Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకోనశతాధిక శతతమోధ్యయః

అథ నానావ్రతాని

అగ్నిరువాచ :

ఋతువ్రతాన్యహం వక్ష్యే భుక్తిముక్తిప్రదాని తే | ఇన్దనాని తు యో దద్యాద్వర్షాదిచతురో హ్యృతూన్‌. 1

ఘృతధేనుప్రదశ్చాన్తేబ్రాహ్మణో7గ్నివ్రతీ భ##వేత్‌ |

కృత్వా మౌనం తు సన్థ్యాయాం మాసాన్తే ఘృతకుమ్భదః 2

తిలఘణ్టావస్త్రదాతా సుఖీ సారస్వతవ్రతీ | పఞ్చామృతేన స్నపనం కృత్వాబ్దం ధేనుదో నృపః. 3

ఏకాదశ్యాం తు నక్తాశీ చైత్రే భక్తం నివేదయేత్‌ | హేమం విష్ణోః పదం యాతి మాసాన్తే విష్ణుమద్వ్రతీ. 4

పాయసాశీ గోయుగదః శ్రీభాగ్దేవీవ్రతీ భ##వేత్‌ | నివేద్య పితృదేవేభ్యో యో భుఙ్త్కే సభ##వేన్నృపః. 5

వర్షవ్రతాని చోక్తాని సంక్రాన్తివ్రతకం వదే | సంక్రాన్తౌ స్వర్గలోకే స్యాద్రాత్రిజాగరణాన్నరః. 6

అమావాస్యాం తు సంక్రాన్తౌ శివార్కయజనాత్తథా | ఉత్తరే త్వయనే చాజ్యప్రస్థస్నానేన కేశ##వే. 7

ద్వాత్రింశత్పలమానేన సర్వపాపైః ప్రముచ్యతే | ఘృతక్షీరాదినా స్నాప్య ప్రాప్నోతి విషువాదిషు. 8

స్త్రీణాముమావ్రతం శ్రీదం తృతీయాష్వష్టమీషు చ|

గౌరీం మహేశ్వరం చాపి యజేత్సౌభాగ్యమాప్నుయాత్‌. 9

ఉమామహేశ్వరౌ ప్రార్చ్య హ్యనియోగాది చాప్నుయాత్‌ | మూలవ్రతకరీ స్త్రీ చ హ్యుమేశవ్రతకారిణీ. 10

సూర్యభక్తా తు యా నారీ ధ్రువం సా పురుషో భ##వేత్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నానావ్రతాని నామైకోన శతాధిక శతతమో7ధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను : ఇపుడు భుక్తిముక్తిప్రదము లగు ఋతువ్రతములను గూర్చి చెప్పెదను వర్షా-శరద్‌-హేమంత-శిశిరర్తువులందు కట్టెలు దానము చేసి, వ్రతాంతమున ఘృతధేను దానముచేసి ఈ విధముగ అగ్ని వ్రతమును పాలించినవాడు మరు జన్మలో బ్రాహ్మణుడై పుట్టును. ఒక మాసము సంధ్యాసమయమున మౌనవ్రతమలంబించి మాసాంతమున బ్రాహ్మణునకు ఘృతకుంభము, తిలలు, ఘంట, వస్త్రములు దానము చేయువాడు ఈ సారస్వతవ్రత మాచరించి సుఖవంతు డగును. ఒక సంవత్సరము పంచామృతస్నానము చేసి గోదానము చేయువాడు రాజగును. చైత్త్రెకాదశినాడు నక్తభుక్తవ్రతము చేసి చైత్రమాసాంతమున విష్ణుభక్తు డగు బ్రాహ్మణునకు సువర్ణమయవిష్ణు ప్రతిమను దానముచేయవలెను. ఇట్లే ఉత్తమ మగు విష్ణువ్రతము నాచరించినవాడు విష్ణుపదమును పొందును. ఒక సంవత్సరము పాయసభోజనము చేసి రెండు గోవులను దానము చేసినవాడు ఈ దేవీవ్రతముచే శ్రీసంపన్నుడగును. ఒక సంవత్సరము పితృదేవతలకు సమర్పించిన అన్నము భుజించువాడు రాజ్యమును పొందును. ఇవి వర్షవ్రతములు. ఇపుడు సంక్రాంతి వ్రతములను చెప్పెదను. సంక్రాంతినాడు జాగరణము చేసినవాడు స్వర్గమును పొందును. అమావాస్యనాడు సంక్రాంతి వచ్చినపుడు శివసూర్యులను పూజించినవాడు స్వర్గము పొందును. మకర సంక్రాంతినాడు ప్రాతఃస్నానము చేసి కేశవుని అర్చించవలెను. ఉద్యావనమున ముప్పదిరెండు పలముల స్వర్ణము దానము చేసినవాడు సకలపాపవిముక్తుడగును. విషువాది యోగములందు శ్రీమహావిష్ణువునకు ఘృతిమిశ్రదుగ్ధాదులతో స్నానము చేయించినవాడు సర్వమును పొందును. స్త్రీలకు ఉమావ్రతము లక్ష్మీ ప్రదము వారు తృతీయా- అష్టమీతిథులందు గౌరీశంకరుని పూజించవలెను. ఈ విధముగ శివపార్వతీ పూజ చేసిన స్త్రీ అఖండ సౌభాగ్యము కల దగును. ఆమె ఎన్నడును. పతివియోగము కలుగదు 'మూలవ్రత' ''ఉమేశవ్రతములు'' ఆచరించు స్త్రీ, సూర్యభక్తురా లగు స్త్రీ కూడ తరువాతి జన్మలో తప్పక పురుషత్వమును పొందును.

అగ్నిమహాపురాణమునందు నానావ్రతకథన మను నూటతొంబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters