Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ సప్తనవత్యుత్తర శతతమో7ధ్యాయః.

అథ దివసవ్రతాని.

అగ్నిరువాచ :

దివసవ్రతకం వక్ష్యే హ్యాదౌ ధేనువ్రతం వదే | యశ్చోభయముఖీం దద్యాత్ప్రభూతకనకాన్వితామ్‌. 1

దినం పయోవ్రతస్తిష్ఠేత్స యాతి పరమం పదమ్‌ | త్ర్యహం పయోవ్రతం కృత్వా కాఞ్చనం కల్పపాదపమ్‌.

దత్త్వా బ్రహ్మపదం యాతి కల్పవృక్షవ్రతం స్మృతమ్‌ |

దద్యాద్వింశత్పలాదూర్ధ్వం మహీం కృత్వా తు కాఞ్చనీమ్‌. 3

దినం పయోవ్రతస్తిష్ఠేద్రుద్రగః స్యాద్దివావ్రతీ | పక్షే పక్షే త్రిరాత్రం తు భ##క్తేనైకేన యః క్షపేత్‌. 4

విపులం ధనమాప్నోతి త్రిరాత్రవ్రతకృద్దినమ్‌ | మాసే మాసే త్రిరాత్రాశీ హ్యేకభక్తీ గణశతామ్‌. 5

యస్త్రిరాత్రవ్రతం కుర్యాత్సముద్దిశ్య జనార్ధనమ్‌ | కులానాం శతమాదాయ స యాతి భవనం హరేః. 6

నవమ్యాం చ సితే పక్షే నరో మార్గశిరస్యథ | ప్రారభేత త్రిరాత్రాణాం వ్రతం తు విధివద్ర్వతీ. 7

ఓం నమో వాసుదేవాయ సహప్రం వా శతం జపేత్‌ | అష్టమ్యామేకభక్తాశీ దినత్రయముపావసేత్‌. 8

ద్వాదశ్యాం పూజయేద్విష్ణుం కార్తికే కారయేద్ర్వతమ్‌ | విప్రాన్‌ సంభోజ్య వస్త్రాణి శయనాన్యాసనాని చ. 9

ఛత్రోపవీతపాత్రాణి దదేత్సంప్రార్థయేద్ద్విజాన్‌ | వ్రతే7స్మిన్‌ దుష్కరే చాపి వికలం యదభూన్మమ. 10

భవద్భిస్తదనుజ్ఞాతం పరిపూర్ణం భవత్వితి | భుక్తభోగో వ్రజేద్విష్ణుం త్రిరాత్ర వ్రతకవ్రతీ. 11

కార్తికవ్రతకం వక్ష్యే భుక్తి ముక్తి ప్రదాయకమ్‌ | దశమ్యాం పఞ్చగద్యాశీ ఏకాదశ్యాముపోషితః. 12

కార్తికస్య సితే7భ్యర్చ్య విష్ణుం దేవవిమానగః | చైత్రే త్రిరాత్రం నక్తాశీ హ్యజాపఞ్చప్రదః సుఖీ. 13

త్రిరాత్రం పయసః పానముపవాసపరస్త్ర్యహమ్‌ | షష్ఠ్యాది కార్తికే శుక్లే కృచ్ఛ్రో మాహేన్ద్ర ఉచ్యతే. 14

పఞ్చారాత్రం పయః పీత్వా దధ్యాహారో హ్యుపోషితః |

ఏకాదశ్యాం కార్తికే తు కృచ్ఛ్రో7యం భాస్కరో7ర్థదః. 15

యవాగూం యావకం శాకం దధి క్షీరం ఘృతం జలమ్‌ |

పఞ్చమ్యాది సితే పక్షే కృచ్ఛ్రః సాన్తపనః స్మృతః. 16

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే దివసవ్రతాని నామ ప్తనవత్యధికశతతమోధ్యాయః.

అ (63)

అగ్నిదేవుడు చెప్పెను : ఇపుడు దివసములను సంబంధించిన వ్రతములు చెప్పెదను. మొదట ధేనువ్రతమును గూర్చి చెప్పెదను. సువర్ణరాశితో కూడ ఉభయముఖగోదానము చేసి ఒక దినమున పయోవ్రతము చేయువాడు పరమపదమును పొందును. స్వర్ణమయ కల్పవృక్షదానము చేసి మూడు దినములు పయోవ్రతము చేయువాడు బ్రహ్మపదమును పొందును. దీనికి కల్పవృక్షవ్రత మని పేరు. పది పలములకంటె అధిక మగు స్వర్ణముతో పృథివి నిర్మించి దానము చేసి రెండు దినములు పయోవ్రతము చేయవలెను. దినమునందు మాత్రము వ్రతమవలంబించువాడు రుద్రలోకమును చేరును. ప్రతిపక్షమునందును మూడు రాత్రులు ఏకభుక్తవ్రతము చేయువాడును, పగలు నిరాహారుడై త్రిరాత్రవ్రతము చేయువాడును అధిక మగు ధనము పొందును. ప్రతిమాసమునందును మూడు ఏకభుక్తనక్తవ్రతములు చేయువాడు గణపతిసాయుజ్యమును పొందును. జనార్దనుని ఉద్దేశించి త్రిరాత్రవ్రత మాచరించువాడు తన నూరు కులములతో వైకుంఠముచేరును. మార్గశీర్షశుక్లనవమినుండి త్రిరాత్రవ్రత ప్రారంభము చేయవలెను. ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రమును వేయి పర్యాయములు, లేదా నూరు పర్యాయములు జపము చేయవలెను. అష్ఠమినాడు ఏకభుక్తవ్రతము, నవమీ - దశమీ - ఏకాదశులందు ఉపవాసము చేయవలెను. ద్వాదశినాడు శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఈ వ్రతము కార్తికమాసమందు చేయవలెను. వ్రతసమాప్తియందు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారికి వస్త్ర - శయ్యా - ఆసన - ఛత్ర - యజ్ఞోపవీత - పాత్రలు దానము చేయవలెను. దానసమయమున బ్రాహ్మణులతో ఇట్లు చెప్పవలెను. దుష్కర మగు ఈ వ్రతమునాచరించు నపుడు నావలన కలిగిన లోపములు అన్నియు మీ అనుగ్రహముచే తొలగి పోవుగాక. ఈ త్రిరాత్రవ్రతము చేయువాడు ఇహలోకమున భోగము లనుభవించి మరణానంతరము శ్రీమహావిష్ణుసాంనిధ్యమును పొందును. ఇపుడు భుక్తిముక్తిప్రద మగు కార్తికవ్రతమును గూర్చి చెప్పెదను. దశమినాడు పంచగవ్యప్రాశన చేసి ఏకాదశినాడు ఉపవాస ముండవలెను. ఈ వ్రతమునందు కార్తికశుక్లద్వాదశినాడు శ్రీమహావిష్ణువును పూజించినవాడు విమానముపైసంచరించు దేవత అగును. చైత్రమున త్రిరాత్రవ్రత మాచరించి, రాత్రి మాత్రము భోజనము చేయువాడు వ్రతసమాప్తియందు ఐదు మేకలు దానము చేసినచో సుఖవంతు డగును. కార్తికశుక్లషష్ఠిమొదలు మూడు దినములు పాలు మాత్రము త్రాగి తరువాత, మూడు దినములు ఉపవాపము చేసినచో దానికి మాహేంద్ర కృచ్ఛ్రమని పేరు. కార్తికశుక్లైకాదశినాడు ప్రారంభించి పాంచరాత్రవ్రతము చేయవలెను. మొదటి దినమున క్షీరము, రెండవ దినమున పెరుగు తీసికొని మూడవ దినమునుండి మూడు నాళ్ళు ఉపవాసము చేయవలెను. ఇది ''భాస్కరకృచ్ఛ్రము'' శుక్లపంచమినుండి ప్రారంభించి ఆరు దినములు వరుసగ యవలగంజి, శాకములు, పెరుగు, క్షీరము, నెయ్యి, జలము, ఆహారముగా గ్రహించవలెను. దీనికి ''సాంతపన కృచ్ఛ్రము'' అని పేరు.

అగ్ని మహాపురాణమునందు దివసవ్రతవర్ణన మను నూట తొంబదియేడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters