Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ త్రయస్త్రింశోధ్యాయః

అథ పవిత్రారోపణ విధానమ్‌

అగ్ని రువాచ

పవిత్రారోపణం వక్ష్యే వర్షపూజాఫలం హరేః | ఆషాఢాదౌ కార్తికాన్తే ప్రతిప త్త్యజ్యతే తిథిః. 1

శ్రియా గౌర్యా గణశస్య సరస్వత్యా గుహస్య చ | మార్తణ్డమాతృదుర్గాణాం నాగర్షిహరిమన్మథైః. 2

శివస్య బ్రహ్మణస్తద్వద్ద్వితీయాదితిథేః క్రమాత్‌ | యస్య దేవస్య యో భక్తః పవిత్రా తస్య సా తిథిః. 3

అగ్నిదేవుడు పలికెను : మునీ! ఇపుడు నేను పవిత్రారోపణమను గూర్చి చెప్పెదను. సంత్సరమునందు ఒక మారు పవిత్రారోపణము చేసినచో, సంవత్సర మంతయు శ్రీహరి పూజ చేసిన ఫలము నిచ్చును. ఆషాఢశుక్ల ఏకాదశి మొదలు కార్తిక శుక్లైకాదశి వరకు నున్న కాలమున పవిత్రారోపణము చేయవలెను. ప్రతిపత్తు విడువవలెను. ద్వితీయాదితిథులు క్రమముగ లక్ష్మాదిదేవతల తిథులు. ద్వితీయ లక్ష్మికి, తృతీయ గౌరికి, చతుర్థి గణశునికి, పంచమి సరస్వతికి, షష్ఠి కుమారస్వమికి, సప్తమి సూర్యునకు, అష్టమి మాతృదేతలకు, నవమి దుర్గకు, దశమి నాగులకు, ఏకాదశి ఋషులకు, ద్వాదశి విష్ణువునకు, త్రయోదశి మన్మథునకు, చతుర్దశి శివునకు, పౌర్ణమాస్యవాస్యలు బ్రహ్మకు సంబంధించినవి. ఏ ఉపాసకుడు ఏ దేవతను ఉపాసించునో ఆతనికి ఆ దేవతయొక్క తిథి పవిత్ర మైనది.

ఆరోహణ తుల్యవిధిః పృథఙ్‌ మన్త్రాదికం యది | సౌవర్ణం రాజతం తామ్రం నేత్రకార్పాసకాదికమ్‌. 4

పవిత్రారోపణవిధి అందరు దేవతలకును సమానమే. మంత్రాదులు మాత్రమే ఆయా దేవతలకు వేరు వేరుగా నుండును. పవిత్రకమును నిర్మించుటకై బంగారము, వెండి రాగి తీగలను నూలు దారముగాని ఉపమోగింపవలెను.

బ్రాహ్మణ్యా కర్తితం సూత్రం తదలాభే తు సంస్కృతమ్‌ |

ద్విగుణం త్రిగుణీకృత్య తేన కుర్యాత్‌ పవిత్రకమ్‌. 5

అష్టోత్తరశతాదూర్ధ్వం తదర్ధం చోత్తమాదికమ్‌ | క్రియాలోపవిఘాతార్థం యత్త్వయాభిహితం ప్రభో. 6

మయా తత్ర్కియతే దేవ యథా యత్ర పవిత్రకమ్‌ | అవిఘ్నం తు భ##వేదత్ర కురు నాథ జయావ్యయ. 7

బ్రాహ్మణస్త్రీచేతితో వడికిన నూలు చాల శ్రేష్ఠమైనది. అది లభించనిచో ఏ దారము నైనను గ్రహించి, దానిని సంస్కరించి, ఉపమోగింపవలెను. దారమును మూడుపేటలు చేసి, మరల దానిని మూడు పేటలు చేసి, దానితో పవిత్రకమును నిర్మింపవలెను. నూట ఎనిమిది మొదలు అధికము లగు తంతువులతో నిర్మించిన పవిత్రకము ఉత్తమాదిశ్రేణికి చెందినదిగ పరిగణింపబడుచున్నది. పవిత్రరోపణమునకు ముందు ఇష్టదేవతను గూర్చి ఈ విధముగ ప్రార్థింపవలెను. ''ప్రభూ! క్రియాలోపమువలన కలిగిన దోషమును తొలగించుటకై నీవు ఏ సాధమును చెప్పినావో దానినే నేను చేయుచున్నాను. ఎక్కడ ఏ పవిత్రకము ఆవశ్యకమో అక్కడ అట్టి పవిత్రకమునే అర్పించగలను. నీ కృపచే ఈ కార్యమునందు విఘ్నబాధ లేవియు కలుగకుండుగాక. అవినాశి యైన పరమేశ్వరా! నీకు జయ మగుగాక.

ప్రార్థ్యతన్మణ్డలాయాదౌ గాయత్ర్యా బన్ధయేన్నరః | ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. 8

తన్నో విష్ణుః ప్రచోదయాద్దేవదేవానురూపతః | జానూరునాభినాసాన్తం ప్రతిమాసు పవిత్రకమ్‌. ప9

పాదాన్తా వనమాలా స్యాదష్టోత్తర సహస్రతః | మాలాం తు కల్పసాధ్యాం వా ద్విగుణాం షోడశాఙ్గులామ్‌. 10

కర్ణికా కేసరం పత్రం మన్త్రాద్యం మణ్డలాన్తకమ్‌ | మణ్డలాఙ్గులమాత్రైక చక్రాబ్జాదౌ పవిత్రకమ్‌. 11

స్థణ్డిలే7ఙ్గులమానేన ఆత్మనః సప్తవింశతిః |

ఈ విధముగ ప్రార్థించు పవిత్రకమును ఇష్టదేవతామండలమునకు గాయత్రీమంత్రముతో కట్టవలెను. ''ఓం నమో నారాయణాయ విద్మహే, వాసుదేవాయ దీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్‌'' అనునది ఇష్టదేవత యగు నారాయణుని గాయత్రీమంత్రము. ఈ గాయత్రీ ఇష్టదేవతానామానుసారముగ ఉండును. దేవప్రతిమలపై అర్పించుటకు అనేకవిధములగు పవిత్రకము లుండును. విగ్రహముయొక్క నాభివరకు వచ్చునది ఒకటి; తొడలవరకు వచ్చునది మరి యొకటి మోకాళ్ళవరకు వచ్చునది మరియొకటి. పాదములవరకు వ్రేలాడునది ఒకటి. చివరిదానికి వనమాల అని పేరు. దానిని ఒక వెయ్యి ఎనిమిది దారములతో నిర్మింపవలెను. సాధారణమాలను శక్త్యనుసారము నిర్మింపవలెను. లేదా అది పదునారు అంగుళములకంటె రెట్టింపు పెద్దదిగా ఉండవలెను. కర్ణికా-కేసర-దళాదులుగల యంత్ర-చక్రదిమండలములపై వేయు పవిత్రకము పైనుండి క్రిందివరకును కప్పునదిగా ఉండవలెను. ఒక చక్రము, ఒక కమలము ఉన్న మంక్షలముపై ఆ మండలము ఎన్ని అంగుళము లున్నదో అన్ని అంగుళముల పవిత్రకము అర్పింపవలెను. వేదిపై అర్పించు పవిత్రకము తన చేతి అంగుళములతో ముప్పదియేడు అంగుళముల పొడ వుండవలెను.

ఆచార్యాణాం చ సూత్రాణి పితృమాత్రాదిపుస్తకే. 12

నాభ్యన్తం ద్వాదశగ్రన్థిం తథా గన్ధపవిత్రకే | అఙ్గలాత్కల్పనాదౌద్విర్మాలా చాష్టోత్తరం శతమ్‌. 13

అథవార్కచతుర్వింశషట్త్రింశన్మాలికా ద్విజ | అనామామధ్యమాఙ్గుష్ఠైర్మన్దాద్యైర్మాలికార్థిభిః. 14

కనిష్ఠాదౌ ద్వాదశ వా గ్రన్థయః స్యుః పవిత్రకే | రవేః కుమ్భహుతాశాదేః సమ్భవీ విష్ణువన్మతమ్‌. 15

పీఠస్య పీఠమానం స్యాన్మేఖలాన్తే చ కుణ్డకే | యథాశక్త సూత్రగ్రన్థిః పరిచారే7థ వైష్ణవే. 16

సూత్రాణి వా సప్తదశ సూత్రేణ త్రివిభక్త కౌ |

ఆచార్యునికొరకును, తలిదండ్రులకొరకును, పుస్తకముపై ఉంచుటకొరకును నిర్మింపబుడు పవిత్రకమునాభిప్రదేశమువరకును వ్రేలాడవలెను. దీనికి పండ్రెండు ముడులు ఉండవలెను. దానిపై మంచి గంధము పూయవలెను. వనమాలయందు రెండేసి అంగుళములదూరమున క్రమముగా నూటఎనిమిది ముడులు వేయవలెను. లేదా కనిష్ఠ-మధ్యదు-ఉత్తమపత్రకములపై క్రమముగా పండ్రెండు, ఇరువదినాలుగు, ముప్పదియారుముడులు వేయవలెను. మంద-మధ్యమ-ఉత్తమమాలార్థు లగ పురుషులు అనామికా-మధ్యమా-అంగుష్ఠములచేతనే పవిత్రకములను గ్రహింపవలెను. లేదా కనిష్ఠకాది నామధేయములు గల పవిత్రకములందు అన్నింటియందును పండ్రెండేసి ముడులే ఉండవలెను. (తంతువుల సంఖ్యను పట్టియు, పొడవును పట్టియు ఈ కనిష్ఠికాదినామదేయము లేర్పడినవి). సూర్యునకు, కలశమునకు, అగ్ని మొదలగు వాటికిని గూడ యథాసంభవముగ భగవంతు డగు విష్ణువునకు వలెనే పవిత్రకములను అర్పించుట ఉత్తమ మని చెప్పబడినది. పీఠముకొరకు దాని పొడవును పట్టియు, కుండమునకు దాని మేఖలపర్యంతమును పొడవు గల పవిత్రకముండవలెను. విష్ణుపార్షదులకు యథాశక్తిగ సూత్రగ్రంథులను సమర్పింపవలెను. లేదా గ్రంథులు లేకుండ పదునేడు సూత్రములు సమర్పింపవలెను. భద్రుడను పార్షదునకు త్రిసూత్రము సమర్పింపవలెను.

ఏకాదశ్యాం యాగగృహే భగవన్తం హరిం యజేత్‌. 18

సమస్తపరివారాయ బలిం పీఠే సమర్చయేత్‌ | క్షౌం క్షేత్రపాలాయ ద్వారాన్తే ద్వారోపరి శ్రియమ్‌. 19

ధాత్రే దక్షే విధాత్రే చ గఙ్గాం చ యమునాం తథా | శఙ్ఖపర్మనిధీ పూజ్య మధ్యే వాస్త్వపసారణమ్‌. 20

సారఙ్గాయేతి భూతానాం భూతశుద్ధిం స్థితశ్చరేత్‌ |

ఓం హూం హః ఫట్‌ హ్రూం గన్ధతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రరూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

పఞ్చోద్ఘాతైర్గన్థతన్మాత్రస్వరూపం భూమిమణ్డలమ్‌ |

చతురస్రం చ పీతం చ కఠినం వజ్రలాఙ్ఛితమ్‌.

ఇన్ద్రాధిదైవతం పాదయుగ్మమధ్యగతం స్మరేత్‌ |

శుద్ధం చ రసతన్మాత్రం ప్రవిలాప్యాథ సంహరేత్‌ 7

రసమాత్రం రూపమాత్రే క్మరమేణానేన పూజకః. 22

పవిత్రమును గోరోచనముతోను, అగురుకర్పూరములు కలిపిన పసుపుతోను, కుంకుమరంగుతోను పూయవలెను. భక్తుడు ఏకాదశీదివసమున స్నానసంధ్యాదులు చేసి, పూజగృహము వ్రవేవించి, భగవంతుడగు శ్రీహరిని పూజింపవలెను. విష్ణువుయొక్క సమస్తపరివారమునకును బలి సమర్పించి విష్ణువును పూజింపవలెను. ద్వారముయొక్క అంతమునందు ''క్షం క్షేత్రపాలాయ నమః'' అని చెప్పి క్షేత్రపాలపూజ చేయవలెను. ద్వారము పై భాగమున ''శ్రియై నమః'' అని చెప్పుచు శ్రీదేవిని పూజించవలెను. ద్వారదక్షిణ (కుడి) దేశమున ''ధాత్రే నమః'' ''గంగాయై నమః'' అను మంత్రము లుచ్చరించుచు, ధాతను, గంగను పూజింపవలెను. ఎడమ వైపున ''విధాత్రే నమః'' ''యమునాయై నమః'' అని చెప్పుచు విధాతను, యమునను, పూజింపవలెను. ఇదే విధముగ ద్వారముయొక్క కుడి-ఎడమ ప్రదేశములందు క్రమముగ ''శఙ్ఖనిధయే నమః'' పద్మనిధయే నమః''అని చెప్పుచు శంఖపద్మనిధులను పూజింపవలెను. [పిదప మండపములోపల కుడి హిదము మణవను మూడు మార్లు కొట్టి విఘ్నములను పారద్రోలవలెను]. పిమ్మట ''సారఙ్గాయ నమః అని అనుచు విఘ్నకారములగు భూతములను పారద్రోలవలెను. [పిమ్మట ''ఓం హాం వాస్త్వదిపతయే బ్రహ్మణ నమః'' అను మంత్రము నుచ్చరించుచు బ్రహ్మ యొక్క స్థానమున పుష్పము లుంచవలెను]. పిదప ఆసనముపై కూర్చుండి భూతశుద్ధి చేయవలెను.

''ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం గన్దతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.''

అను ఐదు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు గంధతన్మాత్రస్వరూప మగు భూమండలమును, వజ్రచిహ్నితము, సూవర్ణమయము, చతురస్రము (నలుపలకలు గలది) పీఠమును, ఇంద్రాదిదేవతలను తన పాదముల మధ్య నున్నట్లు చూచుచు వాటి భావన చేయవలెను. ఈ విధముగ శుద్ధ మగు గంధతన్మాత్రను రసతన్మాత్రయందు లీనము చేసి ఉపాసకుడు అదే క్రమమున రసతన్మాత్రను రూపతన్మాత్రయందు లీనము చేయవలెను.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

జానునాభిమధ్యగతం శ్వేతం వై పద్మలాఞ్ఛితమ్‌ |

శుక్లచన్ద్రం చార్ధచన్ద్రం ధ్యాయేద్వరుణదైవతమ్‌.

చతుర్భిశ్చ తదుద్ఘాతైః శుద్ధం తద్రసమాత్రకమ్‌ | సంహరేద్రసతన్మాత్రం రూపమాత్రే చ సంహరేత్‌. 24

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః''.

అను నాలుగు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు మోకాళ్లు మొదలు నాభివరకును ఉన్న శరీరభాగమును శ్వేతకములచే చిహ్నిత మైనదానినిగాను, శుక్లవర్ణ మైనదానినిగాను, అర్ధచంద్రాకారము కలదానినిగాను చూడవలెను. ఈ జలీయ భాగమునకు వరుణుడు దేవత యని భావన చేయవలెను. పై నాలుగు ఉద్ఘాతవాక్యములను ఉచ్చరించుటచే రసతన్మాత్రము శుద్ధ మగును. ఈ రసతన్మాత్రను రూపత్మాత్రయుందు లీనము చేయవలెను.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

ఇతి త్రిభిస్తదుద్ఘాతైస్త్రీకోణం వహ్నిమణ్డలమ్‌ | నాభికణ్ఠమధ్యగతం రక్తం స్వస్తికలాఞ్ఛి

తమ్‌. 25

ధ్యాత్వా7నలాధిదైవం తచ్ఛుద్ధం స్పర్శే లయం నయేత్‌ |

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హఃఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.''

అను మూడు మూడు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు నాభి మొదలు కంఠమువరకును ఉన్న భాగమునందు త్రికోణాకారాగ్ని మండలమును భావింపవలెను. దాని రంగు ఎరుపు. అది స్వస్తికాకారముచే చిహ్నితమైనది. దిన అధిదేవత అగ్ని. ఈ విధముగా శుద్ధము చేయబడిన రూపతన్మాత్రను స్పర్శతన్మాత్రయందు లీనము చేయవలెను.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

కణ్ఠనాసామధ్యగతం వృత్తం వై వాయుమణ్డలమ్‌ |

ద్విరుద్ధౌర్తధూమ్రవర్ణం ధ్యాయేచ్ఛుద్ధేన్దులాఞ్ఛితమ్‌ |

స్పర్శమాత్రం శబ్దమాత్రే సంహరేద్ధ్యానయోగతః. 27

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

ఏకోద్ఘాతేన చాకాశం శుద్ధస్ఫటికసన్నిభమ్‌ | నాసాపుటశిఖాన్తఃస్థ మాకాశముపసంహరేత్‌. 28

పిమ్మట - ''ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్ధతన్మాత్రం సంహరామి నమః.''

అను రెండు ఉద్ఘాతవాక్యములు నుచ్చరించుచు కంఠము మొదలు నాసికామధ్య వరకును ఉన్న భాగమునందు గోలాకారవాయు మండలమును భావన చేయవలెను. దాని రంగు ధూమము వలె నుండును. అది నిష్కలంకచంద్రునిచే చిహ్నిత మైనది. స్పర్శతన్మాత్రమును ధ్యానముచే శబతన్మాత్రయందు లీనము చేయవలెను. పిమ్మట ''ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహారామి నమః'' అను ఒక ఉద్ఘాతవాక్యము నుచ్చరించుచు శుద్ధ స్ఫటికముతో సమానమైన ఆకాశమును, వాసికనుండు శిఖవరకును ఉన్న శరీరభాగముపై భావన చేయవలెను. ఆ శుద్థాకాశము (అహాంకారమునందు) ఉపసంహరింపవలెను.

శోషణాద్యైర్దేహశుద్ధిం కుర్యాదేవ క్రమాత్తతః | శుష్కం కలేవరం ధ్యాయేత్పాదాద్యం చ శిఖాన్తకమ్‌. 29

యం బీజేన వం బీజేన జ్వాలామాలాసమాయుతమ్‌ | దేహం రమిత్యనేనైన బ్రహ్మరన్ధ్రాద్వినిర్గతమ్‌. 30

బిన్దుం ధ్యాత్వా చామృతస్య తేన భస్మ కలేవరమ్‌ | సంస్థాపయేల్లమిత్యస్మాద్దేహం సంపాద్య దివ్యకమ్‌. 31

న్యాసం కృత్వా కరే దేహే మానసం యాగమాచరేత్‌ |

విష్ణుం సాఙ్గం హృది పద్మే మనసైః కుసుమాదిభిః. 32

మూలమన్త్రేణ దేవేశం ప్రార్థయేద్భుక్తి ముక్తిదమ్‌ | స్వాగతం దేవదేవేశ సన్నిధౌ భవ కేశవ. 33

గృహాణ మానసీం పూజాం యథార్థం పరిభావితమ్‌ | ఆధారశక్తః కూర్మోథ పూజ్యోనన్తో మహీ తతః. 34

మధ్యే7గ్న్యాదౌ చ ధర్మాద్యా అధర్మాద్యాశ్చ ముఖ్యగాః |

సత్త్వాదిమధ్యే పద్మ చ మాయావిద్యాఖ్యతత్త్వకే. 35

కాలతత్త్వం చ సూర్యాదిమణ్డలం పక్షిరాజకః | మధ్యే తతశ్చ వాయవ్యాదీశాన్తా గురుపఙ్త్కికా. 36

పిమ్మట శోషణాదుల ద్వారా దేహశుద్ధి చేసుకొనవలెను. పాదమునంచి శిఖవరకును దేహము 'యం' అను వాయుబీజముచే ఎండుపోయినట్లు భావన చయవలెను. పిమ్మట 'రం' అను బీజము ద్వారా అగ్నిని ప్రకటించి సమస్తశరీరము అగ్నిజ్వాలలచే దగ్ధ మై భస్మ మైనట్లు భావన చేయవలెను. పిమ్మట 'వం' బిందువును ఉచ్చరించుచు బ్రహ్మరంధ్రమునుండి అమృతబిందువు ఆవిర్భవించినట్లు భావన చేయవలెను. దాని నుండి ప్రవహించిన అమృతధారచే శరీరము నంతను ముంచెత్తివేయవలెను. పిమ్మట 'లం' అను బీజమును ఉచ్చరించుచు ఆ భస్మమునుండి దివ్యదేహము ఆవిర్భివించి నట్లు భావన చేయవలెను. ఈ విధముగ దివ్యదేహభావన చేసి అంగన్యాసకరన్యాసములు చేయవలెను. పిమ్మట మానసయాగానుష్ఠానము చేయవలెను. హృదయకమలముపై అంగదేవతాసహితు డగు మహావిష్ణువును నిలిపి, మానసికవుష్పాద్యుపచారములు చేయుచు, మూలమంత్రము లుచ్చరించుచు పూజింపవలెను. ఆ భగవంతుడు భోగమోక్షముల నిచ్చువాడు. మానసిక పూజలను స్వీకరింపు మని భగవంతుని ఈ విధముగ ప్రార్థింపవలెను. ''దేవా! దేవాధిదేవా! కేశవా! నీకు స్వాగతము. నా సమీపమున సన్నిహితుడవై నేను అర్పించు మానసికపూజను కైకొనుము.'' పీఠము మధ్యభాగమునందు, యోగపీఠమును ధరించు ఆధారశక్తియైన కూర్మమును, అనంతుని, పృథివిని పూజింపవలెను. ఆగ్నేయకోణము మొదలగు నాలుగు కోణములందును క్రమముగ ధర్మ-జ్ఞాన-వైరాగ్య-ఐశ్వర్యములను పూజింపవలెను. తూర్పమొదలగు ప్రధానదిక్కులందు అధర్మ-అజ్ఞాన-అవైరాగ్య-అనైశ్వర్యములను పూజింపవలెను. పీఠమధ్యమునందు సత్త్వాదిగుణత్రయమును, కమలమును, మాయను, అవిద్యను, కాలతత్త్వమును, సూర్యాదిమండలములను, పక్షిరా జైన గరుత్మంతుని పూజింపవలెను. పీఠము వాయవ్యకోణమునుండి ఈశాన్యకోణము వరకు గురుపంక్తిని పూజింపవలెను.

గణః సరస్వతీ పూజ్య నారదో నలకూబరః | గురుర్గురోః పాదుకా చ పరో గురుశ్చ పాదుకా. 37

పూర్వసిద్ధాః పరసిద్ధాః కేసరేషు చ శక్తయః | లక్ష్మీః సరస్వతీ ప్రీతి కీర్తిః శాన్తిశ్చ కాన్తికా. 38

పుష్టిస్తుష్టిర్మ హేన్ద్రాద్యా మధ్యేచావాహితో హరిః | ధృతిశ్రీరతికాన్త్యాద్యా మూలేన స్థాపితోచ్యుతః. 39

ఓం అభిముఖో భ##వేతి ప్రార్థ్య ప్రాచ్యాం సన్నిహితో భవః

విన్యస్యార్ఘ్యాదికం దత్వా గన్ధాద్యైర్మూలతో యజేత్‌. 40

ఓం భీషయ భీషయ హృచ్ఛిరస్త్రాసయ వై పునః | మర్దయ మర్దయ శిఖా అగ్న్యాదౌ శస్త్రతో7స్త్రకమ్‌. 41

రక్ష రక్ష ప్రధ్వంసయ ప్రధ్వంసయ కవచాయ నమస్తతః |

ఓం హ్రూం ఫట్‌ అస్త్రాయ నమో మూలబీజేన చాఙ్గకమ్‌. 42

పూర్వదక్షాప్యసౌమ్యేషు మూర్త్యావరణమర్చయేత్‌ |

గణములు, సరస్వతి, నారదుడు, నలకూబరుడు, గురువు, గురుపాదుక. పరమగురువు, ఆతని పాదుక-వీటి పూజయే గురుపంక్తిపూజ. పూర్వసిద్ధ-పరసిద్ధ శక్తులను కేసరములపై పూజింపవలెను. లక్ష్మి, సరస్వతి, ప్రీతి, కీర్తి, శాంతి, కాంతి, పుష్టి-; తుష్టి-వీరు పూర్వసిద్ధశక్తులు, పూర్వాది దిక్కులలో క్రమముగ ఈ శక్తుల పూజ చేయవలెను. ఇంద్రాదిదిక్పాలకులను గూడ వారి వారి దిక్కులందు పూజింపవలెను. వీరందరి మధ్యయందు శ్రీహరి విరాజిల్లుచుండును. ధృతి, శ్రీ రతి, కాంత్యాదులు పరసిద్ధశక్తులు. మూలమంత్రముచే అచ్యుతుని స్థాపింపవలెను. పూజాప్రారంభమున- ''ఓం అభిముఖో భవ'' పూర్వదిక్కున నా సమీపమున నుండు అని భగవంతుని ప్రార్థింపవలెను. ఈ విధముగ ప్రార్థించి స్థాపించిన పిమ్మట అర్ఘ్యపాద్యాదులను సమర్పించి, గంధాద్యుపచారముల ద్వారా మూలమంత్రముతో అచ్యుతుని పూజింపవలెను. ''భీషయ భీషయ హృదయాయ నమః'' ''ఓం త్రాసయ త్రాసయ శిరసే నమః'' ''ఓం మర్దయ మర్దయ శిఖాయై నమః ''ఓం రక్ష రక్ష నేత్రత్రయాయ నమః '' ''ఓం ప్రధ్వంసయ ప్రధ్వంసయ కవచాయ నమః'' ఓం హూం ఫట్‌ అస్త్రాయ నమః'' ఈ విధముగ ఆగ్నేయాదివిదిశలయందు క్రమముగా, మూలబీజములతో అంగముల పూజ చేయవలెను. తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము ఈ దిక్కులందు మూర్త్యాత్మక ఆవరణముల పూజ చేయవలెను.

వాసుదేవః సఙ్కర్షణః ప్రద్యుమ్నశ్చానిరుద్దకః. 43

అగ్న్యాదౌ శ్రీధృతిరతికాన్తయో మూర్తయో హరేః | శఙ్ఖచక్రగదాపద్మమగ్న్యాదౌ పూర్వకాదికమ్‌. 44

శార్‌జ్గం చ ముసలం ఖడ్గం వనమాలాం చ తద్బహిః | ఇన్ద్రాద్యాశ్చ తథానన్తో నైరృత్యాం వరుణసత్తః. 45

బ్రహ్మేన్ద్రేశానయోర్మధ్యే అస్త్రావరణకం బహిః | ఐరావతస్తతశ్ఛాగో మహిషో వానరో ఝషః. 46

మృగః శశో7థ వృషభః కూర్మో హంసస్తతో బహిః |

పృశ్నిగర్భః కుముదాద్యా ద్వారపాలా ద్వయం ద్వయమ్‌. 47

పూర్వాద్యుత్త రద్వారాన్తం హరిం నత్వా బలిం బహి ః | విష్ణపార్షదేభ్యో నమో బలిపీఠే బలిం దదేత్‌. 48

విశ్వాయ విష్వక్సేనాత్మనే ఈశానకే యజేత్‌ | దేవస్య దక్షిణ హస్తే రక్షాసూత్రం చ బన్ధయేత్‌. 49

సంవత్సరకృతార్చాయాః సంపూర్ణఫలదాయినే | పవిత్రారోహణాయేదం కౌస్తుభం ధారయ ఓం నమః. 50

ఉపవాసాదినియమం కుర్యాద్వై దేవసన్నిధౌ | ఉపవాసాదినియతో దేవం సంతోషయామ్యహమ్‌. 51

కామక్రోధాదయః సర్వే మా మే తిష్ఠన్తు సర్వధా | అద్యప్రభృతి దేవేశ యావద్వై శేషికం దినమ్‌. 52

యజమానో హ్యశక్త శ్చే త్కుర్యాన్నక్తాదికమ్‌ వ్రతీ | హుత్వావిసర్జయేత్‌ స్తుత్వా శ్రీకరం నిత్యపూజనమ్‌. 53

ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్యమోహనాయనమః.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే పవిత్రారోహణ శ్రీదరనినత్యపూజావిధానం నామ త్రయస్త్రింశో7ధ్యాయః.

వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని నాలుగుమూర్తులు. అగ్నేయాదివిదిశలయందు క్రమముగ శ్రీ, రతి, ధృతి, కాంతలను పూజింపవలెను. వీరు కూడ శ్రీహరి మూర్తులే. అగ్న్యాదికోణములందు క్రమముగ శంఖ-చక్ర-గదా-పద్మములను పూజింపవలెను. తూర్పు మొదలైన దిక్కులందు శార్‌జ్గ- మసల - ఖడ్గ - వనమాలలను పూజించవలెను. వాటి వెలుపల తూర్పు మొదలగు దిక్కులందు క్రమముగ ఇంద్ర - అగ్ని-యమ-నిర్బతి- వరుణ-వాయు-కుబేర-ఈశానులను పూజించి నైరృతి పశ్చమదిక్కల మధ్య అనంతుని, తూర్పు-ఈశాన్యదిక్కుల మధ్య బ్రహ్మను పూజించవలెను వీటి బైట వజ్రము మొదలగు అస్త్రమయఆవరణములను పూజించవలెను. వీటి బైట దిక్పలకుల వాహనరూపములగు ఆవరణములను పూజింపవలెను. తూర్పు మొదలగు దిక్కులందు క్రమముగ ఐరావతమును, మేకను, దున్నపోతును, వానరుని, మత్స్యమును, మృగమును, చెవులపిల్లిని, వృషభమును, కూర్మమును, హంసను పూజింపవలెను. వీటి బయట పృశ్నిగర్భుడు, కుముదుడు మొదలగు ద్వారపాలులను పూజింపలెను. తూర్పు మొదలు ఉత్తరము వరకు, అన్ని దిక్కులందును ఇద్దరిద్దరు ద్వారపాంకులను పూజింపవలెను. పిమ్మట శ్రీహరికి నమస్కారము చేసి వెలుపల బలి అర్పింపవలెను. ''ఓం విష్ణుపార్షదేభ్యో నమః '' అను మంత్రము నుచ్చరించుచు విష్ణుపీఠముపై వారలకు బలి అర్పింపవలెను. ఈశానదిక్కునందు ''ఓం విశ్వాయ విష్వక్సేనాయ నమః'' అను మంత్రముచే విష్వక్సేనపూజ చేయవలెను. పిమ్మట దేవుని కుడిచేతికి రక్షాసూత్రము కట్టవలెను. ఆ సమయమున ఆ భగవంతునితో ఇట్లు చెప్పవలెను-''దేవా! ఒక సంత్సరముపాటు నిరంతరము జరుగు మీ పూజయొక్క సంపూర్ణఫలము లభించుటకై జరుప నున్న పవిత్రారోపణకర్మకొరకై ఈ కౌతుకసూత్రమును ధరింపుము. ఓం నమః''. పిమ్మట భగవంతుని సమీపమున ఉపవాసాది నియమములను అవలంబించి ఇట్లు చెప్పవలెను. ''నేను నియమపూర్వకముగ ఉపవాసాదులు చేసి ఇష్టదేవతకు సంతోషము కలిగింపగలను. దేవేశ్వరా! నేడు మొదలు వైశేషిక ఉత్సవ దివసము వరకును కామక్రోధాదిదోషము లేవియు నా వద్దకు రాకుండు గాక''. వ్రతమును స్వీకరించిన యజమానుడు ఉపవాసముచేయు సామర్థ్యము లేని పక్షమున నక్తవ్రతము (రాత్రిమాత్రమే భోజనము చేయుట) ఆచరించవలెను. హవనము చేసి భగవంతునిస్తోత్రము చేసిన పిమ్మట భగవంతుని ఉద్వాసన చెప్పవలెను. భగవంతుని నిత్యపూజ చేసి చో లక్ష్మి ప్రాప్తించును. భగవంతుని పూజించుటకై ''ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్యమోహనాయ నమః'' అనునది మంత్రము.

శ్రీ అగ్ని మహాపురాణమునందు పవిత్రారోపణమున శ్రీధరనిత్యపూజావిధాన మను ముప్పదిమూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters