Sri Madhagni Mahapuranamu-1    Chapters   

శ్రీమదగ్ని మహాపురాణము

అథ ద్వితియో7ధ్యాయః.

అథ మత్స్యావతార వర్ణనమ్‌

వసిష్ఠ ఉవాచ :

మత్స్యాదిరూపిణం విష్ణుం బ్రూహి సర్గాదికారణమ్‌ | పురాణం బ్రహ్మ చాగ్నేయం తథా విష్ణోః పురా శ్రుతమ్‌. 1

మత్స్యవతార వర్ణనము

విశిష్ఠుడు పలికెను: మత్స్యాదిరూపములను ధరించినవాడును, సృష్ట్యాదులకు కారణమైనవాడును అగు విష్ణువును గూర్చి చెప్పుము. పూర్వము విష్ణువునుండి వినిన విధమున అగ్నేయపురాణమును గూర్చియు, బ్రహ్మను గూర్చియు (లేతా అగ్నేయ పురాణరూప మగు వేదమును) చెప్పుము.

అగ్నిరూవాచ ః

మత్స్యావతారం వక్ష్యే7హం వసిష్ఠ శృణు వై హరేః | అవతార క్రియా దుష్టనష్ట్యై .సత్పాలనాయ హి 2

అగ్ని పలికెను ః వసిష్ఠా! విష్ణువు ధరించిన మత్స్యావతారమును గూర్చి చెప్పదను; వినుము, అవతారములు ధరించుట దుష్టనాశము కొరకును, శిష్టపాలనముకొరకును జరుగుచుండను కదా?

ఆసీదతీతకల్పానై బ్రహ్మోనైమిత్తికో లయః | సముద్రోపప్లుతా స్తత్ర లోకా భూరాదికా మునే. 3

ఓ మునీ! గడచిన కల్పము చివర బ్రహ్మ నిద్రించుట అను నిమిత్తముచే ప్రలయ మేర్పడెను. అపుడు భూలోకాదు లన్నియు సముద్రములో మునిగిపోయినవి.

మనుర్వైవస్వతస్తేపే తపో వై భుక్తిముక్తేయే | ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణమ్‌.

తస్యాఞ్జల్యుదకే త్యల్పో మత్స్య ఏకో7భ్యపద్యత|

వైవన్వతమనుపు భక్తిముక్తుల నపేక్షించి తపస్సుచేసెను. ఒకనా డాతడు కృపతమాలా నదిలో జలతర్పణము చేయుచుండగా అతని దోసిలిలోని జలములో ఒక చిన్న చేపపిల్ల కనబడెను.

క్షేప్తుకామం జలే ప్రాహ న మాం క్షిప నరోత్తమ.

గ్రాహాదిభ్యో భక్షయం మే7త్ర తచ్ఛ్రుత్వా కలశే7క్షిపత్‌ |

ఆ రాజు దానిని నీటిలో పడవేయ దలచుచుండగా అది అతనితో - ''మహారాజా! నా కీ జలములో మొసళ్ళు మొదలగువాటినుండి భయ మున్నది. అందుచే దీనిలో పడవేయకుము" అని పలికెను. అది విని అతడు దానిని కలశములో ఉంచెను.

స తు వృద్ధః పునర్మత్స్యః ప్రాహ తం దేహి మే బృహత్‌ . 6

స్థానమేతద్వచః శ్రుత్వా రాజాథోదఞ్చనే7క్షిపత్‌ |

ఆ మత్యృము పెద్దదిగా అయి రాజుతో "నాకొక పెద్ద స్థానము నిమ్ము'' అని పలికెను. రా జా మాట విని దానిని చేదలో ఉంచెను.

తత్రవృతద్దో7బ్రవీద్భూపం పృథుం దేహి పదం మనో. 7

సరోవరే పునఃక్షిప్తో వవృధే తత్ప్రమాణవాన్‌ |

ఊచే దేహి బృహత్‌ స్థానం ప్రాక్షిపచ్చామ్బుధౌ తతః 8

అచట పెద్దదై ఆ రాజుతో ఇట్లనెను ః " ! మనుచక్రవర్తీ! నాకు విశాలమైన స్థానము నిమ్ము." పిమ్మట దానిని సరస్సులో విడువగా అది ఆ సరస్సు ప్రమాణము వంటి ప్రమాణము గలదిగ పెరిగెను. "నా కింకను పెద్ద దైన స్థానము నిమ్ము" అని పలుకగా దాని నాతడు సముద్రములోనికి విడిచెను.

లక్షయోజనవిస్తీర్ణః | క్షణమాత్రేణ సో 7భవత్‌ |

మత్స్యం తమద్భుతం దృష్ట్యా విస్మితః ప్రాభ్రవీన్మనుః. 9

అది క్షణమాత్రమున లక్షయోజనముల ప్రమాణము గలదిగా పెరిగెను. అద్భతమైన ఆ మత్స్యమును చూచి, మనువు ఆశ్చర్యము చెంది ఇట్లు పలికెను.

కో భవాన్ననువై విష్ణుర్నారయణ నమోస్తుతే | మాయయా మోహయసి మాం కిమర్థం త్వ జనార్దన. 10

"నీ వెవరవు? నీవు నిజముగ విష్ణుమూర్తివే. నారాయణా! నీకు నమస్కారము. జనార్థనా! మాయచేత నీవు నన్నీవిధముగ ఏల మోహపెట్టుచున్నావు?"

మనునోక్తో7బ్రవీన్మత్స్యో మనుం వై పాలనే రతమ్‌ | అవతీర్ణో భవాయాస్య జగతో దుష్టనష్టియే. 11

మన వీ విధముగా పలుకగా ఆ మత్స్యము ప్రజలకు పాలించుట యందు ( లేదా తనను రక్షించుటయందు) ఆసక్తి గల ఆతనితో ఇట్లనెను- "ఈ జగత్తును నిలుపుటకును, దుష్టులను నశింపచేయటకును అవతరించినాను".

సప్తమే దివసే త్వబ్ధిః ప్లావయిష్యతి వై జగత్‌ | ఉపస్థితాయాం నావి త్వం బీజాదీని విధాయ చ. 12

సప్తర్షిభిః పరివృతో నిశాం బ్రాహ్మీం చరిష్యసి | ఉపస్థితస్య మే శృఙ్గే నిబధ్నీహి మహాహినా. 13

"(నేటినుండి) ఏడవ దివసమున సముద్రము ఈ జగత్తును ముంచివేయును. అపుడు నీదగ్గరకు వ్చచిన నావలో బీజములు మొదలగువాటిని ఉంచుకొని, సప్తర్షిసమేతుడవై బ్రహ్మనిద్రించు రాత్రి అంతయు సంచరింపగలవు. నేను నీ దగ్గరకు వచ్చినపుడు ఆ నావను పెద్ద సర్పముతో నా కొమ్మునకు కట్టి వేయుము".

ఇత్యుక్త్వాన్తర్దధే మత్స్యోమనుః కాలప్రతీక్షకః | స్థితః సముద్ర ఉద్వేలే నావమారురుహే తదా. 14

ఇట్లు పలికి మత్స్యము అంతర్ధానము చెందెను. మనువు ఆ కాలమునకై నిరీక్షించుచు ఉండెను. సముద్రము గట్టు దాటి పొంగగా అపుడు నావను ఎక్కెను.

ఏకశృఙ్గధరో మత్స్యో హైమో నియుతమోజనః | నావం బబన్ధ తచ్ఛఙ్గే మత్స్యాఖ్యం చ పురాణకమ్‌ . 15

శుశ్రావ మత్స్యాత్పపఘ్నం సంస్తువన్‌ స్తుతిభిశ్చ తమ్‌ |

ఒక కొమ్ముగల, పదివేల కోట్ల యోజనములు గల బంగారు మత్స్యము (వచ్చెను). దాని కొమ్మునకు నావను కట్టెను. ఆ మత్స్యమును స్తోత్రములచే స్తుతించుచు, పాపములను తొలగించు మాత్స్యపురాణమును ఆ మత్స్యము చెప్పగా వినెను.

బ్రహ్మవేద ప్రహర్తారం హయగ్రీవం చ దానవమ్‌. 16

అవధీద్వేదమన్త్రాద్యాన్పాలయామాస కేశవః | ప్రాప్తే కల్పే7థ వారాహే కూర్మరూపో7 భవద్దరిః. 17

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే మత్స్యావతారో నామ ద్వితీయోధ్యాయః.

కేశవుడు బ్రహ్మనుండి వేదములను అపహరించిన హయగ్రీవు డను దానవుని సంహరించి వేదమంత్రాదులను రక్షించెను. పిమ్మట వారాహకల్పము రాగా హరి కూర్మావతారం ధరించెను.

అగ్ని మహాపురాణములో మత్స్యావతారమను ద్వితీయాధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters