Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ పఞ్చనవత్యుత్తర శతతమోధ్యాయః

అథ వారవ్రతాని

అగ్నిరువాచ :

వారవ్రతాని వక్ష్యామి భుక్తిముక్తిప్రదాని హి | కరం పునర్వసుః సూర్యే స్నానే సర్వౌషధీ శుభా. 1

శ్రాద్ధీ చాదిత్యవారే తు సప్తజన్మస్వరోగభాక్‌ | సంక్రాన్తౌ సూర్యవారో యః సోర్కస్య హృదయః శుభః.

కృత్వా హస్తే సూర్యవారం నక్తేనాబ్దం చ సర్వభాక్‌ | చిత్రాభసోమవారాణి సప్తకృత్వా సుఖీ భ##వేత్‌. 3

స్వాత్యాం గృహీత్వా చాఙ్గారం సప్తనక్త్యార్తివర్జితః | విశాఖాయాం బుధం గృహ్య సప్తనక్తీ గ్రహార్తినుత్‌. 4

అనురాధే దేవగురుం సప్తనక్తీ గ్రహార్తినుత్‌ | శుక్రం జ్యేష్ఠాసు సంగృహ్య సప్తనక్తీ గ్రహార్తినుత్‌. 5

మూలే శ##నైశ్చరం గృహ్య సప్తనక్తీ గ్రహార్తినుత్‌ |

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే వారవ్రతాని నామ పఞ్చనవత్యధిక శతతమోధ్యాయః.

అగ్ని చెప్పెను :- ఇపుడు భుక్తి ముక్తి ప్రదము లగు వారవ్రతములను చెప్పెదను. రవివారమునాడు హస్త కాని పునర్వసు కాని వచ్చినపుడు పవిత్ర మగు సర్వౌషధిజలముతో స్నానము చేసి, శ్రాద్ధము చేయువాడు ఏడు జన్మల వరకును రోగములచే పీడింపబడడు. సంక్రాంతి దినమున భానువాసర మైనచో అది పవిత్ర మగు ఆదిత్యహృదయము అని చెప్పబడును. ఆ దినమున గాని, హస్తనక్షత్రయుక్త భానువారమునందు గాని ఒక సంవత్సరము నక్తవ్రతము చేయువానికి సర్వము లభించును. ఏడు చిత్రానక్షత్రయుక్త సోమవారవ్రతములు చేయువాడు సుఖవంతు డగును. స్వాతీనక్షత్రయుక్త మంగళవార వ్రతము ప్రారంభించి, ఏడు మంగలవార నక్తవ్రతములు చేయువాడు అన్ని కష్టములనుండియు విముక్తుడగును. విశాఖా నక్షత్రయుక్త బుధవారమునాడు ప్రారంభించి ఏడు బుధవారనక్తవ్రతము లాచరించువాడు బుధగ్రహపీడనుండి విముక్తుడగును. అనురాధానక్షత్రయుక్త గురువారమునాడు ప్రారంభించి ఏడు గురువారనక్తవ్రతములు చేయువాడు బృహస్పతి గ్రహపీడనుండి విముక్తు డగును. జ్యేష్ఠానక్షత్రయుక్త శుక్రవారమునాడు ప్రారంభించి ఏడు శుక్రవారనక్తవ్రతములు చేయువాడు శుక్రగ్రహపీడనుండి విముక్తుడగును. మూల నక్షత్రయుక్త శనివారమునాడు ప్రారంభించి ఏడు శనివాసరనక్తవ్రతములు చేయువాడు శనిగ్రహపీడమునుండి విముక్తు డగును.

అగ్ని మహాపురాణమునందలి వారవ్రతవర్ణనమును నూటతొంబదియైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters