Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథసప్తచత్వారింశో7ధ్యాయః

అథ శాలగ్రామా77ది పూజాకథనమ్‌

శ్రీ భగవానువాచ:

శాలగ్రామాది చక్కఙ్కపూజాః సిద్ద్యై వదామితే | త్రివిధః స్యాద్దరేఃపూజా కామ్యాకామ్యో భయాత్మికా. 1

మీనాదీనాంతుపఞ్చానాం కమ్యార్థావోభయాత్మికా | వరాహస్య నృసింహస్య వామనస్య చ ముక్తకమ్‌ . 2

చక్రాదీనాం త్రయానాంతు శాలగ్రామార్చనం శృణు | ఉత్తమా నిష్పలా పూజా కనిష్ఠా సఫలార్చనా. 3

మధ్యమామూ ర్తిపూజాస్యాచ్చక్రాబ్జే చతురస్రకే | ప్రణవం హృది విన్యస్య షడఙ్గం కరదేహమోః. 4

కృతముద్రాత్రయశ్చక్రాద్బహిః పూర్వేగురుం యజేత్‌ | ఆప్యేగణం వాయవ్యే ధాతారం నైరృతే యజేత్‌. 5

విధాతారం చకర్తారం హర్తారం దక్ష సౌమ్యయోః | విష్వక్సేనం యజేదీశ అగ్నేయే క్షేత్రపాలకమ్‌. 6

ఋగాదివేదాన్‌ ప్రాగాదావాధారనన్తకం భువమ్‌. | పీఠం పద్మం చార్కచన్ద్రమహ్న్యాఖ్యం మణ్డలత్రయమ్‌. 7

ఆసనంద్వాదశ##ర్ణేన తత్రస్థాప్య శిలాం యజేత్‌ | వ్యస్తేన చ సమస్తేన స్వబీజేన యజ్రేత్క్రమాల్‌. 8

పూర్వాదావథ వేదాద్యైర్గాయత్రీభ్యాం జితాదినా | ప్రణవేనార్చ యేత్పశ్చాన్ముద్రాస్తిస్రః ప్రదర్శయేత్‌. 9

విష్వక్సేనసయ చక్రస్య క్షేత్రపాలస్య దర్శయేత్‌ |

హయగ్రీవుడు చెప్పెను: ఇపుడు చక్రాంకిత శాలగ్రామముల పూజావిధానమును చెప్పచున్నాను. ఇది సిద్ధిప్రదమైనది. శ్రీహరి పూజ కామ్య, అకామ్య, కామ్యాకమ్య అని మూడు విధములు. మత్స్యాది పంచ విగ్రహముల పూజ కామ్యముగాని, ఉభయాత్మికగాని కావచ్చును. వెనుక చెప్పిన చక్రములతో ప్రకాశించు వారాహ-వామన-నృసింహుల పూజను ముక్తికొరకు చేయవలెను, ఇపుడు మూడు విధములైన శాలగ్రామ పూజను గూర్చి వినుము. వీటిలో నిష్పల పూజ ఉత్తమము: సఫలపూజ కనిష్ఠము; మూర్తిపూజ మద్యమము, చతురస్ర మండపముపైనున్న కమలమునందు పూజా విధి ఈ విధముగ ఉండును- హృదయమునందు ప్రణవన్యాసము చేయుచు షడంగన్యాసము చేయవలెను. పిమ్మట కరన్యాసము, వ్యాపకాన్యసము చేసి మూడు ముద్రలను చూపవలెను పిమ్మట చక్రమునకు బైట, తూర్పున గురువును పూజించవలెను. పశ్చిమమున గణమును, వాయవ్యమున ధాతను, నైరృతి యందు విధాతను పూజింపవలెను. దక్షిణోత్తరములయందు వరుసగా కర్తను, హర్తను పూజింపవలెను. ఈశాన్యమున విష్వక్సేనుని, అగ్నేయమున క్షేత్రపాలుని పూజింపవలెను. పిమ్మట పూర్వాది దిక్కలందు ఋగ్వేదాది వేదచతుష్టయమును పూజించి, అధారశక్తిని, అనంతుని, పృథివిని, యోగపీఠమును పద్మమును, సూర్యమండలమును, చంద్రమండలమును, బ్రహ్మాత్మక వహ్నిమండలమును పూజించి, ద్వాదశాక్షరిచే అసనముపై శిలాస్థాపనముచేసి పూజింపవలెను. పిదప మూల మంత్రమును విభజించియు, సంపూర్ణ మంత్రముచేతను క్రమపూర్వకముగా పూజింపవలెను. పిదప ప్రణవముచే పూజించి మూడు ముద్రలు చూపవలెను. నిష్వక్సేన - చక్ర- క్షేత్రపాలుల ముద్రలు చూపవలెను.

శాలగ్రామస్య ప్రథమాపూజాథో నిష్ఫలోచ్యతే. 10

పూర్వవత్షోడశారం చ సపద్మం మణ్డలం లిఖేత్‌ | శజ్ఖచక్రగదాఖకడ్గెర్గుర్వాద్యం పూర్వవద్యజేత్‌. 11

పూర్వే సౌమ్యేధనుర్బాణాన్‌ వేదాద్యైరాసనందదేత్‌ | శిలాం న్యసేద్ద్వాదశ##ర్ణెస్తృతీయం పూజనం శృణు. 12

అష్టారమబ్జం విలిఖేద్గుర్వాద్యం పూర్వవద్యజేత్‌ | అష్టార్ణేనాసనం దత్వా తేనైవచ శిలాం న్యసేత్‌. 13

పూజయేద్దశధా తేన గాయత్రిభ్యాం జితం తథా |

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే శాలగ్రామపూజాకథనం నామసప్తచతారింశో7ధ్యాయః

ఇంతవరకును చెప్పినది శాలగ్రామ మధ్యమ పూజ. ఇపుడు నిష్పలపూజ చెప్పబడుచున్నది. వెనుకటి వలెనే షోడశదలకమలముతో కూడిన మండలము చేయవలెను. దానిపై శంఖ-చక్ర-గదా-ఖడ్గములను, గురువు మొదలగువారిని వెనుక చెప్పినట్లుగనే పూజింపవలెను. పూర్వోత్తర దిశలయందు వరుసగా ధనుర్బాణములను పూజింపవలెను. ప్రణవముచే అసనము సమర్పించి, ద్వాదశాక్షరిచే శిలాన్యాసము చేయవలెను. ఇపుడు మూడవదైన కనిష్ఠ పూజను (సఫలపూజన) చెప్పుచున్నాను, వినుము. అష్టదల కమలముపై వెనుకటివలె గుర్వాదిపూజ చేయవలెను. పిదప అష్టాక్షర మంత్రముచే అసనము సమర్సించి, ఆ మంత్రముచేతను, శిలను స్థాపించవలెను.

అగ్ని మహాపురాణమునందు శాలగ్రామ పూజాకథనమను నలుబది ఏడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters