Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ పఞ్చాశత్తమో7ధ్యాయః

అథదేవీప్రతిమా లక్షణమ్‌

శ్రీ భగవానువాచ:

చణ్డీవింశతిబాహుః స్యాద్బిభ్రతీ ధక్షిణౖః కరైః | శూలాసి శక్తి చక్రాణి పాశ##ఖేటాయుధాభయమ్‌. 1

డమరుం శక్తికాం వామైర్నాగపాశంచ భేటకమ్‌ | కుఠారా జ్కుశ పాశాంశ్చ ఘణ్టాధ్వజగదాస్తథా. 2

ఆదర్శముద్గరాన్‌ హసై#్తశ్చణ్డీవాదశబాహుకా | తదధో మహిషశ్ఛిన్నముర్ధ్నా పాతితమస్తకః . 3

శస్త్రోద్యతకరః క్రుద్ధస్తద్గ్రీ వాసంభవః పుమాన్‌ | శూలహస్తో వమద్రక్తీ రక్త స్రజ్మూర్ధజేక్షణః. 4

సింహేనాస్వాద్యమానస్తు పాశబద్దోగలే భృశమ్‌ | యామ్యాం ఘ్ర్యాక్రాన్త సింహాచ సవ్యాంఘ్రిర్నీచగాసురే. 5

హయగ్రీవుడు చెప్పెను: చండీదేవికి ఇరువది బుజములుండును. కుడిచేతులలో శూల-ఖడ్గ-శక్తి-చక్ర-పాశ-ఖేట-ఆయుధ, అభయ-డమరు శక్తులను, ఎడమచేతులలో నాగపాశ-ఖేటక-కుఠార-అంకుశ-పాశ-ఘంటా-ఆయుధ-గదా-దర్పణ-ముద్గరములను ధరించియుండును. చండీదేవిప్రతిమకు వదిభుజములుకూడ ఉండవచ్చును. ఆమె పాదములక్రింద తలఖిండించిన మహిషముండును. ఆ తలతెగి వేరుగా ఉండవలెను. దాని కంఠమునుండి శూలము హస్తమునందుగల పురుషుడు శస్త్రమునుఎత్తి మిక్కిలికోపముతో ముఖమునుండి రక్తము కక్కుచుండును. వాని కంఠమునందు మాల, వెండ్రుకలు, ఎఱ్ఱగానుండును, దేవీవాహనమైన సింహము దాని రక్తమునాస్వాదించుచుండును. ఆ మహిషాసురుని కంఠమున పాశమొకటి గట్టిగా బిగించియుండును. దేవి కుడికాలు సింహముపైనను, ఎడమకాలు క్రిందనున్న మహిషాసురుని పైనను ఉండును.

చణ్డికేయం త్రనేత్రీ చ సశస్త్రారిపుమర్దినీ | నవపద్మాత్మకే స్థానే పూజ్యాదుర్గా స్వమూర్తితః . 6

అదౌమధ్యే నవేన్ద్రాద్యా నవతత్త్వాత్మభిః క్రమాత్‌ | అష్టాదశభుజైకాతు దక్షేమణ్డంచ భేటకమ్‌. 7

ఆధర్శం తర్జనీం చాపం ధ్వజం డమరుకం తథా | పాశం వామేబిభ్రతీచ శక్తిముద్గర శూలకమ్‌. 8

వజ్రఖడ్గాజ్కశశరాన్‌ చక్రం దేవీ శలాకయా | ఏతైరేవాయుధైర్యుక్తాః శేషాః షోడశబాహుకాః. 9

డమరుం తర్జనీం త్యక్త్యా రుద్ర చణ్డాదయోనవ | రుద్రచణ్డా ప్రచణ్డాచ చణ్డోగ్రా చణ్డనాయికా. 10

చణ్డాచణ్డవతీ చైవ చణ్డరూపాతి చణ్డికా | ఉగ్రచాణ్డాచ మద్యాస్థా రోచనాభారుణాసితా. 11

నీలాశుక్లా ధూమ్రికాచ పీతా శ్వేతాచ సింహగా | మహిషో7థపుమాఞ్ఛస్త్రీ తత్కచగ్రహముష్టికా. 12

ఈ చండీదేవికి మూడు నేత్రములుండును. ఈమె అనేక శస్త్రములను ధరించి శత్రువులను మర్దించునది. తొమ్మిది పద్మముల రూపమున నున్న పీఠముపై దుర్గాప్రతిమపై ఈమెను పూజింపవలెను. మొదటి కమలము తొమ్మిది దళములందును, మధ్యననున్న కర్ణికయందును ఇంద్రాది దిక్పాలులను, నవతత్త్వాత్మి కలగు శక్తులతో దుర్గాదేవిని పూజింపవలెను. దుర్గాదేవి ప్రతిమకు పదునెనిమిది భుజములుండును. కుడువైపున నున్న హస్తములలో ముండ-ఖేటక-దర్పణ-తర్జనీ-ధనుష్‌-ధ్వజ-డమరు, చర్మ-పాశములను, వామభాగమున నున్న హస్తములలో శక్తి-ముద్దర-శూల-వజ్ర-ఖడ్గ-కుంకుశ-భాణ-చక్ర-శలాకలను ధరించి యుండును. పదునారు భుజముల దుర్గాప్రతిమకు కూడ డమరువు, తర్జని తప్ప ఈ ఆయుధములే ఉండును. రుద్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, అతిచండిక అనువారు ఎనమండుగురు దుర్గలు. ఈ దుర్గలను తూర్పు మొదలు ఎనిమిది దిక్కులందును స్థాపించి పూజింపవలెను. ఉగ్రచండ యను తొమ్మిదవ దుర్గను మధ్య భాగమున స్థాపించి పూజింపవలెను. రుద్రచండ మొదలగు ఎనమండుగురు దుర్గల దేహకాంతి వరుసగ గోరోచనాసదృశముగను, అరుణముగను, నల్లగను, నీలముగను, తెల్లగను, ధూమ్రముగను, పచ్చగను, తెల్లగను ఉండును. వీరందరును సింహవాహనులై మహిషాసురుని కంఠము నుండి ఆవిర్భవించిన పురుషుడు శస్త్ర ధారియై యుండును. ఈ దుర్గాదేవులు వాని జుట్టు, తమ చేతులతో పట్టుకొని యందురు.

ఆలీఢా నవదుర్గాఃస్యుః స్థాప్యాః పుత్రాదివృద్ధయే | తథాగౌరీ చణ్డీ కాద్యా కుణ్డక్షరరదాగ్నిధృక్‌. 13

సైవ రమ్భావనే సిద్ధాగ్ని హీనాలలితా తథా | స్కన్దమూర్దకరా వామే ద్వితీయే ధృతదర్పణా. 14

యామ్యే ఫలాజ్గులిహస్తా సౌభాగ్య తత్ర చోర్ద్వికా | లక్ష్మీర్యా మ్యకరామ్భోజా వామే శ్రీఫలసంయుతా. 15

పుస్తాక్షమాలికగాహస్తా వీణా హస్త సరస్వతీ | కుమ్భాబ్జహస్తా శ్వేతాభా మకరోపరి జాహ్నవీ. 16

కూర్మగాయమునా కుమ్భకరా శ్యామాచ పుజ్యాతే | సవీణస్తుమ్బురుః శుక్లః శూలీమాత్రగ్రతోవృషే. 17

గౌరీచతుర్ముఖీ బ్రాహ్మీ అక్షమాలా సురాన్వితా | కుణ్డాక్ష పాత్రిణీ వామే హంసగా శాఙ్కరీ సితా. 18

శరచక్రీ దక్షిణ7స్యావామే చక్రం ధనుర్వృషౌ | కౌమారీ శిఖిగారక్తా శక్తిహస్తాద్విబాహుకా. 19

శఙ్ఖచక్రధరాసవ్యే వామే లక్ష్మీర్గదాబ్జధృక్‌ | దణ్డశఙ్ఖౌసిగదయా వారాహీ మహిషస్థితా. 20

ఐన్ద్రీ గజే వజ్రహస్తా సహస్రాక్షీతు సిద్దయే | చాముణ్డా కోటరాక్షీస్యాన్నిర్మాంసాతుత్రిలోచనా. 21

నిర్మాంసా అస్థిసారావా ఊర్ద్వకేశీ కృశోదరీ | ద్వీపిచర్మధరావామే కపాలం పట్టిశం కరే. 22

శూలం కర్త్రీ దక్షిణ7స్యాః శవారూఢాస్థి భూషణా |

ఈ నవదుర్గలును ఆలీఢమున (కుడికాలు వెనుకకు తన్నిపెట్టి ఎడమకాలు ముందుకు వంచి నిలబడుటకు ఆలీఢమని పేరు) ఈ నవ దుర్గలను స్థాపించి పూజించినచో పుత్రపౌత్రాభివృద్ధి కలుగును చండికాది రూపములో పూజింపబడునది గౌరియే. హస్తములో కుండి, అక్షమాల, గద, అగ్ని ధరించినచో ఆమెకే ''రంభ'' అని పేరు. వనము నందు ఆమెకే ''సిద్ధ'' యని పేరు. సిద్ధావస్థలో ఆమె వద్ద అగ్ని ఉండదు. ''లలిత'' కూడ గౌరియే. ఆమె స్వరూపమిట్లుండును- ఒక ఎడమచేతిలో కంఠసహితమైన ముండము (భిన్న శిరస్సు), రెండవచేతిలో దర్పణము, క్రింది కుడిచేతిలో ఫలాంజలి, పైచేతిలో సౌభాగ్యముద్ర ఉండును. లక్ష్మి కుడిచేతిలో కమలము. ఎడమచేతిలో మారేడు పండు ఉండును. సరస్వతి రెండు చేతులలో పుస్తకము, అక్షమాల ఉండును. మిగిలిన రెండు చేతులలో వీణ ఉండును. గంగాదేవి తెల్లని దేహచ్ఛాయతే మకరారూఢయై ఒక హస్తము కలశమును, మరియొక హస్తమున కమలమును ధరించి యుండును. యుమునాదేవి శ్యామవర్ణ. రెండు హస్తములందును కలశములు ధరించి తాబేలుపై నిలచి యుండును. తుంబురని ప్రతిమ వీణా సహితముగా నుండవలెను. అతని శరీరకాంతి తెల్లగా నుండును. శంకరుడు శూలపాణియై, వృషభము నెక్కి మాతృకలముందు వెళ్ళచుండును. బ్రహ్మపత్నియైన సావిత్రి గౌరవర్ణముగలది. నాలుగు ముఖములుండును. కుడి చేతులలో అక్షమాల, స్రుక్కు ఉండును. ఎడమ చేతులలో కుండము, అక్షపాత్ర ఉండును, వాహనము హంస శంకరుని పత్నియగు పార్వతి వృషభారూఢయై కుడిచేతులలో ధనుర్బాణములను, ఎడమ చేతులలో చక్ర-ధనస్సులను ధరించి యుండును. ఎఱ్ఱని కాంతి గల కౌమరీ శక్తి నెమలిపై ఎక్కి, రెండు చేతులందును శక్త్యా యుధములను ధరించి యుండును. లక్ష్మి (వైష్ణవీ శక్తి) కుడిచేతులలో చక్ర-శంఖములను, ఎడమ చేతులలో గదా కమలములను ధరించును. వారాహీ శక్తి మహిషముపై ఎక్కి దండ-శంఖ-చక్ర-గదలను ధరించును. ఐంద్రీశక్తి సహస్ర నేత్రములు గలది. ఐరావతముపై ఎక్కి వజ్రము ధరించి యుండును. ఐంద్రీదేవీ పూజ వలన కార్యసిద్ధి లభించును. చాముండ కండ్లు చెట్టు తొఱ్ఱలవలె లోతుగా ఉండును. శరీరము మాంసరహితమై అస్థి పంజరమువలె నుండును. నేత్రములు మూడు. మాంసహీనమగు శరీరమునందు ఆస్థులు మాత్రమే సారముగ మిగిలియుండును జుట్టుపైకి లేచి ఉండును. అణగి ఉండదు. ఏనుగు చర్మమును ధరించును. ఎడమ చేతులలో కపాలము, పట్టిశము, కుడిచేతులలో శూలము, ఖడ్గము ఉండును శవముపై ఎక్కి ఎముకల ఆభరణములు ధరించును.

వినాయకో నరాకారో బృహత్కుక్షిర్గజాననః. 23

బృహచ్ఛుణ్డో హ్యుపవీతీ ముఖం సప్తకలం భ##వేత్‌ | విస్తారా ధ్దైర్ఘ్యతశ్త్చెవ శుణ్డం షట్త్రింశదజ్గులమ్‌. 24

కలాద్వాదశనాడీ తు గ్రీవా సార్థకలోచ్ఛ్రితా | షట్త్రింశదజ్గులం కణ్ఠం గుహ్యమధ్యర్దమజ్గులమ్‌. 25

నాభిరూరూ ద్వాదశంచ జజ్ఘేపాదేతుదక్షిణ | స్వదన్తం పరశుం వామే లడ్డుకంచోత్పలం శ##యే. 26

సుముఖీచ బిడాలాక్షీ పార్శ్వే స్కన్దో మయూరగః | స్వామీ శాఖో విశాఖశ్చ ద్విభూజో బాలరూపధృక్‌. 27

దక్షేశక్తిః కుక్కుటే7థ ఏకవక్త్రో7థషణ్ముఖః | షడ్భుజోవాద్వాదశభిర్గ్రామే7రణ్య ద్విబాహుకః . 28

శక్తీషు పాశనిస్త్రింశలోత్రదోస్తర్జనీయుతః | శక్త్యాదక్షిణహస్తేషు షట్సువామేకరేతథా. 29

శిఖిపచ్ఛం ధనుః ఖేటం పతాకాభయ కుక్కుటే | కపాల కర్తరీ శూల పాశభృద్యామ్య సౌమ్యయోః 30

వినాయకుని ఆకారము మనుష్యా కారసకదృశముగా నుండును. పొట్ట చాల పెద్దది. ముఖము ఏనుగల ముఖము; తొండము చాల పొడవుగా నుండును. యజ్ఞోపవీతము ధరించి యుండును. ముఖము వెడల్పు ఏడుకళలు. తొండము పొడవు ముప్పదియారు అంగుళములు నాడి (కంఠముపై నున్న ఎముక) విస్తారము పండ్రెండు కళలు, మెడ ఒకటిన్నర కళల ఎత్తు ఉండును. కంఠప్రదేశము విస్తారము ముప్పదియారు. అంగుళములు. గుహ్య ప్రదేశము ఒకటిన్నర అంగుళములు. నాభి-ఊరుపుల విస్తారము పండ్రెండు అంగుళములు. కాళ్లు, పాదాల ప్రమాణము కూడ ఇంతయే. కుడి చేతులలో తన దంతమును, పరుశువును. ఎడమచేతులలో లడ్డు, నల్లకలువ ధరించి యుండును.

మయూరారూఢడై ఉన్న కుమారస్వామికి ఇరువైపుల సుముఖీ, బిడాలాక్షి అనుమాతృకలును, శాఖ-విశాఖులను అనుజులనును నిలచి యుందురు. రెండు హస్తములు, బాలరూపము, కుడిచేతిలో శక్తి, ఎడమ చేతిలో కోడి ఉండును. ముఖములు ఒకటి కాని, ఆరుకాని నిర్మింపవచ్చును. గ్రామములోని విగ్రహమునకు ఆరు లేదా పండ్రెండు హస్తములుండవలెను. వనము నందు స్థాపించు విగ్రహమున మాత్రము రెండు భుజములే ఉండవలెన. ఆరు కుడి భుజములలో శక్తి బాణ-పాశ-ఖడ్గ-గదా-తర్జనీ ముద్రలును, ఎడమ చేతులలో నెమలి పింఛము, ధనస్సు, ఖేటము, పతాక, అభయముద్ర, కుక్కటము ఉండవలెను. రుద్రచర్చిక గజచర్మధరించి ఎడమ చేతిలో కాపాలము, కర్తరి ధరించి, కుడి చేతిలో శూల-పాశములను ధరించి, ముఖమును. ఒక పాదమును ఎత్తి ఉండును. ఈ దేవి అష్ట భూజారూపమున గూడ పూజింపబడును.

గజచర్మభృదూర్ద్వాస్యపాదాస్యాద్రుద్రచర్చికా | సైవచాష్టభూజాదేవీ శిరోడమరుకాన్వితా. 31

తేనసారుద్రచాముణ్డా నాట్యేశ్వర్యథ నృత్యతీ | ఇయమేవ మహాలక్ష్మీ రుపవిష్టా చతుర్ముఖీ. 32

నృవాజిమహిషేభాంశ్చ ఖాదన్తీ చ కరే స్థితాన్‌ | దశబాహుస్త్రినేత్రాచ శస్త్రాసి డమరుత్రికమ్‌. 33

బిభ్రతీ దక్షిణహస్తకే వామే ఘణ్టాంచ ఖేటకమ్‌ | ఖట్వాఙ్గం చ త్రిశూలంచ సిద్దచాముణ్డికాహ్వయా. 34

సిద్దయోగీశ్వరీదేవీ సర్వసిద్ధి ప్రదాయికా | ఏ తద్రూపాభ##వేదన్యా పాశాఙ్కుశయుతారుణా. 35

ఖైరవీ రూప విద్యాతు భూజైర్ద్వాదశభిర్యుతా | ఏతాః శ్మశానజా రౌద్రా అమ్బాష్టకమిదం స్మృతమ్‌. 36

క్షమాశిరావృతా వృద్ధా ధ్విభుజా వివృతాననా | దన్తురా క్షేమకారీస్యాద్భుమాజానుకరాస్థితా. 37

యక్షిణ్యఃస్తబ్ధదీర్ఘాక్ష్యః శాకిన్యో వక్రదృష్టయః | పిఙ్గాక్ష్య!సుర్యహారమ్యా రూపిణ్యో7ప్సరసఃసదా. 38

సాక్షమాలీ త్రిశూలీచ నన్దీశోద్వారపాలకః | మహాకాలోసి ముణ్ఢీస్యాచ్ఛూలఖేటకవాస్తథా. 39

కృశోభృఙ్గీ చ నృత్యన్త్వె కూష్మాణ్డస్థూలఖర్వవాన్‌ | గజగోకర్ణవక్త్రాద్యా వీరభద్రాదయోగణాః 40

ఘణ్టాకర్ణో7ష్టదశథోపాపరోగం విదారయన్‌ | వజ్రాసిదణ్డచక్రేషు ముసలాజ్కుశముద్గరాన్‌. 41

దక్షిణ తర్జనీం ఖేటం శక్తిం ముణ్డంచ పాశకమ్‌ | చాపం ఘణ్టాం కుఠారంచ ద్వాఖ్యాంచైవత్రిశూలకమ్‌.

ఘణ్టామాలాకులోదేవో విస్ఫోటక విమర్దనః |

ఇత్యాది మహాపురాణ అగ్నేయే దేవీ ప్రతిమాలక్షణం నామ పఞ్చాశత్తమో7ధ్యాయః.

మండమాలను డమరువును ధరించినపుడు ఆమెయే 'రుద్రచాముండ'అని చెప్పబడును. ఆమె నాట్యము చేయును. అందుచే 'నట్యేశ్వరి' అని కూడ ఈమెకు పేరు, ఈమె నాలుగు ముఖములతో ఆసనముపై కూర్చున్నప్పుడు ''చతుర్ముఖీ మహాలక్ష్మీ'' (మహాలక్ష్మి యొక్క తామస మూర్తి) అని చెప్పబడును. ఈమె తన చేతులలో నున్న నరులను గుఱ్ఱములను, దున్నలను, ఏనుగులను తినుచుండును. సిద్ధ చాముండకు పది భుజడములు, మూడు నేత్రములు ఉండును. కుడి చేతులలో శస్త్రమును, ఖడ్గమును, మూడు డమరువులను ధరించును, ఎడమ చేతులలో గంట, ఖేటకము, మంచపుకోడు, త్రిశూలము, (డాలు) ధరించి యుండును. సిద్ధ యోగీశ్వరీ దేవి సంపూర్ణ సిద్ధినిచ్చును. ఈదేవికి స్వరూపమైన మరియొక సక్తి యున్నధి, ఈమె శరీరకాంతి ఎఱ్ఱగా నుండును. పాశాంకుశములను ధరించిన ఈమెకు 'ఖైరవి' అని పేరు. రూప విద్యాదేవికి పండ్రెండు భుజములుండును. ఈ దేవులందరును శ్మశానములో ఆవిర్భవింతురు. భయంకరముగ నుందురు, ఈ ఎనమండుగురు దేవులకును (రుద్ర, చండ, అష్టభుజ లేతా రుద్ర చాముండ, సిద్దయోగీశ్వరి భైరవి, రూపవిద్య) ''అంబాష్టకము'' అని పేరు. క్షమాదేవి చుట్టు ఆడ నక్కలుండును. వృద్ధ స్త్రీరూపములో నున్న ఆమెకు రెండు హస్తములుండును. నోరు తెరచి ఉండును, పండ్లు ఎత్తుగా ఉండును, మోకాళ్లు చేయి ఆనుకొని భూమిపై కూర్చుండును. ఈమె ఉపాసకులకు కల్యాణప్రదాయిని, యక్షిణిలు కండ్లు తెరచికొని (మూయకుండ చూచుచు) ఉందురు. అప్సరసలు సర్వదా సౌందర్యవతులు, వీళ్ళ కండ్లు పచ్చగా ఉండును.

నందీశ్వరునకు ఒక చేతిలో అక్షమాల, రెండవ చేతిలో త్రిశూలము ఉండును. మహాకాలుని చేతిలో కత్తి, రెండవ చేతిలో ఖండితమైన సిరస్సు, మూడవ చేతిలో శూలము, నాల్గవ చేతిలో ఖేడము ఉండవలెను. కృశ##మైన శరీరము గల భృంగి నృత్యముద్రలో నుండును. ఈతని శిరస్సు కూష్మాండమువలె స్థూలమై బట్టతలయై ఉండును. వీరభద్రడు మొదలగు గణములకు ఏనుగులు, గోవుల వంటి చెవులు ముఖములు ఉండును. ఘంటాకర్ణునకు పదునెనిమిది భుజములుండును. అతడు పాపములను, రోగములను నశింపచేయును. ఎడమ ప్రక్కన నున్న ఎనిమిది చేతులలో వజ్ర-ఖడ్గ-దండ-చక్ర-బాణ-ముసల-అంకుశ-ముద్గరములను, కుడి ప్రక్కనున్న ఎనిమిది చేతులలో తర్జనీ-ఖేట-శక్తి-ముండ-పాశ-ధనుస్‌-ఘంటా-కుఠారములను ధరించును. మిగిలిన రెండు చేతులతో త్రిశూలమును పట్టుకొని యుండును. ఘంటామాలచే అలంకృతుడగు ఘంటా కర్ణుడు విస్ఫోటకమును నివారించును.

అగ్నేయ మహాపురాణమునందు దేవీ ప్రతిమాలక్షణమను ఏబదియవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters