘృతం సిద్దార్థకం తథా. 8

దూర్వాం కుశాగ్రం దేవస్య దద్యాచ్ఛిరసిదేశికః | మధువాతేతి మన్త్రేణ నేత్రేచాభ్యఞ్జయేద్గరుః. 9

హిరణ్యగర్భ మన్త్రేణ ఇమంమేతి చకీర్తయేత్‌ | ఘృతేనాభ్యఞ్జయే త్పశ్చాత్పఠన్‌ ఘృతవతీం పునః. 10

మసూరపిష్టేనోద్వర్త్య అతో దేవేతి కీర్తియేత్‌ | క్షాలయేదష్టతో యేన

సప్తతే7గ్నేతిదేశిక. 11

ద్రుపదాదివేత్యనులింపే దాపోహిష్ఠేతి సేచయేత్‌ | నదీజైస్తీర్థజైఃస్నానం పావమానీతి రత్నజైః. 12

సముద్రం గచ్ఛగచ్ఛేతి తీర్థమృత్కలశేనచ | శన్నోదేవీః స్నాపయేచ్చ గాయత్ర్యా ముష్ణ వారిణా. 13

పఞ్చమృద్భిర్హిరణ్యతి స్నాపయేత్పరమేశ్వరమ్‌ | సికతాద్భి రిమంమేతి వల్మీ కోత్థఘటేనచ. 14

తద్విష్ణోరితి ఔషధ్యద్భిర్యాఓషధి మన్త్రతః | యజ్ఞాయజ్ఞేతి కాషాయైః పఞ్చభిర్గవ్యకై స్తతః. 15

పయఃపృథివ్యాం మన్త్రేణయాః ఫలీతి ఫలామ్బుభిః | విశ్వతశ్చక్షుః సౌమ్యేన పూర్వేణ కలశేనచ. 16

సోమం రాజాన మిత్యేవం విష్ణో రరాటం దక్షతః | హంసః శుచిః పశ్చిమేన కుర్యాదుద్వర్తనం హరేః. 17

శల్పికి ద్రవ్యమునిచ్చి సంతోషపరచవలెను. గురువునకు గోదానమీయవలెను. "చిత్రందేవానామ్‌" ఇత్యాది మంత్రము పఠించుచు ప్రతిమనేత్రములను తెరవవలెను. "అగ్నిర్జ్యోతిః" ఇత్యాది మంత్రముచే దృష్టిసంచారము చేయవలెను. ప్రతిమను భద్రపీఠముపై నుంచి ఆచార్యుడు తెల్లని పుష్పములు, నెయ్యి, ఆవాలు, దూర్వలు, కుశలు దేవత శిరస్సుపై ఉంచవలెను. "మధువాతా" ఇత్యాది మంత్రముచే నేత్రములందు అంజనము ఉంచివలెను. ఆ సమయమున "హిరణ్యగర్భః" "ఇమంమేవరుణః" ఇత్యాది మంత్రములు పఠింపవలెను. ఘృతవతీ ఇత్యాది ఋక్క పఠించుచు ఘృతము శరీరమునకు పూయవలెను. శనగపిండితో నలిచి "అతోదేవాః" ఇత్యాది మంత్రము పఠింపవలెను. "సప్తతే అగ్నే" ఇత్యాది మంత్రము పఠించి గర్భజలముతో ప్రతిమను కడగవలెను. "ద్రువదాదివ" ఇత్యాది మంత్రముచే అను లేపనము, ఆపోహిష్ఠామ" ఇత్యాది మంత్రముచే అభిషేకము చేయవలెను. అభిషేకానంతరము నదీ-తీర్థజలములచేస్నానము చేయించి, 'పావమానీ' ఋక్కు పఠించుచు రత్నస్పర్శగల ఉదకముతో స్నానము చేయింపవలెను. "సముద్రం గచ్ఛస్వాహా" ఇత్యాది మంత్రము చదువుచు తీర్థ మృత్తికచేత, కలశజలము చేతనుస్నానము చేయించవలెను. "శంనోదేవీః" ఇత్యాది మంత్రముగాయత్రీమంత్రము పఠించుచు వేడినీళ్ళతో స్నానము చేయించవలెను. "హిరణ్యగర్భః" ఇత్యాది మంత్రములచే పంచవిధ మృత్తికలతో స్నానము చేయించవలెను. పిమ్మట "ఇమంమేగంగేయమునే" ఇత్యాది మంత్రముచే ఇసుక కలిపిన జలముచేతను, "తద్విష్ణోః పరమంపదమ్‌" అను మంత్రముతో పుట్టమట్టి కలిపిన ఉదకము చేతను, పూర్ణ ఘటముతో స్నానము చేయించవలెను. "యఓషధీః" ఇత్యాది మంత్రము చదువును ఓషధి మిశ్రజలము చేతను, యజ్ఞా యజ్ఞా" ఇత్యాది మంత్రము చదువుచు ఉసిరి మొదలగు కషాయ పదార్థములు కలిపిన జలములచేతను, "పయః పృథివ్యామ్‌" ఇత్యాది మంత్రముతో పంచగవ్యముల చేతను, "యాఃఫలినీః" ఇత్యాది మంత్రముతో ఫలిమిశ్రిత జలములచేతను స్నానము చేయించవలెను. "విశ్వతశ్చక్షుః" ఇత్యాది మంత్రముతో ఉత్తరదిక్కుననున్న కలశ##చేతను. "సోమం రాజనమ్‌" అను మంత్రముతో పూర్వదిక్కలశముచేతను, "విష్ణారరాటమసి" ఇత్యాది మంత్రముతో దక్షిణకలశ##చేతను, "హంసః శుచిషత్‌" ఇత్యాది మంత్రముతో పశ్చిమముననున్న కలశ##చేతను ఉద్వర్తన స్నానము చేయించవెలను.

మూర్ధానమితి మన్త్రేణ ధాత్రీ మాంస్యుదకేనచ | మానస్తోకేతి మన్త్రేణ గన్దద్వారేతి గన్ధకైః. 18

ఇదమాపేతిచ ఘటై రేకాశీతి పదస్థితైః | ఏహ్యేహి భగవన్విష్ణో లోకానుగ్రహ కారక. 19

యజ్ఞభాగం గృహాణమం వాసుదేవనమో7స్తుతే | అనే నావాహ్య దేవేశం కుర్యాత్కౌతుక మోచనమ్‌. 20

ముఞ్చామి త్వేతి సూక్తేన దేశిక స్యాపి మోచయేత్‌ | హిరణ్మయేన పాద్యం దద్యాదతో దేవేతి చార్ఘ్యకమ్‌.

మధువాతా మధుపర్కం మయిగృహ్ణామి చాచమేత్‌ | అక్షన్నమీమదన్తేతి కిరేద్దూర్వాక్షతం బుధః. 22

"మూర్ధానందివో" ఇత్యాది మంత్రముతో ఉసిరికాయతో కూడిన జలముచేతను, "మానస్తోకే" ఇత్యాది మంత్రముతో జటామాంసికలసిన జలముచేతను, "గన్దద్వారామ్‌ " ఇత్యాది మంత్రముతో గంధమిశ్రిత జలముచేతను, "ఇంద్రమాప" ఇత్యాది మంత్రముతో ఎనుబది యొక్క పదముల వాస్తు మండపమునందుంచిన కలశలముచేతను స్నానము చేయించవలెను. స్నానానంతరము - "సమస్త లోకములను అనుగ్రిహించు భగవంతుడవైన మహావిష్ణూ! రమ్ము, రమ్ము, ఈ యజ్ఞభాగమును గ్రహింపును. మీకు నమస్కారము " అని ప్రార్థించుచు దేవేశ్వరుని ఆవాహనము చేసి, "మఞ్చామిత్వా" ఇత్యాది మంత్రము చదువుచు విష్ణు విగ్రహహస్తమునకు క్టటిన కౌతుక సూత్రమును, ఆచార్యుని చేతికి కట్టిన సూత్రమును కూడ విప్పివేయవలెను. పిమ్మట "హిరణ్మయేన" ఇత్యాది మంత్రముతో పాద్యము "అతోదేవా!" ఇత్యాది మంత్రముతో అర్ఘ్యము, "మధువాతాః" ఇత్యాది మంత్రముతో మధుపర్కము ఇచ్చి "మయిగృహ్ణామి" ఇత్యాదిమంత్రముతో ఆచమనము చేయించవలెను. పిమ్మట విద్వాంసుడు "అక్షన్నమీమదన్త" ఇత్యాది మంత్రము చదువును శ్రీమహావిష్ణువు ఆవయవములపై దూర్వలు, అక్షతుల చల్లవలెను.

కాణ్ణాన్నిర్మంథనం కుర్యాద్గన్దం గన్దవతీతిచ | ఉస్నయామీతి మాల్యంచ ఇదంవిష్ణుః పవిత్రకమ్‌. 23

బృహస్ఫతే వస్త్రయుగ్మం వేదాహమిత్యుత్తరీయకమ్‌ | మహావ్రతేన సకలాన్పుష్టం చౌషధయః క్షిపేత్‌. 24

ధూపందద్యాద్ధూరసీతి విభ్రట్సూక్తేన చాఞ్జనమ్‌| యుఞ్జ్‌ న్తీతిచ తిలకం దీర్ఘయుష్ట్వేతి మాల్యకమ్‌. 25

ఇన్ద్రచ్ఛత్రేతి%ి ఛత్రంతు ఆదర్శంతు విరాజతః | చామరం తు వికర్ణేన భూషాం రథన్తరేణచ. 26

వ్యజనం వాయుదైవత్త్యెర్ముఞ్చామి త్వేతి పుష్పకమ్‌ | వేదాద్యైః సంస్తుతింకుర్యాద్ధరేః పురుషసూక్తతః. 27

సర్వమేతత్సమం కుర్యాత్నిణ్డికాదౌహరాదికే | దేవస్యోత్థానసమయే సౌపర్ణం సూక్తముచ్చరేత్‌. 28

ఉత్తిష్ఠేతి సముత్థాప్యశయ్యాయా మణ్డ పేనయేత్‌ | శాకునేనైవ సూక్తేన దేవంబ్రహ్మరథాదినా. 29

అతోదేవేతి సూక్తేన ప్రతిమాం పిండికాం తథా | శ్రీ సూక్తేనచ సయ్యాయాం విష్ణోస్తు సకలీకృతిః. 30

మృగరాజం వృషం నాగం వ్యజనం కలశం తథా | వైజయన్తీం తతా భేరీం దీపమిత్యష్టమఙ్గలమ్‌. 31

దర్శయే దశ్వసూక్తేన పాదదేశే త్రిపాదితి | ఉఖాంపిధానకం పాత్రమిమ్బికాం దర్వికాందదేత్‌. 32

ముసలోలూఖలందద్యాచ్ఛిలాం సంమార్జనీం తథా | తథా భోజన భాణ్డాని గృహోపకరణానిచ. 33

శిరోదేశేచ నిద్రాఖ్యం వస్త్రరత్నంయుతం ఘటమ్‌ | ఖండఖాద్యైః పూరయిత్వా స్నపనస్యవిధిః స్మృతః 34

ఇత్యాది మహాపురాణ స్నపనాది విధానం నామాష్ట పఞ్చాశత్తమో7ధ్యాయః

"కాండాత్‌ " ఇత్యాది మంత్రముతో నిర్మంథనము చేసి, "గంధవతీ" ఇత్యాది మంత్రముతో గంధమును, "ఉన్నయామి" ఇత్యాది మంత్రముతో పుష్పమాలను, "ఇదం విష్ణుః " ఇత్యాది మంత్రముతో పవిత్రకమును అర్పింపవలెను. "బృహస్పతే" ఇత్యాది మంత్రముతో వస్త్ర ద్వయమును, "వేదాహ మేతమ్‌" ఇత్యాది మంత్రముతో ఉత్తరీయమును "మహావ్రతేన" ఇత్యాది మంత్రముతో పుష్పములను, ఓషధులను సమర్పింపవలెను. పిమ్మట "ధూరసి" అను మంత్రముతో ధూపము అర్పించి, 'విరాట్‌' సూక్తముతో అంజనమును, 'యజ్జన్తి' ఇత్యాది మంత్రముతో తిలకమును ఇవ్వవలెను. "దీర్ఘాయుష్ట్వాయు" అను మంత్రముతో పుష్పమాల సమర్పింపవలెను. 'ఇన్ద్రక్షత్రమభి' ఇత్యాది మంత్రముతో ఛత్రమును, 'విరాట్‌' మంత్రముతో అద్దమును, 'వికర్ణ' మంత్రముతో చామరమును, రథంతర మంత్రముతో అలంకారములను సమర్పింపవలెను. వాయుదేవతకు సంబంధించిన మంత్రములతో వింజామరను, "ముఞ్చామిత్వా" ఇత్యాది మంత్రముతో పుష్పములను సమర్పించి, ఓంకారముతో కూడిన పురుషసూక్తముతో శ్రీ హరిని స్తుతింపివలెను. ఈ వస్తువుల నన్నింటిని పిండి కాదులపైనను శివుడు మొదలగు దేవతలకును ఈ విధముగనే సమర్పింపవలెను. దేవతను పైకి ఎత్తు నపుడు సౌపర్ణ సూక్తమును పఠింపవలెను. "ప్రభోలెమ్ము" అని పలుకుచు శ్రీమహావిష్ణువును ఎత్తి శకుని సూక్తము పఠించుచు మండపము నందలి శయ్యమీదకు తీసికొని వెళ్ళవలెను. బ్రహ్మరథము మీదగాని, పల్లకీ మీదగాని తీసికొని వెళ్ళవలెను. "అతోదేవాః" అను సూక్తము పఠించుచు, "శ్రీశ్చతే లక్ష్మీశ్చ" అను మంత్రము పఠించుచు, ప్రతిమను, పిండికను శయ్యపై చేర్చవలెను. పిమ్మట మహావిష్ణువునకు నిష్కలీకరణ క్రియ చేయవలెను. సింహము, వృషభము, గజము, వ్యజనము, కలశము' పతాక, భేరి, దీపము - ఈ ఎనిమిదియు మంగళ సూచక వస్తువులు, వీటినన్నింటిని, అశ్వసూక్తము పఠించుచు భగవంతునకు చూపవలెను. 'త్రిపాత్‌' ఇత్యాది మంత్రము చదువుచు భగవంతుని చరణ ప్రాంతమునందు ఉఖ (ఒక విధమైన పాత్ర) దాని మూత, అంబిక (చిన్న బూర్లమూకుడు,) దర్వి (గరిటె) పాత్ర, రోలు, రోకలి, శిల, చీపురు, భోజన పాత్ర, ఇతర గృహ పాత్రలు ఉంచవలెను. తలవైపు వస్త్రములు, రత్నములుంచిన కలశము ఉంచవలెను. ఆ కలశమును పటికబెల్లం ముక్కలతో. నింపవలెను. దానికి 'నిద్రా' అని పేరు. ఈ విధముగ భగవంతుని శయన విధానము చెప్పబడినది.

అగ్ని మహాపురాణమునందు స్నపనాది విధానము ఏబది ఎనిమిదవ అధ్యాయము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters