Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ షడ్వింశో7ధ్యాయః

అథ ముద్రాలక్షణమ్‌

నారద ఉవాచ :

ముద్రాణాం లక్షణం వక్ష్యే సాన్నిధ్యాది ప్రకారమ్‌ | అఞ్జలిః ప్రథమా ముద్రా వన్దనీ హృదయానుగా. 1

నారదుడు పలికెను :

దేవతాసాంనిధ్యాదులను కలిగించు ముద్రల లక్షణమును చెప్పెదను. హృదయమునకు సమీపమున కట్టబడిన అంజలి మొదటి ముద్ర. రెండవది వందని. మూడవది హృదయానుగ.

ఊర్ధ్వాఙ్గష్ఠో వామముష్టిర్దక్షిణాఙ్గుష్ఠబన్ధనమ్‌ | సవ్యస్య తస్య చాఙ్గష్ఠో యస్య చోర్ధ్వే ప్రకీర్తితః. 2

తస్రః సాధారణావ్యూహే అథాసాధారణా ఇమాః | కనిష్ఠికాదివిమో కేన అష్టౌ ముద్రా యథాక్రమమ్‌. 3

ఎడమచేతి పిడికిలిని బొటనవ్రేలు పైకినిలచి ఉండునట్లును, (అంజలి) కుడిచేతి బొటనవ్రేలు వంచిబింధించినట్లును (వందని) ఉంచవలెను. అట్లే రెండు పిడికెళ్ళ అంగుష్ఠములును పైకి నిలచి ఉండవలెను. (హృదయానుగ). ఈ మూడును వ్యూహామునందు సాధారణముద్రలు. వరుసగా కనిష్ఠిక మొదలైన వాటిని విడువగా ఏర్పడిన ఎనిమిది ముద్రలు అసాధారణములు.

అష్టానాం పూర్వబీజానాం క్రమశ స్త్వవధారయేత్‌ | అఙ్గుష్ఠేన కనిష్ఠాన్తం నామయిత్వాఙ్గులిత్రయమ్‌. 4

ఊర్ధ్వం కృత్వా సంముఖం చ బీజాయ నవమాయవై | వామహస్త మథోత్తానం కృత్వోర్థ్వం నామయేచ్ఛనైః.

వరాహస్య స్మృతౌ ముద్రా అఙ్గానాం చ క్రమాదిమాః | ఏకైకాం మోచయేద్బద్ధ్వా వామముష్టౌ తథాజ్గులీమ్‌.

ఆకుఞ్చయే త్పూర్వముద్రాం దక్షిణ7ప్యేవ మేవ చ | ఊర్ధ్వాఙ్గుష్ఠో వామముష్టిర్మద్రాసిద్ధిస్తతో భ##వేత్‌. 7

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ముద్రా లక్షణం నామ షడ్వింశో7ధ్యాయః.

ఈ ఎనిమిది ముద్రలను పూర్వము చెప్పిన బీజములు ఎనిమిదింటికిని క్రమముగా వినియోగించవలెను. కనిష్ఠిక వరకును ఉన్న మూడు వ్రేళ్ళను అంగుష్ఠముచేత వంచి, పైకి ఉండునట్లును, సంముఖముగాను చేసి నవమబీజమునకు వినియోగించవలెను. వామహస్తమును తిరగదీసి మెల్లగా పైకి వంచవలెను. అది వరాహముద్ర. అంగములకు వరుసగా ఈ చెప్పబోవు ఎనిమిది ముద్రలు ఉపయోగించవలెను. వామముష్టియందు ఒక్కొక్క వ్రేలిని ముణిచి చూపవలెను. పూర్వముద్రను వంచవలెను. దక్షిణహస్తమునందు కూడ ఇట్లే చేయవలెను. వామముష్టియందలి అంగుష్ఠము నిలచి ఉండును. ఈ విధముగా చేసినచో ముద్రాసిద్ధి కలుగును.

అగ్ని మహాపురాణమునందు ముద్రాలక్షణ మను షడ్వింశాధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters