Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకత్రింశో7ధ్యాయః

అథ కుశాపామార్జన విధానమ్‌

అగ్ని రువాచ :

రక్షాం స్వస్య పరేషాం వక్ష్యేతాం మార్జనాహ్వయామ్‌ |యయా విముచ్యతే దుఃఖైః సుఖం చ ప్రాప్నుయాన్నరః. 1

ఓం నమః పరమార్థాయ పురుషాయ పరమాత్మనే | అరూపబహురూపాయ వ్యాపినే పరమాత్మనే. 2

నిష్కల్మషాయ శుద్ధాయ ధ్యానయోగరతాయ చ | నమస్కృత్య ప్రవక్ష్యామి యత్తత్సిధ్యతు మ వచః. 3

వరాహాయ నృసింహాయ వామనాయ మహాత్మనే | నమస్కృత్య ప్రవక్ష్యామి యత్తత్సిధ్యతు మే వచః. 4

త్రివిక్రమాయ రామాయ వైకుణ్ఠాయ నరాయ చ | నమస్కృత్య ప్రవక్ష్యామి యత్తత్సిధ్యతు మేవచః. 5

అగ్నిదేవుడు చెప్పెను : ఓ మునీ! ఇపుడు నేను ఆత్మరక్షను, ఇతరుల రక్షను చేయు విధానమును చెప్పచున్నాను. దీనికి ''మార్జనము'' లేదా ''అపామార్జనము'' అని పేరు. ఈ రక్ష చేసికొనుటచే మానవుడు దుఃఖములు తొలగి సుఖము పొందును. సచ్చిదానందస్వరూపుడును, పరమార్థభూతుడును, సర్వాంతర్యామియు, మహాత్ముడును, నిరాకారుడును, సహస్రాకారములు ధరించినవాడును, సర్వవ్యాపకుడును, అగు పరమాత్మకు నమస్కరించుచున్నాను. కల్మషరహితుడును, పరమశుద్ధుడును, నిత్యధ్యానయోగనిరతుడును అగు పరమాత్మకు నమస్కరించి రక్షావిషయమును చెప్పుచున్నాను. నా వాక్కు సత్య మగు గాక. భగవంతు డైన వరాహమూర్తికిని, నృసింహునకును, వామనునకును నమస్కరించి రక్షావిషయమున చెప్పెదను. నా వాక్యము సిద్ధించుగాక. భగవతంతుడైన త్రివిక్రమునకును, శ్రీరామునకును, శ్రీమహావిష్ణువునకును, నరునకును నమస్కరించి నేను రక్షావిషయమున చెప్పుచున్నాను. అది సత్యమగు గాక.

వరాహనరసింహేశ వామనేశ త్రివిక్రమ | హయగ్రీవేశ సర్వేశ హృషీ కేశ హరాశుభమ్‌. 6

అపరాజితచక్రా ద్యైశ్చతుర్భిః పరమాయుధైః| అఖణ్డితానుభావైస్త్వం సర్వదుఃఖహరో భవ. 7

హరాముకస్య దురితం సర్వం చ కుశలం కురు | మృత్యుబన్ధార్తిభయదం దురితస్య చ యత్ఫలమ్‌. 8

ఓ వరాహస్వామీ! నృసింహేశ్వరా! త్రివిక్రమా! హయగ్రీవేశా! సర్వేశా! హృషీకేశా! నా నమస్త అశుభములను హరింపుము. ఎవ్వనిచేతను ఓడింపరాని ఓ పరమేశ్వరా! ఆకుంఠితశక్తి గల నీ చక్రావ్యాయుధములు నాలిగింటిచే సమస్తదుష్టుల సంహారము చేయుము. ఓ ప్రభూ! ఫలానావాని సంపూర్ణపాపములను హరించి ఆతనికి పూర్తిగ కుశలక్షేమము ను ప్రసాదించుము. పాపములవలన కలుగు మృత్యు, బంధన, రోగ, పీడా, భయాదులను తొలగింపుము.

పరాభిధ్యానసహితైః ప్రయుక్తం చాభిచారికమ్‌ | గరస్పర్శమహారోగప్రయోగం జరయా జర. 9

ఓం నమో వాసుదేవాయ నమః కృష్ణాయ ఖడ్గినే | నమః పుష్కరనేత్రాయ కేశవాయాదిచక్రిణ. 10

నమః కమలకిఞ్జిల్కపీతనిర్మలవాసనే | మహాహవరిపుస్కన్ధఘృష్టచక్రాయ చక్రిణ. 11

దంష్ట్రోద్ధృతక్షితిభృతే త్రయిమూర్తి మతే నమః | మహాయజ్ఞవరాహాయ శేషభోగాఙ్కశాయినే. 12

తప్తహాటక కేశాన్తజ్వలత్పావకలోచన | వజ్రాధికనఖస్పర్శ దివ్యసింహ నమో7స్తు తే. 13

కాశ్యపాయాతిహ్రస్వాయ బుగ్యజుఃసామభూషిణ | తుభ్యం వామనరూపాయాక్రమతే గాం నమో నమః. 14

ఇతరుల వినాశమును కోరువారు చేసిన అభిచారిక ప్రయోగములను, వారిచ్చిన విషమిశ్రాన్నపానములను, వారు కల్పించిన మహారోగములను జరాజీర్ణములుగ చేసి వాటి నన్నింటిని నశింపచేయుము. ఓం భగవంతు డైన వాసుదేవునకు నమస్కారము. ఖడ్గధారియైన కృష్ణునకు నమస్కారము. కమలనేత్రుడును, ఆది చక్రధారియు అగు కేశవునకు సమస్కారము. పద్మముల కింజల్కముల వలె పసుపు రంగు గల నిర్మలవస్త్రములు ధరించిన, భగవంతుడైన పీతాంబరునకు నమస్కారము. ఘోరసంగ్రామములలో శత్రువుల కంఠములతో రాచుకొను చక్రమును ధరించిన చక్రపాణికి నమస్కారము. కోరపై లేవదీయబడిన భూమిని ధరించినవాడును, వేదవిగ్రహుడును శేషశయ్యపై శయనింఉవాడును అగు మహాయజ్ఞవరాహమూర్తికి నమస్కారము. ఓ! దివ్యసింహమూర్తీ! నీ కేశాంతములు కరిగించిన బంగారము వలె ప్రకాశించుచున్నవి. నేత్రములు అగ్ని వలె ప్రజ్వంచుచున్నవి. నీ నఖముల స్పర్వ వజ్రస్పర్శకంటె గూడ ఎక్కువ తీక్షణమైనది. నీకు నమస్కారము. చాల చిన్న శరీరము కలిగి, బుగ్వజుఃసామవేదముచే అలంకృతుడ వైన కాశ్యపకుమారా! వామనా! నమస్కారము. పిమ్మట విరాడ్రూపము ధరించి భూమిని ఆక్రమించిన త్రివిక్రమునకు నమస్కారము.

వరాహాశేషదుష్టాని సర్వపాపఫలాని వై | మర్ద మర్ద మహాదంష్ట్ర మర్ద మర్ద చ తత్ఫలమ్‌. 15

నారసింహ కరాలాస్య దన్తప్రాన్తాలోజ్జ్వల | భఞ్జ భఞ్జ నినాదేన దుష్టాన్‌ పశ్యార్తి నాశన. 16

బుగ్యజుఃసామగర్భాభిర్వాగ్భిర్వామనరూపధృక్‌ | ప్రశమం సర్వదుఃఖాని నయత్వస్య జనార్దన. 17

ఐకాహికం ద్వ్యాహికం చ తథా త్రిదివసం జ్వరమ్‌ | చాతుర్థికం తథాత్యుగ్రం తథైవ సతతం జ్వరమ్‌. 18

దోషోత్ఠం సంనిపాతోత్థం తథైవాగన్తుకం జ్వరమ్‌ | శమం నయాశు గోవిన్ద చ్ఛిన్ధి చ్ఛిన్ధ్యస్య వేదనామ్‌. 19

ఓ వరాహమూర్తీ! సమస్తపాపఫలరూపమున వచ్చిన సకలదుష్టరోగములను ఆణచివేయుము; ఆణచివేయుము. గొప్పకోరలు గల మహావరాహా! పాపమువలన కలిగిన ఫలమును అణచివేయుము; అణచివేయుము. వికట మైన ముఖము గల నీ దంతాగ్రములు అగ్ని వలె ప్రకాశించుచున్నవి. ఓ ఆర్తివినాశనా! ఆక్రమణము చేయు దుష్టుల వైపు చూడుము; నీ గర్జనముచే వారి నందరిని నశింపచేయుము; నశింపచేయుము. ఓ! వామనమూర్తీ! ఋగ్యజుఃసామవేదముల గూఢతత్త్వములతో నిండిన వాక్కుతో ఈ ఆర్తుని సకలదుఃఖములను శమింపచేయుము గోవిందా! త్రిదోషములవలన కలిగినదియు, సంనిపాతమువలన కలిగినదియ, ఆగంతుకమునుఅగు ఐకాహికజ్వరమును (రోజువిడిచి రోజువచ్చు జ్వరము), ద్వ్యాహికజ్వరమును (రెండు రోజులకు (వచ్చునది). త్ర్యాహికజ్వరమును, అత్యంతముభయంకర మగు చాతుర్థిక జ్వరమును (నాలుగురోజులకొకసారివచ్చునది), మానకుండా వచ్చు జ్వరమును శీఘ్రముగ శమింప చేయుము. దానివలన కలుగు బాధలను తొలగింపుము.

నేత్రదుఃఖం శిరోదుఃఖం దుఃకంచౌరగసంభవమ్‌ | అనిశ్వాసమతిశ్వాసం పరితాపం సవేపథుమ్‌. 20

గుదఘ్రాణాఙ్ఘ్రిరోగాంశ్చ కుష్ఠరోగాం స్తథా క్షయమ్‌ | కామలాదీంస్తథా రోగాన్‌ ప్రమేహాంశ్చాతిదారుణాన్‌. 21

భగన్దరాతిసారాంశ్చ ముఖరోగాంశ్చ వల్గులీమ్‌ | అశ్మరీం మూత్రకృచ్ఛ్రాంశ్చ రోగానన్యాంశ్చ దారుణాన్‌. 22

యే వాతప్రభవా రోగా యే చ పిత్తసముద్భవాః | కఫోద్భవాశ్చ యే కేచిద్యే చాన్యే సాంనిపాతికాః. 23

ఆగన్తుకాశ్చ యే రోగా లూతావిస్ఫోటకాదయః | తే సర్వే ప్రశమం యాన్తు వాసుదేవస్య కీర్తనాత్‌. 24

విలయం యాన్తు తే సర్వే విష్ణోరుచ్చారణన చ | క్షయం గచ్ఛన్తు చాశేషాస్తే చక్రాభిహతా హరేః. 25

అచ్యుతానన్తగోవిన్దనామోచ్చరణభేషజాత్‌ | నశ్యన్తి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్‌. 26

నేత్రరోగమును, శిరోరోగమును, ఉదరరోగమును, శ్వాసావరోధమును, అతిశ్వాసమును, పరితాపమును, కంపనమును. గుదరోగమును, నాసికారోగమును, పాదరోగమును, కుష్ఠరోగములను, క్షయరోగమును, కామలాదిరోగములను, అత్యంతముదారుణమైన ప్రమేహమును, భగందర - అతిసారములను, ముఖరోగమును, వల్గులీరోగమును, అశ్మరీరోగమును, ఇతర మూత్రకృచ్ఛ్రరోగములను, ఇతరములైన భయంకరరోగములను తొలగింపుము. వాత-పిత్త-కఫలములవలన కలిగిన రోగములును, సంనిపాతములవలన కలిగిన రోగములును, ఆగంతుకరోగములును, లూతా-విస్ఫోటాదిరోగములును భగవంతు డగు వాసుదేవుని నామసంకీర్తనమాత్రముననే తొలగిపోవుగాక. ఆ రోగము లన్నియు శ్రీ మహావిష్ణు నామోచ్చరణమాత్రముననే నశించి పోవుగాక. అవి అన్నియు శ్రీమహావిష్ణువు చక్రముచే కొట్టబడి తొలగిపోవుగాక. 'అచ్యుత', 'అనంత' 'గోవిన్ద' అను నామములను ఉచ్చరించుట అనెడు ఔషధముచే సకలరోగములును నశించును. నేను చెప్పునది సత్యము: సత్యము.

స్థావరం జఙ్గమం వాపి కృత్రిమం చాపి యద్విషమ్‌ | దన్తోద్భవం నఖభవమాకాశప్రభవం విషమ్‌. 27

లూతాదిప్రభవం యచ్చ విషమన్యత్తు దుఃఖదమ్‌ | శమం నయతు తత్సర్వం వాసుదేవస్య కీర్తనమ్‌. 28

గ్రహాన్‌ ప్రేతగ్రహాంశ్చాపి తథా వై డాకినీగ్రహాన్‌ | వేతాలాంశ్చ పిశాచాంశ్చ గన్ధర్వాన్‌ యక్షరాక్షసాన్‌. 29

శకునీపూతనాద్యాంశ్చ తథా వైనాయకాన్‌ గ్రహాన్‌ | ముఖమణ్డీం తథా క్రూరాం రేవతీం వృద్ధరేవతీమ్‌. 30

వృద్ధికాఖ్యాన్‌ గ్రహాంశ్చోగ్రాంస్తథా మాతృగ్రహానపి | బాలస్య విష్ణోశ్చరితం హన్తు బాలగ్రహానిమాన్‌. ప31

వృద్ధాశ్చ యే గ్రహాః కేచిత్‌ యే చ బాలగ్రహాః క్వచిత |

నరసింహస్య తే దృష్ట్యా దగ్ధా యే చాపి ¸°వనే. 32

సటాకరాలవదనో నారసింహో మహాబలః | గ్రహానశేషాన్నిః శేషాన్‌ కరోతు జగతో హితః. 33

నరసింహ మహాసింహ జ్వాలామాలోజ్జ్వలానన | గ్రహానశేషాన్‌ సర్వేశ ఖాద ఖాదాగ్నిలోచన. 34

స్థావరము, జంగమము, కృత్రిమము, దంతములందు పుట్టినది, నఖములందు పుట్టినది, అకాశమునందు పుట్టినది, సాలెపురుగు మొదలగువాటినుండి పుట్టినది, ఇంకను ఇతరవిధములైన దుఃఖకర మగు విషమును భగవంతుడైన వాసుదేవుని స్మరణము నశింపచేయుగాక. బాలకృష్ణుని చరిత్రముయొక్క కీర్తనము గ్రహ-ప్రేతగ్రహ-డాకినీ పూతనాది గ్రహ-వినాయకగ్రహ - ముఖమండికా - క్రూరరేవతీ - వృద్ధరేవతీ - వృద్ధికానామకోగ్రగ్రహ - మాతృగ్రహాదులగు బాలగ్రహములను నశింపచేయుగాక! భగవంతుడ వైన నరసివంహా! నీ దృష్టిప్రసారముచే బాలగ్రహములు, యువగ్రహములు, వృద్ధగ్రహాములు దగ్ధము లైపోవుగాక! జూలుతో భయంకర మైన ముఖము కలవాడును, లోకమునకు హితము చేకూర్చువాడును, మహాబలవంతుడును అగు భగవంతు డైన నృసింహుడు సమస్తబాలగ్రహములను నశింపచేయుగాక, ఓ నరసింహా! మహాసింహా! జ్వాలామాలలచే నీ ముఖమండలము ప్రకాశించుచున్నది. ఓ అగ్ని లోచనా! సర్వేశ్వరా! సమస్తగ్రహములను భక్షించుము! భక్షించుము.

యే రోగా యే మహోత్పాతా యద్విషం యే మహాగ్రహాః | యాని చ క్రూరభూతాని గ్రహాపీడాశ్చ దారుణాః.

శస్త్రక్షతేషు యే దోషా జ్వాలా గర్దభకాదయకః | తాని సర్వాణి సర్వాత్మా పరమాత్మా జనార్దనః. 36

కించిద్రూపం సమాస్థాయ వాసుదేవస్య నాశయ | క్షిప్త్వా సుదర్శనం చక్రం జ్వాలామాలాతిభీషణమ్‌. 37

సర్వదుష్టోపశమనం కురు దేవవరాచ్యుత | సుదర్శన మహాజ్వాలా చ్ఛిన్ధి చ్ఛిన్థి మహారవ. 38

సర్వదుష్టాని రక్షాంసి క్షయం యాన్తు విభీషణ | ప్రాచ్యాం ప్రతీచ్యాం చ దిశి దక్షిణోత్తరతస్తథా. 39

రక్షాం కరోతు సర్వాత్మా నరసింహః స్వగర్జితైః | దివిభువ్యన్తరిక్షేచ పృష్ఠతః పార్శ్వతో7గ్రత. 40

రక్షాం కరోతు భగవాన్‌ బహురూపీ జనార్దనః | యథా విష్ణుర్జగత్సర్వం సదేవాసురమానుషమ్‌. 41

పరమాత్ము డైన జనార్దనుడు సర్వాత్మస్వరూపుడు. ఓ వాసుదేవా! ఈ వ్యక్తియందు ఏ రోగములన్నవో, ఏ మహోత్పాతము లున్నవో, ఏ విషమున్నదో, ఏ మహాగ్రము లున్నవో, క్రూరభూతము లున్నవో, దారుణ మైన గ్రహపీడ లున్నవో వాటి నన్నింటిని ఏదియో ఒక రూపము ధరించి నశింపచేయుము. దేవశ్రేష్ఠుడ వైన అచ్యుతా! జ్వాలామాలలచే మిక్కిలి భయంకరమైన సుదర్శనచక్రమును ప్రయోగించి దుష్టరోగలముల నన్నింటిని నశించేయుము. తీవ్రజ్వాలలచే ప్రకాశించుచు, మహాధ్వని చేయుచున్న సుదర్శనచక్రమా! సమస్తదుష్టరాక్షసులను సంహరింపుము; సంహరింపుము. నీ ప్రభావముచే ఆ రాక్షసు లందరును నశింతురుగాక. సర్వాత్మకు డగు నృసింహుడు, తన గర్జనముచే, పూర్వ-పశ్చిమ-ఉత్తర-దక్షిణదిశలందు రక్షించుగాక. అ నేక రూపములను ధరించు భగవంతుడైన జనార్దనుడు స్వర్గలోక-భూలోక-అంతరిక్షములందును, ముందును, వెనుకను రక్షించుగాక. దేవాసుర మనుష్యసహిత మగు ఈ జగత్తు అంతుయు భగవంతు డగు విష్ణుయొక్క స్వరూపమే. ఈ సత్యముయొక్క ప్రభావముచే ఈతని దుష్టరోగము లన్నియు నశించుగాక.

తేన సత్యేన దుష్టాని శమమస్య ప్రజన్తువై |

యథా విష్ణౌ స్మృతే సద్యః సంక్షయం యాన్తి పాతకాః. 42

సత్యేన తేన సకలం దుష్టమస్య ప్రశామ్యతు | యథా యజ్ఞేశ్వరో విష్ణుర్దేవేష్వపి హి గీయతే. 43

సత్యేన తేన సకలం యన్మయోక్తం తథాస్తు తత్‌ | శాన్తిరస్తు శివం చాస్తు దుష్టమస్య ప్రశామ్యతు. 44

వాసుదేవశరీరోత్థైః కుశైర్నిర్ణాశితం మయా | అపామార్జతు గోవిన్దో నరో నారాయణస్తథా. 45

తథాస్తు సర్వదుఃఖానాం ప్రళయో వచనాద్దరేః | అపామార్జనకం శస్తం సర్వరోగాదివారణమ్‌. 46

అహం హరిః కుశా విష్ణుర్హతా రోగా మయా తవ. 47

ఇత్యాగ్నేయే మహాపురాణ కుశాపామార్జనవర్ణనం నామ ఏకత్రింశో7ధ్యాయః.

''విష్ణువును స్మరింపగనే సర్వపాపములును వెంటనే తొలగిపోవును'' అను సత్యముయొక్క ప్రభావముచే వీని దుష్టరోగము లన్నియు శాంతించుగాక. ''యజ్ఞేశ్వరుడైన విష్ణువు దేవతలచే ప్రశంసించబడుచున్నాడు'' అనెడు సత్యముయొక్క ప్రభావముచే నా మాట సత్య మగుగాక. శాంతి కలుగుగాక. మంగల మగుగాక. ఈతని దుష్టరోగములు నశించుగాక. భగవంతు డైన వాసుదేవుని శరీరమునుండి పుట్టిన కుశలచే నేను ఈతని రోగములను తొలగించితిని. నరనారాయణులు, గోవిందుడును వీనికి అపామార్జనము చేయుగాక. శ్రీహరి వచనము ప్రకారము ఈతని సంపూర్ణదుఃఖములు శమించుగాక. సమప్తరోగాదులను నివారించుటకు అపామార్జనస్తోత్రము ప్రశస్త మైనది. నేను శ్రీహరిని. నేను నీ రోగములను నశింపచేసితిని.

అగ్నిమహాపురాణమునందలి కేశాపామార్జనస్తోత్రవర్ణన మను ముప్పదియొకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters